" మాఘ బహుళ చతుర్దశి నాటి అర్థరాత్రి నాడు
శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి, లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
అందుకే, రాత్రి పదకొండు గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రులవుతుంటారు
మరొక కథనం ఏమిటంటే...
ఒకానొక సందర్భంలో భృగుమహర్షి శివుడి దగ్గరికి వస్తాడు. కానీ శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోలేదు. దీంతో కోపోదృక్తుడైన మహర్షి "నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తారట.
ఆ శాపం కారణంగానే శివ లింగాన్ని, శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మొదలైందని చెపుతుంటారు.)"
శివలింగం లో మూడు భాగాలు ఉంటాయంటారు .
బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో,
శివ భాగం మనకు కనిపించే పూజా భాగంగా
శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధంగా ,
నిర్మిస్తారు.
ఈ శివ లింగాల లో కొన్ని ...
స్వయం భూ లింగములు . అవి స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
దైవిక లింగములు : దేవతలు ప్రతిష్ఠించినవి.
రుష్య లింగములు : ఋషులు ప్రతిష్ఠించినవి
మానుష లింగములు : ఇవి మానవ నిర్మిత లింగములు.
బాణ లింగములు : ఇవి నర్మదా నదీతీరాన దొరికే బొమ్మరాళ్ళు.
ఇవిగాక పంచభూత లింగాలుగా వెలసిన ప్రసిద్ధ దివ్య క్షేత్రాలు కొన్ని ఉన్నాయి .అవి...
.
1. తేజో లింగం : అన్నామలైశ్వరుడుగా - అన్నామలైలోనుా,
2. జల లింగం : జంబుకేశ్వరునిగా, జంబుకేశ్వరంలోనుా,
3. ఆకాశ లింగం : చిదంబరేశ్వరునిగా చిదంబరంలోనుా,
4. పృథ్వీ లింగం : ఏకాంబరేశ్వరునిగా - కంచిలోనుా,
5. వాయు లింగం : శ్రీకాళహస్తీశ్వరునిగా - శ్రీకాళహస్తి లోనుా
వెలసి ,మానవ జీవితాలను తరింపజేస్తున్నాడు శివుడు.
ఇక మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ.
ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది
ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజుగా.
ఆ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా ,
శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు, మాఘ మాసంలో వచ్చే మాఘ బహుళ చతుర్దశిని " మహాశివరాత్రి " పర్వ దినంగా హిందువులు ఆచరిస్తుా శివారాధనలు చేస్తారు.
శివరాత్రి రోజు, ఉత్తర ధ్రువం లోని గ్రహ స్థానాలు ఎంతో బలమైనవిగా ఉండి ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి
సహాయంగా ఉంటాయని అంటారు..
మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాల శక్తి ,
ఈ రాత్రి గొప్పగా పెరుగుతుందని ప్రతీతి.
Monday, February 27, 2023
Sunday, February 26, 2023
పారితోషికం.
[25/02, 10:01 pm] Pari
మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు:
ప్రతి నెల మనోహరి పత్రికలో వచ్చిన వాటిలో నుండి ఉత్తమమైన కొన్ని రచనలను సెలెక్ట్ చేసుకుని పారితోషకం ఇవ్వబడుతుంది.
ఫిబ్రవరి మనోహరి రెండవ సంచికలో ప్రచురితం అయిన రచనల్లో, బహుమతి పొందిన చేసిన రచనలు:
*కథలు:*
1. ఓ తండ్రి వ్యధ - కృష్ణ మోహిని ధార్వాడ
2. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష - సావిత్రి కోవూరు
*కవితలు:*
1. మనసు విప్పి చెప్పనీ - పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
2. నూరు శరత్తులు - టీ. వి. ఎల్. గాయత్రి
*Articles:*
1. అరుదైన కళ ఒగ్గు కథ - సుజాత పి. వి. ఎల్
2. బాలలు బరువులు - ఇరువంటి మాధురీ దేవి
కార్టూన్స్: విజయదుర్గ. ఎల్
[25/02, 10:02 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: విజేతలకు అభినందనలు 💐💐.
విజేతలు మీ ఫోన్ పే లేదా gpay నంబర్స్ తెలియచేయగలరు
మహిళా దినోత్సవం..ఆర్టికల్ .
॥
23/02/2023.
మహిళా దినోత్సవం పురస్కరించుకొని *మనోహరి మహిళా మాసపత్రిక* కొరకు
ఆర్టికల్ ....
అంశం:* అన్ని రంగాలలో మహిళలు మాత్రమే బాస్ లు అయితే..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
నాడు ,
నాలుగు గోడల మధ్య సాంప్రదాయాల ముసుగులో
తన అస్ఠిత్వాన్ని కోల్పోయిన మహిళ -
నేడు ,
అనేకమంది సంఘ సంస్కర్తలు, స్త్రీలకు సమాన హక్కులు కల్పించే దిశలో కృషి చేయడంతో ,
భారతదేశంలో మహిళల చరిత్ర కీర్తి కిరీటాల సమాహారమయ్యింది..
ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి కూడా ఒక మహిళే కావడం విశేషం.
పురుషునితో సమానమైన ,హక్కులను సాధించిన స్త్రీలు
పురుషుని కన్నా కొన్ని రెట్ల ప్రతిభను కనబరుస్తుా ఇంటా బయటా కుాడా తమ విధినిర్వాహణలో తమదైన స్థాయిని పటిష్టం చేసుకోవడమేగాక పురుషులను
అధిగమించడంతో, స్త్రీ శక్తి అన్ని రంగాల లోనుా ప్రపంచ వ్యాప్తంగా విజయపథంపై నడుస్తుా తమ "సత్తా" ను చాటుకుంటోంది
ప్రపంచంలో ప్రతి మహిళా ఆమె ఎదుర్కునే పరిస్థితులు ఎటువంటివైనా కానీ తను కన్న కలలు నిజం చేసుకోవడం లేదా చేద్దామనుకున్న పనులు చేసి తీరగలదు.
వివిధ రంగాలలో మహిళలు దేశ సమానత్వానికి ,
అభివృద్ధికై కృషి చేస్తుానే ,చాలా దూరం వచ్చి అనేక రంగాల్లో తమ సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నారు
మానవత్వం నశించిన , నేటి స్వార్ధపుారితమైన ప్రపంచంలో
స్త్రీలే "బాస్ లు ఐతే వారు సాధించే విజయాలు ఎన్నో...
అమ్మగా, ఆలిగా అక్కగా చెల్లిగా ఇంటి ఆడపడుచుగాతమ బాదర్యతలను నిర్వర్తిస్తున్న స్త్రీలు నేడు రాజకీయపరంగా
పుార్తి ప్రపంచాన్నే పరిపాలించగలిగినంత ఎత్తుకు ఎదిగారు.
సంగీత ,సాహిత్య, క్రీడా, రాజకీయ రంగాల లోనే కాక,
విద్యా ,వైద్య ,కర్షక ,కార్మిక ,సిపాయి ,సైన్య ,రంగాల లో తమ శక్తిని తాము నిరుాపించుకొని ,వీరత్వాన్ని , ధైర్యాన్ని ప్రదర్శించ గల సాహసవంతులు స్త్రీలు .
ప్రస్తుత సంక్షోభిత సమయంలో సామాజిక మార్పుకు సారథ్యం వహిస్తూ, ప్రత్యేకంగా నిలిచిన మహిళలు
ఎంతోమంది ఉన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఖగోళ శాస్త్రం, రాజకీయాలు, క్రీడల వరకు, మహిళలు ప్రతి వృత్తిలో ఒక ప్రమాణాన్ని సాధించి. తమ విజయాలతో భారతదేశాన్ని గర్వించేలా చేసిన టాప్ మహిళలున్నారు.
మహిళలే ప్రపంచానికి బాస్ అయితే...
బ్రిటన్ దేశంలో వేసవి సెలవుల్లో బడి పిల్లలకు ఉచితంగా ఆహరం ఇవ్వాలని వేసిన పిటిషన్ వెనక ఉన్న ఒక క్రిస్టినా కాగలదు..
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరా గాంధీ ,భారతదేశపు మొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా పనిచేసిన ప్రధాన మంత్రి కాగలదు..
భూమికి చేరే చివరి క్షణంలో ఫ్లైట్లో సాంకేతిక కారణాల వల్ల మరణించినా "నేటికీ నేషనల్ హీరోగానే
పరిగణింపబడుతుా" భారతీయ సంతతికి చెందిన మొదటి అమెరికన్ వ్యోమగామి ఇంజినీర్ గా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళ..
కల్పనా చావ్లా" కాగలదు.
"భారత మహిళల క్రికెట్ జట్టుకు టెస్ట్ ,వన్డే కెప్టెన్. ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి."మిథాలీ రాజ్" కాగలదు.
ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి మహిళా ఫ్లైయింగ్ ఆఫీసర్ "అంజలి గుప్తా".
మొట్టమొదటి సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తి "ఎం.ఫాతిమా బీవి".
ఇండియన్ ఎయిర్ లైన్స్, మొట్టమొదటి మహిళా పైలట్ "దుర్గా బెనర్జీ". కాగలదు
యుద్ద విమానంలో మొట్టమొదటి మహిళా పైలట్ "అవని చతుర్వేది"కాగలదు
మొదటి మహిళా ముఖ్యమంత్రి "సుచేత కృపలాని" కాగలదు.
భారత మొదటి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి "అన్నా జార్జి".
ప్రపంచ బాక్సింగ్ పోటీలో గెలుపొందిన భారత మొదటి మహిళ "మేరీ కోమ్"
భారతదేశపు మొదటి మహిళా ఆర్మీ కెప్టెన్" లక్ష్మీ సెహగల్"
ఎవరెస్ట్‌ను అధిరోహించిను భారత మొదటి మహిళ "బచేంద్రిపాల్" కాగలదు .ఇలా ఎన్నో రంగాలలో స్త్రీలు నిష్ణాతులు కాగలరు.
ఇలా చెప్పుకుంటుా పోతే భారతదేశపు కీర్తి కిరీటంలో" కలికి తురాయిలై " కాలగమనంలోమరుగు పడిన అట్టడుగు వర్గాలకు చెంది , గుర్తించబడని మహిళలు ఎందరో ఉన్నారు.
అన్నిటా తామై, అన్ని రంగాలలో తామై, సృష్టి కి ప్రతి సృష్టి చేస్తున్న స్త్రీ శక్తిని , అంచనా వేయడం కష్టతరమే.
ఒక స్త్రీ ప్రపంచానికే బాస్ అయితే
అమ్మ ప్రేమ నందించడంతో పాటు అందరినీ సమాన దృష్టి తో పాలించి దేశాన్ని, దేశ ప్రజలను ఉన్నత స్థితికి తేవగలదన్న మాట మాత్రం అక్షరాలా నిజం అనడానికి ఏమాత్రముా సందేహం లేదు. ..
హామీ :
ఈ ఆర్టికల్ నా స్వీయ రచన.
+++++++++++++++++++++++++++++++++
------
Saturday, February 25, 2023
దండకం
అంశం : ఐచ్ఛికం .
శీర్షిక : జ్ఞాన ప్రసుానాంబ దండకం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
జయ,జయ ,జగత్ జ్ఞానప్రసూనాంబికే, అంబికే,
సత్యసంధాయికే, సకల శృష్థ్యాత్మికే ,సర్వసంధాత్రికే ,
భూ,నభో, భువన,సముద్రాంతరవ్యాప్తికే కాళికే ,
వాయురాకాసతేజోవిలాసాంతికే ,దీప్తికే...
చంద్ర,సూర్యాగ్ని సమలోచనావిక్షితే ,సుక్షితే ,
ఇంద్ర, యక్ష్యాది, గంధర్వ ,గణస్తూయకే ,ధ్యాయతే
సర్వ జగన్నాటకాసూత్ర సారాత్మికే శ్రేయసే ,
సకలసౌందర్యతేజోవిరాజాత్మికే, భ్రాజితే |
సర్వ జనమోహ సౌందర్య సారాత్మికే ,చంద్రికే |
సరసమాధుర్య గీతాది నృ శ్చేశ్చికే , స్వశ్చికే |
సౌమ్యే, సింధూరవర్ణే , అనన్యే, శరణ్యే -
గిరిజాంబపూర్ణే , మాతా సువర్ణే
అమోఘాస్థ్థ్రశస్థ్థ్రాది ,పరిపూర్ణమాన్యే , ఓంకారపర్ణే
అణిమద్యష్థసిద్ద్యర్ధ , గుణసారగమ్యే ,సురమ్యే |
పంచ భూతాదివసనే, త్రిలోకాదిమాన్యే.
సాధుజనపూజ్య సంతుష్థ భావే, సర్వజ్ఙే |
శర్వాణి, గీర్వాణీ, మునిరాజయజ్ఙే |
విశ్వాంబికే వేదసారార్ధపరిపూర్ణ శక్త్యాంబికే |
దేవమాతే ధరాద్దురిత శమనాత్మికే, సాత్వికే |
అండ ,పిండాది , బ్రహ్మండ పరిపాలికే కౌళికే |
చండ, ముండాది,మాలాధరే, రౌద్రికే - జ్వలిత-
హ్రీంకారి , ఓంకార బీజాక్షరే భీకరే , అంబ -
శ్రీచక్రరాజేసుపరివేష్థితే , సుస్థితే -హస్త-
పాశాంకుసాదిన్మహా అస్త్ర- శస్త్రాధికే, -అంబికే
చిత్రమాలా విభూషాది రణ ఛండికే, రౌద్రికే
సర్వరక్షాకరే, ప్రళయ బీజాంకురే , గిరీన్మధ్య -
స్థిరే , పురే కైలాశ మల్లే, జన కల్పవల్లే ....
జనని రక్షే, కటాక్షే, కృపాక్షే , వరాక్షే ,
జగద్రక్షకారభయ కారుణ్యహస్తే ,
నమ:స్తే | నమ:స్తే | నమ:స్తే | నమ: ||
అంశం:* అన్ని రంగాలలో మహిళలు మాత్రమే బాస్ లు అయితే..
23/02/2023.
మహిళా దినోత్సవం పురస్కరించుకొని *మనోహరి మహిళా మాసపత్రిక* కొరకు
ఆర్టికల్ ....
అంశం:* అన్ని రంగాలలో మహిళలు మాత్రమే బాస్ లు అయితే..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
నాడు ,
నాలుగు గోడల మధ్య సాంప్రదాయాల ముసుగులో
తన అస్ఠిత్వాన్ని కోల్పోయిన మహిళ -
నేడు ,
అనేకమంది సంఘ సంస్కర్తలు, స్త్రీలకు సమాన హక్కులు కల్పించే దిశలో కృషి చేయడంతో ,
భారతదేశంలో మహిళల చరిత్ర కీర్తి కిరీటాల సమాహారమయ్యింది..
ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి కూడా ఒక మహిళే కావడం విశేషం.
పురుషునితో సమానమైన ,హక్కులను సాధించిన స్త్రీలు
పురుషుని కన్నా కొన్ని రెట్ల ప్రతిభను కనబరుస్తుా ఇంటా బయటా కుాడా తమ విధినిర్వాహణలో తమదైన స్థాయిని పటిష్టం చేసుకోవడమేగాక పురుషులను
అధిగమించడంతో, స్త్రీ శక్తి అన్ని రంగాల లోనుా ప్రపంచ వ్యాప్తంగా విజయపథంపై నడుస్తుా తమ "సత్తా" ను చాటుకుంటోంది
ప్రపంచంలో ప్రతి మహిళా ఆమె ఎదుర్కునే పరిస్థితులు ఎటువంటివైనా కానీ తను కన్న కలలు నిజం చేసుకోవడం లేదా చేద్దామనుకున్న పనులు చేసి తీరగలదు.
వివిధ రంగాలలో మహిళలు దేశ సమానత్వానికి ,
అభివృద్ధికై కృషి చేస్తుానే ,చాలా దూరం వచ్చి అనేక రంగాల్లో తమ సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నారు
మానవత్వం నశించిన , నేటి స్వార్ధపుారితమైన ప్రపంచంలో
స్త్రీలే "బాస్ లు ఐతే వారు సాధించే విజయాలు ఎన్నో...
అమ్మగా, ఆలిగా అక్కగా చెల్లిగా ఇంటి ఆడపడుచుగాతమ బాదర్యతలను నిర్వర్తిస్తున్న స్త్రీలు నేడు రాజకీయపరంగా
పుార్తి ప్రపంచాన్నే పరిపాలించగలిగినంత ఎత్తుకు ఎదిగారు.
సంగీత ,సాహిత్య, క్రీడా, రాజకీయ రంగాల లోనే కాక,
విద్యా ,వైద్య ,కర్షక ,కార్మిక ,సిపాయి ,సైన్య ,రంగాల లో తమ శక్తిని తాము నిరుాపించుకొని ,వీరత్వాన్ని , ధైర్యాన్ని ప్రదర్శించ గల సాహసవంతులు స్త్రీలు .
ప్రస్తుత సంక్షోభిత సమయంలో సామాజిక మార్పుకు సారథ్యం వహిస్తూ, ప్రత్యేకంగా నిలిచిన మహిళలు
ఎంతోమంది ఉన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఖగోళ శాస్త్రం, రాజకీయాలు, క్రీడల వరకు, మహిళలు ప్రతి వృత్తిలో ఒక ప్రమాణాన్ని సాధించి. తమ విజయాలతో భారతదేశాన్ని గర్వించేలా చేసిన టాప్ మహిళలున్నారు.
మహిళలే ప్రపంచానికి బాస్ అయితే...
బ్రిటన్ దేశంలో వేసవి సెలవుల్లో బడి పిల్లలకు ఉచితంగా ఆహరం ఇవ్వాలని వేసిన పిటిషన్ వెనక ఉన్న ఒక క్రిస్టినా కాగలదు..
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరా గాంధీ ,భారతదేశపు మొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా పనిచేసిన ప్రధాన మంత్రి కాగలదు..
భూమికి చేరే చివరి క్షణంలో ఫ్లైట్లో సాంకేతిక కారణాల వల్ల మరణించినా "నేటికీ నేషనల్ హీరోగానే
పరిగణింపబడుతుా" భారతీయ సంతతికి చెందిన మొదటి అమెరికన్ వ్యోమగామి ఇంజినీర్ గా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళ..
కల్పనా చావ్లా" కాగలదు.
"భారత మహిళల క్రికెట్ జట్టుకు టెస్ట్ ,వన్డే కెప్టెన్. ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి."మిథాలీ రాజ్" కాగలదు.
ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి మహిళా ఫ్లైయింగ్ ఆఫీసర్ "అంజలి గుప్తా".
మొట్టమొదటి సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తి "ఎం.ఫాతిమా బీవి".
ఇండియన్ ఎయిర్ లైన్స్, మొట్టమొదటి మహిళా పైలట్ "దుర్గా బెనర్జీ". కాగలదు
యుద్ద విమానంలో మొట్టమొదటి మహిళా పైలట్ "అవని చతుర్వేది"కాగలదు
మొదటి మహిళా ముఖ్యమంత్రి "సుచేత కృపలాని" కాగలదు.
భారత మొదటి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి "అన్నా జార్జి".
ప్రపంచ బాక్సింగ్ పోటీలో గెలుపొందిన భారత మొదటి మహిళ "మేరీ కోమ్"
భారతదేశపు మొదటి మహిళా ఆర్మీ కెప్టెన్" లక్ష్మీ సెహగల్"
ఎవరెస్ట్‌ను అధిరోహించిను భారత మొదటి మహిళ "బచేంద్రిపాల్" కాగలదు .ఇలా ఎన్నో రంగాలలో స్త్రీలు నిష్ణాతులు కాగలరు.
ఇలా చెప్పుకుంటుా పోతే భారతదేశపు కీర్తి కిరీటంలో" కలికి తురాయిలై " కాలగమనంలోమరుగు పడిన అట్టడుగు వర్గాలకు చెంది , గుర్తించబడని మహిళలు ఎందరో ఉన్నారు.
అన్నిటా తామై, అన్ని రంగాలలో తామై, సృష్టి కి ప్రతి సృష్టి చేస్తున్న స్త్రీ శక్తిని , అంచనా వేయడం కష్టతరమే.
ఒక స్త్రీ ప్రపంచానికే బాస్ అయితే
అమ్మ ప్రేమ నందించడంతో పాటు అందరినీ సమాన దృష్టి తో పాలించి దేశాన్ని, దేశ ప్రజలను ఉన్నత స్థితికి తేవగలదన్న మాట మాత్రం అక్షరాలా నిజం అనడానికి ఏమాత్రముా సందేహం లేదు. ..
హామీ :
ఈ ఆర్టికల్ నా స్వీయ రచన.
సిసింద్రీలు
[06/02, 6:08 pm] JAGADISWARI SREERAMAMURTH: 06/02/2023.
"తపస్వీ మనోహరం" పోటీ కొరకు ,
ప్రక్రియ : సిసింద్రీలు. (లఘు ప్రక్రియ).
రుాపకర్త : శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
1. ఓ ఆలోచన .
--------------
మనిషి మస్తిష్కానికి పదును పెడుతుంది
మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంది .
2. ఓ ఆవేశం.
----------
ఆశయ నిర్ణయాలకు ఆనకట్ట వేస్తుంది.
ఆఖరున అంతరాళలో ఆవేదన మిగులుస్తుంది.
3. ఓ మాట తీరు.
-------------
ఎంత మంది మనుషులను దగ్గర చేస్తుందో
ఎంతమంది మనసులను గాయం చేస్తుందో ..
4. ఓ అబద్ధం ...
-------------
శస్త్రమై జీవితాల్ని నాశనం చేస్తుంది.
శత్రువై నీలో మనిషిని హత్య చేస్తుంది.
5. ఓ చరిత.
------------
జీవిత గమనంలో ఆశయాలకై .పోరాటం.
జీవితమంతా ఉద్యమాలతో ముగిసిన కథనం.
6. ఓ భవిత.
-----------
అందమైన కలలతో ఆనంద తీరం వైపు .
అడుగడుగు అవరోధాలకు, అగుపడని గమ్యం వైపు.
7. ఓ రాజకీయం.
---------------
స్వాతంత్ర్యం నిండిన దేశానికి గొడ్డలి పెట్టు.
స్వార్ధ పుారిత నిర్ణయాలకు మనిషి జీవితాలే తాకట్టు.
8.ఓ స్త్రీ.
--------+
కారుణ్య ముార్తిగా మనలను కనిపెంచిన అమ్మ .
కామం నిండిన కళ్ళకు అంగట్లో ఆట బొమ్మ.
9. ఓ పురుషుడు.
----------------
మానవత్వంతో మసలితే మనుషుల్లో దేముడు
మదాహంకారంతో మసలితే , మృగతుల్యుడు .
10. ఓ మనిషి.
-------------
సమత -మమతల బాటలో సాధిస్తాడు విజయం .
సమానత్వ భావనతో మసలితే భుాతలమే స్వర్గం .
హామీ :
పై సిసింద్రీలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని
నా స్వీయ రచనలు.
[24/02, 1:52 pm] JAGADISWARI SREERAMAMURTH: 24/02/2023 :
తపస్వీ మనోహరం కొరకు.
అంశం : సిసింద్రీలు
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
1 . ఓ అవమానం
మనిషిని మానసికంగా కృంగదీస్తుంది.
మానసిక మధనం మనిషి విజయానికి దారి తీస్తుంది ॥
2. ఓ క్రోధం.
తనవారైన హితులను కుాడా దుారం చేస్తుంది.
తన కోపమే తన శతృవౌతుంది. ॥
పొడుపు లథలు
*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *25-02-2023-శనివారం*
అంశము: *బాలసాహిత్యం(జవత్తు పదాలు)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *పొడుపు విప్పవమ్మ!బుజ్జిబొమ్మ!*
ప్రక్రియ: *పద్యము*
*********************
*(1)*
*అర్జనంబు సేయ నదియెంత తృప్తియో!*
*స్వార్జితంబులిచ్చు సంతసములు!*
*గడ్డిమేయదెపుడు గర్జించు సింహము!*
*వర్జితంబు గాదె పరుల సొమ్ము!*
*(2)*
*అన్నలిద్దరుందు రత్యంత బలశాలు*
*లనుజులిద్దరుందు రతని వెనుక*
*మధ్యసోదరుడయి మహినంత గెల్చెను*
*పొడుపు విప్పవమ్మ!బుజ్జి బొమ్మ!*
*(3)*
*పాలు పెరుగు త్రాగి పర్జన్యుడిని గెల్చె!*
*కర్జమేదియైన కన్నడచట!*
*నీతివైపు నిలిచి నిర్జించె నసురులన్!*
*పొడుపు విప్పవమ్మ!బుజ్జిబొమ్మ!*
*(4)*
*ముజ్జగంబులందు ముక్కంటిగా తాను*
*పూజలందుకొనును! భోగమిచ్చు!*
*పుత్రుడాయె తనకు బొజ్జగణపతియే!*
*పొడుపు విప్పవమ్మ!బుజ్జిబొమ్మ!*
*(5)*
*పాలనుండి వచ్చు!పాలకు తోడౌను!*
*పెరిగినంత జిలుక వెన్న వచ్చు!*
*త్రాగినంత మనకు దాహమే తీరేను!*
*పొడుపు విప్పవమ్మ! బుజ్జిబొమ్మ!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
*జవాబులు*
1. --------- (నీతి పద్యం)
2. *అర్జునుడు*
3. *కృష్ణుడు*
4. *శివుడు*
5. *మజ్జిగ*
*నా పొడుపు పద్యాలను ఆదరిస్తున్న కవిమిత్రులు అందరికీ ధన్యవాదనమస్సులు*
--- *వేణుగోపాలుడు*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
అన్ని రంగాలలో మహిళలు మాత్రమే బాస్ లు అయితే..
23/02/2023.
మహిళా దినోత్సవం పురస్కరించుకొని *మనోహరి మహిళా మాసపత్రిక* కొరకు
ఆర్టికల్ ....
అంశం:* అన్ని రంగాలలో మహిళలు మాత్రమే బాస్ లు అయితే..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
నాడు ,
నాలుగు గోడల మధ్య సాంప్రదాయాల ముసుగులో
తన అస్ఠిత్వాన్ని కోల్పోయిన మహిళ -
నేడు ,
అనేకమంది సంఘ సంస్కర్తలు, స్త్రీలకు సమాన హక్కులు కల్పించే దిశలో కృషి చేయడంతో ,
భారతదేశంలో మహిళల చరిత్ర కీర్తి కిరీటాల సమాహారమయ్యింది..
ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి కూడా ఒక మహిళే కావడం విశేషం.
పురుషునితో సమానమైన ,హక్కులను సాధించిన స్త్రీలు
పురుషుని కన్నా కొన్ని రెట్ల ప్రతిభను కనబరుస్తుా ఇంటా బయటా కుాడా తమ విధినిర్వాహణలో తమదైన స్థాయిని పటిష్టం చేసుకోవడమేగాక పురుషులను
అధిగమించడంతో, స్త్రీ శక్తి అన్ని రంగాల లోనుా ప్రపంచ వ్యాప్తంగా విజయపథంపై నడుస్తుా తమ "సత్తా" ను చాటుకుంటోంది
ప్రపంచంలో ప్రతి మహిళా ఆమె ఎదుర్కునే పరిస్థితులు ఎటువంటివైనా కానీ తను కన్న కలలు నిజం చేసుకోవడం లేదా చేద్దామనుకున్న పనులు చేసి తీరగలదు.
వివిధ రంగాలలో మహిళలు దేశ సమానత్వానికి ,
అభివృద్ధికై కృషి చేస్తుానే ,చాలా దూరం వచ్చి అనేక రంగాల్లో తమ సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నారు
మానవత్వం నశించిన , నేటి స్వార్ధపుారితమైన ప్రపంచంలో
స్త్రీలే "బాస్ లు ఐతే వారు సాధించే విజయాలు ఎన్నో...
అమ్మగా, ఆలిగా అక్కగా చెల్లిగా ఇంటి ఆడపడుచుగాతమ బాదర్యతలను నిర్వర్తిస్తున్న స్త్రీలు నేడు రాజకీయపరంగా
పుార్తి ప్రపంచాన్నే పరిపాలించగలిగినంత ఎత్తుకు ఎదిగారు.
సంగీత ,సాహిత్య, క్రీడా, రాజకీయ రంగాల లోనే కాక,
విద్యా ,వైద్య ,కర్షక ,కార్మిక ,సిపాయి ,సైన్య ,రంగాల లో తమ శక్తిని తాము నిరుాపించుకొని ,వీరత్వాన్ని , ధైర్యాన్ని ప్రదర్శించ గల సాహసవంతులు స్త్రీలు .
ప్రస్తుత సంక్షోభిత సమయంలో సామాజిక మార్పుకు సారథ్యం వహిస్తూ, ప్రత్యేకంగా నిలిచిన మహిళలు
ఎంతోమంది ఉన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఖగోళ శాస్త్రం, రాజకీయాలు, క్రీడల వరకు, మహిళలు ప్రతి వృత్తిలో ఒక ప్రమాణాన్ని సాధించి. తమ విజయాలతో భారతదేశాన్ని గర్వించేలా చేసిన టాప్ మహిళలున్నారు.
మహిళలే ప్రపంచానికి బాస్ అయితే...
బ్రిటన్ దేశంలో వేసవి సెలవుల్లో బడి పిల్లలకు ఉచితంగా ఆహరం ఇవ్వాలని వేసిన పిటిషన్ వెనక ఉన్న ఒక క్రిస్టినా కాగలదు..
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరా గాంధీ ,భారతదేశపు మొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా పనిచేసిన ప్రధాన మంత్రి కాగలదు..
భూమికి చేరే చివరి క్షణంలో ఫ్లైట్లో సాంకేతిక కారణాల వల్ల మరణించినా "నేటికీ నేషనల్ హీరోగానే
పరిగణింపబడుతుా" భారతీయ సంతతికి చెందిన మొదటి అమెరికన్ వ్యోమగామి ఇంజినీర్ గా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళ..
కల్పనా చావ్లా" కాగలదు.
"భారత మహిళల క్రికెట్ జట్టుకు టెస్ట్ ,వన్డే కెప్టెన్. ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి."మిథాలీ రాజ్" కాగలదు.
ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి మహిళా ఫ్లైయింగ్ ఆఫీసర్ "అంజలి గుప్తా".
మొట్టమొదటి సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తి "ఎం.ఫాతిమా బీవి".
ఇండియన్ ఎయిర్ లైన్స్, మొట్టమొదటి మహిళా పైలట్ "దుర్గా బెనర్జీ". కాగలదు
యుద్ద విమానంలో మొట్టమొదటి మహిళా పైలట్ "అవని చతుర్వేది"కాగలదు
మొదటి మహిళా ముఖ్యమంత్రి "సుచేత కృపలాని" కాగలదు.
భారత మొదటి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి "అన్నా జార్జి".
ప్రపంచ బాక్సింగ్ పోటీలో గెలుపొందిన భారత మొదటి మహిళ "మేరీ కోమ్"
భారతదేశపు మొదటి మహిళా ఆర్మీ కెప్టెన్" లక్ష్మీ సెహగల్"
ఎవరెస్ట్‌ను అధిరోహించిను భారత మొదటి మహిళ "బచేంద్రిపాల్" కాగలదు .ఇలా ఎన్నో రంగాలలో స్త్రీలు నిష్ణాతులు కాగలరు.
ఇలా చెప్పుకుంటుా పోతే భారతదేశపు కీర్తి కిరీటంలో" కలికి తురాయిలై " కాలగమనంలోమరుగు పడిన అట్టడుగు వర్గాలకు చెంది , గుర్తించబడని మహిళలు ఎందరో ఉన్నారు.
అన్నిటా తామై, అన్ని రంగాలలో తామై, సృష్టి కి ప్రతి సృష్టి చేస్తున్న స్త్రీ శక్తిని , అంచనా వేయడం కష్టతరమే.
ఒక స్త్రీ ప్రపంచానికే బాస్ అయితే
అమ్మ ప్రేమ నందించడంతో పాటు అందరినీ సమాన దృష్టి తో పాలించి దేశాన్ని, దేశ ప్రజలను ఉన్నత స్థితికి తేవగలదన్న మాట మాత్రం అక్షరాలా నిజం అనడానికి ఏమార్తముా సందేహం లేదు. ..
హామీ :
ఈ ఆర్టికల్ నా స్వీయ రచన.
Tuesday, February 21, 2023
దేశభక్తిగీతం.
తల్లి భారతి తరలివచ్చెను
కావ్య మంజరి కవితలా..
మేలు మువ్వల సడుల ,సరిగమ
సప్త స్వర జతి , పదములా.. '' తల్లి ''
సస్యశ్యామల వర్ణమది ఆ
మేని గిరులా ఒంపులూ...
పైరు,పచ్చని చీరకట్టెను ,
ప్రకృతి పడతీ సొంపులూ...
నీలి మబ్బుల కురుల నిండెను
మిణుకుతారల మాలలూ..
సూర్య, చంద్రుల కాంతి కన్నుల
కరుణ నిండిన చూపులూ.. '' తల్లి ''
త్యాగరాయ శ్రీ రామదాసు ,
వాగ్గేయకారుల కీరితీ...
పుణ్యచరితపు మేటి -
రత్నాలాయె ఆమెకు సంతతీ...
గాంధి, నెహృ వంటి నేతలు
నిలుప శాంతీ, సౌఖ్యమూ ..
వీర గతినే పొందు సుతులకు
మాత ఒడి తరుకల్పమూ... '' తల్లి ''
శ్రీనాధుల, క్షేత్రయ్యల పదము-
బంగరు మకుటమూ...
విజయనగరా..కాకతీయుల
ఖ్యాతి రత్నపు పీఠమూ...
వీర పురుషుల రుధిర ధారలు
భరతమాత సుచరితమూ ..
పుడమి తల్లికి నుదుటి బొట్టై
వెలిగె ధర్మపు చక్రమూ... '' తల్లి ''
మూడురంగుల మూలమైనది
శాంతి ,ధర్మ ,సుసత్యమూ..
ఎగిరె నదిగో రాజసమ్ముగ
ఒరగనీయకు నిరతమూ....'' తల్లి ''
*****
ఎంత అందమైనది స్వాతంత్ర్యబాలా..
రంగుపూల చీరచుట్టె నీవేళా..
భరతమాత సిగనిండుగ ముద్దబంతులూ
మెడనిండుగ మెరయు చామంతి దండలూ '' ఎంత ''
సూర్యకాంతి పూల పసిమిచాయతో,
ముద్దమందారాలా నుదుటి బోట్టుతో ,
విరిసిన కలువల రేకుల కాంతి కనులతో,
లేలేత గులాబీల అధర సుధలతో '' ఎంత ''
మల్లెలు, మరువము నిండిన నీలవేణిగా..
జాజీ , కనకాంబరాలె మేని సొగసుగా..
పచ్చనీ చేలనడుమ పరిమళాల వీచిగా
పాడి,పంట సొగసుల సంక్రాంతి లక్ష్మిగా.. '' ఎంత ''
జాతి-భేదమెరుగని మన తల్లికిదే స్వాగతం ,
సమత ,మమత నిండిన సుమ-వల్లికిదే స్వాగతం ,
శాంతి - సౌఖ్యాల కల్పవల్లికి సుస్వాగతం ,
క్షమయా-ధరిత్రి భరతమాత కిదే స్వాగతం '' మూడు సార్లు ''
*****
హంకొ మనుకి శక్తిదేన వరస
*****
విశ్వశాంతి నిలుపు శక్తి మదిని పెంచుకో ..
సమత ,మమత వెల్లి విరియు బాట నెంచుకో ''..విశ్వ ''
భేదభావ మెరిగినట్టి స్నేహమెందుకూ...
బాధలోని తోడుకాని బంధమెందుకూ ..
వేదసారమంత ఎరుగ వేడుకెందుకూ..
సాటివారి తూలనాడు చదువులెందుకూ... '' విశ్వ ''
కలసి ,మెలసి శాంతి నిలుపు మంచి మనసుతో ,
చేయి ,చేయి కలిపి నడువు ధర్మనిరతితో..
మన ఝండా కీర్తి నిలుపు , మదిని భక్తితో ..
భరతమాత ఖ్యాతి పెంచు భవ్యచరితలో... '' విశ్వ ''

Monday, February 20, 2023
మత్తకోకిల పద్యాలు మనోహరి మా పత్రిక లో (లింక్ )
https://thapasvimanoharam.com/books/shambo-shiva-shambo18-02-2023/
శివరాత్రి సందర్భంగా తపస్వి మనోహరం రచయిత(త్రు)లు రాసిన కవితల సమాహారం.. *శంభో శివ శంభో* కవితా సంకలనం e-book వెబ్సైట్ లింక్. వెబ్సైట్ నుండి pdf download చేసుకొని చదవవచ్చు.
సంకలనంలో భాగస్వామ్యులైన వారందరికీ మా హృదయ పూర్వక ధన్యవాదములు & అభినందనలు 🙏
Saturday, February 11, 2023
అద్భుత రచన
*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *11-02-2023- శనివారం*
అంశము: *బాలసాహిత్యం(చ వత్తు పదాలు)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *తేల్చి చెప్పవమ్మ! తెలుగు బొమ్మ!*
*********************
*(1)*
*ఇచ్చిన పనినే చేసెను!*
*తెచ్చిన యుంగరము జూపి దీవెనలందెన్!*
*మెచ్చెను జానకి యతనిని!*
*పిచ్చిగ రెచ్చిన యసురుల పీచము నణచెన్!*
*(జవాబు: ????)*
*(2)*
*పచ్చగడ్డి మేసి పాలిచ్చు మనకంట!*
*మచ్చికైన పశువు! మాత మనకు!*
*నచ్చినట్లు మెలగు!నరునకు నేస్తమై!*
*అచ్చమైన అమ్మ! అవనియందు!*
*(జవాబు: ???)*
*(3)*
*తాల్చెను చంద్రుని తలపై!*
*కూల్చెను త్రిపురాసురులను ఘోర రణమునన్!*
*కాల్చెను మన్మథు జ్వాలల!*
*కొల్చిన మోక్షమునిడు!మన కోర్కెలు దీర్చున్!*
*(జవాబు: ???)*
*(4)*
*పిల్చిన తప్పక పలుకును!*
*తేల్చెను గోవర్ధనగిరి తృణమాత్రమునన్!*
*తాల్చును పింఛము తలపై!*
*వేల్చివరల పట్టియూదు వేణువునతడే!*
*(జవాబు:- ???)*
*(5)*
*వచ్చిన కవులను జేర్చుకు*
*నిచ్చిన రచనలను జేయ నిష్టముతోడన్!*
*మెచ్చుక పత్రములిచ్చెడి*
*యచ్చపు సాహిత్య సంఘమది!జూచితిరే!*
*(జవాబు:-???)*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
*(జవాబులు)*
*1.హనుమంతుడు*
*2. ఆవు*
*3.శివుడు*
*4. శ్రీకృష్ణుడు*
*5. మహతీ*
*నా పొడుపు పద్యాలను ఆదరిస్తున్న కవిమిత్రులు అందరికీ హృదయ పూర్వక ధన్యవాద నమస్సులు!*
----- *వేణుగోపాలుడు*
🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹
06/02/2023.
ప్రక్రియ : సిసింద్రీలు. (లఘు ప్రక్రియ).
రుాపకర్త : శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
1. ఓ ఆలోచన .
--------------
మనిషి మస్తిష్కానికి పదును పెడుతుంది
మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంది .
2. ఓ ఆవేశం.
----------
ఆశయ నిర్ణయాలకు ఆనకట్ట వేస్తుంది.
ఆఖరున అంతరాళలో ఆవేదన మిగులుస్తుంది.
3. ఓ మాట తీరు.
-------------
ఎంత మంది మనుషులను దగ్గర చేస్తుందో
ఎంతమంది మనసులను గాయం చేస్తుందో ..
4. ఓ అబద్ధం ...
-------------
శస్త్రమై జీవితాల్ని నాశనం చేస్తుంది.
శత్రువై నీలో మనిషిని హత్య చేస్తుంది.
5. ఓ చరిత.
------------
జీవిత గమనంలో ఆశయాలకై .పోరాటం.
జీవితమంతా ఉద్యమాలతో ముగిసిన కథనం.
6. ఓ భవిత.
-----------
అందమైన కలలతో ఆనంద తీరం వైపు .
అడుగడుగు అవరోధాలకు, అగుపడని గమ్యం వైపు.
7. ఓ రాజకీయం.
---------------
స్వాతంత్ర్యం నిండిన దేశానికి గొడ్డలి పెట్టు.
స్వార్ధ పుారిత నిర్ణయాలకు మనిషి జీవితాలే తాకట్టు.
8.ఓ స్త్రీ.
--------+
కారుణ్య ముార్తిగా మనలను కనిపెంచిన అమ్మ .
కామం నిండిన కళ్ళకు అంగట్లో ఆట బొమ్మ.
9. ఓ పురుషుడు.
----------------
మానవత్వంతో మసలితే మనుషుల్లో దేముడు
మదాహంకారంతో మసలితే , మృగతుల్యుడు .
10. ఓ మనిషి.
-------------
సమత -మమతల బాటలో సాధిస్తాడు విజయం .
సమానత్వ భావనతో మసలితే భుాతలమే స్వర్గం .
హామీ :
పై సిసింద్రీలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని
నా స్వీయ రచనలు.
Monday, February 6, 2023
సిసింద్రీలు.
06/02/2023.
"
ప్రక్రియ : సిసింద్రీలు.
రుాపకర్త : శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
1. ఓ ఆలోచన .
--------------
మనిషి మస్తిష్కానికి పదును పెడుతుంది
మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంది .
2. ఓ ఆవేశం.
----------
ఆశయ నిర్ణయాలకు ఆనకట్ట వేస్తుంది.
ఆఖరున అంతరాళలో ఆవేదన మిగులుస్తుంది.
3. ఓ మాట తీరు.
-------------
ఎంత మంది మనుషులను దగ్గర చేస్తుందో
ఎంతమంది మనసులను గాయం చేస్తుందో ..
4. ఓ అబద్ధం ...
-------------
శస్త్రమై జీవితాల్ని నాశనం చేస్తుంది.
శత్రువై నీలో మనిషిని హత్య చేస్తుంది.
5. ఓ చరిత.
------------
జీవిత గమనంలో ఆశయాలకై .పోరాటం.
జీవితమంతా ఉద్యమాలతో ముగిసిన కథనం.
6. ఓ భవిత.
-----------
అందమైన కలలతో ఆనంద తీరం వైపు .
అడుగడుగు అవరోధాలకు, అగుపడని గమ్యం వైపు.
7. ఓ రాజకీయం.
---------------
స్వాతంత్ర్యం నిండిన దేశానికి గొడ్డలి పెట్టు.
స్వార్ధ పుారిత నిర్ణయాలకు మనిషి జీవితాలే తాకట్టు.
8.ఓ స్త్రీ.
--------+
కారుణ్య ముార్తిగా మనలను కనిపెంచిన అమ్మ .
కామం నిండిన కళ్ళకు అంగట్లో ఆట బొమ్మ.
9. ఓ పురుషుడు.
----------------
మానవత్వంతో మసలితే మనుషుల్లో దేముడు
మదాహంకారంతో మసలితే , మృగతుల్యుడు .
10. ఓ మనిషి.
-------------
సమత -మమతల బాటలో సాధిస్తాడు విజయం .
సమానత్వ భావనతో మసలితే భుాతలమే స్వర్గం .
*****************************************
Subscribe to:
Posts (Atom)