Tuesday, November 10, 2009

అధోగతా......పురోగతా.......?.

Adhogataa Purogataa

అధోగతా...పురోగతా?
---------------------------------
మారుతున్నకాలంలో మనిషి ఎటువైపు ప్రయాణిస్తున్నాడో చెప్పడం కష్థమవుతున్నాది . మన పూర్వికులు నిరక్షరాస్యులు , అవివేకస్థ్థితిలో ఉన్న మానవులకోసం వారి యాంత్రిక, దైనందికజీవనాన్ని దృష్థిలోపెట్టుకొని మన సంస్కృతికి కొన్ని సాంప్రదాయాల్ని శాస్థ్రాను కూలంగా కొన్ని ఆచార -వ్యవహారాలని జతకూర్చి , పురాణాలకి ప్రశస్త్యమిచ్చి , దేవతలని ,
వాటిరూపాలని, రూపాన్నిబట్టి దేవతల విశిష్థ గుణ-గణాలని మేళవించి , హైందవసంస్కృతిగా దానిని ఆచరణలోపెట్టేరు .

( ఐతే వైదికకాలంలో పరమాత్మస్వరూపాన్ని రూపరహితంగా , సత్యస్వరూపంగా ఆరాధిస్తూ " బ్రహ్మ, నిర్గుణ, ఈశ్వర: " అనే శబ్ధంతో ఆరాధించేవారు . ఈ నిరాకారస్వరూపానికి ఏరకమైన ఆకారమూలేదు . ఆకాలంలో ఋషులు , మునులు , ,మొదలైనవారు శిలారూపదేవతలని పూజించినట్లు ఆధారాలుకూడాలేవు )

అప్పుడుకూడా ప్రజలు పెద్దలు ప్రవేశపెట్టిన పద్ధతులకి తమతమ ఆలోచనాపంధాలని జతకలిపి , దేవతార్చనలు , దేవీబలులు, స్థ్థ్రీలకట్టుబాట్లు , ఆచార-వ్యవహారాలలో కఠిన నియమ-నిబంధనలు జతకూర్చి , కన్యాశుల్కం , బాలవివాహాది - విధవాముండనాలవంటి కఠోర నియమాలతో జీవితాలని దుర్భరం చేసుకున్నారు .

జాతులు, శాఖలు , ఉచ్చవర్గాలు , నీచవర్గాలు అంటూ తమసాటి వారిని తమతో వేరుచేస్తూ కట్టడి చేసేవారు .

కాలం గడుస్తున్నకొలదీ వీరిలోకూడా మార్పు వచ్చింది . కొన్ని కట్టుబాట్లు వెసులు పడ్డాయి . ఆడపిల్లలను చదువు, సంస్కారాలకై స్కూళ్లకి పంపడం , యుక్తవయస్సువచ్చాకా వివాహాలుచేయడం , కన్యాశుల్కం వంటివి రూపుమాపడం వంటి చిన్న-చిన్న మార్పులు మొదలయ్యాయి.

ఈమార్పు ఇంతటితో ఆగలేదు . మగవారు వ్యవసాయం , పౌరోహిత్యం , వేదపఠనం వంటివి వదలి ఉద్యోగస్తులయ్యేరు . కాలం మారిందిం, మనం మారాలి ,అంటూ మరీ ముందుకు సాగిపోయారు .

దాని పర్యవసానంగా పొద్దెక్కినా నిద్రలేవని పడకలు , ఒక సమయం , పద్ధతీ లేని ఆహారపూలవాట్లు , సుచీ - శుభ్రతా లేని దైనందిక చర్యలు , దైవం అంటే ఎవరు ? ఆచారం అంటే ఏమిటీ ? అంటూ వితండవాదం చేస్తూ అజ్ఙానంలో కొట్టుకుపోతున్నామన్న ధ్యాస కూడాలేకుండా వ్యవహరిస్తున్నారు .

మితిమీరిన స్వాతంత్ర్యం మినీబట్టలరూపంలో , మాదకద్రవ్యాల మత్తులో ,మనుగడమరచి ఆడా, మగా, తేడాలు విడచి వికటంగా వెకిలిపోకడలుపోతున్నాది .మనిషి వికాసానికై తోడ్పడవలసిన విజ్ఞానం మందుగుండు పేలుళ్లతో మసికొట్టుకుపోయింది . స్వాతంత్ర్యానికి మరో మెట్టు , అబలల ఆర్తనాదాలు , బాల-బలాత్కారాలు , భ్రూణహత్యలు .ఈ పరిస్థితిలో ఏదిమంచో, ఏదిచెడో నిర్ణయించుకోలేక మానవజీవనం అగమ్యగోచరమవుతున్నాది . ఎందుకంటే కాలంలో ఏ మార్పూ రాలేదు . మనిషి మాత్రం మారేడు .

రాను, రాను సమాజ పరిస్థితి ఎలామారిందంటే , ఆధునికపోకడలంటూనే ఆచారాలంటారు , కానీ వాటిని పాటించరు . సంస్కారం ఇది , అంటారు కానీ ఎక్కడా కనిపించదు. స్త్రీ లకి స్వాతంత్ర్యం అంటారు , కానీ రక్షణ లేదు .మాట్లాడే మాటలో
మృదుత్వం లేదు , కట్టే బట్టలో నిండుతనం లేదు . నీతులుచెప్పేవారు తమదాకా వస్తే తప్పుకుంటున్నారు . రాతలు రాసేవారు రాయడంతో తమపని అయిపోయిందనుకుంటున్నారు .

ఎవరో వస్తారు , ఏదో చేస్తారని మిగిలినవాళ్లు ఎదురుచూస్తున్నారు . ఇలా చేసేబదులు అంతా ఒక్కటై ఒక నవ, సమసమాజాన్ని 
స్తాపించి , మంచిగా , మహొన్నతంగా , మానవత్యంతో బతికే మహాప్రస్థానాన్ని ప్రతిష్థిస్తే  , అందరం
ఒక్కటై కలసి జీవిస్తే ,...............

ఈ అల్లర్లు ఉండవు . ఆర్తనాదాలు ఉండవు . అప్పుడే " సత్యం వద - ధర్మం చర " అన్న పదానికి న్యాయం చేకూరుతుంది .

అదే నిజమైన జ్ఞానం , నిశ్చలమైన భగవత్తత్వస్వరూపం ..
విజయోస్థు .
-----------------------------------------------
రచన..శ్రీమతి',
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-----------------------------------

*****

మనమంతా ఒక్కటే |

మనమంతా ఒక్కటే .
*****

బ్రహ్మ తను చేతనాస్థ్థ్తితిలో ఉండగా చేసిన సృష్థ్థి సర్వోత్తమమైనదిగాను , అచేతనాస్థ్థితిలోఉండి చేసిన సృష్థ్థి భీభత్సముగాను మారినది . ఉత్తమమైన సృష్థ్థిలో ఋషి , ముని , దేవతాది సర్వగుణ సంపన్నులు జనియించగా అస్థవ్యస్థస్తితిలో నుండగా చేసిన సృష్థ్థిలో దానవ , విష -క్రిమికీటకాది క్రూర జంతువులు ఉద్భవించినవి .

వాటికారణంగా లోకమంతా అస్థవ్యస్థమైనది . అటువంటిసమయంలో దుష్థ , దానవ , క్రిమి-కీటకాదుల సంహరణార్ధం యజ్ఞయాగాదులు చేయదలచి దేవతలు సంసిద్ధులు కాగా , దైత్యాది విషకీటకాదులు ఆటంకపరచడం మొదలైంది . వాటి బారి-బాధలనుంచి విముక్తికై యొచన చేసిన శక్తిస్వరూపడైన భగవంతుడు తాను చేసిన సృష్థిని నాలుగు భాగాలుగా విభజించి యజ్ఞ, -
యాగది శుభకర్మలకు కర్తలుగా కొంతమందినీ , అవసర సామగ్రిసమకూర్చడానికి కొంతమందినీ ' యజ్ఞపరిరక్షణకై మరికొంతమందినీ , వీరందరిరక్షణ -పర్యవేక్షణకై ఇంకొంతమందినీ నియమించీ ,వారివారి కర్మానుసారంగా గుర్తింపుకై బ్రాహ్మణ , క్షత్రియ , వైస్య , శూద్రులుగా విభజించడమైనది .
వీరిలో ఏఒక్కరికొరతైనా యజ్ఞకర్మ పరిపూర్ణంకాదు . బ్రాహ్మణుడు పవిత్రుడై వేద-మంత్రాది స్థోత్రపఠనం చేస్థూ యజ్ఞాహుతికై ద్రమువ్యలు   సమర్పించుసమయంలో క్షత్రియులు , దైత్యాది- క్రూర మృగాది , క్రిమి -కీటకాల బారినుండీ యజ్ఞరక్షణ గావించుట , వైస్యులు యజ్ఞసామగ్రి సమకూర్చుట , శూద్రులు వీరందరి సౌకర్యార్ధం అవసరకార్యాలు చేస్తూ యజ్ఞరక్షణ సానుకూలపరచడం చేస్తూఉండేవారు .
ఈ నాలుగువర్ణాల కష్థ ఫలితంగా యజ్ఞపురుషుని తృప్తి పరచి దుష్థశక్తులను విధ్వంసంచేసి శాంతిస్థాపన చేయడం ఆకాలంనుంచీ మొదలై ,రానురాను ఆచారంగా మారింది .

అయితే యజ్ఞయాగాదులు చేయడం ఎందుకు ?, అసలు దేముడంటే ఎవరు ? అన్న ప్రశ్నలు రావచ్చు.

భగవంతుడు అనేదానికి ఒకరూపమంటూ లేదు . అది ఒక విశ్వ-చైతన్యశక్తి .ఆ శక్తివల్లే ఈ పూర్తి ప్రపంచమంతా ఆధారపడిఉంది . గాలికి , వెలుతురుకి , నీటికీ , అగ్నికి ,ఒక రూపం అంటూ లేదు . కానీ వీటిని వేటిలో బంధిస్తే వాటిరూపుని సంతరించుకుంటాయి .అలాగే ఈ భగవత్-శక్తికి మనం మన ఆలోచనలకి అనుకూలంగా ఆకారాలని , పేర్లని , మనమే కల్పించుకొని కొన్ని నిర్దిష్థమైన నియమాలని నిర్ణయించుకున్నాము . ఈ శక్తిని మనం ఏ రూపం లో ఆరాధించినా ఇచ్చే ఫలితం ఒక్కటే . కారణం ఈ శక్తి కోరేది సత్కర్మ , సదాచరణ , సద్ధర్మ పరిపాలన .

రామభక్తుడైన హనుమంతునికి సముద్రలంఘనానికి ముందు , అతను శక్తిమంతుడనని తెలియచెప్పేందుకు సుర , గణ , సేనాదులు ఆతని శక్తిని పేర్కొని ఆతనిముందు వర్ణించగా , ఆ సామూహిక వాక్పటిమాశక్తి ఆతనిని ఆవహించీ , మహాబలుడై
ఎన్నో క్లిష్థకార్యాలను సానుకూలపరిచేడని పురాణాలు చెపుతున్నాయి .

కాబట్టీ భగవంతుడనే ఈ శక్తి జాగ్రూతమవ్వాలంటే " ఓంకార " మనే ప్రణవాన్ని సామూహికంగా ఉచ్చరిస్థూ సమారాధనచేయాలి . దానివల్ల ఈ శ్రీశక్తి మహొజ్వలంగా మారి సంకల్పశిద్ధిని కలుగజేస్థుంది . ఈ శక్తివల్లే మన శరీరం లోని ప్రతీ కదలికా ఆధారపడి ఉంది . అటువంటి శక్తి విశ్వశక్తిగా మారాలంటే , ఆవాహన , ఆరాధన , మంత్రోచ్చరణ అవసరం .
అది యజ్న్యయాగాదులవల్ల , నిష్థాగరిష్థులైన సద్బ్థ్రాహ్మణుల మంత్రోచ్చారణ , వేద-పఠనాది సత్కర్మలవల్లా సంభవమవుతుంది . దానికొరకై బ్రాహ్మణుడుచేసే సమారాధనకి సమాన సహాయ-సహకారాలు అందించేది మిగిలిన మూడువర్గాలవారు గనక ఇందులో ఒకరు హెచ్చు ,ఇంకొకరు తక్కువ అనే ప్రసక్తి లేదు .
విశ్వశాంతికై అందరూ కలసి వివేకంగా వ్యవహరిస్తే ప్రజారక్షణ , శాంతి-సంరక్షణా సాధింపగలుగుతాము . ప్రతీఒక్కరిలోను ఉండేది ఆ పరమాత్మస్వరూపమే. దానికి చావు, పుట్టుక , వర్ణభేదం , వర్గభేదం లేదు . కానీ శరీరానికి సంబంధించీ కొన్ని నియమాలూ, నిష్థ్థలూ , సాంప్రదాయాది - స్వద్ధర్మ కర్మలూ కాక కామ, క్రోధ , లోభ , మోహ , మద , మత్సర్యాది ఆరు
శతృవులు ఆవహించి విటిచే పీడింపపడుతూండడం వల్ల , ధర్మాది , కామ ,మోక్షాలకోసం సామూహిక సత్కర్మలు , యజ్ఞయాగాది మంత్రోచ్చరణ సాధనలు చేయమని నిర్దేసించడమైనది .

కనుక ఆలోచనాపరులమైన నమంతాకలసి విశ్వకల్యాణంకొరకు ,విలక్షణమైన మార్గాలను అనుసరిస్తూ , కలసి,మెలసి , సంఘమర్యాదలు పాటిస్థూ , సత్సంగజీవనం కొనసాగించాలి.

మనకున్న వేళ్ళలోనే ఒక్కవేలికి బలముండదు , కానీ ఐదువేళ్ళు కలిస్తే ముష్థిఘాతమవుతుంది . అలాగే అందరం కలిస్తేనే సమైక్యతానందాన్ని పొంది , సద్గతి పొంద గలుగుతాము .

ఐకమత్యమే మహాబలం.

ఆలోచించండిమరి .
సర్వే జనా: సుఖినోభవంతు .
ఓం శాంతి:
----------------------
రచన  , శ్రీమతీ ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.