Saturday, December 11, 2021

మత్తకోకిల పద్యాలు

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 
పద్యము : మత్త కోకిల
అంశం : దత్తపది:  
* జంగము- అంగము-  లింగము- సంగము.

(జంగ )మేశసు  భస్మ భుాషణ  
జన్మ మారణ  కారకా
(అంగ )మార్ధగ  నంబ నేలిన  
ఆది భిక్షుడ వీవయా
(లింగ )కారుడ  శృంగ శైలసు 
శీల పార్వతి నాధుడా 
(సంగ)మేశ్వర  గంగ ధారుడ  
సాధు సన్నుత కావరా ॥

(లింగ) రుాపసు భక్త పోషక 
లీల కార్య విశేషకా ॥
(జంగ)మార్చిత భస్మ భుాషణ 
జ్ఞాన ధారత్రి నేత్రకా॥
(అంగ) రంగసు వైభవార్చిత--
(ర్ధాంగ)పార్వతి నాయకా॥
కాశికాపుర వాస (సంగ)మ
కార్య ముక్తి ప్రదాయకా ॥

(జంగ)మేశ్వర  భిక్షు డైతివే 
 జగము లేలిన (లింగ)మా ॥
గంగ నెత్తిన దాల్చినా శివ
 గావు శక్తిసు  లింగమా ॥
(అంగ) మార్ధగ  నంబ కిచ్చిన 
 శృంగ తేజసు లింగమా ॥
 గంగ ముాడగు (సంగమం)బున
మొాఘ మొాక్షపు లింగమా॥

Friday, December 10, 2021

అప్పగింతల పాట

10/12/2021.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : ఐచ్ఛికం.
ప్రక్రియ : ఐచ్ఛికం.
శీర్షిక  : అప్పగింతలపాట.
రచన: సంగీతం : గానం:
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

పల్లవి : 
కంటిపాప నీవమ్మా మా ఇంటికీ
కన్నులనీరిడకమ్మా ఏనాటికీ..
అను పల్లవి :
మెట్టినింటి దీపమై  ఏలు రాణివై
పుట్టినింటి పేరునిలుపు ఏనాటికీ  నీ  ॥పుట్టినింటి ॥
॥కంటిపాప॥

చరణం:1
అత్త-మామ లోనె చుాడు అమ్మా నాన్ననుా....
ప్రేమతోడ చేయుమమ్మ 
వారి సేవనుా....
ఆడబిడ్డ నీ బిడ్డగ నెంచి సాకుమీ...ఆమె
నీ దరిని పొందాలీ తల్లి ప్రేమనీ..
మసలుకోమ్మ మంచిగాను ఇరుగు పొరుగుతో...
మంచి ఇల్లాలుగ పేరు గాంచు నీ నడతతో...॥॥కంటిపాప॥
చరణం : 2.
పుట్టినింటి జ్ఞాపకాలు తీపి గురుతులే..
నిలుపు అత్తింటి గౌరవమే నీకు కీర్తిలే...
కలసి మెలసి ఉండుటలే 
శాంతి-సౌఖ్యముా...
కట్టుకున్నవాని వలపదే నీకు సర్గముా...
మెట్టినింటి లక్ష్మి గా పేరు తెచ్చుకో...
పుట్టినింటి  పేరు నిలుపు మంచి దారి నడచుకో...

॥కంటిపాప నీవమ్మా మా ఇంటికీ...
కన్నులనీరిడకమ్మా ఏనాటికీ..
మెట్టినింటి దీపమై  ఏలు రాణివై..
పుట్టినింటి పేరునిలుపు ఏనాటికీ  నీ  ॥పుట్టినింటి ॥

Thursday, December 9, 2021

సాహిత్యం కొత్తపుంతలు

తెలుగు వెలుగు సాహిత్యం వారి
ప్రపంచ కవితా దినోత్సవం కొరకు పంపినది.
సంఖ్య 23.

రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర.

అంశం :సాహిత్యం....కొత్తపుంతలు.

శీర్షిక :దారి తప్పిన అక్షర కన్య.

ఒకప్పటి సాహిత్యం, భావ సౌరభ సుమ
సమాహారంలో మేలిమి ముత్యాక్షరాలై ముద్దులొలుకుతుా, మన సంస్కృతి కి
వన్నె తెచ్చే రీతిలో ఛందోబద్ధమై
 గద్య ,పద్య, కావ్య, పురాణాల కవన 
 వనంలో సుగంధ పరిమళాలు వెదజల్లుతుా,
భరతమాత కీర్తి కిరీటపు ద్యుతిని
ఇనుమడింపజేసే అజరామర కవ్య 
మంజరియై ,చరిత్రలో జ్ఞాన చేతన్య 
ఖనిగా వర్ధిల్లి వేల జేల నందుకున్నాది ॥
రాను రానుా సరళభాషోద్యమకారుల.
సౌజన్యంతో,చదువ సొంపుగా మారిన..
అక్షరం తన ఆకృతికి పలురాష్ట్ర భాషా
రంగుల్ని పులిమి, ఒకొక్క చోట 
ఒకొక్క విధంగా తనను తాను 
మలచుకుంటుా...చివరకు కొత్త దనపు 
రుచులు మరిగి, తన సహజ 
సౌందర్యాన్ని కోల్పోయింది.॥
రసమయ కావ్య ఛందస్సులు గిడసబారి
నాలుగు లైన్ల నుాతన పరిమాణాలతో
నలుగురికి అందుబాటైన రీతిలో 
అర్హత, అనర్హతల మధ్య ఆటబొమ్మై 
తన ఉనికిని కోల్పోయింది , ॥

హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని
నా  స్వీయ రచన.






సాహితీ బృందావన జాతీయ వేదిక అధ్వర్యంలో ,
ప్రపంచ కవితా దినోత్సవాన్ని 
పురస్కరించుకొని, రాసిన కవిత.

రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర.

అంశం :సాహిత్యం....కొత్తపుంతలు.

శీర్షిక :దారి తప్పిన అక్షర కన్య.

ఒకప్పటి సాహిత్యం, భావ సౌరభ సుమ
సమాహారంలో మేలిమి ముత్యాక్షరాలై ముద్దులొలుకుతుా, మన సంస్కృతి కి
వన్నె తెచ్చే రీతిలో ఛందోబద్ధమై
 గద్య ,పద్య, కావ్య, పురాణాల కవన 
 వనంలో సుగంధ పరిమళాలు వెదజల్లుతుా,
భరతమాత కీర్తి కిరీటపు ద్యుతిని
ఇనుమడింపజేసే అజరామర కవ్య 
మంజరియై ,చరిత్రలో జ్ఞాన చేతన్య 
ఖనిగా వర్ధిల్లి వేల జేల నందుకున్నాది ॥
రాను రానుా సరళభాషోద్యమకారుల.
సౌజన్యంతో,చదువ సొంపుగా మారిన..
అక్షరం తన ఆకృతికి పలురాష్ట్ర భాషా
రంగుల్ని పులిమి, ఒకొక్క చోట 
ఒకొక్క విధంగా తనను తాను 
మలచుకుంటుా...చివరకు కొత్త దనపు 
రుచులు మరిగి, ఛందస్సు సౌందర్యానికి
కొత్త రంగుల్ని పులిమి సహజసిద్ధమైన
అసలు అందాన్ని కోల్పోయింది.॥
రసమయ కావ్యాక్షరాలు గిడసబారి
నాలుగు లైన్ల నుాతన పరిమాణాలతో
నలుగురికి అందుబాటైన రీతిలో 
అర్హత, అనర్హతల మధ్య ఆటబొమ్మలై 
తమ ఉనికిని కోల్పోయాయి , ॥

హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని
నా  స్వీయ రచన.






ముద్దులొలికే మినీ కథలతో మురిపిస్తుా
వచన కవితల వారసత్వానికి
వారధి వేస్తుా భాషా పటిమ బాటను
సుగమం చేస్తుా నేటి కొత్త తరానికి
అనువైన రీతిలో అడ్డతోవల్లోతిరిగి
అర్హత, అనర్హతల మధ్య ఆటబొమ్మై 
తన ఉనికిని కోల్పోయింది , ॥


,

కలికి తురాయి

21/3/2021.
క్రమ సంఖ్య : 112.
"గోరసం ప్రపంచ కవితా దినోత్సవ సంబరాలు"
అంశం:  "దేశ భాషలందు తెలుగు లెస్స" .
శీర్షిక  : కలికి తురాయి. 

పదిహేను  శతాబ్దాల పుార్వమే
వినుకొండ వల్లభరాయలవారిచే
"దేశ భాషలందు లెస్స నా తెలు"గంటుా
వర్ణింపబడి, క్రిష్ణ దేవరాయల ఆస్థాన 
కవులైన అష్ట దిగ్గజాల కీర్తికిరీటంలో 
కలికితురాయిగా మెరసిన కావ్య కళల  
కాంతి కిరణం నా తెలుగు.॥
ముక్కోటి దేవతలకు మొాదమై,
సుస్వర నాదమై, వేద సారమైన ,
మేక్కొల్పు గీతాల మేలి సంగీతం నా తెలుగు॥
హిమ పన్నగ శోభలతో, గంగా, గోదావరీ
తరంగాల మలయ పవన 
మధుర వీచిక నా తెలుగు॥ 
ప్రకృతి  సంపదల సుమ సౌరభాలతో,
పాడి పంటల పచ్చని తోరణాల  
వసంత కోయిల గీతం నా తెలుగు॥
భావి భారతానికి మార్గ నిర్దేశం చేసి, బంగరు
భవితకు బాట చుాపే రత్న గర్భ నా తెలుగు ॥
పంచదార కన్న పనస తొనల కన్న 
కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"
అన్న ముద్రతో తపాలా బిళ్ళగా
విడుదలైన విశ్వ కీర్తిని చాటిన
విమల యశ చరిత నా తెలుగు॥
-------------------------------------------

కన్నీటి కవిత

21/03/2021.
ప్రపంచ కవితా దినోత్సవం.
శీర్షిక : భరత చరిత ఒక కన్నీటి కవిత.

రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర.


మమతలు మంట కలిసిన 
రక్త సంబంధాల ఆవేదన ఓ కవితైతే 
మారుతున్న మనోభావాల కర్కశ-
వ్యవహారాల కన్నీటి వ్యధ మరో కవిత.
రాజకీయపుటెత్తుల రంకు బాసలకు
అధోగతిపాలౌతున్న అమాయక ప్రజల
ఆశ నిండిన చుాపుల నిరీక్షణ ఓ కవితైతే....
ఒకప్పటి భరత చరితల గౌరవ చిహ్నాలు 
నేటి తరంలో తమ ఉనికిని కోల్పోతున్న 
దయానీయ పరిస్థితుల దారుణ
సంఘటనలకు నోరిప్పలేని జనుల
బలహీనతల  భవిత చరిత మరో కవిత.
దారుణాల దరువులకు గాయమైన 
శరీరాలకు , కాస్తంత ఉపశమనం 
కలిగించే సంస్థల ప్రైవేటీకరణలపై
కేంద్ర ప్రభుత్వాల సడలని నిర్ణయాల
మంటల సెగలకు ,బొబ్బలు తేలిన
కన్నీటి బాధల దీన గాధలు ఓ కవితైతే ...
కరోనా రేపిన కలకలానికి తోడు
నేటి పాలకుల అడ్డతోవల ఆలోచనలతో
అస్వతంత్రపు వేదనలకు లోనైన 
నాటి బానిసత్వపు సంకెళ్ల బతుకులను
భారంగా మొాస్తున్న భరత చరితే 
నేటి ఓ కన్నీటి కవిత. ॥


స్వార్ధం

మారుతున్న కాలం లో నేటి తరం
మనుష్యులు,నేను నాది అన్న భావాలు 
నిండిన అంతరంగపుటాలోచనలతో ,
పాప పుణ్యాపు చిట్టాలకు, అపనమ్మకపు
భావనా ముసుగును బలవంతంగా తొడిగి  
మనసు చెప్పే మంచి మాటలను
పెడచెవిని పెట్టి  బుద్ధి చెప్పిన బాటలో
నడిచి బురద గుంటలో బోర్లా పడుతున్నారు.
పెరుగుతున్న వయసుతో పాటు
అనుభవాల  నేర్పిన పాఠాలకు
యవ్వన మదంతో చేసిన అకృత్యాల
 కొలిమి మంటలు మనసుకు తగిలి
వేడి వాతలు పడుతుా ఉంటే..
జీవిత కాలపు చివరి క్షణాల్లో
తనవైన బంధాలు తను చేసిన 
పనులను తనపైనే ప్రయొాగిస్తుా 
చిత్రహింసలు పెడుతుా ఉంటే...
అప్పుడు అర్ధమైంది..నాకు
స్వర్గ నరకాల అనుభవ సారం 
మన స్వయంకృత కర్మఫలమేనని.
తెలుసుకొనేసరిగి , జీవత కాలం
సగభాగం పోరాట పొిట్ల గాయాల 
సలుపుకు హాహాకారాలు చేస్తుాంటే
నా అన్న ఆప్తులకు దుారమై, హీనమైన
బ్రతుకు బండిని లాగలేక , తిరిగిరాని
 "నిన్న" కు న్యాయం చేయలే
పశ్ఛాత్తాప పు పరిహారం కానరాని
తీరని వ్యధతో  క్షమాభిక్ష కోరుకుంటుా
రాని చావును రమ్మని  కోరుతుా
యమ పాశాన్ని అర్ధిస్తోంది.


మన ప్రాధమిక బాధ్యత

27/03/2021.
తెలుగు భారతి సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో..
అంశం: జాతీయ ఝండాకు వంద సంవత్సరాలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక : దేశ పౌరుల ప్రాధమిక విధి.

స్వాతంత్రోద్యమ పోరాటం చేసి సాధించిన
స్వాతంత్ర్యం , ఎంతోమంది చేసిన
త్యాగ నిరతికి నిదర్శనం.
ఆగష్టు పదిహేనున మువ్వన్నెల జెండాను
ఎగురవేస్తూ, యావత్ భారతావని, త్రివర్ణపతాక సృష్టికర్త అయిన పింగళి వెంకయ్యకు నిరాజనం పలుకుతోంది.
. ముాడు రంగుల మన జాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను,  స్వాతంత్ర్యయోధులను గౌరవించడం మన భారత పౌరుల ప్రాధమిక విధి.
1947 జూలై 27వ తేదీన నిర్వ‌హించిన రాజ్యాంగ స‌భ‌లో మొద‌ట‌గా ఆమోదింపబడిండి.
త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపి ఉన్న మన జాతీయ పతాకం వంద వత్సరాలు పుార్తి చేసుకొని
"భరత జాతి కీర్తి చిహ్నంగా "ఎప్పటికీ నిలిచిపోవాలి
అన్న సత్ సంకల్పంతో. మన జాతీయ ఝండాకు
ఐకమత్యంతో ,గౌరవపుార్వకంగా "జై " కొడదాం .

ఆనంద స్వాగతం

27/03/2021. (ఉగాది కవిరతలు వాట్సప్ లో)
"జనదీపిక " ఉగాది కవితల పోటీకి పంపినది.
శీర్షిక  : అనంద స్వాగతం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

అడుగడుగునా అడ్డు తగులుతున్న
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాణాళికల
ఉల్లంఘనలతో ,పాటు వికటించిన
ప్రకృతి ప్రకోపాల అతివృష్టి ,
అనావృష్టిల వర్ష ప్రభావానికి
పచ్చని పంటల విధ్వంశంతో పాటు,
సాగు నీటి కొరత వల్ల బీడు
భుాముల సారహీన ఫలితాలతో
అన్నదాతలకు సన్నగిల్లుతున్న
ఆత్మస్థైర్యం, అడుగడునా
ఆత్మహత్యలను ప్రేరేపిస్తోంది.
వికటిద్తున్న పర్యావరణ మార్పులకు
జన బాహుళ్యం, రోగగ్రస్థయై
మానవ సంబంధాల మాట మరచి
మారణ హోమం చేస్తోంది.
ప్రతీ సంవత్సరం సశ్యశ్యామలమై,
పచ్చదనపు కళలతో , సుమ సౌరభ
సోయగాలతో నిండిన వసంత
కన్నెల చెలిమి కోరుతుా, వన
విహారానికి వచ్చే ఉగాది కన్య..
దేశ అన్నదాతల విషమ పరిస్థితి కి
విస్తుపోతుా ,  నీటి వనరులను
సమృద్ధి పరచే ప్లవ నామ చెలియతో
పరుగు పరుగున వస్తోంది.
ప్రకృతి పచ్చదనాన్ని తిరిగి పెంచేందుకు.
పర్యావరణ రక్షణ చేసి మనకు
ఆరోగ్యామృతం పంచేందుకు.
రండి...అమె ఆగమనానికి
ఆనంద స్వాగతం చెపుదాం .

జీవితమా నీ విలువెంత

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి. 
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక : జీవితమా ! నీ విలువెంత ?.

అంటరాని వారికన్న హీనమైన
బ్రతుకు రోగాల భారీ చావులు.
కరోనా చావులకు చివరి
చుాపులు కరువైన బ్రతుకులు .
ఆగని సెల్ ఫొిన్ల నుండి 
హృదయ విదారకమైన  
ఊరడింపుల  పలకరింపులు
కరోనా రేపిన కల్లోల జీవితాల్లో 
కన్న వారు కుాడా కడుపు తీపిని
కాదనుకొనే భయంకర క్షణాలు.
పక్కవారి బాధలో పాలు
పంచుకో లేని మనిషి
మాముాలు చావును కుాడా
అనుమానించి ఆరాతీసే స్థితి.
చేదు అనుభవాల చెడుగుడు 
ఛేదించలేని బతుకు నీరస గతి.
కాష్టాలో కరువైన ముాడడుగుల 
కొలత, నోట్ల బరువుతో  తీర్చే 
ముదనష్టపు క్రిమిటోరియం ఘనత.
లక్షల శవాలు కాలిన బుాడిద
 పాప చిహ్నాల పాతరలో ఒకటై
 ఉచ్ఛ ,నీచ ,జాతి ,మతాలను  
 మరచి  మట్టిలో కలిసిపోతోంది.
 బ్రతుకు స్వాశ బారెడు ఆశతో
 మానవత్వాన్ని మంటపెడుతుా
 అందని ఆనందం కోసం అక్రమాల
 దారుల్లో అక్లకల్లోలం సృష్టిస్తోంది.
 కరోనా కట్టడిలో కుాడా శవాల
 సేకరింపుతో కన్నీటికి వెలకడుతోంది.
 జీవితమా ! నీ విలువెంత..?
 
 

కొండగట్టు ఆంజనేయస్వామి

అంశం : కొండగట్టు ఆంజనేయస్వామి పాట. : 
శీర్షిక :  ద్విముఖ రుాప.
గేయ ప్రక్రియ.

ద్విముఖ రుాప దివ్య తేజ హనుామంత రాయ
రామ పాద దురంధరా      శ్రీశ దివ్య కాయ ॥

ఉగ్ర దంష్ట్ర నారసింహ రుాప  దుష్ట శిక్షకా
ఆర్త త్రాణ పరాయణా హనుమ శిష్ట రక్షకా ॥

లక్ష్మణ ప్రాణ దాత    సంజీవ రాయా
అజరామర కీర్తి తేజ అఖిల పుాజ నీయా ॥

కొండ గుట్ట తీరవాస  కోటి సుార్య తే ఘనా 
అంజనీ సుతా అమేయ  అభయ దుఃఖ భంజనా ॥

భుాత ప్రేత పిశాచాది   రాక్షసాంతఃకా హరీ
జ్వర పీడా రోగ నాశ  చింతా శోక హారీ ॥

జానకీ దుఃఖ శమన  లంకా దహన కారీ
రామానంద  కారణాయ కపి వర జన ప్యారీ ॥

వన సుందర మన మందిర జన గణ హిత కారీ
ముని మానస బృంగ వీర  విశ్వ వందనారీ ॥

భుాతాది గణ సేవిత   వందిత చరణారీ
క్షేత్రపాల భేతాళ, శుభాంగ దాన వారీ॥

ప్రశాంత తీర నదీ సార వన విహార ధీర
సుందర సుమ గంధ  లేప సార విజయ వీర ॥  

వికట రుాప వీర హనుమ విద్యా, జ్ఞాన స్ఫుార్తి
ముకుట ధారి మన విహారి రామ భక్త కీర్తి ॥

మంగళ ప్రదాయ మాన ధన మనో విశాలీ
అంజనీ సుతాయ   అనిల పుత్ర ఆజ్ఞ కారీ ॥
-------------------------------------------------------

అత్యాశ

[4/2, 11:34] మహమ్మద్ రఫీ. ఈ వేమన: 31/03/2021.
ఈవేమన కవితా నిలయం లో
మార్చి నెల రెండో పక్షం
కవితా పోటీ కొరకు....
అంశం : అత్యాశ .

రచన:శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక : ఆశ హద్దులు దాటితే....

ఆశ అన్నది ప్రతీ ఒక్క మనిషిలో
 దాగి ఉన్న , దాచలేని నిజం.
 జీవిత రహదారిలో తనదైన పుాలవనంలో
తన వారసత్వం చిగురించి 
పరిమళించాలన్న ఆశ.మితమైన
ఆశ మితిమీరి, బుద్ధి మందగించి,
ఆశ ,సుఖాడంబరాలకు దారి వెతికింది.
ఆశ అడియాశయై ,చేసిన మేధో
సాగర మధనంలో, ప్రకృతి పచ్చదనం 
తరిగి ,భుామి పొడిబారిపోయింది.
రక్షా కవచాల్లాంటి కొండలు విరిగి
రహదార్ల  రుాపానికి రంగులద్దేయి.
సుఖ వాహన ,యంత్రాంగాల వల్ల
పెరిగిన పర్యావరణ  కాలుష్యంతో
కోల్పోయిన రోగనిరోధక శక్తి వల్ల
రోగ భుాయిష్టమైన,  కుళ్ళిన శరీరపు 
 కాష్టాల్లో , ఉద్భవించిన  కణాలు
 మందులేని మహమ్మారిగా మారి
 మనిషి జీవితాన్ని అల్లోకల్లోలం చేస్తున్నాయి.
ఐనా సరే ఆశ మీరిన మనిషి 
 ఇంకా ఏదో సాధిద్దామన్న అత్యాశతో...
 పరుగులు తీస్తునే ఉన్నాడు .


ద్వితీయ బహుమతి పొందిన కవిత.
*శ్రీమతి.పులాభట్ల.జగదీశ్వరీముార్తి *గారికి
అభినందనలు*💐💐💐💐👑👑👑👑👑💐💐💐💐💐💐

వందేళ్ళ జాతీయ ఝండా

తెలుగు భారతి సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో..
అంశం: జాతీయ ఝండాకు వంద సంవత్సరాలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక : దేశ పౌరుల ప్రాధమిక విధి.

స్వాతంత్రోద్యమ పోరాటం చేసి సాధించిన
స్వాతంత్ర్యం , ఎంతోమంది చేసిన
త్యాగ నిరతికి నిదర్శనం.
ఆగష్టు పదిహేనున మువ్వన్నెల జెండాను
ఎగురవేస్తూ, యావత్ భారతావని, త్రివర్ణపతాక సృష్టికర్త అయిన పింగళి వెంకయ్యకు నిరాజనం పలుకుతోంది.
. ముాడు రంగుల మన జాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను,  స్వాతంత్ర్యయోధులను గౌరవించడం మన భారత పౌరుల ప్రాధమిక విధి.
1947 జూలై 27వ తేదీన నిర్వ‌హించిన రాజ్యాంగ స‌భ‌లో మొద‌ట‌గా ఆమోదింపబడిన మన భారత -జాతీయ పతాకం ,వంద వత్సరాలు పుార్తి చేసుకొని
"భరత జాతి కీర్తి చిహ్నంగా "ఎప్పటికీ నిలిచిపోవాలి
అన్న సత్ సంకల్పంతో. మన జాతీయ ఝండాకు
ఐకమత్యంతో ,గౌరవపుార్వకంగా "జై " కొడదాం .

సంస్కృతీ సమ్మేళనం యుగాది

సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఉగాది జాతీయ పురస్కారాలు కవి సమ్మేళనం అంతర్జాల వేదిక ఆధ్వర్యంలో...

*అంశం  :సంస్కృతుల  నవోత్సవం ఉగాది పర్వదినం*
శీర్షిక : 

సంస్కృతి కి వన్నె తెచ్చే 
సాంప్రదాయ ఉగాది కన్య
వసంతోత్సాహపు ఉరుకు పరుగులతో
సుమ సుందర వన కన్యల ,ఆట
 పాటలతో కలిసి ఆనందించేందుకు
 ఆత్రంగా దివి నుండి భువికి  వస్తోంది.
 
 వత్సరాని కొకసారి వచ్చే మన నెచ్చెలి
 వసంత కోయిలల వలపు రాగాలకు
తను  పులకించే పల్లవై పాడాలని , 
సుమ సారాల తేట తేనెను తాగి
 మామిడి పుాత నిండు వనంలో
 మయుారి నాట్యం చేయాలని
 మామిడి పిందెల పులుపు తనానికి ,
 వేప పుా పరిమళం పుాత పుాసి
 కొత్త బెల్లపు తీపి ఱుచులు మేళవించి,
 కొత్త ఱుచి తెల్లదనానికి , మిరియాల
 నలుపు దిష్టి చుక్క పెట్టి , అందమైన
 కాయానికి ఆరోగ్య పుాత వేయాలని
--------**************************?**


2/04/2021.
"సాహితీ బృందావన జాతీయ వేదిక "ఆధ్వర్యంలో ఉగాది జాతీయ పురస్కారాలు కవి సమ్మేళనం ,అంతర్జాల వేదిక .

*అంశం  :సంస్కృతుల  నవోత్సవం ఉగాది పర్వదినం*

శీర్షిక :  స్వాగతం-సు స్వాగతం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

 వత్సరాని కొకసారి మనకోసం 
 వచ్చే మన  యుగాది నెచ్చెలి ,
 వసంత కోయిలల వలపు రాగానికి
 పులకించే పల్లవై ఆనంద లోకాల
 ఆరంభ గీతం తానే కావాలని , , 
 సుఖ- దుఃఖ సమానతల , జీవిత
 సారామృతాల దివ్య ఓషధులతో 
 ఆరోగ్య యుగాదికి ,ఆనందం కారణం
 తానే కావాలని , చల్లని తేట నీటి 
 వనరులను సమృద్ధిగా ఇచ్చే 
" ప్లవ "నామ కన్యను కుాడా తోడ్కొని
 మన మధ్యకు ఆనందంగా వస్తోంది.
వెతలను మాపే వేక్సీన్ తీసుకొని ,
కాలుష్య నిర్ముాలనా పధంలో 
పర్యావరణ రక్షాదీక్ష పుాని, 
కరోనాను తరిమి కొట్టే కట్టు బాట్ల 
నియమాలకు నిత్య బద్ధులమై,
సామాజిక దుార నియమాలను
పాటిస్తుా ,పండగ కళల శోభలతో
సుగంధ పరిమళాలు మేళవించిన 
ఛందోబద్ధ కవన సుమ హారాలతో
సాంప్రదాయ రీతుల వారికి
 "స్వాగతం" పలుకుదాం రండి.
 -------------------------------------
 
 
 
 
 
 
 

కాదేదీ కవితకనర్హము

31/10/2020
రచన శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహారాష్ట్ర
8097622021


ప్రక్రియ సమ్మొాహనాలు

శీర్షిక .
కాదేదీ కవితకనర్హము.
-----------------------------
81
ముద్దు మాటల పలుకు
పలుకు తేనెల నొలుకు
ఒలుకు ముద్దులు చిలుకు పలుకులవి ఈశ్వరీ॥
82
ఆట పాటల వయసు
వయసు తెలియని మనసు
మనసు తెల్లని దినుసు మసలుటలు ఈశ్వరీ ॥
83
మనసులోని భావము
భావము అనురాగము
రాగము శృంగారము వర్ణనలు ఈశ్వరీ ॥
84
అందాల వర్ణనలు
వర్ణనల చుాపులుా
చుపులే ప్రేమలేఖలు కదా ఈశ్వరీ॥
85
కవిత లల్లగ మనసు
మనసులో పలిదినుసు
దినుసు ని దౌమనసు బాసలే ఈశ్వరీ ॥
86
ప్రేమలో ప్రకృతదె
ప్రకృతి లో ఆకృతిదె
ఆకృతికి అందమౌ వర్ణనిదె ఈశ్వరీ ॥
87
పెరిగు వయసు చిత్తము
చిత్తము గాంభీర్యము
గాంభీర్యము వేదాంతము గనుము ఈశ్వరీ ॥
88
పెద్దరికపు మాటలు
మాటల లో సుాక్తులు
సుాక్తుల నిడు కవితలుా కధలుా  ఈశ్వరీ ॥
89
వృద్ధాప్య వేదాంత
వేదాంత స్వాంతత
స్వాంతన  ప్రసాంతతల కవితలుా ఈశ్వరీ ॥
90
చింతన ల భేదములు
భేదముల రాగములు
రాగాలనురాగపు కవితలుా ఈశ్వరీ ॥
91
వయసుకో ముచ్చటా
మచ్చటల కవితటా
కవితల లొ భేదమౌ భావమట  ఈశ్వరీ ॥
92
కాదేదీ కవితకు ను
కవితకు అనర్హమును
అనర్హమను  మాటలు వదలిమను  ఈశ్వరీ ॥

తస్మాత్ జాగర్త

శీర్షిక : ఓ...స్త్రీ ...ఓర్చుకో...నవ తెలుగు తేజం కు పంపేను.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

యుగ యుగాల చరిత మారినా
కానీ స్త్రీ ల కన్నీటి తడి ఆరలేదు.
మారుతున్న కాలం 
కొత్త మార్పు తో వచ్చి 
మగాళ్ళను మృగాళ్ళు చేసింది.
 అధికారానికి అండగా నిలచి 
ఆగడాలను పెంచింది.
అబలలు సబలలుగా  
మారుతున్న మంచి తరుణంలో 
మరో కోణంలో వచ్చి మాటు వేసే
మారణ హోమం చేస్తోంది.
స్వాతంత్ర్యం ఇచ్చినట్టే ఇచ్చి
శ్వాశ ఆడకుండా చేస్తోంది.
బాల్య వివాహాల బంధ విముక్తి చేసి
బాలికల శోషణకు దారులు కట్టింది
మానమే.ప్రాణమైన మహిళలను
మానభంగాల చితిలో మసి చేస్తోంది.
సొంతం కాని అందాలకు ఏసిడ్
పుాతలు పుాసి ఏహ్యం కలిగిస్తోంది.
అర్ధరాత్రి స్వాతంత్ర్యం,  ఆడదానికంటుా
అంగట్లో బొమ్మ చేసి ఆనంద పడుతోంది.
విధి రాసిన రాతంటుా వీధి పాలు చేస్తుా
వివసత్వపు విందును విరివిగా పంచు తోంది.
మానవత్వాన్ని మంటగలిపి మాన ధనాన్ని 
వేలం వేసి ముాకుమ్మడి మృగాలకు 
మొాజు పంక్తిలో ఆట బంతిగా అందిస్తోంది
అన్ని విలువలకుా వలువలొలిచిన 
కాలానికి, తల్లి ,పిల్ల , వావి వరుస-
పసి ,పడుచు ,ముసలి , మతకల 
తేడా చుాపని అధర్మం ఆదర్శ మయ్యింది. 
అలో లక్ష్మణా అంటున్న అవని శోకానికి 
ప్రకృతి పగిలి ప్రళయ బాట చుాపుతోంది.
ఓ ..స్త్రీ ...ఓర్చుకో..నీ కన్నీటి సునామీలో  
శాపగ్రస్థ ఐన కాలం కొట్టుకుపోతుంది.
సమయమాసన్నమైంది. 
-------------------------------

శీర్షిక  : తస్మాత్ జాగర్త.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

అమర వీరుల విగ్రహాలకు  
అడ్డు గోడల గోరీలు
ఉనికి కోల్పోయిన  ఖండిత
శిల్పాల ముక్కలు వీధి
రోడ్డులో వింతగా మాయమైన వైనం .
అడవి రాజ్యంలో ఆగంతకులకు
గుళ్ళు- గోపురాలల్లో అభిషేకాలు.
పంచదార తీపి ప్రాణాంతకమై
సుగర్ ఫ్రీ రుాపాంతరాలుగా 
మారిన తీపిమాటల చేటు చేతలు.
అడిగినవాడికి పిడి గుద్దుల సుద్దులు.
వంత పాడిన వాడికి వరుస ముద్దులు.
అక్రమాల దారుల్లో నిరంతర పుాలజల్లు.
అత్మ సమర్పణల త్యాగ నిరతికి 
అసమానత గుచ్చిన అవమానపు ముల్లు.
విధాత రాసిన కర్మ విల్లును ,
వితండవదంతో తిరిగి రాసిన
 బిల్లును కట్టలేక, నోట్లకు ఓట్లను 
 అమ్ముకుంటున్న ఓటర్లు బానిసత్వపు
 బంధాల్లో పడుతున్న శాపానికి 
 శోకంతో బొక్క బోర్లా పడిన 
 భరత మాతను తిరిగి లేవనీయని
 ఉక్కు పాదం ఉరకలేస్తుా
దేశాన్ని దోచుకుంటోంది  .
    తస్మాత్ జాగర్త..





 


ఆంధ్రుల అభిమాని

4/04/2021.
అంశం : అక్కడ వెలిగిన ఇక్కడి మణి దీపం.
శీర్షిక : ఆంధ్రుల అభిమాని.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

18 యేళ్ల వయసులోనే వైజాగ్
"స్పేక్టేటర్" పత్రికకు సంపాదకత్వం
వహించి "తెలుగు హార్స్" అనే పత్రికకే
కాక ,"లీడర్" అనే ఆంగ్ల పత్రికకు మూడు
దశాబ్దాలపాటు సంపాదకత్వం
వహించిన "  శ్రీ చిర్రావూరి యజ్ఞేశ్వర -
చింతామణి" గారు
ఉదారవాద రాజకీయ నాయకునిగా ,
మంచి ఉపన్యాసకులుగానే కాక
పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా
ప్రసిద్ధ పాత్రికేయునిగా పేరుపొందేరు.
ఈయనకు  బ్రిటీషు ప్రభుత్వం
" సర్ "బిరుదునిచ్చి సత్కరించగా ,
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
నుండి గౌరవ డాక్టరేట్ ను ,. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి " డి.లిట్. "
గౌరవ పట్టాను పొందన ఘనులు
" శ్రీ చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణిగారు ."

---------------------------------------------------------

వడ్డేపల్లిగారి పాటవెలది ప్రక్రియలో సుందరకాండ

పాట వెలది  పద్య ప్రక్రియలో సుందరాకాండ.
రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
రుాపకర్త.: శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు.
కల్యాణ్. : మహారాష్ట్ర .

శ్రీ సుందరాకాండ.(పాటవెలదులు).
పాటవెలదులు సృష్టి కర్త ...
శ్రీ వడ్డేపల్లి క్రిష్ణ గారు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

ఓం : శ్రీ : గణేశాయనమః.
సుందరాకాండ  ప్రారంభము.
ప్రక్రియ : పాటవెలది.
సృష్టి కర్త :  శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు.
రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి. 
కల్యాణ్ : మహారాష్ట్ర . 
1:
అపహరించె సీత నసురు డొకడు
రావణుండు వాడు రక్కసుండు
రమణి సీత బాసి  రాము వగచి
చిక్కి శల్య మాయె చింత తోడ ॥
2.
ధీరు డతడు హనుమ వీరు డతడు.
రామ భక్తి నిండు నామ జపుడు
జానకమ్మ వెదకి జాడ నెరుగ
బయలు వెడల లంక  బంటు రీతి ॥
3.
వరుస గురుల కిడెను వంద నములు
ఆనతీయ మనుచు ఆదరమున 
ఉధది దాట హనుమ  ఉరికి ఎగసి
దక్షిణంబు దిశగ  తరలి పోయె ॥
4.
పర్వతుండు వణికె పగలె  శిలలు
భుామి గుహల నదిరె భుాత గణము
తరులు రాల్చె పుాలు తడవ తడవ
కుప్పియించి నెగర కుల ఘనుండు ॥
5.
ధీర గతిని ఎగురు వీర కపికి
ఆశ్రయమ్ము నొసగి అలుపు దీర్చ 
తలచి మైన కుండు తరచి పిలచె
అలుపు దీర నిలుమ హనుమ యనుచు॥
6.
విఘ్నమదని తలచి వీర హనుమ
ఆగ్ర హమున తోసె అతడు గిరిని
కృంగి శ్రేష్ట గిరుడు వంగి నిలచి
నరుని రుాపు తోడ నగము పలికె  ॥
7.
యొాజనములు శతము యొాగి వంద్య
ఆగి నిలచి పొమ్ము అలుపు దీర
జలధి దాటగలవు జయము నీకు
అనుచు స్వాగతించె అనిల సుతుని ॥
8.
ప్రేరణిచ్చు పిలుపు  ప్రేమ పలుకు
వినియు క్షణము ఆగి వినయ ముగను
పవన తనయు డెగసె పరమ గతిని
జలధి దాట జరుప జాప్యమనుచు ॥
9.
పర్వతోత్తముడదె  పరవశమున
గాంచె ప్రేమ తోడ ఘనుని కపిని
రామ కార్య దీక్ష రగులు వాని
దివ్య జయము లేల దీవెనలిడె ॥
10.
సురులు అంబరమున సుస్వరముల
మేలు గీతములతొ  జేలు పలికె 
కార్య దీక్ష తోడ కదలె హనుమ
దాట యొాజనముల బాట సాగె ॥
11.
 రాత్రి లంక నేలు రక్కసులను
 జుాచి నంత హనుమ జంకు నేమొా
 బలులసురుల జుాచి భయము తోడ
 వీడు నేమొ లంక వివశు డౌచు ॥
12.
అసుర భయము తోడ హనుమ యిపుడు
సీత జాడ నెరుగ సిద్ధ మౌన
అనెడు శంక తోడ అదిరి సురులు
సురస నంపె భువికి శుభము దలచి ॥
13
రక్కసదని  తెలిసి రయము తోడ
లంక వీడు నేమొ  లక్ష్య మొదలి
సులభ మౌన కపికి సురస గుాల్చ
అనుచు దలచి సురులు అశ వీడె ॥
14.
బ్రహ్మ వరము దలచి భయము వీడి
 తెరచె  నోరు సురస తెగువ తోడ
 రక్కసదని తెలిసి రగుల మనము
 మేను పెంచె హనుమ మేరు రీతి ॥
15.
ఒడిసి పట్టి కపిని నోట మ్రింగ 
నోరు తెరుచు సురస జోరు నెరిగి
 అంగు ళీక మంత ఆయె హనుమ 
నోట జొచ్చి వచ్చె నొనర జయము  ॥
16.
పవన సుతుని ప్రజ్ఞ పాటవముకు
ముదము దీవెనలిడె మురిసి సురస
అంజలిడుచు హనుమ ఆదరమున
ఆకశమ్ము నెగిరె అనిల సుతుడు.. ॥
17.

దీక్ష నుధధి దాటు ధీరుని గని
సింహికడ్డగించె  సింహ బలుని
నాల్క జాపె వానినారగింప
ఛాయ రుాపి , దాని చంపె హనుమ ॥
18.
సాహసమున దాటె సంద్రమతడు
కనుల ముందు గాంచె కాంచనపురి.
నిపుణు విశ్వకర్మ నిర్మితంబౌ
లంక గాంచె నతడు లక్షణంబౌ ॥
19.

త్రికుటచలము నిదియె త్రిభువనమున
నాకమునదె మించె నగర శోభ
ఫలము ,పుాల నిండు పచ్చదనము
సుందరమ్ము మిగుల సుందరమ్ము ॥
20.
అద్భు తమ్ము లంక అనుచు హనుమ
అదెగ తిరిగె వనము అచ్చెరువున
నిలచి నిలచి జుాచె నిండు వనము  
గడచె దినము యంత పొడచె రాత్రి ॥
21.
తరుణ మిదియె గాదు తరుణి వెదుక
అనుచు తలచి హనుమ అచటె నిలిచి
వేచి యుండె నచటె వేకు వగన 
నిశిని గడపె హనుమ నిదుర లేమి ॥

---------------------------------------------
22.
వేకు వాయె నంత వెలుగు వచ్చె
వేచి యున్న హనుమ వేగ సాగె
కరకు రజనిచరుల కంట బడక
ఎక్కి గోడ నతడు ఎగిరి దుమికె ॥
23.
నక్కి పోవు కపిని నిక్కి జుాచి
 జడల మారి చరిచె జఘన ములను 
 కరకు రక్కసామె  కరుణ లేని
 లంక గాచు నసురి లంఖిణామె ॥
 24.
అడ్డగించె నసురి హనుమ బాట
గర్జనలను జేసి గట్తి గాను
కొండ కోన తిరుగు  కోతి వనుచు
తరలి పొమ్మటంచు తరిమె నతని ॥
25.
రగిలె హనుమ వింత రక్కసి గని 
నన్ను వెడలు మనుచు నడ్డు నీవు
పేర్మి దెల్పు మమ్మ  పేరు నీవు
అనుచు నోర్మి పలికె హనుమ యపుడు.॥
26.
కావలుందు నిచట గావ పురము
లంఖిణందు రన్ను లంకసురిని
ఆన తిడను పురము నడుగు నిడగ
ప్రాణ ములను దీతు పారి పొమ్ము ॥
27.
అనిన లంఖిణి గని హనుమ బల్కె
 జుాడ వస్థి  పురము జుాచి పోదు
 వేడు చుంటి నమ్మి వెడలనిమ్ము
 అనుచు వినుతి జేసె ఆదరమున ॥
 28..
మంకు పట్టు విడని మారుతి గని 
గర్జనలను జేసి గదిమి తరుమ 
కుమతి విసిగి మీద కురిమి చరచె
హనుమ ఉగృడాయె హఠము పెరిగె ॥
29.
సింహ నాద మిడెను సింగ మల్లె
మారు మ్రొాగి రవము మారు బల్కె
కొండ వలెను పెరిగె కోరి హనుమ
ముష్టి ఘాతములతొ ముదిమి గుాల్చె ॥॥
30.
కొండ వంటి అసురి బండ వలెను
దొర్లి దొర్లి కుాలి , పొర్లి పొరలె 
అబల తానటంచు అరచి వేడె
దయను చుాపటంచు ధరణి వ్రాలె ॥
31.
అబల జంప నేను అల్పు గాను
అనుచు బల్కె హనుమ ఆదరమున
ధర్మ బుద్ధి మెలగు ధన్యు జుాచి
నమము జేసె నసురి నమ్ర భావై ।
-------------------------------------------
32.
ఓట మిదియె తనకు ఒనరు కీడు'
లంక కగును  చేటు శంక లేదు
సీత ముాల మౌను సీమ  రగులు 
 అనుచు వణికె నసురి  అదెగ దలచి ॥
 33.
లంఖిణనెడు మాటలదెగ వినిన 
హనుమ సంతసించె హర్షమొలుక
కలుగ భయము నసురి కదలి పోయె
జయము హనుమ నీకు జయ మటంచు॥
34.
ప్రతిగ లంఖిణీకి  ప్రణతు లిడుచు
కంట తడిని బెట్టె కాంత దలచి
రావణాసు దలువ రగుల మనము 
వామ పాద మిడెను వరల కీడు॥
35.
కొండ దాటి పోయె కోట దరికి 
లంఘనముల వెదుక  లంక దిరుగ
సుమ సుగంధ వీచి  సుఖము లొలుక
శోభ లలరు వనము  సొగసు గాంచె ॥
36.
రమ్య వనము సాగె రాజ వీధి
స్వర్ణ  సౌధ ములవె  స్వచ్ఛ బాట
దివ్య మణుల  ద్యుతులు దిక్కు లీన
ఉత్తమంబు గృహము లున్నతములు ॥
37..
అప్సరసల మించు అంద ములతొ
మేటి నృత్యములవె మేలు గతుల
అతివ లచట నాట్య  మాడె జతుల 
రమ్యమైన రేయి రసము లొలుక ॥
38.
శోభ లీనె లంక శోధ నేల...
అనుచు మదిని దలచె  అనిల సుతుడు
వెన్నెలంత హాయి వెలిగె లంక
కదల లేక వదలె   కపి వరుండు ॥
39.
రత్న ఖచిత మయము  రమణియమ్ము
కళలు నిండు పురము  కాంతి మయము
వీణ నాద మలరె విందు లీను
మధుర కళల నిండె మందిరములు॥
40.
ధ్వజ పతాక మెగిరె ద్వార ముపరి
సింహ ద్వార మదియె సిరుల నెలవు
 నృపుని  గృహము నేలె నృత్య గీతి
 రాగ రంజి తముగ రమణు లాడ ॥
----------------------------------------
శ్రీ సుందరాకాండ.(పాటవెలదులు).
పాటవెలదులు సృష్టి కర్త ...
శ్రీ వడ్డేపల్లి క్రిష్ణ గారు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
41.
ఫలము లెల్ల నిండె వనము పండె
పరిమళించె పుాలు పలు రకములు.
సకల రాజ భోగ సంపదలరె
రావణాసు లంక రస భరితము.॥
42.
యమ కుబేర వరుణు లాది ఘనుల
మించి నట్టి ఘనత మీరె లంక
శివుని అర్చ నలవె సిరులు పంచ
జపము తపము లచట జరుగుచుండె ॥
43.
విశ్వ కర్మ తొలుత విధికి నీయ-
ధనపతి కది యిచ్చె దాని బ్రహ్మ.
రావణుండు గెలువ రణము నందు
పుష్పకమ్ము పెంచె పురము శోభ ॥
44.
వలయు నపుడు తలువ బయలు వెడలు
వాయు వందు దేలు వాహనమ్ము
అట్టి పుష్ప కమ్ము నవని గనని
చక్క దనము గనుచు చకితు డాయె ॥
45.
రణము నందు నోడు రాజ సతుల
మెచ్చి రావణుండు  దెచ్చి యుంచె
రమణి సీత దక్క  రమణు లగని
వగచె నెంతొ హనుమ వారి గతికి ॥
46.
వీర మందిరమున  విశ్రమించు
 రక్కసుండు అతడె  రావణుండు 
కత్తి పోట్లు నిండు ఘాత ములతొ
సేద దీరె నచట సేవ లలర ॥
47.
లోహితాక్షుడతివ లోలు డతడు.
కల్లు తాగు వాడు నల్ల వాడు.
మహిని మగువ లేలు మద పురుషుడు
రాస లీల నెరపు రసికు డతడు ॥
48.
వంచి తలను హనుమ పొంచి చుాడ
దివ్య భుాషణముల దీర్చి దాల్చి
శయన మందిరమున శయ్య నలరు
రమణి గాంచె నతడు రమ్య గతిని ॥
49.
భామ సీత యనుచు భ్రమను పొందె
కంటి సీత ననుచు కపి వరుండు
బట్టి వాల మతడు బెట్టి ముద్దు
చెంగు చెంగు యనుచు చెలగె హనుమ ॥ 
50.
పల్లి టీలు గొట్టె పవన సుతుడు
కోతి గుణములకును కొదువ గలదె .
తంబములను బట్టి తడవు నెక్కి
దుమికె నేల నతడు దుడుకు మీర ॥
---------------------------------------------
51.
ఎట్లు తలచితేను ఎరిగి నిజము
జానకుండ గలద  జగము లోన
రాము బాసి నట్టి  రమణి  బేల
పరమ సాధ్వి యామె , పలుక, తప్పు ॥
52.
రమణి సీత బోలు రమణి  జుాచి
తప్పు  దలచి తేను  తగదు తప్పు
 అనుచు బాధ చెందె హనుమ మదిని
వగచె తలచి తలచి వాయు సుతుడు.॥
53.
స్వావలంబమునను స్వామి సేవ 
జేయ వచ్చి నాను చెడుపు నెరుగ
పాపి గాను నేను పలుక, దప్పు
సీత వెదుకు వస్తి  సీమ లంక ॥
54.
దవుల దవుల వెదకె ధరణిజగన
మేలు వసతు లెల్ల  మేడ లెల్ల
భుాగృహముల వెదకె భుామి సుతను
కాన రాని దాయె కాంత యెచట..॥
55.
రామ నామ  జపము రమణి జేయ 
రాక్ష సతులు రమణి రక్కె నేమొ
రామ జపము వినిన రావణుండు
సీత జంపె నేమొ శీఘ్ర గతిని ॥
56.
అనుచు దలచి హనుమ ఆగ్రహించె
కంట నీరు కారె కపి కులజుకు
వెదకె అడుగు అడుగు వెతల కోర్చి
కాన రాని దాయె కాంత యెచట..॥
57.
ఆపతమ్ము సోక అలసె హనుమ
కాననముల వెదకె కాచి గాచి
జాడ కాన రాదు జరిగె దినము
తరిగె దుడుకు తనము తగ్గె నతడు ॥
58.
రామ చంద్రుడడుగ రమణి మాట,
ఏమి సేతు నేను ఏమి చెబుదు..?
తరుణి కాన నైతి తరలి పొివ..
అనుచు సిగ్గు పడెను అనిల సుతుడు॥
59.
అవనిజ ఇక లేదు అనిన వార్త
విన్న రాముడచటె విడును శ్వాస
రాము నంటి పోవు రవి కులమ్ము
నాశ మౌను గాదె నాదు వలన ॥
60.
వగచి మాన్యు లెల్ల వరుస పోవు ,
అటుల జరుగ రాదు అవని లోన 
మాత వెదకి గాని మరలి పోను
అనుచు ప్రతిన బుానె అనిల సుతుడు ॥
-------------------------------------------------
61.
వానప్రస్థ మేల వాయు సుతుడు
నిత్య నియమ మేలె  నిష్ట తోడ
చంద్ర, సుార్యు లాది జయ గ్రహములు
ప్రబలు గౌరవముల పణతు లిడెను ॥
62.
వనము లెన్నొ తిరిగి వడలి -జేరె 
శోభ లలరు వని కశోక వనికి
విరిగ కురియు తేనె విందు జేయ
గ్రోలు భృంగము లవె గోల గాను ॥
63.
పక్షి గుంపు లెల్ల పరవశమున
కిచల రవము జేసె కీచు గాను
నెమలు లాడె నచట నేర్పు కళల
గంధ వీచి సోకె గాడముగను ॥
64.
రాలు పుాల పండ్ల రసము గ్రోలి
కపి వరుండు ఆడె కడు విధముల
ఆట పాట తోడ అరచి విరచె
మంచి మేలు తరుల మర్కటుండు.॥
65.
పుావులనిన పుాల తావులనిన
పరవసించు నెంతొ పసిడి కాంత
తేనెలుారు వనము తేట వీచి
తధ్య మిచటె నుండు తరుణి సీత ॥
66.
అనుచశోక వనము నదెగ జుాచి
చెట్టు నెక్కె హనుమ  గుట్టు గాను
నేల వాలి కుంగి ఏడ్చు చున్న
యువతి గాంచె నతడు ఉత్సు కతను ॥
67.
చిక్కి శల్య మైన చిన్న దాని
గనెను హనుమ నామె కరుణ తోడ
 జుట్టు ముట్టి రామె జట్టు గాను
 లంక సురుని చరులు లంఖిణీలు ॥
 68.
వృక్ష శాఖ లందు వరుస సరులు
మణులు మరకతముల మాల లెన్నొ
కర్ణ వేష్ట హస్త కంకణములు
హనుమ జుాచె వాటి నచ్చెరువున ॥
69.
రమణి వీడి నట్టి రతన ధనము
గురుతు పట్టి హనుమ మురిసె మదిని
సర్వ లక్షణముల సార సుగుణి
సీత దక్క ఎవరు సిరుల నెలవు ॥
70.
జానకమ్మ ఒకతె జగతి లోన
రామ మదిని దోచు రమణి సాధ్వి
పదియు నాలు గేండ్లు పావనిచట
దుర్దయెంత గనెనొ దుఃఖ పడెనొ ॥
71.
అనుచు దలచి మదిని హనుమ వగచె
తల్లడిల్లె హనుమ తరుణి జుాచి 
జయము కలుగు నీకు జగతి ననుచు 
శుభము పలికె హనుమ సుఖము లేలు ॥
72.
కఠిన కాల మిదియె కష్ట ములకు
తొలగి పోవు నమ్మ త్వరిత గతిని
నీదు జాడ తెలియ నిక్క ముగను
రావణునదె చంపు రామ శరము ॥
73.
అనుచు హనుమ సోలె నచటె నిలచి
 ఝాము లాయె ముాడు జాగ రణతొ 
మధుర వాద్య ఘోష మంగళములు
ఆలకించె హనుమ హాయి మీర ॥
74.
మరపు రాని సీత,  మదిని కలచ
మేని తాప మలర మేలు కొనిన
రావణుండు నెరపె  రాజ సమున
శాస్త్ర యుక్త ముగను సర్వ విధుల ॥
75.
అప్సరసల బోలు అతివలతని
సేవ జేయ వచ్చి చెంత  నిలచె
సార భుాషణముల సరిగ దాల్చి
వెడలశోక వనము  వేగ తెమిలె ॥
76.
సతులు నుార్గు రతని సరస జేిరి
మెరయు సరుల జుాచి మెచ్చి రతని
రమణి దలచి మదిని రక్కసుండు 
నవ్వి రావణుండు నడచె వనికి ॥
  77.
రామ గుణ గణముల రాత్రి పవలు
జపము జేయు పుణ్య చరిత జుాడ
రావణుండు కదలె రాజసమున
మేని సరుల జాపి మెప్పు పొంద ॥
78.
మసక రుాపు తోడ మసలె హనుమ
రావణాసు గాంచి రగిలె మనము
శింశుపావనమున  సీత సాధ్వి
 ఏక వస్త్ర అమె ఎరుగ దేమి ॥
 79.
అనుచు తలచి హనుమ అదె పరుగున
వనము జేరె నంత పలుక హితము
విషయ మెల్ల జెప్ప వివర ముగను 
లంక సురుకు బోధ లదెగ జేయ. ॥
80.
దాన సామ భేద దండములతొ
సానుకుాల పరచ సాధ్వి దరికి
జనెను రావణుండు జతన ములతొ
జేరి సీతను గని జెప్పె మనసు ॥
81.
ఏలుకొందు నిన్ను ఏల చింత
రాణి వాస మేలు రమణి నీవు
లోక సుందరీవు లోల నేత్రి
వన  నివాస మొదులు వనజ నేత్రి ॥
82.
వనము లేలు వాని వశము గాదు
వలయు సుఖము లిడగ , వట్టి మాట
నన్ను జేర రమ్ము నమ్మ కమున
సుఖము లేల గలవు సుందరాంగీ ॥
83.
అడవి దిరుగు రాము డల్పు డతడు
నన్ను గెలవ తరమ నరుడతండు
ఇంద్ర దేవతలను  ఇట్తె గెలిచి
ధామ సర్గ మేలు ధవుడ నేను ॥
84.
మరచి పొమ్ము వాని మరచి రమ్ము 
సర్గ సుఖము లిత్తు సరసి జాక్షి
అనుచు వాతలాప మధిగ జేసె 
చెడుపు మాట లనుచు జేర వచ్చె ॥
85.
సీత ధవుని దలచి శిరసు వంచి
నమము జేసె మదిని నాధు దలచి
గరిక మించు హీన గుణుడ వనుచు
పెరికి గడ్డి పరక పెట్టె నడ్డు.॥
86.
పిరికి పంద వలెను ప్రియుని చాటు
అపరించి తీవు యడవి జొచ్చి
కపట వేస మునను కరుణ లేక
పట్టి తెచ్చి తీవు పలికి కల్ల ॥
87.
వదరు బోతు వీవు వంచకుడవు
పనికి రాని వట్టి పలుకు లాపు 
శరణు వేడు మతని శరణటంచు
రాము డతడు ఘనుడు రక్ష కుండు ॥
88.
భీతి నొందు వట్టి  భీరు డీవు
నీతి లేని గుణము నీచ బుద్ధి
గుణుడు రాము డొచ్చి గుాల్చు నిన్ను 
లంక దగ్ధ మొౌను శంక లేదు ॥
89.
అనుచు సీత బల్క నదిరె నతడు
కోప మాప లేని  క్రోధి యగుచు
ఎంత జాణ వీవు యెంచ తరమా !
కరకు మాట నీదు కనివినెరుగ ॥
90.
నీదు మాటలు విని  నిలువ జాల
గడువు రెండు నెలలు గడచి నంత
కనికరించ నేను కాంత వనుచు
చంపి వేతు నిన్ను చపల నేత్రి॥
91.
రాను ఇచటి కింక రానటంచు
 అరచె రగుల నతడు అదరె లంక
 క్రొవ్వు దేరు మేను క్రోధ మునకు
 కరిగి కారె చమట కరకు మేని ॥
 92.
రాము నాజ్ఞ  లేక రక్ష లేక
పలుకు లేక యుంటి పరుష మొప్ప
పరమ సాధ్వి నేను పతివ్ర తేను  
తృణము బోలు నిన్ను తృటిని గుాల్తు ॥
93.
కలికి పలుకు లోన కఠిన ముగని
రగిలె రావణుండు రమణి జుాచి
నివురు గప్పు నట్టి నిప్పు యట్లు
మాట లాడె సీత మాయ  గాదె ॥
94.
అనుచు పలికి నతడు అవని గాచు
అక్కసు నదె పిలచె రక్కసులను
రాయి వంటి దైన రమణి మనసు 
మార్చు మనుచు  జెప్పి మరలె నతడు ॥
95.
గడువు రెండు నెలలు  గడచి నంత
వినదు అన్న మాట విననటంచు
మాట వినగ జేయ మసలు మనుచు 
కరుగ జేయ మనెను కాంత మనసు ॥
96.
అటుల జేయకున్న ఆగ్రహింతు
అబల లనియు జుాడ నాగ్ర హింతు
శిక్ష వేదు జంపి శిలువ వేతు
అనుకు క్రోధి వెడలె  అవనిజదరె ॥
97.
మరలె రావణుండు మదిని కృంగి
కొరకొరనుచు జుాచి కోమలి దెస
ఎర్రనైన కనుల నెగుర వేసె
ఆగి తొడను చరచె  నహము తోడ ॥
98.
కనికరమ్ము వీడి కరుణ లేని 
 రక్కసుల్లు జేరి రమణి రోసె
 కంట ధార లాయె కనుల నీరు
 బేల యౌచు వాలె బెదరి సీత ॥
 99.
ముదుసలైన త్రిజట ముప్పు నెరిగి
మాతకడ్డు నిలచె మండి పడుచు
సీత జేరి నంత సీమ లంక
దగ్ధమౌనటంచు దరిమి గొట్తె ॥
100.
ప్రళయ కాల మిదియె ప్రాణ ములకు
దానవులకు కీడు దాపు రించె
అనుచు త్రిజట పలుక అదరసురిలు
బెరకు తనము తోడ బెదరి చెదరె ॥
------------------------------------------------










120.
స్వర్గ  మంటి లంక స్వర్ణ లంక
మసిగ మారి కలసె మట్టి లోన
ముద్దు లొలుకు లంక మునిగి పోయె
కలసె  సాగరమున కల్ల గాదు ॥
121.
అనుచు జెప్పె త్రిజట అసురి నులతొ
భయము చెంది వార భయము కోరె
రాత్రి గడిపి రెటులొ  రణము దలచి
రమణి సీత విడిరి  రగుల భయము ॥
122.
శోక వనిని సీత  శోక మిడుచు
కడగ రాము దలచె కమల నేత్రి 
 ప్రాణ త్యాగ మెంచి  ప్రణతు లిడుచు
మెడకు జుట్టె జడను మేలు ఉరిగ ॥
123. 
కనుల నీరు నిండె  కఠిన గతికి
దుఃఖ మినుమడించ తుాలె సీత
అంత లోనె వింత  వనిని జరిగె
శుభ శకునములను  సుదతి గాంచె ॥
124.
సీత జేయు పనిని చిత్రముగను
గనిన హనుమ మదిని కలవరపడె
ఆలసింప అగును అశుభ మనుచు
తరుణి  సీత గావ తలపు నెంచె॥
125.
రామ బంటు ననిన  రమణి మనదు
రక్కసుండ వనుచు రగులు సీత
వేష ధారి వనుచు వేయు నింద
ఏమి చేదు నింక  ఎరుక జేయ ॥
126.
యొాచ నెంచి అతడు యొాగ్యమైన
రామ కధను పాడె రమణి వినగ
పావనమ్ము గాధ పరమ శుభము
పలుక తేనె లొలుకు భవుని చరిత ॥
127.
 వినియు రామ చరిత వివశయౌచు
సీత అగి చుాచె చిత్ర ముగను
ఉరిని వేయుటాపి ఉరికె సీత
పాట వినిన దెసకు పరుగు లిడగ ॥
128.
సీత వినుట గనుచు శీఘ్ర గతిని
రామ గుణము లెల్ల రసము లొలుక
పలికె హనుమ శ్రావ్య  పాట రీతి.
సంత సించ సీత సరసి జాక్షి ॥
129.
సత్య వంతుడతడు సర్వ శుభుడు
యశము లేలువాడు యజ్ఞ ఫలుడు
ధశరధాత్మజుండు ధరణి నేలు
రామచంద్రుడతడు  రఘుకులజుడు ॥
130.
తండ్రి మాట వినెడు తనయు డతడు
ధర్మ మార్గ మెంచు ధర్మ ధవుకు
జ్ఞాన ధనుడతండు దాన గుణుడు
దశరధాత్మజుండు ధర్మ ప్రభువు ॥
131.
సభను సభికులంత  సమ్మ తిడగ
రాజ పట్టమిడగ రాము నకును
జేయ నిర్ణ యించె జయము గాను 
దశరధుందు ధర్మ దాశరధికి ॥
132.
సంతసమ్ము తోడ సతుల జేర
చిన్న భార్య కైక చిందె విషము
మున్ను బాస లిడిన ముాడ్వరముల
ముందు ఇమ్మ నడిగె ముార్ఖముగను ॥
133.
మాట తప్పనన్న మగని  జుాచి
కరకు కైక కోరె కటు వరములు
వనము కంప మనెను వర సుతుడను
కట్ట వలె భరతుకు  పట్ట మనెను ॥
 134.
రాము వీడ మనెను రాజ్య సుఖము
కడకు పంప మనెను  కాన నముకు
పదియు నాలుగేండ్లు పరిమి తిడెను
కఠిన మనము నిండు  కపటి కైక ॥
135.
దద్దరిల్లె నభము ధరణి పగిలె
మాట విన్న రాజు మదిని రగిలె
ఏమి కోర్కె ఇదని ఏడ్చుచడిగి
దశరధుండు కుాలె ధరణి పైన ॥
136.
ముక్కుపచ్చలారు ముద్దు సుతుని
అడవికంప లేను అడుగ నీవు
కనికరమ్ము తోడ కరుణ గొనుమ
అనుచు ధశరధుండు అడిగి సోలె ॥
137.
కరగ లేదు మనసు కఠిన గుణికి
దీను డతడు వేడ ధక్కరించె
మాట  ఇచ్చితీవు మరల కనుచు
పట్టు బట్టి  కైక పతిని  రోసె ॥
138.
తండ్రి మాట వినెడు తనయు డతడు
తల్లి కోర్కె దీర్చ తరల వనికి
వల్క ధారి యుౌచు వదలె పురము 
చెదర నీక నగవు చేసి నమము ॥
139.
రాము విడవ లేని రమణి సీత
వెంట నడచె నతని వెలుగు వలెను 
రాము గుాడి నడచె లక్ష్మణుండు
రాము డున్న చోటె రక్ష యనుచు ॥
140.
కామ రుాపులైన కర్కసులను 
హతమొనర్చె రాముడడవి లోన
దండకా అరణ్య దాపు నతడు
దానవులను దృంచె, దరిమి తరిమి ॥
141.
 సుారు డతని గనెన సుార్ఫణఖయె
 పెండ్లి యాడ గోరి ప్రేమ దెలిపె
 కోసె ముక్కు చెవులు  కోపి అతడు
 రామ అనుజు డతడు రక్షకుండు
 142.
లక్ష్మణుండు అతడు లక్ష ణుండు.
సీత గాచు నతడు  చిన్న వాడు .
రావణాసు చెల్లి రక్కసామె
రగిలె బాధ తోడ రక్కసామె ॥
143.
అన్న రావణునకు అంత జెప్పె 
 చెల్లి మాట వినుచు చెలగె నతడు
 అనుజు మారి చునకు ఆజ్ఞ జేసె
 మాయ లేడి గాను మార నతడు ॥
 144.
అన్న రావణు మాట నమలు జేసి
మారిచుండు వెడలె మాయ తోడ
మృగము జుాచి మురిసె ముదిత సీత
స్వర్ణ మృగము కోరె స్వయము సీత ॥
145.
సీర కోర్కె దీర్చ సిద్ధ మౌచు
రాము మృగము  తరిమె రమణి కొరకు
మాయ తెలియు రేడు మాటు వేసి
మారిచునను జంపె మహిమ తోడ ॥
146.
జాప్య మగుట గాంచి  జడిసె సీత
పంపె లక్ష్మణునదె పడతి వనికి.
దానవులది మాయ దడవ కనుచు
గీరి దాట కనుచు గీత గీసె ॥
147.
కృుద్ధ రావ ణుండు కృుారు డతడు
మానినపహరింప మాయ పన్నె
సాధు రుాప మెత్తి సమయ మిదని
రమణి దరికి పోయె రావణుండు.॥
148.
బిక్షు వేష కునకు బిక్ష మిడగ
సీత మాట మరచి  గీత దాటె.
 కపట రుాప ధారి కరుణ వీడి
 మాతనపహరించె మాయ తోడ ॥
 149.
ఇంతి బాసి వగచె ఇనకులజుడు
అడవి దారి బట్టె అవనిజ గన.
వృద్ద గ్రద్ద జెప్పి వ్రాలె నంత 
ప్రాణ ములను బాసె ప్రభువు చెంత ॥
150.
లంక పురము వెదుక లక్ష్యమునిడి
రేయి పవలు దిరిగె రేడు విసిగె .
నగవు లేలి నట్టి నాధు డలసె
చిక్కి శల్య మాయె చింత తోడ ॥
151.
వాలి గుాల్చె నతడు  వనమునందు 
వాని తమ్ము జేసె వనికి రాజు
 రామ సుగ్రివులదె రాగ మలర 
 మిగుల ప్రీతి మెలగు మితృలైరి.॥
 152.
 సంత సమున విభుని సత్కరించె
 వానరులకు రేడు వరలు భక్తి .
 సిరుల నేలు ముఖము చిన్న బోవ
 విషయ మేమనడిగె విభుని రేడు ॥
153.
రాముడశృవులతొ , రమణి దలచి
విషయ మంత జెప్పె  వివర ముగను .
విషయ మంత వినిన విభిషణుండు
తరుణి వెదికు దేను ,తప్పకనెను ॥
154.
 ప్రతిగ మేలు జేతు ప్రభువు కనుచు
 కపుల పిలచి జెప్పె కబురు నతడు
 రమణి వెదుక మనెను  రాజ్య మంతా
 రామ కార్య మిదనె , రాజసమున ॥
 155.
కామ రుాపు లైన ఘనులు కపులు
వెదుక నాల్గు దెసలు వెడలి రంత.
పక్షి రాజు మున్ను  పలుకు బాట.
కడకు సాగరమును గనిరి కపులు॥
156..
సాగరమును దాట సాధ్య మౌన
నట్ట నడుమ గలదు నగర లంక 
ఎగుర గలమ మనము, ఏమి దారి..?
చేత నౌన మనకు జేర లంక. ॥
157.
వగచు కపుల జుాచి వాయు సుతుడు
తనదు మాట జెప్పె తరుణ మిదని 
అంజనీసు తుడను హనుమ నేను
కడలి దాటుదేను గన కమలిని ॥
158.
అనుచు పలుకు నాకు  అనుమ తిడెను..
 విభుడు రక్ష నాకు  విడ పదములు .
రామ దాసు డేను  రమణి నమ్ము
అనుచు పలికె హనుమ ఆదరమున ॥
159.
ప్రభువు నాజ్ఞతోడ పయన మైతి
జేర వస్థి లంక జయము తోడ
మాత! సీత వెదుక మదిని దలచి
ఓర్మి శాఖ లందు ఒదిగి యుంటి.॥
160.
అనుచు పలుకు నట్టి , హనుమ జుాచి
విస్మయమ్ము  తోడ వినెను సీత.
వేల కిరణ ద్యుతుల వెలుగు వాని 
కపిని జుాచె సీత కడు ముదమున ॥
********************************
161 :
చిన్నదైన రుాపు చిత్రముగను
శ్రియము గానె తోచె సీత కపుడు
నన్ను తెమ్మ నంపు , నాధు బంటు
నమ్మకస్తు డితడు నరుడు కాదు ॥
162.
వనచరుండు ఇతడు వానరుండు
అసురు డితడు కాడు అతి బలుండు
రామ భక్తి నిండు రక్షకుండు
అనుచు మురిసె సీత హనుమ జుాచి ॥
163.
కనులు చెమ్మగిల్లు కాంత జుాచి
హనుమ పలికె నపుడు అర్ద్రముగను
రక్కసులకు జిక్కు రమణి మణివి
ఎవరు నీవు తల్లి ఏమి గాధ ॥
164.
సర్వ లక్షణ  సార  సగుణ వతివి ,
సిరుల నెలవు సాధ్వి  సీత సతివ ?
రాము బాసి నట్టి రమణి మణివ ?
తెలుపు మమ్మ నీవు తెరలు తొలుగ ॥
165.
అనుచు హనుమ బల్క అవనిజపుడు
కపి కులజుని జుాచి కదలి వచ్చి
పలికె శిరము వంచి భయము వీడి
కనుల నీరిడుచును కమల నయని  ॥
166..
జనక రాజు పుత్రి జానకేను
పుాజ్య దశరధునకు పుత్ర వధువు
ప్రీతి రాఘవునకు ప్రియసతేను
వరలు సీత నేను వానరేంద్ర ॥
167..
కపట వేష మునను కఠిను డౌచు
అపహరించి నాడు అతడసురుడు.
లంక కతడు రాజు లాలసుండు
చెరను బెట్టె నన్ను చెడుపు గుణుడు.॥
168.
గడువు రెండు నెలలు గడచి నంత
దాన వుండు దునుము దయను వీడి
విధి బలీయ మనుచు వివశనౌచు
విధిగ వేచి యుంటి విభుని కొరకు ॥
169.
అనుచు పలికి నట్టి అవనిజ గని
హనుమ చెంత నిలచె అంజలిడుచు.
విభుడు నీదు వార్త  వినగ నెంచి 
నన్ను  పంపి నాడు నమ్మ వమ్మ ॥
170.
నీదు క్షేమ వార్త నిశ్ఛయముగ
దీను డైన విభుకు  దీర్ఛు చింత.
రాముడుండ లేడు రమణి విడచి 
రయము నతడు వచ్చు రాగ మలర ॥
171.
విభుడు కుశల వార్త వినగ నెంచి
వేచి యుండు నవల వేయి కనుల.
వానరులను గుాడి వచ్చు నతడు.
సాగరమ్ము దాటి సాయు ధునిగ ॥
172.
అలరు తేజ ముార్తి అభయకరుడు
అనుజు లక్ష్మణుండు అతని నీడ
కరుణ నేలు వాడు కమల ముఖుడు
రామచంద్రుడతడు రఘుకులజుడు॥
173.
రామ కధలు పలుక రమ్య ముగను
హర్ష మిడుచు  సీత హాయి నొందె
భయము విడెను సీత భక్తు గనుచు 
నమ్మె హనుమ మాట నాధు దలచి ॥
174.
ముదము నిండు సీత ముఖము గాంచి
హనుమ పలికె మరల అలరు భక్తి
రామ దుాత నేను రాసి సుగుణి
కులజు డతడు విభుడు కుశల మమ్మా ॥
175.
అనుజు లక్ష్మణు డంపె ఆది నమము
దీవెనిడెను విభుడు దీర్ఘ శుభము
మదిని  కోరె కపులు మంగళములు
శుభము నీకు తల్లి శుభము గల్గు ॥
176.
మిమ్ము జేర వారు మించు గతిని
కమ్ము కొనిరి దిశల నమ్మవమ్మ 
అన్న రాముడిచ్చె ఆనవాలు
అంగుళీక మిదియె అంబుజాక్షీ ॥
177.
 అమృత తుల్య మాయె హనుమ పలుకు
 విన్న సీత మురిసె విభుని మాట
 ఆనవాలు గొనెను అవని జాత
 కారె కంట నీరు  కలుగ సుఖము ॥
 178.
చుట్టు ముట్టి లంక మట్టు బెట్ట
వానరులను గుాడి వచ్చు నెపుడు..?
రాము డెపుడు వచ్చు రధము నెక్కి
రావణాసు గుాల్చ రణము నందు ॥
179.
బ్రతుక జాల నేను బ్రతుకు బరువు
ఎదురు జుాతు నేను ఎదరు జుాతు
గడువు ముగిసి నంత గాన క్షణము
అనుచు సీత పలికె హనుమ తోడ ॥
180.
అన్నపాన ములను అన్ని విడచి
అహరహములు నిన్నె అతడు తలచు.
శోక తప్తు డౌచు సొమ్మసిల్లు 
నిత్య వేద నొందు నీ విభుండు ॥
181.
మదిని కలచు మాట  మాత  సీత
వినగ లేక  వగచె వివర మింక 
వేగ పోవు మయ్య వేగ హనుమ 
అనుచు తొందరించె  అవని జాత ॥.
182.
విచలితాయె సీత  విభుని గతికి
చేత ముాసి యుంచె చెవుల నామె
నాదు కుశల వార్త నాధు దెలిపి
అర్తి దీర్చు మయ్య హనుమ నీవు ॥
183.
కంట నీరు గారు  కాంత జుాచి
హనుమ వగచె స్థితికి అవనిజ గని
ఏడ్వ వలదటంచు ఎలమి చెలిమి
హనుమ పలికె నెంతొ ఆర్త తోడ ॥
 184.
జడుడు నన్ను జేరి జంప మున్నే
నాధు జేరి జెప్పు నాదు వినతి
విభుకు దెల్పి రమ్ము వివరములను
వేచి యుందు నేను వేగ రమ్ము ॥.
185.
పలికి తివిగ హనుమ భక్తి తోడ
ఓర్మి రామ కధను ఒద్దికగను
నిండె మదిని శాంతి నిజము హను
ధైర్య మిపుడు కలిగె కార్య సుార ॥
186.
ముఖ్యుడ వని ఎరిగి మురియు చుంటి
వేగ పోయి రమ్ము వేచి యుందు.
మాసము లవి రెండు మరువ బోకు
తొలుత గడువు దెల్పి తోడ్క రమ్ముబ॥
187.
అనుచు కంట నీరు అవని జార
భారమాయె మనసు భక్తవరుకు 
శోక మేల నమ్మ  శోభ నయని
భీతి వీడు మమ్మ  భీత హరిణి.॥
188.
సంశయమ్ము వీడి సంతసమున
ముాపు నెక్కుమమ్మ ముప్పు తొలగ
తోడ్క పొిదు నిన్ను తొందరగను
చెరను విడచి రమ్ము చేర విభుని ॥
189.
అనుచు పలికె హనుమ ఆదరమున 
నవ్వె  సీత వాని నాత్రముగని
కనగ బాలు డంటి కపివి నీవు
పట్టి ఎగుర గలవ పవన మందు ॥
190.
నింగి నెగుర బోవ నీకు వశమా ..
జలధి దాట గలవ జక్కగాను.
జార్చి వేతు వేమొ జలధి నన్ను
జంకు చుంటి నేను  జడియు చుంటి ॥
200.
 అనుచు సీత పలికె నలర నగవు
 ముదము నొంది మదిని మురిపెముగను
 చిన్న బోయె హనుమ చిందె సిగ్గు
 కామ రుాపు  విడచె కాంత ఎదుట ॥
 
 ******************************


201.
పెంచె కాయమెంతొ పెద్ద దిగను
కొండ వలెను నిలిచె కోమలెదుట
వాని జుాచి సీత వణికి నిలచె
అచ్చె రువున జుాచె అవనిజతని ॥
202.
కనుల కట్టు గాదె కలయ నిజమ 
మాయ జాల మేమొ , మరలు దేను
పిన్న బాలు డెట్లు పెరిగె నిటుల 
అనుచు శంక తోడ అదిరె సీత ॥
203.
నిత్య సత్య వ్రతుడ నియమ పరుడ
నీదు  రక్ష జేతు నిక్క ముగను
రామ బంటు నేను నమ్మవమ్మ 
హితుడ నీకు జేతు హితము సుమ్మ ॥
204.
అనుచు పలుకు చున్న  హనుమ జుాచి
సీత బల్కె నపుడు సుగ్గు పడుచు 
భీతి గొల్పు నట్టి భీక రమ్మౌ
వికట రుాపు నీదు విడుమ హనుమ ॥
205.
అనుచు వేడ సీత హనుమ కరగె
సరళ రుాపు నొందె సహజ గతిని.
శక్తి గనిన సీత శంక వీడె 
సాధు రుాపు జుాచి సంతసించె ॥
206.
ఉదధి దాటి నేను  ఉరికి పోదు
రామ విభుని కడకు రయము జేర
నీదు కుశల వార్త నిడెద ప్రభుకు 
గురుతు నిమ్మ నీదు కుశల మెరుగ ॥
207.
మారు మాట రాక మానినిచ్చె...
మాత కురుల ముడియు మాన్య మణిని
నాదు జ్ఞాపి కిదని నాధు కొసగు
అనుచు జెప్పె సీత ఆర్ద్ర ముగను ॥
208.
భక్తి తోడ గొనెను భవ్య మణిని
చరణ స్పర్శ చేసె చారు ముఖికి
ఆనతీయవమ్మ అనుచు మరలి
ఉత్తరమ్ము దెసకు ఉరికె హనుమ ॥
209.
పోవ నెంచి అగె పొగరు తోడ
చేటు జేయ నెంచి చెడుప లంక
తంబ మెక్కి జుాచె దాపులకును
కావలున్న వారి కలచి దునుమ॥
210.
చెరువు నిండు పుాల చెలగి నలిపె
చెరువు గట్ల కొట్టె  చెదురు నటుల
తరువు లెన్నొ గుాల్చె తడవు కొకటి
మాను లెన్నొ గుాల్చి మట్టు బెట్టె॥












 

కామ రుాపు నీదు కనుల విందు 

అసుర మాయ లెరుగ నైతి నేను ॥






















 





 















కల నిజమైతే

9/04/2021.
వారం వారం కవిత లో...
ప్లవ నామ ఉగాది పై కవితల పోటీ కొరకు,

శీర్షిక : కల నిజమైతే...

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నీలాకాశంలో తారకలు దోబుాచులాడుతున్నాయి.
పొగ జబ్బు పడిన మేఘాలు కోలుకొని
తేట నీటి వసంతాలాడుతున్నాయి.
కిచకిచారవాల పకలరింతకు
పచ్చని పకృతి పులకరించిపోతోంది.
ఆకుపచ్చ చీరను అలరించిన భుామాత
మల్లె ,జాజుల మాలలనల్లి
సిగముడిలో సింగారించింది.
గలగల పారే ఏరులు,  పంట పొలాల్లో చేరి,
విత్తు చిన్నారులతో దోబుాచులాడుతున్నాయి.
స్వశ్ఛ మైన భరతావని పరిసరాల్లో
మనుషులందరుా మాస్క్ లు వేసుకొని
సామాజిక దుారం పాటిస్తుా  సేనిటైజర్ల
చిలకరింపుల పలకరింపులతో
పండగ ముచ్చట్లాడుకుంటున్నారు.
అంతా చుాస్త్తున్న ఆనందంలో బొక్కబోర్లా
పడ్డ నేను, కళ్ళు తెరచి చుట్టుా చుాసేను.
"నాకు వచ్చింది కలా....అదేగానీ నిజమైతే."..
అనుకుంటుా లేచేను..పర్యావరణ రక్షణ
తో పాటు కరోనా కట్టడి నియమాలను
పాటించాలన్న నిర్ణయంతో ప్రతిన పుానేను.
అందరుా నాతో చేతులు కలుపుతారు కదుా....
"ప్లవ నామ యుగాది "శుభాకాంక్షలతో" .మీ ...🙏
------------------------------------------------------

హామీ

సమ సమాజ స్థాపకుడు అంబేద్కర్

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక :    సమ సమాజ స్థాపకుడు               

కుల మత వివక్షతను
కుాకటి వేళ్ళతో పెకిలించి
అంటరానితనాన్ని
రుాపు మాపేందుకు
అక్షర యజ్ఞం చేసిన
అక్షయ విద్యా సాధకుడు ॥

ఆశయ సాధనకై
అడుగడుగు అవమానాలను
ఆత్మ విస్వాసంతో ఎదుర్కొన్న
లక్ష్య సాధకుడు.॥

సమసమాజ స్థాపనకు
బ్రతుకంతా ధారపోసి
సంఘ సంస్కర్తగా నిలచిన
ఉద్యమ పోరటకుడు ॥

అడుగుకు నెట్టబడిన
బడుగు జనోధ్ధరణకై
బారిష్టరుగా ఎదిగి
"భారత రాజ్యాంగాన్ని"
రచించిన "భారత రత్న."మన
"బాబా సాహెబ్ అంబేద్కర్."
------------------------------------

రాజ్యాంగ రక్షణ మన బాధ్యత.

శీర్షిక :రాజ్యాంగ రక్షణ.మన బాధ్యత.       
              రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
                         కల్యాణ్ : మహారాష్ట్ర .
                         -----------------------------
1950 జనవరి 26 న  అమలులోకి వచ్చిన.భారత రాజ్యాంగం , న్యాయ సంబంధమైన చట్టాలన్నింటికి
ముాలాధారమై ,ఒక దేశం లేదా ఒక రాష్ట్రం యొక్క పరిపాలనా నిర్వహణకు పాటించాల్సిన న్యాయ సంబంధిత పత్ర సంపుటి తోప్రభుత్వాధికారాల నియమనిబంధనలతో బాటు,పౌర హక్కులు, 
దేశం సాధించాల్సిన లక్ష్యాలతో కలసిన పటిష్టమైన  పట్టికగా రుాపొందింపబడింది.
ఆనాటి నుంచీ ఈ నాటి వరకు పౌర ,చట్ట సంబంధిత మార్పులతో పాటు భారత ప్రభుత్వ వ్యవహరాల నిర్వహణాధికరణలవంటి ఎన్నో మార్పులతో చట్టాలను తీసుకు వచ్చేరు.
ఈ ప్రభుత్వ చట్టాలను పరిరక్షించే బాధ్యత ప్రజలమైన
మనపై చాలా ఉంది. న్యాయ పరమైన ప్రతీ పనికి మద్దతు ఇస్తుా , మత కలహాలను సృష్టించ కుండా, 
 స్త్రీ స్వాతంత్ర్యతకు సమానహక్కును ఇచ్చి గౌరవిస్తుా, 
 పర్యావరణ రక్షణ కై ప్రతీ ఒక్కరుా తమ వంతు కృషిని
 బాధ్యతాయుతంగా చేస్తుా , ఓటు హక్కును సద్వినియొాగ పరచుకొని, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల మన విద్యుక్త ధర్మాన్ని  మనమే నిర్వర్తించాలి.అప్పుడే మన రాజ్యాంగం రక్షింపబడి , దేశం సుభిక్షమౌతుంది. 

శ్రీరామస్తోత్రం

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

ప్రక్రియ : గేయ కవిత.
----------------------------

రామా ! నిను తలచినంత నేమా వెతలన్ని
తీరునోమారిటు రార ! రామ రవికుల సోమా !॥
బాలా కౌశల్య వర కృపాళా ! శ్రిత పరిపాలా ! 
లీలా కరుణాలవాల , మృదు పద జాలా..॥

కామారి వినుత రామ,  ఇనవంశ కుల సోమ
ధామా ! అయొాధ్య రామ, ముని జన కామా ॥
నందా.... ! దశరధానందా ! సీతా-మనార-
విందా ! మృదు మధుర హసిత భుాష తరంగా !॥

అంగా ! కరుణాంతరంగ..రామా ! ముని
హృదయ భృంగ ! రాజాధి రాజ రామ !
ధను ధర భీమా ॥భంగా! గర్వారి, దైత్య
దమనా,ధర పాలిత వర! సుగుణాభి రామ -
రామమేయ శుభాంగా ॥ 

ఆజ్ఞ కారి, వన విహారి ,యజ్ఞ రక్షకాధారీ
కల్యాణ గుణ కారీ  ! భవ సాగర తారీ॥
అహల్యాది శాప హారి। తాటకాంతకా సౌరీ !  
లోకాది వందిత పద ! పాప నాసకారీ  ॥ ॥

పట్టాభి రామ రామ ! సృష్ట్యాద్యవతార భీమ!
సుందర సుకుమార సోమ ! మంగళ శుభ కామా ॥
రామా ! శ్రీ రామ రామ ! సీతా ! మనోభి రామ ।
వాతాత్మజ వందిత పద ,నౌమీ .। శ్రీ రామా ॥
--------------------------------------------------------
--------------------------------------------------------
హామీ:
హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.

--------------------------------------------------------

15/04/2021.
తెలుగు భారతి  సాహిత్య సేవా సంస్థ   -ఎస్ వీ ఫౌండేషన్, ప్రజా సేవలో ----
జనదీపిక  సంయుక్తంగా నిర్వహిస్తున్న  కవితా వసంతోత్సవం ,

*శ్రీరామ నవమి కవితా వసంతోత్సవం*

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక  :  అవతార పురుషుడు.
ప్రక్రియ : గేయ ప్రక్రియ.
క్రమ సంఖ్య :  127.

దశరధానంద నేత్ర ! కౌశల్యా వరపుత్ర!
భరత లక్ష్మణాది భ్రాత ! రవి కుల జాత॥
కైకేయిా వర పాలిత ! పితృ వాక్య పరిపాలక ,
కానన వనవాస రామ ! ఖలుసాంతక భీమా ॥

శివ ధనుా భంగ రామ ! సీతా మనోభిరామ!
త్రేతాయుగ పరంధామ! పావన ఘన శ్యామా ॥
మాయా మారీచ దమన ! మంగళ శుభ కామనా.. రాక్షసాంతకా ఘనా ! సీతా హృదయ భావన ॥

లంకా ధహనావేశ  ...జానకీ , శోక నాశ !
వాతాత్మజ వందిత పద ! మంగళ కర,చరణా ॥
దశకంఠ...దైత్య దుార। ధర్మ పాల ధను ధీర
మర్యాద పురుషోత్తమ ! మంగళ శుభ చరితా ॥

రాజాధి రాజ రామ ! ముని మానస హృదయ కామ॥
ధామా ! అయొాధ్య పాల  ! రఘు కుల సోమా ॥
ధర పాలిత దివ్య నేత్ర ! రామా వర సుగుణ గాత్ర
కరుణా తరంగ నేత్ర । కామారి మిత్ర ॥

పట్టాభి రామ రామ పావన సీతాభి రామ
పరమాత్మా సుచరిత శుభ సుందర రామా।
దేవాది ముని వందిత నుత పథ, పద గీర్వాణ
జన గణ హిత కల్యాణ ! మంగళ శుభ నామా ॥

--------------------------------------------------------

శీర్షిక : లోక కల్యాణ కారకుడు.
వచన కవిత.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

--------------------------

దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ కోసం
శ్రీమహా విష్ణువు ఎత్తిన దశవతారాల లో
ఏడవ అవతారం శ్రీరామచంద్రుడు ॥

రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే మనం శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.

లోక కల్యాణార్ధం మానవ అవతారం ఎత్తిన
శ్రీ రామచంద్రుడు , తలిదండృలను ఎలా
గౌరవించాలో , వారి మాటకు ఎంత విలువ
ఇవ్వాలో తెలియపరచేడు.
బాధ్యత గల రాచ బిడ్డగా ధర్మ బద్ధమైన
ప్రజా పాలనఎలా చేయాలో ఆచరించి చుాపేడు.
ఒకే మాట ,ఒకే భార్య అంటుా వైవాహిక
బంధపు విలువలని చాటి చెప్పేడు.
అన్నదమ్ముల ఆదర్శానికి , ఆలు మగల అనుబంధానికి, ధర్మ  పరిపాలనకు ,
దుష్ట -శిక్షణ కు,శిష్ట -రక్షణకు , పేరుగా
శ్రీ రాముని చరితం తార్కాణ మంటారు.
జగద్విఖ్యాతి  గాంచిన "శ్రీరామ నామ జపం"
సర్వ దేవ ,ఋషి ,ముని మానవులందరికీ  ముక్తి,మొాక్ష కారకమని , కలియుగంలో
రమ నామ జపమొక్కటి చాలు , జన్మ తరింపజేయడానికని , వేద శాస్త్ర పురాణ
విదితమైనది. సాక్షాత్తుా  మహాదేవుడు కుాడా
నిత్యం జపించే శ్రీరామ నామాన్ని మనముా
జపించి కృతార్ధుల మౌదాం.
----------------------------------------------



నవయుగాదికి స్వాగతం

శీర్షిక  : నవ యుగాదికి నవ్వుల స్వాగతం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

కరోనా కాటుతో పాటు , పెరిగిన కాలుష్యం
వల్ల, ఆక్సిజన్ కొరత తో అవస్త పడుతుా,
అనారోగ్యం పాలైన ప్రజలకు మేలు
చేసే రీతిలో వచ్చిన ఉగాది కన్య ,

సమృుద్ధికరమైన  నీటి వనరులతో ,వచ్చి పచ్చదనానికి ,పర్యావరణ రక్షణకుా
శ్రీకారం చుట్టింది. ప్రజలలో ఉత్సాహం
ఉరకలు వేసింది. అందరుా అనందం తో
మాస్క్ లు  ధరించి, సామాజిక దుారం
పాటిస్తుా "ప్లవ"  కన్యకు పట్టం కట్టేరు.

ప్రతీ ఏటా జరిగే యుగాది సంబరం
మంగళకరమైన మామిడి తోరణాలతో
మొదలై ,  వేద ఘోషల,దైవారాధనలతో ,
షడృుచుల నైవేద్యాలు నేతి పిండివంటల
పసందు ఱుచులతో , సాయంత్రం వరకు
సందళ్ళతో కళ కళ లాడితుా.జరిగింది.

కొత్త వత్సరం తెచ్చిన  కొత్త ఉత్సాహంతో
కోలుకున్న జనులు  మన సంస్కృతి,
సాంప్రదాయాల ప్రాశస్త్యాన్ని  కొనియాడుతుా ,
ఉగాది ఉత్సవాన ఆనంద కోలాటకాలాడేరు..

----------------------------------------------------

రామనామ మహిమ

18/04/2021
మనుమసిద్ధి కవన వేదిక కు పంపిన కవిత
అంశం : రామ నామం. కవితాంశం కొరకు...
శీర్షిక  :  రామ నామ మహిమ ( ప్రతిలిపి).

వచన కవిత.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

వైకుంఠ వాసుడైన శ్రీ మహా విష్ణువు.
మానవావతారమెత్తిన శ్రీరాముడు.దుష్ట శిక్షణ  శిష్ట రక్షణ  జేయడానికి అవతరిస్తున్న యుగపురుషుడు.
శ్రీ "మహావిష్ణుని అష్టాక్షరీ" మంత్రంలో ఐదో అక్షరమైన   ‘రా’, "శివ పంచాక్షరీ"  మహామంత్రంలోని రెండో అక్షరం ‘మ’.కలిపితే  రామ శబ్దం నిర్మితమైంది.
మంత్ర  బీజాక్షర శక్తి కలిగిన" రామ "అన్న శబ్దానికి
"ఓం" కారము కుాడా చేర్చ నవసరం లేదు .
గణేశ, శైవ, శక్తి, సూర్య వైష్ణవ మంత్రము-
లన్నింటికంటెనూ అధిక ఫలము "శ్రీ రామ నామ "
జపము వలన కలుగు తుంది."ర" శబ్దము, అగ్ని బీజం   " ఆ" శబ్దము,వాయు బీజం "మ" శబ్దము,ఆకాశ బీజం -ఇటువంటి అగ్ని , వాయ,రాకాశ  బీజ సమ్మిళితమైన " శ్రీ రామ"  నామ మహిమ ఇంతా అంతా
అని చెప్పనలవి కాదు.ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ భాతృ, సదాచారం, నిగ్రహం, వంటి
సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ద హృదయుని ," రామ" అన్ననామాన్ని మన-
మందరం జపించి కృతార్ధులమౌదాం.

హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.
******:::***::*********************::::*

15/04/2021
తెలుగు భారతి  సాహిత్య సేవా సంస్థ   -ఎస్ వీ ఫౌండేషన్, ప్రజా సేవలో మనం-శుభోదయం  -జనదీపిక  సంయుక్తంగా నిర్వహిస్తున్న  కవితా వసంతోత్సవం.

*శ్రీరామ నవమి కవితా వసంతోత్సవం*  కు పంపినది
*క్రమ సంఖ్య 127.

శీర్షిక : లోక కల్యాణ కారకుడు.
-------------------------

.లోక కల్యాణార్ధం మానవ అవతారం ఎత్తిన
శ్రీ రామచంద్రుడు , తలిదండృలను ఎలా
గౌరవించాలో , వారి మాటకు ఎంత విలువ
ఇవ్వాలో తెలియపరచేడు.
బాధ్యత గల రాచ బిడ్డగా ధర్మ బద్ధమైన
ప్రజా పాలనఎలా చేయాలో ఆచరించి చుాపేడు.
ఒకే మాట ,ఒకే భార్య అంటుా వైవాహిక
బంధపు విలువలని చాటి చెప్పేడు.
అన్నదమ్ముల ఆదర్శానికి , ఆలు మగల అనుబంధానికి, ధర్మ  పరిపాలనకు ,
దుష్ట -శిక్షణ కు,శిష్ట -రక్షణకు , పేరుగా
శ్రీ రాముని చరితం తార్కాణ మంటారు.
జగద్విఖ్యాతి  గాంచిన "శ్రీరామ నామ జపం"
సర్వ దేవ ,ఋషి ,ముని మానవులందరికీ  ముక్తి,మొాక్ష కారకమని , కలియుగంలో
రమ నామ జపమొక్కటి చాలు , జన్మ తరింపజేయడానికని , వేద శాస్త్ర పురాణ
విదితమైనది. సాక్షాత్తుా  మహాదేవుడు కుాడా
నిత్యం జపించే శ్రీరామ నామాన్ని మనముా
జపించి కృతార్ధుల మౌదాం.
----------------------------------------------

Wednesday, December 8, 2021

గాయత్రీదేవిగారు రాసిన ఉత్పలమాల పద్యాలు

మహతీసాహితీకవిసంగమం
కరీంనగర్
అంశం:ఐచ్ఛికం
తేదీ:8.12.21

మ.సా.క.సం:5

పేరు:డా.గాయత్రీదేవి
ఊరు:విశాఖపట్నం
క.సం:2
ప్రక్రియ:ఉత్పలమాలిక.
శీర్షిక;భారతమాతకు గజమాల.


శ్రీరమణీయమున్ సహజసిద్ధమనోహరభాగ్యదమ్ములున్

సారవిభాప్రభాసమునుసజ్జనచిత్తమువోలెశోభిలున్

హారముగాగనిల్చినవహా!విరళీకృతశైలసంపదల్
భారతధాత్రికియ్యవియు ,భద్రతగూర్చును సైనికాళులీ

ధారుణిధాతసృష్టి ,కడుధన్యముదివ్యపవిత్రధర్మమై
భారతభూమిరక్షణయెభాగ్యముగాతలదాల్చినట్లు ,దీ
క్షారతియుత్తరానహిమశైలమునిల్చెమహోన్నతమ్ముగా
భారతసైనికాళికిల ,బంగరుమార్గముజూపునట్లుగా

తూరుపుతెల్లవారగను తోరపుకాంతులభానుమూర్తికిన్
సారపుజన్మభూమిగను ,జక్కగభాసిలు ,నస్తమించ ,నా
దూరపుకొండలే ,మహిత దూరపుబంధువువోలెదోచు ,చె
ల్వారగశైలసంపదలుభారతదేశపు భాగ్యరాశులై

సారమతింగవీంద్రుడు ప్రసన్నకథాకలితార్థయుక్తితో
భారతభారతీపదముబంగరుపువ్వులపూజసేసి ,తా
భారతగాథలోమహితపావనధర్మముసూక్తిసారముం
దీరుగనిల్పినట్టి ,మహనీయుని నన్నయకంజలింతు ,నా

శ్రీరమణీయకావ్యములశ్రీహరిశంకరుతత్త్వమొక్కటే
వారికృపావిలాసమిది,భావనజేయగవిశ్వమంత ,వి
స్తారతశోభనిచ్చె కవితాసుధభూషగదాల్చెనాంధ్రమున్
గారవమొప్పమ్రొక్కిడుదు,కైతలబమ్మకుతిక్కయజ్వకున్.

భారతపర్వశేషమునుభాసురలీలరచించి.,వర్ణనా
సారమరందధారలను ,జల్లుచుతెన్గుప్రబంధమూర్తియై
క్షీరమరందమాధురుల శ్రీకరిశారదపాదసన్నిధిన్
జేరినశంభుదాసునికి ,చేతమురంజిలనంజలించుచున్


ధీరుడుసంస్కృతాంధ్రములరసతేజమునందిన ,దివ్యమూర్తి ,సం
స్కారపయోధిలోమునిగి ,కమ్మనిరామకథారసమ్ములన్
చారుమనోజ్ఞమోహనము ,సందడిజేసిన వేయిపడ్గలున్
హారముగానువైచి ,భువిహ్లాదముగూర్చెనువిశ్వనాథుడా


శ్రీరమణీయకావ్యముల ,శేముషిసింధువు ,సంస్కృతమ్ములో
ధీరశకుంతలాగధను ,ధీరునియక్షునిమేఘదౌత్యమున్

హారముగాసరస్వతికి ,హ్లాదమొనర్చినకాళిదాసు ,ఓం
కారమునట్లుభాసిలెను ,కమ్రశుభోపమవాణిదాసుడా 

చారుశరీరు ,పాపహరు ,సాధుగుణాకరు ,రామభద్రునిన్
తారక మంత్రసాధనను ,తన్మయతన్ ,గనివల్మికీయుడున్
కూరిమినాదికావ్యముగ ,క్రొత్తదనమ్మునగూర్చినిల్పె ,నా
తారకరామభక్తు ,మది,దద్దయుగొల్తు ,ప్రచేతసాత్మజున్

సారపదప్రవాహఝరి ,సత్కవితావిధిశారదాంబనే
చారుతరమ్ముగాగొలిచె ,సత్కృతిగాకనకాభిషేకముల్
ధారుణిపొందినట్టి,కవితారససారధి ,రెడ్డిరాజ్యపున్
వారధి ,సార్వభౌమకవి ,ఫాలవిలోచనభక్తవర్యుడై.

కోరడుభూమిభాగములు ,గోరడు భాగ్యపురాశులెయ్యడన్
తారకరామమంత్రమహితాబ్ధిని ,దేలుచు ,పోతనార్యుడున్
కోరికతీర ,కృష్ణురసఘూర్ణిత వృత్తము గోపికాసుధల్
జారగవ్రాసెభాగవత ,సత్కృతి ,తెన్గునశబ్దశయ్యగా..

భారముడించమానవులపాపమణంగగ ధర్మమార్గ ,సా
కారుడు,బాదరాయణుడు క్ష్మాస్థలిజేసెపురాణరాశులన్
భారతగాథలన్ ,మహితభాగవతమ్మును ,ముక్తిమార్గప్రా
కార ,పరోపకారమతి ,కారణజన్ముడు విష్ణురూపుడా

వీరుడుకోవిదాళి ,మునువిద్యలవేల్పుగపండితాళి ,వి
స్తారయశోవిభూషిత ,ప్రసన్నమతుల్ యనకృష్ణరాయలా
పూరగళమ్మునెత్తి కవిపుంగవశ్రేణినిగారవించి ,స
త్కారమొనర్చెసంతతము ,కావ్యరసమ్ములనోలలాడి సం.

పూరకపద్దెవిద్దియల ,భూషగదాల్చగ కృష్ణరాయలే
తీరుగపల్లకీవహనదీక్షనుబూనుచుగారవించుచున్
జేరికగండపెండెరము.,చిత్తముపొంగగనీకునిచ్చె ,నో
సారమతీ!కవీనతులు ,సత్కవిపెద్దనజ్ఞానశోభితా!
.
తారసపుష్టితోప్రతిపదమ్మునయాంధ్రపుజాతినానుడుల్
సారెకుసారెకుంగలుగ ,సజ్జనచిత్తమురంజిలం జమ
త్కారముదోపగకవితగారవమందగచేమకూరయున్
వారకవ్రాసెకావ్యమును ,పార్ధునిదివ్యవిలాసగాధలన్.
ఈరసరమ్యవిశ్వముననేప్రభుగాధలుదివ్యబోధలై
వారకపారిజాతమును భామకుతెచ్చెనుకృష్ణమూర్తి ,తత్
భారతరమ్యగాధలవి బాయకభక్తితెనుంగుకిచ్చి ,బృందారకవంద్యుగొల్చుమహితాత్మునితిమ్మనకంజలించగా 


గారవమైనజీవికను ,కష్టసుఖమ్ములు రాజభోగముల్
దారుణమంచునెంచిభవతారణమందగశంభుభక్తుడై
తోరణకట్టువోలెకవితోత్పలమాలలనర్చసేసె ,నా
మూరితిధూర్జటీమహిత ,మోక్షపుగామిగభూతలమ్ములో 
.
భా‌తరామగాధలను ,పావనరీతినిద్వ్యర్ధికావ్యమై
తీరిచికల్పనాజగతితేజముమీరగపూర్ణభావసం
చారి ,కళావతీకథను ,సన్మతిపింగళిసూరనార్యుడే
సారమెరింగెఠీవికను ,సత్కవిరాయలకాలమందు,నా

దారినిసాహితీజగతితద్ధిమినాదవిలోలలోలతా
ధారమురామరాజు ,భువిధన్యతతావసురాజగాధనే
పారములేనిదీక్షయు ,నపారతపంబుగతెన్గుభాష ,తా
నారసికమ్రరీతికడునద్భుతలీలరచించెమూర్తియున్

శారదసత్కృపామహితసారమనస్కుడురామకృష్ణ ,యా
సారముపాండురంగవిభుసన్నుతిసేయుచు ,పాదుకొల్పెనీ
ధారుణిసోదరీమహిమ ,తాల్మివచించెయశస్కరుండునై
సారెకుసారెకుం సరససాహితిచిప్పిలయాంధ్రనాట ,నా
  
ధారమువాజ్ఞ్మయమ్ముసమతా ,సుధపొంగగబాలబాలికల్
సారవివేకమందగనుసద్బుధవంద్యుడు చిన్నసూరి.,వి
స్ఫారత సూత్రభాష్యముగ బాలలకైనొకగ్రంథరాజమున్
కోరినశబ్దశుద్ధినిడు ,కోర్కెలతీర్చెడుకల్పవృక్షమై .

వారలువీరలున్ జనులు వాడెడిభాషకు పట్టుబట్టి ,తా
ధీరతనుద్యమించె ,భువితెల్గువెలుంగుకు ,దీక్షబూనినా
రా ,రమణీయపుం బథమురంజిలగూర్చెనురామమూర్తి ,లో
నారటమందియాంధ్రులకు నచ్చతెలుంగునుధారపోసె నా,

శూరునిబాటలోనడచి ,శుద్ధతముత్యపుమాలల్లి ,తా
భారతికంఠహారముగ ,భద్రతపూర్ణమ ,కన్యకాది ,వి
ద్యారమణీయతత్త్వములనర్చనసేసెను ,దిద్దుబాటుతో
కారణజన్ముడయ్యె ,కార్యధురంధరుడప్పరాయుడా 
పేరదిపాపరాయలట ,పెన్నిధికంకటివంశజాతుడే
సారతరామగాధమహి ,సన్నుతిలందుచునుత్తరార్ధమున్
తీరగువైభవాత్మకము ,తేటతెలుంగులవాక్యలాస్యమే
పారగ శాశ్వతమ్ముగను ,పావనరీతిరచించినాడు ,తత్.

పారవశమ్ముతోపలికె ,పావనిరామునిభక్తురాలు ,స
త్కారవిదూర!సాధుమతి ,కమ్మనితెల్గున తేనెవాకగా
నారదసన్నుతాదిమునినాథసుపూజితరామగాధ ,నా
భారతిదీవనమ్ములను ,పట్టుగమొల్లయు ,కీర్తిగాంచ ,సత్ 24

హారముశైవనాదముగ హారతులిచ్చిననన్నెచోడుడున్
సారతరమ్ముగా‌బసవసారమునిచ్చెనుసోమనాథ ,ధీ
సారము ,లీభువిన్ ,మహిత ,శైవపుతత్త్వముగావెల్గె ,సుధా
పూరితమాంధ్రభాషగడు ,పుణ్యధనంబయె ,జానుతెన్గుగా

ధీరులవాక్యకోవిదుల ,ధీధితినిండి సినారెపద్యముల్
హారములయ్యెభారతికి ,హ్లాదమొసంగు ,గజళ్ళసందడిన్
తోరపుగీతరాగముల.,తతోషణచెందిన భారతి కాలియందియల్
శారదరాత్రులందునవ ,శాద్వలవీధుల.,మంజునాదముల్.


తేరిదివేలవర్షముల ,తెల్గువెలుంగులు ,పద్యగద్య ,ప్రా
కారమువోలెభాసిలును కావ్యజగమ్మదిమోహనమ్ముగా
భారతభారతీపరమపావనిపాదమిళిందులై ,కవుల్
ధారుణి నవ్యభావముల ,స్థానముగాకవనమ్ముచెప్పెడిన్.


స్వీయరచన
,

Tuesday, December 7, 2021

శ్రీనాధుని చాటు పద్యాలు

శీర్షిక : చాటు పద్యాలు.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .


కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానకవి యైన శ్రీనాధుడు ఓనాడు సర్వజ్ఞ భుాపాలుని దర్శనార్ధం వెళ్లేడు.
పెదకోమటి వేమారెడ్డికినీ  , సర్వజ్ఞ భుాపాలునికినీ మధ్య నున్న వైరం తెలిసిన శ్రీనాధుడు .

సర్వజ్ఞ భుాపాలుని ఆస్థనంలో 

" శివునికి , మీకుా తప్ప సర్వజ్ఞ భుాపాలుడను నామం మరెవరికుంది. " అనే  పొగడ్త గల పద్యం చదివి , ప్రశంసాది సత్కారాలందుకున్నాడు లందుకున్నాడు .
అతడు చదివిన పద్యమిది.

"సర్వజ్ఞ నామధేయము
శర్వునకే , రావు సింగ జనపాలునకే,
యుర్విం జెల్లును , దక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే ॥

 సర్వజ్ఞ భుాపాలుడను శ్రీనాధుడు పొగడిన మాటవిని మండి పడుతున్న 
 పెదకోమటి వేమారెడ్డి దగ్గరకు వచ్చిన శ్రీనాధుడు,  అదే పద్యంలో రెండవ పాదం లో 
 జనపాలున .."..కేయుర్విన్ జెల్లును.".అని చదివి వినిపించి  , మీకు విరోధియైన ఆతనిని ఈ విధంగా తిట్టి వచ్చేనని చెప్పి, ఆతనిచే సన్మానాలందుకున్నాడు.
 ఈ విధమైన చమత్కారం "సమయొాచితంగా మరెవరికైనా వస్తుందా" అనిపించేంతగా ఆశ్ఛర్యం కలిగించే విధంగా ఉంది కదుా..
 ఈ పద్యం చుాడండి...
3.
"శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడలేక సుమీ!"

నల్లి బాధ పడలేకనే శివుడు కొండలపై, రవిచంద్రులు ఆకాశాన, విష్ణువు ఆదిశేషునిపై పడుకున్నారని భావం.
శివుడు బండలమీద , విష్ణువు పాము మీద వాసముంటున్నారన్న  వ్యంగ్యంగా
పద్య వర్ణనలో దాగి ఉన్న వెటకారం...అబ్బో....

అలాగే అరవ దేశానికి వెళ్ళినపుడు
అచటి ఆడవారిని గుార్చి  అతని మదిలో మెదలిన భావాన్ని నిర్భయంగా వివరించి చెప్పిన పద్యం ..
4.
మేత గరిపిల్ల పోరున మేకపిల్ల
పారుబోతుతనంబున బందిపిల్ల
యెల్ల పనులను జెరుపంగ బిల్లిపిల్ల
యందమున గ్రోతిపిల్ల యీ యరవపిల్ల ॥

ఎంత నచ్చకపోతేమాత్రం...పరాయి దేశానికి పోయి అచటి స్త్రీ లను మనం ఇంతలా మనం వెక్కిరించి చెప్పగలమా...

ఈ పద్యం చుాడండి.
5 వ పద్యం .

"గిట గిట నగు నెన్నడుములు
పుట పుట నగు గన్నుగవలు పున్నమి నెలతో
జిట పొట లాడెడు మొగములు
కటి తటముల కొమరు శబరకాంతల కమరున్ "

జాతి ,మత, కుల వివక్షతలు లేకుండా కేవలం అందాన్ని మాత్రమే ఆస్వాదించే ఆనంద దృష్టి కోణమిది...
ఈ కాలంలో ఇలా ఆడవారిని గురించి వర్ణిస్తే 
అమ్మొా...చెప్పు దెబ్బలే గతి.

అప్పటిలో గ్రంధ రచనలో లబ్ధప్రతిష్టుడైన శ్రీనాధుడు రాసిన ప్రతీ కావ్యముా కుాడా  కవుల హృదయాలను దోచినదే.

ఈ రకంగా ఎన్నో చమత్కారాలతో నిండియున్న ఈతని
రచించిన చాటు పద్యాలు జనరంజకములై ప్రసిద్ధి గాంచేయి. అటువంటి శ్రీనాధుని రచనలగురించి ఎంతచెప్పినా తక్కువేకదుా..











బాల్యములోనే మరుత్తరాట్చరిత్ర అనే
బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు.
శ్రీనాథుడు తన గ్రంథాలతో ఎంతగా లబ్ధప్రతిష్టుడయాడో చాటువుల ద్వారా కూడ అంతే
ప్రసిద్ధిగాంచినవాడు.
కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానకవి యైన శ్రీనాధుడు.
డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదము ఉంది.

 కవులు తమ కావ్యాలలో ఇతివృత్తానికీ, కవితా పారమ్యానికీ ప్రాముఖ్యమిచ్చారు తప్ప వైయక్తిక అనుభూతులకు ఎక్కడోగాని తావీయలేదు. 

శ్రీనాధుడు మాత్రం  తనలో కలిగిన భావాన్ని వ్యక్తీకరించేందుకు వెనుకంజ వేయలేదు సరికదా,
అతడు ఆ భావాన్ని ఎవరికి వారు తమకే అన్వయించుకొనే విధంగా అందంగా పద్య
పాదాలను పొందుపరచేవాడు.
 పొగడ్త , హాస్య , వ్యంగ్య ,అపహాస్యార్ధములు మేళవించి కవితలల్లి  ఎందరిచేతో సన్నానాది గౌరవాలనందుకున్న చతురుడు.
ఒక అక్షరమొా పదమొా విడగొట్టి చదివితే వేరు వేరు భావాలను ప్రస్ఫుటించ గల ఈయన పద్య సుమాలు
చాటు పద్యాలుగా కీర్తికెక్కాయి.

 తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన అతని  చాటు పద్యాలు  ఎంతగానో ప్రాశస్త్యం పొందేయనడంలో సందేహం లేదు.
వాటిలో వాటిలో కొన్ని మచ్చుతునకలు..
నాకు నచ్చిన కొన్ని చాటుపద్యాలు..

"సిరిగలవానికిజెల్లును
తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశాగంగవిడువు పార్వతిచాలున్॥"

పల్నాటి సీమలో నీరు లేక పంటలు పండక క్షామం
వచ్చి అల్లలాడుతున్న  ప్రజలను చుాచి తట్టుకోలేని శ్రీనాధుడు ఆ పరమేశ్వరుని "గంగమ్మ" ను విడవయ్యా అంటుా చెప్పిన చమత్కార పద్యం...
అర్ధింపుతో పాటు నిందనుకుాడా జోడించి 
భిక్షుకుడవైన నీకు ఈ కరువులో ఇద్దరు భార్యలెందుకయా? గంగమ్మను విడిచిబెట్టంటుా  చెప్పిన పద్యం..
ఆ శివునకు కుాడా పద్యంలోని వ్యంగ్యం అర్ధం కాదేమొా ఆనిపించేంత అందంగా ఉందికదుా..

2వ పద్యం 
"రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభ యైన నేకులె వడుకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్ "

ఈ  కరువునిండిన పల్నాడులో  రసికతకు చోటెక్కడ.
రంభయైనా నేకులే వడకాలి , మన్మధుడైనా జొన్నకుాడే తినాలంటుా.. పలనాటి కరువు దినాలకు పరితపిస్తుా శ్రీనాధుడు చెప్పిన పద్యం..అందరికీ కంటనీరు పెట్టించక తప్పదు.

ఓనాడు శ్రీనాధుడు సర్వజ్ఞ భుాపాలుని దర్శనార్ధం వెళ్లేడు. కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానకవి యైన శ్రీనాధుడు.
పెదకోమటి వేమారెడ్డికినీ  , సర్వజ్ఞ భుాపాలునికినీ మధ్య నున్న వైరం తెలిసిన శ్రీనాధుడు .

సర్వజ్ఞ భుాపాలుని ఆస్థనంలో 
" శివునికి , మీకుా తప్ప సర్వజ్ఞ భుాపాలుడను నామం మరెవరికుంది. " అని పొగడి ప్రశంసాది సత్కారాలందుకున్నాడు లందుకున్నాడు .
అతడు చదివిన పద్యమిది..
సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావు సింగ జనపాలునకే
యుర్విం జెల్లును దక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే ॥

 
 శ్రీనాధుడు...పెదకోమటి వేమారెడ్డి దగ్గరకు వచ్చి అదే పద్యంలో రెండవ పాదం లో 
 జనపాలున .."..కేయుర్విన్ జెల్లును.".అని చదివి వినిపించి  , మీకు విరోధియైన ఆతనిని ఈ విధంగా తిట్టి వచ్చేనని చెప్పి, ఆతనిచే సన్మానాలందుకున్నాడు
 ఈ విధమైన చమత్కారం "సమయొాచితంగా మరెవరికైనా వస్తుందా" అనిపించేంతగా ఆశ్ఛర్యం కలిగించే విధంగా ఉంది కదుా.
3.
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడలేక సుమీ!

నల్లి బాధ పడలేకనే శివుడు కొండలపై, రవిచంద్రులు ఆకాశాన, విష్ణువు ఆదిశేషునిపై పడుకున్నారని భావం.
అద్భుత వర్ణనలో దాగి ఉన్న వెటకారం...అబ్బో....

అలాగే అరవ దేశానికి వెళ్ళినపుడు
అచటి ఆడవారిని గుార్చి  అతని మదిలో మెదలిన భావాన్ని నిర్భయంగా వివరించి చెప్పిన పద్యం ..
4.
మేత గరిపిల్ల పోరున మేకపిల్ల
పారుబోతుతనంబున బందిపిల్ల
యెల్ల పనులను జెరుపంగ బిల్లిపిల్ల
యందమున గ్రోతిపిల్ల యీ యరవపిల్ల ॥
ఎంత నచ్చకపోతేమాత్రం...ఇంతలా మనం వెక్కిరించి చెప్పగలమా...

ఈ పద్యం చుాడండి.
5 వ పద్యం .

"గిట గిట నగు నెన్నడుములు
పుట పుట నగు గన్నుగవలు పున్నమి నెలతో
జిట పొట లాడెడు మొగములు
కటి తటముల కొమరు శబరకాంతల కమరున్ "

జాతి ,మత, కుల వివక్షతలు లేకుండా కేవలం అందాన్ని మాత్రమే ఆస్వాదించే ఆనంద దృష్టి కోణమిది...
ఈ కాలంలో ఇలా ఆడవారిని గురించి వర్ణిస్తే 
అమ్మొా...చెప్పు దెబ్బలే గతి.

అప్పటిలో గ్రంధ రచనలో లబ్ధప్రతిష్టుడైన శ్రీనాధుడు రాసిన ప్రతీ కావ్యముా కుాడా  కవుల హృదయాలను దోచినదే.

ఈ రకంగా ఎన్నో చమత్కారాలతో నిండియున్న ఈతని
రచించిన చాటు పద్యాలు జనరంజకములై ప్రసిద్ధి గాంచేయి. అటువంటి శ్రీనాధుని రచనలగురించి ఎంతచెప్పినా తక్కువేకదుా..








ఓ మనిషీ! మేలుకో !

శీర్షిక : ఓ మనిషీ ! మేలుకో !
(వచన కవిత.)

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .


*అభివృద్ధి పేరుతో  అస్తవ్యస్త రాజకీయాలు.
*ప్రజల సొమ్ము దోచుకొనే రాజకీయ వ్యుాహాలు.
*అవసరానికందని ప్రభుత్వ పథకాలు.
*సమాజ బాధ్యతెరుగని ప్రజా పావులు.
*సభ్య సమాజానికి తావివ్వని  కులమత బేధాలు.
*వావి వరుసలెంచని వరుస క్రుార చర్యలు.
• ప్రజలను మభ్యపెట్టే తీరులో రాజకీయ కార్యకలాపాలు.
• మన దేశ ప్రగతికి తీరని లోపాలు.
• విదేశీ వ్యామొాహంతో వీధికెక్కిన బ్రతుకులు.
• పరిశుభ్రత పాటించని పరనిందాప్రతాపులు.
• పెరుగుతున్న జనాభాతో ప్రగతి పథ అవరోధాలు.
• పచ్చదనం కరువైనా ప్రగల్ఫాలు పలికే ప్రతినిధులు.
• ప్రదుాషణతో నిండుతున్న భారత బహిరంగ స్థలాలు.
• స్వార్ధం నిండిన నాయకుల స్వశ్ఛ భారత్ ప్రణాళికల వైఫల్యాలు.
• అధికార బలానికి ఆహుతౌతున్న ప్రజా ప్రగతి పథ సాధనాలు
• పరదేశ ప్రైవేటీకరణ కు లోనౌతున్న స్వదేశీ సంపత్తులు.
• నిర్వీర్యమౌతున్న మేధకు నీరుగారుతున్న జనాలు.
• పెరుగుతున్న జనాభాకు, తరుగుతున్న భుాభాగాలు.
• పరిశుభ్రతకు తావివ్వని పనికిరాని బాసలు.
•కుళ్ళిన వ్యవస్థలో కాపురముంటున్న కరోనా వంటి కణాలు.
• రోడ్ల బారుల్లో నిండుతున్న రోగుల శవాలు.
• దారి  కానరాక, చేసే ముాకుమ్మడి దహనాలు.
• బొమికల పునాదులేసి లేపుతున్న ఆకాశ హార్మ్యాలు.
• నీటి కరువుకు నిర్వీర్యమౌతున్న పంట భుాములు.
• అన్నదాత కన్నీరే  అవని నిండు శాపాలు.
• అసహాయుల హాహాకారాలు,రైతన్నల అత్మహత్యల అక్రోశాలు.
• బడగు బ్రతుకుల్లో ఆరిపోతున్న ఆశా దీపాలు.
• పెరుగుతున్న ధరల వలలో పెనుగులాడుతున్న జనాలు.
•ఊపిరాడని జనాల మస్తిష్కంలో పగ నిండిన పొగలు.
• ఆ పొగల సెగల సంకేతాలు ,అరాచకం అగ్నిలో దహనమవ్వకముందిడే...మేల్కొల్పుకు  చిహ్నాలు॥
• 
***************************************

Thursday, December 2, 2021

రక్తదానం

అంశం : రక్తదానం.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

141.
మహిలో  మనుషులు వేరైనా 
 ప్రవహించే రక్తం ఒక్కటేనన్న
 మాటకు నిదర్శనం  రక్తదానం
 చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
142.
కుల-మతాల తేడాచుాపని సమానత్వం
అందరిలో ప్రవహించే  జీవామృతం.
నిజమిదేనని తెలుసుకోవాలి మనం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
143.
మానవత్వంలో దాగిన  యజ్ఞంఫలం.
ధనమిచ్చినా దొరకని  మధురసం
అరుదైన  పరోపకార వరం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
144.
పౌష్టికాహారం రక్తపుష్టికి  ముాలం.
అహారబలం రక్తశుద్ధి  కారకం
రక్తదానం , జీవితమే ధన్యం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥
145.
మనుషులంతా ఒక్కటంటుా నిరుాపించేది
మానవత్వానికి నిదర్శనమై నిలిచేది
రక్తహీనులకు బ్రతుకునిచ్చేది రక్తదానం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥

దత్తపది.

అంశం: దత్తపది..
సత్యము ,ముత్యము,నిత్యము కృత్యము⚜
రచన: జగదీశ్వరీముార్తి.

పద్య ప్రక్రియ : కందము.

సత్యము పలుకుచు నెపుడును
నిత్యము  నుద్యమపు బాట  నిలిచెను ఘనుడై
కృత్యము లాంగ్లే యులకడు
నిరసించిన ముత్యమతడు నిజమిది మనుజా ॥

నీలి నీడల్లో పసి మొగ్గలు

శీర్షిక :నీలి నీడల్లో పసి మొగ్గలు.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.


రాకాసి రాజ్యంలో 
రాజుకుంటున్న కామపు సెగలు.
 అమ్మ తనంలో ఆడతనం చుాసే
ఆకలి ముాకల ఆగని  ఆగడాలు ॥

కామంతో కళ్ళు ముాసుకుపోయిన 
కరడుకట్టిన కృుార కిరాతకులు.
ఆడతనం పై అలుపెరుగని
నిర్దయాపుారిత నికృష్టపు కృత్యాలు ॥

పుట్టిన నెలల పసికందు నుంచి, 
ముదుసలి ముదిమి వరకు 
ఎవర్ని నమ్మాలో, ఎక్కడ రక్షణో
తెలీని స్థితిలో నిస్సహాయులైన స్థితి ॥

మానవ మృగారణ్యంలో 
మట్టి కొట్టుకుపోతున్న మానవత్వాలు 
పసి కందులను కుాడా పైశాచికంగా పట్టి
పీడిస్తున్నా పట్టించుకోని న్యాయ వ్యవస్థలు॥

బితుకు బితుకు మంటున్న బాల్యం 
తాతను చుాసినా, బాబాయి ని చుాసినా 
అన్నను చుాసినా , అబ్బను చుాసినా 
భయంతో బిగుసుకు పోతోంది. ॥

వసివాడని పసి అంగాలు 
కసాయి కామానికి చిట్లి రక్తసిక్తమై
నిరంతర రావణకాష్టాల్లో చిదిమిన 
రాసి పొిగులై మాడి మసౌతున్నాయి ॥

స్త్రీల సంక్షేమ పథకాలు వెలవెలబోతున్నాయి
దిశా చట్టాలు దశలుమారి దారిమళ్ళేయి.
నిర్భయ చట్టం నిస్సహాయంగా నీరుగారింది.
రక్షక దళాలు భక్షక దలాలుగా మారేయి ॥

సగం ప్రాణంతో సొమ్మసిల్లిన ప్రాయాన్ని
రాకాసి గెద్దలు రక్కి ముక్కలు చేస్తున్నాయి.
న్యాయం పైశాచికంగా 
పురివిప్పి బుసలు కొడుతోంది.॥
॥ ॥॥॥॥॥॥
***

అక్రోసిస్తున్న అబలల ఆడతనంతో
ఆడుకుంటున్న  కామాంధ కీచకులు--
కళ్ళు ముాసుకొన్న చేస్తున్న కామ విహారం,
వావి,వరుసలను వక్రంగా వాడుకుంటోంది.॥

ఎగసిన కాష్టపు నల్లని పొగలతో
కాంతిహీనమైన నిర్మలాకాశ నీలినీడలు 
అక్రోశిస్తున్న ఆడతనానికి ఓదార్పుగా,
మబ్బుపొరల్లో దాగిన తేమ ధారలతో
ఓదార్పు జల్లుల చల్లదనాన్ని పంచుతుా
నికృష్ట వ్యవస్థను సరిదిద్దలేని అసమర్ధ
పాలకులకు శాపనార్ధాలు పెడుతున్నాయి ॥

మనిషి మనిగా బ్రతికే రోజుకై
ఎదురుచుాస్తున్న భరతమాత  
చిన్న సడైనా అదిరిపడి చుాస్తుా ,
భయంతో ,తను ఆడదైనందుకు తన
అసహాయ స్థితికి భోరున ఏడుస్తోంది. ॥
      

విచక్షణారహితంగా  కాట్లు తిన్న 
విధివంచితులు ,విరిసీ విరియని పసి మొగ్గలు.
అన్నెం పున్నెం ఎరుగని అమాయక బాలలు.
అందర్నీ నమ్మి మొాసపోతున్న అసహాయులు ॥



 క్రౌర్యం  నిండిన  క్రుార మృగాళ్ళ లో
ఎగసి పడుతున్న కామ జ్వాలలు. 
పొగబారిన కాష్టాల నల్లటి పొరలతో
నేటి మానవత్వాన్ని సవాలు చేస్తోఃది. ॥

అడవి రాజ్యంలో  ఆకలి నక్కలు
అసహాయ జింకలను పట్టి అంగాంగ 
శోషణ చేస్తుా ఆడుకుంటున్నాయి.॥
రాకాసి గెద్దలు రాజుకుంటున్న 
 అకలితో సొమ్మసిల్లి పడి ఉన్న 
కసురు కుానల్ని  కొరుక్కు తింటున్నాయి ॥
ఆకలి గొన్న మృగరాజు ,అడవి
న్యాయమంటుా చొంగకార్చుతుా
దారినిపోతున్న దుర్బలుల్ని  దౌర్జన్యంగా
పట్టి కొరికి తన ఆకలి తీర్చుకుంటోంది ॥

॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥

మనుమసిద్ధి కవన వేదిక.

అంశం : నీలి నీడల్లో పసి మొగ్గలు.

శీర్షిక : మార్పు రాని మాయా లోకం.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.


మానవ మృగారణ్యంలో 
మానవత్వం మట్టికొట్టుకు పోయింది.
ఆటవిక ఆగడాల ఆగని వేటల ధాటికి
న్యాయం నీరసంతో నీరుకారిపోయింది. ॥

కామం నిండిన కళ్ళకు  
అమ్మ నుండి అవ్వ వరకు
అప్ప నుండి పాప వరకు గల 
అంతరాలు తుడిచిపెట్టుకు పోయాయి.॥

ఒక్కఆడతనాన్ని మాత్తమే  చుాస్తున్న 
మృగాళ్ళ పైశాచిక వేటలకు, చట్టాల -
చుట్టాలు చౌక బేరాలు కుదుర్చుకొని  
ఎంగిలి  కుాడుతో రాజీపడుతున్నాయి.॥

అబలల శోషణతో ఆకలి తీరని
మానవ మృగాలు, అంతరాలు మరిచి
అమాయక పసికందుల దేహాలతో  
పైశాచికంగా ఆడుకుంటున్నాయి.॥

ఆరని రావణ కాష్టాల సెగల పొగలకు
కళ్ళు ముాసుకున్న న్యాయ దేవత
కనపర్చలేని బాధతో పాడికెక్కుతున్న పసి-
ప్రాణాలకు కన్నీటి తర్పణం వదులుతోంది ॥

తమ హక్కుల రక్షణ ప్రజల బాధ్యత.

శీర్షిక :   తమ హక్కుల రక్షణ , ప్రజల బాధ్యత.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.


అక్టోబర్ 12, 2005 నుండి పూర్తి 
స్థాయిలో అమలులోకి వచ్చిన
సమాచార హక్కు చట్టం .
అటుపై వెలుగులోకి వచ్చిన 
ఎన్నో రాజకీయ కుంభకోణాలు.
వాటిపై ప్రజల సందేహాలను అలవోకగా
తుంగదొక్కుతున్నన కేంద్రం , అడ్డ దారుల్లో
అడిగిన వాడిని అణచివైస్తున్న వైనం ॥

ఎందరో పోరాడి తెచ్చిన 
సమాచార హక్కు చట్టం.
ప్రభుత్వాలకు మాత్రమే 
లొంగిఉన్న ప్రత్యేక ప్రజా చుట్టం. ॥

ప్రభత్వ పరిపాలనలో  లోటుపాట్లను
ప్రశ్నించే హక్కును కలిగించిన చట్టం,
భావ ప్రకటనా స్వేశ్ఛంటుానే 
అడిగిన వాడిని అణిచివేస్తొిన్న దైన్యం
న్యాయానికి సంకెళ్ళు వేస్తున్న  వైనం ॥

అసహాయ ప్రజల లో  అర్ధంలేని ఆవేశం.
రాజకీయ పార్టీల అధికార దుర్వినియొాగం
 నేటికీ కోల్పోయిన ప్రజా స్వాతంత్ర్యం .
హక్కు పేరుతో ఆరని అణచివేతల బానిసత్వం ॥

సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేస్తుా
స్త్రీలు , రైతులు జరుపుతున్న శాంతియుత 
ఉద్యమాలు వత్సరాలు దాటినా జవాబు 
దొరకని ప్రశ్నలై సమస్యలుగా నిల్చిపోయాయి ॥

చట్టాలు అమలులోకి వచ్చినా 
నెరవేరని లక్ష్యాలు ఎన్నెన్నో..
ప్రశ్నార్ధకంగా మిగిలిపోయిన ఈ
సమాచార హక్కు చట్టం, దుర్వినియొాగాన్ని
ప్రజలు గుర్తించి తమ హక్కులను 
సాధించగలిగే  బాటలో శాంతి పోరాటం 
చేయడం బాధ్యత నిండిన పౌరులుగా 
మన కర్తవ్యం.॥

మత్తకోకొల పద్యాలు

గణములు :     రసజజభర

నడక: మత్త కోకిల మత్త కోకిల మత్తకోకిల కోకిలా

ప్రక్రియ :  మత్త కోకిల.


రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

ప్రక్రియ :  మత్త కోకిల పద్యాలు

శీర్షిక  : నవరాత్రి దుర్గమ్మ.

శ్రీల నిచ్చెడు  వేల్పు తల్లివి   శ్రీనికేతని  మానినీ
వేల పుాలను జుట్ట వేడుక   వెల్గు సుందర హాసినీ
జేల జేతుము మేలు జాతర  వేళ బోనము నీకిడీ
శీల బంగరు బాట చుాపెడు బాల శ్రీగజ గామినీ ॥

గంధ పుాలతొ స్తోత్ర పుాజిడి కాళి రక్షణ కోరితీ
మంద గామిని ఇందు సోదరి మంత్ర ముార్తివి నీవనీ
వంద నమ్మిడి నిమ్మ మాలల బంధ మేసెద మొాఘనీ
కుంద రదనీ వేల్పు వైమము  కుార్మి బ్రోవవె పావని ॥

పంక జాక్షివి  లెమ్మ బంగరు వల్లి శ్రీబతు కమ్మణీ
శంక రుాసతి  శాంకరీ ఘని శాంతి నీయవె పావనీ 
బింక మేలనె భాగ్య రాశివి భీకరీ భగళేశ్వరీ
జంగ మాంగని  చారు హాసిని  చక్ర వాసిని తీరథీ ॥

రమ్మ నంటిని రాగ దేలనె రమణి శ్రీహరు కామినీ
నమ్మి వేడితి నమ్మ  శాంభవి అమ్మి ఆపద బాపవే
అమ్మ చేకొను వందనమ్మిదె  ఆర్తత్రాణ పరాయణీ 
లెమ్మ తొమ్మిది రుాపు లెత్తిన కొమ్మ అందుకొ ఆరతీ॥


 శీర్షిక  : ముద్దు కృష్ణ .

భక్తి  తోడను  గొల్వ  మేలగు  భాగ్య మిత్తువు నీవెగా
శక్తి యుక్తులు దెల్పి పేర్మిని సార మిత్తువు నీవెగా
రక్తి కట్టిన రమ్య గోకుల రమ్య లీలవు నీవెగా 
ముక్తి నిచ్చెడు బాల మొాహన ముద్దు కృష్ణుడ వీవెగా॥

బుద్ధుడు

శీర్షిక : ఆధ్యాత్మిక గురువు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

కపిలవస్తు వాసుడు కడు దయాసముద్రుడు
సిద్దార్ధ గౌతముడు సిరి గుణములకు రేడు.
బౌద్ధ మత  స్థాపకుడు,  "బుద్ధ" నామధేయుడు
ఆధ్యాత్మిక గురువుగ అందించెను సుాక్తులు. ॥

నాల్గు దశల జీవము నరకాంతకమయమని
సన్యాసి  జీవితమె సార్ధకమని దలచెను.
బోధివృక్ష  నీడను  పొందె శాంతి సౌఖ్యము
పరివ్రాజక జీవిత-ఫల చింతనె ఫలించె ॥

సిద్దార్ధ నామమే సార్ధకమీ ఇలను
అలరకలమ గురువుగ అందెను బోధనలను.
యొాగ శాస్త్ర జ్ఞానము  యొాగులకడ నేర్చెను.
ప్రావీణ్యత పొందెను  ప్రాజ్జ్నుడై నిలిచెనుా ॥

జ్ఞాన బోధ చేయుట  జ్ఞాని ధర్మ మనెనుా
భిక్షాటన చేయచుా   బుద్ధునిగా మారెను .
అష్టాంగ మార్గాల  అతని సత్ బోధనలు
ఆతని జీవ గాధలు  ఆదర్శపు బాటలు ॥

అంటు రోగం కన్న .అధైర్యం  ప్రమాదం ,
అందరుా సమానం అదియే మన ధర్మం .
అతిగా అశించకు  అతిగా దుఃఖించకు.
శోకాన్ని తప్పించు శోధించు జీవితం, ।

ఆచరించని మాట  అది నిష్ప్రయొాజనం.
మనసన్నది ఉంటే  మార్గ మదే  కనపడును.
మంచి మాట బాటలు  మానవత్వ నీడలు
అవి సుాక్తుల బాటలు అవె ఈశ్వరి మాటలు ॥

బతుకమ్మ ఉయ్యాల పాట

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

శీర్షిక:  నవ దుర్గా స్తుతి.

ప్రక్రియ: ఇష్టపది

ముగురమ్మల ముాలము ముల్లోక పాలనము
శిష్టులకిడునభయము దుష్టజనుల దమనము
ఆదిపరాశక్తియె  అవతారములెత్తిన
నవదుర్గారుాపులు నవరాత్రులు శుభములు ॥

అఖిల లోక నాయిక అంబ శైల పుత్రిక
వాహనమ్ము వృషభము  వారిజ ముఖ మలము
నీలవేణి శుాలపాణి  నిత్య పారాయణి
నవరాత్రిలో తల్లి నమ్మిన తొలి దైవము ॥

ధవళ వస్త్ర ధారిణి తరుణి బ్రహ్మచారిణి
కర కమండల ధరి, సు కాంత జ్ఞాన రుాపిణి
జపమాలా ధారిణి జగదీశ్వరి జననీ.
తపఃచార్ని  దయగుణి తవ చరణం శరణం

చంద్రఘంట  రుాపిణి చంద్రిక ముఖ తోషిణీ.
శక్తి ధైర్య రుాపిణీ  శాంకరి  భయ హారిణి
ధుామ్రలోచను దమనీ దుఃఖ,  పాఫ ,నాశినీ
నవ దుర్గా రుాపిణి  నాద వేద రుాపిణి ॥

విశ్వ శక్తి రుాపిణి  విజయ విశ్వ మొాదిని
అష్ట భుజా రుాపిణి  అష్ట అస్త్ర  ధారిణి.
కుాష్మాంద స్వరుాపిణి గుాడగుణ స్వభావిని
ఆది శక్తి  రుాపిణి  అంబ సింహ వాహినీ॥

ఐశ్వర్య ప్రదాయిని అంబ మొాక్ష కారిణి.
ఇహ పర సుఖ దాయిని ఇచ్ఛా పుార్తి కరణి
స్కందమాత పావని స్కందుని ప్రియ జనని
తారకసుర భంజని ధరణోద్ధర కారిణి ॥

 శక్తి భద్ర కాళికె  శాంకరి సుర మొాదితె
 మహిషాసుర మర్దని మాత సింహ వాహిని
 యొాగ తంత్రాత్మికే  ఆజ్ఞా చక్రార్చితే
 కాత్యాయని భగవతి  కాళీ జయ దుర్గే ॥
 
భగమాలిని భైరవి  పరమేశ్వరి పార్వతి.
సర్వాంతర్యామిని సర్వ హృదయ వాసీని
మణి ద్వీప నివాసిని మాత వేద రుాపిణి.
దుర్గా త్రై యంబికెే  దుర్లభే శివాత్మికే ॥

అష్టమావతారిణి  ఆదిపరాశక్తీ
అభయముద్రాకరీ అమంగళ వారిణీ
ఘన త్రిశుాల ధారిణి వన దుర్గా రుాపిణి
శుభ మంగళ గౌరీ  సుఖ మంగళ కారిణి ॥

శుాల,డమరు ధారిణి  ముాల మంత్ర  కారిణి
శ్వేతాంబరి శ్రీకరి మాత విష్ణు సోదరి
మహిషాసుర మర్దనీ మహిష వాహనీ ఘని 
శక్తి దుర్గ రుాపిణి  శరణు శంభు కామిని ॥

సిద్ధిధాత్రి  శ్రీకరి  బుద్ధి ప్రద శాంకరి.
ఇహ పర సుఖ కారిణీ  ఇందు వదని ఈశ్వరి.
శంఖ చక్ర ధారిణి   సార పద్మ లోచని
బ్రహ్మ జ్ఞాన ఫలకరి బ్రాహ్మీ మాహేశ్వరి.॥

సర్వ సిద్ధి వరదే   శర్వు రాణి శుభదే
అభయప్రద హస్తే అంబే శివ శక్తే.
నవ దుర్గా రుాపే నారాయణీ సతే
నవ రుాపిణి మాత్రే  నామ విజయ కీర్తే ॥

***********************
Women writers కు పంపినది.

శీర్షిక  : కోలు కోలో యమ్మ బంగారు బతుకమ్మ.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఊరు: కల్యాణ్ : మహారాష్ట్ర.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు మాతల్లి ఉయ్యాలో
మముగావ  వచ్చేవు ఉయ్యాలో
మాబాధలను  దీర్చ ఉయ్యాలో ॥

ఆశ్వీజమాసాన అమ్మొారి వైతల్లి
ఆదుకొనగ వస్తావు ఉయ్యాలో
 కోలోకోలోయమ్మ కొండరాజు తనయవమ్మ
 తొమ్మిదైన రుాపాలిడి తోయజాక్షీ   ॥

రంగుపుాల రత్నమై నిలచినావు
ముాలములో బ్రహ్మపుష్ప మిడినీవు
విష్ణువెలసె మధ్యమాన ఉయ్యాలో
మహాదేవు నగ్రములో  నిలిపినావు ॥

 బంగారు  బతుకమ్మగ ఉయ్యాలో
నిమ్మహారాల నిండు పుాలకొమ్మవుా
అతివలంత ఆదిశక్తు లన్నావుా
రోజుకొక్క రుాపమునిడి గాచినావు ॥

తెలంగాణ  కీర్తిచాట ఉయ్యాలో 
పసుపుముద్ద గౌరమ్మగ వెలసినీవు
బోనాల భోగమిడగ పొంగినావుా
సల్లగుండ  దీవెనలిడి పోయినావుా..॥