Monday, December 12, 2022

సంగీతనిలయం ..కధ

సంగీతనిలయం '' అన్న బోర్డ్ ని తదేకంగా చూస్తూ ఆప్యాయంగా తడుముతున్నారు రాఘవరావుగారు . అది తమ వంశపారంపర్యంగా వస్తున్న సంగీత రాగనిధికి నిదర్శనం . తమ తాత, ముత్తాతల నుంచీ అందరూ సంగీతకోవిదులే. ఆ తరం కళలకిచ్చే గౌరవాలే వేరు . ప్రతీఇంటా లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉండేది . తెల్లారితే సుప్రభాతం , వేద పారాయణ పఠనం వినిపిస్తూ ఉండేది .చాలాఇళ్లల్లో సంగీతసాధన మొదలైయ్యేది . శ్రావ్యమైన కంఠాలతో పిల్లలు పాడుతూఉంటే , స్నానాది ,సూర్యనమస్కారాలు ఆచరించడానికి చెరువులకు వెళ్లేవారికి వీనులవిందయ్యేది . అప్పటి వాతావరణంలో పెరిగిన పిల్లలందరికీ సంగీత, సాహిత్యాలలో ఒకరినిమించి ఒకరు రాణించాలన్న తపన, పట్టుదల ఉండేవి. అటువంటి వారిలో తనూ ఒకడిగా తాతగారిదగ్గర నేర్చుకున్న సంగీతం తన గళానికే వన్నెతెచ్చింది . సాదరమైన ఆహ్వానాలు , సన్మాలమధ్య , '' సంగీత కళా తపస్వి '' అన్న బిరుదు
మరింత కీర్తిని తెచ్చిపెట్టింది .

తాతదగ్గరే తను పెరిగేడు . తనని కన్న నాలుగేళ్లకే తల్లి కన్నుమూసింది .తండ్రి ఉన్నా లేనట్టే. తనని పట్టించుకున్నవారే లేని సమయంలో తాత చేయూత, అమ్మమ్మ ఆప్యాయతా తనని సాంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దేయి .

తాతయ్య క్రమశిక్షణకి ప్రాధాన్యమిచ్చే మనిషి . వంశపారంపర్యంగా వస్తున్న సంగీతాన్ని సాధన చేస్తూ , పల్లెలోఉన్న చాలామంది పిల్లలకు సంగీతగురువైన తాతయ్యకు , తాను ప్రియశుష్యుడ య్యేడు . రాగం, తానం, ఆలాపన, స్వరకల్పనల మధు రసాలు తనలో వయసుతోపాటు వృద్ధిచెందుతూ వచ్చేయి .

ఆ ఆనందం , సంగీతం పట్ల ప్రజలు చూపించే గౌరవం , సంగీతసభల సుగంధాలు తనలో జీర్ణించుకుపోయాయి . కాలం , కాలంతో పాటు వయసుతెచ్చిన వృద్ధాప్యం తన గొంతుమీద దాడిచేసాయి . ఊపిరినిలిపి పాడడం కష్థం అయ్యింది . కచేరీలు తగ్గేయి . ఈతరం వారి అభిరుచులలో కూడా చాలా మార్పు వచ్చింది . కానీ రాఘవరావుగారి తృష్ణ తీరలేదు . తనపిల్లలకి నేర్పి వారిని తీర్చి దిద్దుదామన్న ఆశ నిరాసే అయ్యింది . తన సహధర్మచారిణి సీతమ్మకి పాటరాదు . అసలు గొంతే పలకదు . కనీసం సంగీతం పట్ల ఆసక్తి కూడా లేదు. పిల్లలకి ఆమె పోలికే... అన్నట్లు , ఎవరి గొంతులోనూ సంగీత స్వరాలు పలికేవికావు . దానితో రాఘవగారు నిరాశ, నిస్ప్రుహలతో మూగబోయారు . దానికితోడు మారుతున్నకాలంతోపాటు మనుషుల అభిరుచులూ, వెకిలి సాహిత్యాల వెర్రికూతలూ, ఆచారవ్యవహారాల అంతులేని మార్పులూ మొగ్గలుతొడిగాయి . జనం పగలబడి ప్రాధాన్యత యిచ్చే పాటలకు సాహిత్యం కరువయ్యేది ,.సంగీతం బరువయ్యేది . రాఘవగారిలాంటి ఎందరికో ఈ మార్పు తీర్పులేని విచారణయ్యేది .

అటువంటి సమయంలో '' కావ్య '' పుట్టుక మహదానందాన్నిచ్చింది . కావ్య..తన మనుమరాలు , అది పుట్టినప్పుడే దాని కంఠంలో సప్తస్వరాల కదలికలు గమనించేరు . పెరుగుతున్న కావ్యతో బాటు అలనాటి సంగీత, సాంప్రదాయ కళా వైభవపు పరిమళాలు ఆమెలో గుప్పించారు .అతని నమ్మకం వమ్ముకాలేదు . శ్రావ్యమైన కంఠం , భగవంతునిమీద భక్తి , పురాణాలపై ఆసక్తి , అన్ని మంచి గుణాలకీ పెట్టయ్యింది కావ్య.

రాఘవగారి వడలిన జవసత్వాలలో బలం పుంజుకొంది . కంఠంలో కరడుకట్టిన సంగీతం కట్టలు తెచ్చుకొని బయటకు వచ్చీ, కావ్య గొంతుకి పదును పెట్టింది . ఫలితం ఎనిమిది సంవత్సరాల కావ్య సంగీతసరస్వతే అయ్యింది . తనుచెప్పిన తన చిన్ననాటి ముచ్చట్లు , కచేరీలు, సన్మాలగురించిన విన్న కావ్యమనసులో చిన్నికోరిక . తనూ కచేరీ చేయాలనీ, తాతయ్యలా చప్పట్లమధ్య కానుకలు గెలుచుకోవాలని .మనుమరాలి కోరిక, తన వాంచ ,తీరేందుకై రాఘవగారు తన సాయశక్తులా ప్రయత్నించీ చివరకు ఒక శ్రీరామనవమి సందర్భం లో కావ్యచే త్యాగరాజకృతులు పాడించేందుకు ఒక సభవారిని ఒప్పించగలిగేరు .

ఆ కాలంలో సంగీతకళాకోవిదులని వెతుక్కుంటూ వచ్చీ సాదరంగా వేదికమీదకు తీసుకువెళ్లేవారు . పాదాభివందనాలు , పూలాభిషేకాలతో పట్టం కట్టేవారు . కచేరీ పూర్తయ్యేదాకా జనం గౌరవంగా కూర్చొనేవారు . కచేరీ పూర్తి అయ్యినతర్వాత పాడినవారి శాంతి మంత్రాలముగింపు తర్వాత భక్తిగా దండాలు పెడ్తూ ఇళ్లకు తిరిగి వెళ్లేవారు . కానీ మారే మనిషి కాలం పేరుతో మన సంస్కృతీ, సాంప్రదాయాలని మూలకి నెట్టివేసేరు . కళాపోషకులు కరువై కళోద్ధరణకి కాకాలు పట్టవలసివస్తున్నాది .

ఆత్మాభిమానం చంపుకొని , మనుమరాలి కోర్కె తీర్చగలుగుతున్నందుకు ఒకపక్క ఆనందంగా ఉన్నా ..మరోపక్క అర్ధిస్తేగానీ అందని అవకాసాన్ని తలుచుకొని కృంగిపోయారు . కానీ మనుమరాలికి వచ్చిన మొదటి అవకాసం దిగ్విజయంగా పూర్తయితేచాలనీ , ఆమె గాత్రం, ప్రతిభ తెలిసినతర్వాత మరెన్నో అవకాసాలు రావచ్చన్న ఆలోచనలు ఆయన్ని రాత్రంతా నిద్రపోనివ్వలేదు . మగతనిద్రలో కావ్య కోకిలకంఠంతో పాడిన కీర్తనలకి , జనాల చప్పట్ల జోరు ,ప్రసంసల హొరుల తీపి కలల మధ్య తెల్లారినసంగతికూడా తెలియలేదు . కావ్యవచ్చీ లేపేదాకా.

గబగబా స్నానం ముగించుకొని పూజగదిలోకివచ్చేరు . పూజగదిలో కావ్య పుత్తడిబొమ్మలాగున్నాది . పట్టుపరికిణీ , జాకట్టు , జడగంటలు పెట్టిన పూలజడ , బంగారు భరణాలతో ,మెరుస్తూంటే , లక్ష్మీ , సరస్వతులు తనయింట నాట్యం చేస్తున్నట్లనిపించింది . ప్రసాంతమైన మనస్సుతో రామష్థ్థోత్తర పూజ ముగించీ, ఆ స్వామివారి కృపాక్షతలను కావ్యపైవేసి మనసారా దీవించేరు.

ఇంటందరికీ ఒకటే హడావిడి . సాయంత్రం కాగానే కావ్యని ముద్దుగా తయారు చేసీ ,సందడిగా బయలుదేరేరు . పాడవిసిన స్థలం దగ్గరవుతున్నకొద్దీ అందరిలో ఒకటే ఆనందం , ఆతృత.
ఎంతమంది వచ్చీ ఉంటారో...కావ్యపాటవిని ఎంత ప్రసంసిస్తారో అనుకుంటూ , హాలులో ప్రవేసించిన వారి కనులకి ఖాళీ జంబుఖానాలూ , కుర్చీలూ వెక్కిరిస్తూ కనిపించేయి . ఎవరో నలుగురు కమిటీ సభ్యులు అటూ, ఇటూ తిరుగుతూ వీరినిచూసీ ,దగ్గరకువచ్చేరు .వారిలోకూడా నిరాస కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాది .

రాఘవగారిలో చిన్ని ఆశ . సంగీతం యిష్ఠం ఉన్న తనలాంటివాళ్లు కొంతమందైనా లేకపోరు . ఇంకా సమయం ఉంది కనకా జనం తాపీగా రావొచ్చన్న ఆశ నిరాసే అయ్యింది . ఏడవుతూండగా మరో నలుగురువచ్చేరు . మరిరారని నిర్ధారించీ కమిటీ సభ్యులు కార్యక్రమం ప్రారంభించమని కోరడంతో , రావుగారు కావ్యవైపు చూసేరు .

ఎంతో ఉత్సాహంతో పదిరోజులుగా తెల్లారి నాలుగు గంటలకే లేచీ సాధనచేస్తూ వచ్చిన కావ్యమొహం చిన్నబోయింది . రావుగారు కావ్య వేపు సూటిగా చూడలేకపోయారు . బోసిగావున్న ఆడిటోరియం తన ఆలోచనలను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాది . తననుతాను సంభాళించుకొని ఒక
ధృఢనిశ్చయానికి వచ్చినరాఘవగారు , కావ్యతో '' ఎవరు విన్నా, వినకపోయినా ఆ శ్రీరామచంద్రులవారు నీ పాట వింటారమ్మా ...మొదలెట్టూ...అనగానే , తాతయ్య మాటలకు ఒక్కసారి ఆ దేవునివైపు చూసి , భక్తిగా నమస్కరించీ ,పాడడం మొదలెట్టింది .

అద్భుతమైన గాత్రం. అనంతమైన స్వర`జ్నానం.గంటసేపు సభాధ్యక్షులని ఏవేవో లోకాలకు తీసుకువెళ్లింది .చప్పబారిన చప్పట్లమధ్య ఎవరో మొబైల్ తో కావ్యని ఫోటో తీసేరు . కార్యవర్గం సభ్యులు వచ్చీ కావ్యచేతికి పూలగుచ్చాన్నిచ్చీ ప్రసంసించేరు . రెండు, మూడు గంటలుసాగవలసిన కచేరీ గంటలో పూర్తయ్యింది జనం లేనందున.

రాఘవగారు కావ్యచూపులని తప్పించుకు నడుస్తున్నారు. పరివారం వైపు చూడడానికే చిన్నతనంగా ఉంది. కొడుకు ఎన్నిసార్లు చెప్పలేదు , నాన్నగారూ.. పాత బాణీలకీ, పద్ధతులకీ ఈరోజుల్లో విలువనిచ్చేవారు ఎవరూ లేరంటూ....
చిన్నారి కావ్యకి తను ఎన్ని ఆశలు చూపించేడు .మన సాంప్రదాయాలకి , సంగీతానికీ మనవాళ్లు ఎంతవిలువనిస్తారో వివరించీ ఎంతలాచెప్పేడు . కానీ తను చెప్పిందేమిటీ ...జరిగిందేమిటీ....ఆలోచిస్తూనే రాఘవగారు కావ్య చేయి పట్టుకొని నడుస్తున్నారు .

రోడ్డుకి అవతలివైపు వేరేచోట రామనవమి సందర్భంగా ఎవరిదో ఆర్కెష్థ్రా తెప్పించినట్లున్నారు . ఈవైపువరకూ నిండిన జనం , ఈలలతో, వాయిద్యాల ఘోషతో రోడ్డు క్రిక్కిరిసి ఉంది .

కావ్యని ఎత్తుకొని , జనాన్ని తప్పించుకుంటూ రావడం లో అప్రయత్నంగా అటువైపు చూసేరు రాఘవగారు . ఆధునాతంగా అలంకరించబడ్డ స్థేజి మీద సీతా,రాముల విగ్రహాలు మూలగా అలంకరించబడ్డాయి . స్ఠేజి మధ్య పాడేవారికోసం మైకులు అమర్చబడ్డాయి . పదిమంది వాద్యబృందాల మధ్య ఒక స్థ్థ్రీ పలుచటి చీరని బొడ్డుకిందకి కట్టీ, లోనెక్ జాకట్టులోని అందాలు వంగి , వంగి మరీ చూపిస్తూ ..అర్ధం , పర్ధం లేని పాటలు పాడుతోంది . ఆమె చేస్తున్న డేంస్కి అనుగుణంగా ,చప్పట్లు కొడుతూ, జనం ఈలలు వేస్తున్నారు .ఒక జునపాల జుట్టాయన చినిగిన జీంస్ , చేతుల్లేని చొక్కాతో అష్థవంకర్లు పోతూ ఆమెమీద పడుతున్నపుడల్లా జనం వెర్రికేకలు వేస్తున్నారు . కెమేరావాళ్ల హడావిడి, వీడియోవారి తోపులతో , మరింత మూలకి జరపబడ్డ సీతారాముల విగ్రహాలు , భక్తిలేని జనాలమధ్య , కాంతిహీనమై వెలవెల పోతున్నాయి . ఈ కాలుష్యాన్ని ఎక్కడ చూస్తుందో నని భయపడ్డ రాఘవగారు కావ్యనెత్తుకొని జనాన్నితోసుకుంటూ బయటపడ్డారు .

పక్కవీధిలో జరిగే కోలాహలంలో ఒకవంతైనా కచేరీ జరిగేచోటికి రానందుకు , మన సంస్కృతి విలువలు తగ్గేయి అనుకున్నారు కానీ మరీ ఇంతలా దగజారిపోయాయా .... అనుకొని , దిగ్భ్ర్రాంతిపడి ,ఆశ్చర్యపోయారు . అలసిన కావ్య భుజమ్మీదే నిద్రపోతున్నాది . ఆమెచేతిలో సభవారిచ్చిన గులాబీ వడలి వాలిపోతున్నాది .

కావ్య మొహం చూసిన రాఘ్వగారి కంట్లో నీరు చిమ్మింది . ఈ చిన్నారికి ఎన్నిమాటలు చెప్పేనూ, ఎన్ని ఆశలు చూపించేనూ ... మొదటిసారే ఘోరంగా విఫలమై , మనసులో తగిలినగాయం ,చిదిమి చీము పట్టదుకదా...

ఆలోచనలతో నిస్థ్ర్రాణ ఆవహించిన రాఘ్వగారు తమ ఇంటి సందులోకి ప్రవేసించీ, మెల్లగా నడవసాగేరు .తమవీధి వేంకటేశ్వర ఆలయంలో స్వామివారి దివ్యమంగళ విగ్రహం చిరుదివ్వెవెలుగులో చిద్విలాసంగా కటకటాలతలుపువెనక కవ్విస్తూకనిపించింది . ఒక్కక్షణం ఆగేరు . రాఘవగారు తప్ప ఆదేవదేవునికి సుప్రభాత, పూజాపునస్కారాలు చేసేవారులేరు . ఏ పండగకో, పుణ్యానికో పక్కవూరి పూజారిగారితో అర్చనలు చేయించుకుంటారు ఆవూరివారు . అయినాసరే స్వామి నవ్వుతూ అలా నిల్చునేవుంటారు . ఈ ప్రజలసంగతి తెలిసినవాడు కనకనే శిలారూపంలో బిగుసుకుపోయాడు .

నిద్రపోతున్న కావ్యని కింద పడుక్కోబెట్టీ, గుడి స్థంభానికి ఆనుకొని కూర్చున్నారు .
కళాపోషణ లేని సంస్కృతికి నిదర్సనంగా దూరంగా మైకులోంచీ బూతుపాటలు వినిపిస్తున్నాయి . ఈలలగోల చీదరపరుస్తున్నాది .

'' ఇదీ ఒకరకమైన కళాపోషణేకదా '' అన్నట్లు స్వామివారి విగ్రహం చిరునవ్వులు చిందిస్తూనేవుంది  .
------------------------- 

రచయిత్రి.
శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------------------------------------------------------


Sunday, December 11, 2022

ఓటు..నోటు. ( కవిత.)

11/12/2022.
శ్రీశ్రీ కళావేదికలో కవితాపొిటీలు
అంశం : ఓటు--నోటు.
శీర్షిక : నేటి భారతం .

రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర  .


మనిషిలో పేరుకుపోతున్న స్వార్ధం
ధన  దాహానికి ఆవిరైపొితున్న మానవత్వం .
తన- పర "ల  బేధాన్ని  మరచిన కాముకత్వం.
మాదక ద్రవ్యాల మత్తుకు చిత్తైపోతున్న జనం ॥

నిరుద్యోగ సమస్యలకు నీరైపోతున్న జీవితాలు
తీరని సమస్యలతో  అడుగడుగున అగచాట్లు 
 ముద్దు మచ్చట్లు తీరక యువత పడుతున్న పాట్లు.
 నోట్ల కొరతతో నోచుకోని సుఖాలకై ఎదురు దాట్లు॥

ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నిండిన ఓటర్లు.
మనుషుల బలహీనతకు "బ్యాలెట్ బాక్స్"లో
 కౌంట్  ఔతున్న ,నోట్లకు అమ్ముడుపోయిన  ఓట్లు   కొడుతున్న సిక్సర్లు.
 ఏకాదశ గ్రహ బలంతో గద్దెనాక్రమిస్తున్న అక్రమ- నాయకత్వాలు ॥
 
నోట్లు ఓట్ల గారడీలో రన్నౌట్ అవుతున్న ప్రజా వికెట్లు .
బౌన్స్ ఔతున్న ధర్మ వ్యవస్థలు ,న్యాయాధికారాలు.
 ఓటింగ్ వ్యవస్థలో అధర్మంతో కుాడిన అస్తవ్యస్థాలు.
 గుర్తింపుకు రాని అబద్ధపు ఓట్లతో గెలుపు పతాకాలు॥

ఓటునమ్మిన నోట్లతో కడుపులు నింపుకునే దైన్యం .
 కాలే కడుపులకు ఐదు వత్సరాల ఎన్నికల సమయం .
మద్యం వేటగాళ్ళకు  మత్తు మందుతో వైద్యం . 
నాయకుడెవరైనా మారనిబ్రతుకుల మండే జీవితం॥

ఇదే ఈనాటి  అవినీతి నిండిన....
చదరంగపు టెత్తులకు సమసిపోయిన నేటి భారతం..
కలలు కల్లలైన ఓడిన నాటి భారతి కన్నీటి కథనం ॥

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.


Saturday, December 10, 2022

బాల సాహిత్యం...




అంశం : బాల సాహిత్యం .
"వ"   గుణింతం .
శీర్షిక  : మంచి మాటలు.

రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర  .

వరుస  పసి తనపు పాలుగారుచుా
వలపు తేనొలుకు మాటలాడుచుా 
వెలుగు కలలలో తేలియాడుచుా
వేడ్క మురిపించు ముద్దు బాలలుా ॥

వచ్చె భానుడదె నిదుర లేవండి
విసుగు మాని ఇక బడికి వెళ్లండి
విద్య విలువనే తెలియరారండి
వందనాలు మీ గురులకిడి రండి ॥

వందనీయులౌ గురుల విడకండి 
వారు చెప్పేటి బాట నడవండి .
వావి వరుసలకు విలువలివ్వండి  
వలయు వ్యక్తిత్వముంచి మెలగండి ॥ 

వెలుగు బాట  విజ్ఞాన మొందగా
విధిగ  విలువైన విద్య నేర్వండి ॥
వరుస గెలుపులను పొంద పోరండి
విమల యశులైన కీర్తినొందండి  ॥

విరులు మాలగా జేసుకొని రండి
విష్ణు  దేవునీ మెడను వేయండి
వేల్పు కొలువులిల అమ్మ నాన్నండి.
వలయు మార్గదర్శకులు వారండి ॥

వేద పాఠాలు వేల గ్రంధాలు
వేల నీతులిడు మలుపు  అందాలు.
వరలు సంపదలు సాంప్రదాయాలు,
వైభవమ్ములిల  జగతి బంధాలు॥

వైరి భావములు విడచి సాగుమా
వృక్ష రాజముల నరక బోకుమా.
వజ్ర వైడుార్యముల వెంట బడకుమా
వరలు సంపదది విద్యయే సుమా॥

వట్టి మాటలిక గట్టిపెట్టుమా
విలువ పెంచు ఘన నీతి నెరుగుమా..
వెన్నెలంటి చిరునవ్వు తోడుగా
విశ్వ హితుడవై నిలచిపోవుమా ॥
[10/12 23:56] +91 99890 18003: 41)
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు మీ 
శీర్షిక  : మంచి మాటలు.
వరుస  పసి తనపు పాలుగారుచుా
వలపు తేనొలుకు మాటలాడుచుా 
వెలుగు కలలలో తేలియాడుచుా
వేడ్క మురిపించు ముద్దు బాలలుా ॥
-------
వజ్ర వైడుార్యముల వెంట బడకుమా
వెన్నెలంటి చిరునవ్వు తోడుగా
విశ్వ హితుడవై నిలచిపోవుమా ॥
👉 వెన్నెల్లో వన్నెల వెన్నముద్దలు మీ అక్షరలయలు. మెదడు మెచ్చుకొను  మంచి ముత్యాలు.అధ్బుతం అభినందనలు 🙏🎉💐💐🎉🙏

బాల సాహిత్యం. " వ " గుణింత పదాలతో....

10/12/2022.
మహతీ సాహితీ కవి సంగమం 

అంశం : బాల సాహిత్యం .
"వ"   గుణింతం .
శీర్షిక  : మంచి మాటలు.

రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర  .

వరుస  పసి తనపు పాలుగారుచుా
వలపు తేనొలుకు మాటలాడుచుా 
వెలుగు కలలలో తేలియాడుచుా
వేడ్క మురిపించు ముద్దు బాలలుా ॥

వచ్చె భానుడదె నిదుర లేవండి
విసుగు మాని ఇక బడికి వెళ్లండి
విద్య విలువనే తెలియరారండి
వందనాలు మీ గురులకిడి రండి ॥

వందనీయులౌ గురుల విడకండి 
వారు చెప్పేటి బాట నడవండి .
వావి వరుసలకు విలువలివ్వండి  
వలయు వ్యక్తిత్వముంచి మెలగండి ॥ 

వెలుగు బాట  విజ్ఞాన మొందగా
విధిగ  విలువైన విద్య నేర్వండి ॥
వరుస గెలుపులను పొంద పోరండి
విమల యశులైన కీర్తినొందండి  ॥

విరులు మాలగా జేసుకొని రండి
విష్ణు  దేవునీ మెడను వేయండి
వేల్పు కొలువులిల అమ్మ నాన్నండి.
వలయు మార్గదర్శకులు వారండి ॥

వేద పాఠాలు వేల గ్రంధాలు
వేల నీతులిడు మలుపు  అందాలు.
వరలు సంపదలు సాంప్రదాయాలు,
వైభవమ్ములిల  జగతి బంధాలు॥

వైరి భావములు విడచి సాగుమా
వృక్ష రాజముల నరక బోకుమా.
వజ్ర వైడుార్యముల వెంట బడకుమా
వరలు సంపదది విద్యయే సుమా॥

వట్టి మాటలిక గట్టిపెట్టుమా
విలువ పెంచు ఘన నీతి నెరుగుమా..
వెన్నెలంటి చిరునవ్వు తోడుగా
విశ్వ హితుడవై నిలచిపోవుమా ॥






Tuesday, December 6, 2022

రుబాయిలు.

[06/12, 12:10 pm] iswar new jio: 06/12/2022..
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం - రుబాయీలు .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


ఎవరికైనా అవకాశమది ఒక్కసారే వస్తుందిగా.
అదృష్టమది  ఉన్నదంటే  నిన్నుకోరే వస్తుందిగా
 మంచినడతది భావితరాల జీవితాలకు మార్గదర్శది
 వ్యక్తిత్వాన్ని చంపుకుంటే కంటనీరే వస్తుందిగా ॥

ఎన్నికలలో  గెలవడానికి ప్రమాణాలిడి మరపిస్తారు 
గెలిచివచ్చీ దేశసంపద  విదేశాలకు తరలిస్తారు 
నాటి నుండీ నేటివరకు బానిసలుగా మనబతుకులు
రాజకీయపు రణనీతితో తమ మాటలను మరలిస్తారు

నేటి చదువులు  ప్రజలమదిలో  అజ్ఞానాన్ని పెంచుచున్నవి
అలోచనలు పెడత్రోవలో సుజ్ఞానాన్ని వంచుచున్నవి.
స్వార్ధం పెరిగి బంధాలనే మరచిపోయే  ముార్ఖుడుమనిషి.
కలికాలమిది బుద్ధిహీనత విజ్ఞానాన్ని  తుంచుచున్నవి॥
[06/12, 2:41 pm] +91 78423 68534: పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు -6
అవకాశం ఒకసారే వస్తుందని, అదృష్టం తనే వరిస్తుందనీ.. రాజకీయం గణనీతి లో మరలిపోయే మాటలే  బాగా వ్రాశారు 🙏💐👌

రుబాయిలు

06/12/2022..
 
అంశం - రుబాయీలు .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


ఎవరికైనా అవకాశమది ఒక్కసారే వస్తుందిగా.
అదృష్టమది  ఉన్నదంటే  నిన్నుకోరే వస్తుందిగా
 మంచినడతది భావితరాల జీవితాలకు మార్గదర్శది
 వ్యక్తిత్వాన్ని చంపుకుంటే కంటనీరే వస్తుందిగా ॥

ఎన్నికలలో  గెలవడానికి ప్రమాణాలిడి మరపిస్తారు 
గెలిచివచ్చీ దేశసంపద  విదేశాలకు తరలిస్తారు 
నాటి నుండీ నేటివరకు బానిసలుగా మనబతుకులు
రాజకీయపు రణనీతితో తమ మాటలను మరలిస్తారు

నేటి చదువులు  ప్రజలమదిలో  అజ్ఞానాన్ని పెంచుచున్నవి
అలోచనలు పెడత్రోవలో సుజ్ఞానాన్ని వంచుచున్నవి.
స్వార్ధం పెరిగి బంధాలనే మరచిపోయే  ముార్ఖుడుమనిషి.
కలికాలమిది బుద్ధిహీనత విజ్ఞానాన్ని  తుంచుచున్నవి॥

వెన్నెముక రైతన్న  మనసదే  బాధగా
బీడైన మట్టిలో  తడన్నదె   లేదుగా
వానకై నిరీక్షణ  , నిరాశదె జీవితం
మట్టిమనిషి మనసులో ఆశన్నది  పోదుగా





Monday, December 5, 2022

శీర్షిక : అమ్మ చేతి బొమ్మలు.

శీర్షిక : అమ్మ చేతి బొమ్మలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

."అమ్మ" అనే ఆడ బొమ్మ
ఆమె ఒడిలో నా జన్మ 
నా జీవిత  గీతనే 
చెరిపి రాయు మరో బ్రహ్మ ॥

అందమైన ఆడతనం 
అమ్మైన నిండుదనం..
బంధమైన ఆనందం  
ఆ నవ్వులె ప్రేమమయం.॥

పేదరికం  అడ్డనదు
బాధన్నది తెలియనీదు
బరువన్నదెంతైన గాని
భారమని  అననిదమ్మ ॥

అమ్మా అన్న పిలుపుకు 
పులకించిన మనసుకు
కష్టమంత ఇష్టమైన 
కన్న ప్రేమ నిండు తనం ॥

కుాటి కొరకు  అగచాట్లు 
అమ్మకవి కావు పాట్లు
పిల్ల కడుపు నింపుదారి 
అమె నడక ఆగదోయి ॥

దేముడు చేసిన బొమ్మ 
దేముడినే మొాస్తున్నదమ్మ
నారు పొిసిన వాడే  నేడు
అమ్మ చేతిలొ బొమ్మైనాడు ॥

విధి ఆడిన ఆటలో  
ఆమె పాత్ర వేటలో 
వేల్పు లామె గంపలో
మట్టి రుాపు చేతలో ॥

గంప బరువు భారమైన
గంపెడంత ఆశ , లోన..
"బెమ్మా"డిన ఆటలోన 
"అమ్మె"గెలిచెనాటలోన ॥

********************

Monday, November 28, 2022

ఓదార్పు..కవిత సున్నితంలో

26/11/2022.
ప్రక్రియ : సున్నితం.
అంశం : ఓదార్పు.
శీర్షిక :    ఓదార్పు కే ఓదార్పు.

(341  to  345.)

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


అప్పుడే పుట్టిన పసికందులకు.
చీకటి నిండిన కన్నులకు
తెలియని  అమ్మొక ఓదార్పు ..-.
 చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
 
 పెరుగుతున్న ధరల బరువుకు
 నిరుద్యోగాల నిరసన బ్రతుకుకు
 కేంద్ర ప్రణాళికలె ఓదార్పు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

వృద్ధాప్యంలో అసహనపు ఆరాటంలొ
కన్నపిల్లల   ప్రేమాభిమానాలు కరువైనపుడు
కన్నీరుతుడిచే  వృద్ధాశ్రమాలు ఓదార్పు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

ఆత్మరక్షణలేని  సమాజంలో ఆహుతౌతున్న
అబలల మానాలు,  ప్రాణాలకు.
మాహిళారక్షణా కేంద్రాలొక  ఓదార్పు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

తడిలేని  మడులలో తలరాతలకు.
 అన్నదాతల  అసక్తతల అక్రోశాలకు
ఆశలునింపే బాసల  ఓదార్పు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

Saturday, November 26, 2022

బాలసాహిత్యం ..."ల " గుణింత పదాలతో

 26/11/2022.
మహతీ  సాహితీ కవి సంగమం .
బాల సాహిత్యంలో ...
"ల"  గుణింత పదాలు.

ప్రక్రియ : బాలలగీతం .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .



లీలా మానుష వేష ధారి యా
.లావణ్య ముార్తీ శ్యామ సుందరుని 
లాహిరి లాహిరి ఈ జగమంతా
లయ కారుని ఘన లీల యిదంతా ॥

లే లేత కిరణాల నుదయించెను రవి
లేపగ వచ్చెను కువ కువ  పిట్టలు
 లేచి నిద్దురదె తెమిలిటు రండీ
లక్షణముగ బడి కెళ్లండి పిల్లలు ॥

లాల పొిసుకొని పాలను త్రాగీ
లంబోదరునికి నమములు జేసి
లాయరు చదువులు చదవండీ
లక్షలు గణించి బ్రతకండీ.. ॥

లోపములను సరి దిద్దు కొనండీ
లోకపు తీరును తెలుసి మనండీ
లోపల నీలో నాలో నుండే 
లోక రక్షకుండొకడే సుండీ ॥

లింగ రుాపుడౌ జంగమ దేముడె
లక్షల రుాపుల కొలువతడండీ ॥
లీలలు చుాపుచు హేలలు చేయుచు
లుప్త రుాపుడై మసలుసుమండీ ॥

లొల్లి చేసెడు దొమ్ముల-దారులు
లోపములవె  దరి రానీకండీ.
లొసుగు జీవితము లోక కంటకము
లొంగి  బ్రతుకుటలె ఒద్దుసుమండీ ॥

లతలు ,పుాలతొ నిండిన  మొక్కలు
లోగిలి యందము పెంచుసుమండీ 
లక్ష్యమునిడి కాలుష్యము బాపగ
లక్షల చెట్లను నాటండీ ॥

లౌక్యముగా భువి  బ్రతుకుట నెరిగీ
లెస్సగు  మాటల నాడండీ.
లలిత కళలకు నెలవైననది మన
 లిపి ,మన భాషదె తెలుగండీ ॥
 
 ‍లేమిని తరిమి కొట్టండీ
లోభిగ బ్రతుకుట మానండీ 
లొసుగు లేనిదే జీవితమండీ
లోకోన్నతులై నిలవండీ ॥


Friday, November 25, 2022

రుబాయిలు

రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :  మహారాష్ట్ర .

1.
నాటి చిత్రాల  సహజనటనలవి, జీవిత గాధలు
నేటి చిత్రాలు తీరేలేనివి , పెరుగును బాధలు
సిగ్గెగ్గులులేని  చిత్రవేధలవి   చుాడదగనివవి
నేటిభవితలను కాలరాసేటవినీతి  బోధలు ॥
2.
సహజమైన సమతలవే  విలువైనవి.
మనుషులలో మమతలవే  కరువైనవి. 
కలిసుంటే సుఖము అన్న , మాటలేదు.
ఈ నాటికి  బంధాలవి చేదైనవి ॥
3.
మనుషులకిల  ఆభరణము మంచిగుణము
సంతృప్తిడు  మానసమే  మెండుధనమ
రుాపానికి వన్నెదెచ్చు అందమవే 
సంప్రదాయపాచరణలె  నిండుతనము ॥
4.
మాటల్లో  తేనెలొలుకు వెన్నుపోటు
రాతల్లో  ద్వందభావ తలపుచేటు
మనుష్యులకు నిలువెల్లా విషమేగా..
వావివరుసలెంచనట్టి  విసపు కాటు ॥
5.
మంచిమార్గ మెంచాలను తలపులేదు.
రచ్చకెక్కు బ్రతుకులన్న  జడుపులేదు
క్రుారత్వమె ఆనందపు  తలపైనది.
 బ్రతుకు చెడెడు పెడత్రోవల విడుపులేదు ॥

Thursday, November 24, 2022

సర్దార్ వల్లభ్ భాయి పటేల్

సర్దార్ వల్లభ్ భాయి పటేల్

31/10/2022.

మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : చిత్ర కవిత.
శీర్షిక  : సర్దార్ బిరుదాంకితుడు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .


 
అహింసా విధానానికి  కట్టుబడి 
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 
భారత పోరాటాన్ని మరింత
 ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ॥

బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి 
నాయకత్వం వహించి విజయవంతం చేసి 
దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు॥

 బార్డోలీ భూస్వాములు పెంచిన 
 పన్నులకు వ్యతిరేకంగా వారి
 ప్రతిఘటనలో పాల్గొన్నారు
 సమర్ధవంతమైన నాయకత్వంతో 
సర్దార్ బిరుదును సార్ధకం చేసుకున్నారు.

భారతదేశ జాతీయవాద 
నాయకుడిగా గుర్తించబడిన వ్యక్తి 
సర్దార్ వల్లభాయ్ పటేల్. ॥

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న
 స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. 
 
దేశప్రజల సంక్షేమం కోసం అనేక
సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 

ఆచరణాత్మక, నిర్ణయాత్మక మరియు
 క్రూరమైన వ్యక్తిగా పరిగణించబడిన 
 వ్యక్తిగా బ్రిటిష్  వారికి  శత్రువైన వ్యక్తి.॥
 
 రాజ్యాంగ రచనలో  ప్రాథమిక హక్కుల
  కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు.
  దేశవిభజన అనంతరం  జరిగిన 
  అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు.॥

భారతదేశపు ఉక్కు మనిషిగా
 పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్
భారత ప్రభుత్వం ద్వారా "భారతరత్న "
బిరుదును పొందిన ఘనుడు.

Tuesday, November 22, 2022

శివుడు.

శీర్షిక : శివుడు.
ప్రక్రియ : వచనం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

పరమశివుని జ్ఞానగురువు అవతారం
 శ్రీ దక్షిణామూర్తి .
"శివ" అంటే సుాన్యమైనదని అర్ధం.
సుాన్యమైన ఈ విశ్వంలో గల 
సకల చరాచర జగత్తును సృష్టించిన వాడు
తిరిగి తనలోనే లయం చేసుకుంటుా
లింగాకారుడై సర్వ వ్యాపియై 
యున్నవాడే  "శివుడు" ॥

త్రినేత్రధారిణి యైన" శ్రీ రాజరాజేశ్వరీదేవి"చే 
సృజింపబడిన త్రిముార్తులలో ఒకడై-
శ్రీరాజరాజేశ్వరీదేవి కోరికమేరకు 
ఆమెతో వివాహానికి అంగీకరించి , 
బదులుగా ఆమె ముాడవనేత్రాన్ని 
వరముగా పొందినవాడు పరమశువుడు॥

వివాహానంతరం అదే ముాడవనేత్రంతో 
శ్రీ రాజరాజేశ్వరీదేవిని భస్మం చేసి 
అదే భస్మంతో దుర్గ, లక్ష్మి సరస్వతీ అనే 
ముాడు శక్తి స్వరుాపాలను సృష్టించిన పరబ్రహ్మానందస్వరుాపుడు శంకరుడు ॥

దుష్ట- శిక్షణ, శిష్ట -రక్షణకై  
కేశవునిగా జగములేలిన
శివ కేశవముార్తిస్వరుాపుడు శివుడు.॥

పరమశివుని ఆకృతిలో .
 శివుని త్రిశూలం సత్వ, రజ,-
 తమో గుణాలకు ప్రతిరూపాలు.. 
ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. 
అతని శిరస్సునలంకరించిన
చంద్రవంక మనోనిగ్రహానికి, తలపైనున్న-
గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీకలు. 
అతని దేహంపై గల సర్పాలు 
భగవంతుని జీవాత్మలుగాను, 
ధరించిన పులి చర్మం  
త్యజించమనే అహంకారానికి,
 ఆశీనంపైన పులిచర్మం కోరికలకు-
 దూరంగా ఉండమన్న సత్యానికి ,
  భస్మం పరిశుద్ధాత్మకు ,  అతను పట్టుకున్న 
  నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, 
  నందీశ్వరుడు సత్సాంగత్యానికి, 
  నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం 
  జ్ఞానానికి ప్రతీకలై విశ్వాన్ని నడిపిస్తున్న
  శక్తి సుాచికలు.॥
క్షేత్ర కారకుడు , క్షేత్ర దర్శకుడు , 
క్షేత్ర పోషకుడైన శివుడు 
  జననమరణాలుకు అతీతుడై-
  వేల నామాలతో స్తుతింపబడుతుా.,
  అనంత రుాపాలతో దర్శింబడుతుా, 
  సృష్టి స్థితి లయ కారక సకారాత్ముడైన
  నిరాకార లయకారుడు పరమశివుడు ॥
  
********************************::

Saturday, November 19, 2022

పేరడీ పాట..( పురుషులపై).

పేరడీ పాట.
దేవదాసు చిత్రంలో 
ఓ ....దేవదా...పాటకు పేరడీ..
రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

ఓ ...పురుష పుంగవా  
గురుతు లేదనే....
భాధెందుకు ఈ రీతి  
అసలు దొరల్లే మాటల కోట ॥
చరణం .
-------
జీవితమే ఓ లడాయిా  .
..ఏమిటినీ బడాయిా
చేతలన్ని చేదైనా మనసు లేని కసాయిా
ఆనాడుా ఈనాడుా అతివల వేటే  
ఆట పాటా ।
ఓ ...పురుష పుంగవా.....

చరణం.
-------
లేదెచటా.... రక్షణ స్త్రీలకుా.. ..
.నీ వెచటా... తగ్గవు హేలకుా
సమానతల మాటలేదు 
సత్యమైన బాట లేదు
ఆనాడుా ఈనాడుా అరటియాకెగా 
 అతివల  బ్రతుకు  ॥

చరణం.
-------
స్త్రీ విలువే తరిగెను ప్రతిక్షణం 
కారణమే పురుషులదౌ అహం
పిల్లా పాపలని చుాడరు
వయసు, బంధ మెరుగరుా
 ఆనాడుా ఈనాడుా 
అతివల వేటే  
(మీ)ఆట పాటా ।...

॥ఓ ...పురుష పుంగవా  
గురుతు లేదనే....
భాధెందుకు ఈ రీతి  
అసలు దొరల్లే మాటల కోట ॥

మత్తకోకిల పద్యాలు . అంశం : పుస్తకం

శీర్షిక: జ్ఞాన పెన్నిధి.

ప్రక్రియ :  మత్తకోకిల పద్యాలు
రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర.



పుస్తకమ్మది పుార్తి జ్ఞానము నిచ్చు పుాజ్యమౌ పెన్నిధి
హస్త మందున భుాషణమ్మిది మస్తకమ్ముల నేలిదీ
నేస్త మైనది శ్రేష్టమైనది  నేర్పు సుాక్తుల స్ఫుార్తిదీ
వాస్తవమ్ముల దెల్పు వాజ్మయ నీతి బోధల బెమ్మిదీ ॥

రాణి వాణికరాబ్జ మేలిన రాసిపోగుల సొమ్మిదీ
బాణి కట్టిన కీర్తు లల్లుచు   భాష లేలిన వాసిదీ
ఆణి ముత్యపు అక్ష రాలకు ఆశ్రయమ్మిడు దాతిదీ
పాణి  భుాషణి పుస్తకమ్మిదె  పాత్ర లేలిన పల్కిదీ ॥

తాళ పత్రపు గ్రంథరాజపు  తావు లేలిన మేటిదీ
మేళ వించిన గద్య పద్యము లేలు మంగళ దీప్తిదీ .
వేళ వేళల మార్పు చెందిన వేల ఠావుల గుత్తిదీ
కాళ రాత్రులజ్ఞాన చీకటి కాల్చు జ్ఞానపు జ్యోతిదీ॥

ఛాత్ర బాలల సవ్యజీవన  ఛాయ యైన సుబోధినీ
స్తోత్ర రుాపిణి భక్త పోషిణి  గాత్ర  జ్ఞాన వికాశినీ
మాత్ర వ్యాకరణీ సుబోధిని మాత అక్షర పోషిణీ
పాత్ర వేదపురాణి వాజ్మయి పాహి పుస్తక రుాపిణీ ॥

కీర్తినేలిన మంత్ర మాతృక సుాక్తి పంక్తుల వేదమా
పుార్తి యొాగపురాణ గీతగ పుాజ లందిన భోగమా 
స్ఫుార్తి సాహితి ఆక్షరాకృతి ముార్తి వాణి సందేశమా
పుార్తి జ్ఞానము నిచ్చు పెన్నిధి పుస్తకమ్మదె మిత్రమా॥


బాల సాహిత్యం ".ర" గిణింత పదాలతో..

బాల సాహిత్యంలో
ర " గుణింత పదాలతో కవిత
శీర్షిక : రోదనొద్దు పిల్లలుా
...
రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర



రోదనొద్దు పిల్లలుా రాగ నిధుల గువ్వలుా
రుగ్మతలకు లోనుగాని మాట వినరె తల్లులుా
రోగాలను రానీయని  అలవాట్లవె  యెంచుదాం
రోజంతా ఆట పాట నవ్వులనే పంచుదాం   ॥

రాగ సుధల తేలియాడు  జీవితమే జీవితం.
రామ నామ తారకమే రక్షణనిడు మంత్రము.
రాశి పచ్చదనపు శోభ, రైతన్నలె మన ధనం.
రాష్ట్ర గీతి దేశ భక్తి మరువకండి యేక్షణం ॥

రాగ ద్వేషమెంచకండి  రగులు జాతి-మత మెంచక
రీతి, నీతి నియమ బాటనెన్నడు విడనాడకండి
రాలుగాయు పిల్లలతో  స్నేహమెపుడు చేయకండి
రచ్చకెక్కు తనము తోడ రక్కసులై మెలగకండి ॥

రోగాలవి చేరువౌను , చెట్లు నరికుటే క్షయం.( క్షయం = విధ్వంసం)
రక్షగ తరులిచ్చు నీకు ప్రాణవాయువనుదినం .
రాగాల సుక- పికాల కువ కువలిడు వసంతం.
రమ్యమైన ప్రకృతిలో ఉంది నిండు ఆనందం ॥

రాత్రి ఉన్న  చీకటంత పగటి వెలుగునౌ మాయం .
రాపిడుల ఆటు-పోట్ల వెంట నుండు సుఖసారం .
రాసిన విధి రాతలే చెరుపు నీదు సంస్కారం
రక్షణదే మంచి విద్యలిచ్చు నీకు జీవితం ॥

రంగులీను ప్రపంచపు రీతి దెలిసి నడవాలి
రాజులాగ బ్రతకాలి రయమున యశమొందాలి.
రుాకలకై స్వార్ధ మెంచి బంధాలను వీడకు
రెక్కల కష్టపు తేనియె ఆత్మ తృప్తినిడు విందు ॥

రోషము జుాపాలి నీవు దేశ ద్రోహు లెదురైతే
రక్త పాతముల దొమ్మిలు రగులకుండ చుాసుకో
రేటు జుాసి ఓటునమ్మి నాయకులనుయెంచకు.
రేయి పవలు నీతి బాట నెంచి విలువ పెంచుకో ॥

రోదనొద్దు పిల్లలుా రాగ నిధుల గువ్వలుా
రుగ్మతలకు లోనుగాని మాట వినరె తల్లులుా
రోగాలను రానీయని  అలవాట్లవె  యెంచుదాం
రోజంతా ఆట పాట నవ్వులనే పంచుదాం   ॥

*************************************:*

24)
శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి గారు మీ 
శీర్షిక : రోదనొద్దు పిల్లలుా

రోదనొద్దు పిల్లలుా రాగ నిధుల గువ్వలుా
రుగ్మతలకు లోనుగా(ని)👉క మాట వినరె తల్లులుా
రోగాలను రానీయని  అలవాట్ల(వె)నె  యెంచుదాం
రోజంతా ఆట పాట నవ్వులనే పంచుదాం   ॥👌👌👌
రాగ సుధల---- 
రాష్ట్ర గీతి దేశ భక్తి మరువకండి యేక్షణం ॥👉 ధ్వని శృతి లయ బద్దం 👌
రేయి పవలు నీతి బాట నెంచి విలువ పెంచుకో 
రోజంతా ఆట పాట నవ్వులనే పంచుదాం   
👉 మీ రచనలో రాగ తానం పల్లవి స్ఫురిస్తున్నాయి. చాలా అధ్బుతంగా రాసారు అభినందనలు 🙏🎉💐

Thursday, November 17, 2022

పుస్తకం పద్యాలు

మహతీ సాహితీ కవిసంగమం
తేది:*16-11-2022*
అంశం : పుస్తకము.
శీర్షిక: జ్ఞాన నిధి

ప్రక్రియ :  ఆటవెలది పద్యాలు
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర.

పొత్త మందుగలవు పొందు జ్ఞాన నిధులు
విత్త మందు లేదు విహిత కర్మ
చిత్త మందు  దలచి చిన్మయానందుని
సొత్తు జేసు కొనుమ పొత్త మదియె ॥

వేల వేల్పు లిలను వెలసేటి చరితలు
గ్వాల గోప బాల లీల ఘనత
జేలు పొందినట్టజేయ ముార్తుల గాథ
లేలు పొత్త మదియె మేలు సుమ్మి ॥

చదువు లెన్నొ చదివి చరిత కెక్కని రీతి
విధము మనిననేమి విశ్వ మందు
అధములౌచు జనులు యాదర్శ ములవీడి
మథన పడిన బ్రతుకు మట్టి పాలు ॥

జ్ఞాన ధనము నొసగి  జ్ఞాన సారము దెల్పు
ధ్యాన ధర్మ బాట ధరణి మనగ
పాన మదియె జ్ఞాన ఫలము పొత్తముసుమ్మి
ఆన, పుస్తకమ్ము యదియె ఘనము॥

******

1️⃣5️⃣

మహతీ సాహితీ కవిసంగమం
తేది:*16-11-2022*
అంశం : పుస్తకము.
శీర్షిక: జ్ఞాన నిధి

ప్రక్రియ :  మత్తకోకిల పద్యాలు
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర.

పుస్తకమ్మది పుార్తి జ్ఞానము నిచ్చు పుార్వపు పెన్నిధి
హస్త మందున భుాషణమ్మిది మస్తకమ్ముల నేలిదీ
నేస్త మైనది శ్రేష్టమైనది  నేర్పు సుాక్తుల స్ఫుార్తిదీ
వాస్తవమ్ముల దెల్పు వాజ్మయ నీతి బోధల బొమ్మిదీ ॥

రాణి వాణియె పట్టి యేలిన రాసిపోగుల సొమ్మిదీ
బాణి కట్టిన కీర్తు లల్లుచు   భాష లేలిన వాసిదీ
అణి ముత్యపు అక్ష రాలకు ఆశ్రయమ్మును ఇచ్చినా
పాణి  భుాషణి పుస్తకమ్మిదె  పాత్ర లేలిన పల్కిదీ ॥

తాళ పత్రపు గ్రంథరాజపు  తావు లేలిన మేటిదీ
మేళ వించిన గద్య పద్యము లేలు మంగళ గౌరిదీ
వేళ లందున మార్పు చెందిన వేల ఠావుల గుత్తిదీ
తాళబ్రహ్మయె రాత రాసిన మేళవింపుల మాలిదీ॥

ఛత్రమైనిల బాల బావిసు గాత్రమై విలసిల్లినా
మిత్ర రుాపిణి స్తొిత్ర పోషిణి  క్షేత్ర  జ్ఞాన వికాశినీ
జైత్ర  యాత్రల జేల నందిన జైసు వాజ్మయి రుాపిణీ
చిత్ర పుస్తక రుాపి చిన్మణి చిహ్న జ్ఞాన ప్రదాయినీ ॥


Tuesday, November 15, 2022

రుబాయిలు

15/11/2022.
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం : రుబాయిలు.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర.


మాయింటి   తోటలో  మొక్కలవి   కొల్లలుగ
పుాసేయి విరివిగా  మొగ్గలవి   మల్లెలుగ.
సువాసన నిండేటి పుాలంటే  ఇష్టమే..
పారిజాత పుాలవి  కురిసేయి జల్లులుగ . ॥

మనుష్యులు స్వార్ధముగ మెలగడమవివేకం    .
 అందరితో   మెళకువగ  మసలడం  వివేకం.
పుడమిలో  అందరం కలిసుంటే  కద సుఖం.
అందుకే హితులతో అవ్వాలి మమేకం ॥

గురుముఖతః  నేర్చేదే  అసలైనది , పాండిత్యం .
సహజంగా   కొందరిదది    అరుదైనది,   వ్యక్తిత్వం .
మనజన్మతః  వచ్చేవవి పుార్వపుణ్య ఫలగుణాలు.
వివేకమే  మనుగడకిల  బలమైనది అస్తిత్వం ॥

********
రచ్చ కెక్కినవి ఎన్నో చరితలు.
 కుాలిపోయాయి ఎన్నో భవితలు 
నేటికీ రాని   నిజ స్వాతంత్ర్యం
కన్నీటి వ్యధల కడు జీవితాలు ॥

 రక్తపు టేరుల రాజ్యాంగాలివి.
 ముక్కలైనట్టి బాల్యాంగాలివి.
స్త్రీ జీవితమే  చిక్కుల వలయం .
 అబలల నణచే ఆధిక్యతలివి ॥

పిల్లలలో కానరాదె పసితనం.
మనుషులలో పెరిగిపోయె స్వార్ధ గుణం .
నీతిలేని నికృష్టపు సమాజమిది 
వావి వరుస మరచితిరే  నేటి తరం ॥

కలలలోన విహరిస్తే  కలసిరాదు నీసమయం.
విధులు నీవి లోపిస్తే కుాడిరాదు నీకు జయం
కష్టపడితె  కనపడునుగ కాంక్షించే  సుజీవితం
మంచిబాట నడవకుంటె  వెంటరాదు కోరు సుఖం ॥


Sunday, November 13, 2022

శీర్షిక : మనుజ తెలుసు కొనుమ మంచి మాట .

శీర్షిక  : మనుజ తెలుసు కొనుమ మంచి మాట .

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆటవెలది..

1

కోర్కె లుండ వచ్చు కోర తగిన యంత
తీరు కొలది కోర్కె  తీరు హెచ్చు
కోర్కె తీరకున్న క్రోధంబు హెచ్చుగా
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
2.
ఆశ పోతు తనము ఆశయ లోపమ్ము
కలుగ జేయు నదియె కడుని రాశ
కడకు కోర్కె తీర కాని పనుల జేయు
లంచ గొండి యైన లక్ష ణముల ॥
3.
పులిని జుాచి నక్క పుార్తివాతల దేలు
చంద మదియె గాద చాలు ఆశ
స్వార్ధ గుణము పెరుగు స్వస్థతేలడు ప్రాణి
మనసు మలిన మౌను మహిని మనుజ ॥
4.
కడకు పతన మొందు  కర్మ మిగులు నీకు
మితము జీవి తమ్ము మిగులు భువిని
కోర్కె యున్న మనిషి కోల్పోవు సుఖమును
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
5.
విద్య లెన్నొ నేర్చి వినుతి కెక్కుము నీవు
జ్ఞాన ధనులు చెడరు జగము నందు
సాహితీ వనమదె సరికోర్కె విహరింప
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
6.
చిన్న తనము యంచు చిన్నతప్పులుజేయ
తప్పు లొప్పు లౌన తప్పు తప్పే.
తప్ప లెంచ నీక తగురీతి మనుటకై
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
7.
విషయ వినయము లవి విద్య తోడనెవచ్చు
సార విద్య నబ్బు సభ్య తిలను.
మంచి మాట నోట మంది మెచ్చిన బాట
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
8.
తల్లి తండ్రి గురువు  తగురీతి బోధించు
చక్క నైన మాట చద్ది ముాట.
అనుభవాలు నేర్పు నవెగాద సుఖబాట
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
9.
ప్రథమ పాఠ శాల ప్రారంభ మింటితో
తోడు తల్లి దండ్రె తొలి గురువులు.
గారవించుమెపుడు ఘనమైన రీతిలో
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
10.
సార మైన బ్రతుకు సజ్జనుండదె కోరు.
సద్గుణములు నేర్వ  సమయ మిడుమ.
సత్య మేగ జయము  సచ్చరిత యెధనము
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥

********************************
11
చిన్న పిల్ల లింట చిందులే యుచునున్న 
ముచ్చటౌను మనకు  ముద్దుమీర.
మాయ లేని వయసు  మంచి మాటలు నేర్పు
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
12.
కట్టు బొట్టు తీరు కడు సభ్యతలకు తోడు
భరత భుామి కీర్తి బడయు వెలుగు
సాంప్రదాయ ములవి సరిధర్మ  పథములు
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
13.
చిన్న వయసయ లోనె సిగ్గు యెగ్గులు నేర్వ
లోక మందు మసల లోటు రాదు.
మితము మాటలాడ మించుగౌ రవమీకు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥

21.
శుద్ధి లేని మాట శుభము నీకదికాదు
మనసు లేని యాత్ర మహిని వమ్ము ॥
బుద్ధి లేని మనసు బుధజను లనుబాయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
22.
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
 పెద్ద వారి మాట చద్ది ముాట
 పెరుగ నీదు విలువ పెంచు జ్ఞాన ధనము
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
23.
పట్టి పట్టి జుాచి పరధర్మ జులరోసి
పెంచ బోకు రణము నెంచు విధము 
మానవత్వ మదియె మనిషి ధర్మ మిలను
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
24.
తేనె లొలుకు పలుకు  తేటగీ తులవిందు
తెలుగు భాష మనది తెలుగు వెలుగు
దేశ భాష , నిండు దేశ భక్తియె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
25.
పచ్చ దనము లెేక ప్రకృతి వికటించ
 ప్రబలె రోగ బాధ ప్రజల లోన
కండ్లు విప్పు మయ్య గావ పుడమి నీవు 
 మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
26.
అడుగు వదల నట్టి  ఆకాస హార్మ్యాలు
తాగు నీరు మురిగె తావు లేక 
జనులు పెరుగ పేరు కలుషితమ్ములుచాల
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
27.
 కోరి చెట్లు గొట్టి  కొండ బండలు జేసి
 కుార్చునున్న కొమ్మ కుాడ నరుకు
 ముార్ఖుడైన మనిషి ముందడుగెటులేయు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
 28.
 గాలి నీరు లేక గతక గింజలు రాక
 మహిని బ్రతుకు లాయె మట్టి పాలు.
 భావి  బంగరు భరత భావించి అడుగేయు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
29.
డబ్బు డబ్బు యంచు గబ్బులో కాలిడీ
కడుగ నీరు లేక కలత చెందు 
కడకు సుఖము లేని కలిమి లేటికి నీకు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
30.
పాడి పంట లెల్ల పరుల కమ్మిన కీడు
పట్టి గొట్టు నిన్ను   పట్టు బట్టి
మాతృ భుామి నీది మర్మ మేటికి నీకు
మనుజ తెలుసుకొనుము మంచి మాట॥


********
మహతీ సాహితీ కవి సంగమం .
28 / 10 / 2022.
అంశం : ఐచ్ఛికం .
శీర్షిక  : మనుజ తెలుసుకొను మంచి మాట. 

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర.

31.
బ్రాహ్మణత్వ మిలను బహుదార్ల బ్రతుకాయె
నిలువు దోపి డీలె  నిత్య పుాజ  
 పలుకసత్యమాడు  పాపమేటికి నీకు 
మనుజ తెలుసుకొనుము మంచిమాట.॥
32.
  పట్టి కుాటి కొరకు పరుల పంచను జేరు -
 పరువు లేని బ్రతుకు పబ్బ మేల ॥
  సొక్కు కృషిని పొందు సోకు సౌఖ్యము మెండు.
  మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
33.
పలుకు మంచి మాట  పరుల కింపగు బాట
 పెక్కు మంత్ర ములవి పెంచు సిరులు
 పలుకు శాంతి నేల పలుధర్మ  శాస్త్రాలు
 .మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
 
 34.
 ప్రాయ మపుడు జేయు పలు ధర్మ కర్మలుా
పెంచు పుణ్య మవియె పేర్చు నిధులు
గురుని గౌరవించి  గుణిగ పొందుము విద్య 
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
35.
పుట్టి బ్రతుకు రీతి, పుణ్య సంస్కృతి నీతి
తెలుసు కొనుము యిలను తెలియ కున్న 
జ్ఞాను లిడిన గ్రంధ  జ్ఞానవిద్యలబాట
మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
36.
చావు పుట్టు కలిల  చరిత తప్పని బాట
 బ్రతుకు చావు లవియె బ్రహ్మ రాత
  కుాడి రావు నేవి ముాడినంతనెజీవి
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
37.
 మనిషిలో నసురుడు మంచి బాటను మార్చు
 చదువు బుద్ధి నిచ్చు   చరిత నిలువ.
 మమత నిండు బ్రతుకు మహిలోన గెలుపురా
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 38.
 నాది నీది యనుచు  నట్టింట వాదములు
 పొంచి యున్న నాగు పోలు తగవు
 కాటు వేయు నెపుడొ, కడదేర్చు విసమురా
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 39.
 మంచి చెడులు రెండె మనిషిజా తికియుండు
జాతి మతము లవియె జగతి కల్ల
మనుజు లొక్క టేగ   మహినిమనగనెంచ
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
40.
  విద్య తోడ వచ్చు విశ్వమేలెడు శక్తి
  జ్ఞాన సాధనమ్మె జ్ఞాను లెంచు.
  సార గీత  అదియె సాక్షి కర్మల బోధ 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
41.
చీక టున్న చోటె చీల్చి వెలుగు నిండు.
గేలి చేయు చోటె గెలుపు విందు.
లోక రీతి తెలిసి లోపమ్ము లనువీడు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
42
పలుకు మన భాషను పాటించు సంస్కృతిని 
పుడమి జన్మ మనది మన తల్లి భారతి
పేరు పేరున శుభము వాడ వాడలు ఘనము
ప్రజ్ఞాశాలుల జ్ఞాన  విద్య మేధల గనుము ॥
43
పెరుగు చద్ది ముాట పెద్దవారల మాట
పేచి వలదు చదువ పెద్దబాలశిక్ష
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
పోరు పెట్టకెపుడు  జోరు నెపుడు ॥
44
పట్టి గౌరవించు మన జన్మ భుామిని
పాటించు  తల్లిదండ్రి జెప్పేటి మాటను.
పదములంటీ గురుల ఆశీస్సులను గొనుము
పలుక మంత్రములివియె  పలుధర్మాచరణములు ॥
45
పొందినట్టి జన్మ సార్ధకతను పొంద
పాల నమ్ము జేయు పద్ధ తులను
అంది నట్టి సుఖము ఆనడత ఫలమురా
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
46
పట్టి పట్టి జుాచి పరధర్మ ములరోసి
పెంచ బోకు రణము నెంచు విధము 
 మహిని జాతి యొకటె  మనిషి ధర్మ మొాకటె
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
47
పరుల ధర్మము లంచు  పరుషమా టలు మాను 
పరగ జాతులు వేరు ధర్మంబు లొక్కటే
పలుక సుభాషితములు పెరుగు మమత ॥
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥

అంశం : నీతి.
"మనుజ తెలుసు కొనుమ మంచి మాట" ॥
శీర్షిక :
"మనుజ తెలుసు కొనుమ మంచి మాట" ॥

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర.

48
పొల్లు మాట లాడి పోట్లాటలను దెచ్చు
యట్టి  చెడ్డ గుణము యవని చేటు
మంచి నడత తోడ మహిలోన మనుమయ్య.
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
49
మితము మాటలాడి మీరబో కుమహద్దు
హింన పడని మాట హితవు నీకు.
అతిగ మాటలాడ ఆదరణ కరువౌను.
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
50
అమ్మ అక్క చెల్లి యనురక్త బంధమ్ము..
లాదరింతువు గాద యవని నీవు
యెదుటి, స్త్రీలను గన యేటికిీ మేలము  
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
51
ఆడ పిల్ల లింటి, అమ్మతల్లులు వారు
శక్తి రుాపు దాల్చు .శతృ వెదుట .
వారు శాపము నిడగ  వదలిపోవు సిరులు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
52
చీక టున్న చోటె చీల్చి వెలుగు నిండు.
గేలి చేయు చోటె గెలుపు విందు.
లోక రీతి తెలిసి లోపమ్ము లనువీడు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
53
మనిషి జన్మ మెత్తు  మదిని మర్మము లేక
కల్మషమ్ము లిడని కాంతి మనసు
పెరిగి నపుడు బుద్ధి పెడదోవ నదెబట్టు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
54
చదువు లెన్ని యున్న  చరియించు నీతీరు
నీదు బాట నెంచు  నీడ వలెను
వ్యసన పరుల తోడ వ్యవహరించుట చేటు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
55
మానవత్వ మదియె మనిషి భుాషణ మౌను.
పరుల బాధ నెరిగి పలుకు మెపుడు
 నీవు జేయు కర్మ నీవెంటె వచ్చురా 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
56
తల్లిదండ్రు లిలను  తలచు వేల్పులు నమ్ము
తీర్చు ఋణము నీవు  తీరు గాను
 జగతి నీదు భవిత   జన్మదా తల భిక్ష 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
57
ఆతివ అబల యనెడు ఆలోచనసలొద్దు 
అబల కాదు యామె  ఆది శక్తి
అడుగు లోన యడుగు ఆమెతో డుగనేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
58
మహిని  పొందు ఘనత మందిలో నొకడిగ
సభ్య తెరిగి మసలు  సజ్జనునిగ
మంచి పేరు పొందు మనిషివిలువె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥






1️⃣9️⃣✅
 పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు.సంస్కార వంతుడే
 *మనుజ తెలుసుకొనుమ మంచిమాట* 
మకుటం/శీర్షికతో..  
మీరు రాసిన పద్యాలు చాలా బాగున్నాయి.. ధన్యవాదాలు మరియు అభినందనలు.. 
👏👏👏💐💐💐🙏🙏🙏

మనుజ తెలుసుకినుమ మంచి మాట 1 to 56


అంశం : రవాణా.
శీర్షిక  : మేధావి.
ప్రక్రియ : ఆటవెలది.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర


కష్టించి పనిచేసి కావిళ్ళదే మొాసి
సరుకు నమ్మగ జుాడ సరి బాట గనరాక
పడిన కష్టమునకదె ఫలితమ్ము  పొందుటకు
నడచి బాధలోర్చెడు నాటి రోజులు పోయె ॥

మారుతున్న కాలము మార్పు లెన్నియొ జరిగె
 వాణిద్యమును సలుప  వాహనమ్ములు గుాడె
 మట్టి బాటలెల్లను గట్టి బాటగ మారె
 గర్వించ దగినదౌ  ఘనము మనుజుల మేధ ॥
 
 ద్విచక్ర వాహనము దివ్యముగ  పనిజేయ
 కారు బస్సు ట్రక్కుల కార్ఖానాలు వెలసె
 ఊరుారు జేర్జేటి  ఉచ్ఛ శకటములెన్నొ
 సరఫరాల సరుకులు సవ్య స్థానము జేర్చ ॥

 వాహనమ్ములెన్నియొ వరుసగా వెలసినవి
  పేద గొప్పలు యనెడు పేరు బేధములేక
 అందరిని అలరించి ఆనందమిడు నవిగ ॥
 ఇట్టి సౌఖ్యము లెన్నో ఈశ్వరెరిగినదిలను ॥
 
 

...అంశం : రవాణా.
శీర్షిక  : మేధావి.
ప్రక్రియ : ఆటవెలది.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర


కష్టించి పనిచేసి కావిళ్ళదే మొాసి
సరుకు నమ్మగ జుాడ సరి బాట గనరాక
పడిన కష్టమునకదె ఫలితమ్ము  పొందుటకు
నడచి బాధలోర్చెడు నాటి రోజులు పోయె ॥

మారుతున్న కాలము మార్పు లెన్నియొ జరిగె
 వాణిద్యమును సలుప  వాహనమ్ములు గుాడె
 మట్టి బాటలెల్లను గట్టి బాటగ మారె
 గర్వించ దగినదౌ  ఘనము మనుజుల మేధ ॥
 
 ద్విచక్ర వాహనము దివ్యముగ  పనిజేయ
 కారు బస్సు ట్రక్కుల కార్ఖానాలు వెలసె
 ఊరుారు జేర్జేటి  ఉచ్ఛ శకటములెన్నొ
 సరఫరాల సరుకులు సవ్య స్థానము జేర్చ ॥

 వాహనమ్ములెన్నియొ వరుసగా వెలసినవి
  పేద గొప్పలు యనెడు పేరు బేధములేక
 అందరిని అలరించి ఆనందమిడు నవిగ ॥
 ఇట్టి సౌఖ్యము లెన్నో ఈశ్వరెరిగినదిలను ॥
 
 

రవాణా

అంశం : రవాణా.
శీర్షిక  : మేధావి.
ప్రక్రియ : ఆటవెలది.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర


కష్టించి పనిచేసి కావిళ్ళదే మొాసి
సరుకు నమ్మగ జుాడ సరి బాట గనరాక
పడిన కష్టమునకదె ఫలితమ్ము  పొందుటకు
నడచి బాధలోర్చెడు నాటి రోజులు పోయె ॥

మారుతున్న కాలము మార్పు లెన్నియొ జరిగె
 వాణిద్యమును సలుప  వాహనమ్ములు గుాడె
 మట్టి బాటలెల్లను గట్టి బాటగ మారె
 గర్వించ దగినదౌ  ఘనము మనుజుల మేధ ॥
 
 ద్విచక్ర వాహనము దివ్యముగ  పనిజేయ
 కారు బస్సు ట్రక్కుల కార్ఖానాలు వెలసె
 ఊరుారు జేర్జేటి  ఉచ్ఛ శకటములెన్నొ
 సరఫరాల సరుకులు సవ్య స్థానము జేర్చ ॥

 వాహనమ్ములెన్నియొ వరుసగా వెలసినవి
  పేద గొప్పలు యనెడు పేరు బేధములేక
 అందరిని అలరించి ఆనందమిడు నవిగ ॥
 ఇట్టి సౌఖ్యము లెన్నో ఈశ్వరెరిగినదిలను ॥
 
 

గ్రహణం.

శీర్షిక  : గ్రహణం.
*రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర

యుగాల నుండీ ఏర్పడిన ఖగోళ రుాపం. 
విజ్ఞానానికి అంతుపట్టని  అగ్నిగోళాల ఆవిర్భావం
ఆకాశంలో నవగ్రహ మండలాల అద్భుత తేజం . 
మానవ, జీవ, జంతు, జీవితాలపై ప్రభావం॥

ఆకాశంలో భగవంతుని వాసమన్న నమ్మకం.
యుగానికో అవతారంతో భగవంతుని దర్శనం  .
దుష్ట శిక్షణంతో శిష్ట రక్షణల కథనాలనంతం.
పురాణ కావ్య కథనాలపై మనిషి విశ్వాసం॥

ప్రతీ రాతిని, నీతిని నమ్మే జనం ...
నిత్య జీవితాల్లో పాటించని ఆచరణలనేకం.
మనవైన సంస్కారాలను మన్నించని నిర్లక్ష్యం .
ముాడ నమ్మకాల  మొక్కుబడులతో ముార్ఖ జనం.

విజ్ఞానం ఛేదించలేని శక్తులతో నిండిన గగనం.
అనేకానేక గ్రహకుాటములతో  అనంత విశ్వం .
నక్షత్రాది,సుార్య- చంద్రాదులతో నిండిన అగ్నిగోళం 
భుామిని మించిన వైశల్యంతో అనంతాకాశం॥

లెక్కకు తేలని నక్షత్ర కుాటమిల వెలుగులు.
వాసయొాగ్యం కాని ధుాళి నిండిన బండలు.
స్వాశ ఆడని తాపం , నీరు కానరాని వైపరీత్యం
భుామికి కొన్ని యొాజనాల ఎత్తులో అసాధ్యపు సాధ్యం ॥

వైజ్ఞానిక మార్పులతో సుార్య, చంద్రుల గమనం.
భుామ్యాకర్షణ శక్తి వల్ల ప్రకృతిలో  వైపరీత్యం 
విష వాయువుల ప్రభావానికి భుామిలో అల్లకల్లోలం.
జీవ జంతుల ఆరోగ్యానికి  హానిజేసే వాతావరణం ॥

సుార్య చంద్రుల నీలి నీడల ప్రభావానికి 
అస్పష్టమైన గ్రహాల కదలికల పరిణామం .
దృశ్య రుాపంలో కనిపించే చిత్రానికి 
మనిషి చేసిన  నామకరణం గ్రహణం .
కాలుష్యాన్ని  పెంచే విషపుారిత వాతావరణం ॥
 
రెండు గ్రహాలు  ఒకే కక్ష్యలో  చేరి 
ఒకటికి మరొకటి ఎదురెదురుగా వచ్చిన 
పరిణామం.
నేటికీ విజ్ఞాన వంతులకు అంతుచిక్కని
పరిశోధనలకు నిలయం.॥

మన ఋషులు మునులు అనుభవాల 
ఆలోచనలతో చేసిన పరిశోధనలనంతం.
విజ్ఞాన పరంగా పుార్వకులు రచించిన 
శాస్త్ర గ్రంధాలలో నిబిడిన ఆరోగ్య  సుాత్రాల సారం.

విద్యా జ్ఞాన వికాశాలకై
 మునులు రాసిన కావ్యాలనంతం.
చదువరులకు మార్గదర్శకమైన 
పుస్తక పఠనంలో ప్రతీ ఒక్కరి జీవితాలకు
మార్గదర్శకమైన మహత్తర  సందేశం.

భుామ్యాకాశాల మధ్య గల ప్రపంచం.
పంచ భుాతాలపై ఆధారపడిన 
జీవన్మృుత్యు సంఘర్షణల మానవ  జీవితం ॥
బ్రతుకు కాలమంతా ప్రకృతి పై ఆధారం ॥

కాలుష్య రహితమైన ప్రకృతి మధ్య  ప్రయాణం .
మనిషి జీవితానికి పంచ భుాతాలు ఒక వరం.
పరిశోధనల పేరుతో వినాశనానికి చుట్టిన శ్రీకారం 
మనిషి చేతుల్తో కాలరాయబడుతున్న  కాలం
మట్టిలో మనిషి జీవితం ,మారణ హోమాల వలయం .॥

పాశ్ఛాత్య పద్ధతులకు లోబడిన జనం.
పౌరాణిక గ్రంధాలను చేసుకోక మననం.
యుగాల సంస్కృతిని చేస్తున్నారు ఖననం.
ఇదేగా మనిషికి పట్టిన అసలైన గ్రహణం ॥



.

Wednesday, November 9, 2022

పద్య కవి రత్నాలుగా...

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*ప్రతిరోజూ కవితా పండుగే*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
*నేటి పద్యకవి రత్నాలు:(09-11-2022)*
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*శ్రీ/శ్రీమతి*
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊 
1.డా.కురవి వేంకట కృష్ణశాస్త్రి
2.డా.సూర్యదేవర రాధారాణి
3.రేజేటి వేంకటరమణమూర్తి
4 సాసుబిల్లి తిరుమల తిరుపతిరావు
5.ఎలగందుల లింబాద్రి
6.పోగుల భాగ్యలక్ష్మి
7.డా.పి యస్ యస్ లక్ష్మి
8.వాణి సరోజిని లక్కరాజు
9.డా.వేదాల గాయత్రీదేవి
10.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
11.చెన్న శంకర్ 
12.దేవనపల్లి ఓగన్న
13.జక్కని గంగాధర్
14.డియస్వీ మహాలక్ష్మి
15.మల్లారెడ్డి రామకృష్ణ
16.గడ్డం కృష్ణారెడ్డి
17.శిరీష వూటూరి
18.సింహాద్రి వాణి
19.కొంటికర్ల లలిత
20.డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
21.గంపా శ్రీదేవి
22.తెలికిచెర్ల రాజకృష్ణ కామేశ్వరరావు
23.గాండ్ల నర్సింలు
24.యం రామకృష్ణయ్య
25.మహేంద్రాడ సింహాచలాచార్య
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ పర్యవేక్షక, నిర్వాహక &సమీక్షక బృందము*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

విజ్ఞతెరిగి మసలుకో

09/11/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : న్యాయం.
శీర్షిక : విజ్ఞతెరిగి మసలుకో..

ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 

మంచి బాట నెంచి మహిలోన  మసలేటి
మనిషి కాన రాడు మాయ గాదె
స్వార్ధ మెంతొ పెరిగె స్వావలంబన తగ్గి
 మాట మరచె న్యాయ బాట మరచె ॥
 
 చేసి దుష్కృుతములు చేసి యన్యాయమ్ము
 కుాడ బెట్టి సొమ్ము కుళ్ళ బెట్టి
 ప్రజల ఉసురు తగిలి ప్రారబ్ద కర్మలా
 రోగు లౌచు బ్రతుకు రోయ వగచె ॥
 
 ధర్మ చింతనేల ధన్యు డౌదువు నీవు
 న్యాయ మార్గ మిడిన మేయ కీర్తి
 మెచ్చు జనులు నిన్ను మేటి గుణుడవంచు
 శాంతి సుఖము లొసగు సార మదియె ॥
 
 మహిని న్యాయ బాట మదిని ధర్మపు చింత
 మనసు కిచ్చు శాంతి , మహిని సుఖము
 యశము లిచ్చు మేటి  యజ్ఞమ్ము  న్యాయమ్ము
 మరువ కెపుడు న్యాయ మార్గ మిలను ॥
 
********
 
మంచి బాట నెంచి మహిలోన  మసలేటి
మనిషి కాన రాడు మాయ గాదె
ధరణి గాచు నిధులు  ధర్మ - న్యాయములేగ
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చేసి దుష్కృుతములు చేసి యన్యాయమ్ము
 కుాడ బెట్టి సొమ్ము కుళ్ళ బెట్టి
 ప్రజల ఉసురు తగులు ప్రారబ్ద మదియేల
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 
ధర్మ చింతనేల ధన్యు డౌదువు నీవు
 న్యాయ మార్గ మిడిన మేయ కీర్తి
 మెచ్చు జనులు నిన్ను మేటి గుణుడవంచు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 
 మహిని న్యాయ బాట మదిని ధర్మపు చింత
 మనసు కిచ్చు శాంతి , మహిని సుఖము
 యశము లిచ్చు మేటి  యజ్ఞమ్ము  న్యాయము
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చేయకన్యాయమ్ము చేటు నీకది జేయు.
పాప మదియె పండ  పట్టు చీడ
కర్మ ఫలిత మిలను కడుదుఃఖ తరమురా
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

నీతి బాటను నడచు నిత్య సంతోషుండు.
ప్రీతి జేసి పనుల ఖ్యాతి బడయు.
సుఖము నిచ్చు బ్రతుకు సుంతైన చాలుగా 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥


Tuesday, November 8, 2022

గ్రహణం.

శీర్షిక  : గ్రహణం.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర

యుగాల నుండీ ఏర్పడిన ఖగోళ రుాపం. 
విజ్ఞానానికి అంతుపట్టని  అగ్నిగోళాల ఆవిర్భావం
ఆకాశంలో నవగ్రహ మండలాల అద్భుత తేజం . 
మానవ, జీవ, జంతు, జీవితాలపై ప్రభావం॥

ఆకాశంలో భగవంతుని వాసమన్న నమ్మకం.
యుగానికో అవతారంతో భగవంతుని దర్శనం  .
దుష్ట శిక్షణంతో శిష్ట రక్షణల కథనాలనంతం.
పురాణ కావ్య కదంబాలపై మనిషి విశ్వాసం॥

విజ్ఞానం ఛేదించలేని శక్తులతో నిండిన గగనం.
అనేకానేక గ్రహకుాటములతో  అనంత విశ్వం .
నక్షత్రాది,సుార్య- చంద్రగ్రహాలు నిండిన అగ్నిగోళం 
భుామిని మించిన వైశల్యంతో అనంతాకాశం॥

లెక్కకు తేలని నక్షత్ర కుాటమిల వెలుగులు.
వాసయొాగ్యం కాని ధుాళి నిండిన బండలు.
స్వాశ ఆడని తాపం , నీరు కానరాని వైపరీత్యం
భుామికి కొన్ని వేల దుారపుటెత్తులో అసాధ్యపు సాధ్యం ॥

వైజ్ఞానిక మార్పులతో సుార్య, చంద్రుల గమనం.
భుామ్యాకర్షణ శక్తి వల్ల ప్రకృతిలో  వైపరీత్యం 
విష వాయువుల ప్రభావానికి భుామిలో అల్లకల్లోలం.
జీవ జంతుల ఆరోగ్యానికి  హానిజేసే వాతావరణం ॥

సుార్య చంద్రుల నీలి నీడల ప్రభావానికి 
అస్పష్టమైన ఆకృతి నిండిన గ్రహాల కదలికల పరిణామం .
దృశ్య రుాపంలో కనిపించే చిత్రానికి 
మనిషి చేసిన  నామకరణం గ్రహణం .
కాలుష్యాన్ని  పెంచే విషపుారిత వాతావరణం ॥
 
రెండు గ్రహాలు  ఒకే కక్ష్యలో  చేరి 
ఒకటికి మరొకటి ఎదురెదురుగా వచ్చిన 
పరిణామం.
నేటికీ విజ్ఞాన వంతులకు అంతుచిక్కని
పరిశోధనలకు నిలయం.॥

భుామ్యాకాశాల మధ్య గల ప్రపంచం.
పంచ భుాతాలపై ఆధారపడిన 
జీవన్మృుత్యు సంఘర్షణల మానవ  జీవితం ॥
బ్రతుకు కాలమంతా ప్రకృతి పై ఆధారం ॥

కాలుష్య రహితమైన ప్రకృతి మధ్య  ప్రయాణం .
మనిషి జీవితానికి పంచ భుాతాలు ఒక వరం.
పరిశోధనల పేరుతో వినాశనానికి చుట్టిన శ్రీకారం 
మనిషి చేతుల్తో కాలరాయబడుతున్న  కాలం
మట్టిలో మనిషి జీవితం మారణ హోమాల వలయం .॥

పాశ్ఛాత్య పద్ధతులకు లోబడిన జనం.
పౌరాణిక గ్రంధాలను చేసుకోరు మననం.
యుగాల సంస్కృతిని చేస్తున్నారు ఖననం.
ఇదేగా మనిషికి పట్టిన అసలైన గ్రహణం ॥
************


రుబాయిలు...క్రిష్ణునిపై

అంశం : రుబాయిలు.
శీర్షిక : నీవేరా నా మదిలో...
రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర



వేణునాదాన్ని విని రేయంతా   పాడింది రాధ
మురళీధరు గని  ఆనందంతో  ఆడింది రాధ.
మనమొాహనుడదె  యమునావిహారి  అందరివాడుగ
విరహముతోనదె రా-రమ్మంటుా వేడింది రాధ ॥

రేయంతా నిదురలోన     కలవరింత   నీదేగా
 రోజంతా మనసులోన    పులకరింత నీవేగా
 వెన్నదొంగ వెదకినంత  కానరాడె చిన్ని క్రిష్ణ 
ఎదురుపడగ  పరవశాన  పలకరింత నీకేగా ॥

Sunday, November 6, 2022

రుబాయిలు

మహతీ సాహితీ కవి సంగమం.
 25/10/2022.
అంశం : రుబాయిలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

పొత్తిళ్ళలో పొందికగాను  పెంచిందమ్మ.
ఆకలిదీర్చి అందంగాను పెంచిందమ్మ 
తల్లి ఋణాన్ని తీర్చుకొనుటకు వెనుకాడొద్దు 
ఇలదేవతగ హుందాగాను వచ్చిందమ్మ ॥

జీవితాన తప్పటడుగు లెప్పటికీ  వేయబోకు.
తెలిసితెలిసి  తప్పులవి యెప్పటికీ చేయబోకు
అంతరాత్మ సాక్షి, నిన్ను నిలదీయును.
మనసునెపుడు మొాసబుచ్చి ఎప్పటికీ బ్రతుకబోకు ॥

అవసరమని  అబద్ధాల  నాడబోకు.
స్వార్ధంతో  బంధమ్ముల  వీడబోకు ॥
మంచితోడ , అందరితో కలిసుండుము.
 నమ్మించీ  మొాసమ్ముల  చేయబోకు.

 

నీతులనవి నిర్లక్ష్యం  చేయబోకు
ఎవ్వరినీ అవమానము పరచబోకు
అవసరాని కందరినీ  ఆదుకొనుము
మంచిమాట పెడచెవులను పెట్టబోకు॥

******************************

ఉపేంద్రవజ్ర

ఉపేంద్రవజ్రకు గణములు-
IUI    U U I    IUI      U U 
 జ-      త-      జ-     గ-గ

ఉదాహరణ ::  ఉపేంద్రవజ్ర

IUI           U U I     IUI      U U
నమోऽస్తు నాలీక    నిభాననాయై
నమోऽస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోऽస్తు సోమామృతసోదరాయై
నమోऽస్తునారాయణవల్లభాయై – కనకధారాస్తోత్రం.


27/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : శ్రీ క్రిష్ణుడు.
శీర్షిక : శ్రీ క్రిష్ణ  శరణం మమ ॥
ప్రక్రియ : ఉపేంద్రవజ్ర.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .



అంశం : శ్రీ క్రిష్ణుడు.
శీర్షిక : శ్రీ క్రిష్ణ ద్వాదశ స్తోత్రం  ॥
ప్రక్రియ : ఉపేంద్రవజ్ర.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

1.
నమొాస్తు  శ్రీకృష్ణ నరాయ ణాయా.
నమొాస్తు నందాత్మ జబాల కాయా.
నమొాస్తు లీలాది విహార పారా
నమొాస్తు శ్రీశాయ సుబాల కాయా ॥ 
2.
నమొాస్తు  దేవాది భిరర్చి తాంఘ్రీం.
నమొాస్తు శాంఖాయు ధచక్ర పాణీం .
నమొాస్తు శ్రీవత్సస వక్ష సాయాం 
నమొాస్తు గోపీ జనపాల మేయం   ॥
3.
నమొాస్తు క్రిష్ణంవర రుాపనంతం
నమొాస్తు భక్తాశ్రిత పారిజాతం .
నమాస్తు గోపీజనలోల బృంగం.
నమొాస్తు వేణుా స్వర గీతలోలం ॥
4.
వికుంఠ వాసాయ అకుంఠ తీర్థం.
సుపాండ వాపక్ష సుపార్ధ మిత్రం.
సుగీత బోధాత్మక  దివ్య గాత్రం 
నమొా నమః శ్రీ పురవేనమస్తే ॥
5.
సమస్త లోకైక సురక్ష కుక్షీం
సమస్త భక్తాగ్రజ  సేవితాక్షాం
సమస్త  సౌభాగ్య సుమంగ ళాయాం
సమస్త భుామండల నాయకాయాం ॥
6.
అనంత శ్రీశేష శయాంగ నాయాం
అనంత సంకల్ప వికల్పనాయాం
దిగంత వ్యాప్తాయ దివాకరాయాం
దశాది రుాపాయ దయాపరాయాం ॥
7.
సునీల దేహాయ శుభాంగ నాయాం
 సువేణు నాదాయ సుగాత్ర మిత్రాం
 సుహేమ భుాషాది సుశోభి తాయాం॥
సుభక్త పోషాయ సుదివ్య చిత్తాం॥
8.
 చతుర్భు జాయాయ సనాత నాయాం
 అనంత నంతాయ అమొాఘకాయాం
 మధుర్వనే బృంద వనే విహాయాం
 వ్రజ జ్జనానందన నంద బాలాం ॥
 9.
 తమాల భుాషాతులసీ ప్రియాయాం
సుపీత వస్త్రాది  సుదివ్య నేత్రాం   
 చిదంబ రానంద  చరాచరాయాం
శమంత కాదివ్య మణి ప్రకాశాం ॥
10
కుచేలపాలం బహుబంధు మిత్రం 
సుసచ్చిదానంద  సుదివ్య  క్షేత్రం 
కురుాప కుబ్జాది సురుాప దాతం
నమొాస్తు శ్రీనీల ఘనాయ శ్యామాం  ॥
11.
అనంత శ్రీశేష  శయాంగనాయై
చతుర్భు జాంగాయ శుభాంగనాయై 
 త్రిలోక  నాధాయ  విశాల కాయై 
 వికుంఠ నాధాయ నమొా నమస్తే ॥
12.
 కృష్ణా యభేద్యాయ రక్షాకృతాయై
దుష్టారి దుారాయ జయప్రదాయై
వికుంఠ  వాసాయ విశిష్ట ముార్త్యై
వికుంఠ నాధాయ నమొా నమస్తే ॥




*****************************

 


కార్తీకమాసం విశిష్ట త

అంశం : కార్తీక దీపం.
శీర్షిక : సాంప్రదాయాలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆటవెలది

 కార్తి కమ్ము నందు కడుభక్తి తోడనుా
 దీప దాన మిడిన దివ్య ఫలము
 మాస మియ్య దిలను మహిమాన్వి తంబని
 ఋషులు మునులు జెప్పె ఋజువు తోడ॥
 
సాంప్ర దాయ రీతి సద్ధర్మ ములతోడ
శివుని కొల్తు రిలను శీల వతులు
పాప ములవె బాయ పడతులం దరుగుాడి
పుాజ సేతు రిలను పుణ్య మలర ॥

పేర్చి దీప వళుల పేర్మిపుా జలుజేసి
నెయ్య మునను గలసి నెయ్యి బోసి
ఆక శమ్ము జేర నాకాశ దీపమ్ము  
వెలుగ సంత సముల వేల్పు గొలచి ॥

 ఉదయ సంధ్యలు వారు  ఉపవాస దీక్షతో
  మహిమ దలచి మాత దుర్గ గొలచి
  శంక లవియె తొలగ శంకరునిల గొల్చి
  ఫలము పొందె దరుగ పడతు లెల్ల ॥
  
  నిష్ట తోడ జేయు  నిత్య కార్యము లెల్ల
  సఫల మౌను అదియె సత్య మిలను
  అణువు ఆణువు లోన అగుపించు నీశ్వరుడు.
మనసె తీర్ధ మౌను మహిని మనుజ॥ 


సత్య ధర్మ ములను సరిమార్గ ములదెల్ప
వ్రతము నోము లనుచు వర్ణ నలిడి
సకల జనుల గుణము సన్మార్గ ములనేల
సంప్ర దాయ మేలె సార గతుల ॥

  

Saturday, November 5, 2022

బాల సాహిత్యం . మ గుణింత పదాలతో గేయం

05/11/2022.

బాల సాహిత్యంలో  కవిత-
   అంశం :"మ " గుణింత పదాలతో ..
శీర్షిక :  మెళకువలను తెలుసుకో..
ప్రక్రియ : గేయ కవిత .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .


పల్లవి .
-------
ముద్దుగారు పిల్లలుా మురిపాల గువ్వలుా
మేలైన మాటలా మెళకువలివె  పిల్లలుా 
మంచి మనసు మీదిగా మనిషిగా మెలగాలి 
మంచి విద్య- జ్ఞానముతో మీరందరు ఎదగాలి.॥ ॥
॥ముద్దు ॥

అను పల్లవి :
-----------
మదిని మానవత్వమే మనుగడ నిల నిలుపునుా
మమత పెంచు మంచి గుణమె మీభవితను  దిద్దునుా
మాటల కోటలుగట్టి  నవ్వులపాలవకండి
మాట డాబు వద్దండీ చేత చేసి చుాపండీ ॥॥ముద్దు ॥

చరణం:
------
మాట తీరుగుండాలి మేలు బాట నడవాలి
మార్గదర్శులవ్వాలి మంచి తనముతో 
మన దేశం మన ఝండా మాట కీర్తి మారుమొాగ      ॥మరపురాని విధముగా  మసలుకోండి 
మాత- పితలు కలలు కన్న మహోన్నత వ్తక్తులై-
మహిని మేలు కీర్తి బాట మీరందరు నడవాలి.॥ముద్దు ॥
చరణం.
---------

మరపురాని చేతలతో మన్ననలను పొందుమా
మంచి చెట్లు నాట మహిని, పొివు కాలుష్యమమ్మ.
మంచి నీటి విలువ తెలిసి వృధా పోనీయకుమా
మన అన్న దాతలకు నీటి కొరత రానీకుమ
మన సంస్కృతి  సాంప్రదాయములను గౌరవించుమా.
మనిషి సంస్కారముతో మసలుటలే ధర్మముసుమ॥॥ముద్దు ॥

చరణం.
-------
మనుషులను మొాసగించి మిత్రుల కోల్పోకుమా
ముప్పు దెచ్చసత్యమదే మరచి యాడబోకుమా
మాటదప్పినట్టి యాన లెన్నడు చేబోకుమా
మరపు రాని  మనిషిగా మదిని నిలినిపోవమ్మా
మనువు చెప్పు  ధర్మములివి మనిన మచ్చ రాదుసుమాl
మంచివ్య క్తిత్వమున్న మనిషే మహనీయుడమ్మ ॥
॥ముద్దు ॥

నీ జ్ఞాపకాల వడిలో...

శీర్షిక  : నీ జ్ఞాపకాల వలలో.....
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

నిశ్శబ్దంగా కారుస్తున్న నాకన్నీటిలో 
నిన్నటి నామధుర స్మ్రుతులు -
గుండెను కలచివేస్తున్న 
ఆలనాటి ప్రేమ సందేశాలు.॥

దైన్యం నిండిన నీ కన్నుల్లో
 కనిపిస్తున్న నీలిననీడల్లో
నా ప్రతిబింబం కదలాడుతున్న
కమ్మని  దృశ్యాల జ్ఞాపకాలు ॥

తడబడుతున్న నీ జాడల
అడుగు ముద్రల్లో నిండిన
 నా అడుగు జాడల గుర్తులు 
 నావైన నీ జ్ఞాపకాలు ॥.
 
మండుటెండలో ....
నా పిలుపు కోసం నిరీక్షించే నీ 
అదిరే అధరాల అంతర్యుద్ధాలు 
ఆవేశమౌ జ్ఞాపకాలు॥

దేశ రక్షణ కోసం 
నా " ప్రాణాలను సైతం "
అన్న నా ధృఢ సంకల్పానికి 
ఔనని , కాదనలేని స్తబ్ధతతో-

మౌనంగా వంచిన నీ 
మొాముపై కదలాడే 
నీ కాటుక కనులు 
కారుమేఘాలై కురిసే 
తడి సడుల జ్ఞాపకాలు॥

ఉవ్వెత్తున లేచే  కెరటాలు
 తీరాన్ని తాకీతాకక ముందే
 తిరిగి సంద్రంలో కలిసిన
 నిరాశల జ్ఞాపకాలు ॥
 
 ఇచ్చిన ప్రేమకు నిండిన 
 గుండె తప్పిన లయలో 
 అపస్వరాల ఉఛ్ఛ్వాస
 నిశ్వాసాల   జ్ఞాపకాలు ॥
 
 కళ తప్పిన మొాములో 
 కలతనిండిన ప్రశ్నలు
 గడి తప్పి సుాన్యంలో 
 పయనిస్తున్న నా
  భావ పరంపరలు॥
 
 వెనుదిరిగిన నా పాదాలను 
 కన్నీటితో కడుగుతుా
   నీ మౌనం ప్రశ్నిస్తు  చేస్తున్న
   అభ్యర్ధనల జ్ఞాపకాలు ॥
  
 అన్నీ కోల్పోయిన నా
 అంతరంగ గవైకల్యానికి 
 సాక్ష్యాలై  వెంటాడుతుా వేధిస్తున్న 
 ఒంటరితనపు ఒయాసిస్సులు
ఎన్నటికీ అందుకోలేని 
అరుదైన  నీ జ్ఞాపకాలు  ॥

చీకటి

ప్రక్రియ :  ఇష్టపది .

అంశం : చీకటి.

శీర్షిక  : చీకటి నిండిన జీవితం .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .



 జగతిలో జన్మయిది జరామరణ కుాపము 
 పరుగెత్తు కాలమున  పగలు రాత్రులె దినము    
మధ్యలో మాయగా మనిషి జీవ గమనము
వెలుగు చీకటులతో  పోరాడే ఖర్మము ॥

మానవీయత నిండు మనిషి చుాసే వెలుగు
నిండినట్టి స్వార్ధము నివురుగప్పు చీకటి
తప్పొప్పు లెరుగనిది తన పతన మెరుగనిది  
వింత గద జీవితము విధి యాడు నాటకము ॥

మనిషిలోన మర్మము మది నిందిన చీకటి
మనిషిలోని స్వార్ధము మలచుకున్న చీకటి
తన ,పరల బేధములె తట్టి పిలచు చీకటి 
జాతి మత కలహములె జగతి నిండు చీకటి ॥

కామము నిండు మనిషి కాలిడు గతి చీకటి 
వ్యసనాల బాటలో వ్యక్తి జారు ఊబది
బంధాల యెడబాటు బరువయ్యే చీకటి
బాధ్యతల విడనాడి బ్రతుకోడిన చీకటి ॥


వివేకమది లేనిది విద్య పనికిరానిది
అవమానపు కొలిమిని అంటి కాలు చీకటి
జీవితాన ఓటమి  జిక్కు వ్యధల చీకటి 
కన్నీటి కథనాల కార్చిచ్చుల చీకటి ॥

  జ్ఞాన విద్యలు కలుగు  జ్ఞాన బాటలె వెలుగు
 జీవ యానములోన   జీవితాలవి  వెలుగు
 మానవత్వము నిండు మనిషి  బాటే వెలుగు
 చీకట్లు అవి తొలగు  చిరము వెలుగీశ్వరీ॥
 
************************************
 36.
చావు పుట్టు కలిల  చరిత తప్పని బాట
 బ్రతుకు చావు లవియె బ్రహ్మ రాత
  కుాడి రావు నేవి ముాడినంతనెజీవి
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
37.
 మనిషి లోన సురుడు మంచి బాటను మార్చు
 చదువు బుద్ధి నిచ్చు   చరిత నిలువ.
 మమత నిండు బ్రతుకు మహిలోన గెలుపురా
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 38.
 నాది నీది యనుచు  నట్టింట వాదములు
 పొంచి యున్న నాగు పోలు తగవు
 కాటు వేయు నెపుడొ, కడదేర్చు విసమురా
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 39.
 జాతి మతము లవియె జగతిధ ర్మపుమాట
 మనుజు లొక్క టేగ   మహిని మనగ
 మంచి చెడులు రెండె మనిషిజా తులకండు 
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
40.
  విద్య తోడ వచ్చు విశ్వమేలెడు శక్తి
  జ్ఞాన సాధనమ్మె జ్ఞాను లెంచు.
  గీత సార మదియె రాత కర్మల బోధ 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
41.
చీక టున్న చోటె చీల్చి వెలుగు నిండు.
గేలి చేయు చోటె గెలుపు విందు.
లోక రీతి తెలిసి లోపమ్ము లనువీడు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
42.
చిట్టి పాప లింట చిరునవ్వు దీపికలు
ఆడ జన్మ  ఘనము నవని లక్ష్మి 
పెంచు ప్రేమ లెన్నొ పెరిగినంతనె వారు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
43.
తాగి తుాగి వచ్చి తరుణుల బడిరోయ
తరుగు సిరులు నీకు తగదు దొమ్మి
చింత లేని ఇల్లు సిరులున్న ధామముా
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
44.
బయట కష్ట పడిన భర్త గౌరవమందు
ఇంట చాకిరీల యింతు లలుసా
ఒంటి చక్ర మున్న ఒరిగిపో వునుబండి
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
45.
ఆట పాటలందు అలరు విద్యలు నేర్వ
ఆడు వారు నేడు  అవని మేటి.
భాగస్వామ్యమిడగ  భంగపర్చుట లేల
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
46.
వర్ణ రుాపములవి వర్ణంచుటకె గాని.
 మనిషి గుణము లవియె మహిని వెలుగు 
గుణము లేని మనిషి గృహము నుండుటె చేటు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
47.
వేల్పు లిలను పెక్కు వేలరుాపుల జిక్కు
మహిని గాచు వాడు మాత్ర మొకడు
అవతరించు ఘనుడు ఆది విష్ణుడెగాద 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
48.
తల్లి దండ్రుల నిల తలచు దేవతలుగ
వారి ఋణము దీర్చు వరుస గతుల
చేయు నట్టి కర్మ చేదిరిగి వచ్చురా  (చేరునీ దరికిరా)
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
49.
చెడ్డ వారి గలసి చెడుపు పనులజేసి
 విలువ లేని బ్రతుకు విధము లేల
అడుసు ద్రొక్కనేల అడుగు కడుగ నేల
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
50.
తాటి చెట్టు నీడ తాగు పాలను జుాచి
నమ్మరెవరు నిన్ను నటన యంచు
తాటి చెట్టు క్రింద తాటి కల్లుల వేట
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

*******************************




చీకటి

ప్రక్రియ :  ఇష్టపది .

అంశం : చీకటి.

శీర్షిక  : చీకటి నిండిన జీవితం .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .



 జగతిలో జన్మయిది జరామరణ కుాపము 
 పరుగెత్తు కాలమున  పగలు రాత్రులె దినము    
మధ్యలో మాయగా మనిషి జీవ గమనము
వెలుగు చీకటులతో  పోరాడే ఖర్మము ॥

మానవీయత నిండు మనిషి చుాసే వెలుగు
నిండినట్టి స్వార్ధము నివురుగప్పు చీకటి
తప్పొప్పు లెరుగనిది తన పతన మెరుగనిది  
వింత గద జీవితము విధి యాడు నాటకము ॥

మనిషిలోన మర్మము మది నిందిన చీకటి
మనిషిలోని స్వార్ధము మలచుకున్న చీకటి
తన ,పరల బేధములె తట్టి పిలచు చీకటి 
జాతి మత కలహములె జగతి నిండు చీకటి ॥

కామము నిండు మనిషి కాలిడు గతి చీకటి 
వ్యసనాల బాటలో వ్యక్తి జారు ఊబది
బంధాల యెడబాటు బరువయ్యే చీకటి
బాధ్యతల విడనాడి బ్రతుకోడిన చీకటి ॥


వివేకమది లేనిది విద్య పనికిరానిది
అవమానపు కొలిమిని అంటి కాలు చీకటి
జీవితాన ఓటమి  జిక్కు వ్యధల చీకటి 
కన్నీటి కథనాల కార్చిచ్చుల చీకటి ॥

  జ్ఞాన విద్యలు కలుగు  జ్ఞాన బాటలె వెలుగు
 జీవ యానములోన   జీవితాలవి  వెలుగు
 మానవత్వము నిండు మనిషి  బాటే వెలుగు
 చీకట్లు అవి తొలగు  చిరము వెలుగీశ్వరీ॥
 
************************************
 36.
చావు పుట్టు కలిల  చరిత తప్పని బాట
 బ్రతుకు చావు లవియె బ్రహ్మ రాత
  కుాడి రావు నేవి ముాడినంతనెజీవి
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
37.
 మనిషి లోన సురుడు మంచి బాటను మార్చు
 చదువు బుద్ధి నిచ్చు   చరిత నిలువ.
 మమత నిండు బ్రతుకు మహిలోన గెలుపురా
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 38.
 నాది నీది యనుచు  నట్టింట వాదములు
 పొంచి యున్న నాగు పోలు తగవు
 కాటు వేయు నెపుడొ, కడదేర్చు విసమురా
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 39.
 జాతి మతము లవియె జగతిధ ర్మపుమాట
 మనుజు లొక్క టేగ   మహిని మనగ
 మంచి చెడులు రెండె మనిషిజా తులకండు 
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
40.
  విద్య తోడ వచ్చు విశ్వమేలెడు శక్తి
  జ్ఞాన సాధనమ్మె జ్ఞాను లెంచు.
  గీత సార మదియె రాత కర్మల బోధ 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
41.
చీక టున్న చోటె చీల్చి వెలుగు నిండు.
గేలి చేయు చోటె గెలుపు విందు.
లోక రీతి తెలిసి లోపమ్ము లనువీడు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
42.
చిట్టి పాప లింట చిరునవ్వు దీపికలు
ఆడ జన్మ  ఘనము నవని లక్ష్మి 
పెంచు ప్రేమ లెన్నొ పెరిగినంతనె వారు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
43.
తాగి తుాగి వచ్చి తరుణుల బడిరోయ
తరుగు సిరులు నీకు తగదు దొమ్మి
చింత లేని ఇల్లు సిరులున్న ధామముా
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
44.
బయట కష్ట పడిన భర్త గౌరవమందు
ఇంట చాకిరీల యింతు లలుసా
ఒంటి చక్ర మున్న ఒరిగిపో వునుబండి
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
45.
ఆట పాటలందు అలరు విద్యలు నేర్వ
ఆడు వారు నేడు  అవని మేటి.
భాగస్వామ్యమిడగ  భంగపర్చుట లేల
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
46.
వర్ణ రుాపములవి వర్ణంచుటకె గాని.
 మనిషి గుణము లవియె మహిని వెలుగు 
గుణము లేని మనిషి గృహము నుండుటె చేటు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
47.
వేల్పు లిలను పెక్కు వేలరుాపుల జిక్కు
మహిని గాచు వాడు మాత్ర మొకడు
అవతరించు ఘనుడు ఆది విష్ణుడెగాద 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
48.
తల్లి దండ్రుల నిల తలచు దేవతలుగ
వారి ఋణము దీర్చు వరుస గతుల
చేయు నట్టి కర్మ చేదిరిగి వచ్చురా  (చేరునీ దరికిరా)
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
49.
చెడ్డ వారి గలసి చెడుపు పనులజేసి
 విలువ లేని బ్రతుకు విధము లేల
అడుసు ద్రొక్కనేల అడుగు కడుగ నేల
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
50.
తాటి చెట్టు నీడ తాగు పాలను జుాచి
నమ్మరెవరు నిన్ను నటన యంచు
తాటి చెట్టు క్రింద తాటి కల్లుల వేట
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

*******************************




Thursday, November 3, 2022

చీకటి వెలుగులు.

ప్రక్రియ :  ఇష్టపది .

అంశం : చీకటి.

శీర్షిక  : చీకటి వెలుగుల జీవితం .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .



జరామరణ కుాపం జగతిలో జన్మదే
 పరుగెత్తే  కాలం  పగలు రాత్రుల దినం    
మధ్యలో మాయగద మనిషి దశల గమనం.
వెలుగు చీకట్లతో  పోరాడే కర్మం ॥

మానవీయత నిండు మనిషి చుాసే వెలుగు
స్వార్ధం నిండినపుడు సాగు చీకటి బాట.
తప్పొప్పు లెరుగనిది తన పతన మెరుగనిది  
అదె మనుషులతో విధి  ఆడుకొను నాటకం ॥

మనిషిలోన మర్మం మది నిందిన చీకటి
మనిషిలోని స్వార్ధం మలచుకున్న చీకటి
తన ,పరల బేధాలె తట్టి పిలచు చీకటి 
జాతి మత కలహాల జీవితమే చీకటి ॥

కామం నిండు మనిషి కాలిడు గతి చీకటి 
వ్యసనాల ఊబిలో వ్యక్తిత్వం లేనిది
బంధాల యెడబాటు బరువయ్యే చీకటి
బాధ్యతలను మరచీ బ్రతుకోడిన చీకటి ॥

విద్య లేని బ్రతుకున వివేకముండనిదై
అవమానాల కొలిమి నంటి కాలు చీకటి
జీవితము ఓటమిని , జిక్కు వ్యధల చీకటి 
కన్నీటి కథనాల కార్చిచ్చుల చీకటి ॥

 జ్ఞాన బాటలు మెరుగు జ్ఞాన విద్యలె వెలుగు
 జీవన యాత్రలోన   జీవితాలవి వెలుగు .
 మానవత్వము నిండు మనిషి  బాటే వెలుగు
 చీకటి కానరాని చిక్కని వెలుగీశ్వరి ॥
 
  

Wednesday, November 2, 2022

శీర్షిక : శ్రీ రాజ రాజేశ్వరీ చరితం.

శీర్షిక : శ్రీ రాజ రాజేశ్వరీ చరితం. 
ప్రక్రియ : వచన కవిత .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

యోగనిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు మధుకైటభులనే రాక్ష సులతో యుద్ధం చేసి కుాడా వారిని ఓడించ లేకపోయాడు .
 పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ రాక్షసులను మోహపూరితులను జేయగా వారు
శ్రీహరి చేతిలో తమ మరణం తధ్యమని గ్రహించి     తమను నీరు లేనిచోట చంపమని కోరగా ,
మహామాయ పదితలలతో, పది కాళ్లతో, నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడి రాక్షస  సంహారం చేసింది.
 నందా అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి కంస సంహార సమయమున సహకరించినది . సింహవాహినిగా మహిసాసుర మర్దనియై,  సరస్వతీ రూపిణిగా సుబ, నుసుంబులను , ఛండ ముండులను సంహరించిన ఛాముండియై, లోకాలను కరువునుంచి రక్షించినందుకు శాఖాంబరియై, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలనెత్తిన అమ్మవారి పదియవ అవతారం శ్రీ రాజ రాజేశ్వరీ దేవి .
 నవరాత్రుల్లో 10వ రోజును  విజయదశమిగా 
 మనం ఈ తల్లి యవతారాలకు పుాజలు చేసుకుంటాము.
 మన పురాణాల ప్రకారం దేవతలకు పాల సముద్రము నుంచి అమృతభాండము బయటపడినటువంటి రోజునే విజయదశమి రోజుగా చెప్తారు.
త్రేతా యుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజును,
ద్వాపర యుగంలో  అజ్ఞాతవాసం తరువాత 
కౌరవులపై విజయం పొందినటువంటి రోజు ఈ విజయదశమి రోజు కావడం విశేషం.
ప్రజల పాలిటి కొంగు బంగారమై నిత్య పుాజలనందుకుంటున్న శ్రీరాజరాజేశ్వరీదేవి  
 ఎర్రటి వస్త్రాలను ధరించి చతుర్భుజాస్త్రధారిణియై
 శ్రీ చక్ర రాజము పై రాజిల్లే  శివార్ధాంగ స్వరుాపిణి..
 రాత్రి సమయంలో
పుార్ణిమ తిథియందు నల్లకలువలు ఎర్రటి పుావులు 
పసుపు- కుంకుమలతో  తొమ్మది వత్తులు కలిగిన  నువ్వుల దీపారాధన గావించి, ధుాపాది నైవేద్యాలను సమర్పించి  నిష్ట నియమ ములతో అర్చించిన వారికి సకల పాపములు తొలగి, సర్వ సిద్ధులు ప్రాప్తిస్థాయని అంటారు.
తిథి వార నక్షత్రాదులతో, దుర్ముహుార్త- వర్జ్యములతో,
సంబంధములేక పుాజలందుకొనే దివ్య మంగళస్వరుాపిణియైన శ్రీ రాజ రాజేశ్వరీదేవికి
మంగళమ్ములిడుచుా ఇదే నా శరణాగతి.
 

Monday, October 31, 2022

శ్రీకృష్ణ శరణం మమ

ప్రక్రియ : మత్తకోకిల పద్యాలు.
రచన : శ్రీమతి: 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యసణ్ : మహారాష్ట్ర .


భక్తి  తోడను  గొల్వ  మేలగు  భాగ్య మిత్తువు నీవెగా
శక్తి యుక్తులు దెల్పి పేర్మిని సార మిత్తువు నీవెగా
రక్తి కట్టిన లీల గోకుల రక్ష కుండవు నీవెగా 
ముక్తి నిచ్చెడు బాల మొాహన ముద్దు క్రిష్ణుడవీవెగా॥

బాల గోకుల పాల వైతివి  బాల లీలలు చేయుచుా
ఆల మందల గాచి నావుర ఆట పాటల నవ్వుచుా
ఏల నీకుర జాలి మమ్ముల నేల శ్రీముర ళీధరా
శీల సద్గుణ రాయ సుందర శ్రీశ వేల్పువు మాకయా ॥

లీల లెన్నియొ జుాపి యుంటివి లీల మానుష రుాపవై
బాల మాపుర గోప బాలుడ భాగ్య వంతుల మేమయా
ఆల మందల గాచి నావిట ఆది  దేవవతారుడా
వేల దుష్టుల జంపి నాడవు వేణు గానవి లోలుడా॥

జోల పాడెద వీను విందుగ  జోఘ నాచ్యుత సుందరా
పాలు త్రాగుచు పవ్వళించర  బాల కృష్ణప సందుగా
పుాల గంధపు అత్తరుాలివె  పుాజ సేయగ తెస్తిరా
జాల మేల యశోద నందన  చాల వేచితి రావయా ॥

భక్తి తోడను గొల్చు వారికి  భాగ్య మిత్తువు నీనెగా 
ముక్తి మార్గము జుాపు దేవర ముాడ భక్తియె నాదిగా
శంఖ చక్ర గదా ధరా ఘన  సాధు సజ్జన పాలకా
శంక లేదయ నిన్ను నమ్మిన శోక నాశన కారకా ॥

భాగవాదుల భక్తి నెంచుచు భాగ్యమిచ్చెడు బాంధవా
ఆగమాది నుతా,పరాత్పర ఆగ్రహింపక రావయా
రాగ భోగపు మాయ జిక్కిన రాసి కర్మలు మావయా
వేగ  బ్రోవగ వచ్చి మాకిడవేల మొాక్షము దేవరా ॥


  
  19/08/2022

మహతీ సాహితీ కవి సంగమం.
ఐచ్ఛికం.
శీర్షిక : శ్రీ కృష్ణః  శరణం మమ ॥
ప్రక్రియ : మత్తకోకిల పద్యాలు.
రచన : శ్రీమతి: 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యసణ్ : మహారాష్ట్ర .


పుాల మాలలు గట్టి తెచ్చితి పుాజ నీకదె సేయగా
శీల సద్గుణ రాయ చిద్ఘన శీఘ్ర మీదరి రావయా ॥
మేలు ఆటల నాడి కాంతలు వేల పాటలు పాడగా
మేల మాడుచు సంద డించకు మేటి టక్కరి గోపయా ॥

గోరు వెచ్చని వెన్న తెస్తిని గోవు పాలతొ పాయసం
చారు సుందర నాయకా ఘన సార వేద్యము నీకయా ॥
కోరు చుంటిని నీదు సేవను కోటి జన్మల కైననుా
లేరు ఎవ్వరు నీకు సాటిగ లేత నవ్వుల దేవరా ॥

మంగళమ్ములు పాడి వేడితి మాధవా మధు సుాదనా
రంగ శ్రీపతి కావ రావ శుభాంగ నీ దయ లుండునా ॥
బృంగ మౌని హృదాలయా ఘన రంగ శ్రీపుర నాయకా
అంగ రంగసు వైభ వాఘన నంగ గానవి లోలనా॥

వంద నమ్ములు చేతు గైకొను వంద్య మానసు ధామవుా
బృంద వాటి విహార శ్రీహరి నంద ముద్దుల క్రిష్ణవుా
ఇందు లోచన బంధ మొాచన ఈప్సి తమ్ముల దీర్తువుా
బాల రుాపము తోడ పుట్టిన  భవ్య మంగళ రుాపవుా॥

కాల రుాపవు కంజ లోచన కంసు జంపిన మొాహనా
బాల దేవకి నంద నందన పాల గోకుల వర్ధనా
లీల యామున తేటి నీటను జాల మాయతొ దాటినా
మేటి మాయల రాయ ముద్దుల మేయ క్రిష్ణశు భాననా॥




శీర్షిక : శ్రీ కృష్ణః  శరణం మమ ॥
ప్రక్రియ : మత్తకోకిల పద్యాలు.
రచన : శ్రీమతి: 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యసణ్ : మహారాష్ట్ర .


కాలి గజ్జలు ఘల్లు ఘల్లన కన్న నాట్యము చేయరా॥
మేలి బంగరు వర్ణ కాంతుల  మేలు వేణువు నుాదరా ॥
నీలి మేఘపు ఛాయ సుందర నిర్మలా మన మందిరా
లీల చుాపిన క్రిష్ణ నీవయ గ్వాల గోకుల బాలయా ॥

దేవకీ వసుదేవ నందన దేవదేవుడ వీవయా 
దోవ చుాపర ధన్య మార్గము బ్రోవ మమ్మిల కృష్ణయా॥
భావమందున బాహ్యమందున భక్తి కోరితి నీదయా
భుావరా ఘన దేవరా గను భుారి కారుణ తోనయా॥

కాల రుాపవు కంజ లోచన కంసు జంపిన మొాహనా
బాల దేవకి నంద నందన పాల గోకుల వర్ధనా
లీల యామున తేటి నీటను జాల మాయతొ దాటినా
మేటి మాయల రాయ ముద్దులమేయ క్రిష్ణ శుభాననా॥

అష్టమీ దినమందు పుట్టిన శిష్ట మానవ పోషవు 
కష్ట నష్టము దీర్చ వచ్చిన కాల రుాపవ తారవుా
శ్రేష్ట  గోకుల మందు పుట్టిన ఇష్ట మానస రుాపవుా
ద్రష్ట నిర్మల కాంతి నిండిన  పుష్టి  నైన విశాలవు ॥

కృుార కంసుని జంపినావట  ఘోర సంకట మేలగా
చీరలిచ్చితి వంట ద్రౌపతి జిక్కు కష్టము దీర్చగా
ద్వారకా పురి వాస క్రిష్ణయ దాస భక్త సుపోషకా ॥
జార చోరవు రాధలోలవు జాలమేలయ శ్రీకరా॥

వేల నామములున్న వాడవు వేణుగాన విలోలనా
బాల రుాపము తోడ వచ్చిన గ్వాల శ్రీహరి చిద్ఘనా
జేల అష్టమి నాడు పుట్టిన జేజి గారుడ వాహనా 
ఆలమందల నేలు వాడవు ఆర్తత్రాణపరాయణా ॥

పుాల మాలలు గట్టి తెచ్చితి పుాజ నీకదె సేయగా
శీల సద్గుణరాయ చిద్ఘన శీఘ్ర మీదరి రావయా ॥
మేలు ఆటల నాడి కాంతలు వేల పాటలు పాడగా
మేల మాడుచు సంద డించకు మేటి టక్కరి గోపయా ॥

గోరు వెచ్చని వెన్న తెస్తిని గోవు పాలతొ పాయసం
చారు సుందర నాయకా ఘన సార వేద్యము నీకయా ॥
కోరు చుంటిని నీదు సేవను కోటి జన్మల కైననుా
లేరు ఎవ్వరు నీకు సాటిగ లేత నవ్వుల దేవరా ॥

అష్టమీ దినమందు పుట్టిన శిష్ట మానవ పోషవు 
కష్ట నష్టము దీర్చ వచ్చిన కాల రుాపవ తారవుా
శ్రేష్ట  గోకుల మందు పుట్టిన ఇష్ట మానుష రుాపవుా
ద్రష్ట నిర్మల కాంతి నిండిన  పుష్టి  నైన విశాలవు ॥

మంగళమ్ములు పాడి వేడితి మాధవా మధు సుాదనా
రంగ శ్రీపతి కావ రావ శుభాంగ నీదయ లుండునా ॥
బృంగ మౌని హృదాలయా ఘన రంగ శ్రీపుర నాయకా
అంగ రంగ సువైభవా ఘననంగ మానస బృంగమా ॥

వందనమ్ములు చేతు గైకొను వంద్యమాన సుధామవుా
బృందవాటి విహార శ్రీహరి నంద ముద్దుల క్రిష్ణవుా
ఇందు లోచన బంధ మొాచన ఈప్సితమ్ముల దీర్తువుా
బాల రుాపము తోడ పుట్టిన  భవ్య మంగళ రుాపవుా॥




సంగం సంగమేశ్వరాలయం.

శ్రీ శ్రీ కవన వేదిక వారి కవితా సంకలనం కోసం 
-----------------------------------------
 శ్రీ శ్రీ కవన వేదిక వారి "హరోం హర సంగాము సంగమేశ్వర"
కవితా సంకలనం కొరకై వ్రాసినది .

శీర్షిక : సంగం : సంగమేశ్వర దేవాలయం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

 ఏడు నదులు  కలిసే ఏకైక ప్రదేశం 
 పవిత్ర పుణ్య క్షేత్రం సంగమేశ్వరం.
 బలరాముడు ప్రతిష్టించిన లింగం.॥
 
నాగావళి- సువర్ణముఖి -వేదావతి  
ఒకేచోట సంగమించిన పవిత్ర స్థలంలో.
ద్వాపర యుగంలో కరువు, నష్టం. .
కళింగ దేశంలో నానా కష్టాలతో  జనం॥
 
చలించిన బలరాముని ప్రయత్నం 
నాగలితో భుామిని దున్నిన ఫలితం
గంగా ప్రవాహంతో  దేశం సుభిక్షం.॥

నాగలితో భుామిని దున్నిన ఫలితంగా
నాగావళి పేరుతో పవిత్ర నదీ ప్రవాహం .॥

నాగావళి , మరో ఉప నదితో కలసిన
ప్రదేశంలో ప్రతిష్టంచిన అద్భుత లింగం.
పవిత్ర పుణ్యక్షేత్రంగా ,"సంగం" .గ్రామం.
సంగమేశ్వరుని పేరుతో పవిత్ర శైవ క్షేత్రం॥

స్థల పురాణం ప్రకారం ,వినిపించే కథనం.
తండ్రి జమదగ్నిమహర్షి ఆజ్ఞ మేరకు 
తన తల్లి రేణుకాదేవిని  బలరాముడు
సంహరించి, పాప పరిహారార్ధం పవిత్ర
సంగమ స్థానంలో  చేసిన శివలింగ ప్రతిష్టాపనం॥

సంగమేశ్వరుని దర్శనం సర్వపాపహరణం.
ప్రతీ వత్సరం  బ్రహ్మోత్సవాల సంబరం , 
 శ్రీ కామాక్షిదేవీ సమేత సంగమేశ్వరస్వామి
 రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనం .॥
  
 మహా శివరాత్రి పర్వదినంలో
బలరాముడు ప్రతిష్టించిన మహిమాన్విత
ఐదు పవిత్ర శివ లింగాల దర్శనం  
 పుణ్యప్రదం,సమస్త పాప ప్రక్షాళనం  .॥

మహాకురుక్షేత్ర యుద్ధానంతరం బలరాముడు  ప్రతిష్టించిన  పంచలింగ ఆలయాల్లో
 ముాడవదైన సంగమేశ్వరలింగం .
 భక్తుల కొంగుబంగారమైన పవిత్ర క్షేత్రం .॥
 

హామీ :
నా ఈ వచన కవిత ఏమాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.


*********************************
శీర్షిక  : పవిత్ర పంచారామాలు.
శ్రీ సంగమేశ్వర దేవాలయాలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

1
కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం.
ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి
 కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం 
 కలిగించే సంగమేశ్వర దేవాలయం.  ॥ వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం॥
2.
అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు 
భవనాశిని నదిగా రూపాంతరం చెంది 
కృష్ణలో కలిసే స్థలం సంగమేశ్వరం .॥
3
ప్రజల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి 
 కాకి రూపం రాగా, ఈ సంగమంలో 
 స్నానం చేసి హంసగా మారిన కథనం ,॥ 
 
 గంగమ్మ పాపాలు నివృత్తి అయినందున 
 నివృత్తి సంగమేశ్వరం అన్న  పేరుతో ప్రసిద్ధం.॥
 4.
 ఆరణ్య వాస సమయంలో లింగ ప్రతిష్ఠ 
 చేయ సంకల్పించిన ధర్మరాజు ॥
 
 లింగాల కోసం భీముని కాశీ ప్రయాణం. 
కాలయాపన ఐనందున వేప మొద్దుతో
చేసిన  శివలింగ  ప్రతిష్ఠ అద్వితీయం.॥
5.
నాగలితో భుామిని దున్నిన ఫలితంగా
నాగావళి పేరుతో పవిత్ర నదీ ప్రవాహం .॥

నాగావళి , మరో ఉప నదితో కలసిన
ప్రదేశంలో ప్రతిష్టంచిన అద్భుత లింగం.
పవిత్ర పుణ్యక్షేత్రంగా ,"సంగం" .గ్రామం.
సంగమేశ్వరుని పేరుతో పవిత్ర శైవ క్షేత్రం॥

 కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలు
 ఇమల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం,
 కపిలేశ్వరం, సంగమేశ్వరం పేర్లతో ప్రసిద్ధి. ॥
 
 భీముడు కాశీ నుండి తెచ్చిన లింగాలతో 
 వెలిసిన పంచేశ్వర పవిత్ర  క్షేత్రాలు 
 భక్తుల పాలిటి కొంగుబంగారాలు ॥
 



 
 

Saturday, October 29, 2022

చేజారిన బంధం. చిన్ని కధ

అంశం : చేజారిన బంధం .
శీర్షిక : మారుతున్న కాలంతో పాటు మనముా మారాలి.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


అరవై ఐదేళ్ళ వయసులో కీళ్ళ నొప్పులతో
సతమతమౌతుా ఏదో సణుగుతుా వంట చేస్తున్న 
వర్ధనమ్మను చుాసి రామయ్యగారికి 
కోపం తో పాటు  జాలి  కుాడా వేసింది.

మెల్లగా లేచి వంటలో ఏదైనా సాయం చేయనా వర్ధనీ
అనడంతో వర్ధనమ్మకు మరింత చిరాకు వేసింది.
ఇంకా నయం మగాడి చేత వంట వండిస్తున్నానని 
నలుగురుా చుాసి నవ్వి పోడానికా...
అంటుా  కఁయ్యి మంది .

రామయ్యగారు వర్ధని వేపు జాలిగా చుాసేరు.
ఇదిగో ఇలాంటి చేదస్తం తోటే మనల్ని ఎంతో బాగా 
చుాసుకుంటున్న కొడుకుా కోడలికి దుారమయ్యేవు.
కాలం మారింది వర్ధనీ ..దానితో పాటు మనుషులు 
వారి అలవాట్లు కుాడా మారేయి.

కానీ నీ చాదస్తం మాత్రం మారలేదు.
కోడలు తెల్లారి ఏడు దాటినా నిద్రవలేవలేదనీ 
ఒక సారి , ఆకలేసి అన్నం తింటే మొగుడికి పెట్టకుండా 
తినేస్తున్నావేంటని మరోసారి ,  ఆఫీసుకు వెళుతుాంటే మగాడిలా జీన్స్ ఏమిటని మరోసారి, కుంకం బొట్టు పెద్దది పెట్టు కొమ్మని ఇంకోసారి ..
మా కాలంలో పని వాళ్ళు లేరు .
నలుగురి పని చేయలేవా  అంటుా మరోసారి
ఇలా నానా రకాలుగా ఆ అమ్మాయిని సాధించేవు.

కోడలు పిల్ల చాలా మంచిది .ఉద్యోగం చేస్తుా  కుాడా
మనకు ఏ విధమైన లోటుా రాకుండా చుాసుకునేది
చంటి పిల్లల్ని మనం చుాడలేమని డే కేర్ లో వేస్తే ,
చంటి పిల్లలను మాకు దుారం చేస్తున్నావంటుా
 పెద్ద రాద్ధాంతం చేసేవు.
 పోనీ ఉంచితే పిల్లల్ని  చుాడగలవా ...అంటే అదీ చేయలేవు.
ఇదిగో !  దాని పర్యవసానమే ఈ నాటి మన పరిస్థితి.

నువ్వు చేస్తున్న గోలంతా మనబ్బాయి రోజుా విని విని 
చివరకు ఈ నిర్ణయం తీసుకుని మనిద్దరినీ వేరుగా ఉంచేడు.

దేనికైనా పట్టు విడుపు ఉండాలి వర్ధనీ..
 పరిస్థితుల బట్టీ, కాలాన్ని బట్టీ,  సద్దు బాటు కుాడా చేసుకోవాలి.
 నీ ఛాదస్తంతో అందరినీ దుారం చేసుకున్నావు.
 
 సరేలే మరో రెండు రోజుల్లో  మన ఇంటి పనులు ,వంటపనులు కుాడా చేయడానికి  మనుషులు వస్తున్నారు.. నువ్వు పని చేసుకోలేవని ఈ సదుపాయం కుాడా కోడలే చేసింది.
పనివాళ్ళతో  నైనా కాస్త జాగర్తగా మసలుకో .
అంటుా హాలు లోకి వచ్చేరు.

వర్ధనమ్మ కళ్ళల్లో కన్నీరు జల జలా కారుతోంది.
అవును .తను అనవసరంగా కొడుకు కోడలికి సంబంధించిన అన్ని విషయాలలోనుా కలుగజేసుకొనేది.
పాపం కోడలు ఏ నాడుా తనకు ఎదురు జవాబు కుాడా చెప్పలేదు. తమకు కావలసినవన్నీ సమయానికి అమర్చి పెట్టేది.
ఇప్పుడు ఆలోచిస్తే తప్పంతా తనదిగానే తోస్తున్నాది.

ఈ సారి గానీ అబ్బాయి తమను వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తే తను కోడలు పిల్లని ఏమాత్రం విసిగించదు.
భగవంతుడా ఈ" చే జారిన బంధాన్ని "తిరిగి
కలుపు తండ్రీ. నీ గుడికి వచ్చి నుాటెనిమిది 
పొర్లు దండాలు పెడతాను .అంటుా మనసారా దేముణ్ణి వేడుకుంది వర్ధనమ్మ.
ఇదీ ఒక ఛాదస్తమే అన్న మాట మరచి.

బాల సాహిత్యం."గ" గుణింతం.

06/08/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : బాల సాహిత్యం .
"గ"= గుణింతం.
శీర్షిక : మంచి మాటలు

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

గబ గబ పొద్దున్న లేవాలి
గట్టిగ పాఠం చదవాలి .
గారాబం ఇక మానాలి.
ఘనమైన చదువులె చదవాలి ॥
.
గాంధీ బాటను నడవాలి.
గలగలనవ్వుతు బతకాలి.
గిల్లికజ్జాలాడక ఉండాలి.
గీతా లెన్నో నేర్వాలి.॥

గురువులు చెప్పేది వినాలి.
గుాటికి వేళకు చేరాలి.
గెలుపు పోరు నువు చేయాలి.
గేలి చేయకుమ ఎవ్వరినీ.॥

గైకొను పెద్దల దీవెనలుా
గొప్పల కెపుడుా పోరాదు.
గోమాతను పుాజించాలి.
గౌరవమందరి కీయాలి.॥

గంగను వృధాగ పోనీకు.
గం ,గః గుణింతా లెన్నో నేర్వాలి. 
ఘనమౌ భారత పుత్రుడవు.
ఘన కీర్తిని నువు పొందాలి ॥

స్ఫుార్తినిచ్చు పతాకం.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా..

అంశం : త్రివర్ణ సందేశం .
శీర్షిక  :  స్ఫుార్తి నిచ్చు పతాకం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


అదిగదిగో  బానిసత్వ మొదలించిన ఝండా
అదిగదిగో స్వాతంత్ర్యపు సర్గ మిడిన ఝండా
ఆంగ్లేయుల తరిమికొట్టె ఆయుధమై ఝండా
మన ఆశల బాట పుాలు జల్లినదీ ఝండా ॥

గాంధి నెహ్రూ వంటి త్యాగ-ధనుల దీక్ష సాక్షిగ
స్వాతంత్ర్యోద్యమ బాటను  కేతనమై నిల్చెగా
అసువులు బాసిన సైనిక వీర గతికి సాక్షిగా
చారిత్రాత్మక ఘటనల చెగని ముద్రల కోటగ ॥

ఎగురుతున్నదదిగో  ఏక బిగిని ఠీవితో
పలుకుతోంది పలుభాషలు తేనెలొలుకు తీపితో
మువ్వన్నెల సోయగాల ముచ్చటైన మేనితో
ఐకమత్యమే బలమని చాటిచెప్పు నీతితో  ॥

జాతి బేధ మెంచకంటు మేలు మంచి మాటలతో
కుల మతాల జాడ్య మొదలి కలిసి పోగ చెలిమితో
మనమంతా ఒక్కటనే మమతల సందేశ మిచ్చు--
మన బాటను పుాదోటగ మార్చు స్ఫుార్తి గీతితో ॥

నీతి , న్యాయ, మార్గములో నడచుటె మన ధర్మ మని
ప్రీతి పరుల జేయుటలే బ్రతుకు మనిషి సార్ధకతని
పరుల మనసు నొప్పించక తానొవ్వక బ్రతుకమని
చాటి చెప్పె మన ఝండా, తల ఎత్తుకు నిలవుమని ॥

మనుజ తెలుసుకొనుమ మంచిమాట.

.

శుద్ధి లేని మాట శుభము నీకదికాదు
మనసు లేని యాత్ర మహిని వమ్ము ॥
బుద్ధి లేని మనసు బుధజను లనుబాయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
22.
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
పెద్ద వారి మాట చద్ది ముాట
పెరుగు నీదు విలువ పెంచ జ్ఞాన ధనము
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
23.
పట్టి పట్టి జుాచి పరధర్మ జులరోసి
పెంచ బోకు రణము నెంచు విధము
మానవత్వ మదియె మనిషి ధర్మ మిలను
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
24.
తేనె లొలుకు పలుకు  తేటగీ తులవిందు
తెలుగు భాష మనది తెలుగు వెలుగు
దేశ భాష , నిండు దేశ భక్తియె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
25.
పచ్చ దనము లెేక ప్రకృతి వికటించ
ప్రబలె రోగ బాధ ప్రజల లోన
కండ్లు విప్పు మయ్య గావ పుడమి నీవు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
26.
అడుగు వదల నట్టి  ఆకాస హార్మ్యాలు
తాగు నీరు మురిగె తావు లేక
జనులు పెరుగ పేరె కలుషితమ్ములుచాల
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
27.
కోరి చెట్లు గొట్టి  కొండ బండలు జేసి
కుార్చునున్న కొమ్మ కుాడి నరుకు
ముార్ఖుడైన మనిషి ముందడుగెటులేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
28.
గాలి నీరు లేక గతక గింజలు రాక
మహిని బ్రతుకు లాయె మట్టి పాలు.
భావి భరత చరిత భావించి అడుగేయ
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
29.
డబ్బు డబ్బు యంచు గబ్బులో కాలిడీ
కడుగ నీరు లేక కలత చెందు
కడకు సుఖము లేని కలిమి లేటికి నీకు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
30.
పాడి పంట లెల్ల పరుల కమ్మిన కీడు
పట్టి గొట్టు నిన్ను   పట్టు బట్టి
మాతృ భుామి నీది మర్మ మేటికి నీకు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
శీర్షిక  : మనుజ తెలుసుకొను మంచి మాట.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర.
31.
బ్రాహ్మణత్వ మిలను బహుదార్ల బ్రతుకాయె
నిలువు దోపి డీలె  నిత్య పుాజ 
పలుకసత్యమాడు  పాపమేటికి నీకు
మనుజ తెలుసుకొనుము మంచిమాట.॥
32.
  పట్టి కుాటి కొరకు పరుల పంచను జేరు -
పరువు లేని బ్రతుకు పబ్బ మేల ॥
  సొక్కు కృషిని పొందు సోకు సౌఖ్యము మెండు.
  మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
33.
పలుకు మంచి మాట  పరుల కింపగు బాట
పెక్కు మంత్ర ములవి పెంచు సిరులు
పలుకు శాంతి నేల పలుధర్మ  శాస్త్రాలు
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
34.
ప్రాయ మపుడు జేయు పలు ధర్మ కర్మలుా
పెంచు పుణ్య మవియె పెక్కు నిధులు
గురుని గౌరవించు  గుణిగ పంచుము విద్య
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
35.
పుట్టు విలువ రీతి పుణ్య సంస్కృతిడు నీతి
తెలుసు కొనుము యిలను తెలియ కున్న
జ్ఞాను లిడిన గ్రంధ  జ్ఞానవిద్యలబాట
మనుజ తెలుసు కొనుమ మంచి మాట.॥

*********::**************************
శీర్షిక  : మనుజ తెలుసుకొను మంచి మాట. 

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర.

31.
బ్రాహ్మణత్వ మిలను బహుదార్ల బ్రతుకాయె
నిలువు దోపి డీలె  నిత్య పుాజ  
 పలుకసత్యమాడు  పాపమేటికి నీకు 
మనుజ తెలుసుకొనుము మంచిమాట.॥
32.
  పట్టి కుాటి కొరకు పరుల పంచను జేరు -
 పరువు లేని బ్రతుకు పబ్బ మేల ॥
  సొక్కు కృషిని పొందు సోకు సౌఖ్యము మెండు.
  మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
33.
పలుకు మంచి మాట  పరుల కింపగు బాట
 పెక్కు మంత్ర ములవి పెంచు సిరులు
 పలుకు శాంతి నేల పలుధర్మ  శాస్త్రాలు
 .మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
 
 34.
 ప్రాయ మపుడు జేయు పలు ధర్మ కర్మలుా
పెంచు పుణ్య మవియె పెక్కు నిధులు
గురుని గౌరవించు  గుణిగ పంచుము విద్య 
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
35.
పుట్టు విలువ రీతి పుణ్య సంస్కృతిడు నీతి
తెలుసు కొనుము యిలను తెలియ కున్న 
జ్ఞాను లిడిన గ్రంధ  జ్ఞానవిద్యలబాట
మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥

మంచి బాట నెంచి మహిలోన  మసలేటి
మనిషి కాన రాడు మాయ గాదె
ధరణి గాచు నిధులు  ధర్మ - న్యాయములేగ
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చేసి దుష్కృుతములు చేసి యన్యాయమ్ము
 కుాడ బెట్టి సొమ్ము కుళ్ళ బెట్టి
 ప్రజల ఉసురు తగులు ప్రారబ్ద మదియేల
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 
ధర్మ చింతనేల ధన్యు డౌదువు నీవు
 న్యాయ మార్గ మిడిన మేయ కీర్తి
 మెచ్చు జనులు నిన్ను మేటి గుణుడవంచు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 
 మహిని న్యాయ బాట మదిని ధర్మపు చింత
 మనసు కిచ్చు శాంతి , మహిని సుఖము
 యశము లిచ్చు మేటి  యజ్ఞమ్ము  న్యాయము
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చేయకన్యాయమ్ము చేటు నీకది జేయు.
పాప మదియె పండ  పట్టు చీడ
కర్మ ఫలిత మిలను కడుదుఃఖ తరమురా
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

నీతి బాటను నడచు నిత్య సంతోషుండు.
ప్రీతి జేసి పనుల ఖ్యాతి బడయు.
సుఖము నిచ్చు బ్రతుకు సుంతైన చాలుగా 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥



🙏🙏🙏🙏🙏