[6/7/2019, 22:37] p3: శ్రీ రాజరాజేశ్వరీ. శివే. సప్తతాళ కీర్తన మాయామాళవగౌళ రాగం మఠ్య తాళం.
[6/7/2019, 22:41] p3: చతురస్రజాతి మఠ్యతాళం. 10 క్రియలు
1.లఘువు. 1. ధ్రుతం . 1. లఘువు. (1.0.1 )
మాయామాళవగౌళ రాగం.
ఆరోహణ = స ,రిశు,గఅం,మశు ,ప ,ధశు, నికా ,స ॥స.॥
అవరోహణ = స , నికా , ధశు , ప, మశు, గఅం , రిశు , స ॥
--------------------------------------------------------------------
పల్లవి.
----------
శ్రీ రాజరాజేశ్వరీ..శివే...శంకరి.......
అ॥ ప॥
-----------
శ్రీచక్ర సంచారిణీ...చిత్స్వరుాపిణీ శ్యామల గౌరీ..
॥ శ్రీ రాజరాజేశ్వరీ.. ॥
చరణం.
------------
పరమ దయాకరి పంకజ లోచనీ
పురభంజను సతి పాహీ భవానీ...॥
సర్వసిద్ధిప్రద త్రిజగత్కల్యాణీ...॥ 2 ॥
సరస సంగీత సాహిత్య మొాదిని పావని.॥శ్రీ॥
చరణం.
---------
నాదబ్రహ్మమయానందే నాట్యరతే...
నారాయణేనార్చితశ్రిత నుాపుర పాదే...॥2॥
బిందు మధ్యస్థితానందానందవిభుాతే....
వేదనుతే సద్గుణమణి శైలసుతే...॥2॥
మధ్యమకాలం:
--------------------
చింతామణిమయ ద్వీప నగరే
చిద్ఘనానంద చిన్మయి మంత్రస్వరుాపే...॥2 ॥
సుందర దరహాసోజ్వలదీప్తే లలితే....
కలిత భవార్ణవ తారణ నౌకే...॥2॥
॥ శ్రీరాజరాజేశ్వరీ ॥
--------------------------------------------------
రచన , స్వరకల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
---------------
[6/7/2019, 22:43] p3: ధ్యాన కీర్తన.
--------------------
పుార్వికల్యాణి రాగం. ఆదితాళం.
---------------------------------------------
పల్లవి .
---------
హిమశైల సుతే ..పాహీ లలితే
పాలయమాం , శరణాగత వత్సలే...॥హిమ ॥
అనుపల్లవి.
--------------
కామకోటి పీఠ వాసినీ.....ఈ.....॥ కామ...
శంకరాభరణ వేణీ....॥2 ॥ హిమ ॥
1.చరణం.
---------------
సుమశరేక్షు కోదండ పాణీ -
రమణి మణీ రస రాగ రంజనీ..॥ 2 ॥
కోమలతర శుభ సుందర వదనీ
శ్యామల వర్ణ అపర్ణ భవానీ ॥ హిమ॥
2.చరణం.
-------------
రాకా శశిముఖి , రాజీవ లోచని ,
శాకంబరి శ్రీ సింహ వాహినీ...॥ 2 ॥
ముాకదైత్య దమనీ.....మాహేశ్వరీ..
ఏకానేకాక్షర మంత్ర స్వరుాపిణీ..॥2॥.హిమ॥
3. చరణం.
---------------
షట్చక్రోపరిస్థిత కమలాసని..
షడ్గుణ నిపుణ సంపుార్ణాభరణీ..
మాయా కల్పిత విషయ ధురీణే....
త్రిజగద్వందిత త్రిగుణ స్వరుాపిణీ...॥ హిమ॥
------------------------------------------------------------
రచన + స్వర కల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------
[6/7/2019, 22:45] p3: కల్యాణి రాగం. ఆది తాళం.
అరో॥ స, రిచ, గఅం, మప్ర , ప, ధచ, నికా, స ॥
అవ ॥ స ని ధ ప మ గ రి స ॥
-----------------------------------
పల్లవి.
-----------
నిరుపమగుణ సదనీ వాణీ
నీరజాక్షి జయ నిత్య కల్యాణి..॥ నిరుపమ ॥
అనుపల్లవి.
--------------
వరదాయకి వాణీ....కర రాజిత
వర మ్రదు వీణా పాణీ....॥ వర॥ నిరుపమ ॥
చరణం.
-----------
శరదిందు శోభిత సుందర వదనీ..
రాగాది స్వర, లయ, సంగీత సదనీ..॥
ఓంకార నాదాది ప్రణవ ప్రసుానే..
వాగ్విలాసిని వరదే కల్యాణీ...॥ నిరుపమ ॥
చరణం.
-----------
బ్రహ్మ మానస జాయే మాత్రే..
శ్రుతి సామ గాన సుధా రస పుార్తే..
అక్షయతేజో రుాప సుగాత్రే..
కచ్ఛతి వీణా వాదిని వంద్యే...॥ నిరుపమ ॥
-----------------------------------------------------------
రచన, :స్వరకల్పన...
శ్రీమతి , పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------
[6/12/2019, 11:13] p3: చతురస్రజాతి..ధ్రువ తాళం.
నాట రాగం.
ఆరోహణ =స, రిష, గఅం, మశు ,ప, ధష ,నికా ,స. అవరోహణ = స ని ధ ప మ గ రి స ॥
14 క్రియలు. ( l0ll ).
లఘవు , ధ్రుతం , లఘువు , లఘువు.
== =l 0 l l .
--------------------------------------------------
పల్లవి .
-----------
అఖిలాండేశ్వరీ శివే ,ఆగమ వినుతే,అంబ భవానీ..
అనుపల్లవి.
----------------
సుఖ సాగర లహరీ, సురేశ్వరీ, సుందరి ,శివసహితే..
అఖిలాండేశ్వరీ॥
చరణం.
----------
లక్ష్మీ ,వాణీ, సన్నుత చరణే, హరి-సోదరి మాన్యే
యక్షరాజ సఖ, అర్ధ శరీరిణి , దేవీ ముని ధ్యానే..
మధ్యమకాలం.
---------------------
రాకా శశిముఖి, రాజీవ-లోచని,
రత్న-సింహాసన-రాజిత రాజ్నీ రమణి మణీ ...
మ్రుగ వాహిని గుణమణి సుగుణ ధనీ...॥
ప్రాకారీ ప్రముఖార్చిత సేవిత ..మంజుల తర శుభ కామిని, కోమల పదయుగనే
పాహీ పావని గజగమనే....॥అఖిలాండేశ్వరీ ॥
చరణం 2.
--------------
స్మిత సిత సుందరి, చంద్ర కళాధరి , దేవీ వేదనుతే
నతజన సేవిత త్రిజగద్వందిత దేవీ యొాగ శిఖే..
మధ్యమకాలం.
-------------------
చక్రాయుధ ధరి, శ్రీ చక్రోపరి-స్థిత కమలాశని,
దుర్దశ నాసిని దురిత శమే....భవ-సాగర-
తారణి కలి హరణెే.....॥
ఛిద్రుాపీ శివ తాండవ లయకరి , నాదా నందిత
నాట్యరతే , శివ- శంకరు కామిని శైలసుతే....శివ వినుతే॥ అఖిలాండేశ్వరీ..॥
షట్ శ్రుతి రిషభం.
అంతర గాంధారం.
శుధ్ధ మధ్యమం.
కాకలి నిషాదం.
---------------------------------------------------------
రచన, స్వర కల్పన..
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి..
కల్యాణ్.
-------------
.
[6/12/2019, 14:45] p3: శరణాగత వత్సలే...
ఆభోగి రాగం.
ఆరో॥ స - రిచ -గసా -మశు - ధచ - స ॥
అవ ॥ స ధ మ గ రి స ॥
చతురస్ర జాతి ఝంపె తాళం.
10. క్రియలు. 1.లఘవు..1అనుధ్రుతం ..1 ధ్రుతం
ఆరు వేళ్ళు , అర ఉసి , పుార్తి ఉసి .
---------------------------------------------------------
పల్లవి:
-----------
శరణాగత వత్సలే శంకరీ శివే...॥
అనుపల్లవి:
-----------------
పరమేశ్వరీ పరే...లలితే...పాహిమాం..॥
చరణం:
-------------
హిమవత్పర్వత రాజకుమారీశ్వరీ...
హైమవతీ హరి సోదరీ..గౌరీ.....
కామకోటి శ్రీపీఠాది విలసితే.....
కామ రాగాదిరస షడ్రిపు విదళితే.. ॥
చరణం:
------------
కమలాశన స్థిత ప్రణవాకార దీప్తే
మిధ్యా మాయా..మొాహవికారే పరే...
తామస గుణ ఘన త్రిగుణ రహితే..హితే
సామ గాన ప్రియ సంపుాజిత గుణ నుతే..॥
----------------------------------------------------------
రచన , స్వర కల్పన ,
శ్రీమతి పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------
[6/12/2019, 14:57] p3: 53 వ మేళకర్త ఐన గమనశ్రమ జన్యం
హంసానందిరాగం.
ఆరోహణ =స- రిషట్- గఅం-మప్ర- ధచ- నికా- స
అవరోహణ= స ని ధ మ గ రి స
చతురస్ర జాతి , రుాపక తాళం. (ఆరు క్రియలు.)
1. ధ్రుతం. 1.లఘువు. ( 0 . 1).
0 1
--------------------------------------------------------------------
పల్లవి :
---------
శివానందమయ లహరీ -- శాంకరి హిమగిరీశ్వరీ
శక్తి స్వరుాపిణి దేవీ-- శ్రీ (చక్రేశ్వరి )లలితే...
అను పల్లవి:
-----------------
కామకోటి శ్రీ పీఠనివాశిని శివ కల్యాణీ...
కామ దహను ప్రియ సతీ శివే శర్వాణీ...
చరణం:
------------
చింతామణిమయ ద్వీప వాశినీ శ్రీమాత్రే..
చిద్ఘనే శుద్ధ మంత్రమయే... మంగళ గాత్రే..
సోమ సుార్యాగ్ని నయనే....సౌరి భయంకరి
సామవేద సంస్తుత శ్రుతి కీర్తే ...శుభంకరి..॥
చరణం :
------------
శబ్ద బ్రహ్మమయి సకల భువన వ్యాప్తే హితే
ఓంకార ప్రణవాది స్వరుాప మంత్ర ద్యుతే..
నాదబిందుమయి నాదానందానురక్తే స్థితే
నారాయణీ శివ నాట్య రసాద్భుత స్ఫుార్తే..॥
మధ్యమకాలం :
----------------------
తధ్ధిమిత ధిం ధిం సు ఢక్కా నినాదానందే రతే
తధ్ధిమ్మి తకధిమ్మి సంగీత సాహిత్య సింధే పరే
సిధ్ధే సుసిధ్ధే ప్రపంచైకానంతే అనంతానంతే..
అజేయే అమేయే అభేద్యే శుభే జోత్యఖండే శివాంగే..
॥ శివానందమయలహరీ...॥
----------------------------------------------------------------
రచన, స్వర కల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-----------------------
[6/12/2019, 21:56] p3: బాల త్రిపుర సుందరీ.
తోడి రాగం.
ఆరో ॥ స , రిశు, గసా , మశు , ప , ధశు , నికై , స ॥
అవ॥ స , నికై , ధశు, ప, మశు, గసా, రిశు , స ॥
చతురస్రజాతి త్రిపుట తాళం.
7. క్రియలు.
ఒక లఘువు...రెండు ధ్రుతాలు.
( అసావేరిలో పాడేను).
----------------------------------------------------------
పల్లవి:
బాల త్రపుర సుందరీ.. ,పాహిమాం పరమేశ్వరీ...
అనుపల్లవి:
శైల రాజ ప్రియ నందినీ , ఫాలనేత్రు ప్రియ భామినీ॥
చరణాలు :
------------
1. కోటి సుార్య ప్రకాశినీ -- ఖేటకాస్త్ర కర ధారిణీ..
దుష్ట దైత్య సంహారిణీ -- శిష్టత్రాణ పరాయణీ ॥
2. మంత్ర తంత్ర సంవాస గుహే -- శ్రీకరీ ప్రణవాక్రుతే
పంచాక్షర మంత్రార్చితే --బీజాక్షరి శ్రీ మాత్ర్రుకే
3. ఆగమాది నుత శ్రీప్రదే.----శ్రితజనాత్కల్ప లతికే
శైల తీర్ధ వర వైభవే ---- శాంకరీ కరుణార్ణవే....॥
4. ధ్యానయొాగ సంపుార్ణమయే- జ్ఞాన కమల - మకరందమయే....
వేద విదిత సంపుాజ్యమయే- నాద భరిత-
స్వర శబ్దమయే....॥
5. చక్ర రాజ స్థిత శ్రీకరీ.. త్రిపురాది చక్రేశ్వరీ...
శక్తి అష్ట - శిద్ధేశ్వరీ - సుందరీ జగదీశ్వరీ.....॥
-------------------------------------------------------------
రచన, స్వరకల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------------
[6/12/2019, 22:07] p3: 6. పద్మలోచనీ..భవానీ...
శంకరాభరణం రాగం.
ఆరో= స, రిచ, గఅం, మశు ,ప , ధచ , నికా , స.॥
అవ== స , ని , ధ , ప , మ , గ , రి , స ॥
ఖండజాతి అట తాళం.
14. క్రియలు.
2- లఘవులు,2- ధ్రుతాలు
( 4.వేళ్ళు ఒక లఘవు. )
-------------------------------------------------------------------
పల్లవి:
--------
పద్మలోచనీ..భవానీ...పాలయమాం గౌరీ..పరి
పాలయమాం..గౌరీ....
శివంకరి శంకరి శివసతి ఈశ్వరీ.....॥
చరణం:
-----------
-పాశాంకుశ ధ్వజ సుదర్శన రాజిత సింహాసనే..
-పద్మ మాలా ధరీ పద్మ సులోచనీ పావని శశి వదనే
-పద్మనాభ ప్రియ సొిదరీ సుందరి గుణ సదనే
- పద్మాశనాది సుర ముని వందిత కోమల శుభ చరణే......॥ ॥
చరణం:-
-----------
నాదబిందుమయి యొాగజ్ఞానానందే నిగమ వినుతే
మ్రుదు మందస్మిత మ్రుగమదోజ్వల ఫాల తిలకే
సాధు జనాశ్రిత త్రిజగద్వందిత శ్రీచక్ర రాజ నిలయే
బోధానందామ్రుత రస పుారిత భావనే సంపుార్ణే...॥
---------------------------------------------------------------
రచన, స్వరకల్పన-
శ్రీమతి, పుల్లాభట్ల,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------------
[6/12/2019, 22:43] p3: శ్రీ....రాజరాజేశ్వరీ...
శ్రీరాగం. మంగళం.
ఆరో॥ స , రిచ , మశు , ప , నికై, స ॥
అవ॥ స , ని , ప , మ , రి, గసా , రి , స ॥
ఖండజాతి ఏక తాళం.
దెబ్బ..నాలుగు వేళ్ళు.
---------------------------------------------------------
పల్లవి:
-----------
శ్రీ.....రాజరాజేశ్వరీ....పాలయే..శంకరీ....శివే...
అనుపల్లవి:
----------------
శ్రీ.....చక్ర సంచారిణీ..శ్రీకరి , మణిద్వీప వాసిని లలితే--------॥శ్రీ....॥
చరణం:
-------------
ఇందుకళాధరు సుందరీ..నారాయణి
నంద నందను సోదరీ ....ఘనీ...॥
బిందు మణ్డలా..వాసినీ...పావని..
కామకోటి పీఠ విలాసినీ..జననీ...॥ శ్రీ ॥
మధ్యమకాలం:
---------------------
కోటి బాలార్కవర్ణే అపర్ణే...
కనక కుసుమ కీర్ణే ...శ్యామల వర్ణే
కరధ్రుతేక్షు పాశాంకుశ పుష్ప బాణే
కామేశ్వరీ శ్రీ లలితే భవానీ.. ॥ శ్రీ ॥
చరణం:
------------
నిఖిల నిగమాంత నుత పదే మానిని
క్షిత్యాదీ తత్వ స్వరుాపిణీ భవానీ..
అ క చ ట త పా..దివర్ణే...సంపుార్ణే
అక్షర మాత్రుకే త్రిపుర సుందరీ భవానీ..॥శ్రీ॥
మధ్యమకాలం.
---------------------
చింతామణిమయ మందిర స్థితే
శివ కామేశ్వరి చిన్మాత్రే పరే
బ్రహ్మ , శివా , విష్ణుా నఖ ప్రకటిత
బ్రహ్మాండ నాయమకి ,
శివయువతే..శైలసుతే..॥-
---------------------------------------------
రచన , స్వర కల్పన,
శ్రీమతి పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి
కల్యాణ్.
--------------
[6/13/2019, 16:25] p3: రజతాచలాగ్ర నిలయే..
మధ్యమావతి రాగం.
ఆ == స, రిచ, మశు, ప , ని కెై , స.॥
అ====స ని ప మ రి స ॥
చతురస్ర జాతి ఏకతాళం.
4. క్రియలు.
(4 .వేళ్ళు.)ఒక లఘువు.
----------------------------------------------------------------
పల్లవి:
----------
--రజతాచలాగ్ర నిలయే అంబా..
శ్రీ రమా వాణీ సఖీ.. సతీ..
అను పల్లవి:
---------------------
అజయే దయార్ద్ర , హ్రుదయే జయే
జగదీశ్వరీ.. పాహిమాం శివే...॥
చరణం:
--------------
--పావని శశిముఖీ , -పాహీ-పార్వతీ----
---భావిత శ్రీపదాశ్రితజన స్తుతిమతీ...
---సర్వోన్నత ఘన, గుణ విభుాతీ
---సర్వమయే శ్రీ, గౌరి మహేశ్వరి ॥ రజతా ॥
చరణం:
------------
----మునిజన హితే , -మొాహన- రుాపే
----మణిమయ భుాషిత , మంజుల గాత్రే
----జ్ఞానానంద విలసితే...... ,.హితే...
----సర్వ సుపర్వ , సంపుాజిత కీర్తే...
మధ్యమకాలం:
---------------------
షట్చక్రోపరి స్థితకరి శ్రీకరి
చక్ర రాజ వలయే...
షడ్గుణైశ్వర్య సంపత్కారిణి
సుందరి శ్రీ గిరి నిలయే..
శుంభ-నిశుంభాది కైటభ భంజని
మహిషాద్యాసురగణ దమనే..
అరిషడ్వర్గ విదారిణి గుణమణి
జగదంబా పరమశివే.....॥ రజతా ॥
---------------------------------------------------------------
రచన, స్వరకల్పన,
శ్రీమతి పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------
[8/27/2019, 18:54] p3: రజతాచలాగ్ర నిలయే..
మధ్యమావతి రాగం.
ఆ == స, రిచ, మశు, ప , ని కెై , స.॥
అ====స ని ప మ రి స ॥
చతురస్ర జాతి ఏకతాళం.
4. క్రియలు.
(4 .వేళ్ళు.)ఒక లఘువు.
----------------------------------------------------------------
పల్లవి:
----------
--రజతాచలాగ్ర నిలయే అంబా..
శ్రీ రమా వాణీ సఖీ.. సతీ..
అను పల్లవి:
---------------------
అజయే దయార్ద్ర , హ్రుదయే జయే
జగదీశ్వరీ.. పాహిమాం శివే...॥
చరణం:
--------------
--పావని శశిముఖీ , -పాహీ-పార్వతీ----
---భావిత శ్రీపదాశ్రితజన స్తుతిమతీ...
---సర్వోన్నత ఘన, గుణ విభుాతీ
---సర్వమయే శ్రీ, గౌరి మహేశ్వరి ॥ రజతా ॥
చరణం:
------------
----మునిజన హితే , -మొాహన- రుాపే
----మణిమయ భుాషిత , మంజుల గాత్రే
----జ్ఞానానంద విలసితే...... ,.హితే...
----సర్వ సుపర్వ , సంపుాజిత కీర్తే...
మధ్యమకాలం:
---------------------
షట్చక్రోపరి స్థితకరి శ్రీకరి
చక్ర రాజ వలయే...
షడ్గుణైశ్వర్య సంపత్కారిణి
సుందరి శ్రీ గిరి నిలయే..
శుంభ-నిశుంభాది కైటభ భంజని
మహిషాద్యాసురగణ దమనే..
అరిషడ్వర్గ విదారిణి గుణమణి
జగదంబా పరమశివే.....॥ రజతా ॥
---------------------------------------------------------------
రచన, స్వరకల్పన,
శ్రీమతి పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------