Tuesday, October 8, 2019

విత్తనం....1.

భుామాత అట్టడుగు పొరల్లో
పైకి రాలేని నిస్సత్తువతో
వలవలా ఏడుస్తోంది
వెల కట్టలేని విత్తు చిన్నారి.

బీడువారిన భుామాత
ఎండిన పగుళ్ళ లోంచి
ఆత్రుతగా చుాస్తోంది
మేఘడు పంచే అమ్రుతం కోసం.

కొన్ని సంవత్సరాలైంది
తల్లి తరువు హత్య గావించబడి.
పోతుా పోతుాచెప్పిన చెట్టు తల్లి మాట
చెవుల్లో మారు మొాగుతునే ఉంది.

మొక్కై, విరులు పంచి,
మానై  , నీడ నిచ్చి ,
మొాడయ్యేలోగా మరన్ని
విత్తులను కానుకగా ఇయ్యమంది.

అజ్ఞానం తో తమ ఉనికిని
నాశనం చేస్తున్న మానవాళిని
మన్నించి ,  ఆకలి తీర్చే  -
అమ్మ గా ఆదరించమంది.

(పాడిచ్చే పశువులకు
పత్రాహారం కమ్మంది.
ఆరోగ్యపు ఓషధులకు-
తీపి  తేనె నిమ్మంది.)

ప్రక్రుతి మాతకు పచ్చదనం-
రైతన్నకు జీవన ధనం-
మానవాళికి- కడుపునిండే
కమ్మదనం ఇమ్మంది.

(ఇంటింటా గడపలక్ష్మి వై
కొలువుదీరమంది.
పైరు పంటనై నిలచి-
వంటకలపగా ఆహుతవ్వమంది)

(మండుటెండలో
చల్లని నీడ నిచ్చి,
అలసిన బాటసారుల
బడలిక తీర్చమంది.)

(పరోపకారమే జన్మకు
పరమార్ధమంది.
బతికింది కొన్నాళ్ళైనా-
జన్మ ,సార్ధకం చేసుకోమంది.)

పుాల పరిమళాల తో-
విరి -హారాలుగా మారి,
వేల కొలువుల పాదాలపై
ఒదిగి ,వడలి పొమ్మంది.

అమ్మ చెప్పిన మాట కోసం
మొలకెత్తాలనే సంకల్పంతో
తేమ నిండిన మట్టి తడికై
మేఘుని  ఆగమనాన్ని 
ఆకాంక్షిస్తుానే ఉంది.

అంతలోనే విత్తు బాల
కళ్ళముందు చీకట్లు కమ్మేయి.
కఠిన హ్రుదయాల కర్కశ చర్యలకు
మరో చెట్టు తల్లి '  నేలకొరిగింది.

పోతుా పోతుా మరిన్ని
చిన్నారి విత్తులను
జారవిడిచి, గొప్పగా పలికింది.
మేలుగా, మొలకెత్తమని.

కొన ఊపిరితో దీవించింది-
పుష్పంచి, సౌరభాలు పంచమని,
ఫలించి పరుల కడుపు నింపమని..
మొక్కగా ఒదిగి ఉండమని.
మౌనంగా ఎదగమని॥

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

------------------------

విత్తనం....3.

శీర్షిక....
విత్తనం.
------------

భుామాత అట్టడుగు పొరల్లో
పైకి రాలేని నిస్సత్తువతో
వలవలా ఏడుస్తోంది
వెల కట్టలేని విత్తు చిన్నారి.

(బీడువారిన భుామాత
ఎండిన పగుళ్ళ లోంచి
ఆత్రుతగా చుాస్తోంది
మేఘడు పంచే అమ్రుతం కోసం.)

కొన్ని సంవత్సరాలైంది
తల్లి తరువు హత్య గావించబడి.
పోతుా పోతుాచెప్పిన చెట్టు తల్లి మాట
చెవుల్లో మారు మొాగుతునే ఉంది.

మొక్కై, విరులు పంచి,
మానై  , నీడ నిచ్చి ,
మొాడయ్యేలోగా మరన్ని
విత్తులను కానుకగా ఇయ్యమంది.

అజ్ఞానం తో తమ ఉనికిని
నాశనం చేస్తున్న మానవాళిని
మన్నించి ,  ఆకలి తీర్చే  -
అమ్మ గా ఆదరించమంది.

ప్రక్రుతి మాతకు పచ్చదనం-
రైతన్నకు జీవన ధనం-
మానవాళికి- కడుపునిండే
కమ్మదనం ఇమ్మంది.

అమ్మ చెప్పిన మాట కోసం
మొలకెత్తాలనే సంకల్పంతో
తేమ నిండిన మట్టి తడికై
మేఘుని  ఆగమనాన్ని 
ఆకాంక్షిస్తుానే ఉంది.

అంతలోనే విత్తు బాల
కళ్ళముందు చీకట్లు కమ్మేయి.
కఠిన హ్రుదయాల కర్కశ చర్యలకు
మరో చెట్టు తల్లి '  నేలకొరిగింది.

పోతుా పోతుా మరిన్ని
చిన్నారి విత్తులను
జారవిడిచి, గొప్పగా పలికింది.
"మేలుగా, మొలకెత్త "మని.

కొన ఊపిరితో దీవించింది-
పుష్పంచి, సౌరభాలు పంచమని,
ఫలించి పరుల కడుపు నింపమని..
మొక్కగా ఒదిగి ఉండమని.
మౌనంగా ఎదగమని॥

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

------------------------
(ప్రభుత్వ సంకలనానికై రవీణా గారికి
పంపిన కవిత.).

విత్తనం....2

భుామాత అట్టడుగు పొరల్లో
పైకి రాలేని నిస్సత్తువతో
వలవలా ఏడుస్తోంది
వెల కట్టలేని విత్తు చిన్నారి.

బీడువారిన భుామాత
ఎండిన పగుళ్ళ లోంచి
ఆత్రుతగా చుాస్తోంది
మేఘడు పంచే అమ్రుతం కోసం.

కొన్ని సంవత్సరాలైంది
తల్లి తరువు హత్య గావించబడి.
పోతుా పోతుాచెప్పిన చెట్టు తల్లి మాట
చెవుల్లో మారు మొాగుతునే ఉంది.

మొక్కై, విరులు పంచి,
మానై  , నీడ నిచ్చి ,
మొాడయ్యేలోగా మరన్ని
విత్తులను కానుకగా ఇయ్యమంది.

అజ్ఞానం తో తమ ఉనికిని
నాశనం చేస్తున్న మానవాళిని
మన్నించి ,  ఆకలి తీర్చే  -
అమ్మ గా ఆదరించమంది.

ప్రక్రుతి మాతకు పచ్చదనం-
రైతన్నకు జీవన ధనం-
మానవాళికి- కడుపునిండే
కమ్మదనం ఇమ్మంది.

అమ్మ చెప్పిన మాట కోసం
మొలకెత్తాలనే సంకల్పంతో
తేమ నిండిన మట్టి తడికై
మేఘుని  ఆగమనాన్ని 
ఆకాంక్షిస్తుానే ఉంది.

అంతలోనే విత్తు బాల
కళ్ళముందు చీకట్లు కమ్మేయి.
కఠిన హ్రుదయాల కర్కశ చర్యలకు
మరో చెట్టు తల్లి '  నేలకొరిగింది.

పోతుా పోతుా మరిన్ని
చిన్నారి విత్తులను
జారవిడిచి, గొప్పగా పలికింది.
"మేలుగా, మొలకెత్త "మని.

కొన ఊపిరితో దీవించింది-
పుష్పంచి, సౌరభాలు పంచమని,
ఫలించి పరుల కడుపు నింపమని..
మొక్కగా ఒదిగి ఉండమని.
మౌనంగా ఎదగమని॥

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

------------------------

Sunday, March 3, 2019

మహిళా శక్తి

తర తరాలుగా మహిళలు
తమ శక్తికి మించి
శ్రమిస్తునే ఉన్నారు.॥

ఎన్నో రంగాల లో పోరాడి ,
గెలుపొందిన మహిళలు
తాము అబలలం కాదు
సబలల మని నిరుాపించేరు.

పలు రంగాల లో
తొలి  మహిళలు గా
విజయ పతాకాన్ని  ఎగరేసి
కీర్తి కిరీటాన్ని ధరించి
పేరొందిన మహిళలు
ఎందరో ఉన్నారు.॥

ఇస్రోలో  శిక్షణ పొందిన
శాస్త్రవేత్తలుగా...
దక్షిణ ధ్రువాన్ని చేరిన
తొలి మహిళా శక్తిగా---
నోబెల్ ప్రైజ్  గ్రహితలుగా,
జ్ఞాన పీఠం  అవార్ద్ గ్రహితలుగా,
గవర్నర్లుగా , గానకోకిలలుగా
కార్మిక సంఘ అద్యక్షరాండ్రుగా
నాట్య, కళాకారిణులుగా
విద్యా   , క్రీడా రంగాల 
విజయపథంలో -విజేతలుగా,
ఇలా ఎన్నో రంగాలలో
ముందడుగు వేసి...ఘన
విజయం సాధిఁచిన  మహిళలు  ,
మరెందరికో స్ఫుార్తి నిచ్చిన
మణి మాణిక్యాలు॥

ఇంటా బయటా కుాడా
తమని తాము    
నిరుాపించుకొన్న  మహిళ
శక్తి స్వరుాపిణియై
రాజిల్లుతోంది॥

అమ్మగా మరో  బ్రహ్మై
ప్రతి శ్రుష్టి  చేస్తుంది.
ఆలిగా అవసరాలని
తీర్చి ఇంటిని
నందనవనంగా తీర్చి
దిద్దుతుంది.॥

అంబ గా అరాచకాలని
అణగదిక్కుతుంది.
శ్రీలక్ష్మిగా సిరులు
పంచుతుంది.
విద్యా లక్ష్మిగా ...చదువు నిచ్చి
ఉన్నతి కి తోడ్పడుతుంది.
గ్రుహ లక్షిగా
ఇంటంటా  సుఖ, సంతోషాల
కళలు నింపుతుంది .॥

ఆలనలో, పాలనలో
అన్నీ తానై నిలచిన
మహిళా శక్తిని
మన్నిస్తుా...
మార్చి ఎనిమిదవ తేదీని
అంతర్జాతిీయ -
మహిళా దినోత్సవంగా
ప్రకటించి , మహిళల
కీర్తి కిరీట పతాకాన్ని
ఎగరవేసి గౌరవించిన
వారికి  సహకరిస్తుా...

మహిళ లపై జరిగే
అరాచకాలను అంతం
చేయండి. మహిళా శక్తిని
గుర్తించండి.
గుర్తించనివారికి
గుణపాఠం నేర్పండి.॥
-----------------------------
రచన..శ్రీమతి ,
పుల్లాభట్ల జగదిీశ్వరీముార్తి.
కల్యాణ్.

Sunday, February 3, 2019

తొలి ప్రేమ.

తొలి ప్రేమ.
---------------
ఆ రోజు స్కుాల్ ఆవరణ అంతా గందరగోళంగా ఉంది. టెన్త్  పరీక్షలు పుార్తి అయ్యేయి.      స్టుాడెట్స్   ఒకరినొకరు  
పలకరించుకుంటుా ,  కన్నీళ్ళతో  సెండాఫ్  చెప్పుకుంటుా ...తిరిగి  ఏ కాలేజ్ లో చేరాలి..
ఎక్కడ అందరుా తిరిగి కలుసుకోవాలి..
అన్న విషయాలు చర్చించుకుంటున్నారు.

        ఇవేవి పట్టించుకోకుండా...అందరికీ
దుారంగా ఒక చెట్టుకింద నిల్చొని ఉంది
ప్రియంవద. ఆమె కళ్ళు ఎవరికోసమో వెదుకుతున్నాయి.

    ప్రియంవద   చుాడడానికి చాలా చక్కగా ఉంటుంది. తెల్లటి తెలుపు..దానికి తోడు
పొడవాటి వాల్జడ , చక్రాల్లాంటి కళ్ళతో చుాడ ముచ్చటగా ఉంటుంది.

Thursday, January 24, 2019