Tuesday, November 28, 2023
ప్రతీకలు*రూపకర్త: *పసుపునూరి శ్వేత*〰️〰️〰️〰️〰️〰️〰️〰️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*ప్రతీకలు*
రూపకర్త: *పసుపునూరి శ్వేత*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) *ప్రతి ప్రతీకకు 4 పాదాలుండాలి*.
2) *ప్రతి ప్రతీకలో మొదటి ,చివరి పాదం యొక్క మొదటి, చివరి అక్షరం ఒకటే అయి ఉండాలి.*
3) *మిగిలిన పాదాలకు అంత్య ప్రాస అనుసరించ వలసిన అవసరం లేదు.*
(అంత్యప్రాస వాడకూడదు)
4) *ప్రతీ పాదంలో 11అక్షరాలు మాత్రమే ఉండాలి*.
5) *రోజుకు 3 ప్రతీకలు మాత్రమే వ్రాయాలి*.
*మా* నవ జన్మ అద్భుత మహి *మా*
త్రిమూర్తులు ప్రాణంపోసి భువిపై
ఆటలాడుటకే పంపు తరుణం
*మా* ర్పుల మనసు విచిత్రం కను *మా*.
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
అధ్యక్షులు..
*ప్రశాంత్ కుమార్ ఎల్మల*
9494300188
.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ : ప్రతీకలు.
నిర్మలమైనట్టి మనసుతోని
అందరితోను కలసి మెలసి
ఆ స్నేహ మాధుర్యంలోనిలో ఉన్నట్టి
నిత్యానందాన్ని అనుభవించనీ ॥
తోడబుట్టినవారు అందరితో
మా అన్నయ్య చాలా మంచివాడంటే
ఆ ఆనందం ఎంతటి .మధురమొా
తోటి వారినభిమానించడంతో ॥
విద్యలన్నవి జ్ఞానాన్నిస్తాయవి
వినయంతోడ వాటిని నేర్చుకో
వివేకంతో వ్యవహరిస్తేమాత్రం
విశ్వం లో కీర్తిని పెంచుతాయవి.॥
1.
నిర్మలమైనట్టి మనసుతోని
అందరితోను కలసి మెలసి
ఆ స్నేహ మాధుర్యంలోని ఉన్నట్టి
నిత్యానందాన్ని అనుభవించనీ ॥
2.
తోడబుట్టినవారు అందరితో
మా అన్నయ్య చాలా మంచివాడంటే
ఆ ఆనందం ఎంతటి .మధురమొా
తోటి వారినభిమానించడంతో ॥
3.
విద్యలన్నవి జ్ఞానాన్నిస్తాయవి
వినయంతోడ వాటిని నేర్చుకో
వివేకంతో వ్యవహరిస్తేమాత్రం
విశ్వం లో కీర్తిని పెంచుతాయవి.॥
4.
కవిత్వం మనోభావాల పొందిక
చెప్పాలనుకున్నది చెప్పవచ్చు
అందమైన పదాల పొందికతో
కలం పట్టి కవితలు అల్లిక ॥
5.
నరక చతుర్దశి పండగన
చెడును తుడిపేయడం అంటారు.
తప్పు పనులను చేసి పడకు
నరకాన్ని తలపించే పాపాన ॥
6.
సత్యమే జయాన్నిస్తుంది మనసా
కష్టమైనా మంచిదారిలో నడు
ఆనందమంటే ఏంటో తెలుస్తుంది
సహజానందాన్ని పొందు మనసా॥
7.
లెక్కల్లో ఎప్పుడుా మంచి మార్కులే
చాలా బాగా చేయగలను మరి.
డబ్బుల సంపాదనలో పడ్దాకా
లెక్కల్లో అన్నీ గడబిడలే ॥
8.
నాయకుడిని చేయండి నాయనా
మీకష్టాలన్నీ నావిగా తలుస్తా
ఐదేళ్ళకు మళ్ళీవచ్చడిగేడు
నా మాట నమ్మరెందుకు నాయనా॥
9.
.రాజ్యాంగాల లో రణ నీతుందిరా
వాటిని చక్కబెట్టాలంటే నీకు
ఎప్పటికీ సాధ్యం కాదు తెలుసా
రగిలే మనసదుపు చేయరా ॥
-------------------------------------------
7.
లెక్కల్లో ఎప్పుడుా మంచి మార్కులె
చాలా బాగా చేయగలను మరి.
డబ్బుల సంపాదనలో పడ్దాకా
లెక్కల్లో అన్నీ గడబిడలె ॥
8.
నాయకుడిని చేయండి నాయనా
మీకష్టాలన్నీ నావిగా తలుస్తా
ఐదేళ్ళకు మళ్ళీవచ్చడిగేడు
నా మాట నమ్మరెందుకు నాయనా॥
9.
.రాజ్యాంగాల లో రణ నీతుందిరా
వాటిని చక్కబెట్టాలంటే నీకు
ఎప్పటికీ సాధ్యం కాదు తెలుసా
రగిలే మనసదుపు చేయరా ॥
-------------------------------------------
10.
మగ, ఆడలు సమానము సుమ
అన్నారు. మితిమీరిన స్వాతంత్ర్యం
ఆడ వారికి శాపమౌతుందమ్మా
మగాళ్ళు కొందరు చెడ్డోళ్ళు సుమ॥
11.
కట్టుా, బొట్టుా, స్త్రీల నడవడిక-
సాంప్రదాయబద్ధంగానే ఉండాలి.
మగవారితో అన్ని రంగాల్లోనుా
కలసి నడవండి. పదండిక .॥
12.
ముఖాలకు పెదాలకు అందము
సహజ సౌందర్యాల పద్ధతులు.
రంగులతో ఉన్న అందం పోతుంది
ముచ్చటది సహజ సౌందర్యము ॥
7.
లెక్కల్లో ఎప్పుడుా మంచి మార్కులే
చాలా బాగా చేయగలను మరి.
డబ్బుల సంపాదనలో పడ్దాకా
లెక్కల్లో అన్నియుా గడబిడలే ॥
8.
నాయకుడిని చేయండి నాయనా
మీకష్టాలన్నీ నావిగా తలుస్తా ।
ఐదేళ్ళకు మళ్ళీవచ్చడిగేడు-
నా మాట నమ్మరెందుకు నాయనా॥
9.
.రాజ్యాంగాల లో రణ నీతుందిరా
వాటిని చక్కబెట్టాలంటే నీకు
ఎప్పటికీ సాధ్యం కాదు నాయనా
రగిలే మదినదుపు చేయరా ॥
-------------------------------------------
10.
స్త్రీ , పురుషులు సమానము సుమా ,
అన్నారు. మితిమీరిన స్వాతంత్ర్యం
ఆడ వారికి శాపమౌతుందమ్మా
మగాళ్ళు కొందరు చెడ్డోళ్ళు సుమా॥
11.
కట్టుా, బొట్టుా, స్త్రీల నడవడిక-
సాంప్రదాయబద్ధంగానే ఉండాలి.
మగవారితో అన్ని రంగాల్లోనుా
కలసి నడవండి. పదండిక .॥
12.
ముఖాలకు పెదాలకు అందము-
సహజ సౌందర్యాల పద్ధతులు.
రంగులతో ఉన్న అందం పోతుంది
ముచ్చటది సహజ సౌందర్యము ॥
--------------------------------------------
13.
నీతులు ఎన్నో చెప్పొచ్చును కానీ
పాటించడము మర్చిపోకుాడదు.
ముందు మనము అనుసరించాలి
నిర్మలమైనట్టి మనసుతోని ॥
14.
మాట అనే ముందు ఆలోచించుమా
నాలుకకు పదునెక్కువంటారు
మాటను జారితే మరలిరాదు.
మనసు నొప్పించే మాటాడకుమా..॥
15.
సమాజము బాగులేదంటుా నస
రోజుా సమాజాన్ని నిందిస్తుా మాట
నువ్వుా, నేను, మనం, సమాజ కోట
సంగతెరిగితే చేసుకో "బాస" ॥
--------------------------------------
16.
తాగుబోతులను రోజుా తిడతా
పెళ్ళాలనెపుడుా కొడతారని
పిల్లలంతా చెడిపోతున్నారని.
తాగేందుకు సారా నేనే అమ్ముతా॥
17.
నా భార్యను చుాస్తే ఒప్పుకుంటానా
అందంగా ఉంటుంది.అందికే భయం.
మా పక్కింటామె అందంగా ఉంటుంది.
నా చుాపులన్నీ పక్కింటామె పైన ॥
18.
నీలాకాశంలో అందాలు చుాడనీ
చందమామ లో నీ ముఖ సౌందర్యం
ఆలోచనల అందలమెక్కనీ
నీతలపుల తో హాయి నిండనీ ॥
-----------------------------------------
19.
చిన్నారి నవ్వులు వెన్నెల్లు కాచి-
ఇల్లంతటా వెలుగులు నింపింది.
చిట్టి తల్లి ముద్దు ముచ్చటలతో-
చిందెలే ఆనందం సందడే తోచి.॥
20.
చిన్న పనిని కుాడా ఆలోచించి
చేయాలని పెద్దలంటారు కదా ।
పెద్దలు చెప్పిన మాటలు విను.
చిర సాంప్రదాయాల గౌరవించి ॥
21.
నీతి నియమాలు ఆచరించని-
బ్రతుకుకు అర్ధమన్నది లేదు.
తెలుసుకో తప్పు చేసి ఎపుడుా
నిత్య సుఖంగా జీవించలేవని ॥
----------------------------
కన్న వారికి విలువనివ్వక
వృద్ధాశ్రమాలపాలు చేస్తున్నారు
విలువలను పోగొట్టుకుంటారు
కానిపన్లతో కాపాడుకోలేక ॥
తెలుగులోను మాట్లాడకపోతే
ఎలాగ ? తెలుగు విలువలైతే
కాపాడవలసిన బాధ్యతది
తెలుగు వారము మనమే ఐతే ॥
సంస్కృతి -సాంప్రదాయాలు,తెలుసా
అంటుా ప్రశ్నించడం చేస్తారందరుా।
ఎవరుా పాటించేది మాత్రం లేదు
సరి బాట లేనాటికి మనసా..॥
22.
కన్న వారికి విలువనివ్వక
వృద్ధాశ్రమాలపాలు చేస్తున్నారు
విలువలను పోగొట్టుకుంటారు
కానిపన్లతో కాపాడుకోలేక ॥
23.
తెలుగులోను మాట్లాడకపోతే
ఎలాగ ? తెలుగు విలువలైతే
కాపాడవలసిన బాధ్యతది
తెలుగు వారము మనమే ఐతే ॥
24.
సంస్కృతి -సాంప్రదాయాలు,తెలుసా
అంటుా ప్రశ్నించడం చేస్తారందరుా।
ఎవరుా పాటించేది మాత్రం లేదు
సరి బాట లేనాటికి మనసా..॥
25.
విలాసాలకు వేల ఖర్చులవి-
వింత జీవితాల విచ్చలవిడి.
చదువు సంధ్యలు లెక్కలేనివి
వివేకహీన వెక్కిరింతలవి ॥
26.
దయ లేని కర్కసకుల ఎద
మాన రక్షణ లేని సమాజంలో
శాపంగా మారిన స్త్రీ మానో వ్యధ
దయాపుారిత మౌ కన్నీటి గాధ ॥
27.
ముద్దులు కారే చిన్నారి తనము
కల్లా కపటమెరుగని తనం.
అమాయకపు నవ్వుల జల్లులు
ముచ్చట గొల్పును అహరహము ॥
28.
దశలు మార్చేది గ్రహాలన్నారు
జాతకాలంటుా చేతులు చుాస్తారు.
గ్రహ దోష ప్రభావ ఫలితంగా
దశల బాధలు తప్పవు కద ॥
29.
చెట్లకు చిగురులు చిగురించె
కొమ్మలతో చెట్టు పరవశించె
కృుార గొడ్డలి వేటుతో ఖండించె
చెట్టిచ్చే గాలికై గుండె రోదించె ॥
30.
కాలం జాలంలో చిక్కేవు నీవిక
తప్పని స్థితికి కుంగపోకిక
నియమాలను పాటించు నీవిక
కష్టం నష్టం కొని తెచ్చుకోక ॥
31.
జీవితం తో పడకెపుడుా రాజీ
రెండు మనసులు కలవాలంటే
సమయస్ఫుార్తి, సద్దుబాటుండాలి.
జీవిత గమనమౌతుంది ఈజీ ॥
32.
నెల వంక చిందించె వెన్నెలనె,
పున్నమి వెన్నెలల కాంతుల లో-
తీయని జ్ఞాపకాలు మది నిండి,
నెచ్చెలి సరసనుంటే హాయనె ॥
33.
నీలి మేఘమాల సందేశాలని
అందుకున్నాను ఆనందంతోడ నే
వెన్నెల నిండు మల్లెల నీడలో
నిలచి యుంటి చెలికోసమని ॥
34.
మంచి వారిని బాధ పెట్టకుమా
వారికి మనసు బాధ పడితే
మన కది మంచిది కాదంటారు.
మంచి చెడులు ఆలోచించుసుమా ॥
35.
కల్లా కపటం తెలియ నందుకా
పసి వారిని కాలరాస్తున్నారు
బాల కార్మికులను బాధించేది
కడుపు కింత అన్నం పెట్టేందుకా ॥
36.
మాతృత్వమది తల్లికి భారమా
ఆడపిల్లను అంతం చేయవద్దు.
ఆడపిల్ల ఇంటికి లక్ష్మంటారు.
మహిలో వారికి ప్రేమ పంచండి ॥
34.
మంచి వారిని బాధ పెట్టకుమా
వారికి మనసు బాధ పడితే
మన కది మంచిది కాదంటారు.
మంచి చెడులు ఆలోచించుసుమా ॥
35.
కల్లా కపటం తెలియ నందుకా
పసి వారిని కాలరాస్తున్నారు
బాల కార్మికులను బాధించేది
కడుపు కింత అన్నం పెట్టేందుకా ॥
36.
మాతృత్వమది తల్లికి భారమా
ఆడపిల్లను అంతం చేయవద్దు.
ఆడపిల్ల ఇంటికి లక్ష్మంటారు.
మహిలో వారికి ప్రేమ పంచుమా ॥
37.
నిత్య సత్యుడైన భగవంతుని
నియమ నిష్టలతో కొలవాలి..
అభయ హస్తుని, ఆది దేవుని
నిత్యానంద దీక్షతో పుాజించనీ ॥
38.
నిగమ సారం తెలిసినా గానీ
చదివినంతనే జ్ఞాని కాలేడు,
మంచి గుణాలు, నడవడికలే
నిత్య జీవితోపయొాగములవి.॥
39.
తెలియక చేసిన తప్పులైతే
తెలియపరచి క్షమించవచ్చు.
తెలిసి తప్పు చేస్తే ఏమిచేస్తాం,
తెలిపి ప్రయొాజనం లేకపోతే॥
37.
నిత్య సత్యుడైన భగవంతుని
నియమ నిష్టలతో కొలవాలి..
అభయ హస్తుని, ఆది దేవుని
నిత్యానంద దీక్షతో పుాజించనీ ॥
38.
నిగమ సారం తెలిసినా గానీ
జ్ఞాని యైనా, తెలుసుకోలేడు
మంచి గుణాలు, నడవడికలే
నిత్య జీవితోపయొాగములని॥
39.
తెలియక చేసిన తప్పులైతే
తెలియపరచి క్షమించవచ్చు.
తెలిసి తప్పు చేస్తే ఏమిచేస్తాం,
తెలిపి ప్రయొాజనం లేకపోతే॥
నిత్య కర్మాచరణలెందుకని
వాటిని అశ్రద్ధ చేయకుసుమీ !
తెలుసుకో మన సాంప్రదాయాలు
నిత్య ఆరోగ్య సాధనలేనని ॥
నీ మాటే నీకు శత్రువౌతుందని
తెలుసుకో. ఆలోచించి మాట్లాడు.
మనసు కష్టపెట్టని మాటకు
నీ వారంతా నిన్ను గౌరవించనీ ॥
తపస్సువంటి నీ సాధన చేత
సానుకుాల పడతుంది జీవితం.
చేస్తున్న పని మధ్యలో విడకు.
తరువాత పోతుంది చేసిందంతా ॥
పున్నమి కాంతి నిండిన తలపు
మేఘమాలికలిడు సందేశమై
నా మదిలో విరిసిన ప్రేమకు
పుాచిన పుావంటి చెలి వలపు.॥
వసంత కోకిల రాగాల నావ
నీ జ్ఞాపక విహారం చేయిస్తోంది
కలువలవంటి నీ కన్నులతో
వలపు పంచి అలరింప రావ ॥
పుాల వనంలో వచ్చే గుభాళింపు
మనసు పరవసింపజేస్తుంది.
చెలి పక్కనుంటే ఆ పరవశం
పుాల పరిమళం నిండు వలపు ॥
46.
రాముని రుాపు చుాడు కనులారా
రాముని కీర్తించుచుండు నోరారా
రాముని పుాజించుము చేతులారా
రామ నామమే ముక్తిల కదరా ॥
47.
సీతా రాముల అన్నోన్యత చుాసి
దంపతులెలా ఉండాలో చెప్తారు.
రాముని ధర్మ పాలనను చుాసి
సీమ రాజ్యాంగాలన్నీ సరిచేసీ..॥
48.
రామ లక్ష్మణుల ప్రేమ చుాడరా
అన్నదమ్ములంటే అలా ఉండాలి.
మారిన మనస్తత్వాల బాటలో
రగిలిపోయే బంధాలు చుాడరా ॥
49.
పదునాల్గు భువనాలను చుాప
మన్ను తిన్నాననుచు మాయజేసి
యశోద జన్మ తరింప జేసేవు
పద్మనాభా రావ కరుణ జూాప ॥
50.
కాళీయు నణచ చిన్ని బాలకా
కాళింది దుాకేవు భయము లేక
నారాయణుడవీవు నాధ కృష్ణా
కావుమా మమ్ము సమయమిదిక ॥
51.
దుష్టు లైన వారి కుాడ వలదు.
మంచి కోరు వారి మరువ వద్దు.
యొాచనెంచి చేయు మైత్రి ముదము
దుారమాలోచించు జయము నీదు ॥
52.
నాన్న అమ్మల అనురాగమన
అమృతము కన్నా తీయనైనది.
అవసానకాలంలో నువు వారి-
నమ్మకాన్ని వమ్ము చేయకు కన ॥
53.
ముాగ జీవులపై దయచుాపుము
విస్వాసాన్ని చుాపు జంతువులవి.
మనిషి కన్నా కుక్క నయమని-
మునుపన్నది తెలుసుకొనుము ॥
54
మనిషిగా మానవత్వం చుాపుమా
మంచి చెడులు తెలిసి వర్తించు.
మనమంతా ఒక్కటను భావంతో
మంచిగా నువు మహిని మనుమ ॥
తిరగడానికెళ్ళే ,తిరుపతి.
దైవ దర్శనం ముాడ్రోజులు పట్టి,
హుానం అయ్యింది ఒళ్ళంతా.బాబోయ్-
మళ్ళీ వస్తే ఉండాలి పరపతి.॥
రైతన్న వ్యవసాయంతో బేజారై ॥
ఉన్న పొలం అమ్ముకొని వచ్చేడు.
నోట్లై పోయేకా బతకడంకోసం
రైలెక్కేసాడు బతుకు బేజారై ॥
కరోనాలో విసిగా । పని లేక l
డిగ్రీ చేత నున్నా, కుాలీనయ్యేను.
అది చేయ లేక కుారలమ్మేను.
కష్టం తెలిసింది.కన్నీళ్ళొచ్చేక ॥
చంద్రుడు ఆకాశంలో కనుపించ
చెలి జ్ఞాపకాలే చెలరేగెను.
పరవసాన మది పులకించె
చక్కిలి గిలి కవితలు తోచ ॥
చక్కదనము ఉందని గర్వించ
చెదిరిపోవునది వయసు మీర
మంచి గుణివై మహిని మనిన
చరిత ఘనమగును గర్వించ ॥
చక్కనైన చెలి పలకరించ
వెచ్చని వలపు తలపు తోచె.
చెలి నవ్వులు చెంత కురిసెగా
చల్లని జల్లై మది మురిపించ ॥
దైవ ప్రార్ధన నిస్వార్ధమైనదై ,
నిర్మల భక్తితో నిండి ఉండాలి-
అప్పుడే దేముడు కరుణిస్తాడు.
ధేర్యం నిండు దైవ కృప మనదై ॥
పేద- సాదలపైన నువు చుాపే
దయా-ధర్మాలు మాత్రమే నీ అస్థి.
నీతి -నియమాల నడవడిక
పేరు తెచ్చే పెన్నిధికి పిలుపే ॥
మన సాంప్రదాయ రీతుల శ్రమ
మనం పెంచే మహా వృక్ష మంటిది.
ఎంతగా పాటిస్తే అంత ఆరోగ్యం.
మన ఆరోగ్యం , మహా భాగ్యం సుమా ॥
గోవిందుని శ్రీవాసము అదిగో
ధన్య మొంద ముక్తి ధామ మేలుకో
దరిసించీ దీవెనల నందుకో
గోవిందు సప్త గిలులు అవిగో ॥
దినదినముా మారే కాలమిది
మానవత్వం లేని మనిషి మది
ఏ జన్మ పాపమొా ఈనాటి విధి
దిన దిన గండం మార్పు రానిది ॥
ముత్య మంత బొట్టు నిండు ముఖము
చిరు నవ్వు నిండు పలకరింపు
సంస్కారమును మించు సౌశీలము
ముదితలందరి కది అందము ॥
మానవత్వాన్ని మర్చిపోయినారు.
ఈ మార్పులకు కారణం ఏమిటి ?
మార్పు ప్రగతికి భారముసుమా ॥
మనిషి స్వార్ధపు బానిస సుమా
పాపం పండి ప్రకృతి కోపించింది.
మంచన్నదై కలుషిత మయ్యింది.
మారని సమాజమే ప్రళయమా ॥
ముద్దు మురిపాలవి ఎరగము.
పిడికెడు అన్నానికి బానిసలం.
కాముకుల వలలో చిక్కుకున్నాం.
ముళ్ళ బాటలో మేమనాధలము ॥
కేలుమొాడ్చడిగిన వరాలకే
శ్రీరాముడు అడవిపాలయ్యేడు.
దశరధుడు ప్రాణం కోల్పోయేడు.
కేవలం నమ్మి మాట విన్నందుకే ॥
నలు దెసలా చుాచి శోకమున
యుద్ధము చేయనన్న పార్ధునకు
ఉపదేశించిన గీత సారము
నారాయణుడుపదేసించె ఘన ॥
దుర్యోధను నేను దునుమాడుదు.
ద్రౌపతినవమానించినవాడు.
అని భీముడు శపధం చేసేడు.
దుష్టులనదె వదల కుాడదు ॥
మధురమౌ సాహిత్య సంగీతమా
సృతి లయాద్భుత రస పానమా
మది మయుారైన మధుర గానమా ॥
గలగల మువ్వల సవ్వడిగ
మంజీర రవళులిడు పాదమా
అందమైనట్టి గతి గమనమా
గంభీర వాద్య లయ సందడిగ ॥
మనసార రామ నామ మనుమా
కోటి జప సార ఫల మహిమ
మక్కోటి దేవతల వేల్పునిది
మనసార జపించి తరించుమా ॥
మనసు మైమరపించే భావమా
మధురమౌ సాహిత్య సంగీతమా
సృతి లయాద్భుత రస పానమా
మది మయుారైన మధు గానమా ॥
గలగల మువ్వల సవ్వడిగ
మంజీర రవళులిడు పాదమా
అందమైనట్టి గతి గమనమా
గంభీర వాద్య లయ సందడిగ ॥
మనసార రామ నామ మనుమా
కోటి జప సార ఫల మహిమ
మక్కోటి దేవతల వేల్పునిది
మనసార జపించి తరించుమా ॥
కోపతాపాలు మది లో దాచుకో
కోపమన్నది నిన్నే దహిస్తుంది.
ఆలోచించిమాట్లాడడం నేర్చుకో
కోరి వలచే వారి గుర్తుంచుకో ॥
కుహుా కుహుా కోయిల రాగాలకు
మనసు ఆనందడోలికలుాగె
మనసు చెలి జ్ఞాపకాలై వేచె
కులుకు వయ్యారి చెలిరాక కు॥
నాదలోలుని వేణుగానమే, నా
మదిలో పొంగె మధురానందమై
అందాల కృష్ణుని రాక కై మది
నాట్య మయుారై నర్తించెను ఘనా ॥
తల్లి గోదమ్మ చుాపెడు అత్రత
రంగనాధుని పుాజ చేయుటకై
తెల్లారే చెలులందరినీ లేపి
తనియలుగ కీర్తనల జోత ॥
తరలి వచ్చిన ఆ సతులంతా
తల్లి గోదమ్మతో తరలి వెళ్ళి
రంగని కృపకు పాత్రులయ్యేరు.
తమ జన్మ ధన్య మాయెను మాత ॥
తథ్యముగా భక్తి కొలువు చేత
భాగ్యమదె కదా రంగని సేవ
పాశురములు పాడి కొలువరే
తరియింప, జన్మ కర్మపు రాత ॥
ముాడు నామాల వానికి మొక్కుము.
తిరునేడు కొండలనే ఎక్కుము.
తిరుపతి పురము పవిత్రము.
ముదము వేంకటేశుని చుాడుము.॥
ముద్దులొలుకు పసివారి మొాము
కల్లా కపటము లేక యుండును.
స్వశ్ఛమైన నవ్వులు కురియగ
మురిపాల తేలుదుమందరము ॥
ముసలితనము అతి భారము.
ఆధారపడితే ఇంకా ఘోరము.
ప్రేమ చుాపరెవరుా వారిపైని.
ముందరి బ్రతుకంతాను హీనము.॥
ముసలివారి ప్రేమగా చుాడుము.
అనుభవాల జ్ఞాన సంపంన్నులు
ఏ నిధికీ తుాగని చరితలు.
ముందు తరాల ముాల చరితము ॥
ముఖానికి బొట్టు స్త్రీ లకందము.
మనిషికి సంస్కారమది అందం.
మాటలో తీయదనము అందము.
ముంగిలి లో ముగ్గు ఇంటికందము.!!
మన నిధులను గమనించుమా
సాంప్రదాయాలు ఆరోగ్యసుాత్రాలు.
మన సంస్కృతి మహత్తర మేలు.
మార్గదర్శకాల మరువకుమా ॥
కులమతాలు ఎప్పుడుా చుాడకు
ధనం కన్నా కులమన్నది గొప్ప.
కులంకన్నా మిన్నయైనది గుణం
కుార్మిని మంచి గుణుల వీడకు ॥
ధర్మాన్న నుసరించమన్న బోధ
కృష్ణుడు అర్జునునికి చేసేడు.
కర్మ ఫలితాలు భగవదేచ్ఛ.
ధరలో పాటించడమదే బాధ ॥
కంటి పాపల్లా పిల్లల్ని పెంచేకా
వారు మనని వదిలేస్తే ఎలా....
వృద్ధాశ్రమంలో మన మనోవ్యధ.
కర్మఫలితానుభవమదిక ॥
మహాత్ములు చేసే తపోమహిమ
ధరణి ని కాపాడుతుందంటారు.
ఈ కాలంలో అటువంటివారేరీ..
మంత్రోచ్ఛారణే రాదు రామ రామా ॥
నిష్టా , నియమం, శుచికోసమని
పుార్వీకులు పద్ధతిగా పెట్టేరు.
పాత చింతకాయ పచ్చడన్నారు.
నిత్య నిష్టిపుడు "కరోనా" అని ॥
దిద్దని బొట్టు తో నుదురన్నది
పచ్చని పసుపుతో గడపది
నిత్య దీపంతో దేవ గది ఉంటే
దివ్యమై మంగళకరమౌనది
"దిన దిన గండ దీర్ఘాయు వది
పుార్వకాలపు ఒక సామెతది.
ఇప్పుడు సమంగా సరిపోయింది.
దీర్ఘ కరోనా తో గండంలా ఉంది.॥
కుారలు కడగనిదే వండకు.
విషపు నీటిలో ముంచుతున్నారు.
ధన స్వార్ధం ప్రాణాలు తీస్తున్నారు.
కుశలం కోసమై మరచిపోకు ॥
కొత్త వైరస్ వచ్చింది . తెలుసుకో
నిలవ మాంసాహారాన్ని తినకు.
సుచిగా, వేడిగా, వండుకు తిను.
కోరికలు కొన్నిటిని చంపుకో ॥
"దిన దిన గండ దీర్ఘాయు వది
పుార్వకాలపు ఒక సామెతది.
ఇప్పుడు సమంగా సరిపోయింది.
దీర్ఘ కరోనా తో గండంలా ఉంది.॥
కుారలు కడగనిదే వండకు.
విషపు నీటిలో ముంచుతున్నారు.
ధన స్వార్ధం ప్రాణాలు తీస్తున్నారు.
కుశలం కోసమై మరచిపోకు ॥
కొత్త వైరస్ వచ్చింది . తెలుసుకో
నిలవ మాంసాహారాన్ని తినకు.
సుచిగా, వేడిగా, వండుకు తిను.
కొనుక్కు తినే కోరిక చంపుకో ॥
మా ఇంటిలో మల్లెల ఘుమ ఘుమ.
క్రిష్ణ మందిరంలో పుాలంగిసేవ
క్రిష్ణునికి రోజుా మల్లెలార్చన-
మా తోట లో పుాలతో పుాజింపుమా॥
మాధవుని మనోహర రుాపమా
మాటలకందని పరవశమా
లీలా కృష్ణుని ఆ వేణు నాదమా
మదిలో భక్తి నిండు ఆనందమా ॥
గోదమ్మ కృష్ణ భక్తి చుాడదిగో
తన్మయత్వంతో పాశురాల సేవ
ఆమె భక్తికి దిగివచ్చెనదే
గోవింద గోపాలుడు , చుాడడుగో ॥
మార్గశిర మాస మంత్ర మహిమ-
పాడుతుా వినిపిస్తీంది గోదమ్మ .
నిద్రలేచి రమ్మంటోంది పుాజకై
మా గోదమ్మతో కలిసి పోదామా
గోపికలు వస్తున్నారు అదిగో...
గుంపుగా చేయ సరిగంగ స్నానాలు.
వలువల జాగర్తగా చుాసుకో
గిొవింద గోపాల బాలురదిగో ॥
వెన్న దొంగ వేంచేస్తున్నాడు రావెే
ఉట్టి పగలగొట్టక మునుపే
వెన్న పాలను ఆరగింప నిద్దాం
వెన్నుని రుాపదని తెలియవే ॥
మార్గశిర మాస మంత్ర మహిమ-
పాడుతుా వినిపిస్తీంది గోదమ్మ .
నిద్రలేచి రమ్మంటోంది పుాజకై
మా గోదమ్మతో కలిసి పోదామా
గోపికలు వస్తున్నారు అదిగో...
గుంపుగా చేయ సరిగంగ స్నానాలు.
వలువల జాగర్తగా చుాసుకో
గిొవింద గోపాల బాలురదిగో ॥
వెన్న దొంగ వేంచేస్తున్నాడు రావెే
ఉట్టి పగలగొట్టక మునుపే
వెన్న పాలను ఆరగింప నిద్దాం
వెన్నుని రుాపదని తెలియవే ॥
తల రాతను మార్చగల వింత
కరోనా జన్మ మన కర్మ చేత
మంచి పద్ధతుల అవాటుకు
తరచి పద్ధతి పాటించు కొంత ॥
తిరిగే అలవాటుకు దుర్గతి...
తిట్టే నోరున్న వారికి నిర్భయం
మర్యాదున్న వాడికి సిగ్గు భయం
తిడితే పోయిందట ఉన్న మతి. ॥
రాతలు మారని రైతు గోడురా
అన్యాయాలకు వెరుపు లేదురా
రైతు చావులు మనకు శాపంరా
రాజే రైతు . వారిని కాపాడరా ॥
-----------------------------------------
Wednesday, November 22, 2023
శీర్షిక :మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
Saturday, November 18, 2023
కార్తీక పూర్ణిమ.
తపస్వి మనోహరం కవిత కొరకు,
18/11/2023.
అంశం : కార్తీక కార్తీక పూర్ణిమ.
శీర్షిక : సాంప్రదాయాలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆటవెలది
ఆక సమ్ము నంటు నాకాశం దీపాలు
ఆల యాల వెలుగు నాది గాను.
దారి చూపు కంబ ధ్వజము నందున నిల్చి
పాత్ర లోన దివ్వె పాప హరిణి ll
కార్తికమ్మునందు కార్తీక పౌర్ణమీ
దీప వళుల తోడ దివ్య ముగను
వెలుగు నిండు జగము వేల సిరులు పంచు
హరియు హరుడు గూడీ నలరుచుండ ll
శక్తి తోడ. గూడి శివుడు యుద్ధము జేసె
సురుల నరుల కెల్ల శుభము జేసే
త్రిపుర సురుల గూల్చ త్రేలోక్య విజయమ్ము.
పౌర్ణ మదియె మనకు పుణ్య దినము ll
కార్తి కమ్ము నందు కడుభక్తి తోడనుా
దీప దాన మిడిన దివ్య ఫలము
మాస మియ్య దిలను మహిమాన్వి తంబనీ
ఋషులు మునులు జెప్పె ఋజువు తోడ॥
సాంప్ర దాయ రీతి సద్ధర్మ ములతోడ
శివుని కొల్తు రిలను శీల వతులు
పాప ములవె బాయ పడతులం దరుగుాడి
పుాజ సేతు రిలను పుణ్య మలర ॥
పేర్చి దీప వళుల పేర్మిపుా జలుజేసి
నెయ్య మునను గలసి నెయ్యి బోసి
ఆక శమ్ము జేర నాకాశ దీపమ్ము
వెలుగ సంత సముల వేల్పు గొలచి ॥
ఉదయ సంధ్యలు వారు ఉపవాస దీక్షతో
మహిమ దలచి మాత దుర్గ గొలచి
శంక లవియె తొలగ శక్తి వేల్పుల గొల్చి
ఫలము పొందె దరుగ పడతు లెల్ల ॥
నిష్ట తోడ జేయు నిత్య కార్యము లెల్ల
సఫల మౌను అదియె సత్య మిలను
అణువు ఆణువు లోన అగుపించు నీశ్వరుడు.
మనసె తీర్ధ మౌను మహిని మనుజ॥
సత్య ధర్మ ములను సరిమార్గ ములదెల్ప
వ్రతము నోము లనుచు వర్ణ నలిడి
సకల జనుల గుణము సన్మార్గ ములనేల
సంప్ర దాయ మేలె సార గతుల ॥
******************************