Monday, November 4, 2024

శీర్షిక: బాల లీలలు.

అంశం: ఐచ్ఛికం 

కవితాసంఖ్య: 03

తేది: 30-10-2024, బుధవారం.

శీర్షిక: బాల లీలలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)

ప్రక్రియ: వృషభగతి రగడ.




బాల కృష్ణుని /వలచి  భావపు/  భక్తి తోడను  /గొల్చి చూడుము

వేల నాముని/  మదిని దలచుచు/ వేడ్క వానిని / నమ్మి వేడుము !!

పాల వెన్నను / పంచ గ్వాలల/  పరుగు పరుగున/వచ్చు వేగము

బాల కృష్ణుడ /తండె  శ్రీహరి /భాగ్య మిదిమన  /జన్మ ధన్యము!!

------------------------------

అంశం: ఐచ్ఛికం 

కవితాసంఖ్య: 03

తేది: 30-10-2024, బుధవారం.

శీర్షిక: బాల లీలలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)

ప్రక్రియ: వృషభగతి రగడ.

---------------------



నంద-యశోద / లకిదె  పరమా/ నంద మయమై /నట్టి వరముగ

బంధ మదియే/ మధుర తరమౌ/ భావ నలనిడె/ బాలు గనగా!!


చంద మామను/ బోలు కోమల/ చారు శీలుని / కొంటె చేతలు!!

విందు లాయెను/ఆట పాటలు/వినగ విందులు /మురళి పాటలు.!!


చిన్ని కృష్ణుని/ బాల లీలలు/చిలిపి చేతల/చిందు నవ్వులు 

ఎన్ని జూచిన/ ఎంత వినినా/ఎరుగలేముగ / కృష్ణ లీలలు !!


అన్ని మానుల /చాటు దాగుచు/ అల్లరెంతో  /చేయు వేళలు

కొన్ని కావుగ / వెన్న దొంగడు/కోరి చేసెడు/ చిలిపి చేష్టలు !!


పాల వెన్నలు /దొంగలాడెడు /బాలకృష్ణుడు/ బంధు డాయెను!!

ఏల పుడమిని/రామవిభుడై/ఎంచి దశరథ/పుత్రుడాయెను!! 


వేల జనులకు/అభయ మొసగుచు/వేంకటేశుగ/వెరపు దీర్చెను!

వేలనామము /లున్న వానిని/వెన్ను డాతని /చేరి కొలువుము!!





-----------------------------------------------

పాల వెన్నలు /దొంగలాడెడు /బాలకృష్ణుడు/ బంధు డాయెను!!

ఏల పుడమిని/రామవిభుడై/ఎంచి దశరథ/పుత్రుడాయెను!! 

వేల జనులకు/అభయ మొసగుచు/వేంకటేశుగ/వెరపు దీర్చెను!

వేలనామము /లున్న వానిని/వెన్ను డాతని /చేరి కొలువుము!!







1️⃣5️⃣✅ శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు బహుకాల దర్శనం దసరా నవరాత్రులలో మీ అద్భుతమైన గానామృతాన్ని రుచి చూపించారు నేటి అంశానికి జన్మ ధన్యము శీర్షికతో మీరు రాసిన వృషభరతి రగడ చాలా బాగుంది సహజంగా గాయని అయిన మీరు మాత్రలను నడకను ఇట్టే పట్టుకున్నారు. రాబోయే బుధవారాలు కూడా తప్పక రాయండి ధన్యవాదములు మరియు అభినందనలు👏👏👏💐💐💐🙏🙏🙏





ఇష్టపది



మహతీ సాహితీ కవిసంగమం 

అంశం: నీతి.

ప్రక్రియ :  ఇష్టపది

కవితాసంఖ్య: 04

తేది: 17-10-2024, బుధవారం.

శీర్షిక: నీతి నియమాలు ఎక్కడ?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)



నేటి న్యాయ వ్యవస్థ నెంచ కుటిల మాయెను

మేటి ఘోర ఖలుల నేడు చేయి కలిపెను !!

తోటి మనిషి బాధను తోసి తీర్పు నిచ్చెను

కాటి, జైలు వాసము కలుగజేసి చంపెను !!


ధర్మ న్యాయ నిరతిని దాటి ధైత్యు డాయెను

కర్మ భోగ మనుచును  కరకు గాను మారెను. 

నిర్మల మౌ బతుకుల నిలువు కోత  కోసెను  .

మర్మ మెరుగని వారి , మట్టి లోన కలిపెను !!


నేటి దేశ పాలన కోటి జనుల రోదన.

తోటి వారి హింసకు తోవ గనుటే యోచన

పాలకుల కుశాసన పలుక చిత్ర వేదన.

వేల యువత బాధలు వెరపు నిండు శోషణ.!!


తీర్చువాడే లేడు   తిరుగుబాటుల గోడు.

కూర్చు శిక్షలు వేలు , కుటిల బుద్ధులు చూడు.

నేర్పు చూపిన వాడు నేల బతుకడు వాడు

మార్చు ఓట్లను వారు మనిషికి రూక తోడు. 


లేపి దొమ్ములు నడుమ ,దొంగ ఓటుల గెలుపు

దోపిడీలే బ్రతుకు, దోచుకొనుటే బలుపు

 పాపి యగుచూ కులుకు  పాలకులదే గెలుపు.

 జూపి మత్తుల సరుకు జూద మాడిన పిలుపు  !! 


రూకలాడిన యాట రూపు మారిన మాట

శోకమొందిన చోట , రూక నిండిన వేట

చౌకబారుల తీరు చావు బతుకుల పోరు

చాకలాడే మిన్న చదువులోడిన జోరు.


---------------------------------

నేడు ఎన్నికలన్న  .  నేరాలకు నిలయము

లేడు అడుగు ధీరుడు లెక్క జెప్పు వీరుడు

గోడు,గొడవల తీరు గోస జనులదాయెను

జోడు దుష్ట గణముల జోరు గెలుపులాయెను !!


లేదు న్యాయ మదేల  లేపు చావుల గోల

కూల్చివేతల లీల  కుల,మతాలదె హేల

మనిషి బ్రతుకుట కన్న మత్తు దారది మిన్న 

యువత బ్రతుకే సున్న యూధముల బతుకన్న

వృషభగతి రగడలు మరియు ఇష్టపది

అంశం: ఐచ్ఛికం 

కవితాసంఖ్య: 03

తేది: 30-10-2024, బుధవారం.

శీర్షిక: బాల లీలలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)

ప్రక్రియ: వృషభగతి రగడ.




బాల కృష్ణుని /వలచి  భావపు/  భక్తి తోడను  /గొల్చి చూడుము

వేల నాముని/  మదిని దలచుచు/ వేడ్క వానిని / నమ్మి వేడుము !!

పాల వెన్నను / పంచ గ్వాలల/  పరుగు పరుగున/వచ్చు వేగము

బాల కృష్ణుడ /తండె  శ్రీహరి /భాగ్య మిదిమన  /జన్మ ధన్యము!!

------------------------------

అంశం: ఐచ్ఛికం 

కవితాసంఖ్య: 03

తేది: 30-10-2024, బుధవారం.

శీర్షిక: బాల లీలలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)

ప్రక్రియ: వృషభగతి రగడ.

---------------------



నంద-యశోద / లకిదె  పరమా/ నంద మయమై /నట్టి వరముగ

బంధ మదియే/ మధుర తరమౌ/ భావ నలనిడె/ బాలు గనగా!!


చంద మామను/ బోలు కోమల/ చారు శీలుని / కొంటె చేతలు!!

విందు లాయెను/ఆట పాటలు/వినగ విందులు /మురళి పాటలు.!!


చిన్ని కృష్ణుని/ బాల లీలలు/చిలిపి చేతల/చిందు నవ్వులు 

ఎన్ని జూచిన/ ఎంత వినినా/ఎరుగలేముగ / కృష్ణ లీలలు !!


అన్ని మానుల /చాటు దాగుచు/ అల్లరెంతో  /చేయు వేళలు

కొన్ని కావుగ / వెన్న దొంగడు/కోరి చేసెడు/ చిలిపి చేష్టలు !!


పాల వెన్నలు /దొంగలాడెడు /బాలకృష్ణుడు/ బంధు డాయెను!!

ఏల పుడమిని/రామవిభుడై/ఎంచి దశరథ/పుత్రుడాయెను!! 


వేల జనులకు/అభయ మొసగుచు/వేంకటేశుగ/వెరపు దీర్చెను!

వేలనామము /లున్న వానిని/వెన్ను డాతని /చేరి కొలువుము!!





-----------------------------------------------

పాల వెన్నలు /దొంగలాడెడు /బాలకృష్ణుడు/ బంధు డాయెను!!

ఏల పుడమిని/రామవిభుడై/ఎంచి దశరథ/పుత్రుడాయెను!! 

వేల జనులకు/అభయ మొసగుచు/వేంకటేశుగ/వెరపు దీర్చెను!

వేలనామము /లున్న వానిని/వెన్ను డాతని /చేరి కొలువుము!!







1️⃣5️⃣✅ శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు బహుకాల దర్శనం దసరా నవరాత్రులలో మీ అద్భుతమైన గానామృతాన్ని రుచి చూపించారు నేటి అంశానికి జన్మ ధన్యము శీర్షికతో మీరు రాసిన వృషభరతి రగడ చాలా బాగుంది సహజంగా గాయని అయిన మీరు మాత్రలను నడకను ఇట్టే పట్టుకున్నారు. రాబోయే బుధవారాలు కూడా తప్పక రాయండి ధన్యవాదములు మరియు అభినందనలు👏👏👏💐💐💐🙏🙏🙏





ఇష్టపది



మహతీ సాహితీ కవిసంగమం 

అంశం: నీతి.

ప్రక్రియ :  ఇష్టపది

కవితాసంఖ్య: 04

తేది: 17-10-2024, బుధవారం.

శీర్షిక: నీతి నియమాలు ఎక్కడ?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)



నేటి న్యాయ వ్యవస్థ నెంచ కుటిల మాయెను

మేటి ఘోర ఖలుల నేడు చేయి కలిపెను !!

తోటి మనిషి బాధను తోసి తీర్పు నిచ్చెను

కాటి, జైలు వాసము కలుగజేసి చంపెను !!


ధర్మ న్యాయ నిరతిని దాటి ధైత్యు డాయెను

కర్మ భోగ మనుచును  కరకు గాను మారెను. 

నిర్మల మౌ బతుకుల నిలువు కోత  కోసెను  .

మర్మ మెరుగని వారి , మట్టి లోన కలిపెను !!


నేటి దేశ పాలన కోటి జనుల రోదన.

తోటి వారి హింసకు తోవ గనుటే యోచన

పాలకుల కుశాసన పలుక చిత్ర వేదన.

వేల యువత బాధలు వెరపు నిండు శోషణ.!!


తీర్చువాడే లేడు   తిరుగుబాటుల గోడు.

కూర్చు శిక్షలు వేలు , కుటిల బుద్ధులు చూడు.

నేర్పు చూపిన వాడు నేల బతుకడు వాడు

మార్చు ఓట్లను వారు మనిషికి రూక తోడు. 


లేపి దొమ్ములు నడుమ ,దొంగ ఓటుల గెలుపు

దోపిడీలే బ్రతుకు, దోచుకొనుటే బలుపు

 పాపి యగుచూ కులుకు  పాలకులదే గెలుపు.

 జూపి మత్తుల సరుకు జూద మాడిన పిలుపు  !! 


రూకలాడిన యాట రూపు మారిన మాట

శోకమొందిన చోట , రూక నిండిన వేట

చౌకబారుల తీరు చావు బతుకుల పోరు

చాకలాడే మిన్న చదువులోడిన జోరు.


---------------------------------

నేడు ఎన్నికలన్న  .  నేరాలకు నిలయము

లేడు అడుగు ధీరుడు లెక్క జెప్పు వీరుడు

గోడు,గొడవల తీరు గోస జనులదాయెను

జోడు దుష్ట గణముల జోరు గెలుపులాయెను !!


లేదు న్యాయ మదేల  లేపు చావుల గోల

కూల్చివేతల లీల  కుల,మతాలదె హేల

మనిషి బ్రతుకుట కన్న మత్తు దారది మిన్న 

యువత బ్రతుకే సున్న యూధముల బతుకన్న

శీర్షిక : నేటి భారతం .

మహతీ సాహితీ కవిసంగమం.

18/10/2024.శుక్రవారం.

కవిత సంఖ్య : 5.

అంశం : ఐచ్ఛికం

శీర్షిక : నేటి భారతం .

రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కల్యాణ్ .మహారాష్ట్ర  

మ సా క .సం 43).




నిరుద్యోగ సమస్యలకు నీరైపోతున్న జీవితాలు

తీరని సమస్యలతో  అడుగడుగున అగచాట్లు 

 ముద్దు మచ్చట్లు తీరక యువత పడుతున్న పాట్లు.

 నోట్ల కొరతతో నోచుకోని సుఖాలకై ఎదురు దాట్లు॥

ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నిండిన ఓటర్లు.

మనుషుల బలహీనతకు "బ్యాలెట్ బాక్స్"లో

 కౌంట్  ఔతున్న ,ఓట్లు.

నోట్లకు అమ్ముడుపోయిన  ఓట్లు కొడుతున్న సిక్సర్లు.!!

ఏకాదశ గ్రహ బలంతో గద్దెనాక్రమిస్తున్న

 అక్రమ- నాయకత్వాలు ॥

 

నోట్లు ఓట్ల గారడీలో రన్నౌట్ అవుతున్న ప్రజా వికెట్లు .

బౌన్స్ ఔతున్న ధర్మ వ్యవస్థలు ,న్యాయాధికారాలు.

 ఓటింగ్ వ్యవస్థలో అధర్మంతో కుాడిన అస్తవ్యస్థాలు.

 గుర్తింపుకు రాని అబద్ధపు ఓట్లతో గెలుపు పతాకాలు॥

కాలే కడుపులకు ఐదు వత్సరాల ఎన్నికల సమయం .

ఓటునమ్మిన నోట్లతో కడుపులు నింపుకునే దైన్యం .

మద్యం వేటగాళ్ళకు  మత్తు మందుతో వైద్యం . 

నాయకుడెవరైనా మారనిబ్రతుకుల మండే జీవితం॥

ఇదే ఈనాటి  అవినీతి నిండిన....ఎన్నికల పర్వం.

చదరంగపు టెత్తులకు  దిగజారిపోయిన నేటి భారతం..

కలలు కల్లలై , ఓడిన, నేటి భారతి  కన్నీటి కథనం ॥



హామీ :

నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన. మత్తుకు 

నేను సమయాన్ని. ముందడుగే నా లక్ష్యం" శీర్షిక"

మహతీ సాహితీ కవి సంగమం.

04//11/2024.

అంశం : చిత్ర కవిత. 

ప్రక్రియ : వచన కవిత.

కవిత సంఖ్య  :  1.

శీర్షిక: "నేను సమయాన్ని .ముందడుగే నా లక్ష్యం."

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర 


________________________________



నేను కాలాన్ని ---

ముందడుగే తప్ప వెనకడుగు వేయలేని వివశను.

గత కాలంలో ఒకప్పటి సంస్కారాలను మరిచిపోయిన మానవుల మితిమీరిన మనస్తత్వాలను 

అంచనా వేయలేక వారితో పాటే ముందుకు పోతున్నా!!

రాజకీయ నిర్ణయాల బలవంతపు ఒత్తిడులు

తట్టుకోలేక ,పొగమత్తుకు ,మగువకు ,మదిరకు

బానిసై ,  మనిషి చేస్తున్న అరాచకాలకు 

నా గుండె దడ దడ లాడుతోంది.!!

స్వార్థం నిండిన మానవుడు తన అవసరాలకు 

తమ తోటి వారిని తొక్కి వేస్తున్న వైనం 

 నాలో ఆవేశాన్ని నింపుతోంది.!!

మేధావి యైన మానవుడు , తాను సాధించిన 

చరవాణి , ముఖచిత్రం,దూరదర్శన్ వంటి  

టెలికమ్యూనికేషన్  మాధ్యమాలకు 

తానే బానిసౌతూ, రేపుతున్న -కలకలాలు

ఎన్నోఅరాచకాలను సృష్టిస్తున్నాయి.

ఏమీచేయలేని వివసత్వంతో ,నా కళ్ళు వర్షిస్తున్నాయి !!

జాతి -మతాల, మారణహోమాల  జోరుకు -

 పెరుగుతున్న స్వార్థం , మనిషిలో

 వివేకాన్ని నశింప చేస్తోంది !! 

చేటు చేసే చెడు చెడుదారులకు 

అలవాటు పడిన యువత , విజ్ఞాన పునాదులను 

 పెకిలివేస్తూ , వింత వివాదాలకు, విద్రోహాలకు 

 ఆరతి పడుతోంది. !!

ఈ ప్రపంచ సృష్టిలో,  అన్నీ అలాగే ఉన్నాయి.కానీ- 

ప్రకృతిలో వచ్చే అన్ని వైపరీత్యాలకు ,అకృత్యాలకు -

కారణంగా మారిన మనిషి మాత్రం , అమాయకంగా

" కాలం మారింది, మనం కాలంతో పాటు ముందుకు పోతున్నాం", అన్న భ్రమలో పడి ,  బ్రష్టుడౌతున్నాడు.!!

"తమ అధోగతికి తామే కారణం" అన్న ,

మాట మరచిన మానవుడు, తమకు తామే 

 వేసుకున్న "మత్తు" సంకెళ్లను విడదీసుకోలేక. 

బయట పడలేక ,వెర్రి చూపులు చూస్తున్నాడు.!!

అన్నీ చూస్తూ కూడా ఏమీ చేయలేని నేను,

వెనుకకు తిరిగి చూడకుండా ,

ముందుకు సాగుతూనే ఉన్నాను. !!

"ఎందుకంటే నేను సమయాన్ని . 

"వెనుకకు తిరిగి చూడను.ముందడిగే నా లక్ష్యం."!!


హామీ:

ఈ కవిత నా స్వీయ రచన.

--------------------------



2️⃣6️⃣✅ శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారూ ,

"నేను సమయాన్ని. ముందడుగే నా లక్ష్యం" శీర్షికతో,

 నేటి చిత్రానికి మీరు వ్రాసిన కవిత చాలా బాగుంది.  

మానవుల మితిమీరిన వింత చేష్టలకు నిర్ఘాంతపోతూ అంచనావేయలేక వారితోపాటే చరిస్తున్నాను మౌనంగా. 

నాకు వెనుక చూపులేదు. "రాను. మీరేమైపోయినా నాకు సంబంధంలేదు "అంటూ కాలంతో ఖచ్చితంగా 

నిష్కర్షగా చెప్పించిన తీరు హర్షణీయము..

 చాలా బాగుంది. 👌🏻 ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏💐💐💐🙏🙏🙏





Sunday, September 8, 2024

కవిత

[31/08, 9:51 pm] JAGADISWARI SREERAMAMURTH: తపస్వి మనోహరం పత్రిక కొరకు,
31/08/2024.

అంశం ..ఐఛ్ఛికం.

శీర్షిక  ..సజీవ సమాధులు.

రచన:  శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
 కళ్యాణ్ మహారాష్ట్ర

నాటి నుండి, నేటి వరకు, 
 అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలంటుా 
మాటల్లో అందలానికెక్కిస్తూ, 
చేతలతో చిత్తు చేస్తునే ఉన్నారు .!!

అవనిలో ఆడది, అమ్మగా మరో బ్రహ్మై ,
 తొమ్మిది నెలల భారాన్ని మోస్తూ. 
 సృష్టికి-ప్రతి సృష్టి  చేసేందుకు
 తన రక్తం మాంసాలను పంచుతూనే ఉంది.!!

ఆ సృష్టికి కారకుడైన తండ్రి, 
తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం కోసం , 
బాధ్యతల బరువును మోస్తూ, జీవితాంతం, 
తన కుటుంబం కోసం ,తన. జీవితాన్ని
పణంగా పెడుతుానే ఉన్నాడు.!!

పాశ్చాత్య  సంస్కృతి  మొాజుతో ,
 మన సంస్కృతి , సాంప్రదాయాలు 
 ఏనాడో మట్టి కలిసిపోయాయి.
నేను, నా , అనే స్వార్ధం , 
వావి వరుసలకు "చెక్" పెట్టింది .!!

ఆడ దాని అస్తిత్వం , 
అంగట్లో ఆట బొమ్మై పోయింది.
అలసిపోయిన అమ్మ తనం , 
అడ్డుగోడై నిలిచింది.
జవసత్వాలుడిగిన నాన్న ఉనికి ,
 జారిపోతున్న  విలువల, 
విచ్చలవిడి తనానికి , ప్రతిబంధకమైంది.!!

అంతే మట్టిలో కలసిన మానవత్వం , 
మరోదారిని కనుక్కొంది.
తీరిన అవసరాల చివరి  క్షణాలకై , 
జన్మదాతలకు ,ఊరవతల జీవ సమాధులు కట్టి, 
ఆధునుకతను తలపించే .అందమైన పేరు పెట్టింది.!!

అవే నేటి బ్రతుకు బడుగు జీవితాలకు ఆశ్రమాలు.
అంతరించిపోతున్న ఆప్యాతలకు నిలువుటద్దాలు. 
అడుగు కొకటిగా అలరారుతున్న" వృద్ధాశ్రమాలు ".!!
----------------------------------------
హామీ ..
ఈ కవిత నా స్వీయ రచన.
[07/09, 10:46 pm] బుజ్జి...✍️ స్వప్న: *27-08-2024 నుండి 31-08-2024 వరకు గ్రూప్ సభ్యులు రాసిన ఐచ్ఛిక కవితలలో పత్రిక/e-book కు సెలక్ట్ చేసినవి..*


1.గమ్యం - పప్పు సుజాతారావు 
2.దేశ సైనికుల జీవన పరిక్రయం -ప్రసన్న కుమ్మరగుంట్ల 
3.పండువెన్నెల-కళావతి కందగట్ల 
4.మధుర జ్ఞాపికలు-చట్టి లక్ష్మి 
5.నీలిమేఘమా-కె.రాధిక నరేన్ 
6.ఒకటి కావాలి-టి.నాగేశ్వరి 
7.చిరునవ్వులను చెదరనీయద్దు-రామకూరు లక్ష్మీమణి 
8.చిరుజల్లు-ఎస్.గిరిజశివకుమారి
9.సజీవ సమాధులు పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
10.సరిచేయు చువ్వలను- జగదీశ్వరి కందికుప్ప 
11.గురుదేవోభవః-వై.కె.సంధ్య శర్మ (టీచర్స్ డే ఈ-బుక్)
12.జ్వాలాదీపిక-బత్తిన గీతాకుమారి (టీచర్స్ డే ఈ-బుక్)

Tuesday, April 9, 2024

ఆమెని కాంతులు ( క్రోధి సంవత్సర ఉగాది గేయం).

శీర్షిక :  ఆమని కాంతులు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .
---------------------
గేయం.
------
యుగయుగాలుగా జగాన ఆమని 
 వెన్నెల కాంతులు తెచ్చెనులే
ఉగాది పర్వము ఆంధృల మదిలో
పునాది వేసిన పండగలే...!!2!!
ఆ.....ఆ....ఆ.......ఆ.....

చరణం: 
------
అందముగా ఆనందముగా చిరు 
చిగురుల కొమ్మల ఊయలలూ
బంధములే అనుబంధములౌ, అర
విరిసిన మల్లె సుగంధములు.,
చిగురులు తొడిగిన కొమ్మల నడుమ 
 కోయిల పాడే గీతికలు
సమతా మమతల శాంతి సౌఖ్యముల
సాగే జీవన రాగములూ...అవి
నాల్గు వేదముల సారములు !!
ఆ.....ఆ....ఆ.......ఆ.....
చరణం: 
------
ఆరు రుచులతో నిండిన సాదము
ఆరోగ్యమునకు సూత్రముగా...
ఆరు ఋతువులా ఆగమనమదే..
ప్రకృతి పడతికి  చెలియలుగా..
సస్యశ్యామల ప్రగతి పథమదే
దేశ సంపదకు మూలముగా 
అందము నిండిన అనందములే
దివిలో వెలిగిన దివ్వెలుగా..శుభ-
శాంతి సౌఖ్యముల దూతలుగా...
ఆ.....ఆ....ఆ.......ఆ.....!!
----------------------

Tuesday, March 12, 2024

అంశం: అడవి జంతువులు (

అంశం: అడవి జంతువులు (గేయం).
శీర్షిక :  మా బాధలు  కనరండి.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 
కళ్యాణ్ :  మహారాష్ట్ర.

పల్లవి:
-----
అడవిలో పుట్టాము అడవిలో పెరిగాము 
ఆనంద తీరాల ఆడాము పాడాము ॥
అనుపల్లవి :
--------
చీకుా చింతా లేని జీవితాలు మావీ
మాజంతు జీవాలకు సాటిరావు ఏవీ ॥అడవి ॥

చరణం :
------
సాధు  జంతు జీవాలము,  కలసి మెలసి ఉంటాము .
జాతి మతముల జోలికి పోమే పోముా 
కలసి నీరు తాగుతాం ,కలివిడిగా మసలుతాం.
అడవి యంతా తిరిగి అలసి సొలసి వాలుతాం ॥

చరణం :
------
క్రుార జంతు బంధులున్న , కుటిల బుద్ధి లేదుా
ఆకలైతేగానీ, దరికి చంపగ రావుా
స్వార్ధమన్నది లేదు  పాచి కుాడు నవి తినవుా
వలసినంత  మాత్రమె తిని, మిగులును వదలేసి పోవు ॥

చరణం :
------
ఆశ నిండు విసపు మనిషి  ఎదుటివాణ్ణి దోచే,
స్వార్ధ చింతనలు జేసి , నమ్మువారి  రోసే
 మానవత్వమే మరచే మనిషి మనిషినే కోసే,
జాతి భేదముల పేరున రాజకీయములు జేసే ॥

చరణం :
------
మేడ, మిద్దెలు కట్టగ మనిషి యడవి  కోసే
జంతువులను చంపి అమ్మి , సొమ్ములెన్నొ దాచే
 బ్రతుకు తెరువు పేరుతో బంధనాలు వేసే
గారడీలు చేయించి, మా  కడుపులు మాడ్చే॥ 

చరణం :
------
చిలకల మేల్కొలుపు లేదు, కోయిలమ్మ పాటలేదు
నెమలి కన్నెలాట లేదు , పుా బాలల శోభ లేదు
పచ్చదనపు వాడ లేదు, కొండ చాటు నీడ లేదు
ప్రకృతి పడతి ఎండి పోయె, భరత మాత క్రుంగిపోయె॥

చరణం :
------
బ్రతుకు తీరు బరువై , వాసములే  కరువై
 రోడ్లు జేరు మమ్ము  జంపె, మనిషి క్రుార మృగమై
మాస్థానము దోచీ , సంకెళ్ళను వేసీ
తోలు తీసి అమ్మకున్న మనిషి బ్రతుకు ఛీ ఛీ ॥

------------------------------------