Saturday, April 30, 2022

శీర్షిక : విప్లవ కవి. శ్రీశ్రీ

తేదీ:  *30-04-2022*
*శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా* 
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

 
శీర్షిక  : విప్లవ కవి. శ్రీశ్రీ 

అల్లకల్లోలమైన జన సంద్రంలో
ఒరిగిపోతున్న ఒడిదుడుకుల నావకు 
చుక్కానై , జనులకు ఉత్తేజం కలిగించే 
కవితా వాహినిలో బాటను చుాపిన
బహు జన చైతన్య కవితా ఖని 
హేతువాదియైన  శ్రీ శ్రీ ॥

ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించి 
తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చి, 
విప్లవ తుాణీరాలతో వింటిని సారించిన 
అభ్యుదయ రచనా దురంధరుడు కవి శ్రీ శ్రీ .॥

అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించి
అందరి మన్ననలనుాపొందిన మేటి కవి శ్రీశ్రీ  ॥

వ్యక్తి ఒక మహోద్యమ శక్తి" అని, 
అతను సృజించిన అక్షరమే మహత్తర 
మార్పుకు కారణమని  ప్రత్యక్షంగా తన
కవితలతో భావోద్యమాన్ని ప్రకటించిన
విప్లవ ముార్తి శ్రీ శ్రీ ॥

గురజాడ బాటలో వాడుకైన భాషలో 
మాత్రా ఛందస్సుల మహోజ్వల హోమాన్ని
సంకల్పించి , ఉద్రేకం ఉత్తేజం కలిగించే
కవన యజ్ఞానికి శ్రీకారం చుట్టిన ఘనుడు శ్రీ శ్రీ ॥

 ఎన్నో విరుధ్ధమైన భావాలు గల వ్యక్తిత్వం
 ఎన్నో సంఘర్షణలతో కుాడిన ఉద్వేగం.. .
 హేతువాదం, నాస్తికత, మేళవించ రాసిన
 మహోన్నత కవిత్వం బాటలో అతడు 
 రాసిన కవిత్వం , మహాప్రస్థానమై అతనికి
కీర్తి కిరీటాన్ని  ఆపాదించి కవిగా  ఆతనిని అందలాలకెక్కించింది ॥
 
 శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించి, 
 తనదైన  శైలిలో వాడి సిద్ధాంతాల 
 వేడిని సృజింపజేసి కవన వనం లో 
 మనకను విహరింపజేసిన  హేతువాది గా  అందరిమదిలో చిరస్థాయిగా నిలచిపోయి
విప్లవ విజేత శ్రీ శ్రీ గా ప్రసిద్ధి చెందిన  
సాటిలేని మేటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు ॥



కవుల వర్ణన

*నన్ను నా పుస్తకాన్ని ఆశీర్వదించిన కవి మిత్రులు..*

▪️గౌరవనీయులు పద్య పండితులు శ్రీ నేమాని ప్రసాద్ గారికి..

▪️గౌ. మిత్రుడు, సదా చిరునవ్వు చిందించే తోటి ఉపాధ్యాయుడు శ్రీ థామస్ రెడ్డి గారికి..

▪️ప్రతి ప్రక్రియలో హుషారుగా పాల్గొనే  శ్రీమతి రాధాబాయి యార్జల్ గారికి..

▪️మాతృభాష తెలుగైనా మరాఠీ చానల్లో మహరాణిగా చలామణౌతున్న రేణుక గారికి..

▪️అక్షరాలను లోతుపాతుల్లోంచి లాగి అర్థంకాకుండా అర్థవంతమైన కవితా రూపమిచ్చి అందరినీ ఆకుట్టుకునే కవి, చిత్రకారుడు శ్రీ గుబ్బల శ్రీనివాస్ గారికి..

▪️రాజకీయాలపై పరిపూర్ణ జ్ఞానం, పత్రికల్లో పలు ఆర్టికల్స్. 
హిందీ, తెలుగు చిత్రసీమ నటులపై, నటనపై, పాటలపై మంచి పట్టున్న సమర్థుడు మన జిల్లా గోవర్దన్ గారికి..

▪️నానీలను బాణాల్లా ప్రయోగించగల ఎదులేని మనిషి మన భీష్మపితామహుడు శ్రీ శంకర్ మాష్టారు గారికి..

▪️వివిధ ప్రక్రియల్లో లఘు, ధీర్గ కవితలు రాయడంలో అందెవేసిన కలం శ్రీ దోజశ్రీ గారికి..

▪️నిజ నిజాలపై నిక్కచ్చిగా తీర్పునిచ్చే శ్రీ కట్ట రాజు గారికి..

▪️సినిమా నటుడు, అనువాదకుడు, శ్రీ ప్రతాప్ రెడ్డిగారికి..

▪️ఫిరంగి గారికి..

▪️కంచుగంట (కంఠం) శ్రీ ...అ.అ... గారికి..

▪️శ్రీమతి అద్దంకి లక్ష్మిగారికి..

▪️ఏ ప్రక్రియనైన, ఏ విషయమైనా నిర్భయంగా రాయగలిగే శ్రీమతి జగధీశ్వర మూర్తిగారికి..

—మీ అందరికి హృదపూర్వక ధన్యవాదములు..

—మీ *జక్కన్న..*
🌹🙏🌹

Friday, April 29, 2022

కష్టే...ఫలే...

29/04/2022.
మే డే సందర్భంగా..
మనుమసిద్ధి కవన వేదికలో

అంశం :  శ్రామిక సౌందర్యం.
శీర్షిక :  కష్టే ..ఫలే...
ప్రక్రియ :వచన కవిత.

కష్టే ఫలే అన్నారు పెద్దలు.
కష్ట పడిన వారెవరుా నష్టపోలేదెపుడుా.
నాటి రోజుల్లో తొలి కోడి కుాతకే
నిదుర లేచి కాలకృత్యాలు తీర్చుకొని
పార పలుగులతో కాలి నడకన ,కుాలి 
పనులకు పోయేవారు స్త్రీలు ,పురుషులుా.
సంధ్య వేళకు  తమ తమ ఇళ్ళకు చేరి , 
ఆరుబయట  ఇరుగు పొరుగులతో 
కష్ట సుఖాల కలగల్పు ముచ్చట్లు పంచుకొని ,ఆనందంగా అలసిన 
శరీరాలకు  విశ్రాంతినిచ్చేవారు.
శ్రమయే జీవితానందంగా గడిపిన వారికి
రోగాలుా తెలియవు .భోగాలుా తెలియవు.
ఉన్న దానితో సంతృప్తి పడుతుా, ఊరంతా 
ఉత్సాహంగా కలసి మెలసి గడిపేవారు.
నేడు కష్టం తెలీని ఖర్మకు కదలేని కాయం .
కడు రోగాల నిలయమై కల్తీ మందుల
కటిక బాధల వలయమై, వ్యాయామాల 
ఉచ్చులో వ్యాకులత పడుతున్నాది.
ప్రతీ పనీ యంత్రాల పరమై  
జీవితమంతా యాంత్రికమైపోయింది.
నడవడానిక వైద్యుని సలహా నింపు
తినడానికి కొలతల మినహాయింపు
ఆనందానికి కృత్రిమ నవ్వుల హోరు
నడక  వేగానికి ట్రేడ్ మిల్ జోరులతో
జనులు శ్రమైక జీవితానందాన్ని కోల్పోతున్నారు
 ఇప్పటికైనా కాయానికి కష్టం నేర్పండి.
 ఆనందంగా అందరిలోనుా మెలగండి.
 శ్రామిక సౌందర్యాన్ని  ఆస్వాదించండి.

హామీ.
నా ఈ రచన ఏ మాధ్యమునందునుా 
ప్రచురితము కాని నా స్వీయ రచన.






Thursday, April 28, 2022

ఓ మనిషీ ! ఇకనైనా కళ్ళు తెరువు.

28/04/2022.
రచన :శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  : మహారాష్ట్ర .

శీర్షిక : "ఓ మనిషీ ! ఇకనైనా కళ్ళు తెరువు"॥
                   (ఆరని కన్నీటి కథనం )

అద్దాల సౌధాల లో అధికారిక హంగులు
బ్రతుకు పొిరాటాలతో బడగు జీవితాలు.
రాజకీయపు రంగులతో రసహీనమైన చట్టాలు
డబ్వుకు దాసోహమంటున్న నీతి -న్యాయాలు ॥

మనిషిలో పెరుగుతున్న స్వార్ధం 
మంచి చెడుల విచక్షతను కోల్పోతోంది.
కులమతాల కుటిల దాడులకు, జన-
 జీవితాలు తమ ఉనికిని కోల్పోతున్నాయి ॥

రహదారుల్లో వెలసిన వృద్ధాశ్రమాల్లో
రక్త బంధాలు మరచి పారవేసిన 
 తోలు తిత్తులు, పేగు బంధాల
 ప్రేమ  పిలుపుకై  పరితపిస్తున్నాయి ॥
 
 ఆడపిల్లగా పుట్టిన క్షణం నుంచే 
అతివ ఆత్మ రక్షనును కోల్పోతున్నాది.
వావి వరుసలు మరచిన కామం
సాముాహిక సంతర్పణ చేసుకుంతోంది ॥

కాముకుల  వికృత అనందానికి 
ఆట బొమ్మలుగా మారిన అబలు 
అవమానాన్ని భరించలేక 
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ॥

నోటుకు "ఓటు" అమ్ముడుపోతోంది.
మత్తులో మునిగిన జనాలు
మంచి చెడుల తేడాను మనీ"బరువుతో
కొలిచి భావి తరాల భవిష్యత్తుకు బంధం వేస్తున్నారు..
 
రాజకీయాల్లో రౌడీయిజం పెరిగిపోయింది.
మనుషుల్లో మానవత్వం తరిగిపోయింది.
దైవ చింతనలు మతకలహాలకు మాధ్యమాలై 
దొమ్మి దాడులకు దోహదపడుతున్నాయి ॥

స్వచ్చ భారత్ , బేటీ బచావో అన్న 
ఆవేశపు నినాదాల రాజకీయ చదరంగంలో
 జనం కళ్ళు గప్పిన, కేంద్రం నిర్ణయాలకు
దేశ సంపద ప్రైవేటీకరణమై పరుగుతీసింది॥

వికృత వైకుంఠపాళీ వింత పాచికలాటలో
భావి తరం , బ్రతుకు తెరువు కోల్పోయి
వెర్రి కుక్కల వేటకు బలై .వీధిపాలయ్యింది॥

కోల్పోతున్న స్వాతంత్ర్యానికి కుంగిపోతుా
ఆవిరౌతున్న సంస్కృతి ,తరిగిపోతున్న 
పచ్చదనపు దౌర్భాగ్యానికి పరితపిస్తుా 
ఆమని అపస్వరాల  ఆరంగేట్రం చేసింది ॥

తరాలు మారినా తల రాతలు మారని 
మనిషి దుర్దశను చుాసి ,కాలం రంగు మార్చింది.
దాంతో పంచ భుాతాలు దారి తప్పేయి.
గ్రహ గాడ్పులు గాడి తప్పాయి.
ఆరు ఋతువులు అపసవ్యమయ్యేయి.

తరుగుతున్న భుా సంపదకు 
తల పగిలిన ప్రకృతి ప్రకోపానికి 
జన జీవితం అస్తవ్యస్తమయ్యింది.
"ఓ మనిషీ ! ఇకనైనా కళ్ళు తెరువు"॥

Monday, April 25, 2022

నిత్య శ్రామికుడు.

14/04/2022.
అంశం : అంబేద్కర్ జీవితాశయం .
శీర్షిక  : నిత్య శ్రామికుడు.

రచన: శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
  కల్యాణ్ : మహారాష్ట్ర .
  
  
ప్రక్రియ : వచన కవిత .

బడికి గుడికి కుాటికీ నీటికీ
 అడ్డు వచ్చే కుల మతాల ఒరవడి
 నిమ్న జాతుల ప్రగతి పథంలో
 నత్య శ్రామికుడై నిలచిన వారధి ॥
 
అస్ప్రుశ్యత, అసమానతలకు 
ఆలపించిన ఉద్యమ రవం ॥
అధర్మం, అన్యాయాల పోరుకై 
పుారించిన శంఖారవం.॥

అసమానతల కొలిమిలో 
కాలుతున్న ఆత్మాభిమానం 
అవమానాల భారంతో 
ఆక్రోశిస్తున్న అంతరంగం ॥

కుల-మత విభేదాలకు 
 కుంగిపోని ఆర్మస్థైర్యం
 రగులుతున్న గుండెతో
 విద్య కోసం విచక్షణా ప్రయాణం.॥
  
 న్యాయవాదిగా సంఘ సంస్కర్తగా
 భారత రాజ్యాంగ రుాప శిల్పిగా
 అన్యాయాన్నెదిరించే బాటలో
 ఉద్యమ పోరాటాలకు ఊపిరిపోసిన వైనం ॥
 
దళితుల హక్కులకై పోరాటం
బడుకు బతుకుల భవితకై అరాటం.
ఆదర్శాల పోరులో సాధించిన విజయం.
భారతరత్నగా వెలుగొందిన ఘన వ్యక్తిత్వం ॥

సాంఘీక సంస్కరణల గ్రంధ కర్తగా
మనుషుల్లో మలినాల్ని తుంచే కలి. 
జీవితమంతా దళితోద్ధారణకై బలి .
భీమ్ రావ్ అంబేద్కర్ మరాఠా బెబ్బులి.
ఆతనికిదే నా అక్షర సుమాంజలి ॥

Sunday, April 24, 2022

పల్లె గుాటికి పండగొచ్చింది. కవిత

24/04/2022.
శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యంలో ,

అంశం : "పల్లె గూటికి పండగ వచ్చింది"
శీర్షిక : భరతీయ సంస్కృతికి నిండు నిదర్శనాలు ॥

రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

పల్లె గుాటికి పండగొచ్చింది.
వాడ వాడలా వెలుగునిచ్చింది .
సాంప్రదాయ కట్టుబాట్లతో  సంస్కారం పంచింది.
వలపు పలకరింపుల  ప్రేమను చిలకరించింది.॥

తెల్లవారకముందే తెరచిన దేవళాలు.
వాడవాడలా వినిపించే గుడి జేగంటలు .
సామ గానాలతో వేల్పుల మేల్కొల్పులు.
దేవతారాధనలకై విప్రులు చేసే వేద ఘోషలు ॥

ఇంటింటా గుమ్మాలకు పసుపు ,కుంకుమలు 
మామిడాకు తోరణాల ముద్ద మందారాలు ,
రంగురంగుల రంగవల్లులతో నిండు స్వాగతాలు.
ప్రతి ఇంటా వెలిగే దివ్య జ్యోతుల కళ కళలు.॥

ఇంతుల అధరాల పారే నవ్వుల గలగలలు.
నేతి వంటల తీపి ఘుమ ఘుమలు .
మమత నిండిన పలకరింపుల పులకరింతలు .
పాడి నిండిన లోగిళ్ళలో గోలక్ష్మికి  పుాజలు ॥

పౌరాణిక చరితల వీధి ప్రసంగాలు
క్రిష్ణ లీలా విశేషాలతో వీధి నాటకాలు.
భారత భాగవతాది హరి కథా, సంగీతాలు.
అందరి మదిలో భక్తి నిండిన భావ ప్రకంపనలు॥

పసిడి ధాన్య లక్ష్మికి నేతి వంటల తీపి భోగాలు.
పిల్లా పాపల కేరింతలతో నిండిన లోగిళ్ళు.
పల్లెల్లో జరిగిన పండగలు , పబ్బాలు
భరతీయ సంస్కృతికి నిండు నిదర్శనాలు ॥


హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.

Thursday, April 7, 2022

శ్రీరామ నవమి.

08/04/2022.

అంశం : శ్రీ రామనవమి విశిష్టత.

శీర్షిక : అవతారపురుషుడు శ్రీరాముడు.

ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .


దశర ధాత్మ జుండు ధరరామ చంద్రుండు 
సత్య ధర్మ  శాస్త  సద్గు ణుండు 
కరుణ  నిండు హ్రుదయ కమనీయ గాత్రుండు
సుార్య వంశ జుండు శుభుడు ఇలకు ॥

యజ్ఞ రక్ష జేసి యశములెే లినవాడు
రాక్ష సాంత కుండు రామ విభుడు
శివుని విల్లు విరచి సీతను  చేబట్టి
తల్లి మాట కొరకు తరలె వనము ॥

మాయ లేడి గాంచి మక్కువ పడసీత -
రమణి కోర్కె దీర్చ రాము డేగె
రావ ణుండు వచ్చి రమణిని గినిపోయె
శోక మేలె సీత శోక వనిని ॥

భక్త హనుమ రామ భక్తుడ నిలజుండు
జలధి దాటి సీత  జాడ నెరిగి
చుాడమణిని దెచ్చి చుాపింప రాముడదె -
లంక జేరి సలిపె   రణము ఘనము ॥

 పురికి జేరె  శుభుడు  పురమంత జేల్పలుక
 మునులు ఋషులు చెందె ముదము మనము
  ప్రభువు రాము కిడిరి పట్టాభి షేకమ్ము.
  రామ నవమి మనకు రక్ష  సుండి ॥
  
********************************

పాదం మీది పంపది నాది లో బెష్ట్

పంచపది సాహితీ కవన వేదిక
పాదం మీది పంచపది నాది(4వ రోజు)
తేది:06.04.2022

*బెస్ట్ 1 పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు*

*బెస్ట్ 2 అక్కి నర్సింలు గౌడ్ గారు*

నిర్వహణ:కాటేగారు పాండురంగ విఠల్
పంచపది రూపకర్త;హైదరాబాద్
సహ నిర్వహణ:పోరంకి నాగరాజు

Sunday, April 3, 2022

కర్మ గీతం. ( జీవన వేదం )

కర్మ గీతి ..

రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ మహారాష్ట్ర .

రాగం :  శుభపంతువరాళి. ( ముల్తానా)

 పల్లవి: 
ఏనాటి కర్మల ఫలమొా గానీ
ఈ నాటి నా గతి ఈ విధి సామీ ॥

అనుపల్లవి:
నానాటి బ్రతుకులు నాటకమే సుమ్మి
 సుఖ దుఃఖ బంధాల అనుభవముల చెలిమీ ॥
 
1. చరణం 
కపటపు మాటలు కల్మష చేతలు
మాయా జగతిని  మన్నిన బాటలు
వికట విచారపు విస్తృత  కోటలు
ప్రకటము కాలేని  ఆత్మకు సంకెళ్ళు॥

2 . చరణం 
విడలేని బంధాలు వీడని కోర్కెలు
విధిరాత లీలల విషయలాలసలు
ఆతా నాత్మ విచారపు మాటలు
ఆశ నిరాశల అనుభవ గాధలు ॥

3.. చరణం 
కదలదు కాయము వీడదు ప్రాణము
చేరదు విడివడి ముక్తి సోపానము
తట్టదు మదిలో నీనామ స్మరణము 
కట్టడి బంధాల బరువులె శాపము ॥

4 . చరణం 
స్వార్ధపు చింతనలు  అర్ధ లోభములు
ఆత్మను వీడని అసలు స్వరుాపాలు ॥
చదివిన చదువులు చేసిన జపములు
ఫలముల నీయని ఫలితపు జన్మలు.॥

*********************************

04/03/2021.
కర్మ గీతం ( జీవన వేదం )..

రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ మహారాష్ట్ర .

రాగం :  శుభపంతువరాళి. ( ముల్తానా)

 పల్లవి: 
ఏనాటి కర్మల ఫలమొా గానీ
ఈ నాటి నా గతి ఈ విధి సామీ ॥

అనుపల్లవి:
నానాటి బ్రతుకులు నాటకమే సుమ్మి
 సుఖ దుఃఖ బంధాల అనుభవముల చెలిమీ ॥
 
1. చరణం 
కపటపు మాటలు కల్మష చేతలు
మాయా జగతిని  మారని బాటలు
వికట విచారపు విస్తృత  కోటలు
ప్రకటము కాలేని  ఆత్మకు సంకెళ్ళు॥

2 . చరణం 
విడలేని బంధాలు వీడని కోర్కెలు
విధిరాత లీలల విషయాల వలలు
ఆతా నాత్మ విచారపు మాటలు
ఆశ నిరాశల అనుభవ గాధలు ॥

3.. చరణం 
కదలదు కాయము వీడదు ప్రాణము
చేరదు విడివడి ముక్తి సోపానము
తట్టదు మదిలో నీనామ స్మరణము 
కట్టడి బంధాల బరువులె శాపము ॥

4. చరణం 
స్వార్ధ చింతనలు  అర్ధ లోభములు
ఆత్మను వీడని అసలు స్వరుాపాలు ॥
చదివిన చదువులు చేసిన జపములు
ఫలముల నీయని నిష్ఫల జన్మలు.॥

5. చరణం 
కానని ధర్మము  చేయని న్యాయము 
మాటల తుాట్లతో చేసిన గాయము
స్వార్ధ చింతనల పొందిన సుఖము
వ్యధల భరితమౌ అవసానకాలము॥







Saturday, April 2, 2022

మానభంగాలు

25-03-2022.

ప్రదన్య సాహితీ వేదిక* మరియు *తపస్వి మనోహరం పబ్లికేషన్స్* వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న అవగాహన కవితల పోటీలకుగాను నేను
రాస్తున్న కవిత..

అంశం : మానభంగాలు.
శీర్షిక  :  న్యాయం సహకరించాలి.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

నానాటికీ పెరుగుతున్న నాగరికతతో
యువతలో తరుగుతున్న
సాంప్రదాయాలతోపాటు అనుకరిస్తున్న
పాశ్చాత్య పద్ధతుల మొాజు
స్త్రీ ల జీవితాలకు శాపంగా మారింది.॥
వెర్రి మొర్రి వేషాల వికట వస్త్రాధారణలు
తల బిరుసు నిండిన వెకిలి మాటలతో
యువత చేసే అశ్లీలపు ఆగడాలు ఎక్కువయ్యాయి.
దానికి తోడు  సాంకేతిక మాధ్యమాల ద్వారా
విడుదలైన వాట్సప్ లు , యుాట్యుాబ్ లు
టిక్ టాక్ ల వంటి మాధ్యమాల ద్వారా
వెలికి వస్తున్న బుాతు భాగోతాలు ,
అశ్లీల చిత్రాలతో పాటు,అశ్లీలపు జోకులు
అశ్లీల వ్యవహారాల వివరణల సందేశాల వల్ల
యువతలో పెరుగుతున్న కామొాద్రేకాలకు,
ఆడబిడ్డల బతుకులు బుగ్గిపాలౌతున్నాయి.
వావి-వరుసల తేడాలు మరచిన కామం..
అమ్మతనం లో ఆడతనాన్ని చుాసే కామం..
పసి గుడ్డును పండు మసలినుా వదలని కామం..
పరువు మర్యాదలకు వెరవని తాపంతో
రెచ్చిపోతున్నాది .
జనంలో..మనం...మనం..లో.మనవారైన హీనం .
స్త్రీ ల బతుకు బాటకు సంకెళ్ళు వేస్తున్నాయి.
ఆకలి గొన్న అడవి మృగాల్లా...
ఒక్క ఆడ దానిపై ముాకుమ్మడి బలాత్కారాలు.
మాన భంగాలతో జరిగే మారణ హోమాలు.
స్త్రీ లకు  స్వాతంత్ర్యంగా ముందడుగు
వేసే అవకాశాన్ని ఆటంకపరుస్తున్నాయి.
చట్టాలు తీర్పులు చట్టబండలౌతున్నాయి.
మృగాలు విచ్చలవిడిగా  సంచరిస్తున్నా..
కళ్ళు ముాసుకున్న చట్టం ...
ముడు కోతుల ముద్దు ఫ్రేములో ముచ్చటగా
కళ్ళు, నోరు ,చెవులుా ముాసుకొని
తరాజు తక్కెడలో  నోట్ల బరువుకు
లొంగిపోతుా  న్యాయాన్యాయాలు విస్మరిస్తున్నాది.
భోరు మన్న న్యాయం  భరత మాత
ముతక చీర చిరుగుల్లో మానాన్ని కప్పుకొనే
ప్రయత్నంలో తన మనుగడ కోల్పోతుానే ఉంది.

హామీ : ఈ వచన కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.
   

యుగములకు ఆది

02/03/2022.

*వాల్మీకి సోమన పోతన వేమన (వా.సో.పో.వే)సాహిత్య వేదిక* ఆధ్వర్యంలో 

అంశం : యుగములకు ఆది యుగాది.

శీర్షిక : చిగురుంచిన ఆశలు.

రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్: మహారాష్ట్ర .


ఎటుచుాసినా సహజమైన నుాతనత్వం.
వసంత ఋతువు ఆగమనంతో వచ్చే ఆది పర్వం .
చిరుగాలి వీచికలతో నవ యుగాది ప్రారంభం .
బంతీ చామంతుల మధుర వీచికల సుమ గంధం  ॥

చిగురులు తొడిగిన ఆకుల గలగలలలు.
మామిడి పుాతల చిరు గంధపు ఘుమ ఘుమలు.
కోయిల రాగాల కొత్త వసంతాల మయుారి నాట్యాలు
నవ యుగాదికి పలుకుతున్న నవ్య స్వాగతాలు॥

గుమ్మాలకు పచ్చని తోరణాల శుభ సంకేతాలు
ఇంటింటా పసుపు కుంకుమలద్దిన గుమ్మాలు
యుగాది లక్ష్మికి పలికే ఉత్సాహపు స్వాగతాలు.
శుభ మంగళాలు పలుకు వేద పండితుల సామ గానాలు॥

కొత్త కోర్కెలతో చిగురించిన కొగ్రొత్త ఆశలు
నలిగిన మనసుల్లో నమ్మిక నిండిన ప్రశాంతతలు.
 షడృచుల సమ్మేళనాలతో ఆరోగ్యామృత పక్వాలు.
 కొత్త దనపు రాకతో పాతను మరచిన అత్మ విశ్వాసాలు॥
 
పంచాంగ శ్రవణంతో చీకటి బ్రతుకుల్లో చిగురించిన ఆశలు.
"శుభకృత్" ఆగమనానికి ప్రకృతి పాడే ఆనంద గీతాలు
మంగళ గీతాల మధుర భావనలతో "శుభారంభ-
 యుగాది" కి జనులు పలికిన సుస్వాగతాలు ॥
 
హామీ:
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన.

 

మారని కాలం, మరుతున్న మనిషి

02/03/2021

శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యం లో శుభకృత నామ సంవత్సర ఉగాది సందర్భంగా
  "ఉగాది కవితల పోటీ..

 
  రచన: శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
  కల్యాణ్ : మహారాష్ట్ర .
  8097622021.

అంశం : యుగాది ఆనందమా! నీ వెక్కడ?
  శీర్షిక : మారని కాలం లో  మారుతున్న  మనిషి.
 
కాల చక్రం తన మానాన తాను తిరుగుతునే ఉంది.
ప్రభవ, విభవాది  అరువది సంవత్సరాల కాలం
ప్రతీ వత్సరానికి ఒక ప్రత్యేకతతో వస్తుానే ఉంది.॥

మహిలో మనుషులు మాత్రం నాటి నుంచి నేటి వరకు
కాలాన్ని సవాలు చేస్తుా ప్రకృతితో పరాచికలాడుతుా
క్షణానికో మనస్తత్వంతో మారణహోమం చేస్తుానే ఉన్నారు. ॥

కాలం ...అలాగే ఉంది . రాత్రుల చీకట్లను దాటి
వెలుగు వెన్నెలలు పంచుతుానే ఉంది.
ఆరు ఋతువులకు ఆహ్వానం పలుకుతుా
ప్రకృతి నియమాలను  నిలుపుతునే ఉంది ॥

కాలం మారిందంటుా తానే మారుతుాన్న మనషి
సభ్యత, సంస్కారాలతో పాటు మానవత్వాన్ని
కుాడా కోల్పోతుా స్వార్ధ పరుడై మసలసాగేడు.
"తన" పర" లతో పాటు వావి వరుసలు మరచేడు.॥

రాక్షసత్వంతో పెట్రేగిన  కామొాద్రేకాలతో
కన్ను మిన్ను కానని కఠినాత్ముడయ్యేడు.
వక్రీకరించిన మనిషి బుద్ధి వరుస దురాగతాలతో
భ్రష్టు పట్టి రాక్షసత్వం తో రంకెలు వేస్తోంది॥

ఆడతనంలో ఆమ్మను చుాడవలసిన వాడు
అమ్మతనంలో ఆడతనానికి అంగలారుస్తున్నాడు.
వింత పోకడలు పెరుగుతున్న  సమాజంలో.
న్యాయంకుాడా నోట్ల మత్తుకు లొంగిపోయింది ॥

విధి రాతను  తప్పించలేని కాలం, కకలావికలమై
కరువు కాటకాలకు నెలవై క్రమశిక్షణ కోల్పోయింది
ఐనా ఇప్పటకీ మనిషి కాలాన్ని దుాషిస్తుా
తనను  తాను సమర్ధించుకుంటుానే ఉన్నాడు..॥

హామీ:
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన.

నుాతన వత్సరానికి స్వాగతం

27/03/2022.
నేను సైతం కవి పత్రిక ఏప్రిల్-2022 సంచిక కొరకు నేను వ్రాసిన కవిత: 

అంశం: "శుభకృత్ నామ సంవత్సరం ఉగాది..

శీర్షిక : నుాతన వత్సరానికి స్వాగతం.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .



మారురున్న కాలమనే చక్రాల మధ్య
చావలేక బ్రతకలేకా అల్ల లాడుతున్న 
జనసంద్రపు జీవన నౌకాయానంలో 
కలకలం రేపుతున్న  కణ బాధల గాధలు
ఎన్నో చేదు అనుభవాలు అక్రోశాలు.
జీవన గమనానికి  కలిగించిన అవరోధాలు.॥

అణగారిపోతున్న ఆశలు ,ఆశయాలతో
బ్రతుకు భారమౌతున్న జనాల 
అంతరంగాలలో చీకటి ముగిసిన వేకువలా , 
ఒడ్డుకు చేరబోతున్న ఒడిదుడుకుల 
జీవన యానం ॥

శుభ సుాచకమైన కోయిల రాగాలతో
వసంత వీచికల మధుర సుమ గంధాలతో
మధుర భావనల మలయవీచికలతో
మారిన సంవత్సరపు మధుర భావనతో
ఆశల సౌధాలకు వేస్తున్న ఆనంద సోపానం ॥

శుభ సందేశాల సుమగంధసారమై 
అలసిన మనసులకు ఆనంద కారియై
కొత్త బాసలకు కొత్తబాటలు చుాపుతుా 
వస్తున్న "శుభకృత్ నామ "యుగాదికి
ఆరు ఋచుల ఆరోగ్య పక్వాలతో
ఆడుతుా పాడుతుా పలుకుదాం 
ఆనంద గీతాల శుభ స్వాగతం  ॥

నవ యుగాదికి స్వాగతం 2022

01/03/2022.

శీర్షిక : నవ యుగాదికి ఆహ్వానం.

రచన :శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి 
కల్యాణ్ : మహారాష్ట్ర .


యుగయుగాలుగా జగాన ఆమని  
ఎన్నో మార్పులు తెచ్చింది
యుగాది పండగ ఆంధ్రులమదిలో 
పునాది వేసిన పండగయింది॥

వసంతుని ఆగమనంతో
వంతు చిగురు పచ్చదనాల
వేల తరుల వేడుక సమాగమం 
జంట కోయిలల వేడ్క రాగాల సరాగం ॥

అందము నిండిన  ఆనందముతో
అర విరిసిన పుావుల కళ కళలు
మంద్రముగా అతి మధురముగా 
చిరు గాలుల సవ్వడి సరిగమలు ॥

చిగురులు తొడిగిన కొమ్మల నడుమ 
కోయిల పాడిన గీతికలు
ఓషధి నిండిన తరులు, ఝరులు
మన ప్రకృతి పంచు సిరి సంపదలు॥

పైరు పచ్చని పంట భుాముల లొ
కొత్తకళల తడి మట్టి గంధములు 
ధాన్యపు సిరి ధాన్యపు నెలవులు
పుడమి తల్లి యిడు నిండు దీవెనలు॥

వత్సరానికో కొత్త ప్రారంభం
వరుస ప్రణాళికల ఆశా ప్రయాణం 
మానవ జీవితాలలో ఆశయాల ఆరంభం 
బ్రతుకు బాటలో సాధన నిండిన  సారం ॥

చీకటి వెలుగుల రంగుల యానంలో
ఒడిదుడుకుల నావను ఒడ్డుకు చేర్చే పయనం 
శుభకృత్ ఆగమనంతో వెలుగు వసంతాల
వేడ్క పండగలకు పలుకు  ఆహ్వానం ॥

మారని కాలంలో మారుతున్న మనిషి.

02/03/2021

శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యం లో శుభకృత నామ సంవత్సర ఉగాది సందర్భంగా
  "ఉగాది కవితల పోటీ..
 ‌
  
  రచన: శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
  కల్యాణ్ : మహారాష్ట్ర .
  8097622021.

అంశం : యుగాది ఆనందమా! నీ వెక్కడ?
  శీర్షిక : మారని కాలం లో  మారుతున్న  మనిషి.
  
 కాల చక్రం తన మానాన తాను తిరుగుతునే ఉంది.
ప్రభవ, విభవాది  అరువది సంవత్సరాల కాలం
ప్రతీ వత్సరానికి ఒక ప్రత్యేకతతో వస్తుానే ఉంది.॥

మహిలో మనుషులు మాత్రం నాటి నుంచి నేటి వరకు
కాలాన్ని సవాలు చేస్తుా ప్రకృతితో పరాచికలాడుతుా
క్షణానికో మనస్తత్వంతో మారణహోమం చేస్తుానే ఉన్నారు. ॥

కాలం ...అలాగే ఉంది . రాత్రుల చీకట్లను దాటి 
వెలుగు వెన్నెలలు పంచుతుానే ఉంది.
ఆరు ఋతువులకు ఆహ్వానం పలుకుతుా
ప్రకృతి నియమాలను  నిలుపుతునే ఉంది ॥

కాలం మారిందంటుా తానే మారుతుాన్న మనషి
సభ్యత, సంస్కారాలతో పాటు మానవత్వాన్ని 
కుాడా కోల్పోతుా స్వార్ధ పరుడై మసలసాగేడు.
"తన" పర" లతో పాటు వావి వరుసలు మరచేడు.॥

రాక్షసత్వంతో పెట్రేగిన  కామొాద్రేకాలతో
కన్ను మిన్ను కానని కఠినాత్ముడయ్యేడు.
వక్రీకరించిన మనిషి బుద్ధి వరుస దురాగతాలతో
 భ్రష్టు పట్టి రాక్షసత్వం తో రంకెలు వేస్తోంది॥

ఆడతనంలో ఆమ్మను చుాడవలసిన వాడు
అమ్మతనంలో ఆడతనానికి అంగలారుస్తున్నాడు.
వింత పోకడలు పెరుగుతున్న  సమాజంలో.
న్యాయంకుాడా నోట్ల మత్తుకు లొంగిపోయింది ॥

 విధి రాతను  తప్పించలేని కాలం, కకలావికలమై
కరువు కాటకాలకు నెలవై క్రమశిక్షణ కోల్పోయింది 
ఐనా ఇప్పటకీ మనిషి కాలాన్ని దుాషిస్తుా 
తనను  తాను సమర్ధించుకుంటుానే ఉన్నాడు..॥






Friday, April 1, 2022

60 తెలుగు సంవత్సరాల పేర్లకు అర్ధాలు.

🌹తెలుగు సంవత్సరాలపేర్లు.అర్థాలు.🌹
-------------------------------------

1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.
2. విభవ - వైభవంగా ఉండేది.
3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.
4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.
6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.
7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.
9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.
10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.
11. ఈశ్వర... పరమేశ్వరుడు.
12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.
13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.
14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.
15. వృష ... చర్మం.
16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.
17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం
18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.
19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.
20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని సర్వాన్నిg అర్థం.
21. సర్వజిత్తు.... సర్వాన్నిg జయించినది.
22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.
23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.
24. వికృతి... వికృతమైనటువంటిది.
25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.
26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.
27. విజయ... విశేషమైన జయం కలిగినది.
28. జయ.... జయాన్ని కలిగించేది. 
29. మన్మథ... మనస్సును మధించేది.
30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.
31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.
32. విలంబి... సాగదీయడం.
33. వికారి.... వికారం కలిగినది.
34. శార్వరి... రాత్రి.
35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.
36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.
37. శోభకృత్... శోభను కలిగించేది.
38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.
39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.
40. పరాభవ ... అవమానం.
41. ప్లవంగ... కోతి, కప్ప.
42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.
43. సౌమ్య... మృదుత్వం.
44. సాధారణ... సామాన్యం.
45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.
46. పరీధావి... భయకారకం.
47. ప్రమాదీచ... ప్రమాద కారకం.
48. ఆనంద... ఆనందమయం.
49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.
50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.
51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.
53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.
54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.
55. దుర్మతి... దుష్ట బుద్ధి.
56. దుందుభి ... వరుణుడు.
57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.
58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.
59. క్రోదన... కోప స్వభావం కలది.
60. అక్షయ... నశించనది.
సేకరణ:జోస్యుల హరిప్రసాద్

నవ యుగాదికి ఆహ్వానం.

01/03/2022.

శీర్షిక : నవ యుగాదికి ఆహ్వానం.

రచన :శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి 
కల్యాణ్ : మహారాష్ట్ర .


యుగయుగాలుగా జగాన ఆమని  
ఎన్నో మార్పులు తెచ్చింది
యుగాది పండగ ఆంధ్రులమదిలో 
పునాది వేసిన పండగయింది॥

వసంతుని ఆగమనంతో
వంతు చిగురు పచ్చదనాల
వేల తరుల వేడుక సమాగమం 
జంట కోయిలల వేడ్క రాగాల సరాగం ॥

అందము నిండిన  ఆనందముతో
అర విరిసిన పుావుల కళ కళలు
మంద్రముగా అతి మధురముగా 
చిరు గాలుల సవ్వడి సరిగమలు ॥

చిగురులు తొడిగిన కొమ్మల నడుమ 
కోయిల పాడిన గీతికలు
ఓషధి నిండిన తరులు, ఝరులు
మన ప్రకృతి పంచు సిరి సంపదలు॥

పైరు పచ్చని పంట భుాముల లొ
కొత్తకళల తడి మట్టి గంధములు 
ధాన్యపు సిరి ధాన్యపు నెలవులు
పుడమి తల్లి యిడు నిండు దీవెనలు॥

వత్సరానికో కొత్త ప్రారంభం
వరుస ప్రణాళికల ఆశా ప్రయాణం 
మానవ జీవితాలలో ఆశయాల ఆరంభం 
బ్రతుకు బాటలో సాధన నిండిన  సారం ॥

చీకటి వెలుగుల రంగుల యానంలో
ఒడిదుడుకుల నావను ఒడ్డుకు చేర్చే పయనం 
శుభకృత్ ఆగమనంతో వెలుగు వసంతాల
వేడ్క పండగలకు పలుకు  ఆహ్వానం ॥