అంశం: గురువే దైవం
శీర్షిక: స్వచ్ఛమైన స్వాతిముత్యం
పేరు: జామి సత్యనారాయణ
వృత్తి: తెలుగు ఉపాధ్యాయుడు
ఊరు: లక్కవరపుకోట
జిల్లా: విజయనగరం
చరవాణి:7013658114
********************************
అజ్ఞానాంధకారమును పారద్రోలే కాంతిపుంజం
విజ్ఞాన వెలుగును పంచే చైతన్య తేజం
ప్రతి వ్యక్తి మరువని ఆత్మీయ బంధం
ప్రగతి పథంలో నడిపించే ప్రగతి రథం
ఉన్నత విలువలు కలిగిన ఉన్నత శిఖరం
ఉత్తేజము నింపే ఉరకల వేసే చైతన్య కెరటం
విద్యార్ధి లోకమునకు ఆదర్శ దైవ సమానం
విలువలు నిచ్చే విలువైన విజ్ఞాన యంత్రం
సమాజ ప్రగతిని కాంక్షించే సమాజం నేస్తం
సహన గుణ శీలం కలిగిన మూర్తిమత్వం
జీవితమంతా పరుల కర్పించిన త్యాగపూరితం
జీవిత పాఠాలు బాలలకు అందించిన జీవిత సత్యం
బడిని గుడిగా మార్చిన భగవంతుని రూపం
బదులుగా ఏమాశించని స్వచ్ఛమైన స్వాతిముత్యం
********************************
*హామీ పత్రం: ఇది నా స్వీయ రచన. ఈ రచన అనుసరణ గాని, అనుకరణ గాని కానేకాదు. ఏ మాధ్యమము లోను ప్రచురింపబడలేదు*
*జామి సత్యనారాయణ*