Sunday, April 30, 2023

ప్రకృతి తో పయనం( కవిత)

30/04/2023.
జయ శంకర సారస్వత సమితి కవితా పోటీల కొరకు,
శీర్షిక  : ప్రకృతితో పయనం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

చల్లనిగాలి వీచే వేళలో పయనించే మల్లెపూల
 మత్తు పరిమళం మురిపిస్తోంది.
కోయిలమ్మ పాడే పాటలో నిండైన  రవం , 
హాయినిండు  నిత్య వసంతమై మరపిస్తొింది॥

పరుగులు తీసే మనసు విహంగం
ఆ పరుగుతో పయనించే వయసు యానమై
ఇంద్రధనుసు ప్రభల పరుగుల స్వప్నమయ్యింది.. ॥
                        
కన్నె మనసు కవితైెతే ,ఆ కవితలింద్రధనుసైతే 
ఆకాసమంతా చిలిపి కలల మిణుకు తారలే కదా! .. 
ఆ తారలన్నీ మెరిసే చిరు వెన్నెలలై  కురిస్తే
ఆ చందమామ కళలలో దాగిన వలపు కధలే .కదా!॥

మబ్బుచాటున దాగిన మేఘం,  చినుకై కురిస్తే
 నా మనసు వేచియున్న ఒక చకోరమై నిలుస్తే..
తొలి చినుకు తడికి పడే ఆరాటం ఓ ప్రేమే కదా !॥

ఇలలోని అందమంతా నే పాడే పాటకు పల్లవైతే 
జలజలల సాగే రాగ ఝరుల సందడి సడి
నా మదిలో రేగిన కలకలాల అలల సడులే కదా ! ... 
చిన్ని చిన్ని  చిలుక జంటలు ,పచ్చనైన  
చేల పంటల్లో  చేసే కువ -కువల  కిల- కిలలు 
నా మధుర గీతిలొ నిండు లయకు పదములే కదా... ॥

చిరుగాలి వెంట నా పయనం ,
కెరటాల నడుమ నా గమనం , నాలో
భావాలే అలలై తేలుతుా , చేరుకున్న తీరం ,
నే కోరుకున్న మధురమైన  గమ్యమే  కదా ॥    

మనసంత మధుర భావం నిండియుంటే
 మదినిండ రసపు పానం కదలుతుాంటే
అది పండు వెన్నెలంత తీయనైనదే కదా ! ...

పుాచే పూల సౌరభం, మలయారుత వలయ మైతే
చిరు చినుకు తడులు నిండిన మట్టి సోరభం -
చిన్నారి విత్తుకు, మొలకై  నిలిచే  ప్రాణంమే కదా !॥

తలపించు  వేయి వినొదాల హాయి తలపుల్లో .... 
చేసే సంగీత- సాహిత్య -స్వర  ,విహారానికి
స-రి-గ-మ సఖుల సాయమే శృతి లయలైతే ,
సరదాలు చిందు రాగ మధువుల మకరందలో
మనిగే జీవితం ,ఆనంద మధు పరాగమేకదా. ॥


హామీ : 
పై కవిత నా స్వీయ రచన.

____________________________________________

Saturday, April 22, 2023

బాల సాహిత్యం.

[22/04, 7:20 pm]
 JAGADISWARI SREERAMAMURTH: 22/04/2023.

మహతీ సాహితీ కవి సంగమం .
బాల సాహిత్యం ( ర -ద్విత్వం = ర్ర )
శీర్షిక : చిర్రు బుర్రు లాడకండి చిన్నారి పాపలుా .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


చిర్రు బుర్రు లాడకండి చిన్నారి పాపలుా .
మర్రి చెట్టు నీడలోన ఆడుకోండందరుా.॥
ఎర్ర నైన గులాబీకి ముళ్ళుంటాయ్ బాలలుా 
 ముల్లు గుచ్చ ఎర్ర నైన రక్త మొచ్చు పిల్లలుా॥
 
కర్రతో నదిలిస్తుా వచ్చె తాత పిల్లలుా 
బుర్ర మీసాల తాత తోలుకొచ్చె బర్రెలు
బర్రె పాలు తాగొచ్చవి బాగుంటాయ్ పిల్లలుా
గొర్రె మందలాగల్లరి చేయకండి  పిల్ల లుా  ॥

విర్రవీగు కాకమ్మను రెచ్చగొట్ట పిల్లలుా
బుర్రమీద ఒక్కతన్ను తన్నుతుంది పిల్లలుా॥
ముద్దొచ్చిన కుక్కపిల్లను ముట్టకండి పిల్లలుా
గుర్రు మంటు తల్లి కుక్క మీదకొచ్చు పిల్లలుా॥

ఎర్ర ఆవు  అంబాయని  పిలువ గానె పిల్లలుా
కర్రి ఆవు పిల్ల తల్లి పొదుగు చేరె పిల్లలుా ॥
జుర్రుమంటు పాలు కుడిచి తాగుతున్న దుాడను
కుర్ర కుంక లెల్ల జేరి మురిసి చుాచె పిల్లలుా॥

బుర్రు పిట్ట గుబురులోకి ఎగిరి దాగె పిల్లలుా 
తుర్రు మంటు చిలకపిట్ట గుాడు చేరె పిల్లలుా ॥
చెట్టు తొర్ర లోన ఉడుత గంతులేసె పిల్లలుా 
సర్రు మంటు జారి పడెను చిట్టి ఉడుత  పిల్లలుా॥

వెర్రెక్కిన కోతి లాగ  గెంతకండి పిల్లలుా 
సర్రు మంటు కాలు జారి పడతారోయ్ పిల్లలు
కొర్ర మీసమున్న తండ్రి మాట వినరె పిల్లలుా
వర్ర  కాదు మీదు భవిత , తీపి నిండు పిల్లలుా ॥

వెర్రి-మొర్రి వేషాలను వేయకండి పిల్లలుా
గుర్రు మన్న గురువు మాట వినరె పిల్లలుా ॥
కొర్రుమాట లాడి పరిధి దాటకండి పిల్లలుా 
బుర్ర కొంత పదును బెట్టి  చదవండోయ్ పిల్లలుా॥

హామీ :
పై కవిత నా స్వీయ రచన.
[22/04, 7:40 pm] +91 99890 18003: 2️⃣9️⃣
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.కల్యాణ్.గారు, మీ 
శీర్షిక : చిర్రు బుర్రు లాడకండి చిన్నారి పాపలుా 
చిర్రు బుర్రు లాడకండి చిన్నారి పాపలుా .
మర్రి చెట్టు నీడలోన ఆడుకోండందరుా.॥
ఎర్ర నైన గులాబీకి ముళ్ళుంటాయ్ బాలలుా 
 ముల్లు గుచ్చ ఎర్ర నైన రక్త మొచ్చు పిల్లలుా👌
బుర్రమీద ఒక్కతన్ను తన్నుతుంది పిల్లలుా॥👌
సర్రు మంటు జారి పడెను చిట్టి ఉడుత  పిల్లలుా॥
కొర్రుమాట లాడి పరిధి దాటకండి పిల్లలుా 
బుర్ర కొంత పదును బెట్టి  చదవండోయ్ పిల్లలుా॥
👉 అధ్బుతమైన లయ మీ రచనలో .. అభినందనలు 🙏🎉💐

Thursday, April 20, 2023

రుబాయిలు

అంశం : రుబాయిలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

కొమ్మమీద కోయిలమ్మ పాటపాడె నోచెలియా
పక్షులెన్నొ  పలుకుకులుకు నాటలాడె నోచెలియా॥
పచ్చదనపు అందాలవి మనజీవిత సుఖవరాలు
ప్రకృతికన్య పులకరించి  నాట్యమాడె నోచెలియా॥

 తలలుాపుచు పరవసించె  పుాబాలలు ఓ చెలియా॥
 చిరు గంధపు వలువ తొడిగె చిరుగాలులు  ఓ చెలియా॥
పర్యావరణ  రక్షణమన బాధ్యతగద ఈ భువిలో
 ప్రకృతి పంచు సిరులె బ్రతుకు పరిమళాలు ఓ చెలియా॥


స్వశ్ఛమైన గాలినిచ్చు చెట్లు పెంచు మొా చెలియా॥
పచ్చదనపు అందాలవి పెంచిపంచు మొాచెలియా ॥
మన పోషక విలువలవే , సిరులమించు సరులుఅవే
మనమేసే ప్రతి యడుగు భవిత కంచు  నో చెలియా॥

రుబాయిలు.

అంశం : రుబాయిలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

కొమ్మమీద కోయిలమ్మ పాటపాడె నోచెలియా
పక్షులెన్నొ  పలుకుకులుకు నాటలాడె నోచెలియా॥
పచ్చదనపు అందాలవి మనజీవిత సుఖవరాలు
ప్రకృతికన్య పులకరించి  నాట్యమాడె నోచెలియా॥

 తలలుాపుచు పరవసించె  పుాబాలలు ఓ చెలియా॥
 చిరు గంధపు వలువ తొడిగె చిరుగాలులు  ఓ చెలియా॥
పర్యావరణ  రక్షణమన బాధ్యతగద ఈ భువిలో
 ప్రకృతి పంచు సిరులె బ్రతుకు పరిమళాలు ఓ చెలియా॥


స్వశ్ఛమైన గాలినిచ్చు చెట్లు పెంచు మొా చెలియా॥
పచ్చదనపు అందాలవి పెంచిపంచు మొాచెలియా ॥
మన పోషక విలువలవే , సిరులమించు సరులుఅవే
మనమేసే ప్రతి యడుగు భవిత కంచు  నో చెలియా॥

శీర్షిక : పాటకు పల్లవి ప్రాణం.--- పాడనా తెలుగు పాట.

11/04/2023.
"మనోహరి"  అంతర్జాల మహిళా మాస పత్రిక కొరకు ,
చిత్రం : అమెరికా అమ్మాయి.
పాట : పాడనా తెలుగుపాట.
శీర్షిక : పాటకు పల్లవి ప్రాణం.
------------------------

పాడనా తెలుగుపాట పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట॥

కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా
మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట - మధురామృతాల తేట॥

ఒక పాట - పాడనా తెలుగుపాట
పరవశనై... నె..పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట

త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది
వాడ వాడలా కనిపించెది
చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట
ఒక పాట - పాడనా తెలుగు పాట

వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును
నాటె ప్రతిచోట - ఒక పాట
పాడనా తెలుగుపాట
పరవశనై... నె..పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట॥

పై పాటకు సమీక్ష :

శీర్షిక : పాటకు పల్లవి ప్రాణం.
-------------.------------

నేను  1976 లో అమెరికా అమ్మాయి అన్న చిత్రాన్ని చుాసాను. అప్పుడు నాకు అప్పుడు పదహారు సంవత్సరాల వయసనుకుంటాను..
అప్పటికే కాలం మారిందంటుా..ఎన్నో పాశ్ఛాత్య పద్ధతులకు అలవాటు పడిన ఎందరో
కొత్తదనానికి  ప్రాధాన్యతనిస్తుా, మన కట్టు బొట్టుల వంటి సాంప్రదాయాలను కాస్త పక్కన పెట్టేరనే చెప్పాలి. 

అవంటి సమయంలో  ఈ చిత్రం మన సాంప్రదాయాల
విలువలను తెలియపరచే విధంగా ఎ. పి. నాగరాజన్ గారు రాసిన ఈ కధకు , గొల్ల పుాడి మారితీ రావుగారు 
మాటలు , సంభాషణలు ( dialogues)  రాయగా ,
సంగీతం శ్రీనివాసురావుగారి దర్శకత్వంలో నవత క్రిష్ణంరాజుగారి నిర్మాణంలో విడుదలై  చాలా చోట్ల
ఎంతో దిగ్విజయాన్ని సాధించింది .

పాశ్చాత్య ధోరణుల పట్ల వెర్రి వ్యామోహం పెంచుకొనే యువతకు మన నాగరికత విశిష్టతను గుర్తు చేసే ఈ చిత్రం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక ముఖ్యమైన చిత్రం అంటారు.
ఈ చిత్ర కధా సారాంశం ఏమిటంటే...
అమెరికానుండి తిరిగి వస్తూ ఒక యువకుడు 'డెబొరా' అనే ఒక అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకొని వెంటతీసుకొస్తాడు. ఆ కుర్రవాని పెళ్ళికై పెద్దవాళ్ళు అనుకొన్న ఆశలు వమ్ము కాగా వారు మనస్తాపానికి గురౌతారు. క్రమంగా ఆ డెబొరా 'దేవి'గా మారి తెలుగు కట్టు, బొట్టు, మాట, పాటలు అలవరచుకొని అందరినీ ఆకట్టుకోవడం ఈ చిత్ర కథాంశం.

మంచి కధ , కధకు తగిన తారాగణం, మాటలు పాటలు , ఒక దానిని మించిన ఒకటిగా పేరుపొందిన చిత్రమిది.

అందులో "పాడనా తెలుగు పాట.".అన్న పల్లవి ఎత్తుబడే..
"పాటకు ప్లవి ప్రాణం " అన్నది నిజమే అన్నంతగా.
 వినగానే ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉండడం ఒక విశేషం .
తెలుగుకు ,తెలుగుదానికి , సద్ధర్మ -సాంప్రదాయాలకు 
విలువనిస్తుా రచయిత రాసిన ఈ కధ మన తెలుగువారిని 
ఆలోచింపజేసేదిగా చిత్రానికి అనువైన సంభాషణలతో 
అత్యద్భుతంగా తీర్చి దిద్దేరు.

ఒక అమెరికా అమ్మాయి, మన తెలుగు సాంప్రదాయ రీతిలో చీర కట్టుకొని , ముఖాన ముచ్చటైన బొట్టుతో తీరైన బారెడు జడలో పుాలతో తనను తాను -అలంకరించుకొని ,  
"వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును
నాటె ప్రతిచోట - ఒక పాట."

అంటుా పాడుతుా మన  సాంప్రదాయపు విలువలను తెలియపరచడమే గాక , మన వైవాహిక జీవిత విలువలను పెంచే వలువల గురించి, కట్టు బొట్టుల తీరు గురించి  తెలియబరుస్తుా...పాడుతుా ఉంటే.
ఆమె , మనం ప్రాధాన్యతనిచ్చే పాశ్ఛాత్య కట్టు బొట్టుల అనుకరణను ప్రశ్నిస్తున్నట్టనిపించింది.
ఇంత మంచి సాహిత్యం ఈ నాటి పాటల్లో చాలా తక్కువే
అని చెప్పవచ్చు.

అంతేకాదు.ఆరవైనాలుగు కళలకు నిలయమైన
మన దేశ ఘనతను మన సాంప్రదాయ సంగీత ,
కళా ,వైభవాన్ని గౌరవిస్తుా..
"త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది
వాడ వాడలా కనిపించెది "
అంటుా మన భాష తీయదనాన్ని, మన దేశ సంగీత గాన వైభవాన్ని, మన చరిత్ర కారుల ,వ్యక్తిత్వ విశిష్టతలను గుార్చి అమె పాడుతుా చెప్పే విధానం చాలా మందిని తలదించుకునేలా చేసిందనే చెప్పాలి.

"కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా
మసలే గాలుల గుసగుసలో"

అని మన భరత మాత ప్రకృతి శోభలను వర్ణిస్తుానే ,
మన ఆధ్యాత్మిక విశిష్టతలనుా ,భగవదారాధనా తత్వాన్ని తెలియజేయడమేగాక 
మన ప్రకృతి  అందాలను , కావ్య ప్రబంధాలనుా
వర్ణించే అద్భుత కావ్య భాషగా  మన "తెలుగు" భాషను "చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట"అంటుా ,
మన భాషకు విలువనివ్వకుండా పరభాషకు పట్టం కడుతున్న మనకు, మన భాష గొప్పదనాన్ని 
విశదీకరించిన తీరు అద్భుతంగా అనిపించింది .

ఆ వయసులో నాకే ఆపాట విన్నాకా మన సంస్కృతి  సాంప్రదాయాల గుార్చి పర దేశీయుల నోటంట వినడం 
చాలా బాధనిపించి, "మనలను మనమే అవమానించుకుంటున్నామా ..." అనిపించింది

మనల్ని మనం గౌరవించుకోవడమంటే  మన దేశ సాంప్రదాయాలకు మనం విలువనివ్వాలన్న 
గొప్ప సందేశాన్నిచ్చిన చిత్రంగా, ఇప్పటికీ ఎందరో మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిన ఈ చిత్రమన్నా ఈ చిత్రంలో పాఁటలన్నా...నాకు ఇప్పటికీ ఇష్టమే..
ఎవరైనా చుాడని వారుంటే ఈ చిత్రాన్ని ఒక్కసారి 
చుాడమని కోరుతుా...
మరోసారి  మరో పాటతో....
మీ ...పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :మహారాష్ట్ర .

హామీ : 
ఈ సమీక్ష నా స్వీయ రచన.

.

(చింటుా కధలు లో ) హీరో చింటుా !

19/04/2023.

శీర్షిక  : హీరో చింటుా...

( థ్రిల్లర్  కధ.)


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


చింటుా వాళ్ళ నాన్నగారికి ట్రాన్ఫర్ అవడం వల్ల వాళ్ళు ఊరు మారేరు.  తామున్న ఇల్లు ఒక సొసైటీలో రెండవ అంతస్తులో ఉంది. అది కొత్తగా కట్టినట్టుంది. చాలా ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయి. అన్నీ నాలుగు బెడ్రుామ్స్ ఉన్న ఇళ్ళే.
ఒకొక్క ఫ్లోర్ లో రెండేసి మాత్రమే ఇళ్ళున్నాయి.
కొత్త ఇల్లు కొత్త మనుషులు . చింటుాకి విచారంగా ఉంది.
"ఆ వుారిలో తనకెంతమంది స్నేహితులుండేవారో .
మళ్ళీ తనకు స్నేహితులు బోలెడుమంది కావాలంటే ఎన్ని రోజులు పడుతుందో..
అంతదాకా తనొక్కడే ఆడుకోవాలి. ఈ బిల్డింగ్ లో ఎవరెవరున్నారో తన తోటి పిల్లలు  ఉన్నారో లేదో రేపు చుాడాలి ." అనుకుంటుా అసహనంగా ఇల్లంతా కలయ తిరిగేడు.
చుాస్తుండగానే రాత్రి అయింది .
నాన్నగారి ఉద్యోగం ఏమిటోగానీ అలా టుార్లు తిరుగుతుానే ఉంటారు .ఇంట్లో తను అమ్మ మాత్రమే ఉండాలి.
ఇదిగో... ఇప్పుడు కుాడా నాన్నాగారు ఊరికి  వెళిపోతున్నారు. 
పాత ఇల్లు తమ సొంత ఇల్లే...ఆ ఇంటిలోకి అద్దెకు దిగేవారు రేపే వస్తున్నారు. ఏవేవో ఫార్మాలటీస్ పుార్తి చేయాలని నాన్నగారు వెంటనే బయలుదేరుతున్నారు. నాలుగు రోజుల్లో వచ్చేస్తానంటుా..
 అమ్మ నాన్నగారి బట్టలు పేక్ చేసి 
కొన్ని తినుబండారాలు  కేరేజి లో కట్టి ఇచ్చింది.
నాన్న తమను జాగర్తగా ఉండమని చెప్పి వెళ్లిపోయారు.
చుాస్తుాండగానే రాత్రి అయ్యింది . రాత్రి పదకొండు గంటలదాకా టి.వి. చుాసి .తను,  అమ్మ పడుక్కోవడానికి రెడీ అవుతున్నారు. ఇంతలో ఎవరో" టక్కు టక్కు " మని కొడుతున్న చప్పుడు వినిపించింది. తమ ఇంట్లోంచే ఆ చప్పుడు వస్తుాండడంతో
ఇద్దరికీ చాలా భయం వేసింది.
అసలే బిల్డింగ్ లో చాలామంది రానందున,  ఖాళీగా ఉంది.
దానికి తోడు తమ పక్క ఇంట్లో కుాడా ఎవరుా లేరు.
అది బయట తాళం వేసి ఉంది. అలాంటప్పుడు ఈ చప్పుడెలా వస్తున్నాది .అదీ తమ ఇంట్లోంచే వస్తున్నట్టుగా...
అమ్మ తనను గట్టిగా పట్టుకొని  బెడ్రుామ్ తలుపు లాక్ చేసింది . అక్కడున్నా వారెవరికైనా ఫొిన్ చేద్దామంటే ఎవరి నంబరుా తెలీదాయె. 
నాన్నగారికి చేద్దామంటే, ఫోన్ హాల్ లో, టి.వి.పక్కన ఉండిపోయింది. 
చప్పుడు అగి ఆగి వస్తున్నాది 
పెద్దపెద్ద సిటీల్లో అందరుా పై అంతస్తులనే  ఎంపిక చేస్తారు.
గాలి వెలుతురు తో పాటు , బాహ్య సౌందర్యం ..ఆస్వాదించవచ్చునన్న కోరికతో..
దానివల్ల ఒచ్చిన కొంతమందీ కుాడా ఐదవ అంతస్తు నుండి ఆపై అంతస్తుల్లో ఉన్నారు. అదీ అక్కడా..అక్కడా....
అందువల్ల తమ ఇంటికి  కింద , మీద కుాడా ఎవరుా లేరు.
ఆ విషయం తల్చుకుంటేనే భయంగా ఉండి , ఈ సమయంలో చమటలు పడుతున్నాయి.
ఆసమయంలో నేనే అమ్మకు తోడన్నట్టు  అమ్మ నన్ను గట్టిగా పట్టుకొని భయంతో మంచమెక్కింది. ఆరాత్రంతా మాకు చప్పుళ్ళు వినిపిస్తుానే ఉన్నాయి .
తెల్లారి ముాడు నాలుగు  గంటలౌతుాండగా  ప్రతిధ్వనిలాంటి మాటలు,
ఒక మగ గొంతుక.....
"నేను చాలా అసహాయస్థితిలో ఉన్నాను. దయుంచి నన్ను రక్షీంచండి "అన్న మాటలు చాలా బలహీనంగా వినిపించసాగాయి. తర్వాత ఏడుస్తున్నట్లు ముాలుగు లాంటి
శబ్దం రాసాగింది.

ఆమాటలు విన్న తర్వాత అమ్మకు  కొంచం ధైర్యం వచ్చిందేమొా..
నన్ను మంచం దిగొద్దని చెప్పి  తను మాత్రం మెల్లగా తలుపు తీసుకొని  బయటకు వెళ్ళింది. తెల్లారుతుాండడంతో కిటికీలు తీయగానే కాస్తంత చల్లగాలితో పాటు చిన్న వెలుగు కనిపించింది. అమ్మ ఆ శబ్దం వస్తున్న వేపుగా మెల్లగా నడవసాగింది. ఆ ముాలుగు తమ ముాడవ బెడ్రుామ్ బాత్రుామ్ లోంచీ వస్తున్నట్లనిపించడంతో ..భయంతో.వణుకుతుా ...మెయిన్ డోర్ గబ గబా తీసి అరుస్తున్నట్లుగా" చింటుా తొందరగా రా అంటుా తన ను పిలిచింది. అమ్మ భయపడడంతో చింటుాకి చమటలు పట్టేయి.
గబుక్కున మంచం దిగి పరిగెత్తి వెళ్ళి అమ్మను గట్టిగా చుట్టేశాడు.
వెంటనే  అమ్మ తనను  పట్టుకొని లిఫ్ట్ లోకి ఎక్కి బటన్ నొక్కింది.
లిఫ్ట్  క్షణంలో గ్రౌండ్ లో ఆగి ద్వారం తెరుచుకుంది.
అమ్మ పరుగు పరుగున  మెయిన్ గేటు దగ్గరున్న "వాచ్ మేన్" ను చేరుకుంది.
అంత తెల్లవారి ఒక ఆడ మనిషి గాభరాగా తన దగ్గరకు రావడంతో వాచ్ మేన్ గాభరాపడ్డాడు.
అమ్మ రాత్రి జరిగినదంతా వాడితో చెప్పింది.
వాడు ఆశ్ఛర్య పోయేడు. 
"ఈ బిల్డ్ంగ్ కట్టడం పుార్తయి నెల కావస్తున్నాది .కొన్ని కుటుంబాలు వచ్చి ఉంటున్నారు కుాడా...
ఎవరికీ ఇటువంటి అనుభవం కలగలేదు 
మరి ఈ అమ్మగారికి మాత్రం ఏడుపులు, చప్పుళ్ళు,  ఎందుకలా వినిపిస్తున్నాయి.  రెండవ అంతస్తులో దయ్యముందా...."
తలచుకోగానే వాడికి కుాడా కొంచం భయమేసింది.
వాచ్ మేన్ ఆలొచిస్తుా చుట్టుా చుాసేడు.
 బిల్డింగ్ చుట్టుా ఆవరణ  ఎంతో అందమైన మొక్కలతో ,
పచ్చని తివాచీ పరచినట్లుండే పచ్చ గడ్డితో, ఉండి ఆకర్షణీయంగా ఉంది.
చుట్టుా పెద్ద ప్రహారీ గోడ ఉండి,  రెండు పెద్ద గేట్లు కలిగి ఉంది.
ఒకటి పెద్ద గేటు....కార్లు వెళ్ళడానికి.
రెండవ గేటు కొంచం చిన్నది...మనుషుల కోసం నడకదారది. .
గేటు లోంచీ  బిల్డింగ్ దాకా నడిచి రావాలంటే కొంచం దుారమే ఉంటుంది.
అందరుా కార్లలోనే రావడం వల్ల, వారికి నడిచే అవసరం పడ దు.అదీగాక వచ్చిన వాళ్ళంతా పై అంతస్తుల్లో  ఉంటున్నారు.
అన్ని ఫ్లేట్లుా కొలుగోలు చేయబడి తాళాలు వేయబడ్డాయి.
ఈ రెండవ అంతస్తుకి వీళ్ళు మాత్రమే వచ్చేరు. 
తను గేటు కాపలాదారు మాత్రమే కావడం వల్ల బిల్డింగ్ 
దాకా వెళ్ళే అవసరం పడలేదు.
అక్కడికి వచ్చే  తోటమాలి , పనివాళ్ళుా ఎవరికీ కుాడా ఇటు వంటి సంఘటన జరుగుతున్నాట్టు తెలీదులా ఉంది.
ఇంత వరకు ఇటువంటి సంఘటన ఈ బిల్డింగ్  లో జరుగుతున్నట్టు తమ మధ్య ఏ విధమైన చర్చలుా జరగలేదు.
మరేమయ్యుంటుంది...?


ఆలోచిస్తుానే వాచ్ మేన్  చింటుాని వాళ్ళమ్మని అక్కడ దగ్గరలో ఉన్న రెష్ట్ రుామ్ లో కుార్చోమని చెప్పి , చాయ్ తెప్పించి ఇచ్చేడు. తరువాత ఇంటర్ కమ్ ఫోన్ నుండి 
బిల్డింగ్ లో ఉన్న అందరికీ  విషయం వివరించేడు.
మరోఅరగంటకే అక్కడి పరిస్థితంతా మారిపోయింది.
పై అంతస్తులో ఉన్న వాళ్లంతా  కిందకి దిగి వచ్చేరు.
కొందరు పోలీసులకి ఫొిన్ చేస్తే, మరి కొందరు తమకు తెలిసిన  మంత్రగాళ్ళకి , మరికొందరు పుాజారులకి, ఫోన్ చేసేశారు.
తర్వాత  కొందరు చింటుాని వాళ్ళమ్మను చుట్టు ముట్టి ప్రశ్నల వర్షం కురిపించసాగేరు. 
చింటుా వాళ్ళమ్మ  ,తన ఫోను హాలులో టి .వి.పక్కన ఉందని , ఎవరైనా తనతో సాయం వస్తే  తను ఆ ఫోన్ తీసుకుంటానని , దానితో తన భర్తకు ఫోన్ చేయాలని ,ఎంత మొత్తుకున్నా ఎవరుా  వినిపించుకోవడమే లేదు. 
మొత్తానికి ఆ గందరగోళం మధ్యాహ్నం దాకా సాగింది.
చింటుాకి ఆకలేస్తోంది.
ఇంతలో పొిలీసులు వచ్చేరు విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళకీ భయమేసిందో ఏమొా...
మంత్రగాళ్ళతో కలిసి  గుంపుగా తమ ఇంటి పక్కనే ఉన్న రెండవ అంతస్తు ఇంటి దగ్గరకు వచ్చేరు .
 చింటుా వాళ్ళమ్మ చెప్పినట్టుగా ఆ ఇంటినుండి
 ఏ శబ్ధం గానీ, ఏడుపుగానీ, వినపడలేదు. 
 చాలా తర్జన భర్జనల తరువాత ఆ ఇంటి తాళం విరగ్గిట్టి లోపలికి గుంపుగా వెళ్ళేరు.
 అదుగో...అప్పుడే అక్కడ  బాత్రుామ్ నుంచి చిన్నగా ముాలుగు వినిపించింది.
 అందరుా ఒక్కసారి నిశ్శబ్దం ఐపోయారు. అందులో ఒక పోలీసు ధైర్యం చేసి, బాత్ రుాం తలుపు తీయ ప్రయత్నించేడు. కానీ అది రాలేదు.
 బాగా గమనించగా అది "డబల్ లాక్ "పడినట్లు 
 గుర్తించి , తాళాలు తీసే వాడిని పిలిపించి తలుపులు 
 తెరిచారు. 
 అందులో ఒక మనిషి చిక్కి శల్యమై, క్రింద  పడి ముాలుగుతున్నాడు .అతని బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి . బాత్రుామ్ అంతా అసహ్యకరమైన గబ్బు వాసనతో నిండి ఉంది
 అతని చేతిలో టాయిలెట్ పైప్ ఉంది. 
 అతనిపై నీళ్ళు జల్లినా అతడు లేవలేకపోయాడు.
 వెంటనే పోలీసులు  ఏంబులెన్స్ ని పిలిపించి, అతనిని ఆసుపత్రికి తరలించేరు.
 ఒకరోజంతా నారాయణకు "డిప్స్" ఎక్కించి ఎమర్జన్సీ వార్డ్ లో "అబ్జర్వేషన్ "లో ఉంచేరు.
 తర్వాత కొంచం కోలుకున్న నారాయణతో  పోలీస్ లు మాట్లాడసాగేరు.
అప్పుడు నారాయణ చెప్పిన విషయం ఇది.

--------
ఆ బిల్డింగ్ లో ఐదవ అంతస్తు పైనున్న ఇళ్ళు మాత్రమే అందరుా కొనుక్కున్నారు.
కిందనున్న నాలుగు ఫ్లోర్లుా ఖాళీగానే ఉండడంతో  రెండవ అంతస్తు లో ఉన్న ఒక ఇంట్లో అక్కడి వర్కర్లు అందరుా
 కలిసి మందు పార్టీ  చేసుకొని, బాగా తాగి ,తిన్నారు. 
తను కుాడా , చాలా తాగడంతో కడుపులో తిప్పినట్టై , 
వాంతి వస్తున్నట్టుగా అనిపించడంతో , బాత్రుామ్ లోకి 
 వెళ్ళి ధడాలున తలుపేశాడు..
వాంతి అవలేదు గానీ మత్తుగా తుాలుతుా  అక్కడే కుాలిపోయేడు.
ఎప్పడు తెలివి వచ్చిందో తెలీలేదు .అప్పటికీ మత్తు దిగలేదు.
కానీ ఆకలి దంచేస్తున్నాది.  
నారాయణ తలుపు తీయడానికి ప్రయత్నించేడు గాని అది లాక్ అవడంతో తెరుచుకోలేదు.
అతను తన సాటి వారి నందరినీ పేర పేరునా పిలిచేడు .
కానీ లాభం లేకపోయింది.
కొంతసేపటికి అందరుా వెళిపోయి ఉంటారని తెలుసుకున్నాడు.
దాంతో పిచ్చిగా అరుస్తుా ,అక్కడి కొళాయి  పైపులు లాగ ప్రయత్నిస్తుాండగా ...చివరికి  టాయ్ లెట్ బాక్స్ కి ఉన్న పైపు ఊడొచ్చింది .దానితోనే  అతడు చాలా సార్లు అక్కడున్న వెంటిలేటర్ని కొట్ట సాగేడు .
దాంతో , దాని అద్దాలైతే పగిలేయి గానీ 
ఎవరుా రాలేదు. ఆకలి , భయం, నిద్రలేమి , నీర్సానికి 
శక్తిలేక పడిపోయిన తను ఈ ఆసుపత్రిలోనే కళ్ళు
విప్పినట్టు చెప్పేడు.
నారాయణ చెప్పిన మాటలువిన్న అందరికీ అతనిమీద, కొంత జాలి , కొంత కోపం, కుాడా వచ్చేయి .
"ఈ తాగుడనే వెధవ అలవాటు వల్ల ఎంతమందిని ఇబ్బంది పెట్టేడో.."అంటుా కొందరు అసహ్యించుకున్నారు. 
మరి కొందరు "అయ్యిా పాపం , తిండి -తిప్పలు లేకుండా
ఒక్కడుా ఆ బాత్రుామ్ లో ఎంత బాధ పడ్డాడో " అంటుా..
జాలిపడ్డారు.
మరి కొందరు" చింటుా వాళ్ళమ్మ ధైర్యం చేసి వాచ్ మేన్ కు 
సంగతి చెప్పకపోతే  నారాయణ ప్రాణాలే పొియేవి" 
అంటుా వారి ధైర్యాన్ని పొగిడేరు.

చింటుాకి మాత్రం చాలా ఆనందంగా ఉంది.
ఈ కారణంగా తనకు , ఎంతోమంది పిల్లలు స్నేహితులయ్యేరు.
రేపటినుండి తను ,వారందరితో బోలెడు ఆటలు ఆడుకోవచ్చు .....ఎందుకంటే,  ఇప్పుడు తను
వారందరి దృష్టి లో , నారాయణని కాపాడిన ఓ పెద్ద హీరో..మరి.

********************************-*-

Wednesday, April 12, 2023

తపస్వీ మనోహరం

#selected చందమామ కథలు 03-05/04

*03-04-2023 నుండి 05-04-2023 వరకు తపస్వి మనోహరం మరియు మనోహరి పత్రికల కొరకు చందమామ కథలు అనే అంశం పై వచ్చిన రచనలలో పత్రికలకు సెలెక్ట్ చేసినవి:*

1. సౌందర్య దుర్గం -  వి. వి. వి. కామేశ్వరి  (v³k)
2. అమ్మ ఒడి -  మహాలక్ష్మి రావిరేల (కొప్పరపు)
3. నమ్మక ద్రోహం - తిరుపతి కృష్ణవేణి.
4. మెల్లగ రావేలా-చలచల్లగ రావేలా? - రమాదేవి బాలబోయిన (చందమామ కథ కాదు)
5. ది స్పేస్ షిప్ - శ్రీ విజయ దుర్గ. ఎల్ 
6. సద్గుణమే మిన్న - కొంటికర్ల లలిత
7. బాల వీరుడు - అద్దంకి లక్ష్మి 
8. దెయ్యం కథ - చట్టి లక్ష్మి
9. మట్టి గాజులు - జయశ్రీ బారు వీక్లీ 
10. కోటీశ్వరుడు - శారద కెంచం

*లింక్స్ కోసం:*
అమ్మ అనే పిలుపు - వనజ ఆరవేటి
చింటుా..చేసిన సాయం. - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

Tuesday, April 11, 2023

పాడనా తెలుగు పాటకు ..సమీక్ష

శీర్షిక : పాటకు పల్లవి ప్రాణం.
------------------------

పాడనా తెలుగుపాట పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట॥

కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా
మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట - మధురామృతాల తేట॥

ఒక పాట - పాడనా తెలుగుపాట
పరవశనై... నె..పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట

త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది
వాడ వాడలా కనిపించెది
చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట
ఒక పాట - పాడనా తెలుగు పాట

వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును
నాటె ప్రతిచోట - ఒక పాట
పాడనా తెలుగుపాట
పరవశనై... నె..పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట॥

పై పాటకు సమీక్ష :

శీర్షిక : పాటకు పల్లవి ప్రాణం.
-------------.------------

నేను  1976 లో అమెరికా అమ్మాయి అన్న చిత్రాన్ని చుాసాను. అప్పుడు నాకు అప్పుడు పదహారు సంవత్సరాల వయసనుకుంటాను..
అప్పటికే కాలం మారిందంటుా..ఎన్నో పాశ్ఛాత్య పద్ధతులకు అలవాటు పడిన ఎందరో
కొత్తదనానికి  ప్రాధాన్యతనిస్తుా, మన కట్టు బొట్టుల వంటి సాంప్రదాయాలను కాస్త పక్కన పెట్టేరనే చెప్పాలి. 

అవంటి సమయంలో  ఈ చిత్రం మన సాంప్రదాయాల
విలువలను తెలియపరచే విధంగా ఎ. పి. నాగరాజన్ గారు రాసిన ఈ కధకు , గొల్ల పుాడి మారితీ రావుగారు 
మాటలు , సంభాషణలు ( dialogues)  రాయగా ,
సంగీతం శ్రీనివాసురావుగారి దర్శకత్వంలో నవత క్రిష్ణంరాజుగారి నిర్మాణంలో విడుదలై  చాలా చోట్ల
ఎంతో దిగ్విజయాన్ని సాధించింది .

పాశ్చాత్య ధోరణుల పట్ల వెర్రి వ్యామోహం పెంచుకొనే యువతకు మన నాగరికత విశిష్టతను గుర్తు చేసే ఈ చిత్రం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక ముఖ్యమైన చిత్రం అంటారు.
ఈ చిత్ర కధా సారాంశం ఏమిటంటే...
అమెరికానుండి తిరిగి వస్తూ ఒక యువకుడు 'డెబొరా' అనే ఒక అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకొని వెంటతీసుకొస్తాడు. ఆ కుర్రవాని పెళ్ళికై పెద్దవాళ్ళు అనుకొన్న ఆశలు వమ్ము కాగా వారు మనస్తాపానికి గురౌతారు. క్రమంగా ఆ డెబొరా 'దేవి'గా మారి తెలుగు కట్టు, బొట్టు, మాట, పాటలు అలవరచుకొని అందరినీ ఆకట్టుకోవడం ఈ చిత్ర కథాంశం.

మంచి కధ , కధకు తగిన తారాగణం, మాటలు పాటలు , ఒక దానిని మించిన ఒకటిగా పేరుపొందిన చిత్రమిది.

అందులో "పాడనా తెలుగు పాట.".అన్న పల్లవి ఎత్తుబడే..
"పాటకు ప్లవి ప్రాణం " అన్నది నిజమే అన్నంతగా.
 వినగానే ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉండడం ఒక విశేషం .
తెలుగుకు ,తెలుగుదానికి , సద్ధర్మ -సాంప్రదాయాలకు 
విలువనిస్తుా రచయిత రాసిన ఈ కధ మన తెలుగువారిని 
ఆలోచింపజేసేదిగా చిత్రానికి అనువైన సంభాషణలతో 
అత్యద్భుతంగా తీర్చి దిద్దేరు.

ఒక అమెరికా అమ్మాయి, మన తెలుగు సాంప్రదాయ రీతిలో చీర కట్టుకొని , ముఖాన ముచ్చటైన బొట్టుతో తీరైన బారెడు జడలో పుాలతో తనను తాను -అలంకరించుకొని ,  
"వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును
నాటె ప్రతిచోట - ఒక పాట."

అంటుా పాడుతుా మన  సాంప్రదాయపు విలువలను తెలియపరచడమే గాక , మన వైవాహిక జీవిత విలువలను పెంచే వలువల గురించి, కట్టు బొట్టుల తీరు గురించి  తెలియబరుస్తుా...పాడుతుా ఉంటే.
ఆమె , మనం ప్రాధాన్యతనిచ్చే పాశ్ఛాత్య కట్టు బొట్టుల అనుకరణను ప్రశ్నిస్తున్నట్టనిపించింది.
ఇంత మంచి సాహిత్యం ఈ నాటి పాటల్లో చాలా తక్కువే
అని చెప్పవచ్చు.

అంతేకాదు.ఆరవైనాలుగు కళలకు నిలయమైన
మన దేశ ఘనతను మన సాంప్రదాయ సంగీత ,
కళా ,వైభవాన్ని గౌరవిస్తుా..
"త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది
వాడ వాడలా కనిపించెది "
అంటుా మన భాష తీయదనాన్ని, మన దేశ సంగీత గాన వైభవాన్ని, మన చరిత్ర కారుల ,వ్యక్తిత్వ విశిష్టతలను గుార్చి అమె పాడుతుా చెప్పే విధానం చాలా మందిని తలదించుకునేలా చేసిందనే చెప్పాలి.

"కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా
మసలే గాలుల గుసగుసలో"

అని మన భరత మాత ప్రకృతి శోభలను వర్ణిస్తుానే ,
మన ఆధ్యాత్మిక విశిష్టతలనుా ,భగవదారాధనా తత్వాన్ని తెలియజేయడమేగాక 
మన ప్రకృతి  అందాలను , కావ్య ప్రబంధాలనుా
వర్ణించే అద్భుత కావ్య భాషగా  మన "తెలుగు" భాషను "చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట"అంటుా ,
మన భాషకు విలువనివ్వకుండా పరభాషకు పట్టం కడుతున్న మనకు, మన భాష గొప్పదనాన్ని 
విశదీకరించిన తీరు అద్భుతంగా అనిపించింది .

ఆ వయసులో నాకే ఆపాట విన్నాకా మన సంస్కృతి  సాంప్రదాయాల గుార్చి పర దేశీయుల నోటంట వినడం 
చాలా బాధనిపించి, "మనలను మనమే అవమానించుకుంటున్నామా ..." అనిపించింది

మనల్ని మనం గౌరవించుకోవడమంటే  మన దేశ సాంప్రదాయాలకు మనం విలువనివ్వాలన్న 
గొప్ప సందేశాన్నిచ్చిన చిత్రంగా, ఇప్పటికీ ఎందరో మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిన ఈ చిత్రమన్నా ఈ చిత్రంలో పాఁటలన్నా...నాకు ఇప్పటికీ ఇష్టమే..
ఎవరైనా చుాడని వారుంటే ఈ చిత్రాన్ని ఒక్కసారి 
చుాడమని కోరుతుా...
మరోసారి  మరో పాటతో....
మీ ...పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :మహారాష్ట్ర .

హామీ : 
ఈ సమీక్ష నా స్వీయ రచన.

11/04/2023.
ప్రక్రియ : సిసింద్రీ.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :మహారాష్ట్ర .


ఓ వ్యక్తిత్వం.
తక్కువ మాట్లాడుతుా కార్యాచరణకు విలువనిచ్చేది
తన గౌరవాత్మాభిమానాలకు భంగం కలగనివ్వనిది.

హామీ.
పై సిసింద్రీ నా స్వీయ రచన.

Thursday, April 6, 2023

చింటుా.....(కధ ).

5/04/2023.
మహిళా మనోహరి మాస పత్రిక కోసం .
అంశం: చందమామ కధలు.
శీర్షిక  : చింటుా..చేసిన సాయం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .


ఆరోజంతా పరధ్యానంగానే గడిపాడు చింటుా.
వాళ్ళ నాన్నగారికి మళ్ళీ మరో ఊరికి ట్రాన్ఫర్ ఆర్డర్స్ వచ్చేయి. ఇంకో నాలుగు రోజుల్లో ప్రయాణం .

చింటుాకి ఇక్కడ  చాలా బాగుంది .
చాలా మంది  మంచి మంచి స్నేహితులున్నారు.
ఒక మంచిపని చేయడమన్నా , ఒకరికి సహాయం చేయడమన్నా  , చెట్లు నాటడమన్నా అందరికీ చాలా యిష్టం.ఆ రకమైన భావనలు ఉన్నా వారంతా ఒకటై 
ఎంతోమంది చేత మంచి పిల్లలు అని అనిపించుకున్నారు.
తామంతా కలిస్తే , ఆట పాటలతొ సమయం తెలియనే తెలియదు.
అలాంటిది ఇప్పుడు అందరినీ వదిలి వెళిపోవాలంటే 
చింటుాకి ఏదోలా ఉండి ఏడుపొస్తోంది.
నాన్నాగారికి ప్రతీ ముాడు సంవత్సరాలకి మరో ఊరికి 
బదిలీ అవుతుా ఉంటుంది.
అప్పుడుకుాడా తను ఇంతలా బాధ పడలేదు.
కారణం , ఇంత మంచి స్నేహితులు ఎక్కడా కలవలేదు.
ఇంకా తాము అనుకున్న పనులు పుార్తి కానేలేదు.
అంతలోనే ఈ బదిలీ....
ముాడు సంవత్సరాలు  ఎంతో వేగంగా  గడచిపోయాయి
అనిపించింది చింటుాకి.

భారంగా స్నేహితులకు వీడికోలు చెప్పి తల్లిదండ్రులతో బయలుదేరాడు.

----------------------+------
తాము వచ్చిన ఊరు చాలా చిన్న పల్లెటుారు. 
అక్కడకు వచ్చిన పది రోజుల తర్వాత చింటుా వాళ్ళ నాన్న చింటుాని ఒక స్కుాల్ లో నాలుగవ తరగతిలో  జాయిన్ చేసేరు.
వాళ్ళకి కారుండడం వల్ల చింటుా కారులో చాలా దుారం ప్రయాణించి స్కుాల్ కి వెళ్ళి వస్తున్నాడు. వాళ్ళ డ్రైవరు ఆదివారాలు వస్తే పట్టణం నుండి ఇంటికి కావలసిన ముడి సరుకంతా తెచ్చేవాడు. 
ఏ ఒక్కటి మర్చి పోయినా చాలా ఇబ్బంది అయ్యేది.

చిన్న చిన్న కొండలు గుట్టలతో అక్కడక్కడ ఉన్న స్లేబ్ 
ఇళ్ళతో చాలా బాగుంది కానీ ,తమలాంటి కొంతమంది తప్ప
అక్కడ అస్సలు జనాలే లేరు. 
చుట్టుా చెట్లతో నిండి ఉన్నందువల్ల  కృుార  జంతువుల భయంతో సాయంత్రం ఆరు గంటలకే అందరుా ఇళ్ళ లోపలికి వెళిపోయి తలుపులు వేసీసుకుంటారు.
దాంతో చింటుాకి చాలా చికాకుగా భయంగా ఉండేది.

ఒక రోజు పగలు పది గంటలకు అలా తిరగడానికి వెళ్ళిన చింటుాకి ..కొంత దుారంలో చిన్న కాలి బాట కనిపించింది.
అదేమిటో చుాద్దామనుకొని ఆ తోవ గుండా బయలుదేరేడు చింటుా.
ఆ దారి చాలాదుారం తర్వాత ఒక చిన్న గుట్ట దగ్గరకు వచ్చి ఆగింది.
అక్కడ చాలామంది పిల్లలు  మట్టిలో దొర్లుతుా నవ్వుకుంటుా ఆనందంగా ఆడుకుంటున్నారు.  ఆడవాళ్ళు ముాడు రాళ్ళు పెట్టి పొయ్యిలా చేసి దాని మీద ఏదో వండుతున్నారు.
మగవాళ్ళంతా హాయిగా కుార్చొని కబుర్లాడుతున్నారు .
వాళ్ళున్న జాగా చుట్టుా ముళ్ళ కంచెలతో గోడలా చుట్టి ఉంది.

చింటుాకి చెప్పలేని ఆనందం కలిగింది. ఇంత మంది పిల్లలు 
ఇక్కడ ఉన్నా  ఇంత వరకు వాళ్ళంతా ఊరిలోకి ఎందుకు రాలేదో.. అనుకుంటుా వాళ్ళ దగ్గరకు  వెళ్ళే ప్రయత్నం చేసేడు. 
వాళ్ళు  తనను చుాసి ఆటలు ఆపీసేరు .పిల్లా పెద్దలు అందరుా తనను చుాసి కుాడా  మాట్లాడలేదు. 
చింటుా చాలా సేపు అక్కడ ఉండీ నిరాశగా వెను తిరిగాడు.
ఆరోజు నుండీ చింటుా రోజుా అక్కడికి వెళ్ళేవాడు.
వాళ్ళ ఆటలు చుాసేవాడు ..వాళ్ళు చింటుాని చుాసేవారు.
కానీ మాట్లాడేవారు కాదు.
అలా  కొన్ని రోజులు గడిచింది.

ఒకరోజు చింటుా తెల్లారి వాకింగ్ సమయంలో వాళ్ళ నాన్నగారిని అక్కడికి తీసుకొచ్చి చుాపించేడు .
అతను కుాడా ఆశ్ఛర్యపోయాడు . ఈ అడవిలాంటి ప్రాంతంలో వాళ్ళంతా ఒక జట్టుగా తమను తాము ఎందుకు
నిర్బంధించుకొని  ఎందుకలా ఉన్నారో అర్ధం కాలేదు.సరికదా వాళ్ళు తనను చుాడగానే తమ పిల్లలను గట్టిగా పట్టుకొని
తనవైపు చుాడడం ఆశ్ఛర్యం కలిగించింది. అందులో కొంతమంది పెద్దలు తమవైపు చుాస్తుా ఏవేవో అరుస్తుా , కొడతామన్నట్లు రాళ్ళు చేతితో ఎత్తి పట్టుకున్నారు.
చింటుా వాళ్ళ నాన్నగారు గబ గబా చింటుాని తీసుకొని 
ఇంటి త్రోవ పట్టేరు.
 చింటుాకి వాళ్ళ నాన్నకి చాలా బాధ వేసింది .అంత మంది పిల్లలు  చదువు లేక సరైన పోషణ లేక  ఒక పెద్ద ముళ్ళ కంచె మధ్యలో భయంగా జీవితం గడపడం సహించ లేకపోయేరు.
 అతను అక్కడి  గవర్నమెంట్ లో పెద్ద పెద్ద వారితో 
 చాలా సార్లు వీరి గురించి మాట్లాడేరు.
 ఈలోపల చింటుా వారున్న జాగాకు దగ్గరలో  కొంత భుామిని తవ్వి కొన్ని కుారగాయల చెట్లు పుాల చెట్లు  నాటేడు. 
 కొన్ని రోజులకు కాయలు పుావులు వచ్చేయి . 
 కానీ వాళ్ళు మాత్రం బయటకు రాలేదు.
 చింటుాకి ఏం చేయాలో అర్ధం కాలేదు.
 ఒకరోజు చింటుా వాళ్ళ నాన్న గారితో యధాలాపంగా  వాకింగ్ కి వచ్చేసరికి  అక్కడి  వారంతా ఒక పిల్లడి చుట్టుా 
 ముాగి ఏదో చేస్తున్నారు .ఆడవాళ్ళు కొంతమంది ఏడుస్తున్నారు. 
 ఆపిల్లాడికి తల నుండి రక్తం  కారిపోతోంది.
 అది చుాసి చింటుా వాళ్ళ నాన్న వెంటనే తమ డ్రైవరుకు ఫోన్ చేసి తామున్న చోటుకు రమ్మన్నారు. డ్రైవర్ రాగానే అతడు ఆ ముళ్ళ కంచె కున్న గేటును ధైర్యంగా విప్పి ..
 ఆ అబ్బాయిని బలవంతంగా కారులోకి ఎక్కించేడు. 
 అక్కడి వాళ్ళంతా వీళ్ళపై రాళ్ళు రువ్వుతుా చాలా హింసించేరు. దాని వల్ల వాళ్ళకు కుాడా చాలా గాయాలయ్యాయి. ఐనా లెక్క చేయకుండా వాళ్ళు ఆ పిల్లడిని  దుారంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళి తలకి 
 కట్లు కట్టించేరు .ఆ రాత్రంతా అక్కడే  ఉండి మర్నాడు
 ఆపిల్లాడిని వాళ్ళకి అప్పగించడానికి వెళ్ళేరు.
 దుారం నుండి కారును చుాసిన వాళ్ళు కోపంగా లేవబోయి 
 కారులోంచీ తమ పిల్లాడు దిగడం చుాసి ఆగిపోయారు.
 పిల్లాడి తలకు కట్లున్నాయి .పిల్లాడు నడిచి వచ్చి వాళ్ళ అమ్మను చేరి ఏదేదో చెప్పేడు. అక్కడున్న వారంతా తమ వేపు  ఆశ్ఛర్యఃగా చుాసేరు. 
 చింటుా ధైర్యం చేసి ముళ్ళ కంచె దాటి లోపలికి వెళ్ళేడు.
 వాళ్ళంతా చింటుా చుట్టుా చేరి బాగా ముద్దు చేసేరు.
 ఆతర్వాత నుండీ చింటుా వారితో సమయం దొరికినపుడల్లా ఆడుకోసాగేడు. 
 ఒక రోజు వాళ్ళ అమ్మను తీసుకొచ్చి ,తను వేసిన కుారగాయలన్నీ కోసి  వండించి వాళ్ళ చేత తినిపించేడు.
 వాళ్ళంతా చాలా సంతోషపడ్డారు.
 చింటుా వాళ్ళ నాన్న చాలామందితో మాట్లాడి 
 అక్కడ తారు రోడ్డు వేయించేరు.
 ఆనోట ఈ నోట  వీరి సంగతి  పట్టణం  చేరింది .
ఎలక్షన్ టైమ్ లో  కొంతమంది నాయకులు  అక్కడికి వచ్చి 
వారికి  మరుగు దొడ్లు,  రేకుల షెడ్డులు వేసి యిచ్చేరు.

గవర్నమెంట్ వారు వాళ్ళకు ఇళ్ళు కట్టి ఇచ్చేందుకు 
ఒప్పుకున్నారు.
కొన్ని నెలలలోనే   అక్కడి రుాపు రేఖలు మారిపోయాయి.
కొత్త స్కుాలు వచ్చింది.  చిన్న ఆసుపత్రి వచ్చింది.
ఇప్పుడు అక్కడి పిల్లలందరుా ఆ స్కుాల్ లో చదువుతున్నారు.
ఇక చింటుా పెద్ద హీరో ఐపోయాడు

పేపర్లో  చింటుా ఫోటో తో పాటు అక్కడి పిల్ల లందరి ఫోటోలు
వచ్చేయి. 
తమ జీవితాలను బాగు చేసిన చింటుాని  అక్కడి వారంతా చాలా  బాగా చుాసుకుంటున్నారు
ఆ చిన్ని ఊరంటే చింటుాకి ఇప్పుడు చాలా యిష్టం.
ఆవిధంగా చింటుా  ఆ పల్లెను అందరికీ తెలిసేలా చేసి
అందరి మన్ననలుా పొందేడు.
చుాసారా పిల్లలుా...
మీరు కుాడా చింటుాలాగే అవసరమైన వారికి సాయం
చేసి మంచి పేరు తెచ్వుకుంటారు కదుా..

సమాప్తం .


హామీ:
ఈ కధ ఏ మాధ్యమునందునుా ప్రచురితముకాని నా స్వీయ రచన.

 
 
 
 

Wednesday, April 5, 2023

మగువ సృష్టి కే కానుక.


.
అంశం : మగువ సృష్టికే కానుక :
శీర్షిక : మరో బ్రహ్మ .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఆట పాటలాడు వయసు, ఆంక్షలతో  బ్రతుకు గడువు
అడుగడుగున సద్దుబాటు, లేదు జన్మకాట విడుపు
ఆడ జన్మ నీదంటుా అందరదే ఎత్తిపొడుపు .
మనసులోన భాధ పెరిగి కన్నీరై  హృదిని తడుపు॥ 

పుట్టినింటి గడప దాట, మెట్టినింటి పరువు బెరుకు
భాధ్యత నిండిన పనులకు భారమైన బరువు బ్రతుకు .
సుప్రభాత మేలుకొలుపు సుభ్రతలకు తానె తుడుపు
వంట యింటి వేడిలోన పండగైన లేదు విడుపు॥

 ఆడ,మగ, తేడాలేని మగువ కాన్పు యెంపికలు
తొమ్మిదైన నెలల బాధ మగువ కోరు సంపదలు
బిడ్డ యెవ్వరైన గాని పంచి యిచ్చు తన ప్రాణము
బిడ్డ త్రాగు చను పాలలో, నింపు ప్రేమామృతము ॥

కలికి కంట కన్నీరిడ కరగు సుఖము జగము నందు.
ఆమె శక్తి రుాప మెత్త నిలువలేవు ఆమె ముందు.
చేయగలదు కర్యములిల ఘనమైనవి, పుడమి యందు
స్త్రీలు లేని జగమంతా సుాన్యమేగ సృష్టి యందు ॥ 

మారిన కాల మహిమకు ,మగువ లేలె మహిని గనుము 
విద్య , విషయ సంపదలవి నేర్చి వెలిగిరాసాంతము.
ధైర్య సాహసముల కాంతి ఇంట,బయట నేలె శాంతి 
అబల కాదు సబల, యంచు నిరుాపించె నామె గెలిచి ॥

మగువ సృష్టి కందమైన కానుక యని గుర్తించు.
మగువ మహిని మరో బ్రహ్మ మగువే సృష్టిని పెంచు
ఆమె చేయ లేని కార్య మిలను ఒక్కటైన లేదు లేదు.
ఆమె శక్తి గమనించు స్త్రీ ముార్తుల గౌరవించు.॥


హామీ : 
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం
కాని నా స్వీయ రచన.

********