శీర్షిక : మనుజ తెలుసు కొనుమ మంచి మాట .
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆటవెలది..
1
కోర్కె లుండ వచ్చు కోర తగిన యంత
తీరు కొలది కోర్కె తీరు హెచ్చు
కోర్కె తీరకున్న క్రోధంబు హెచ్చుగా
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
2.
ఆశ పోతు తనము ఆశయ లోపమ్ము
కలుగ జేయు నదియె కడుని రాశ
కడకు కోర్కె తీర కాని పనుల జేయు
లంచ గొండి యైన లక్ష ణముల ॥
3.
పులిని జుాచి నక్క పుార్తివాతల దేలు
చంద మదియె గాద చాలు ఆశ
స్వార్ధ గుణము పెరుగు స్వస్థతేలడు ప్రాణి
మనసు మలిన మౌను మహిని మనుజ ॥
4.
కడకు పతన మొందు కర్మ మిగులు నీకు
మితము జీవి తమ్ము మిగులు భువిని
కోర్కె యున్న మనిషి కోల్పోవు సుఖమును
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
5.
విద్య లెన్నొ నేర్చి వినుతి కెక్కుము నీవు
జ్ఞాన ధనులు చెడరు జగము నందు
సాహితీ వనమదె సరికోర్కె విహరింప
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
6.
చిన్న తనము యంచు చిన్నతప్పులుజేయ
తప్పు లొప్పు లౌన తప్పు తప్పే.
తప్ప లెంచ నీక తగురీతి మనుటకై
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
7.
విషయ వినయము లవి విద్య తోడనెవచ్చు
సార విద్య నబ్బు సభ్య తిలను.
మంచి మాట నోట మంది మెచ్చిన బాట
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
8.
తల్లి తండ్రి గురువు తగురీతి బోధించు
చక్క నైన మాట చద్ది ముాట.
అనుభవాలు నేర్పు నవెగాద సుఖబాట
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
9.
ప్రథమ పాఠ శాల ప్రారంభ మింటితో
తోడు తల్లి దండ్రె తొలి గురువులు.
గారవించుమెపుడు ఘనమైన రీతిలో
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
10.
సార మైన బ్రతుకు సజ్జనుండదె కోరు.
సద్గుణములు నేర్వ సమయ మిడుమ.
సత్య మేగ జయము సచ్చరిత యెధనము
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
********************************
11
చిన్న పిల్ల లింట చిందులే యుచునున్న
ముచ్చటౌను మనకు ముద్దుమీర.
మాయ లేని వయసు మంచి మాటలు నేర్పు
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
12.
కట్టు బొట్టు తీరు కడు సభ్యతలకు తోడు
భరత భుామి కీర్తి బడయు వెలుగు
సాంప్రదాయ ములవి సరిధర్మ పథములు
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
13.
చిన్న వయసయ లోనె సిగ్గు యెగ్గులు నేర్వ
లోక మందు మసల లోటు రాదు.
మితము మాటలాడ మించుగౌ రవమీకు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
21.
శుద్ధి లేని మాట శుభము నీకదికాదు
మనసు లేని యాత్ర మహిని వమ్ము ॥
బుద్ధి లేని మనసు బుధజను లనుబాయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
22.
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
పెద్ద వారి మాట చద్ది ముాట
పెరుగ నీదు విలువ పెంచు జ్ఞాన ధనము
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
23.
పట్టి పట్టి జుాచి పరధర్మ జులరోసి
పెంచ బోకు రణము నెంచు విధము
మానవత్వ మదియె మనిషి ధర్మ మిలను
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
24.
తేనె లొలుకు పలుకు తేటగీ తులవిందు
తెలుగు భాష మనది తెలుగు వెలుగు
దేశ భాష , నిండు దేశ భక్తియె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
25.
పచ్చ దనము లెేక ప్రకృతి వికటించ
ప్రబలె రోగ బాధ ప్రజల లోన
కండ్లు విప్పు మయ్య గావ పుడమి నీవు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
26.
అడుగు వదల నట్టి ఆకాస హార్మ్యాలు
తాగు నీరు మురిగె తావు లేక
జనులు పెరుగ పేరు కలుషితమ్ములుచాల
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
27.
కోరి చెట్లు గొట్టి కొండ బండలు జేసి
కుార్చునున్న కొమ్మ కుాడ నరుకు
ముార్ఖుడైన మనిషి ముందడుగెటులేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
28.
గాలి నీరు లేక గతక గింజలు రాక
మహిని బ్రతుకు లాయె మట్టి పాలు.
భావి బంగరు భరత భావించి అడుగేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
29.
డబ్బు డబ్బు యంచు గబ్బులో కాలిడీ
కడుగ నీరు లేక కలత చెందు
కడకు సుఖము లేని కలిమి లేటికి నీకు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
30.
పాడి పంట లెల్ల పరుల కమ్మిన కీడు
పట్టి గొట్టు నిన్ను పట్టు బట్టి
మాతృ భుామి నీది మర్మ మేటికి నీకు
మనుజ తెలుసుకొనుము మంచి మాట॥
********
మహతీ సాహితీ కవి సంగమం .
28 / 10 / 2022.
అంశం : ఐచ్ఛికం .
శీర్షిక : మనుజ తెలుసుకొను మంచి మాట.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర.
31.
బ్రాహ్మణత్వ మిలను బహుదార్ల బ్రతుకాయె
నిలువు దోపి డీలె నిత్య పుాజ
పలుకసత్యమాడు పాపమేటికి నీకు
మనుజ తెలుసుకొనుము మంచిమాట.॥
32.
పట్టి కుాటి కొరకు పరుల పంచను జేరు -
పరువు లేని బ్రతుకు పబ్బ మేల ॥
సొక్కు కృషిని పొందు సోకు సౌఖ్యము మెండు.
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
33.
పలుకు మంచి మాట పరుల కింపగు బాట
పెక్కు మంత్ర ములవి పెంచు సిరులు
పలుకు శాంతి నేల పలుధర్మ శాస్త్రాలు
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
34.
ప్రాయ మపుడు జేయు పలు ధర్మ కర్మలుా
పెంచు పుణ్య మవియె పేర్చు నిధులు
గురుని గౌరవించి గుణిగ పొందుము విద్య
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
35.
పుట్టి బ్రతుకు రీతి, పుణ్య సంస్కృతి నీతి
తెలుసు కొనుము యిలను తెలియ కున్న
జ్ఞాను లిడిన గ్రంధ జ్ఞానవిద్యలబాట
మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
36.
చావు పుట్టు కలిల చరిత తప్పని బాట
బ్రతుకు చావు లవియె బ్రహ్మ రాత
కుాడి రావు నేవి ముాడినంతనెజీవి
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
37.
మనిషిలో నసురుడు మంచి బాటను మార్చు
చదువు బుద్ధి నిచ్చు చరిత నిలువ.
మమత నిండు బ్రతుకు మహిలోన గెలుపురా
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
38.
నాది నీది యనుచు నట్టింట వాదములు
పొంచి యున్న నాగు పోలు తగవు
కాటు వేయు నెపుడొ, కడదేర్చు విసమురా
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
39.
మంచి చెడులు రెండె మనిషిజా తికియుండు
జాతి మతము లవియె జగతి కల్ల
మనుజు లొక్క టేగ మహినిమనగనెంచ
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
40.
విద్య తోడ వచ్చు విశ్వమేలెడు శక్తి
జ్ఞాన సాధనమ్మె జ్ఞాను లెంచు.
సార గీత అదియె సాక్షి కర్మల బోధ
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
41.
చీక టున్న చోటె చీల్చి వెలుగు నిండు.
గేలి చేయు చోటె గెలుపు విందు.
లోక రీతి తెలిసి లోపమ్ము లనువీడు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
42
పలుకు మన భాషను పాటించు సంస్కృతిని
పుడమి జన్మ మనది మన తల్లి భారతి
పేరు పేరున శుభము వాడ వాడలు ఘనము
ప్రజ్ఞాశాలుల జ్ఞాన విద్య మేధల గనుము ॥
43
పెరుగు చద్ది ముాట పెద్దవారల మాట
పేచి వలదు చదువ పెద్దబాలశిక్ష
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
పోరు పెట్టకెపుడు జోరు నెపుడు ॥
44
పట్టి గౌరవించు మన జన్మ భుామిని
పాటించు తల్లిదండ్రి జెప్పేటి మాటను.
పదములంటీ గురుల ఆశీస్సులను గొనుము
పలుక మంత్రములివియె పలుధర్మాచరణములు ॥
45
పొందినట్టి జన్మ సార్ధకతను పొంద
పాల నమ్ము జేయు పద్ధ తులను
అంది నట్టి సుఖము ఆనడత ఫలమురా
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
46
పట్టి పట్టి జుాచి పరధర్మ ములరోసి
పెంచ బోకు రణము నెంచు విధము
మహిని జాతి యొకటె మనిషి ధర్మ మొాకటె
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
47
పరుల ధర్మము లంచు పరుషమా టలు మాను
పరగ జాతులు వేరు ధర్మంబు లొక్కటే
పలుక సుభాషితములు పెరుగు మమత ॥
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
అంశం : నీతి.
"మనుజ తెలుసు కొనుమ మంచి మాట" ॥
శీర్షిక :
"మనుజ తెలుసు కొనుమ మంచి మాట" ॥
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర.
48
పొల్లు మాట లాడి పోట్లాటలను దెచ్చు
యట్టి చెడ్డ గుణము యవని చేటు
మంచి నడత తోడ మహిలోన మనుమయ్య.
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
49
మితము మాటలాడి మీరబో కుమహద్దు
హింన పడని మాట హితవు నీకు.
అతిగ మాటలాడ ఆదరణ కరువౌను.
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
50
అమ్మ అక్క చెల్లి యనురక్త బంధమ్ము..
లాదరింతువు గాద యవని నీవు
యెదుటి, స్త్రీలను గన యేటికిీ మేలము
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
51
ఆడ పిల్ల లింటి, అమ్మతల్లులు వారు
శక్తి రుాపు దాల్చు .శతృ వెదుట .
వారు శాపము నిడగ వదలిపోవు సిరులు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
52
చీక టున్న చోటె చీల్చి వెలుగు నిండు.
గేలి చేయు చోటె గెలుపు విందు.
లోక రీతి తెలిసి లోపమ్ము లనువీడు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
53
మనిషి జన్మ మెత్తు మదిని మర్మము లేక
కల్మషమ్ము లిడని కాంతి మనసు
పెరిగి నపుడు బుద్ధి పెడదోవ నదెబట్టు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
54
చదువు లెన్ని యున్న చరియించు నీతీరు
నీదు బాట నెంచు నీడ వలెను
వ్యసన పరుల తోడ వ్యవహరించుట చేటు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
55
మానవత్వ మదియె మనిషి భుాషణ మౌను.
పరుల బాధ నెరిగి పలుకు మెపుడు
నీవు జేయు కర్మ నీవెంటె వచ్చురా
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
56
తల్లిదండ్రు లిలను తలచు వేల్పులు నమ్ము
తీర్చు ఋణము నీవు తీరు గాను
జగతి నీదు భవిత జన్మదా తల భిక్ష
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
57
ఆతివ అబల యనెడు ఆలోచనసలొద్దు
అబల కాదు యామె ఆది శక్తి
అడుగు లోన యడుగు ఆమెతో డుగనేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
58
మహిని పొందు ఘనత మందిలో నొకడిగ
సభ్య తెరిగి మసలు సజ్జనునిగ
మంచి పేరు పొందు మనిషివిలువె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
1️⃣9️⃣✅
పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు.సంస్కార వంతుడే
*మనుజ తెలుసుకొనుమ మంచిమాట*
మకుటం/శీర్షికతో..
మీరు రాసిన పద్యాలు చాలా బాగున్నాయి.. ధన్యవాదాలు మరియు అభినందనలు..
👏👏👏💐💐💐🙏🙏🙏