తొలి ప్రేమ.
---------------
ఆ రోజు స్కుాల్ ఆవరణ అంతా గందరగోళంగా ఉంది. టెన్త్ పరీక్షలు పుార్తి అయ్యేయి. స్టుాడెట్స్ ఒకరినొకరు
పలకరించుకుంటుా , కన్నీళ్ళతో సెండాఫ్ చెప్పుకుంటుా ...తిరిగి ఏ కాలేజ్ లో చేరాలి..
ఎక్కడ అందరుా తిరిగి కలుసుకోవాలి..
అన్న విషయాలు చర్చించుకుంటున్నారు.
ఇవేవి పట్టించుకోకుండా...అందరికీ
దుారంగా ఒక చెట్టుకింద నిల్చొని ఉంది
ప్రియంవద. ఆమె కళ్ళు ఎవరికోసమో వెదుకుతున్నాయి.
ప్రియంవద చుాడడానికి చాలా చక్కగా ఉంటుంది. తెల్లటి తెలుపు..దానికి తోడు
పొడవాటి వాల్జడ , చక్రాల్లాంటి కళ్ళతో చుాడ ముచ్చటగా ఉంటుంది.