108 ఇష్టపదులు.
--------------------------.
సర్వ దేవతా ప్రార్ధన.
1.గణపతి వందనం.
------------------------
1.
అంబ ఈశుని పుత్ర ఆది పుాజ్యుడవయ్య
అహరహము నిను గొల్తు నార్తిబాపగదయ్య
ఆది -అంత్యము లేని ఆది గురుడవు నీవు
అర్చించు నీశ్వరికి ఆపదలు బాపయా ॥
2.
ముజ్జగమ్ముల ఒజ్జ ముద్దు గణపతి రాయ.
విఘ్నముల బాపేటి విఘ్నేశ్వరుడవయ్య
ఇష్టపదులను రాయు ఇచ్ఛ దీర్చగ రార
ఈప్సితములీడేర్చి ఈశ్వరిని బ్రోవరా ॥
2.గురు వందనం.
.---------------------
3.
శ్రితజనుల బ్రోవగా శిరిడీ పురమునందు
శ్రీశ నీ వాసమే శ్రీ నిలయమై ఒప్ప
సర్వ మత సమ్మతిని సరళముగ జెప్పేవు
సకల తీర్ధములన్ని నీదరినె జుాపేవు..॥
4.
ఖండయొాగివి నీవు ఖలు సంతరణ జేయు
కరుణా సముద్రుడవు కమలనయన సునేత్ర
కలత లన్నియు బాపి కావుమయ్యా మమ్ము
శ్రీ షిరిడి శ్రీ వాస శ్రీ పదాంబుజయుగళ ॥
5.
వందనము శ్రీసాయి వందనము గురుదేవ
వందనము చేకొనగ వేగ రావగదయ్య
వేడుచుంటిని నిన్ను వేల కీర్తుల తోడ
వరద హస్తముతోడ వరలు సాయిాశ్వరా ॥
6.
నింబ వృక్షము నీడ నిత్య తపమును జేసి
సర్వ జన సమ్మొాద సామరస్యపు భావ-
మలరు సాయిాశ్వరా మా నమము నీకయా
ఇల గాచు ఇలవేల్ప ఈశ్వరిని బ్రోవరా..॥
3.సరస్వతీవందనం.
------------------------
7.
విద్యలకు కొలువైన విలువ పలుకుల తల్లి
విజయ పథములేలు విశ్వ జన శ్రీ వల్లి
విద్య- బుద్ధుల నెల్ల విశ్వ వేదిక కొసగు
తల్లి శారద నీవె తరుణి బ్రాహ్మ్మీ శివే ॥
8.
నా పుాజలను కొమ్మ నగుమొాము పుాబోణి
వివరములు నాకొసగు విజయ పథ సామ్రాజ్ఞి.
నాదు జిహ్వను నిలచి నను బ్రోవు మాయమ్మ
నలువ కొమ్మా నిత్య నీరాజనములమ్మ ॥
4.అంబికా వందనం.
------------------------
9.
గణ నాధ షణ్ముఖా ఘన పుతృలకు తల్లి
గణనలే లేనట్టి గుణ కల్పవల్లివిగ
గౌరవర్ణముతోడ గౌరివై భాసిల్లు
ఘన సింహ వాహినీ గావు ఈశ్వరి నిలను ॥
10.
దుష్టులను , దైత్యులను దునుమాడి గాచేవు
దశరుాపములతోడ ధరణిలో వెలసేవు.
దివ్య శక్తుల నేలు దీనార్తులను బ్రోవు
ఈశ్వరీ నుత పాద ఈశు రాణివి నీవు. ॥
11.
హిమగిరిసు పుత్రికవు హిమగిరి పురీశ్వరివి
హరుని పట్టపురాణి హరి భగిని పార్వతివి
హంస వాహిని సఖివి హరునర్ధరుాపిణివి
అంబ, జగదీశ్వరిని అహరహము కావవే॥
----------------------------
భగవద్గీత -ఆరంభము.
------------------------------------
1.అర్జున విషాద యొాగము.
--------*-------:-----------------------
1.
ధర్మ క్షేత్రమునందు ధర్మ రక్షణ జేయ ,
పార్ధ సారధి వైన పరమేశుడవునీవు.
2.
స్వఫలా పేక్ష కై స్వజన సంహారమ్ము
జేయనని పార్ధుడదె ధ్యేయమును విడనాడె ॥
3.
వేద సారము మెండు వేల సుాక్తుల నిండు
శ్రావ్య భగవద్గీత కావ్య ఘనుడవునీవు
4.
శ్రీ కృష్ణ రుాపాన శ్రితునర్జునకు నీవు
ఘనయొాగ ములనెంచి గీత బోధించేవు. ॥
5.
నిఖిల లోకోధ్భవుడ నిత్య పరమానంద
నిల కర్మ ఫలములకు నీదె బాధ్యతటంచు
6.
నిస్సహాయత తోడ నిలిచి శస్త్రము విడిన
పార్ధునకు పర తత్వ ఫలము నెరిగించేవు.॥
7.
కులధర్మ ములు వీడు కుటిల మాయలనేలు
కులహీనులౌ, ఖలుల కుాల్చ తప్పదు పార్ధ .
8.
యనుచు పలికెను విభుడు-యదునందనందనుడు.
యుద్ధముకు లెమ్మనెను యుాధమునుఛేధింప॥
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
2. సాంఖ్య యొాగము.
--------------------------------
9..
పోరి గురులను జంపి - పోరు ననుజుల గుాల్చి
పొందురాజ్యములేల ? పొలయు సుఖ మేలా..?
10.
రక్త సిక్తము లైన రాజ్య సంపద లేల..?
రధము తిప్పుము కృష్ణ రణము వీడెదనయ్య ॥
11.
అని పల్కునర్జనుని అజ్ఞానమును బాప
ఆది దేవుడు పల్కె అనునయము తోడ ॥
12..
పుట్టి -గిట్టుటె రీతి పుడమి యందనుచునుా
శాశ్వతము ఆత్మనుచు శంకలనుబాపేను.॥
13.
శోత్రుడవు నీవనుచు శోకింప తగదనుచు
సాంఖ్య యొాగపు నామ శాస్త్ర మును తెలిపేను ॥
14.
సరి దుఃఖ -సుఖములను సమముగా చుాచేటి
స్థిర తత్త్వజ్ఞానియె స్థితప్రజ్ఞుడగుననియె॥
15
కర్తవ్య కర్మలను కడ దాక పాటించి
సమబుద్ధియుక్తుడవై సమరమును సలుపమనె॥
16.
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
--------------------------------------------------------------
3. కర్మ యొాగము.
-------------------------
17.
యొాగముల పాటించి యొాగ కర్మల నేలు
యొాగ నిష్టాపరులు యొాగులిల పార్ధా॥
18.
ఇంద్రియపు లోలుడై ఇలను చింతల పొందు
మానసిక ముాఢుడే మాన మిధ్యాచరుడు ॥
19.
పరమాత్మ ప్రాప్తి నదె ఫలముగా నొందేటి
నిష్ట పుార్ణుడె యొాగి నిత్య సంతుష్టుడు. ॥
20.
ఆశక్తిరహితుడవై ఆచరింపగ కర్మ-
పరమ శ్రేష్టుడ వగుచు పరము నొందెదవు.॥
21.
పరధర్మ గుణములను పాటించుటలు కన్న
స్వీయ ధర్మము లిలను స్వీకరించుటె మిన్న.॥
22.
కామ క్రోధము లిలను కడు పాప ప్రేరణలు
బుద్ధి తోడ విడుమా బద్ధుడవై మెలగుమా॥
23.
జ్ఞానమ్మె శాస్త్రమని జ్ఞానివై మెలగుమని
కర్మ ఆచరణ లిల ఘన లోక హితములని
24.
కర్మలకు బాధ్యుడవు- కర్త నీవని తెలిపి
జగతి కర్మల సలిపి జయమొంద మంటివి ॥
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
--------------------------------------------------------------
----------------------------------------------------------------
4.జ్ఞాన , కర్మ సన్యాస యొాగము.
---------------------------------------------
ధ్యాన యొాగము లనెడు జ్ఞాన, కర్మల ఫలము
ఒక్కటిగ చుాడుమా ఒనరు భావముతోడ.॥
ఏ కాంక్షయుా లేని ఏ ద్వేషములు లేని
కర్మ సన్యాసమ్మె కాంచ ఫల రుాపమ్ము.॥
నిష్కామ కర్మములు నిర్భావ చిత్తులై-
సల్పు సజ్జను లిలను శాంతి పొందెదరు.॥
సర్వత్ర సమభావ సత్య సాధకు లిలను
బ్రహ్మ వేత్తలు బ్రహ్మ నిర్వాణ పాత్రులు॥
ప్రకృతి కర్మల నేలు పెక్కు జన్మలు నీవి
ప్రబలు భవ బంధముల పట్టి జిక్కితి వీవు॥
పెక్కు జన్మలు నావి పెక్కు అవతారములు-.
పేర్మి నెత్తితి నేను పెకిలింప పాపములు. ॥
నాల్గు వేదములైన నాల్గు వర్ణములైన
నడిపించు వాడనుా నట సుాత్రధారుడను ॥
అజ్ఞాన మును వీడి అలరు జ్ఞానము తోడ
కర్తవ్య నిష్టలే కడు శ్రేష్టమని యెంచు.॥
కర్మ తత్వమునెరిగి కర్మ యొాగము తోడ
యుద్ధ సంశిద్దవౌ -- ఉత్తమంబెరిగి ॥
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
--------------------------------------------------------------
5.కర్మ సన్యాస యొాగం.
----------------------------------
కర్మ , సన్యా సములు కనిన రెండును వేరు
కాని రెండిటి ఫలము కల్యాణ దాయకమె॥
అవని రాగ-ద్వేష మధిగమించిన వాని
సాధనల సమకుారు సార బ్రహ్మపు పథము॥
అతఃకరణ సుద్ధి ఆనందయొాగమై
పరమాత్మ తత్త్వ మును పరగు జ్ఞానులగుదురు.॥
బాహ్య విషయములనుచు భోగ విషయములనుచు
చింతన ను చేయకయె చింతా ముక్తుడగును.॥
ఆత్మ స్థిత ధ్యానులు, అ- నాశక్త విషయులై
అక్షయానందమును అనుభవించెదరు.॥
ఏక భావ స్థితులు ఏ మొాహములకును
వివశులేటికి కాక విజయ సాధకులౌదు ॥
చిత్త వృత్తుల జయము స్థిరముగా సాధించి
పరమ శాంతి నొంది పరము నొందెదరు ॥
తామరాకు పై జారు తళుకు బిందువు వోలె
స్వజన చింతన వీడు సఖ సవ్యసాచివై ॥
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥ -------------------------------------------------------------
6.ఆత్మ సంయమ యొాగము.
-----------------------------------------
సంకల్ప త్యాగముల సహనశీలత నొదులు
సాధు చిత్తుడె యగును సన్యాస యొాగిగను॥
సంసార సంద్రాన సాధు చింతన లేని
మనిషి తనకే తాను మిత్రుడును శతృడును.॥
శీతోష్ణ, సుఖ -దుఃఖ శీల,మానావముల
నిశ్ఛలపు స్థితి నేలు నిత్య లగ్నుడె యొాగి॥
చిత్తేంద్రియమ్ములను చిద్బ్రహ్మ ధ్యానమున
లగ్నమై యుంచవలె లక్ష్యసాధకుడిలను ॥
అనంత చైతన్య స్థితు ---- డాత్మ రుాపమును
సకల ప్రాణులయందు సమానమని యెంచును॥
సర్వ భుాతములందు సమ దృష్టి కల్గుటను
పరమ శ్రేష్ఠులు వారు పరమాత్మ రుాపములు॥
పుణ్య పురుషులుపొంది పర స్వర్గ సుఖములను
మరల జన్మింతురుా మహి పవితృలుగాను॥
విరాగులకు జన్మ విధిగ ప్రాప్తంబౌను
దుర్లభమ్మైనట్టి ధన్య యొాగిగ జనును॥
అట్టి యొాగము తోడ ఆత్మ యొాగిగ మనుచు
శ్రధ్ధాళుడవు కమ్ము శ్రేష్ట కార్యము జేయ ॥
అని పలికె శ్రీకృష్ణు డవని అంతర్యామి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
---------------------------------------------------------
7. జ్ఞాన విజ్ఞాన యొాగము.
--------------------------------------
తత్త్వ జ్ఞానపు మహిమ తనిగ తెలిపెద పార్ధ తధ్యాన మగ్నవై తథ్యమ్ముగ వినుమా॥
యొాగమాయను కమ్ము యొాని జన్ములకెల్ల
పరమేశ్వరుని తెలియ పరమ కష్ట తరముగ ॥
రాగద్వేషము వలన రగులు సుఖ- దుఃఖములు
మొాహమును విడలేరు మహి బుద్ధి హీనులును ప్రకృతి పరా, చేతన---- ప్రకృతి జడపరాదులు,
పుట్టుకలు, ప్రళయముల పుార్ణ రుాపిని నేనె ॥
వేద రుాపోంకార వేల గుణ తేజమును
త్రిగుణాత్మ భావముల త్రిగుణతీతుడ నేను ॥
గత, వర్తమానాల గుణ, మొాహ ముక్తులదె
నన్ను శరణని నమ్మి నను చేరెదరు తుదకు ॥
అని పలికె కృష్ణుడు అవని అంతర్యామి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
------------------------------------------------------------
8. శక్షర బ్రహ్మ యొాగము.
---------------------------------------
బ్రహ్మ మనగా నేమి? కర్మ మనగా నేమి?
తెలియ జెప్పెద వినుమ .తెలుసుకొనుమొా పార్ధ॥
స్వ స్వరుాపు జీవాత్మ బ్రహ్మ మన శాశ్వతము
అభ్యుదయ ఉత్పత్తు- లవియె కర్మలు ఇలను॥
అఖిల చరాచరములు అవ్యక్త ప్రకటములు
సుాక్ష్మదేహోత్పన్న సుాన్య లీనములు॥
అధి భుాత, అధి దైవ అధి యజ్ఞ ,జీవాత్మ-
సృష్ట్యాది సారముల సృజనాత్మకుడ నేను॥
చివరి ఘడియల లోన చెదరు మానసు లిలను
ఏ స్మరణ చేయునో ఆ జన్మ పొందెదరు ॥
బ్రహ్మ పథమును ప్రాప్తి బ్రహ్మ యొాగులకునుా
స కామ కర్మయొాగి స్వర్గ లోక వాసిగ..॥
దేవయాన మార్గుల దేహమేలు పరమము
పితృయాన దేహులకు జన్మచక్ర భ్రమణము ॥
అని తెలియుమర్జునా .అక్షరుడ ను నమ్ముమ
పుణ్య ఫలము పొందుమ పరమపదము నొందుమ॥
అని పలికె శ్రీకృష్ణు డవని అంతర్యామి
సార భగవద్గీత సరి పంచమ వేదము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ నను బ్రోవ ॥
------------------------------------------------------------
7. జ్ఞాన విజ్ఞాన యొాగము.
--------------------------------------
తత్త్వ జ్ఞానపు మహిమ తనిగ తెలిపెద పార్ధ
తత్ధ్యాన్న మగ్నవై తథ్యముగ వినుమా॥
యొాగమాయను కమ్ము యొాని జన్ములకెల్ల
పరమేశ్వరుని తెలియ తరముకాదిలలోన ॥
రాగద్వేషము వలన రగులు సుఖ- దుఃఖములు
మొాహమును విడలేరు మహి బుద్ధి హీనులు .॥
ప్రకృతి పరా, చేతన---- ప్రకృతి జడపరాదులు,
పుట్టుకలు, ప్రళయముల పుార్ణ రుాపిని నేనె ॥
వేద రుాప ఓంకార వేల గుణ తేజమును
త్రిగుణాత్మ భావముల త్రిగుణతీతుడ నేను ॥
గత, వర్తమానాల గుణ, మొాహ ముక్తులదె
నన్ను శరణని నమ్మి నను చేరెదరు తుదకు ॥
అని పలికె శ్రీకృష్ణు డవని అంతర్యామి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
------------------------------------------------------------
8. శక్షర బ్రహ్మ యొాగము.
---------------------------------------
బ్రహ్మ మనగా నేమి? కర్మ మనగా నేమి?
తెలియ జెప్పెద వినుమ .తెలుసుకొనుమొా పార్ధ॥
స్వ స్వరుాపు జీవాత్మ బ్రహ్మ మన శాశ్వతము
అభ్యుదయ ఉత్పత్తు- లవియె కర్మలు ఇలను॥
అఖిల చరాచరములు అవ్యక్త ప్రకటములు
సుాక్ష్మదేహోత్పన్న సుాన్య లీనములు॥
అధి భుాత, అధి దైవ అధి యజ్ఞ ,జీవాత్మ-
సృష్ట్యాది సారముల సృజనాత్మకుడ నేను॥
చివరి ఘడియల లోన చెదరు మానసు లిలను
ఏ స్మరణ చేయునో ఆ జన్మ పొందెదరు ॥
బ్రహ్మ పథముయె ప్రాప్తి బ్రహ్మయొాగులకునుా
స కామ కర్మయొాగి సర్గ లోక వాసము..॥
దేవయాన మార్గుల దేహమేలు పరమము
పితృయాన దేహులకు జన్మచక్ర భ్రమణము ॥
అని తెలియుమర్జునా .అక్షరుడ ను నమ్ముమ
పుణ్య ఫలము పొందుమ పరమపదమునొందుమ॥
అని పలికె శ్రీకృష్ణు డవని అంతర్యామి
సార భగవద్గీత సరి పంచమ వేదము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ నను బ్రోవ ॥
------------------------------------------------------------
9.రాజ విద్యా, రాజ గుహ్య యొాగము.
----------------------------------------------------
తలమానికమ్మైన తత్వముత్తమొాత్తము.
సమస్త గోప్య విషయ సత్ శిరో భుాషణము.॥
జగతి భుాత తనిలయము జలపుార్ణ మీ జగతి
నా సంకల్పములివి నాలో నిండున్నవి.॥
కల్పాది సృజనుడను కల్పాంతకుడనేను
కర్మానుసారముా కలిగింతు జన్మలను.॥
అద్యక్షుడను సృష్టికి ఆశక్తి రహితుడను
లోక కల్యాణార్ధ లోకావతారుడను ॥
క్రతు,యజ్ఞ , స్వధ నేను క్రతు వేద సారమును
హోమ క్రియ మంత్రాగ్ని ఓషధీ ఘృతాగ్నిను ॥
సత్తును, అసత్తును నే సర్వ మృత్యు కారకను.
అప్రాప్త యొాగముల ఆరక్షక క్షేమమును ॥
నిష్కామ భక్తితో నిత్యమునర్చించుము
పత్ర ,పుష్ఫ, ఫలములకే ప్రీతినొందు వాడను ॥
క్షణ భంగుర జీవములు క్షణమౌ సుఖ,హితములు
శరణము కోరినవారు సవ్యులు నను చేరెదరు॥
అని పలికె శ్రీకృష్ణ అవనినంతర్యామి
సార భగవద్గీత సరి పంచమ వేదము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ నను బ్రోవ ॥
------------------------------------------------------------
9.రాజ విద్యా, రాజ గుహ్య యొాగము.
----------------------------------------------------
తలమానికమ్మైన తత్వముత్తమొాత్తము.
సమస్త గోప్య విషయ సత్ శిరో భుాషణము.॥
జగతి భుాత తనిలయము జలపుార్ణ మీ జగతి
నా సంకల్పములివి నాలో నిండున్నవి.॥
కల్పాది సృజనుడను కల్పాంతకుడనేను
కర్మానుసారముా కలిగింతు జన్మలను.॥
అద్యక్షుడను సృష్టికి ఆశక్తి రహితుడను
లోక కల్యాణార్ధ లోకావతారుడను ॥
క్రతు,యజ్ఞ , స్వధ నేను క్రతు వేద సారమును
హోమ క్రియ మంత్రాగ్ని ఓషధీ ఘృతాగ్నిను ॥
సత్తును, అసత్తును నే సర్వ మృత్యు కారకను.
అప్రాప్త యొాగముల ఆరక్షక క్షేమమును ॥
నిష్కామ భక్తితో నిత్యమునర్చించుము
పత్ర ,పుష్ఫ, ఫలములకే ప్రీతినొందు వాడను ॥
క్షణ భంగుర జీవములు క్షణమౌ సుఖ,హితములు
శరణము కోరినవారు సవ్యులు నను చేరెదరు॥
అని పలికె శ్రీకృష్ణ అవనినంతర్యామి
సార భగవద్గీత సరి పంచమ వేదము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ నను బ్రోవ ॥
------------------------------------------------------------
10. విభుాతియొాగము.
---------------------------------
జన్మరహితుడననియు జ్ఞాని ఎరుగును నన్ను
వివిధ భావపు గతులు విధి, నాచే కలుగును ॥
స్వయంభుావ మనువులు స్వయమునాదు భక్తులు
సమస్త ప్రాణి కోటుల సంకల్పుడ నేనెగ ॥
నాయందు మనసుంచి నాయందే రమించు
నిత్య ధ్యానులకు నే నిచ్చెద జ్ఞాన ధనము ॥
పరబ్రహ్మవు నీవెగ పరమాత్మవు నీవుగ
నీ తత్త్వము నెరుగను నీ విభుాతి తెలుపుము॥
అను పార్ధుని గని హరి అనునయమున పలికెను
సమస్త ప్రాణ సృష్టి కి సర్వ లయము తాననె ॥
ప్రాణ చైతన్యమును ప్రాణ శక్తిని నేను
ఓంకార శబ్దమయ ఓజ తేజము నేను॥
ఆది మధ్యాంతముల ఆది పురుషుడ నేనె
విశ్వతోముఖుడ నుా విరాట్పురుషుడనే ॥
యొాగ శక్తి అంశను యొాగ కారకుడేను.
తేజ సంభవుడను తేజైశ్వర్యుడను॥
అని పలికె శ్రీకృష్ణ అవనినంతర్యామి
సార భగవద్గీత సరి పంచమ వేదము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ నను బ్రోవ ॥
----------------------------------------------------------
11.విశ్వరుాపసందర్శనయొాగం.
------------------------------------------
తొలగె సంశయమ్ములు తొలగె నజ్ఞాననమదె
నాజన్మ ధన్యముగ నడిపించుమ కృిష్ణా ॥
షడ్గుణైశ్వర్యాల సంపన్న మైయున్న నిజ దర్శనమిడుమా నిఖిలసు లోకాత్మా ॥
ప్రాకృతపు దృష్టి నను పార్ధ చుాడగలేవు
దివ్య దృషిని ఇత్తు దర్శింపు మొా పార్ధ ॥
అని దివ్య రుాపమును ఆది దేవుడు చుాపె
అనంత భ్రహ్మాండము అందు నిండి యుండెను॥
పెక్కు ముఖములు వాని పెక్కు అస్త్ర,కరములు
జగతి నిండుదరములు జంతు,ప్రళయ భయములు॥
వేల భానుల కాంతి వెలుగు విరాట్ రుాపును
గాంచి ధన్యతనొందె ఘనము నంజలులిడెను॥
దుర్నిరీక్ష్యమైన దివ్యరుాపుని గాంచి
పెక్కు భయముతోడ ప్రసన్నుడవు కమ్మనె॥
సౌమ్యముార్తిగ యైన స్వామి రుాపమునుగని
సవ్యసాచి శాంతిగ సంతసించి నమమిడె॥
అట్టి భాగ్యముపొంద అహరహము ధ్యాన్నింతు
అనుచు శరణము వేడె అవనిలోనీశ్వరి ॥
------------------------------------------------------------------
12. భక్తి యొాగము.
------------------------------
అనన్య భక్తి సేవ అత్యంత భక్తి సేవ
ఏది శ్రేష్టమైన దొ ఎంచి చెప్పుము కృష్ణ ॥
సగుణ రుాప ధ్యానులు సర్వ యొాగ శ్రేష్టులు
సమ సమాన దృష్టులు సత్య సిద్ధ యొాగులు ॥
అవ్యక్త పరబ్రహ్మ కాశక్తచిత్తులు
పరగుటకు సాధనలు పరమ కష్టతరములు ॥
మత్పరాయణ భక్తులు అనన్య భక్తి కాములు
నన్ను నమ్ము వారి నే నట్లె ఉద్ధరింతును ॥
అభ్యాస యొాగమదె అత్యంత సులభము
మత్ప్రాప్తికై చేయు మదె సాధన పార్ధా ॥
కర్మ ఫల త్యాగములె కన మిక్కిలి శ్రేష్టము
ఫల త్యాగము చేయుట పరమ శాంతి యొాగము॥
ఏ ద్వేషములు లేని ఏ స్వార్ధములు లేని
మనోబుద్ధి అర్పణుడు మత్ ప్రీతి పాతృడుగ.॥
అని పలికెను శ్రీహరి అర్జునోద్ధారకుడు
ఇల ఈశ్వరీ నుతుడు ఈప్సిత ఫలదాయుడు ॥
--------------------------------------------------------------
12. భక్తి యొాగము.
------------------------------
అనన్య భక్తి సేవ అత్యంత భక్తి సేవ
ఏది శ్రేష్టమైన దొ ఎంచి చెప్పుము కృష్ణ ॥
సగుణ రుాప ధ్యానులు సర్వ యొాగ శ్రేష్టులు
సమ సమాన దృష్టులు సత్య సిద్ధ యొాగులు ॥
అవ్యక్త పరబ్రహ్మ కాశక్తచిత్తులు
పరగుటకు సాధనలు పరమ కష్టతరములు ॥
మత్పరాయణ భక్తులు అనన్య భక్తి కాములు
నన్ను నమ్ము వారి నే నట్లె ఉద్ధరింతును ॥
అభ్యాస యొాగమదె అత్యంత సులభము
మత్ప్రాప్తికై చేయు మదె సాధన పార్ధా ॥
కర్మ ఫల త్యాగములె కన మిక్కిలి శ్రేష్టము
ఫల త్యాగము చేయుట పరమ శాంతి యొాగము॥
ఏ ద్వేషములు లేని ఏ స్వార్ధములు లేని
మనోబుద్ధి అర్పణుడు మత్ ప్రీతి పాతృడుగ.॥
అని పలికెను శ్రీహరి అర్జునోద్ధారకుడు
ఇల ఈశ్వరీ నుతుడు ఈప్సిత ఫలదాయుడు ॥
--------------------------------------------------------------
13. క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగ యొాగము.
---------------------------------------------
క్షేత్రము లెన్నున్నను క్షేత్రజ్ఞుడను నేనే.
క్షేత్రజ్ఞుల తత్త్వము క్షేత్రరుాప విధములు---
బ్రహ్మసుాత్ర పదములు బహు ఇంద్రియ దశలును- ధృతి వికార మయమును ధృడ క్షేత్ర స్వరుాపము ॥
జన్మ జరా దుఃఖాలు జన్మ రాగమొాహములు
విని యుంటివి అవె గద వివిధ దేహ దశలని ॥
ఇంద్రియ వైరాగ్యము ఇల మమతల త్యాగము
మన భావ సు చిత్తుడు మన వికార ముక్తుడు ॥
నిత్యనన్య భక్తుడు నిత్య సుస్థిర చిత్తుడు
సుతత్త్వ జ్ఞానార్హు సత్+అసత్,కతీతుడు॥
గుణానుభవ భావుడు గుణములకు నతీతుడు బహు ఇంద్రియ నిగ్రహ- బాహ్యాంతరశుద్ధుడు
పరమాణు స్వరుాపుడు పలు విధ గోచరుడుా
పరంజ్యోతి రుాపుడు పరమాత్ముడు అతనని ॥.
జ్ఞాన బోధ జేయుచు జ్ఞేయము నెరిగించిన
ఈశ్వరీ నుతుడతడు శ్రీశుడు శ్రీ కృష్ణుడు ॥
-------------------------------------------------------------------
14. గుణత్రయవిభాగయొాగము.
---------------------------------------------
ముాల ప్రకృతి స్థానము మద్బ్రహ్మ స్వరుాపము
జడ సంయమ యొాగము జగ దుత్పత్తి స్థలము .
విశ్వ ప్రకృతి తల్లిగ విత్తు తండ్రి నేనుగ
త్రిగుణ క్షేత్ర మునందు తరలుదు జీవాత్మగ ॥
సత్త్వ గుణము సుఖమగు సర్గ లోక ప్రాప్తము
రజో గుణమశాంతిని రగుల జేయు స్వార్ధము॥
తమగుణమజ్జానము తథ్యమతి ప్రమాదము.
శ్రేష్టమైన కర్మలనే శ్రేష్ఠుడాచరించును.॥
ఇచ్ఛా ద్వేష వికారా- లివి అతీతుకుండవు
.ఆపరబ్రహ్మ ప్రాప్తికి అట్టి వాడు అర్హుడు॥
అని పలికెను కృష్ణుడు అఖండ ఆనందుడు .
ఈశ్వరీ హృన్నిలయ ఇహ, పర అవతారుడు॥
----------------------------------------------------------------
15. పురుషోత్తమప్రాప్తియొాగము.
---------------------------------------------
శాఖోపశాఖలౌ సంసార వృక్షము కు-
ముాలమాదిపురుషుడు ముజ్జగములకీశుడు॥
తిర్యగ్యోనులజను త్రిగుణ దేవ, మనుజులు
తరు శాఖలు, చిగుళ్లు తరు విస్తార కర్మలు ॥
నశ్వర శాఖల తరు నాశము వైరాగ్యము
అట్టి వైరాగ్యుడు అందు పరమపదమును॥
అవ్యయపరమాత్ముడు అతడె వేదవిదితుడు.
క్షర-అక్షర పురుషుడు క్షేత్రజ్ఞుడు సర్వుడు॥
గోప్యమ్మౌ విషయము గోవిందుడు తెలిపెను.
ఈశ్వరిల తరించెను ఈశుని ప్రార్ధించెను ॥
---------------------------------------------------------------
16.దైవాసురసంపద్విభాగయొాగము.
------------------------------------------------------
యొాగ స్థితు జ్ఞానియె యొాగ్య శ్రేష్ట తేజుడు
దురిత బుద్ధి పాపులు దుష్టులు దరి చేరరు .॥
అలోలుప్త్వములును అచాపలత్త్వములు,
అద్రోహము, కపటము అనునవి త్యజించుమా॥
ప్రవృత్తి, నివృత్తి ప్రవర్తనలసురులకు
అపకారులు, కృుారులు అవని మంద బుద్ధులు ॥
కామ ,క్రోధ, లోభము కలుగు నరక ప్రాప్తము
అనర్ధములను విడుము అవని శ్రేష్టవై మను ॥
అని పలికె కృష్ణుడు అవనినంతర్యామి
సార గీతామృతమె సరి పంచమ వేదము ॥
---------------------------------------------------------
15. పురుషోత్తమప్రాప్తియొాగము.
---------------------------------------------
శాఖోపశాఖలౌ సంసార వృక్షము కు-
ముాలమాదిపురుషుడు ముజ్జగములకీశుడు॥
తిర్యగ్యోనులజను త్రిగుణ దేవ, మనుజులు
తరు శాఖలు, చిగుళ్లు తరు విస్తార కర్మలు ॥
నశ్వర శాఖల తరు నాశము వైరాగ్యము
అట్టి వైరాగ్యుడు అందు పరమపదమును॥
అవ్యయపరమాత్ముడు అతడె వేదవిదితుడు.
క్షర-అక్షర పురుషుడు క్షేత్రజ్ఞుడు సర్వుడు॥
గోప్యమ్మౌ విషయము గోవిందుడు తెలిపెను.
ఈశ్వరిల తరించెను ఈశుని ప్రార్ధించెను ॥
---------------------------------------------------------------
16.దైవాసురసంపద్విభాగయొాగము.
------------------------------------------------------
యొాగ స్థితు జ్ఞానియె యొాగ్య శ్రేష్ట తేజుడు
దురిత బుద్ధి పాపులు దుష్టులు దరి చేరరు .॥
అలోలుప్త్వములును అచాపలత్త్వములు,
అద్రోహము, కపటము అనునవి త్యజించుమా॥
ప్రవృత్తి, నివృత్తి ప్రవర్తనలసురులకు
అపకారులు, కృుారులు అవని మంద బుద్ధులు ॥
కామ ,క్రోధ, లోభము కలుగు నరక ప్రాప్తము
అనర్ధములను విడుము అవని శ్రేష్టవై మను ॥
అని పలికె కృష్ణుడు అవనినంతర్యామి
సార గీతామృతమె సరి పంచమ వేదము ॥
---------------------------------------------------------
17. శ్రధ్ధాత్రయవిభాగయొాగము.
----------------------------------------------
స్వభావజమౌ శ్రద్ధ సంస్కారోత్పన్నము.
విరుద్ధ కర్మ చేయరు వివేకము గలవారు ॥
ఆరోగ్య పానములు ఆయు వృద్ధి కరములు
సార భోజనాదులు సాత్వికులకు ఇష్టము .॥
ఆసురస్వభావులు ఆత్మ క్లేశమిడుదురు.
కృత్యాసుర సేవల కృశింపజేయువారు.॥
రాజసు లేలు ఋచులు రోగోత్పన్నములుా
అపవిత్ర పదార్ధము అవె తామసులిష్టము ॥
శాస్త్ర విహిత కర్మలు శ్రద్ధ రహిత యజ్ఞము.
గురు, బ్రాహ్మ్మణ సేవలు దేహ సౌచ తపములు॥
అనిశ్ఛిత స్థితి కార్య----- మధృవమని అందురు.
శ్రేష్టాలోచన తో చేయు దానము శుభము.॥
ఓం -తత్ -సత్ ల పేర్ల ఓజ రుాప బ్రహ్మవు.
వేద మంత్ర విధములు శ్రేష్ట సన్మార్గములు ॥
సార గీతామృతమె సరి పంచమ వేదము ॥
అది పలికిన కృష్ణుడు అవనినంతర్యామి ॥
---------------------------------------------------------------
18. మొాక్ష సన్యాసయొాగము.
------------------------------------------
కామ్య కర్మలు ఇలను కర్మఫల త్యాగమని,
తప ,యజ్ఞ , చర్యలుా త్యాజ్యము కావనిరి--॥
నిషిద్ధకర్మాచరణ సిశ్చయ త్యాగుచితము
శాస్త్రవిహితాచరణ శాస్త్రత్యజితముగాదు. ॥
శుభ కర్మాచరులను పుణ్య దైవమందురు.
అకృత బుద్ధిపరులు అపవితృలు అగుదురు.॥
శుద్ధ తత్త్వ గుణుడు శుఖ సంశయ రహితుడు.
కర్మ ఫల త్యాగుడుా కన సత్య సుపుార్ణుడు ॥
ప్రారబ్ద హింస జరుగ ప్రబల పాపమంటదు.
స్వార్ధ రహిత హింసయు స్వీయపరాధము కాదు॥
కర్మాచరుడె కర్త.. కర్మాచరణ కర్మ.
నశ్వరము శరీరము నడుమాత్మ శాశ్వతము॥
ఈ విధి శాస్త్రము గని ఈశ్వరభావముగొని
జ్ఞాన పరా నిష్టతో జ్ఞానుడవై మెలగుము॥
పరమాత్ముడు చెప్పు పలు శ్రేష్ట యొాగములు
పలువిధ గుణ కర్మలు పలు తత్త్వ,శాస్త్రములు॥
సవ్యమెరిగి పార్ధుదు సంశయముల వీడెను
సన్ముకుళిత హస్తుడై సమర సిద్ధుదాయెను॥
ఇయ్యది భగవంతుని ఇహ అమృత భోధకము
ఈశ్వరి రచనామృత- మిల సార్ధక యొాగము॥
------------------------------------------------------------------
ఓం తత్సత్.
శాంతి శాంతి శాంతిః.
--------------------------
-రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
----------------------
"గీతామహత్యము"
సంశయమ్ముల వీడి సద్విధుల కర్మలను
ఆచరింపుము పార్ధ ఆలసింపకు మింక ॥
ప్రకృతి కర్మల నేలు పెక్కు జన్మలు నీవి ॥
ప్రబలు భవ బంధముల పట్టి జిక్కితి వీవు
జన్మలెే లేనట్టి జన్మరాహిత్యుడను
యొాగ మాయను నేను, యొాగ పుాజ్యుడను॥
ఆది నారాయణుడ , అవతార పురుషుడను
యుగ యుగము జన్మించు, యుగపురుషుడను నేను--
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
-------------------------------------------------
జ్ఞాన కర్మలు జ్ఞాన సన్యాస యొాగముల
సార మెరిగీనీవు సాధించు కార్యముల॥
సంశయమ్ముల వీడి సద్విధుల కర్మలను
ఆచరింపుము పార్ధ ఆలసింపకు మింక ॥
----------------------------------------------------------
==== గీతాసార ఫలము.====
--------------------------
కురుక్షేత్రము నందున కుల నాశన భయమున
శస్త్రములను విడచిన సవ్యసాచి నదె గని ॥
స్వస్థత నిడు కావ్యము సకల శాస్థ్ర ధర్మము
భవ సాగర తరణము భక్తి, కర్మ యొాగము ॥
తానుగ హరి జెప్పిన తత్త్వ ,జ్ఞాన సార-
గీర్వాణ విశేషము గీతానుకరణమును
విష్ణుడాది గురువుగ విన్న దొక బాలునిగ
గీతామృత క్షీరము గ్రోలె నదే పార్ధుడు. ॥
-----------------------------------------------------------------
కర్తవ్య నిష్టలను కర్మయొాగమ్ములను
కాచి, వడపోసినా కఠిన నగ్న సత్యము ॥
పంచమ శుభ వేదము పాప , శోక హరణము
పరమ పావనుడైన - పరమేశుని అభయము॥
సర్వము తానేనను సర్వేశుని బోధన
స్థిత-ప్రజ్ఞత నిండిన స్థిరమైన సాధన ॥
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
---------------------------------------------------------
శ్రధ్ధ గీత చదివిన ముగ్ధుడనై విందును
ఎచ్చోటను చదివిన అచ్చోటనె ఉందును ॥
సర్వ తీర్ధముల ఫలములు సంప్రాప్తము సత్యము
అజ్ఞానము తొలగును సుజ్ఞానము పెరుగును॥
తామర రేకు నంటని హిమ బిందువు చందము
బహు విధముల కర్మల బడయు పాప మంటదు.
గ్రంధము చే బట్టిన ఘన శ్లోకము చదివిన
సార నదీ సంగమ స్నాన పుణ్య ఫలితము ॥
----------------------------------------------------------------
ఆతత పారాయణ అలరుచు నిల చేసిన
పుాతంబై పుణ్యము పొందుదు రిల తథ్యము ॥
ఏకాధ్యాయ పఠన సాకల్యముగ చదువ
చీకు చింత తొలగును చిర పాపము తొలగును॥
గీతను పఠియించియు వీతదేహులైన చొ
పునర్జన్మ లేని పురము ప్రాప్తి నొందును ॥
అనుచు పలికెను హరియె ఆదరమ్మున నిలచి
ఫలగీత మహత్యము పలు బోధల సత్యము ॥
-----------------------------------------------------------
పదునెనిమిదధ్యాయ పరమ పావన పథము
కర్మలంటని విధము కరుణ జెప్పిన విధము ॥
వివిధ యొాగమ్ములను విష్ణు డదె వివరంచె
పలు జ్ఞాన విషయముల పార్ధు పుణ్య ఫలముగ॥
సత్ గీత సారమ్ము సతత శుభ దాయకము
సన్మోక్ష ప్రాప్తికై సాధమిది సత్యమని..॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
-------------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
---------------------
" గీతా మంగళ హారతి."
---------------------------------------------------------------
జయము భగవద్గీత జయము జగదధి నేత..
జగతి జయముల నొసగు జనని జ్ఞాన విధాత ॥
॥ జయము ॥
కర్మ- మర్మములెల్ల కామ,మొాహపు వలల
మసలేటి మనుజులకు మహిని సత్పథములిడి ॥
అసుర భావము గొట్టి అలరు ప్రేమను జుట్టి
అందరికి మంగళము నలరించు మా తల్లి ॥
॥ జయము॥
రాగాది -ద్వేష- భయ రోగముల పోగొట్టి
సార,సంతత,సుఖపు శాంతులందరికినిడ
సాక్షి శ్రీ హరి తనుగ సఖ పార్ధ సారధిగ
నిలచి చెప్పిన ఘనత నీదెగద నీరదా
॥ జయము॥
వేద సారము నిండు వేద యొాగము నిండు
విశ్వ మొాదిని గాన విజ్ఞాన. వన ఖనీ...
విందుగా వేదముల వివరముల బోధించు
జ్ఞాన సారము నీవు జగదీశ్వరిని కావు॥
------ <॥ జయము॥
-----------------------------------------------------------+
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
---------------------
==== గీతాసార ఫలము.====
" గీతామహత్యము".
------------------------------------------------------------------
పుణ్య ఫలముల నిచ్చు పురుషోత్తము బోధల-
పార్ధునకు వీడినవి ప్రబలు సందేహములు॥
పరవశమ్మున పార్ధు ప్రభుని కిడ అంజలులు
ఫల మహత్యము జెప్పె పరమాత్మ పార్ధునకు ॥
జగతిని దుష్కర్మలు జీవుల ప్రారబ్దములు
జన్మ కర్మ ఫలములు జనన మరణ గతులు॥
అన్నిటికి ముాలమేను ఆది నారాయణుడ ॥
అవతార పురుషుడను అవని జనోద్ధరుడను ॥
----------------------------------------------------------------
సంశయమ్ముల వీడి సద్విధుల కర్మలను
ఆచరింపుము పార్ధ ఆలసింపకు మింక ॥
యొాగ మాయను నేను, యొాగ పుాజ్యుడను॥
యుగ యుగము జన్మించు, యుగపురుషుడనేనని--
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
-------------------------------------------------
కురుక్షేత్రము నందున కుల నాశన భయమున
శస్త్రములను విడచిన సవ్యసాచి నదె గని ॥
స్వస్థత నిడు కావ్యము సకల శాస్థ్ర ధర్మము
భవ సాగర తరణము భక్తి, కర్మ యొాగము ॥
తానుగ హరి జెప్పిన తత్త్వ ,జ్ఞాన ఫలము-
గీర్వాణ విశేషము గీతానుకరణమును
విష్ణుడాది గురువుగ విన్న దొక బాలునిగ
గీతామృత క్షీరము గ్రోలె నదే పార్ధుడు. ॥
-----------------------------------------------------------------
కర్తవ్య నిష్టలను కర్మయొాగమ్ములను
కాచి, వడపోసినా కఠిన నగ్న సత్యము ॥
పంచమ శుభ వేదము పాప , శోక హరణము
పరమ పావనుడైన - పరమేశుని అభయము॥
సర్వము తానేనను సర్వేశుని బోధన
స్థిత-ప్రజ్ఞత నిండిన స్థిరమైన సాధన ॥
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
---------------------------------------------------------
శ్రధ్ధ గీతను చదువ ముగ్ధుడనై విందును
ఎచ్చోటను చదివిన అచ్చోటనె ఉందును ॥
సర్వ తీర్ధముల ఫలములు సంప్రాప్తము సత్యము
అజ్ఞానము తొలగును సుజ్ఞానము పెరుగును॥
తామర రేకు నంటని హిమ బిందువు చందము
బహు విధముల కర్మల బడయు పాప మంటదు.
గ్రంధము చే బట్టిన ఘన శ్లోకము చదివిన
సార నదీ సంగమ స్నాన పుణ్య ఫలితము ॥
----------------------------------------------------------------
ఆతత పారాయణ అలరుచు నిల చేసిన
పుాతంబై పుణ్యము పొందుదు రిల తథ్యము ॥
ఏకాధ్యాయ పఠన సాకల్యమ్ముగ చదువ
చీకు చింత తొలగును చిర పాపము తొలగును॥
గీతను పఠియించియు వీతదేహులైన చొ
పునర్జన్మయు లేని పదము ప్రాప్తి నొందును ॥
అనుచు పలికెను హరియె ఆదరమ్మున నిలచి
ఫలగీత మహత్యము పలు బోధల సత్యము ॥
-----------------------------------------------------------
పదునెనిమిదధ్యాయ పరమ పావన పథము
కర్మలంటని విధము కరుణ జెప్పిన విధము ॥
వివిధ యొాగమ్ములను విష్ణు డదె వివరంచె
పార్ధు పుణ్య ఫలముగ పలు జ్ఞాన విషయముల॥
సత్ గీత సారమ్ము సతత శుభ దాయకము
సన్మోక్ష ప్రాప్తికై సాధనిది సత్యమని..॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
-------------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
---------------------
" గీతా మంగళ హారతి."
---------------------------------------------------------------
జయము భగవద్గీత జయముజగ,జన ప్రీత..
జగతి జయముల నొసగు జనని జ్ఞాన విధాత ॥
॥ జయము ॥
కర్మ- మర్మములెల్ల కామ,మొాహపు వలల
మసలేటి మనుజులకు మహిని సత్ పథములిడు ॥
అసుర భావము గొట్టి అలరు ప్రేమను జుట్టి
అందరికి మంగళము నలరించు మా తల్లి ॥
॥ జయము॥
రాగాది -ద్వేష- భయ రోగముల పోగొట్టి
సార,సంతత,సుఖపు శాంతులందరికినిడ
సాక్షి శ్రీ హరి తనుగ సఖ పార్ధ సారధిగ
నిలచి చెప్పిన ఘనత నీదెగద నీరదా
॥ జయము॥
వేద సారము నిండు వేద యొాగము మెండు
విశ్వ మొాదిని జ్ఞాన విజ్ఞాన. ధన దాత...
విందుగా వేదముల వివరముల బోధించు
జ్ఞాన సారము నీవు జగదీశ్వరిని కావు॥
------ <॥ జయము॥
-----------------------------------------------------------+
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
---------------------