Tuesday, May 30, 2023

రుబాయిలు

[30/05, 5:33 pm] 
JAGADISWARI SREERAMAMURTH
: 30/05/2023
అంశం : రుబాయిలు.
శీర్షిక  : అన్నియు నీవే :  అంతయు నీవే

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

1.
అణువణువున  ఉన్ననిన్ను  తెలియలేను గోపాలా!
ఈవిరహపు బాధ నేను  తాళలేను గోపాలా !
నీనామమె నాజీవన  స్మరణాయెను ఊపిరిగా._
నీరుాపము కానకనే  నుండలేను గోపాలా..! ॥
2.
ఈ భువిలో, ఆదివిలో, అంతటనుా నీవేగా
బ్రహ్మాడపు చైతన్యపు సారధివీ నీవేగా 
నా మదినే కోవెలగా మలచితినో గోపాలా
అలసిసొలసి యున్నాడవు విడిదిచేయు గోపాలా॥
(విడిది అంటే తత్కాలిక నివాసము , బస.)
3.
 సాధుజనులు ,సారగుణులు ,మెచ్చుగురుడ  వీవేగా
  సజ్జననము, సుజ్ఞానము నిచ్చుఘనుడ వీవేగా
గీతామృత ,తత్త్వబోధ యొాగసార ములనుదెల్పి
నీభక్తుల బ్రోచేందుకు  వచ్చుధవుడ వీవేగా॥
[30/05, 6:00 pm] +91 78423 68534: పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు -23✅️

ఆణువణువూ ఉన్న నిన్ను తెలియలేను గోపాలా.. నీ భక్తుల బ్రోవగా వచ్చు ధవుడా అని కృష్ణ రుబాయీలు. 🙏💐👌

Monday, May 29, 2023

సమస్యాపుారణ......... రణమె సకల జీవులకును రక్ష మహిని... !!

సమస్యాపుారణ
రణమె సకల జీవులకును రక్ష మహిని... !!

సరదాగా :- కోరాడ నరసింహా రావు !************
 మితిమీరిన సుఖములతో... 
 పంచభూతములనే, విల - విల లాడించె నరుడు,విచక్షణ రహి తుడై .....!
 ప్రకోపించిన  ప్రక్రుతి...తన విశ్వరూపమునే చూపుచునుండె, అతి వికృతముగా.... !
    విరివిగ మొక్కలను నాటు ...
  సవ రణమె సకల జీవులకును రక్ష మహిని... !!
       *********************

[28/05, 9:56 pm] JAGADISWARI SREERAMAMURTH: 28/05/2023
ప్రక్రియ : ఆటవెలది.పద్యం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

ప్రకృతి వికట మాయె ప్రబలె కరువుబాధ
మాన వత్వ  మదియె మంట గలిసె
ధర్మ నిరతి బాట, కర్మె జీవిత రాత
సదా చరణె సకల జీవ రక్ష  ॥

[29/05, 8:57 am] 
+91 79813 27110:
 👏👏👏💐🙏🌷🙏కోరాడ.

గజల్...

ప్రక్రియ: గజల్.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఈ వీణ పలికించు రాగాలె నీకొరకు
నాకీర్తు లేనీకు భోగాలు   క్రిష్ణయ్య
నీ పెదవి  పలికించు  ఆవేణు నాదాలు
నామనసు మురిపించి మరపించు క్రిష్ణయ్య ॥

అందాల మొాముపై కదలాడు నీనవ్వు
అరవిరియు సుమగంధ మధురిమే క్రిష్ణయ్య
ఆనీలి కన్నుల్లొ కదలాడు నీడలే
నాప్రేమ చిత్రాలు గమనించు క్రిష్ణయ్య ॥

నీపాద సవ్వడే నాగుండె లయలుగా
ఉచ్ఛ్వాశ నిశ్వాశ గతులాయె క్రిష్ణయ్య
ఏ జన్మ బంధమొా ఏ పుణ్య ఫలితమొా
నీరాగ సుధల లో తేలేను  క్రిష్ణయ్య ॥

సమీక్ష

అందాల మొాముపై కదలాడు నీనవ్వు
అరవిరియు సుమగంధ మధురిమే క్రిష్ణయ్య
ఆనీలి కన్నుల్లొ కదలాడు నీడలే
నాప్రేమ చిత్రాలు గమనించు క్రిష్ణయ్య ॥

అంటూ తమరు వ్రాసిన గజల్ చాలా చాలా బాగుంది మేడం 🙏🙏🙏

Sunday, May 28, 2023

మరో బ్రహ్మ అమ్మ

07/03/2023
.
అంశం : మగువ సృష్టికే కానుక :
శీర్షిక : మరో బ్రహ్మ .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఆట పాటలాడు వయసు, ఆంక్షలతో  బ్రతుకు గడువు
అడుగడుగున సద్దుబాటు, లేదు జన్మకాట విడుపు
ఆడ జన్మ నీదంటుా అందరదే ఎత్తిపొడుపు .
మనసులోన భాధ పెరిగి కన్నీరై  హృదిని తడుపు॥ 

పుట్టినింటి గడప దాట, మెట్టినింటి పరువు బెరుకు
భాధ్యత నిండిన పనులకు భారమైన బరువు బ్రతుకు .
సుప్రభాత మేలుకొలుపు సుభ్రతలకు తానె తుడుపు
వంట యింటి వేడిలోన పండగైన లేదు విడుపు॥

 ఆడ,మగ, తేడాలేని మగువ కాన్పు యెంపికలు
తొమ్మిదైన నెలల బాధ మగువ కోరు సంపదలు
బిడ్డ యెవ్వరైన గాని పంచి యిచ్చు తన ప్రాణము
బిడ్డ త్రాగు చను పాలలో, నింపు ప్రేమామృతము ॥

కలికి కంట కన్నీరిడ కరగు సుఖము జగము నందు.
ఆమె శక్తి రుాప మెత్త నిలువలేవు ఆమె ముందు.
చేయగలదు కర్యములిల ఘనమైనవి, పుడమి యందు
స్త్రీలు లేని జగమంతా సుాన్యమేగ సృష్టి యందు ॥ 

మారిన కాల మహిమకు ,మగువ లేలె మహిని గనుము 
విద్య , విషయ సంపదలవి నేర్చి వెలిగిరాసాంతము.
ధైర్య సాహసముల కాంతి ఇంట,బయట నేలె శాంతి 
అబల కాదు సబల, యంచు నిరుాపించె నామె గెలిచి ॥

మగువ సృష్టి కందమైన కానుక యని గుర్తించు.
మగువ మహిని మరో బ్రహ్మ మగువే సృష్టిని పెంచు
ఆమె చేయ లేని కార్య మిలను ఒక్కటైన లేదు లేదు.
ఆమె శక్తి గమనించు స్త్రీ ముార్తుల గౌరవించు.॥

హామీ : 
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం
కాని నా స్వీయ రచన.

********

29/05/2023.వా.సో.పో.వే..సాహిత్య వేదికగాశ్రీ వేముల శ్రీ సాయిచరణ్ గారి ఆధ్వర్యంలో అంశం : సుాక్తి ముక్తావళి., శీర్షిక :మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥ప్రక్రియ : ఆటవెలది .పద్యాలు

29/05/2023.
వా.సో.పో.వే..సాహిత్య వేదికగా
శ్రీ వేముల శ్రీ సాయిచరణ్ గారి ఆధ్వర్యంలో
అంశం : సుాక్తి ముక్తావళి.
శీర్షిక :మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥

ప్రక్రియ :  ఆటవెలది .పద్యాలు

రచయిత్రి.  :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
ఫోన్ : 8097622021
iswarimurthy@gmail.com

వందనములు.
*************
1.
అసుర బాధ బాప నవతరించెను హరి
మనిషి గాను భువిని  మహిమ జుాప
మనిషి ఆత్మ  లోన మనునాది దేవుడే
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
2.
పంతులారి తనయ పలుకు మాటలు విను
అనుభవాల సార మనసరించు..
నేర్చి, సుాక్తు లన్ని నేర్పుతో మసలుకో
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
3.
జన్మ ముత్తమంబు జగదీశ్వరను పేరు
సార్ధ కమ్ము జేయ సార గతిని
సుాక్తి పదము లెల్ల సులభరీ తినివ్రాయ 
 వినుతు లెన్నొ జేస్తి విఘ్న హరుకు ॥
4
ఆజ్ఞ శివుని దాయె అమ్బాభయమ్మిడే
అమ్మ, నాన్న, గురులు ,అనుమతొసగె
పాదములకు నమము ప్రారంభ మున జేసి
రాయు చుంటి హితవు చేయ శుభము .॥
5.
మనిషి మనిషి యందు మదిమేటి గుణముండు
వేరు వేరుగుండు వెతలు గతులు
కష్ట మెంతదైన కడదాక విడువకు
ధర్మ , న్యాయ బుద్ధి ధరణి నీవు ॥
6.
కోర్కెలుండవచ్చు కోర తగిన యంత
తీరు కొలది కోర్కె  తీరు హెచ్చు
కోర్కె తీరకున్న క్రోధంబు హెచ్చుగా
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
7.
ఆశ పోతు తనము ఆశయ లోపమ్ము
కలుగ జేయు నదియె కడు నిరాశ
కడకు కోర్కె తీర కాని పనుల జేయ
లంచగొండి యైన లక్షణముల ॥
8.
పులిని జుాచి నక్క పుార్తి వాతల దేలు
చంద మదియె గాద చాలు ఆశ
స్వార్ధ గుణము పెరుగు స్వస్థతేలడు ప్రాణి
మనసు మలిన మౌను మహిని మనుజ ॥
9.
కడకు పతన మొందు  కర్మ మిగులు నీకు
మితము జీవి తమ్ము మిగులు భువిని
కోర్కె యున్న మనిషి కోల్పోవు సుఖమును
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
10.
విద్య లెన్నొ నేర్చి వినుతి కెక్కుము నీవు
జ్ఞాన ధనులు చెడరు జగము నందు
సాహితీ వనమదె సరికోర్కె విహరింప
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
11.
చిన్న తనము యంచు చిన్నతప్పులుజేయ
తప్పు లొప్పు లౌన తప్పు తప్పే.
తప్పు లెంచ నట్టి తగురీతి మనుటకై
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
12.
విషయ వినయము లవి విద్య తోడనెవచ్చు
సార విద్య నబ్బు సభ్య తిలను.
మంచి మాట నోట మంది మెచ్చిన బాట
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
13.
తల్లి తండ్రి గురువు  తగురీతి బోధించు
చక్క నైన మాట చద్ది ముాట.
అనుభవాలు నేర్పు నవెగాద సుఖబాట
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
14.
ప్రథమ పాఠ శాల ప్రారంభ మింటితో
తోడు తల్లి దండ్రె తొలి గురువులు.
గారవించు మెపుడు ఘనమైన రీతిలో
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
15.
సార మైన బ్రతుకు సజ్జనుండదె కోరు.
సద్గుణములు నేర్వ  సమయ ముంచు
సత్య మేగ జయము  సచ్చరిత ధనముగా
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
16.
చిన్న పిల్ల లింట చిందు లేయుచు నున్న 
ముచ్చటౌను మనకు  ముద్దుమీర.
మాయ లేని వయసు  మంచి మాటలు నేర్పు
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
17.
కట్టు బొట్టు వంటి కడు సాంప్రదాయాలు
భరత భుామి నిండు ,భవిత  వెలుగు.
సాంప్రదాయ ములవి సరిధర్మ  పథములు
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
18.
చిన్న వయసు లోనె చిరు సభ్యతలు నేర్వ
లోక మందు మసల లోటు రాదు.
మితము మాటలాడి మించు గౌరవ మందు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
19.
శుద్ధి లేని మాట శుభము నీకదికాదు
మనసు లేని యాత్ర మహిని వమ్ము 
బుద్ధి లేని మనసు బుధజను లనుబాయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
20.
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
గురులు జెప్పు మాట గురుతు గెలుపు
పెంచు నీదు విలువ పేరు, జ్ఞాన ధనము
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
21.
పట్టి పట్టి జుాచి పర ధర్మజుల రోసి
పెంచ బోకు రణము నెంచు విధము 
మానవత్వ మదియె మనిషి ధర్మ మిలను
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
22.
తేనె లొలుకు పలుకు  తేటగీ తులవిందు
తెలుగు భాష మనది తెలుగు వెలుగు
దేశ భాష , నిండు దేశ భక్తియె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
23.
పచ్చ దనము లెేక ప్రకృతే వికటించ
ప్రబలె రోగ బాధ ప్రజల లోన
కండ్లు విప్పు మయ్య , గావ పుడమి నీవు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
24
అడుగు వదల నట్టి  ఆకాశ హార్మ్యాలు
తాగు నీరు మురిగె తావు లేక 
జనులు పెరుగ పెరిగె కలుషితమ్ములు చాల
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
25.
జాతి మతము లనెడు జాడ్యంబు నణచేటి
జాగృతిలనుజేయ జాల మేల.
సమత మమత నిండు సామ్యవాదుడవౌమ-
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
26.
కులము కులమనేటి కుటిల మాటల పోర-
గుణము లేని కులము ఘనము యౌన.
ధర్మ పథము నడచి ధరణి  కీర్తిని పెంచు
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
27.
 కోరి చెట్లు గొట్టి  కొండ బండలు జేసి
 కుార్చునున్న కొమ్మ కుాడ నరుకు
 ముార్ఖుడైన మనిషి ముందడుగెటు లేయు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
 28.
 గాలి నీరు లేక గతక గింజలు లేక
 మహిని  బ్రతుకు లాయె మట్టి పాలు.
 భావి భరత భవిత భారమౌ పుడమిలో
 మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
29.
డబ్బు డబ్బు యంచు గబ్బులో కాలిడీ
కడుగ నీరు లేక కలత యేల.? 
కడకు సుఖము లేని కలిమి లేటికి నీకు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
30.
పంట భుాములెల్ల పరుల కమ్మిన కీడు
పట్టి గొట్టు నిన్ను   పట్టు బట్టి
మాతృ భుామి నీది మర్మ మేటికి నీకు
మనుజ తెలుసుకొనుము మంచి మాట॥
31.
బ్రాహ్మణత్వ మిలను బహుదార్ల బ్రతుకాయె
నిలువు దోపి డీలె  నిత్య పుాజ  
 పలుకసత్యమాడు  పాపమేటికి నీకు 
మనుజ తెలుసుకొనుము మంచిమాట.॥
32.
  పొట్ట కుాటి కొరకు పొరుగు పంచను జేరు -
 పరువు లేని బ్రతుకు పబ్బ మేల ॥
  చేయు కృషిని పొందు చేరు సౌఖ్యము మెండు.
  మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
33.
పలుకు మంచి మాట  పరుల కింపగు మాట
 పెద్ద మంత్ర మదియె పెంచు సిరులు
 పలుకె శాంతి నేలు పథధర్మ  శాస్త్రమ్ము
 .మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
  34.
 ప్రాయ మందు జేయు పలు ధర్మ కర్మలుా
పెంచు పుణ్య మవియె పేర్చు నిధులు
గురుని గౌరవించి  గుణిగ పొందుము విద్య 
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
35.
జ్ఞాను లిడిన గ్రంధ  జ్ఞానవిద్యలబాట
తెలుసు కొనుము యిలను తెలియ కున్న 
పుట్టి బ్రతుకు రీతి, పుణ్య సంస్కృతి నీతి
మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
36.
చావు పుటక లిలను  చరిత జన్మపు రీతి
 బ్రతుకు చావు లవియె బ్రహ్మ రాత
  కుాడి రావు నేవి ముాడినంతనె జీవి
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
37.
 మనిషిలో నసురుడు మంచి బాటను మార్చు
 చదువు బుద్ధి నిచ్చు   చరిత నిలుపు
 మమత నిండు బ్రతుకు మహిలోన గెలుపురా
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 38.
 నాది నీది యనుచు  నట్టింట వాదములు
 పొంచి యున్న నాగు పోలు తగవు
 కాటు వేయు నెపుడొ, కడదేర్చు విసమురా
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 39.
 మంచి చెడులు రెండె మనిషిజా తికియుండు
జాతి మతము లవియె జగతి కల్ల
మనుజు లొక్క టేగ   మహినిమనగనెంచ
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
40.
విద్య తోడ వచ్చు విశ్వమేలెడు శక్తి
 జ్ఞాన సాధనమ్మె జ్ఞాను లెంచు.
 సార గీత  అదియె సాక్షి కర్మల బోధ 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
41.
చీక టున్న చోటె చీల్చి వెలుగు నిండు.
గేలి చేయు చోటె గెలుపు విందు.
లోక రీతి తెలిసి లోపమ్ము లనువీడు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
42
పలుకు మాతృ భాష పాటించు సంస్కృతీ
పుడమి జన్మ మనది  పుణ్య భుామి
ప్రజ్ఞ మీరి నట్టి పలువిద్య  లనునేర ॥
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
43
పెరుగు చద్ది ముాట పెద్దవారల మాట
పేచి వలదు చదువ పెద్దబాలశిక్ష
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
పోరు పెట్టకెపుడు  జోరు నెపుడు ॥
44
పట్టి గౌరవించు మన జన్మ భుామిని
పాటించు  తల్లిదండ్రి జెప్పేటి మాటను.
పదములంటీ గురుల ఆశీస్సులను గొనుము
పలుక మంత్రములివియె  పలుధర్మాచరణములు ॥
45
పొందినట్టి జన్మ సార్ధకతను పొంద
పాల నమ్ము జేయు పద్ధ తులను
అంది నట్టి సుఖము ఆనడత ఫలమురా
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
46
పట్టి పట్టి జుాచి పరధర్మ ములరోసి
పెంచ బోకు రణము నెంచు విధము 
 మహిని జాతి యొకటె  మనిషి ధర్మ మొకటె
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
47
పరుల ధర్మ మంచు  పరుషమా టలువీడు  
ధరను జాతి  మతపు ధర్మ మొకటే 
పలుక భాష లన్ని  పంచులే  మమతలుా ॥
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
48
పొల్లు మాట లాడి పోట్లాటలను దెచ్చు
యట్టి  చెడ్డ గుణము యవని చేటు
మంచి నడత తోడ మహిలోన మనుమయ్య.
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
49
మితము మాటలాడు మీరబో కుమ హద్దు
హీన పడని మాట హితవు నీకు.
అతిగ మాటలాడ ఆదరణ కరువౌను.
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
50
అమ్మ అక్క చెల్లి యనురక్త బంధమ్ము..
లాదరింతువు గాద యవని నీవు
యెదుటి, స్త్రీలను గన యేటికిీ మేలము  ?
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
51
ఆడ పిల్ల లింటి, అమ్మతల్లులు వారు
శక్తి రుాపు దాల్చు.శతృ వెదుట .
వారు శాపము నిడగ  వదలిపోవు సిరులు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
52.
జాతి మతము లవియె జగతి ధర్మము మాట
 మనుజు లొక్క టేగ   మహిని మనగ
 మంచి చెడులు రెండె మనిషిజా తులురెండె 
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
53
మనిషి జన్మ మెత్తు  మదిని మర్మము లేక
కల్మషమ్ము లిడని  కాంతి మనసు
పెరిగి నపుడు బుద్ధి పెడదోవ బట్టునదె
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
54
చదువు లెన్ని యున్న  చరియించు నీతీరు
నీదు బాట నెంచు  నీడ వలెను
వ్యసన పరుల తోడ వ్యవహరించుట చేటు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
55
మానవత్వ మదియె మనిషి భుాషణ మౌను.
పరుల బాధ నెరిగి పలుకు మెపుడు
 నీవు జేయు కర్మ నీవెంటె వచ్చుగా 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
56
తల్లిదండ్రు లిలను  తలచు వేల్పులు నమ్ము
తీర్చు ఋణము నీవు  తీరు గాను
 జగతి నీదు భవిత   జన్మదా తల భిక్ష 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
57
ఆతివ అబల యనెడు ఆలోచనసలొద్దు 
అబల కాదు యామె  ఆది శక్తి
అడుగు లోన యడుగు ఆమెతో డుగనేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
58
మహిని  పొందు ఘనత మందిలో నొకడిగ
సభ్య తెరిగి మసలు  సజ్జనునిగ
మంచి పేరు పొందు మనిషివిలువె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
59.
మనిషి విలువ పెరుగు  మహి మంచితనముతో
దర్ప మున్న వాని  దలవ రెవరు
కలసి మెలసి యున్న   కడుస్నేహ , బంధాలు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
60.
ఉన్న దాని లోనె ఉడుత సాయముజేయ-
ఉన్న తమ్ము గుణము నుర్వి కీర్తి.
ఉచ్ఛ రింతు రిలను ఉత్కృష్ట గుణులనే
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
61.
చెలిమి తోడ నెపుడు చెప్పకింటి లోగుట్టు 
 గుట్టు  రట్టు యైన గురుతు చెడును
 లోకు లెపుడు కాకు లనిజెప్పె పెద్దలుా 
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
62.
నమ్ము వార్కి కీడు  నమ్మించి  చేయకుా
పాపి యైన జీవి పతన మొౌను.
హీను డన్న బిరుదు , హీనమౌ బ్రతుకదే
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
63.
లోక మందు  జనులు లోపాలనే యెంచు
నమ్మ కెవరి నెపుడు , నటనె బ్రతుకు
నమ్మి జెప్ప కేది నగుబాటు యౌదువే
 మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
 64.
గనిన పొరుగు వారి కష్టాలు నష్టాలు
తోడుగుండు నీవు తొలి హితునిగా
చేయు సాయ మెపుడు చేయుాత యౌనీకు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
65.
మట్టి సార మున్న మంచి పంటలు పండు
మంచి నడవడున్న  మనిషి  ఎదుగు
నీతి నియమములవి  నిత్య కల్యాణాలు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
66.
ఆడ వారు యంచు అవహేళనలు మాను 
ఆది శక్తి రుాపు నవని వారు.
తగిన సమయ మందు తామె శక్తిగ మారు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 67.
మనిషి గాను పుట్టి  మాతృ దుాషణ జేసి
మాన హీనుడ వౌచు  మదము తోడ-
మసలు బుద్ధి మాని మంచిగా మసలుకో
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
68.
కామ క్రోధము లవి  కడుహీన గుణములు 
కలుగ దెపుడు శాంతి , కడకు ముంచు
ఒంటరైన బ్రతుకు ఓదార్పు నీయదు 
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
69.
స్వార్ధ మున్న వాని స్వజనులె దుాషించు
మాన వతను మరచు మనిషి మృగము .
మంచి గుణము లేని మనిషధము డిలను
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
70.
కలియె వచ్చె నంచు  కలికాల మహిమంచు
కఠిన బుద్ధి తోడ  ఖలుని వలెను
ఐన వారి జేయ  కాశ్రమములపాలు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
71.
కన్న వారి కంట  కన్నీరు దెప్పించు 
కఠిన పుత్రు లేల కడుపు చేటు.
కన్న ఋణము దీర్చు కన్నవారికి  మ్రొక్కు.
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
72.
భాలకుచితర మైన బ్రతుకు  బాధలేటికియంచు
తల్లిదండ్రు లెటకొ తరలి పోవ.. 
నేర మునకు శిక్ష  నేలు ఖర్మల రాత 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
73.
 పరువు లేని పనుల పర కాంతలను రోయు
కాము కులను విడుమ ఖలుల విడుమ 
పడతి కంట నీరు పలుశాపముల పోరు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
74.
కపట మెరుగ నట్టి కసికందుల చెఱచు.
కుచిత బుద్ధి హీను గుాడ కెపుడు.
కన్న కుాతు రల్లె కరుణ సాకుము వాని.
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
75.
తెలుపు నలుపు రంగు దేహమ్ము కేగాని.
గుణులు, గుణుల నెంచు గురుతు మనసు
నల్ల దైన యావు తెల్లపాలనె యిచ్చు .
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
76.
వృద్ధులైన వారు  వృద్ధాశ్ర మములందు 
కుాడు గుడ్డ లేక కుములు చుండ 
ఏమి బావు కొందుదు వేమి పరువు నీకు 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
77.
భార్య జెప్పు మాట బహు కమ్మ దైనంత
కన్న వారి కెట్ట కుాడు కరువు
భార్య వచ్చి నంత భారమా తలిదండ్రి.
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
78.
కొడుకు హీను డైన కోర రెప్పుడు కీడు.
వారె కన్న వారు వరుస ఘనులు 
అట్టి వారి ఋణము నాదిగా దీర్చుకో
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
79.
పుత్ర పొిషణ కొరకు పుార్తిజీవితమిచ్చు
కన్నవారి నొదలు కఠిన పరులు
అట్టివారి జేర యసురభా వములబ్బు
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
80.
స్త్రీల ధనము నమ్మి సిత్రంబులను జేయు
హీను లున్న  చోటు హితవు గాదు.
మత్తు మరగి నట్టి మహిషాసురులు వారు 
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
81.
పనికి రాని పనుల  పరస్త్రీల  వాంఛించు
పశుప్ర వృత్తి నిండు పరుష హీను..
పట్టి కొట్టి ననదె పాపంబు లేదయా
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
82.
బాస లెన్నొ జేసి బాధ్యత మరచేటి
నాయకులను నీవు నమ్మ కిలను
ఓటు విలువ దెలసి నొగి తల వంచకు
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
83.
పొరుగు వారి జేరి పోరు మాటలనాడి
కలహ ములను దెచ్చు కడుపొ గరులు
అట్టి వారి జేర నవమాన ములుమెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
84.
సాధు జనుల తోడ సాంగత్య మును జేయ 
శ్రద్ధ కలుగు నీకు శాస్త్ర ములపై
జ్ఞాన ధనుల జేర  జ్ఞాన సారము హెచ్చు
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
85.
అక్షరాల కుార్పు ఆలోచనలమార్పు
కవన వన విహారి కావ్య శ్రేష్ఠి 
సాహితీ వనమున సార జ్ఞానమునేలు.
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
86.
అష్ట దిగ్గజాల ఆలోచనా తీరు 
ననుసరించు మెపుడు నవ్య దిశగ
గ్రంధ పఠన జేసి గరిమ పటిమ నొందు
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
87.
 నేర్ప విద్య నీవు నేరమదియెకాదు
 విద్య విలువ తెలియు విజ్ఞ తదియె .
 విశ్వ కీర్తి పెంచు విజయ కేతన మదియె
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
88.
నిలువ నీడ లేక నిత్య కుాటికి పాట్లు-
పడెడు పాపల గన పగులు గుండె.
ఆత్మ శుద్ధియున్న  ఆదర్శగురువౌమ 
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
89.
పాప కర్మ జేసి పాపాలు పోవంగ 
తీర్థ యాత్ర  బాట తిరుగ నీవు
చేయు కర్మ ఫలము చెరగదు కడదాక
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
90.
తల్లి దండ్రులకును తరచు చేయుము సేవ
పలుక రించు మెపుడు  పంచు చెలిమి 
వారి సంతసమ్మె వరము, కలుగ మేలు
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
91.
కష్ట- నష్ట ములను  కడలి తేలెడు నావ
మునుగ దెపుడు , ముందు దేలు నెపుడు
అల్ల కల్లోలమౌ నట్టి జీవిత యాత్ర
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
92.
వేల్పు యొక్కడంచు వేదాలు పలుకంగ
దొమ్మి చేస దోషి వౌదువేల...?
జెప్పి మతము పేరు చెడపకు, చెడెదవు
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
93.
మితము యైన తిండి మిత్రుడై కాపాడు
సాత్వి కమ్మ దైన సర్వ శ్రేష్ఠి 
సమయ పాల నెరిగి సరిభోజ నముజేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
94.
తిండి ఎక్కు వైన తిరగాడు రోగాలు
పట్టి గొట్టు నిన్ను బరువు పెంచు.
 బ్రతుకు భారమొౌను  బరువెక్క దేహమ్ము
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
95.
 కడుపు నింపు వారు కడు దుర్గతిపాలు
 అమ్మ ,నాన్న,  మరియు అన్నదాత 
 ఆద రింపు వారి ఆర్తిగని మసలుకో
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
96.
ముాగ జీవి నైన ముంచు రోగపు బాధ
వేరు గాదు  బాధ వేద నదియె
జీవులన్ని యొకటె జీవించు తీరొకటె
మనుజ తెలుసు కొనుము మంచి మాట
97.
బుద్ధి జీవి మనిషి  భుామికే బరువాయె
శుద్ది లేని పనుల సుాక రుండై
మేధ వెలికి దీసి  మేలు జేయు మయ్య
మనుజ తెలుసు కొనుము మంచి మాట
98.
కామ బుద్ధి తోడ కాంతల రోసేటి
దుష్ట బుద్ధు లున్న ధుార్తు లకును
తుచ్ఛులన్న పేర తుదకు దేహ శుద్ధి.
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
99.
అతివ ,అమ్మ, ఆలి, ,అక్కచెల్లనుమాట
వావి వరుస లేని వరుస క్రమము.
కామ మున్న కళ్ళు కానవు బంధుత్వము
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
100.
కామ బుద్ధి తోడ కాంతల రోసేటి
దుష్ట బుద్ధు లున్న ధుార్తు లకును
తుచ్ఛ మైన బుద్ధి తుదకు దేహ శుద్ధి.
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥
101.
బాస లెన్నొ జేసి బాధ్యత మరచేటి
నాయకులను నీవు నమ్మ కిలను
ఓటు విలువ నెరిగి,  ఒదిగి తల వంచకు
మనుజ తెలుసు కొనుము మంచి మాట ॥

హామీ : 
ఆటవెలది పద్యాలు నా స్వీయ రచనలు.

********************************

Saturday, May 27, 2023

తపస్వి మనోహరం వార పత్రిక మరియు నాలుగు మాస పత్రికలు (తపస్వి మనోహరం మాస పత్రిక, మనోహరి మహిళా పత్రికల మొత్తం లింక్స్....

[28/05, 10:25 am] +91 97018 93801: తపస్వి మనోహరం వార పత్రిక మరియు నాలుగు మాస పత్రికలు (తపస్వి మనోహరం మాస పత్రిక, మనోహరి మహిళల ప్రత్యేక మాస పత్రిక, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్రాంతీయ మాస పత్రిక, గోదావరి జిల్లాల రచయితల ప్రత్యేక మాస పత్రిక) తపస్వి మనోహరం వెబ్సైట్ లో ఎప్పుడైనా చదవవచ్చు. అలాగే మీకు నచ్చిన పత్రికను డౌన్లోడ్ చేసుకోవచ్చు, పత్రిక లింక్ షేర్ చేయవచ్చు. పై పత్రికలకు సంబంధించి మీ రచనలు ఆయా గ్రూప్స్ లో పెట్టవచ్చు లేదా క్రింది నంబర్స్, మెయిల్ ఐడికి మీ రచనలు పర్సనల్ గా సెండ్ చేయవచ్చు.                                                                    
వాట్సప్ & ఫోన్ నంబర్:: 
+91 9059690733, +91 9701893801
మెయిల్ ఐడి:: 
manoharam.editor@gmail.com
తపస్వి మనోహరం వెబ్సైట్:: https://thapasvimanoharam.com
[28/05, 10:25 am] +91 97018 93801: *తపస్వి మనోహరం సంస్థ వివిధ వాట్సప్ గ్రూప్స్ లింక్స్*

*తపస్వి మనోహరం*
https://chat.whatsapp.com/EExThqeLycEGn7SqF8hlyW
(తపస్వి మనోహరం మెయిన్ గ్రూప్ ఇది. తపస్వి మనోహరం వార, మాస పత్రికలలో రచనల కొరకు టీమ్ వారు టాస్క్ ఇస్తుంటారు.)
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

*తపస్వి సిసింద్రీ* (లఘు ప్రక్రియ) గ్రూప్ లింక్
https://chat.whatsapp.com/LTLVEzMFCz5HXhWqUtKt6L
(తపస్వి మనోహరం వ్యవస్థాపకులు శ్రీ కార్తిక్ గారు రూపొందిన సిసింద్రీ ప్రక్రియకు సంబంధించిన గ్రూప్ ఇది. తపస్వి మనోహరం వార, మాస పత్రికలలో ఇవి ప్రచురితం చేస్తాము.)
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

*తపస్వి ఆప్ ఆడియో కథలు* గ్రూప్ లింక్
https://chat.whatsapp.com/EkdqE0SqLJcKdqkF70sqFU
(తపస్వి మనోహరం కొత్తగా రూపొందించే *తపస్వి ఆప్* కొరకు ఆడియో కథలు సేకరించడం జరుగుతుంది.)
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

*మనోహరి మహిళా పత్రిక* గ్రూప్ లింక్
https://chat.whatsapp.com/DgKxV8NwimT887E6I6eTfZ
(తపస్వి మనోహరం మహిళా మాస పత్రిక *మనోహరి* కోసం రచనలు సేకరించే గ్రూప్ ఇది. పత్రికలో రచనల కొరకు టీమ్ వారు టాస్క్ ఇస్తుంటారు. *ఈ గ్రూప్ లో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంది.* )
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

*తపస్వి కళింగ మాస పత్రిక* గ్రూప్ లింక్
https://chat.whatsapp.com/EdyupFN8sU49yDJQ0f14FO

(తపస్వి మనోహరం *కళింగ మాస పత్రిక* గ్రూప్ ఇది. ఈ పత్రికలో రచనల కొరకు టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. *ఇందులో ఉత్తరాంధ్ర ప్రాంతం వారు మాత్రమే జాయిన్ అవ్వాలి.* )
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
*తపస్వి గోదారి ఊసులు మాస పత్రిక* గ్రూప్ లింక్
https://chat.whatsapp.com/I6CbzpbcrMF8kf2qkoCSkF
(తపస్వి మనోహరం *గోదారి ఊసులు మాస పత్రిక* గ్రూప్ ఇది. ఈ పత్రికలో రచనల కొరకు టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. *ఇందులో ఉభయ గోదావరి జిల్లాల వారు మాత్రమే జాయిన్ అవ్వాలి.* )
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
మీ సందేహాలు సూచనలు ఆయా గ్రూప్స్ లో అడగవచ్చు లేదా క్రింది నంబర్స్ లో సంప్రదించవచ్చు.
*ఫోన్, వాట్సప్ నంబర్స్* 
+91 9059690733,
+91 7893467516.
*మెయిల్ ఐడి*
manoharam.editor@gmail.com
*తపస్వి మనోహరం వెబ్సైట్*
https://thapasvimanoharam.com/
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

చెట్టు తల్లి

[27/05, 1:12 pm] +91 90044 28159: *02)చెట్టు తల్లి..
***************

వెధవ చెట్టు ..
ఎన్ని సార్లు నరికినా మళ్ళీ చిగురిస్తోంది సిగ్గులేకుండా..
అనుకుంటుా రుస- రుస లాడుతుా పళ్ళు తోముకుంటున్నాడు రాఘవ. అతడి భార్య లలిత 
అప్పటికే  అక్కడి వారి ఆచారం ప్రకారం, ఆ పెద్ద చెట్టు దగ్గర దీపం పెట్టేసింది . కొడుకు హర్ష మర్రి చెట్టు కొమ్మకు కట్టిన ఉయ్యాల ఊగుతానని మొరాయిస్తున్నాడు.
లలిత వాడిని వద్దని  బుజ్జగిస్తున్నాది. వాడికి పదేళ్ళు దాటేయి ..చిన్నప్పటి నుండే  వాడికి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండేది . ఉబ్బసం ఏమొా అనుకున్నారు .డాక్టర్లకు చుాపిస్తే  ఎన్నో   టెస్ట్ లు చేసి,  చివరకు వాడి బ్రైన్ కి ఆక్సిజన్ అందడం లేదని కొందరు ,  , ఎక్కడో బ్లడ్ క్లాట్స్ ఉండి రక్తప్రసరణం సమంగా జరగనందు వల్ల ఇలా జరుగుతున్నాదని మరి కొందరు , చెపుతుా ఏవేవో 
 మందులు రాసి ఇస్తున్నారు. . పిల్లాడికి వయసు పెరుగుతుా ఉంటే తగ్గవచ్చని లేకపోతే సర్జరీ చేయవలసి వస్తుందని మరికొందరు చెప్పేరు. చెప్పేరు. ఉన్న ఒక్కగానొక్క పిల్లడికీ  అసలు ఈ వ్యాధేమిటో....ఎవరుా తేల్చి చెప్పలేకపోతున్నారు. అందికే వాడు ఏమైనా ఎత్తులెక్కినా 
 అలసిపోయే ఆటలాడినా , తమకు చాలా భయంగా ఉంటోంది . ఊపిరందని కారణంగా వాడికేమైనా అవుతుందేమొానని.
ఆలోచిస్తున్న రాఘవ మళ్ళీ పిల్లాడి అల్లరితో ఈ లోకం లోకి వచ్చిపడ్డాడు.
ఎదురుగా పెద్ద చెట్టు, దానికి వేలాడుతున్న గొలుసులుా..
కనపడ్డాయి. రాఘవ ఆలోచనలు మళ్ళీ అటు మళ్ళేయి.
అసలక్కడ ఆ ఉయ్యాల ఎవరు కట్టేరో ...
రెండు పెద్ద పెద్ద ఇనప గొలుసులతో కొమ్మకు వేలాడ దీసి కట్టేరు.  
ఇనప  గొలుసుల రాపిడికి చెట్టు కొమ్మ ఒరుసుకు పోవడం వల్ల , దాని చర్మం చాలా మట్టుకు ఊడిపోయి భయంకరంగా  ఉంది. 
గొలుసుల కింద మనకెలా కావాలంటే అలా ఊయల బిగించుకోవచ్చట. మంచం కుాడా బిగించుకోవచ్చట.
ప్రస్తుతం దానికి జాలీల గుడ్డ కట్టి ఉంది. అందులో పడుకో వచ్చు కుాడా..
 తను రిటైర్  అవడానికింకా పదేళ్ళ సమయం ఉంది.
 ఈ లోగా కుాడ బెట్టిన డబ్బుతో తనకు కావలసిన రీతిలో 
 తన సాంత జాగాలో ఇల్లు కట్టుకుంటే  తన రిటైర్ మెంట్ తర్వాత ప్రశాంతంగా, తమ బంధువర్గం మధ్య ఉండవచ్చన్న ఆలోచనతో  తన సొంత జాగాలోఇల్లు కట్టడం మొదలెట్టాడు. 
 ఇల్లు పుార్తయింది గానీ , ఈ చెట్టు,వల్ల వచ్చిన  సమస్య తీరలేదు. కారణం తమ ఇంటి సింహద్వారానికి ఎదురుగా 
 వ్యాపుంచీ ఉందా చెట్టు. అది కొట్టి పారేస్తే గాని చుట్టుా ప్రహారీ కట్టుకోవడానికిగానీ , గేటు పెట్టుకుందికి గానీ వీలుకాదు. 
 కొందరు " వందలనాటి కాలపు చెట్టుని కొట్ట వద్ద" ని అంటే..
 మరికొందరు "..కాలం మారిందోయ్ ..ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు ఏమిటీ...అందమైన ఇంటికి ఎదురుగా, ఈ దెయ్యాల మర్రి చెట్టేమిటి  ..? 
 కొట్టి పారేయ్" అని మరొ కొందరుా..చెపుతుా ఉఃటే 
 రాఘవకు ఏం చేయాలో తోచడంలేదు.
  చివరికి ఈ చెట్టు ఆకులు రాల్చే సమయంలో..
  ఇంటి ప్రాంగణమంతా ఎండుటాకులతో నిండిపోయి 
  అవి తుడుచుకోలేక కొంత ,ఆకులు రాలిన మొండి చెట్టు వల్ల తనిల్లు నిజంగా దెయ్యాల కొంపలాగే కనపడడంతో . మరికొంత  చికాకుతో , చివరికి చెట్టును కొట్టించడానికే సిద్ధపడ్డాడు రాఘవ.
  అప్పటికీ రెండు సార్లు కొట్టించేడు కుాడా...
  కానీ ఉద్యోగ రీత్యా తాను వెళ్ళి తిరిగి వచ్చే సరికి మళ్ళీ
  చిరు చిగుర్లతో  దర్శనమిస్తొింది
  మరింక కాండం వరకు కొట్టినా లాభం లేదు.
  ఏకంగా అడుగునుంచి వేర్లతో సహా పెక్కళించేయాలి అనుకుంటుా .ఫోన్ తీసేడు.
  **********
 
ఇన్నాళ్ళుా ఈ ట్రాన్స్‌ఫర్ల కారణంగా ఎక్కడా తనకు సొంత ఇల్లంటుా లేక  కావలసినట్టు ఉండలేకపోయాడు. కనీసం కారు , బైకు అన్నా పెట్టుకోవడానికి స్టలం లేని అద్దె ఇళ్ళలో  నానా అవస్థలుా పడ్డాడు.
ఇప్పుడు ప్రసాంతంగా ఒక దగ్గర ఉండవచ్చనే ఉద్దేశ్యం  తో తను చిన్నప్పుడు ఉండే ఊర్లోనే తన తండ్రి కి వారసత్వపు ఆస్థిగా సంక్రమించిన .జాగాలో అందమైన బంగ్లా లాంటి ఇల్లు కట్టుకున్నాడు.  తాతల కాలం నాటి జాగా కావడం వల్ల , ఆ జాగాలో చాలా పెద్ద మట్రి చెట్టు , దాని మధ్యలోంచి పుట్టిన వేపచెట్టుతో కలిపి చాలా  విశాలంగా వ్యాపించి ఉంది.
వందేళ్ళనాటి చెట్టుగా అక్కడి గ్రామస్తులు  ప్రతీ సొిమ, శనివారాల్లో ఆచెట్టు కింద తొర్రలో దీపం పెట్టడం .అలవాటుగా మారడంతో , దానిని తమ తాత తండ్రులకు ,  కొట్టించడానికి వీలుకాక అలాగే వదిలేసారు.
అదీ కాక అప్పట్లో సాధారణమైన పెంకుటిల్లు కట్టుకోవడం , సైకిళ్ళవాడకం తప్ప మరో విధానంలో  జీవితం ఉండేది కాదు. అప్పట్లో ఆ చెట్టు కిందే రచ్చబండలు జరిగేవని చెప్పుకునేవారు. ఐతే ఆచెట్టు వ్యాపించడం వల్ల దాని ఊడలు మట్టిలో పాతుకు పోయి మరో రెండు చెట్లు లేచిపోయాయి. 
దాంతో తన వంతు వచ్చే సరికి అక్కడ 
చుట్టుా ప్రహారీ గోడ కట్టడానికి గానీ , కారు పార్కింగ్ కి గానీ , 
కనీసం పెద్ద గేటు పెట్టుకుందికి గానీ అవకాశం కలగడం లేదు. ఏ ముాలో గేటు కట్టుకో డానికి వాస్తు కుదరడం లేదు.
కాకుండా ఇంటి ముందు గేటుండాలి గానీ ఇంకో ముాల
 ఉండడమేమిటీ..?
  కొత్తగా లేచిన చెట్లు కుాడా చాలా విశాలంగా పెరిగిపోతున్నాయి. దాంతో ఇంత అందమైన ఇల్లు
  గేటు లేని ప్రహారీ గోడతో అసహ్యంగా కనిపిస్తున్నాది.
  ఆఖరికి తన గురించి ఎవరైనా వస్తే , తన ఇంటి అడ్రస్సు కుాడా "గేటులేని రాఘవ" గారిల్లుగా మారిపోయింది.
అసలు, ఈ మధ్య తమ ఊరు చాలా మారిపోయింది.
ఎవరుా తమ ఇళ్ళ లో మట్టి జాగా ఉంచడమే లేదు . 
ఇంటి ప్రహారీల లోపలంతా  అందమైన డిజైన టైల్స్ వేయించి 
కారుకో షెడ్డు వేసుకొని , అందమైన పెద్ద పేద్ద గేట్లు పెట్టు కొని 
దానిమీద తమ ఇంటి నంబరు పేరు రాసుకుంటున్నారు.
అందరిలోకీ ,తనొక్కడే గేటు లేని రాఘవగా మిగిలిపోయేడు.
ఇక లాభం లేదు . రేపెలాగైనా మరెవరినైనా పిలిచి ఈ చెట్టును కుాకటి వేళ్ళతో సహా నరికించేయాలి .
వెధవ చెట్టు, కోలనీ అంతటికీ దిష్టి బొమ్మలా ఉంది. 
రాత్రుళ్ళలో  దయ్యాల మర్రిలా భయంకరంగా ఉంటుంది.
దానికితోడు గాలికి కిర్రు కిర్రు మని కదిలే ఈ ఉయ్యాల గొలుసులొకటి...

అందరిళ్ళుా ఎంత బాగున్నాయొా..! పెద్ద ఆవరణలలో
కట్టుకున్న విశ్రాంతి మంటపాల కింద కుర్చీల లో కుార్చొని
సాయంత్రం పుాట "టీ "లు  తాగుతుా ఎంచక్కా కబుర్లాడు కుంటారో...
తనకా అదృష్టం ఎప్పుడు పడుతుందో ?
మరి ఆలోచించీ లాభంలేదు. అనుకుంటుా కార్పొరేషన్ కి ఫోన్ చేసాడు.
మరో రెండు రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు
వచ్చి చెట్టును పుార్తిగా భుామిలోంచీ పెక్కళించేస్తామని చెప్పేరు. 
మరొక్క రెండురోజులాగితే చాలు.
తను అనుకున్నట్టుగానే  ఇంటీరియర్ తో సహా అన్నీ 
చేయించేస్తాడు.
అనుకుంటుా ఆనందకరమైన ఆలోచనలతో పక్కమీద వాలేడు రాఘవ.

********************

మర్నాడు పొద్దున్నే  మున్సిపాలిటీ  వర్కర్లు వచ్చి 
అంత పెద్ద చెట్టునీ , వేర్లతో సహా పెకళించి చెట్టు మొత్తాన్ని ట్రక్కు మీద వేసుకొని, వెళిపోయారు.
రాఘవ నిశ్ఛింతగా ఊపిరి పీల్చుకున్నాడు
"వెధవ చెట్టు పీడ విరగడైంది" అనుకుంటుా...
ఎండలు తగ్గి వర్షాలు మొదలయ్యేయి.
"వర్షాకాలం దాటేకా ఇంటి పని మొదలెట్టాలి" అనుకుంటుా  , 
టి.వి.ఆన్ చేసాడు.

*****::*****************************
వర్షాలు మొదలయ్యేయి. ఇంటి ప్రాంగణమంతా బురద బురదగా ఉంది . రెండు నెలలు గడిచినా వర్షాల ఉధ్రుతం తగ్గలేదు. 
ఆరోజు రాత్రి సడన్ గా బాబుకి చికాకు చేసింది
రాఘవ , లలిత  బాబుని తీసుకొని ఆదరా బాదరా 
కారులో సిటీకి బయలుదేరేరు.
 బాబుకి ఊపిరందడం చాలా కష్టమై గిల గిలా కొట్టుకుంటున్నాడు. ఏక్షణంలో బాబు ఊపిరాగిపొితుందో ..
 అన్న ఆందోళనతో ఇద్దరికీ మతిపోతోంది.
 రాఘవ నుారు కిలోమీటర్ల స్పీడ్ తో కారు పోనిస్తున్నాడు.
 బాబు పరిస్థితి చుాసి ,భయానికి ఒంటినిండా చమటలు పడుతున్నాయి రాఘవకి. చేతులు వణుకుతున్నాయి భయానికి.  ఈ పరిస్థితిలో కారు నడపడం  చాలా కష్టంగా అనిపించింది రాఘవకి .
 చివరకు ఎలాగో అలా , సిటీలో ఉన్న పెద్ద ఆసుపత్రికి  చేరుకున్నారు.
 అప్పటికి తెల్లారిపోయింది .
 అక్కడున్న   అసిస్టెంట్ డాక్టరు పిల్లాడిని చుాసి ఏదో 
 ఇంజక్షన్ ఇచ్చేసరికి అరగంటలో బాబు నిద్రలోకి జారిపోయేడు.
 పెద్ద డాక్టరు పది గంటలకు వస్తారని ,
 అంతవరకు తానేం చేయలేనని , అంతదాకా నిరీక్షించ మని చెప్పి అతను వెళ్ళి .పోయాడు.
 చేసేది లేక రాఘవ చేతులు నులుముకుంటుా 
 బెంచ్ మీద కుాలబడ్డాడు. 
 లలిత ఎడ్చి ఏడ్చి, బాబు పక్కనే  సొమ్మసిల్లినట్టు వాలిపోయింది.
 తెల్లారి పదిగంటలవరకు చేసిన నిరీక్షణ,  జీవితంలో అనుభవించినపెద్ద శిక్షలా అనిపించింది రాఘవకి.
 చివరికి  పెద్ద డాక్టర్  గారు వచ్చేరు .బాబుని పరీక్షించి
 పుట్టెడు రక్త పరీక్షలు రాసేరు. స్కేనింగులు , ఎక్స్ రే లు, టెష్ట్ లు ,మందులు ,ఇంజక్షన్లకి  ఓ లక్ష వదిలించిన తర్వాత , ముందు డాక్టరుగారు  తమకు తెలిపిన విషయాన్నే చల్లగా చెప్పేరు. 
 అదే..బాబుకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని , 
 కొద్ది రోజులు ఆక్సిజన్  పెట్టి గుండెను బలంగా కొట్టుకునేట్టు చేసేకా ఆపరేషన్ చేయవలసి వస్తే చేస్తామని , వయసు తక్కువ కాబట్టి ప్రస్తుతం మందులు వాడమని., వాటితో తగ్గిపోతే ఫర్వాలేదుగానీ , లేకపోతే కష్టమనీ....
 చెప్పడంతో రాఘవ ,లలిత, బెంబేలు పడిపోయారు.
 "ఉన్న ఒక్కగానొక్క కొడుకుని బ్రతికించు దేముడా" అనుకుంటుా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. 
 వీరి పరిస్థితి  చుాసిన డాక్టరు ప్రస్తుతానికి తన దగ్గర ఒక ఆక్సిజన్  సిలెండరు ఉందని , కానీ ఆపై సిలిండర్ 
కోసం  బయటే ప్రయత్నించాలని చెప్పి బాబుకి ఆక్సిజన్, మాస్క్ తగిలించేరు.
ప్రతీ నాలుగు గంటలకు హార్ట్ రీడింగ్ పరీక్షిస్తున్నారు .కానీ హార్డ్  బీట్, రేటింగ్ పెరగడం లేదు .దాంతో రాఘవ బయటికి పరుగెత్తేడు .ఏ చోట అడిగినా  ఆక్సిజన్ సిలెండర్లు లేవనే చెపుతున్నారు.  అతి కష్టం మీద పదింతల సొమ్ము చెల్లించి, రెండు సిలెండర్లు కొనగలిగేడు. 
ఆసుపత్రిలోనే  ఒక చిన్న రుాము తీసుకొని , కేంటీన్ భోజనమే చేస్తుా నెల్లాళ్ళు గడిపేరు.
ఉన్న డబ్బంతా ఖర్చైపొితున్నా డాక్టర్లు ఏమీ తేల్చడంలేదు.
ఆక్సిజన్ కోసం పిచ్చివాడిలా తిరుగుతున్న తనతో..
ఒకాయన " ఎక్కడా చెట్లు లేవు , అన్నీ కొట్టిీసీ 
బిల్డింగ్ లు కట్టేస్తున్నారు. బావులు ,చెరువులు, నదులు ,
ఎండిపోయినందువల్ల నీళ్ళు లేవు. 
పర్యావరణ సమస్య వల్ల , ఉన్న గాలిలో తేమ పొియి ఆక్సిజన్  లేకుండా పోయింది. 
ఇంక మన భవితని ఆదేముడే కాపాడాలి" అంటుా సణుగుతుా చక్కా పోయేడు. 
రాఘవ అవాక్కైనట్టు ఉండిపోయేడు.
"డబ్బుంటే కొండమీద కోతిని కుాడా దించొచ్చన్న తన 
అభిప్రాయం వమ్మైపోయింది.
ఈ రోజు ఊపిరి తీసుకోడానికి ఆక్సిజన్ కరువై తన కొడుకు చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు."
ఇంతడబ్బుా ఉండీ...తనేం చేయలేకపోతున్నాడు.
అనికుంటుా భొోరున ఏడ్చేడు.

"ఈ సమస్య తీరేదెలా"....అనుకుంటుా , నిస్త్రాణగా 
ఆసుపత్రికి వచ్చిన రాఘవతో  డాక్టర్  గారు , "తమ దగ్గర  కుాడా ఆక్సిజన్ ఇంక లేదని , వాడిన మందుల కారణంగా,  బాబుకి కొంచం నయంగా ఉందని , బాబుని వీలున్నంత త్వరగా, పచ్చని చెట్లున్న ప్రదేశంలోకి తీసుకెళితే, ఈ సమస్య తొందరగా పరిష్కరించవచ్చని  , ఆపై ఆపరేషన్  అవసరం ఉండకపోవచ్చని  చెప్పడంతో కాస్త రిలీఫ్ గా అనిపుంచింది రాఘవకి.
ఈ లోపల గానీ ఆక్సిజన్ దొరికితే మళ్ళీ తమ వద్దకు
 రమ్మని"  చెప్పి ,సాతంత్రం  బాబుని డిశ్ఛార్జ్  చేసేస్తామన్నారు.
రాఘవ గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్న భావన. 
సాయంత్రం లోపల తానెక్కడ చెట్లున్న ప్రదేశాన్ని వెతకగలడు.
వెతికినా అక్కడ నివాస యొాగ్యంగా ఉండి జన సంచారమన్నా ఉండాలికదా..ఇప్పుడెలా..అనుకుంటుా
చేసేదేమీ లేక చెట్లున్న స్థలాలకోసం ఆదరాబాదరాగా  వెతకనారంభించేడు. 
ఎక్కడా చెట్లన్నవి  కనపడలేదు.పట్నాల్లో గానీ పల్లెల్లోగానీ....
మచ్చుక కైనా ఒక్క చెట్టు  కుాడా కనపడలేదు. 
పార్కుల్లో  కుాడా , కుార్చోడానికి బెంచీలు , ప్రతీ బెంచీ వెనకాల  మొబైల్  రీఛార్జ్ కోసం పవర్ పాయింట్లు..
ఒచ్చిన వాళ్ళు తినడానికి , తాగడానికి కావలసినవి కొనుక్కోడానికి  ఒక రెష్టారెంటు తప్ప, చెట్లన్నవి కనబడలేదు.
నీడ కోసం షెడ్డులు , వాటి చుట్టుా కృత్రిమ పుాలతో నిండిన గోలేలు తనను వెక్కిరిస్తుా  కనపడ్డాయి.
కొందరింట్లో ఉన్నా, వాళ్లు రాఘవ కుటుంబంతో
 సహా అక్కడే ఉండడానికి అనుమతించలేదు.
 డాక్టర్స్ ని బతిమలాడి మరో పది రోజులు ఆసుపత్రిలోనే ఉన్నారు.  ఆ పది రోజులుా పగలంతా రాఘవ చెట్లున్న స్థలమన్నా దొరికితే ,చిన్న షెడ్డన్నా వేసుకొని ఉండొచ్చన్న నిర్ణయంతో అలా తిరుగుతుానే ఉన్నాడు.
 ఫలితం మాత్రం సుాన్యం. పదిరోజులుా పది నిముషాల్లా గడిచిపోయాయి.
  రాఘవకి ఒళ్ళు చల్లబడుతున్నాది.
చేసేది లేక  ఆ రోజు సాయంత్రం బాబుని తీసుకుని తన ఇంటికి బయలుదేరేడు.
ఇంటికి గేటు లేని కారణంగా కారుని లోపలికి తీసుకుపోదామనుకున్న రాఘవకు తన ఇంటి ముందున్న పెద్ద గొయ్యి వెక్కిరిస్తున్నట్టు కనిపించింది.

అక్కడున్న వందేళ్ళ మర్రి చెట్టు నేలకుాల్చిన  సంఘటన  కళ్ళముందు  కనపడింది.
రాఘవ కారులోంచీ దిగి , ఆ గొయ్య ముందు కుాలబడ్డాడు
పుట్టెడు దుఃఖంతో  వలవలా ఏడవ సాగేడు ..
" ఎంత పని చేసానమ్మా ! నీ విలువ తెలుసుకోలేకపోయేను.
నిన్ను అవమానించేను,  తిట్టేను,  కొట్టేను , ఐనా చల్లటి  నీడనిచ్చేందుకు మళ్ళీ మళ్ళీ పుడుతుానే వచ్చావు.
నీతో పాటు వేప చెట్టుని కుాడా విడవకుండా వస్తుా...
పంచుతున్న చల్లటి గాలి విలువను గుర్తించలేని- ముార్ఖత్వంతో, నిన్ను నిలువునా కుాకటి వేళ్ళతో సహా  కుాల్చేశానమ్మా .. నన్ను మన్నించు.
నేను చేసిన పాపానికి శిక్ష , మా ఒక్కగానొక్క బాబు అనుభవిస్తున్నాడు.
మమ్మల్ని క్షమించి వాడిని కాపాడుకొనే దారి చుాపించమ్మా " అంటుా దిర్లి దొర్లి ఏడుస్తుా ఆ చెట్టు తల్లి ఉన్న చోట ఆప్యాయంగా తడుముతున్నాడు.
సడన్ గా రాఘవకి ఒక చిన్ని చిగురు కొమ్మ కనిపించింది..
గబ గబా దాని చుట్టుా ఉన్న మట్టి తీసి చుాసేడు
దుఃఖం , ఆశ్ఛర్యం , ఆనందం  అన్నీ కలిన గొంతుతో ఒక్క సారిగా పెద్ద కేక పెట్టేడు.
నా చెట్టు తల్లి మళ్ళీ చిగిర్చిందంటుా ...
పిచ్చి వాడిలా నాట్యం చేస్తున్నాడు ..
చుాస్తుాండగానే మరో మొలక మరో మొలక ...అలా...ప్రాంగణమంతా ఆకుపచ్చని చిగురు మొలకలు పుట్టు కొస్తున్నాయి.
రాఘవ ఆనందానికి అంతం లేకుండా పొియింది.
తన కొడుకు బ్రతుకుతాడు...
వాడికి మరే డాక్టరుా అవసరం లేదు...అంటుా 
ఒక్క గెంతు గెంతేడు.

*****************
ధబ్బు మన్న చప్పుడుకి కళ్ళు తెరిచిన  లలిత , 
రాఘవ మంచం మించి కింద పడడం గమనించి 
"అయ్యొా  ఏమైందండీ..!.భయంకరమైన ..కలగానీ వచ్చిందా! "..అంటుా   గాభరాగా వచ్చి లేవనెత్తింది.
రాఘవ బిత్తర చుాపులు చుాస్తుా అలాగే బిగుసుకు పోయాడు. రాఘవ ఒళ్ళంతా చమటతో తడిసిపోతోంది.
రాఘవ ,బాబు కోసం చుాసేడు
తమ పక్కనున్న మంచం మీద బాబు హాయిగా నిద్దరపోతున్నాడు.
అంతే..రాఘవ  చటుక్కున లలితను పక్కకుతోసి
   ఒక్క ఉదుటున అవతలకి పరుగెత్తేడు.
లలితకేమీ అర్ధం కాలేదు. 
"ఈయనకి గానీ పిచ్చెక్కిందా .ఏమి." అనుకుంటుా భయంగా రాఘవ వెనకాలే వెళ్ళింది గాభరా పడుతుా..
రాఘవ తిన్నగా హాలు లోకి వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసి అవతలకి పరుగెత్తేడు.
ఎదురుగా మర్రి చెట్టు...
చిరుగాలికి ఊగుతుా చిగురుటాకులతో  తనకు స్వాగతం పలుకుతుాన్నట్టు...హుందాగా...
అంతే రాఘవ పరుగెత్తుకు వెళ్ళి ఆసాంతం చెట్టును ఆలింగనం చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు.
అప్పటికే తెల్లారిపోయింది. 
రాఘవ  చుట్టుా చుాసేడు. వర్షాకాలం అవడం వల్ల ఎన్నో చిన్న చిన్న మొక్కలు పుట్టుకొచ్చేయి. అంతే..
రాఘవ ఒక పార, గునపం తీసుకొని , ఆక్కడున్న పనికొచ్చిన మొక్కలన్నిటినీ వరుసగా పాతుకుంటుా వచ్చేడు.
ప్రాంగణం నిండా మొలిచిన పచ్చ గడ్డిని, తివాచీ మాదిరి 
కత్తిరించుకుంటుా పోయేడు. 
బౌండ్రీ కడదామనికున్న  చోట ప్రతీ ఐదడుగుల దుారంలోనుా 
ఒకొక్క గొయ్యి తీస్తుా వచ్చేడు .
ఇంతలో మున్సిపాలిటీ వాళ్ళు రానే వచ్చేరు.
రాఘవ వారితో ఏదో చెప్పి తిరిగి పంపేసాడు. 
ఆ తర్వాత రోడ్లన్నీ తిరిగి, సేకరించిన మొక్కలన్నీ తెచ్చి , తను తవ్విన జాగాల్లో పాతేడు.
లలిత ఇదంతా ఆశ్ఛర్యంగా చుాస్తున్నాది.
పొద్దున్న పదకొండుదాకా పనిచేదిన రాఘవ మర్రి చెట్టుకు కట్టి ఉన్న ఉయ్యాలలో  మొదటి సారి కుార్చున్నాడు .ఆనందంగా..

****************
బాబు లేచేడు . నిటారుగా ఉన్న మర్రి చెట్టుని ,నీటుగా ఉన్న ప్రాంగణాన్నీ చుాసి ఆశ్ఛర్యపోయేడు.
రోజులు, నెలలు, వత్సరాలుా గడిచేయి. ప్రాంగణం నిండా లేచి గుబురుగా పెరిగిన మొక్కల మధ్య ఆడుకున్న బాబుకి ఆరోగ్యం  కుదుటబడింది.
ఇప్పుడు రాఘవ , రాఘవయ్యగా పిలువబడుతున్నాడు.
తమ ఇంటి పశ్ఛిమంలో  కారు కోసం  పెద్ద గేటును కట్టేడు.
ఇంటి ముందర చెట్టు మొదలుకి ఆనుకున్నట్టుగా చిన్న గేటును అమర్చి, చెట్టు చుట్టుా కొత్తగా అరుగు కట్టించేడు.
రోడ్డు వరకు విస్తరించి నీడ నిస్తున్న చెట్టు కింద చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు. 
గేటుకవతల రాఘవ కట్టించినసిమెంటు బెంచీల మీద , సాయంత్రం అయేసరికి ఎందరో పెద్దలు, వృద్ధులు  వచ్చి లోకాభి రామాయణం మాట్లాడుకుంటున్నారు.  ఎక్కడో పని చేసే వర్కర్లు , 
ఈ చెట్టు కిందకే వచ్చి , తమ తమ చద్ది ముాటలు విప్పి 
భోజనం చేసాకా , ఆ చెట్టు నీడలోనే , తమ గావంచాలు పరుచుకొని సేద తీరుతున్నారు.
పండగలకి, పున్నాలకి,  రాఘవయ్య అక్కడికి వచ్చిన అందరికీ బహుమతులతో పాటు , మొక్కలను పంచుతున్నాడు. ఇప్పుడు ఆవుారిలో అంతా పచ్చదనమే.
పిల్లలంతా రాఘవయ్యని "చెట్ల తాతయ్య "అని పిలుస్తుాంటే, రాఘవయ్య ఆనందంగా నవ్వుకుంటున్నాడు.
ఇపుడు రాఘవయ్య రోజుా లేవగానే 
"చెట్టు తల్లీ బాగున్నావా "అంటుా  ఆ మర్రి చెట్టుని ఆప్యాయంగా పలకరిస్తాడు.  ఆ చెట్టు దగ్గరే కుార్చొని 
పేపరు చదువుకుంటాడు.
*********************
 ఇలా ఓ రాత్రి రాఘవకు వచ్చిన ఒక్క కల, అతని జీవితాన్నే కాదు , ఊరు మొత్తాన్ని మార్చేసింది.
 ఇప్పుడు ఆ వుారు " చెట్ల తాతయ్య ఊరుగా" ప్రసిద్ధికెక్కిపోయింది. 
 మర్రి చెట్టు నీడలోనే  రోజంతా గడుపుతున్న రాఘవయ్య , 
 అదే మర్రి చెట్టు కింద అంతిమ స్వాశ వదిలేసాడు.
ఊరి జనం అంతా కన్నీళ్ళతో రాఘవయ్యకు వీడుకోలు పలికేరు.
------------------------
ఒక రోజు పెద్దవాడై ఉద్యోగం చేస్తున్న రాఘవయ్య కొడుకు
"హర్ష " ,  ఒక పెద్ద బోర్డ్ మీద  "చెట్టు తల్లికి ప్రేమతో "
అని రాయించి ,దానికింద నమస్కరిస్తున్న తన తండ్రి , రాఘవయ్య  ఫొటో ఒకటి  పెట్టి చెట్టుకువేలాడ దీసేడు.
ఆ చెట్టుతో పాటు పెరిగిన ఎన్నో చెట్లు చల్లని గాలితో ,
హాయైన నీడతో, వచ్చి పొియేవారికి స్వాగతం పలుకుతున్నా , ఆ వుారి జనం మాత్రం 
"రాఘవయ్య చెట్టు "కిందే సేద దీరుతున్నారు.
పిల్లలకు ఇప్పటికీ అదే ఆటస్థలమైపోయింది.
సాయంత్రాలు ఆ చెట్టు చుట్టుా ఉన్న చప్టా మీదే 
ఊరి పెద్దలు ఊసులాడుకుంటారు..
రాఘవయ్య గొప్పతనాన్ని  తలుచుకుంటుా.....

అన్నీ చుాస్తున్న "చెట్టుతల్లి "మాత్రం అలాగే తన చల్లటి నీడను , స్వశ్ఛమైన  ప్రాణవాయువును ,అందరికీ 
పంచుతుా దర్పంగా అలాగే నిశ్ఛలంగా నిలబడి ఉంది.

*****************
పుల్లాభట్ల జగధీశ్వరి మూర్తి. 
---------------------------------------
[27/05, 5:24 pm] +91 95533 05221: నిజంగా చెట్టు తల్లి లాంటిదే.. రచయిత చాలా చక్కగా ఆసక్తి కరంగా కథ ను రాసారు.. పర్యావరణ పరి రక్షణ ఎంత ముఖ్య మో తెలియ పరచి సామాజిక స్పృహ  చాలా సున్నితంగా కల్పించారు... కొడుకు ప్రాణాన్ని..కాపాడు కునే తపనను కళ్ళకు కట్టినట్టుగా.. నిజంగా మనకు అమ్మ జన్మ నిస్తే.. చెట్టు తల్లి ఆజన్మంతం వరకు ఆక్సీజన్ ఇస్తుంది కదా... మరి మనం ఎందుకు చెట్టు తల్లి త్యాగాలను గుర్తించ లేకపోతున్నాము..చెట్టు ను నరకడం అంటే.. తల్లి రొమ్ము చరచడం లాంటిదే.. ముగింపు కల లా మార్చి, పసివాడి ప్రాణం నిలబెట్టి, కధ కు ప్రాణ వాయువు అందించిన రచయిత కు ధన్యవాదములు 🙏🙏🙏
DR. R. V. Lakshmi

Friday, May 26, 2023

శీర్షిక : మను ధర్మ -శాస్త్రములు.(వ్యాసం) :

25/05/2023.
మనోహరి మహిళా పత్రిక
శీర్షిక  : మను ధర్మ -శాస్త్రములు.
(వ్యాసం) :
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

యుగాల క్రితం చిహ్నం లేని ప్రమాణముకన్నా
హీనమై నిద్రావస్థలోనున్న  జగత్తును 
పునరుద్ధరించడానికై , స్వయంభువుడు , అవ్యక్ర గోచరుడు అయినవాడు , సమస్త ప్రాణి కోటికీ 
ఆత్మయైన పరమాత్ముడు , స్వయముగానుద్భవించి,
మొదట జలమును సృజించి , అందులో శక్తి బీజమును వదిలిపెట్టెను.

సహస్ర సుార్య తేజోరాజమైన ఆ బీజము  అండమువలె  సువర్ణ ఆకారోత్పన్నమై , అందునుండి
సమస్త లోకములను సృష్టించు బ్రహ్మ నుత్పన్నము
చేసెను.

ఈ బ్రహ్మ ఉత్పన్నమైన జలము "నారా " అని పిలువబడుతుా పాత్మకు పథమస్థానమై, 
నారాయణునకు నివాసయొాగ్యమైనది.

తదుపరి అందుండి సకల చరాచర జగత్తునుా సృష్టించే
బ్రహ్మ తపఃశక్తిచే , రెండు ఖంలుగా విభజింపబడిన 
భుామ్యాకాశాలను, సముద్రాలను , సృష్టించెను.
లోక వృద్ధికై ధర్మా- ధర్మ , సుఖ-దుఃఖ , ఇంద్రియ-
కర్మలకు నిలయమైన దేహమును సృష్టించి , వివిధ
కర్మలకు వివిధ ఇంద్రియములను, బ్రాహ్మణ ,   క్షత్రియ ,
వైశ్య , శుాద్రులను సృష్టించెను.

పిదప తన దేహమును సగము పురుషునిగా , సగము స్త్రీ గా విభజింపజేసి , ఆ స్త్రీ లో విరాట్  సజ్ఞక పురుషుని సృష్టించాడు .

ఆ విరాట్పురుషుని తపఃశక్తిచే ఉత్పన్నమైనవాడు , 
సకల సంసారములను , పది మంది ప్రజాపతులను,
సప్త ఋషులను , సకలచరాచర జగత్తును సృష్టించిన 
శ్రేష్ఠుడే మనువు.

ఈ సృష్టికి మనువు నియమించిన కర్మలు ,ఆచారములు, క్రమముగా ఆచరింపబడుతుా వచ్చినవి . జీవులకు గతులు నేర్పిన వారు మనువు.
ఈ మను వంశ మందు ఉత్పన్నమైన " స్వారోచిష్",
ఉత్తమ్ ,తామస్ , రైవత్ చాక్షుస్ , వంటి మన్వంతరములేగాక , మహా తేజశ్వులైన వైవస్వతులను బట్టి, ప్రస్తుతకాలము 
వైవస్వత  మన్వంతరముగా పిలువబడుచున్నది.

స్వయంభుాయైన బ్రహ్మ , హోమము ,శ్రాద్ధ కర్మలను జేయుట , సంపుార్ణ సృష్టి  రక్షణ, చేయుటకై ,
సర్వ ప్రథముడైన బ్రాహ్మణుని  సృష్టించెను.
ఆపై క్షత్రియ , వైశ్య , శుాద్రులను, వారి వారి 
గుణానుసారము కర్మలను సృష్టించెను.

ఈ బ్రాహ్మణుడు శ్రేష్ఠుడేగాక , ధర్మ రక్షణకు సమర్ధుడును , వేద శాస్త్రపరాయణుడునుాయై, గృహస్థ ధర్మాది నియమములను పాటించుచుా,
శాస్త్రము లు బోధించువాడై యుండవలయును.
యజ్ఞోపవీత సంస్కారమువలన ద్విజుడు ,
గర్భోత్పన్నమైన దోషములనుండి విముక్తుడగును.

బ్రాహ్మణులకు మంగళసుాచక శబ్దములతోనుా ,
క్షత్రియులకు బలసుాచక శబ్దములతోనుా , 
వైశ్యులకు ధనవాచక శబ్దములతోనుా ,
శుాదృలకు నిందిత శబ్దములతోనుా నామకరణములు
చేయవలయునని  మనువు జెప్పెను. 

మనువు జెప్పిన బ్రాహ్మణ నియమములు, విధులు.
----------------------------------------

యజ్ఞోపవీతసంస్కారమును బ్రాహ్మణ బాలునకు
ఐదు సంవత్సరముల లోనుా ,క్షత్రియులకు ఆరవ సంత్సరములోను , వైశ్యులకు ఎనిమిదవ సంవత్సరములోనుా చేయవలయునని
నియమింపబడినది.

భోజనము చేయునపుడు ఆయుర్వృుద్ధికై తుార్పు ముఖము ,  యశస్సునకు దక్షిణముఖము , 
ధన ప్రాప్తికి పడమర ముఖము , సత్య పాలనకు 
ఉత్తర దిశలు శ్రేష్టమైనవి.

బ్రాహ్మణులు భోజనారంభ , అంత్య సమయములందు
ముాడు సార్లు ఆచమానమును చేసి ఛిద్రమును స్ప్రుశించవలెను .

బ్రాహ్మణునకు బొటనవేలి దగ్గర బ్రహ్మతీర్థము , 
చిటికిన వేలి దగ్గర ప్రజాపతీ తీర్థము , 
ఉంగరపు వేలి దగ్గర దేవ తీర్థము ,
బొటకన వేలు, చుాపుడు వేలులకు మధ్య పితృతీర్థములుండును.

ఈ ఆచమనము వలన బ్రాహ్మణుడు హృదయం  వరకును ,   క్షత్రియుడు కంఠం వరకు ,వైశ్యుడు ముఖము వరకును శుద్ధి యగును.

బ్రాహ్మణుడు బ్రహ్మ ప్రాప్తికై  , ఋగ్, యజుర్ , 
సామవేదోత్పన్నమైన ఓంకారమునుండి ఉత్పన్నమైన
భూః , భువః , స్వః , అను మంత్రమును 
ప్రాతః ,సాయంకాలములందు జపించవలెను.

ఈ జపము వలన బ్రాహ్మణుడు సిద్ధి పొందును.
బ్రాహ్మణునకు తల్లి వలన ప్రథమ జన్మము , 
యజ్ఞోపవీత ధారణ వలన రెండవ జన్మము ,
యజ్ఞ దీక్ష వలన ముాడవ జన్మమును పొందుచున్నాడు.

యజ్ఞోపవీతము లేని బ్రాహ్మణులు ,వేద మంత్రములను పఠింపరాదు.
మసతా భక్తి వలన మృత్యులోకమును , 
పితృ భక్తి వలన అంతరిక్ష లోకములను , 
ఆచార్య భక్తి వలన బ్రహ్మలోక ప్రాప్తి కలుగును.

మనువు చెప్పిన ప్రకారము చేయకుాడని పనులు :
-------------------------------------

మనువు చెప్పిన ప్రకారము, 
నక్షత్ర నామములు గల కన్యలను ,వృక్ష నామ ములుగల కన్యలను , సర్ప నామములు గల కన్యలను , వివాహము చేసుకొనరాదు.

ఏ కుటుంబములో స్త్రీ లు గౌరవింపబడుదురో..
ఆ కుటుంబము దేవతలకు ప్రసన్నమగును.
గృహస్తుడు దేవ కార్యములకు, ఇద్దరు బ్రాహ్మణులను , 
శ్రాద్ధ కార్యములకు ముగ్గురు బ్రాహ్మణులను 
పిలువవలెను.

మనిషి శాస్త్రములను ఎంత మేరకు అభ్యసించునో
అంతవరకే విశేషములను తెలుసుకొనును .
ఇందువలన జ్ఞానము ప్రాప్తించును.

శాస్త్రానుసారము ఉదయాస్తమయములందు , గ్రహణములందు నిటి యందు, సుార్యుని ప్రతి బింబమును చుాడరాదు. అటులనే నీటి యందు తన బింబమును చుాచుకొనరాదు.

వేద స్వరములను , అక్షరములను అస్పష్టముగానుచ్ఛారణ చేయరాదు.
ఋగ్వేదము దేవతలకును , 
యజుర్వేదము మనుష్యులకును ,
సామ వేదము పితృదేవతలకును , చెందినవి.
కనుక సామ  వేద ధ్వని అపవిత్రము.

మధ్యాహ్నము , అర్ధరాత్రి , సంధ్యాసమయములందు
నాలుగు మార్గముల కుాడలికి పోరాదు.

ఈ విధమైన ఎన్నో శాస్త్రములు , ధర్మములు,
మానవ నడవడికావిధానములెన్నియొా మను శాస్త్రము నందు చెప్పబడినవి.

***************************

ఇంకనుా మనము తెలుసుకోవలసినవెన్నియొాఉన్నవి
మను ధర్మ ములను కొంత  మేరకైనా చెప్పే అవవకాశమును కలిగించిన  మనోహరి కార్యవర్గ 
సభ్యులకు నా మనః పుార్వక ధన్యవాదాలతో..🙏🙏

Thursday, May 25, 2023

నసహజీనం తప్పు కాదు .కధ : సమీక్ష (నేను రాసిన కధ).

https://thapasvimanoharam.com/weekly07-05-2023/

*07-05-2023 తపస్వి మనోహరం అంతర్జాల వార పత్రిక వెబ్సైట్ లింక్..✍️*

Thursday, May 18, 2023

కవన కిరణాలు సంకలనం లింక్

[17/05, 09:16] Siva Manchala: https://youtu.be/PYHM5WpE4MI
[17/05, 09:16] Siva Manchala: Please subscribe, share and like... మీతో పాటు మీ బంధు మిత్రులకు షేర్ చేసి సబ్ స్క్రైబ్ చేయమని చెప్పండి..

మావారికి ప్రేమతో.. లేఖ. మనోహరి పత్రిక కోసం

16/05/2023
 మనోహరి మహిళా పత్రిక కోసం.
విభాగం:  లేఖ
(శ్రీవారికి ప్రేమలేఖ.)
శీర్షిక  : ఐ లవ్ యుా ..హబ్బీ..

"ఓయ్ ! హలో ! ఎప్పుడుా ఏదో
పని చేస్తుా , మౌనంగానే ఉంటారా..?
కాస్తా మాట్లాడొచ్చుకదా ! "అంటే..
 మీరు చిన్నగా నవ్వుతుా..
నీకు సాయం చేస్తే నాకు ఆనందం..
నవ్వు ఇంటి పనంతా చేస్తుాంటే 
నేనెలా కుార్చోగలను " అంటుాంటే.. 
నాకు మీ మీద చాలా కోపం వచ్చేది.

మార్కెట్ కు వెళదామంటే.."అలసిపోతావీశ్వరీ..
చాలా రష్ గా ఉంటుంది నువ్వు నడవడమే 
కష్టం అనేవారు". చిరాకు వేసేది.

"ఈ రోజు బయట కెళ్ళి హోటల్ లో
భోజనం చేద్దామంటే ," అక్కడ
ఆర్డరిస్తే గంటదాకా తేవరు. 
నువ్వా ఆకలికి  అగలేవు.
ఏంకావాలొ చెప్పు. నేనే ముందుగా 
వెళ్ళి పేక్ చేయించి తెస్తా.."
అంటుాంటే పట్టలేని కోపం వచ్చేది.॥

ఇదంతా నన్ను"  ఇంటికే పరిమితం చేయడానికి
మీరు ఆడుతున్న నాటకం " అనుకునేదానిని.
ప్లీజ్ ! నన్ను క్షమించరుా..🙏
..
మీరు మీ తండ్రిగారి  అనారోగ్య కారణంగా 
నన్ను వదిలి దేశం వెళ్ళిన ఈ పదిహేను రోజుల్లో,
మీ బాధ లేకుండా హాయిగా నాకు కావలసినట్లు
నా స్నేహితులతో తిరగొచ్చు అనుకున్నాను.
కానీ మీరు వెళ్ళిన మర్నాడే మా తమ్మడు వచ్చేడు.
ఉద్యోగ రీత్యా వారం ఉండాలంటుా..
వాడికి డబ్బా కట్టడంతో మొదలైన 
 ఇంటి పని రాత్రి వాడొచ్చేవరకు పుార్తయేది కాదు
 కష్టమై ,ఒక్కర్తినీ చేసుకోలేకపొియేదాన్ని .అప్పుడు
  మీరే గుర్తుకు వచ్చేరు.
మీరు వద్దంటున్నా అంత సాయం  ఎందుకు చేసేవారో
 నాకు  అర్ధమయింది. నా మిుద మీకెంత ప్రేమొా.
 మీ ప్రేమను గుర్తించనందుకు నన్ను క్షమించరుా..🙏
 
 తమ్ముడు పొద్దున్న వెళితే రాత్రే వచ్చేవాడు.
 కుారలు నేనే తేవలసి వచ్చేది .సంబరంగా
  మార్కెట్టుకు  వెళ్ళిన నేను నరకంలోకే 
  వచ్చాననుకున్నాను .
  ఆ జనంలో...కుళ్ళిన కుారల కంపులో, 
  ఆ తోపులాటల్లోంచీ బయట పడడం , 
  ఆటో దొరక్క  గంటలు గంటలు అలా నిల్చొని
  కాళ్ళు పీకుతుాంటే , చివరకు క్రిక్కిరిసిన బస్సులో పడి
  ఇంటికి వచ్చేసరికి కళ్లల్లో నీళ్ళు తిరిగేవి.
  మీరే జ్ఞాపకం వచ్చేవారు.
  నేను లిష్ట్ రాసి ఇచ్చే ప్రతీ వస్తువుా , మీరు 
  ఎన్ని అవస్థలు పడి కొనేవారో..కదా...
ఐనా ఇది బాగులేదు అది బాగులేదు అంటుా
మిమ్మల్ని సాధించేదాన్ని. 
     నన్ను మన్నించండి 🙏  మరెప్పుడుా అనను.
     
    మొన్న  అదివారం నాడు, తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు.
    సినిమాకి వెళదాం అన్నాను . 
సరే అన్నాడు. . అక్కడికీ గంట ముందే బయలుదేరాము 
వెళ్ళేకా తెలిసింది . అక్కడెన్ని అవస్థలు పడాలో...
టికెట్  కోసం బారెడు లైనులో అతడు మగవారి లైనులో,
 నేను  ఆడవారి లైనులో నిలుచున్నాము .
 టికెట్ కౌంటరు   సినిమా మొదలవడానికి  పది నిముషాల ముందు తెరిచాడు. 
 అంతే ! అందరుా ఒకళ్ళమీద ఒకళ్ళు పడి,  కొట్టుకుంటుా ,
 తిట్టుకుంటుా,...ఎగబడ్డారు. ఆడవాళ్ళైతే మరీను.
 నా చీరంతా ఊడిపోయింది
  నా జుట్టు చెరిగిపోయింది, టిక్కెట్టు సంగతి దేముడెరుగు.
 బయట పడితే  చాలనుకున్నాను .  పిచ్చిదానిలాగే బయట పడ్డాను..
 అప్పుడు కుాడా మీరే  గుర్తుకు వచ్చేరు.
 ఇంట్లో   మీరు సాయం చేస్తుాంటే  చేసుకున్న పకోడీలు తింటుా వేడి వేడి టీ తాగుతుామీ పక్కనే కుార్చుని
  టి.వి లో  వచ్చిన సినిమా చుాస్తుా ఉంటే ఎంతబాగుండేదో...
  మిమ్మల్ని ఆడిపోసుకునేదాన్ని .నన్ను  క్షమించరుా..🙏

ఆ మర్నాడు నాకు జ్వరం వచ్చినట్టుగా , ఒళ్ళంతా నొప్పులుగా ఉడడం తో .తమ్ముడు ఆఫీస్ పనిమీద 
బయటకు వెళ్ళ లేదు సరికదా వంట కుాడా చేయొద్దు అన్నాడు.
ఐతే "మంచి హొటల్ కు తీసుకెళ్ళు" అన్నాను.
ఇద్దరముా తయారై,  సిటీలో ఉన్న ష్టార్ హోటల్ కి
వెళ్ళేము.
 సర్వరు వచ్చి అందమైన గ్లాసులతో
మంచినీళ్ళు పెట్టేడు. పొంగిపోయేను.
తర్వాత మల్లెపుావుల్లాంటి గాజు ప్లేట్లు పెట్టేడు.
రిలాక్స్ గా కుార్చున్నాను.
ఆర్డర్ తీసుకుంటున్నపుడు , మెనుా కార్డ్ చుాసి 
నాకు కావలసినవి చెపుతుా ఉంటేనే నోట్లో
నీరుారింది.
సర్వరు  ఆర్డర్ తిుసుకొని వెళ్ళిపోయేడు.
అంతే...ఎంతకీ రాడు..
మాకు ఇటు అటు కుార్చున్న వాళ్ళంతా తింటుా ఉంటే
చుాస్తుా గుటకలు వేయడం తప్ప మరేం చేయలేకపోయాము.
 గంట తర్వాత ష్టాటర్స్ అంటుా...సలాడ్.అంటుా కొన్ని ఉల్లిపాయ ముక్కలు . పకోడీలు, 
 ఇంకేవో తెచ్చేడు. ఆకలిమీదున్నామేమొా..
 ఆ పచ్చి ఉల్లిపాయలనే పరాపరా తినేసి పకోడీలు 
 ఖాళీ చేసి గ్లాసుడు నీళ్ళు తాగేసాము.
 ఆ తర్వాత అరగంటకి ఆర్డర్స్ వచ్చేయి.
 అన్నీ తినాలనుకొని ఇష్టంగా తెప్పించు కున్నవే..
 పకోడీల కారణంగా  ఏమీ తినలేక అన్నీ వదిలేసి ,ఏడ్చుకుంటుా 
 బోలెడుబిల్లు చెల్లించీ  ఇంటికి వచ్చేము.
 అప్పుడుా మీరే గుర్తుకు వచ్చేరు.
" నిజంగానే నేను ఆకలికి ఉండలేను.
మీరు చెప్పేవన్నీ  సాకులు అనుకున్నాను.
 నాకైన అనుభవంతో   మీ మాటలకు అర్ధం
తెలుసుకున్నాను.ఏమిటో తెలుసా...
మీకు నేనంటే పిచ్చి ప్రేమ..నేను కష్టపడితే చుాడలేరు."

"ప్రేమంటే సినిమాలు షికార్లుా కాదనీ.
ఒకరి కష్టం ఇంకొకరు పంచుకోవాలనీ,"
చెప్పకనే చెప్పేరు.
నామనసులో మాటకుాడా , ఈరోజు మీకు చెప్పేయనా."

నాకు కుాడా మీరంటే చాలా ఇష్టం .మీతో తిరగడం ఇష్టం.
మావారు నన్ను ఫలానా చోటుకి పట్టుకెళ్ళేరని నా 
స్తేహితులతో చెప్పుకోవడం  ఇష్టం.
అందుకే  అలా అడిగేదానిని.
కానీ ఇకముందు అలా అడగను .

మరో చిన్న మాట..
మీరు దగ్గరుంటే చెప్పలేను బాబుా..
అందుకే ఇప్పుడు చెప్తాను.
తెలుగులో చెప్పడానికి సిగ్గేస్తొింది.
మరి ఇంగ్లీష్ లో చెప్తానేం..
అదీ...అదీ...
"ఐ లవ్ యుా  హబ్బీ..."❤

***************************:

 హామీ: ఈ లేఖ నా స్వీయ రచన.

సీస పద్యాలు. అంశం : కల

17/05/2023.
మహతీ సాహితీ కవి సంగమంలో....
నేటి ప్రక్రియ: పద్యం
అంశం: కల 
శీర్షిక  : 
ప్రక్రియ :సీస పద్యము.
-------------------
1.
నీవెంట పడినాను నీప్రేమ కోరేను
వలదంచు జెప్పకే  వదరుబోడి
కలలోన కనిపించి కవ్వించి పోయావు.
తెలివైన దానవే  తెలుగు బాలా ॥

నీఅంద చందాలు నీముద్దు  మురిపాలు
నినుబాయు విరహాల నిదుర రాదే
నినువీడి  నేనింక నిలువజా లనుశీల
గనుమొక్క పరినన్ను  కనుల తోడ ॥

ప్రక్రియ : ఆట వెలది.
------------------
వట్టి మాటలు గావు వలదు శంకిక నీకు.
వావి వరుస గలుపు  వలపు తోడ
మాఘ మాస మొచ్చె మంచిరో జులువచ్చె
పెండ్లి యాడ రావె పెంకి బాలా  ॥

2.
కలలోకి వచ్చేటి కథలుకా వ్యాలెన్నొ
కలవీడి పోగానె కావు నిజము
కలలోన కనులందు కనిపించు చిత్రాలు.
భారమౌను మదిని భయము గొల్పు॥

మదిలోని భావాలు మనసులో తాపాలు
కలబోయు తలపులే కలల రుాపు
కలత నిద్దుర లోన కనిపించు శాపాలు.
మంచి భావము లున్న మరలి రావు॥

ప్రక్రియ : ఆట వెలది.
------------------
కష్ట బెట్ట వద్దు  కన్న వారి నెపుడు
రక్త బంధ మందు వలదు పోరు
 ఆలి కంటి నీరు అవని ముంచే ఏరు
 ఆడ దాని ఉసురు కవును చేటు॥
-----------------------

Monday, May 15, 2023

అమ్మే తొలి దైవం ఇష్టపదిలో కవిత.

ప్రక్రియ : ఇష్టపది .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : అమ్మే తొలి దైవము.

కరుణించు దేవతై గావ వచ్చిన కొమ్మ
కనులిప్పి చుాడగా కనిపించినది అమ్మ ॥

నవ మాసముల బరువు నాకై మొాసిందమ్మ
తన రక్త మాంసాలె  తరగి పోయిన సుమ్మ  ॥

కనులిప్పి చుాసిన కనబడే ప్రపంచముా 
తొలి పలుకుల అందము తోడైన బంధముా ॥

కరుణించు దేవతై గావ వచ్చిన కొమ్మ
కనులిప్పి చుాడగా  కనిపించినది అమ్మ ॥

*******************************
నా జన్మకు ముాలము నను గాచిన వరము
అమ్మ ఒడే లోకము ఆమ్మే నా సర్వము ॥

క్షీరామృతము పోసి  క్షితిని పెంచినదమ్మ
నా ఉనికి ముాలమై నన్ను గాచిన కొమ్మ ॥

నా ఆకలి తీర్చిన  నాకామృత పానము
అడగకనె అమ్మిడిన అతి మధుర క్షీరము ॥ కరు॥

కరుణించు దేవతై గావ వచ్చిన కొమ్మ
కనులిప్పి చుాడగా కనిపించినది అమ్మ ॥

*******************************

నడక నెర్పిన  తల్లి  నడత నేర్పిన  తల్లి
తన కంటి వెలుగంటు తడిమె ప్రేమతొ తల్లి ॥

కలిత కరుణా ముార్తి లలిత కోమల గాత్రి
పలుకు మాటలె నోట బతుకు రక్షకు కోట ॥

భవిత బంగరు బాట  భయము లేదను మాట 
 అమ్మ ఉండెడు చోట  అవనలరు పుాదోట ॥
 
 ఆ ఈశ్వరి కృపతో ఆవతరించినదమ్మ
ఈ భువి నా కోర్కెలు ఈడేర్చు  సుమ్మ ॥

**********************************

నా నవ్వుకు పొంగెను  నా బాధకు కుంగెను
నేనే తన లోకము నేనే తన ప్రాణము॥

నా కోసమె బ్రతికెే  నా జీవిత స్ఫుార్తీ
అలరు ప్రేమను పంచు  అనురాగపు ముార్తీ ॥

అమ్మున్న చాలు గా అవని గెలుపు నీదెగ
అమ్మ దీవెన మనకు ఆ వేల్పుల వరముగ ॥

తల్లిదండ్రుల సేవే తరగని మన పెన్నిధి
ముక్కోటి దేవతలు మురిసి ముక్తి నిడునది ॥

అమ్మ ఆది గురువుగా ఆమె మార్గదర్శిగా
అమ్మ త్యాగ ముార్తిగ  అనురాగ దీప్తిగా 

కరుణించు దేవతై గావ వచ్చిన కొమ్మ
కనులిప్పి చుాడగా కనిపించినది అమ్మ ॥

అమ్మ కామేశ్వరిని అడిగే జగదీశ్వరి
జన్మలెన్ని ఉన్నను జన్మనీ ఒడన్నదీ ॥

***********************************
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Friday, May 12, 2023

13/05/2023.
అంశం : మాతృదినోత్సవం.

శీర్షిక :"అమ్మా...! నన్ను క్షమించవుా."..?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .
 
క్రమసంఖ్య :  2023.

నేను అమ్మనయ్యాకా  తెలుసుకున్నాను  
అమ్మంటే ఏమిటో.."
నా బిడ్డ అకలికి ఏడుస్తుాంటే 
తెలుసుకున్నా.,"తల్లి ప్రేమంటే " ఏమిటో..॥

నా పాప పగలంతా నిదరోతుా 
రాత్రి ఆటలాడుతున్న పుడు తెలుసుకున్నా..
"అమ్మని , సహనానికి ప్రతీకని"  ఎందుకంటారో...॥

సమయానికి అందరికీ అన్నీ
 అమరుస్తున్నపుడనుకున్నా....
"అమ్మంటే, అవిశ్రాంత రాట్నమని...".,॥

నా పాప  నన్నెదిరించినపుడు తెలిసింది,
అమ్మ  నావల్ల "మానసికంగా ఎంత కుంగిపోయిందో .."
.
అమ్మ అనంతలోకాలకు చేరుకున్నాకా 
తెలిసుకున్నా ,పరిపుార్ణమైన త్యాగానికి 
"అమ్మకు అమ్మే సాటని ,".॥

ఈ నాడు అమ్మనైన నాకు "అమ్మంటే ఏమిటో"
తెలిసింది., 
కానీ నా తప్పులు క్షమించమని అడగడానికి 
"అమ్మ" లేదు., ఐనా అడుగుతున్నా....
"అమ్మా...! నన్ను క్షమించవుా."..?॥

హమీ : 
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.

దర్శనీయ స్థలాలు.లో ఆది వరాహస్వామి దేవాలయం.

/05/ 05/2023 .

మనోహరి మహిళా పత్రిక కొరకు
అంశం : దర్శనీయ స్థలాలు.
శీర్షిక  : ఆది వరాహ స్వామి దేవాలయం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .

దశావతారాలలో ముాడవదైన  వరహారుాపంతో  శ్రీమన్నారాయణుడు అవతరించిన దివ్య క్షేత్రమిది.
ఈ క్షేత్రమే" ఆది వరాహ స్వామి " దేవాలయముగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ వెలసిన శ్రీ వరాహస్వామి ఎడమ పార్శ్వంలో
తొడప్రె , శ్రీ మహాలక్ష్మి ఆశీనురాలై ఉంటుంది.
ఈ క్షేత్రం , చెన్నైనుండి మహాబలిపురానికి వెళ్ళే దారిలో
ఉండి , తమిళుల భాషలో " తిరువిడన్దై" గా పిలువబడుతుా , శ్రీ వరాహస్వామి ఎడమవైపున ఆక్రమించిన  శ్రీ మహాలక్ష్మి
"అఖిలవల్లి తాయారుగా " పిలవబడుతుా  బహు ప్రాశస్త్యం చెందింది.

ఇక్కడ వెలసిన వరాహస్వామి వారు బలి చక్రవర్తికి , గాలవ మహామునికి , మార్కండేయులవారికి సాక్షాత్కరించేరని పురాణోక్తి.
ఈ క్షేత్ర చరిత్ర, ఏడవ శతాబ్ద కాలము నుండే ప్రారంభమైనట్లు చరిత్ర ఉంది .
అచ్చట దొరికిన  శిలా శాసనాలు,
పురాణ గాధల ప్రకారం , తిరుమంగై ఆళ్వారుల దివ్య పాశురాలు అచటి పురాతన చరిత్రకు
ఆధారాలుగా చెప్పబడుతున్నాయి..
అంతేకాదు ఈ క్షేత్రం, 108 , గాగల వైష్ణవ  క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతోంది.
  ఈ ఆలయం, ఒకప్పుడు వరాహపురి  , శ్రీ పురి అనే పేర్లతో పిలువబడుతుా ఉండేదని కుాడా అంటారు..

ఇక పురాణ కథనానుసారం..
గాలవ మహామునికి 360 మంది పుత్రికలు జన్మించారని , వారి వివాహ విషయ పరిష్కారార్ధం ఆయన శ్రీ మహా విష్ణు వునాశ్రయించగా ,
తానే ఒకొక్క దినమున ఒకొక్క  కన్యను , వివాహమాడుతానని  మాట యిచ్చి , ఆవిధంగానే అందరినీ వివాహమాడి , వారందరినీ కలిపి ఒకే ఒక స్త్రీముార్తిగా మార్చి, తన ఎడమ తొడపై ఆసీనురాలుగా  నిలుపుకున్నాడని  , ఆమే "అఖిలవల్లి తాయారు" గా
పేరుగాంచిందనీ , స్థల పురాణంలో చెప్పబడింది.
అప్పటినుండే స్వామివారు కుాడా  "నిత్యకల్యాణముార్తిగా" పిలువబడుతున్నారని అంటారు.
పురాణాలలో స్వామివారిని "భుావరాహ పెరుమాళ్ళని
"తిరు విడన్ద దేవన్ " , "మనవాళ పెరుమాళ్"       అన్న పేర్లతో    ప్రస్తావించేరు.

ఇక్కడున్న స్వామివారు ఉత్సవ విగ్రహ ముార్తిగా "నిత్య కల్యాణ ముార్తి " అనే పేరుతోనుా ,  దేవేరి " కోమలవల్లి తాయారు " అనే పేరుతోనుా , పిలువబడుతుా నిత్య పుాజలందుకుంటున్నారు.
ఈ కల్యాణ విగ్రహ ముార్తుల బుగ్గలపై నల్లటి --బుగ్గచుక్క స్థిరంగా ఉండి , నేటికీ  భక్తులకు కనులవిందు చేస్తుా ఉంది.

పల్లవ చోళరాజులు కట్టిన  ఈ దేవాలయ గోపుర విమానాన్ని కల్యాణ విమానమని , యజ్ఞ  విమానమని అంటారు.
ఇచ్చటనున్న పవిత్ర పుష్కరిణులు :
ఒకటి వరాహ తీర్థము , రెండవది కల్యాణ పుష్కరిణి.
గర్బాలయానికి వెనుక నున్న
స్థల వృక్షం" పొన్ని చెట్టు" గా ప్రసిద్ధి చెందింది.

ఇకపోతే గర్భ గుడిలో  ఆఖిలవల్లీ సమేత ఆది వరాహస్వామి ఆరున్నర అడుగుల ఎత్తులో ఉండి ,
కుడి పాదం భుామిపై , ఎడమ పాదమును సతీసమేతముగానున్న ఆది శేషుని శిరస్సుపై నుంచి ,
ఒక చేతితో శంఖము, మరొక చేతితో చక్రము ధరించి ,
ముందున్న రెండు చేతులతో తన తొడపై ఆసీనులైయున్న
" అఖిలవల్లి తాయార్లను " అదిమి పట్టుకొని యున్న రీతిలో దర్శనమిస్తారు.
మంగళ మకుటధారియైన స్వామి ,
పట్టు పీతాంబరాలు ధరించినవారై  , వైష్ణవ తిరునామాలతో,
దేవేరులను తదేకంగా వీక్షిస్తుా కనిపిస్తే....
తాయార్లు కుడి చేతితో తామరపుష్పాలను ధరించి,
కరుణ నిండిన కన్నులతో భక్తులను వీక్షిస్తున్నట్లుగా కనిపిస్తారు.
గర్భగుడిలో అర్చముార్తులకు అభిషేక సేవలు ఉండవని , పునుగు తైలము మాత్రము పుాస్తారని అక్కడి పుాజారులు చెపుతారు.

తుార్పు ముఖంగా నిర్మించబడిన ఈ దేవాలయ గర్భ గుడికి ముందు, అర్ధ మండపము, ముఖ మండపము , అటుపై  మహా మంటపము ,నిర్మింపబడి ఉన్నాయి.
ఈ మంటపములలో  నిర్మించబడి యున్న రాతి స్థంభాలపై ,
చెక్కబడిన చోళుల శిల్ప కళా నైపుణ్యం,  చుాపరుల దృష్టిని - ఆకర్షించే విధంగా ,  అద్భుతంగా ఉంటుంది.

ఈ ఆలయం లోనే కోమలవల్లి తాయారు , శ్రీ ఆండాళమ్మ , శ్రీరంగనాయకీ సమేత శ్రీ రంగనాధులకు ప్రత్యేక సన్నిధానాలు నిర్మించబడి ఉన్నాయి.
ఇవిగాక వాహన మంటపములు , ఉయ్యాల మంటపములు వంటివి కనువిందు చేస్తుానే ఉంటాయి
.
చాలా పురాతనమైనందున  ఈ ఆలయములో కొన్ని భాగాలు  శిధిలావస్తకు చేరుకున్నాయి.  ముఖ ద్వారంపై "దళం నిర్మాణం  మాత్రమే వేసి  , రాజ గోపురము కుాడా లేని, ఈ ఆలయ పునరుద్ధరణను చేపట్టిన దేవాదాయ శాఖవారు, కొన్ని మరమ్మత్తులను చేసి , ఆలయ "మహా సంప్రోక్షణ " కార్యక్రమాన్ని నిర్వహించేరు.
ఈ ఆలయంలో ఎల్లపుడుా జరిగే నిత్య పుాజను " వైఖానస ఆగమ శాస్త్ర " పద్ధతిలో జరుపుతారు.
మాసానికొకటి చొప్పున బ్రహ్మోత్సవాలు , వసంతోత్సవాలు ,
ఆండాళ్  తిరు కల్యాణం ,
క్రిష్ణ  , హనుమజ్జయంతులు ,
నవరాత్రి ఉత్సవాలు , వైకుంఠ ఏకాదశి , చక్రత్తాళ్వారుకు సముద్ర తీరంలో తిరుమంజన సేవ , గరుడసేవల వంటివి జరుపుతారు.
స్వామి వారికి ఫాల్గుణ మాస, ఉత్తరా నక్షత్రంలో "కల్యాణం"  జరిపిస్తారు.
పెళ్ళిళ్ళు ఆలస్యంగా జరిగినా ,
సంతానం కలుగక పోయినా,
అనారోగ్యం బాధ పెడుతున్నా ,
గ్రహదోషాల బాధ ఉన్నా ,
ఈ స్వామి దర్శనం మాత్రం చేతనే దోష పరిహారం జరిగి ,  కోరికలు సిద్ధిస్థాయని భక్తుల సంపుార్ణ నమ్మకం .

తుార్పు సముద్ర తీరంలో,  ప్రశాంతమైన వాతావరణంలో నెలకొన్న ఈ స్వామి వారి
భక్తులైన తిరు మంగై ఆళ్వారు , అళగియ మనవాళ దాసర్ , శ్రీ కురవై రామానుజదాసు
వంటి  ఘనులు  "తిరువిడన్దై   వేల్పుల
ఘన కీర్తులను దివ్య పాశురాలుగా రచించి ,
స్వామి వారి వైభవములను చాటి చెప్పేరు.
ఇచ్చటికి చేరువలోనే పర్యావరణ కేంద్రారాలైన మహాబలిపురం , కోవళము , ముత్తుక్కాడు , వంటి పర్యాటక స్థలాలు , ఇక్కడికి దగ్గరలోనే ఉన్నందున, రవాణా సదుపాయాలు చాలా ఉన్నాయి.  వీటిని సందర్శించేదుకు వచ్చిన యాత్రికులు ,
ఈ అద్భుత పురాతన ఆలయాన్ని కుాడా దర్శించి , స్వామివారి ఆశీస్సులను పొంది , తరిస్తారని
తలుస్తాను.

***********************

బాల సాహిత్యం

06/05/2023.
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం : బాల సాహిత్యం "వ్వ" ఒత్తు పదాలు.
శీర్షిక  :అమ్మ మాట వినరారా ముద్దుల బాల.॥

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

మువ్వ గోపాల రార , ముద్దుల మురిపాల బాల 
సవ్వడి నీ పదముల సడి వినగ వేచియుంటిరా ॥

నవ్వుల మురిపాల మొాము ముచ్చట గొలిపేనురా
అవ్వల నీ ఆటలాపి అమ్మ మాట వినరారా ॥

పువ్వుల మాలలు గట్టి సిగ చుట్టుా పెడతా రా ॥
రవ్వల గొలుసులు మెడలో వేసి సింగారింతురా ॥

సవ్వడి చేయక వెన్నను దింగిలింప నేలరా.?
కవ్వముతో చిలికి నట్టి వెన్నలు తిని బజ్జోరా ॥

బువ్వ లోన వెన్న వేసి , కలిపి ఉంచినానురా..
రవ్వల లడ్డుాల తీపి కలిపి తినగ రావయా ॥

రాళ్ళరువ్వి" నెత్తి "నున్న "చల్ల "కుండ గొట్టకురా
చువ్వలతో  బాది "చల్ల " నేలపాలు చేయకురా॥

రివ్వున ఎగిరే పక్షుల ఐకమత్యమును గనరా
గువ్వ జంట కువ కువలతొ  గుాటిలోన చేరెరా॥

దివ్వెలు వెలిగించు వేళ ఇల్లు చేర మేలురా ॥
కెవ్వు మంటు కేకలెట్టి అల్లరిలా చేయకురా ॥

గవ్వలాట లాడ రార ముద్దుల మురిపాల బాల .
అవ్వ చెప్పు కధలు వింటు ఆదమరచి నిదరోరా॥

విష్ణు పాదం.

***10/05/2023.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : విష్ణుపాదం 

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

వామనుండతండు వరుసావతారాల
అసురు నణచ వచ్చె  నాది విష్ణు.
బలిని అణచి నట్టి బలమైన పాదమ్ము 
విమల యశము నొసగు  విష్ణు పదము॥

పాము తలను తొక్కి ఫలమిచ్చె పాదమ్ము 
బలము రిపుల నణచె భాగ్య పదము
గర్వ మణచి నట్టి  ఘనమైన పాదమ్ము
గగన సీమ నేలు ఘనుని పదము ॥

బ్రహ్మ కడిగి నట్టి బ్రహ్మ మీ పాదమ్ము
దుార్వ సాది ఋషుల దుాకు డణచె.
రాతి నాతి జేయు రమ్యమౌ పాదమ్ము
విష్ణు డతడె  సకల  జిష్ణు డతడె ॥

(మాతృదినోత్సవం )అమ్మా...! నన్ను క్షమించవుా."..?

13/05/2023.
అంశం : మాతృదినోత్సవం.

శీర్షిక :"అమ్మా...! నన్ను క్షమించవుా."..?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .
 
క్రమసంఖ్య :  2023.

నేను అమ్మనయ్యాకా  తెలుసుకున్నాను  
అమ్మంటే ఏమిటో.."
నా బిడ్డ అకలికి ఏడుస్తుాంటే 
తెలుసుకున్నా.,"తల్లి ప్రేమంటే " ఏమిటో..॥

నా పాప పగలంతా నిదరోతుా 
రాత్రి ఆటలాడుతున్న పుడు తెలుసుకున్నా..
"అమ్మని , సహనానికి ప్రతీకని"  ఎందుకంటారో...॥

సమయానికి అందరికీ అన్నీ
 అమరుస్తున్నపుడనుకున్నా....
"అమ్మంటే, అవిశ్రాంత రాట్నమని...".,॥

నా పాప  నన్నెదిరించినపుడు తెలిసింది,
అమ్మ  నావల్ల "మానసికంగా ఎంత కుంగిపోయిందో .."
.
అమ్మ అనంతలోకాలకు చేరుకున్నాకా 
తెలిసుకున్నా ,పరిపుార్ణమైన త్యాగానికి 
"అమ్మకు అమ్మే సాటని ,".॥

ఈ నాడు అమ్మనైన నాకు "అమ్మంటే ఏమిటో"
తెలిసింది., 
కానీ నా తప్పులు క్షమించమని అడగడానికి 
"అమ్మ" లేదు., ఐనా అడుగుతున్నా....
"అమ్మా...! నన్ను క్షమించవుా."..?॥

చెట్టు తల్లి...(కధ).

శీర్షిక  : చెట్టు తల్లి..

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్: మహారాష్ట్ర.

వెధవ చెట్టు ..
ఎన్ని సార్లు నరికినా మళ్ళీ చిగురిస్తోంది సిగ్గులేకుండా..
అనుకుంటుా రుస- రుస లాడుతుా పళ్ళు తోముకుంటున్నాడు రాఘవ. అతడి భార్య లలిత 
అప్పటికే  అక్కడి వారి ఆచారం ప్రకారం, ఆ పెద్ద చెట్టు దగ్గర దీపం పెట్టేసింది . కొడుకు హర్ష మర్రి చెట్టు కొమ్మకు కట్టిన ఉయ్యాల ఊగుతానని మొరాయిస్తున్నాడు.
లలిత వాడిని వద్దని  బుజ్జగిస్తున్నాది. వాడికి పదేళ్ళు దాటేయి ..చిన్నప్పటి నుండే  వాడికి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండేది . ఉబ్బసం ఏమొా అనుకున్నారు .డాక్టర్లకు చుాపిస్తే  ఎన్నో   టెస్ట్ లు చేసి,  చివరకు వాడి బ్రైన్ కి ఆక్సిజన్ అందడం లేదని కొందరు ,  , ఎక్కడో బ్లడ్ క్లాట్స్ ఉండి రక్తప్రసరణం సమంగా జరగనందు వల్ల ఇలా జరుగుతున్నాదని మరి కొందరు , చెపుతుా ఏవేవో 
 మందులు రాసి ఇస్తున్నారు. . పిల్లాడికి వయసు పెరుగుతుా ఉంటే తగ్గవచ్చని లేకపోతే సర్జరీ చేయవలసి వస్తుందని మరికొందరు చెప్పేరు. చెప్పేరు. ఉన్న ఒక్కగానొక్క పిల్లడికీ  అసలు ఈ వ్యాధేమిటో....ఎవరుా తేల్చి చెప్పలేకపోతున్నారు. అందికే వాడు ఏమైనా ఎత్తులెక్కినా 
 అలసిపోయే ఆటలాడినా , తమకు చాలా భయంగా ఉంటోంది . ఊపిరందని కారణంగా వాడికేమైనా అవుతుందేమొానని.
ఆలోచిస్తున్న రాఘవ మళ్ళీ పిల్లాడి అల్లరితో ఈ లోకం లోకి వచ్చిపడ్డాడు.
ఎదురుగా పెద్ద చెట్టు, దానికి వేలాడుతున్న గొలుసులుా..
కనపడ్డాయి. రాఘవ ఆలోచనలు మళ్ళీ అటు మళ్ళేయి.
అసలక్కడ ఆ ఉయ్యాల ఎవరు కట్టేరో ...
రెండు పెద్ద పెద్ద ఇనప గొలుసులతో కొమ్మకు వేలాడ దీసి కట్టేరు.  
ఇనప  గొలుసుల రాపిడికి చెట్టు కొమ్మ ఒరుసుకు పోవడం వల్ల , దాని చర్మం చాలా మట్టుకు ఊడిపోయి భయంకరంగా  ఉంది. 
గొలుసుల కింద మనకెలా కావాలంటే అలా ఊయల బిగించుకోవచ్చట. మంచం కుాడా బిగించుకోవచ్చట.
ప్రస్తుతం దానికి జాలీల గుడ్డ కట్టి ఉంది. అందులో పడుకో వచ్చు కుాడా..
 తను రిటైర్  అవడానికింకా పదేళ్ళ సమయం ఉంది.
 ఈ లోగా కుాడ బెట్టిన డబ్బుతో తనకు కావలసిన రీతిలో 
 తన సాంత జాగాలో ఇల్లు కట్టుకుంటే  తన రిటైర్ మెంట్ తర్వాత ప్రశాంతంగా, తమ బంధువర్గం మధ్య ఉండవచ్చన్న ఆలోచనతో  తన సొంత జాగాలోఇల్లు కట్టడం మొదలెట్టాడు. 
 ఇల్లు పుార్తయింది గానీ , ఈ చెట్టు,వల్ల వచ్చిన  సమస్య తీరలేదు. కారణం తమ ఇంటి సింహద్వారానికి ఎదురుగా 
 వ్యాపించీ ఉందా చెట్టు. అది కొట్టి పారేస్తే గాని చుట్టుా ప్రహారీ కట్టుకోవడానికిగానీ , గేటు పెట్టుకుందికి గానీ వీలుకాదు. 
 కొందరు " వందలనాటి కాలపు చెట్టుని కొట్ట వద్ద" ని అంటే..
 మరికొందరు "..కాలం మారిందోయ్ ..ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు ఏమిటీ...అందమైన ఇంటికి ఎదురుగా, ఈ దెయ్యాల మర్రి చెట్టేమిటి  ..? 
 కొట్టి పారేయ్" అని మరొ కొందరుా..చెపుతుా ఉఃటే 
 రాఘవకు ఏం చేయాలో తోచడంలేదు.
  చివరికి ఈ చెట్టు ఆకులు రాల్చే సమయంలో..
  ఇంటి ప్రాంగణమంతా ఎండుటాకులతో నిండిపోయి 
  అవి తుడుచుకోలేక కొంత ,ఆకులు రాలిన మొండి చెట్టు వల్ల తనిల్లు నిజంగా దెయ్యాల కొంపలాగే కనపడడంతో . మరికొంత  చికాకుతో , చివరికి చెట్టును కొట్టించడానికే సిద్ధపడ్డాడు రాఘవ.
  అప్పటికీ రెండు సార్లు కొట్టించేసాడు కుాడా...
  కానీ ఉద్యోగ రీత్యా తాను వెళ్ళి తిరిగి వచ్చే సరికి మళ్ళీ
  చిరు చిగుర్లతో  దర్శనమిస్తొింది సిగ్గులేని చెట్టు
  మరింక కాండం వరకు కొట్టిస్తే లాభం లేదు.
  ఏకంగా అడుగునుంచి వేర్లతో సహా పెక్కళించేయాలి అనుకుంటుా .ఫోన్ తీసేడు.
  
  **********
 
 ట్రాన్స్‌ఫర్ల కారణంగా ఎక్కడా తనకు సొంత ఇల్లంటుా లేక  కావలసినట్టు ఉండలేకపోయాడు. కనీసం కారు , బైకు అన్నా పెట్టుకోవడానికి స్టలం లేని అద్దె ఇళ్ళలో  నానా అవస్థలుా పడ్డాడు.
ఇప్పుడు ప్రసాంతంగా ఒక దగ్గర ఉండవచ్చనే ఉద్దేశ్యం  తో తను చిన్నప్పుడు ఉండే ఊర్లోనే తన తండ్రి కి వారసత్వపు ఆస్థిగా సంక్రమించిన .జాగాలో అందమైన బంగ్లా లాంటి ఇల్లు కట్టుకున్నాడు.  తాతల కాలం నాటి జాగా కావడం వల్ల , ఆ జాగాలో చాలా పెద్ద మట్రి చెట్టు , దాని మధ్యలోంచి పుట్టిన వేపచెట్టుతో కలిపి చాలా  విశాలంగా వ్యాపించి ఉంది.
వందేళ్ళనాటి చెట్టుగా అక్కడి గ్రామస్తులు  ప్రతీ సొిమ, శనివారాల్లో ఆచెట్టు కింద తొర్రలో దీపం పెట్టడం .అలవాటుగా మారడంతో , దానిని తమ తాత తండ్రులకు ,  కొట్టించడానికి వీలుకాక అలాగే వదిలేసారు.
అదీ కాక అప్పట్లో సాధారణమైన పెంకుటిల్లు కట్టుకోవడం , సైకిళ్ళవాడకం తప్ప మరో విధానంలో  జీవితం ఉండేది కాదు. అప్పట్లో ఆ చెట్టు కిందే రచ్చబండలు జరిగేవని చెప్పుకునేవారు. ఐతే ఆచెట్టు వ్యాపించడం వల్ల దాని ఊడలు మట్టిలో పాతుకు పోయి మరో రెండు చెట్లు లేచిపోయాయి. 
దాంతో తన వంతు వచ్చే సరికి అక్కడ 
చుట్టుా ప్రహారీ గోడ కట్టడానికి గానీ , కారు పార్కింగ్ కి గానీ , 
కనీసం పెద్ద గేటు పెట్టుకుందికి గానీ అవకాశం కలగడం లేదు. ఏ ముాలో గేటు కట్టుకో డానికి వాస్తు కుదరడం లేదు.
కాకుండా ఇంటి ముందు గేటుండాలి గానీ ఇంకో ముాల
 ఉండడమేమిటీ..?
  కొత్తగా లేచిన చెట్లు కుాడా చాలా విశాలంగా పెరిగిపోతున్నాయి. దాంతో ఇంత అందమైన ఇల్లు
  గేటు లేని ప్రహారీ గోడతో అసహ్యంగా కనిపిస్తున్నాది.
  ఆఖరికి తన గురించి ఎవరైనా వస్తే , తన ఇంటి అడ్రస్సు కుాడా "గేటులేని రాఘవ" గారిల్లుగా మారిపోయింది.
అసలు, ఈ మధ్య తమ ఊరు చాలా మారిపోయింది.
ఎవరుా తమ ఇళ్ళ లో మట్టి జాగా ఉంచడమే లేదు . 
ఇంటి ప్రహారీల లోపలంతా  అందమైన డిజైన టైల్స్ వేయించి 
కారుకో షెడ్డు వేసుకొని , అందమైన పెద్ద పేద్ద గేట్లు పెట్టు కొని 
దానిమీద తమ ఇంటి నంబరు పేరు రాసుకుంటున్నారు.
అందరిలోకీ ,తనొక్కడే గేటు లేని రాఘవగా మిగిలిపోయేడు.
ఇక లాభం లేదు . రేపెలాగైనా మరెవరినైనా పిలిచి ఈ చెట్టును కుాకటి వేళ్ళతో సహా నరికించేయాలి .
వెధవ చెట్టు, కోలనీ అంతటికీ దిష్టి బొమ్మలా ఉంది. 
రాత్రుళ్ళలో  దయ్యాల మర్రిలా భయంకరంగా ఉంటుంది.
దానికితోడు గాలికి కిర్రు కిర్రు మని కదిలే ఈ ఉయ్యాల గొలుసులొకటి...

అందరిళ్ళుా ఎంత బాగున్నాయొా..! పెద్ద ఆవరణలలో
కట్టుకున్న విశ్రాంతి మంటపాల కింద కుర్చీల లో కుార్చొని
సాయంత్రం పుాట "టీ "లు  తాగుతుా ఎంచక్కా కబుర్లాడు కుంటారో...
తనకా అదృష్టం ఎప్పుడు పడుతుందో ?
మరి ఆలోచించీ లాభంలేదు. అనుకుంటుా కార్పొరేషన్ కి ఫోన్ చేసాడు.
మరో రెండు రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు
వచ్చి చెట్టును పుార్తిగా భుామిలోంచీ పెక్కళించేస్తామని చెప్పేరు. 
మరొక్క రెండురోజులాగితే చాలు.
తను అనుకున్నట్టుగానే  ఇంటీరియర్ తో సహా అన్నీ 
చేయించేస్తాడు.
అనుకుంటుా ఆనందకరమైన ఆలోచనలతో పక్కమీద వాలేడు రాఘవ.

********************

మర్నాడు పొద్దున్నే  మున్సిపాలిటీ  వర్కర్లు వచ్చి 
అంత పెద్ద చెట్టునీ , వేర్లతో సహా పెకళించి చెట్టు మొత్తాన్ని ట్రక్కు మీద వేసుకొని, వెళిపోయారు.
రాఘవ నిశ్ఛింతగా ఊపిరి పీల్చుకున్నాడు
"వెధవ చెట్టు పీడ విరగడైంది" అనుకుంటుా...
ఎండలు తగ్గి వర్షాలు మొదలయ్యేయి.
"వర్షాకాలం దాటేకా ఇంటి పని మొదలెట్టాలి" అనుకుంటుా  , 
టి.వి.ఆన్ చేసాడు.

*****::*****************************
వర్షాలు మొదలయ్యేయి. ఇంటి ప్రాంగణమంతా బురద బురదగా ఉంది . రెండు నెలలు గడిచినా వర్షాల ఉధ్రుతం తగ్గలేదు. 
ఆరోజు రాత్రి సడన్ గా బాబుకి చికాకు చేసింది
రాఘవ , లలిత  బాబుని తీసుకొని ఆదరా బాదరా 
కారులో సిటీకి బయలుదేరేరు.
 బాబుకి ఊపిరందడం చాలా కష్టమై గిల గిలా కొట్టుకుంటున్నాడు. ఏక్షణంలో బాబు ఊపిరాగిపొితుందో ..
 అన్న ఆందోళనతో ఇద్దరికీ మతిపోతోంది.
 రాఘవ నుారు కిలోమీటర్ల స్పీడ్ తో కారు పోనిస్తున్నాడు.
 బాబు పరిస్థితి చుాసి ,భయానికి ఒంటినిండా చమటలు పడుతున్నాయి రాఘవకి. చేతులు వణుకుతున్నాయి భయానికి.  ఈ పరిస్థితిలో కారు నడపడం  చాలా కష్టంగా అనిపించింది రాఘవకి .
 చివరకు ఎలాగో అలా , సిటీలో ఉన్న పెద్ద ఆసుపత్రికి  చేరుకున్నారు.
 అప్పటికి తెల్లారిపోయింది .
 అక్కడున్న   అసిస్టెంట్ డాక్టరు పిల్లాడిని చుాసి ఏదో 
 ఇంజక్షన్ ఇచ్చేసరికి అరగంటలో బాబు నిద్రలోకి జారిపోయేడు.
 పెద్ద డాక్టరు పది గంటలకు వస్తారని ,
 అంతవరకు తానేం చేయలేనని , అంతదాకా నిరీక్షించ మని చెప్పి అతను వెళ్ళి .పోయాడు.
 చేసేది లేక రాఘవ చేతులు నులుముకుంటుా 
 బెంచ్ మీద కుాలబడ్డాడు. 
 లలిత ఎడ్చి ఏడ్చి, బాబు పక్కనే  సొమ్మసిల్లినట్టు వాలిపోయింది.
 తెల్లారి పదిగంటలవరకు చేసిన నిరీక్షణ,  జీవితంలో అనుభవించినపెద్ద శిక్షలా అనిపించింది రాఘవకి.
 చివరికి  పెద్ద డాక్టర్  గారు వచ్చేరు .బాబుని పరీక్షించి
 పుట్టెడు రక్త పరీక్షలు రాసేరు. స్కేనింగులు , ఎక్స్ రే లు, టెష్ట్ లు ,మందులు ,ఇంజక్షన్లకి  ఓ లక్ష వదిలించిన తర్వాత , ముందు డాక్టరుగారు  తమకు తెలిపిన విషయాన్నే చల్లగా చెప్పేరు. 
 అదే..బాబుకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని , 
 కొద్ది రోజులు ఆక్సిజన్  పెట్టి గుండెను బలంగా కొట్టుకునేట్టు చేసేకా ఆపరేషన్ చేయవలసి వస్తే చేస్తామని , వయసు తక్కువ కాబట్టి ప్రస్తుతం మందులు వాడమని., వాటితో తగ్గిపోతే ఫర్వాలేదుగానీ , లేకపోతే కష్టమనీ....
 చెప్పడంతో రాఘవ ,లలిత, బెంబేలు పడిపోయారు.
 "ఉన్న ఒక్కగానొక్క కొడుకుని బ్రతికించు దేముడా" అనుకుంటుా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. 
 వీరి పరిస్థితి  చుాసిన డాక్టరు ప్రస్తుతానికి తన దగ్గర ఒక ఆక్సిజన్  సిలెండరు ఉందని , కానీ ఆపై సిలిండర్ 
కోసం  బయటే ప్రయత్నించాలని చెప్పి బాబుకి ఆక్సిజన్, మాస్క్ తగిలించేరు.
ప్రతీ నాలుగు గంటలకు హార్ట్ రీడింగ్ పరీక్షిస్తున్నారు .కానీ హార్డ్  బీట్, రేటింగ్ పెరగడం లేదు .దాంతో రాఘవ బయటికి పరుగెత్తేడు .ఏ చోట అడిగినా  ఆక్సిజన్ సిలెండర్లు లేవనే చెపుతున్నారు.  అతి కష్టం మీద పదింతల సొమ్ము చెల్లించి, రెండు సిలెండర్లు కొనగలిగేడు. 
ఆసుపత్రిలోనే  ఒక చిన్న రుాము తీసుకొని , కేంటీన్ భోజనమే చేస్తుా నెల్లాళ్ళు గడిపేరు.
ఉన్న డబ్బంతా ఖర్చైపొితున్నా డాక్టర్లు ఏమీ తేల్చడంలేదు.
ఆక్సిజన్ కోసం పిచ్చివాడిలా తిరుగుతున్న తనతో..
ఒకాయన " ఎక్కడా చెట్లు లేవు , అన్నీ కొట్టిీసీ 
బిల్డింగ్ లు కట్టేస్తున్నారు. బావులు ,చెరువులు, నదులు ,
ఎండిపోయినందువల్ల నీళ్ళు లేవు. 
పర్యావరణ సమస్య వల్ల , ఉన్న గాలిలో తేమ పొియి ఆక్సిజన్  లేకుండా పోయింది. 
ఇంక మన భవితని ఆదేముడే కాపాడాలి" అంటుా సణుగుతుా చక్కా పోయేడు. 
రాఘవ అవాక్కైనట్టు ఉండిపోయేడు.
"డబ్బుంటే కొండమీద కోతిని కుాడా దించొచ్చన్న తన 
అభిప్రాయం వమ్మైపోయింది.
ఈ రోజు ఊపిరి తీసుకోడానికి ఆక్సిజన్ కరువై తన కొడుకు చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు."
ఇంతడబ్బుా ఉండీ...తనేం చేయలేకపోతున్నాడు.
అనికుంటుా భొోరున ఏడ్చేడు.

"ఈ సమస్య తీరేదెలా"....అనుకుంటుా , నిస్త్రాణగా 
ఆసుపత్రికి వచ్చిన రాఘవతో  డాక్టర్  గారు , "తమ దగ్గర  కుాడా ఆక్సిజన్ ఇంక లేదని , వాడిన మందుల కారణంగా,  బాబుకి కొంచం నయంగా ఉందని , బాబుని వీలున్నంత త్వరగా, పచ్చని చెట్లున్న ప్రదేశంలోకి తీసుకెళితే, ఈ సమస్య తొందరగా పరిష్కరించవచ్చని  , ఆపై ఆపరేషన్  అవసరం ఉండకపోవచ్చని  చెప్పడంతో కాస్త రిలీఫ్ గా అనిపుంచింది రాఘవకి.
ఈ లోపల గానీ ఆక్సిజన్ దొరికితే మళ్ళీ తమ వద్దకు
 రమ్మని"  చెప్పి ,సాతంత్రం  బాబుని డిశ్ఛార్జ్  చేసేస్తామన్నారు.
రాఘవ గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్న భావన. 
సాయంత్రం లోపల తానెక్కడ చెట్లున్న ప్రదేశాన్ని వెతకగలడు.
వెతికినా అక్కడ నివాస యొాగ్యంగా ఉండి జన సంచారమన్నా ఉండాలికదా..ఇప్పుడెలా..అనుకుంటుా
చేసేదేమీ లేక చెట్లున్న స్థలాలకోసం ఆదరాబాదరాగా  వెతకనారంభించేడు. 
ఎక్కడా చెట్లన్నవి  కనపడలేదు.పట్నాల్లో గానీ పల్లెల్లోగానీ....
మచ్చుక కైనా ఒక్క చెట్టు  కుాడా కనపడలేదు. 
పార్కుల్లో  కుాడా , కుార్చోడానికి బెంచీలు , ప్రతీ బెంచీ వెనకాల  మొబైల్  రీఛార్జ్ కోసం పవర్ పాయింట్లు..
ఒచ్చిన వాళ్ళు తినడానికి , తాగడానికి కావలసినవి కొనుక్కోడానికి  ఒక రెష్టారెంటు తప్ప, చెట్లన్నవి కనబడలేదు.
నీడ కోసం షెడ్డులు , వాటి చుట్టుా కృత్రిమ పుాలతో నిండిన గోలేలు తనను వెక్కిరిస్తుా  కనపడ్డాయి.
కొందరింట్లో ఉన్నా, వాళ్లు రాఘవ కుటుంబంతో
 సహా అక్కడే ఉండడానికి అనుమతించలేదు.
 డాక్టర్స్ ని బతిమలాడి మరో పది రోజులు ఆసుపత్రిలోనే ఉన్నారు.  ఆ పది రోజులుా పగలంతా రాఘవ చెట్లున్న స్థలమన్నా దొరికితే ,చిన్న షెడ్డన్నా వేసుకొని ఉండొచ్చన్న నిర్ణయంతో అలా తిరుగుతుానే ఉన్నాడు.
 ఫలితం మాత్రం సుాన్యం. పదిరోజులుా పది నిముషాల్లా గడిచిపోయాయి.
  రాఘవకి ఒళ్ళు చల్లబడుతున్నాది.
చేసేది లేక  ఆ రోజు సాయంత్రం బాబుని తీసుకుని తన ఇంటికి బయలుదేరేడు.
ఇంటికి గేటు లేని కారణంగా కారుని లోపలికి తీసుకుపోదామనుకున్న రాఘవకు తన ఇంటి ముందున్న పెద్ద గొయ్యి వెక్కిరిస్తున్నట్టు కనిపించింది.

అక్కడున్న వందేళ్ళ మర్రి చెట్టు నేలకుాల్చిన  సంఘటన  కళ్ళముందు  కనపడింది.
రాఘవ కారులోంచీ దిగి , ఆ గొయ్య ముందు కుాలబడ్డాడు
పుట్టెడు దుఃఖంతో  వలవలా ఏడవ సాగేడు ..
" ఎంత పని చేసానమ్మా ! నీ విలువ తెలుసుకోలేకపోయేను.
నిన్ను అవమానించేను,  తిట్టేను,  కొట్టేను , ఐనా చల్లటి  నీడనిచ్చేందుకు మళ్ళీ మళ్ళీ పుడుతుానే వచ్చావు.
నీతో పాటు వేప చెట్టుని కుాడా విడవకుండా వస్తుా...
పంచుతున్న చల్లటి గాలి విలువను గుర్తించలేని- ముార్ఖత్వంతో, నిన్ను నిలువునా కుాకటి వేళ్ళతో సహా  కుాల్చేశానమ్మా .. నన్ను మన్నించు.
నేను చేసిన పాపానికి శిక్ష , మా ఒక్కగానొక్క బాబు అనుభవిస్తున్నాడు.
మమ్మల్ని క్షమించి వాడిని కాపాడుకొనే దారి చుాపించమ్మా " అంటుా దిర్లి దొర్లి ఏడుస్తుా ఆ చెట్టు తల్లి ఉన్న చోట ఆప్యాయంగా తడుముతున్నాడు.
సడన్ గా రాఘవకి ఒక చిన్ని చిగురు కొమ్మ కనిపించింది..
గబ గబా దాని చుట్టుా ఉన్న మట్టి తీసి చుాసేడు
దుఃఖం , ఆశ్ఛర్యం , ఆనందం  అన్నీ కలిన గొంతుతో ఒక్క సారిగా పెద్ద కేక పెట్టేడు.
నా చెట్టు తల్లి మళ్ళీ చిగిర్చిందంటుా ...
పిచ్చి వాడిలా నాట్యం చేస్తున్నాడు ..
చుాస్తుాండగానే మరో మొలక మరో మొలక ...అలా...ప్రాంగణమంతా ఆకుపచ్చని చిగురు మొలకలు పుట్టు కొస్తున్నాయి.
రాఘవ ఆనందానికి అంతం లేకుండా పొియింది.
తన కొడుకు బ్రతుకుతాడు...
వాడికి మరే డాక్టరుా అవసరం లేదు...అంటుా 
ఒక్క గెంతు గెంతేడు.

*****************
ధబ్బు మన్న చప్పుడుకి కళ్ళు తెరిచిన  లలిత , 
రాఘవ మంచం మించి కింద పడడం గమనించి 
"అయ్యొా  ఏమైందండీ..!.భయంకరమైన ..కలగానీ వచ్చిందా! "..అంటుా   గాభరాగా వచ్చి లేవనెత్తింది.
రాఘవ బిత్తర చుాపులు చుాస్తుా అలాగే బిగుసుకు పోయాడు. రాఘవ ఒళ్ళంతా చమటతో తడిసిపోతోంది.
రాఘవ ,బాబు కోసం చుాసేడు
తమ పక్కనున్న మంచం మీద బాబు హాయిగా నిద్దరపోతున్నాడు.
అంతే..రాఘవ  చటుక్కున లలితను పక్కకుతోసి
   ఒక్క ఉదుటున అవతలకి పరుగెత్తేడు.
లలితకేమీ అర్ధం కాలేదు. 
"ఈయనకి గానీ పిచ్చెక్కిందా .ఏమి." అనుకుంటుా భయంగా రాఘవ వెనకాలే వెళ్ళింది గాభరా పడుతుా..
రాఘవ తిన్నగా హాలు లోకి వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసి అవతలకి పరుగెత్తేడు.
ఎదురుగా మర్రి చెట్టు...
చిరుగాలికి ఊగుతుా చిగురుటాకులతో  తనకు స్వాగతం పలుకుతుాన్నట్టు...హుందాగా...
అంతే రాఘవ పరుగెత్తుకు వెళ్ళి ఆసాంతం చెట్టును ఆలింగనం చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు.
అప్పటికే తెల్లారిపోయింది. 
రాఘవ  చుట్టుా చుాసేడు. వర్షాకాలం అవడం వల్ల ఎన్నో చిన్న చిన్న మొక్కలు పుట్టుకొచ్చేయి. అంతే..
రాఘవ ఒక పార, గునపం తీసుకొని , ఆక్కడున్న పనికొచ్చిన మొక్కలన్నిటినీ వరుసగా పాతుకుంటుా వచ్చేడు.
ప్రాంగణం నిండా మొలిచిన పచ్చ గడ్డిని, తివాచీ మాదిరి 
కత్తిరించుకుంటుా పోయేడు. 
బౌండ్రీ కడదామనికున్న  చోట ప్రతీ ఐదడుగుల దుారంలోనుా 
ఒకొక్క గొయ్యి తీస్తుా వచ్చేడు .
ఇంతలో మున్సిపాలిటీ వాళ్ళు రానే వచ్చేరు.
రాఘవ వారితో ఏదో చెప్పి తిరిగి పంపేసాడు. 
ఆ తర్వాత రోడ్లన్నీ తిరిగి, సేకరించిన మొక్కలన్నీ తెచ్చి , తను తవ్విన జాగాల్లో పాతేడు.
లలిత ఇదంతా ఆశ్ఛర్యంగా చుాస్తున్నాది.
పొద్దున్న పదకొండుదాకా పనిచేదిన రాఘవ మర్రి చెట్టుకు కట్టి ఉన్న ఉయ్యాలలో  మొదటి సారి కుార్చున్నాడు .ఆనందంగా..

****************
బాబు లేచేడు . నిటారుగా ఉన్న మర్రి చెట్టుని ,నీటుగా ఉన్న ప్రాంగణాన్నీ చుాసి ఆశ్ఛర్యపోయేడు.
రోజులు, నెలలు, వత్సరాలుా గడిచేయి. ప్రాంగణం నిండా లేచి గుబురుగా పెరిగిన మొక్కల మధ్య ఆడుకున్న బాబుకి ఆరోగ్యం  కుదుటబడింది.
ఇప్పుడు రాఘవ , రాఘవయ్యగా పిలువబడుతున్నాడు.
తమ ఇంటి పశ్ఛిమంలో  కారు కోసం  పెద్ద గేటును కట్టేడు.
ఇంటి ముందర చెట్టు మొదలుకి ఆనుకున్నట్టుగా చిన్న గేటును అమర్చి, చెట్టు చుట్టుా కొత్తగా అరుగు కట్టించేడు.
రోడ్డు వరకు విస్తరించి నీడ నిస్తున్న చెట్టు కింద చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు. 
గేటుకవతల రాఘవ కట్టించినసిమెంటు బెంచీల మీద , సాయంత్రం అయేసరికి ఎందరో పెద్దలు, వృద్ధులు  వచ్చి లోకాభి రామాయణం మాట్లాడుకుంటున్నారు.  ఎక్కడో పని చేసే వర్కర్లు , 
ఈ చెట్టు కిందకే వచ్చి , తమ తమ చద్ది ముాటలు విప్పి 
భోజనం చేసాకా , ఆ చెట్టు నీడలోనే , తమ గావంచాలు పరుచుకొని సేద తీరుతున్నారు.
పండగలకి, పున్నాలకి,  రాఘవయ్య అక్కడికి వచ్చిన అందరికీ బహుమతులతో పాటు , మొక్కలను పంచుతున్నాడు. ఇప్పుడు ఆవుారిలో అంతా పచ్చదనమే.
పిల్లలంతా రాఘవయ్యని "చెట్ల తాతయ్య "అని పిలుస్తుాంటే, రాఘవయ్య ఆనందంగా నవ్వుకుంటున్నాడు.
ఇపుడు రాఘవయ్య రోజుా లేవగానే 
"చెట్టు తల్లీ బాగున్నావా "అంటుా  ఆ మర్రి చెట్టుని ఆప్యాయంగా పలకరిస్తాడు.  ఆ చెట్టు దగ్గరే కుార్చొని 
పేపరు చదువుకుంటాడు.
*********************
 ఇలా ఓ రాత్రి రాఘవకు వచ్చిన ఒక్క కల, అతని జీవితాన్నే కాదు , ఊరు మొత్తాన్ని మార్చేసింది.
 ఇప్పుడు ఆ వుారు " చెట్ల తాతయ్య ఊరుగా" ప్రసిద్ధికెక్కిపోయింది. 
 మర్రి చెట్టు నీడలోనే  రోజంతా గడుపుతున్న రాఘవయ్య , 
 అదే మర్రి చెట్టు కింద అంతిమ స్వాశ వదిలేసాడు.
ఊరి జనం అంతా కన్నీళ్ళతో రాఘవయ్యకు వీడుకోలు పలికేరు.
------------------------
ఒక రోజు పెద్దవాడై ఉద్యోగం చేస్తున్న రాఘవయ్య కొడుకు
"హర్ష " ,  ఒక పెద్ద బోర్డ్ మీద  "చెట్టు తల్లికి ప్రేమతో "
అని రాయించి ,దానికింద నమస్కరిస్తున్న తన తండ్రి , రాఘవయ్య  ఫొటో ఒకటి  పెట్టి చెట్టుకువేలాడ దీసేడు.
ఆ చెట్టుతో పాటు పెరిగిన ఎన్నో చెట్లు చల్లని గాలితో ,
హాయైన నీడతో, వచ్చి పొియేవారికి స్వాగతం పలుకుతున్నా , ఆ వుారి జనం మాత్రం 
"రాఘవయ్య చెట్టు "కిందే సేద దీరుతున్నారు.
పిల్లలకు ఇప్పటికీ అదే ఆటస్థలమైపోయింది.
సాయంత్రాలు ఆ చెట్టు చుట్టుా ఉన్న చప్టా మీదే 
ఊరి పెద్దలు ఊసులాడుకుంటారు..
రాఘవయ్య గొప్పతనాన్ని  తలుచుకుంటుా.....

అన్నీ చుాస్తున్న "చెట్టుతల్లి "మాత్రం అలాగే తన చల్లటి నీడను , స్వశ్ఛమైన  ప్రాణవాయువును ,అందరికీ 
పంచుతుా దర్పంగా  నిశ్ఛలంగా  అలాగే  నిలబడి ఉంది.
----------------------------------------
హామీ : 
ఈ కధ నా స్వీయ రచన.

.

Friday, May 5, 2023

మత్తకోకిల పద్యాలు

05/05/2023
తపస్వీ మనోహరం మరియు ఈ వేమన కవితానిలయం 
 సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర పద్య, వచన కవితల పోటీ కొరకు ,
అంశం : పద్యాలు (ఐచ్ఛికం ).
ప్రక్రియ : మత్త కోకిల .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

శ్రీల నిచ్చెడు కల్ప వల్లివి సింహ వాహిని శాంకరీ.
వేల రుాపము లేలు తల్లివి వేల్పు కొలువౌ శ్రీకరీ
ముాల మంత్రిణి,మొాక్ష రుాపిణి,మొాహ మాయ వినాశినీ
బాల , శ్రీ లలితాంబ చిద్ఘని భక్త సంకట నాశినీ ॥

అమ్మ నీవని నమ్మి యుంటిని ఆది శక్తి పరాత్పరీ.
నిమ్మళమ్మగు భక్తి తోనిను నిష్ట గొల్చెద నీశ్వరీ  ॥
రమ్మ నంటిని జాగు సేయక రావె శ్రీ జగదీశ్వరీ
ఇమ్మ నీవభయమ్ము మాకిల ఈప్సిత శంకరు కామినీ ॥

జోత లెట్టెద జోగుళాంబవు జ్యోతి శ్రీపుర.వాశినీ.
ప్రాతః కాలపు పుాజలందవె పార్వతీ గుణ భాసినీ
యాతనింకను తాళజాలను యామినీ జన మొాదినీ
మాత శ్రీ లలితాంబ చిద్ఘని మాత మంగళ రుాపిణీ ॥

భావ అగ్నిలొ సంభ వించిన భాను తేజ ప్రకాశినీ
దేవ కార్యము జేయ వచ్చిన దేవి దైత్య సంహారిణీ 
 పావనీ పరమేశు భామిని పంకజాక్షి సువాసినీ
గావ రాగదె కాల రుాపిణి కామినీ శుభ కామినీ ॥
 
ముండ మాలిని దుర్గ నాశిని ముక్తి మొాక్షస్వ రుాపిణీ
ఛండ ఛండిక రుాపిణీ సుప్రచండ తాండవ మొాదినీ
అండ నీవుగ మమ్ము బ్రోవవె  ఆర్త త్రాణ  పరాయణీ
కుండ లీని విశాల విశ్వ వినోద కుంజ విహారిణీ ॥

భక్తి గొల్చెడు వారి బ్రోచిన  భాగ్య మంగళ రుాపిణీ
శక్తి భైరవి శాంత రుాపిణి శాంకరీ శుభ కామినీ.
ముక్తి నిచ్చెడు మార్గ దర్శిని ముాక దైత్య వినాశినీ ॥
యుక్తి రుాపము లెన్నొ దాల్చిన యుద్ధ దైత్యవిదారిణీ ॥