Tuesday, July 25, 2023

రూపాయి లక్షణాలు ఉదాహరణలు

🍁రుబాయీలు గురించి కొన్ని నియమాలు🍁

రుబాయీ నాలుగు పంక్తులు గల కవిత. ఇది మాత్రా ఛందస్సుతో కూడిన ప్రక్రియ. ఇందులో ప్రతి పాదం ఒక సంపూర్ణ వాక్యం.   1,2,4 పాదాల చివరి పదాన్ని "రదీఫ్" అంటారు. రదీఫ్ కంటే ముందు ఉండే పదాన్ని "కాఫీయా" అంటారు. రధీఫ్ అంటే అదే పదం అని అర్థం చేసుకోవాలి. మొదటి పాదంలో ఏ పదం రధీఫ్ గా ఉంటే రెండవ, నాల్గవ పాదాలలో అదే పదం రదీఫ్ గా రావాలి.  కాఫీయా అంటే అంత్యప్రాస లాంటిది. కానీ తెలుగులో లాగా పూర్తి అంత్యప్రాస మాత్రం కాదు. మొదటి పాదంలోని కాఫీయా ఆకారాంతమయితే రెండవ నాల్గవ పాదాలలోని కాఫీయా ఆకారాంతమే కావాలి. ఇకారాంతమయితే తర్వాతి పాదాలలో ఇకారాంతమే కావాలి. ఉకారాంతమైతే ఉకారాంతమే కావాలి. హల్లుల ప్రాధాన్యత కాదు. 

మూడవ పాదానికి రదీఫ్ కాఫియాలు ఉండనవసరం లేదు.  అన్ని పాదాలకు సమమైన మాత్రలు ఉండాలి. ఏదో ఒక గతి(లయ)లో కొనసాగడం అభిలశనీయం. ప్రతి పాదానికి ఒక స్వతంత్ర అస్తిత్వం ఉంటూ నాలుగు పాదాలకు కలిపి ఒక అస్తిత్వం ఉండాలి. మూడవ పాదంలో ఒక శ్వాస తీసుకొని నాల్గవ పాదంలో మెరుపును సాధించడం అభిలశనీయం. 

"రుబాయీలు" పుట్టు పూర్వోత్తరాలు లేకుండా కేవలం నియమాలను మాత్రం తెలియజేశాను.

ఈ రుబాయీలు అనే ఈ ప్రక్రియ  "పర్షియన్" సాహిత్య ప్రక్రియ, "రుబాయీ" అనేది అరబిక్ పదం.

- సేకరణ ......"శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి" గారి "తెలంగాణ రుబాయీలు" నుండి.

ఇప్పుడు మీకు కొందరు ప్రముఖులు రాసిన రుబాయీలను ఉదాహరణకు ఇస్తున్నాను.
.........//............//......

చిత్రశాల చూశారా చిందులేయు మనసు
మధుశాల చూశారా మత్తెక్కును మనసు
భావి పౌరులకు జ్ఞానామృతాన్ని పోసేటి
పాఠశాల చూశారా పారిపోవు మనసు!!
   
   - డా.తిరుమల శ్రీనివాసాచార్యులు
.......//..........//......

వాకపల్లి ఘోరానికి సిగ్గే లేదు
దుర్మార్గుల నేరానికి ఎగ్గే లేదు
జాతికింత అవమానం జరుగుతు ఉన్నా
జనంలో రగులుతున్న అగ్గే లేదు!!

   - శ్రీ ఎండ్లూరి సుధాకర్
......//..............//.........//.......

కనిపించే గాయమైతె తడమకనే తెలిసేది!
లోలోపలి వేదన ఒక తలగడకే తెలిసేది!
అవ్యక్తపు ఆర్తులన్ని కడదాకా అనాథలే!
సాంధ్యఘోష అంతా ఒక పడమరకే తెలిసేది!

  - శ్రీ పెన్నా శివరామ కృష్ణ

ఇందులో "తెలిసేది" రధీఫ్. తడమకనే , తలగడకే, పడమరకే ఇవన్నీ కాఫియాలు.

ప్రతి పాదంలోను 23 మాత్రలు ఉన్నాయి.

.........//.............//..........//...........

మాటల్లో మాధుర్యం గుర్తు పట్టవచ్చు
రాతల్లో సుకుమారం గుర్తు పట్టవచ్చు
మనసులోని అందాలకు కొలమానం లేదు
సహజమైన సౌందర్యం గుర్తుపట్టవచ్చు

   - శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి

ఇందులో ''గుర్తు పట్టవచ్చు" అనేది రధీఫ్. మాధుర్యం, సౌందర్యం , కొలమానం ఇవన్నీ కాఫియాలు 
ప్రతి పాదంలోను 21 మాత్రలు ఉన్నాయి. 
.....//........//.........//..........

చివరగా నేను రాసిన రుబాయీ....

హరివిల్లుకు రంగులనే అద్దాలని 'ఉందిలే'
ఆ నింగికి ఊయలేసి ఊగాలని 'ఉందిలే'
తొలకరి చినుకై మరిమనసే గంతులేస్తోందని
కోయిలకే సరిజోడిగ పాడాలని 'ఉందిలే'!!
   - శాంతి కృష్ణ

ఇందులో "ఉందిలే" రధీఫ్. అద్దాలని , ఊగాలని, పాడాలని ఇవన్నీ కాఫియాలు.
ప్రతి పాదంలోను 23 మాత్రలు ఉన్నాయి.
...........//.........//........//........

పైన ఉన్న "రుబాయీలు" లో అందరూ ఒకే ఛందస్సు పాటించినా...ఒక్కో రచయిత కు ఒక్కో శైలి కనిపిస్తుంది.....

ఇప్పుడు మీరు పైన ఇచ్చిన నియమాలను పాటిస్తూ చక్కగా "రుబాయీ"లను రాయడానికి ప్రయత్నం చేయండి. 

ఉత్సాహం ఉండే వాళ్ళు కింద కామెంట్లో మీ రుబాయీలు పెట్టండి.

(మాత్రలు : 
ఒక క్షణంలో పలికే అక్షరం ఒక మాత్ర
రెండు క్షణాలలో పలికే అక్షరాలు రెండు మాత్రలు

లఘువు - ఒక మాత్ర
గురువు - రెండు మాత్రలు

గురువులు :- దీర్ఘమైన అచ్చులు , దీర్ఘమైన హల్లులు
ఉదా: ఆ , ఈ.....
         కా , గా......
సంయుక్తాక్షరాలకు, ద్విత్వానికీ , సున్నాకి ,విసర్గకు, నకారానికి ముందున్న అక్షరాలు....ఇవన్నీ గురువులు

లఘువులు : దీర్ఘము లేని అచ్చులు , దీర్ఘము లేని హల్లులు 
ఉదా: అ , ఇ......
          క , గ......

ఇంకా అర్ధంకాకుంటే వ్యాకరణం పుస్తకం చూడండి. లేదా గూగుల్ లో వెతకండి.)

  ఈవిధంగా మనం నెలకు ఒకసారి ఏదైనా ఒక ప్రక్రియ గురించో,  లేకపోతే ఏదైనా 'సమూహ చర్చలు' , పజిల్స్....ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించుకుందాం.

శాంతి కృష్ణ ✍️

Monday, July 24, 2023

శీర్షిక : ఏకమైన స్త్రీ శక్తి .

[24/07, 6:16 pm] 
JAGADISWARI SREERAMAMURTH: 24/07/2023.
 మహతీ -సాహితీ కవి సంగమం.
అంశం :  చిత్రకవిత -50 ,అధికారం.
 శీర్షిక :  ఏకమైన స్త్రీ శక్తి .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .
కళ్యాణ్ :  మహారాష్ట్ర.

 నశించిన మానవత్వంతో అవినీతి,  అక్రమం ,
  అన్యాయం , నిండిన స్వార్థ రాజకీయాలతో
 కళ్ళు మూసుకుపోతున్న  అధికార బలాలను
అదుపులోకి  తీసుకుంటూ, పశుత్వం నిండిన
 అహంకారానికి కళ్లాలు వేస్తూ, ఆవేశంతో గర్జిస్తూ
  అడుగు ముందుకు వేసిందో  స్త్రీ ...
  తాను అబలను కాదు సబలనంటూ....!!
  
వావి వరుసలెంచక, కళ్ళు మూసుకున్న
కామంతో, జన్మస్థానాన్ని జలగల్లా పీకుతూ.
 తామేమిటో తెలియని స్థితిలో, కడుపు నింపి,
  ఆకలికి తీర్చిన స్థన్యాన్ని ,అవహేళన చేస్తూ,
  అంగాగ శోషణ తో. చిత్రహింసలు పెడుస్తూ  ,
   అతివలను,  అంగట్లో నగ్నంగా తిప్పుతూ,
   అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్న
   నికృష్ట నీచ మృగాలకు, తన శక్తేంటో తెలియజేస్తూ
   ధర్మ రథంపై , ధైర్యంగా నిలబడి, 
    క్రౌర్యానికి, కళ్ళేలు వేస్తున్న ...స్త్రీ శక్తి,
   తాను ,అబల కాదు, సబలనంటూ 
   అడుగు ముందుకేసింది.!!

   ఎప్పటికీ ఒరగని ,మువ్వన్నెల  జెండా,
    తల్లి భారతికి , తలమానికమై, 
    సత్య, శాంతి,ధర్మ మార్గాలను  సూచిస్తోంది..
    తల్లి భారతి తరగని వేదనతో,
    పాపులైన బిడ్డలను పరిమార్చేందుకు,
   కరవాలం చేతపట్టి ,  ఖలుల అంతానికై
   కదను తొక్కింది.
   తల్లి భారతి అండతో, స్త్రీ శక్తి విజృంభించింది.
  ఒంటరి పోరాటానికి, ఓట్లు, కోట్లయయ్యాయి.
   వేల అడుగులు ఒక టై, చేయి చేయి కలిపాయి
   అబలల. ఆవేశాలు   అగ్నిశిఖలై రాజుకున్నాయి.
   స్త్రీ శక్తి. ఒకటై ,పురుషాహంకారానికి  ,
   సవాలుగా నిలిచింది..
   తాము,  ,అబలలము  కాదు,, సభలల మంటూ ,
  స్త్రీ శక్తి.  అడుగు ముందుకేసింది.!!



[24/07, 7:07 pm]
 +91 96406 22018: *26*
*శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి* గారూ
  *ఏకమైన స్త్రీ శక్తి* శీర్షికతో మీరు వ్రాసిన కవిత బాగుంది. మానవత్వం నశించిపోయి, వావి, వరుసలెంచక మహిళలను వేధించే మగాళ్ళను ఎదుర్కొని, 
సబలలుగా నిలవమని, స్త్రీ శక్తి పెంచడానికి
" భరత మాత ముందడుగేసింది " అన్న భావం బాగుందండీ. 
ధన్యవాదములు, అభినందనలు.🙏🙏🙏🌸🌸🌸👏🏻👏🏻👏🏻

Thursday, July 20, 2023

నా పరిచయం.

నా పరిచయం...
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.  ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను   .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.
తమ్మడు పంతుల వేంకటరమణ ముార్తి.
సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత  గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు  చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా  నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా  గాత్రానికి సంగీత  శ్రీకారం చుట్టేను .

వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
రైల్వేలో మొాటర్ మేన్ గా రిటైర్ అయి ప్రస్తుతం
 హైకోర్ట్  వకీలుగా కొనసాగుతన్నారు.
మా ఇద్దరు పిల్లలకీ వివాహాలయ్యేయి.
అబ్బాయి పి. రాజశైఖర్ ముార్తి  సైబర్ సెక్యుారిటీ
ఫౌండర్ గా  కొన్ని కంపెనీలకు  డైరెక్టర్ గా 
కొనసాగుతున్నాడు. వికీపీడియాలో రాజశేఖర్ ముార్తి పి. పేరుతో ఉన్న బయొాడేటా చదివి కోర్స్లు పుార్తి చేయడం  వల్ల చాలా మంది యువత
నేటి కంప్యుాయుాటర్  విభాగంలో నిష్టాతులై
ఉద్యోగ ప్రాప్తులయ్యేరు.
అమ్మాయి వివాహానంతరం లండన్ లో స్థిరపడింది.
అన్యోన్య దాంపత్యం .వారిద్దరికీ పిల్లలున్నారు.
 
అటుపై నేను 
 ఇక్కడ పొరుగుారైన  డోంబివిల్లి వాస్థవ్యులు
శ్రీమతి తారా రమేష్ గారి వద్ద సంగీత ప్రస్థానాన్ని కొనసాగించేను . హరికథా శిరోమణి యైన మా
అత్తయ్యగారు సాహిత్యాభిలాషి .అమె దగ్గరున్న పుస్తకాల గది ఒక పెద్ద గ్రంధాలయమని చెప్పవచ్చు
వారికి గల  తొమ్మిది మంది సంతానంలో పెద్ద కోడలిగా
ఆరుగురు ఆడపడుచులు , మరుదుల అభిమానానికి 
పాత్రురాలినయ్యేను.
వారందరుాకుాడా  భక్తి , గాన, వాద్య  భజన కళాకారులే
అమె సంగీత సాహిత్యాల నేర్పు కుార్పులతో రాసిన కీర్తనలు పద్యాలు స్తోత్రాలు అనేకం .
నిత్య పురాణ ఫఠనాలతో భజన సప్తాహాల విందుభోజనాదులతో  మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చతోరణమే.
అవిధంగా

నా పరిచయం...
 నా పేరు , శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.  ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను   .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.

సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత  గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు  చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా  నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా  గాత్రానికి సంగీత  శ్రీకారం చుట్టేను .

వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
మా ఆత్తయ్యగారు సాహిత్య ప్రియులవ్వడంతో
ఆమె ద్వారా నేర్చుకున్న సంగీతానికి , నేర్చుకున్న సాహిత్యానికి , సహజంగా ఉండే ఆశక్తి తోడై  ,
కవితలు రాయడం పాటలు రాయడం రాగాలలో స్వరకల్పన చేయడం చేస్తుా.  రాను రాను .ఎన్నో పాటలను , కధలను కవితలనుా రాస్తుా..అందరిచే ప్రశంశలు పొందేను.
నా స్వీయ రచనలను విని  ఆస్వాదించి ,ఆనందించిన 
గురువుగారు "శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారు  ,తాను రచించిన శివపదం పాటలను, స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో  రెండు CD లుగా  ఆవిష్కరించేరు.  నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం , స్వయంగా వారి చేతులమీదుగా  సన్మానితురాలిని కావడం ,
నాకు గర్వకారణం. 

పలు సంఘాలలో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి. 
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో ఎన్నో  లలిత సంగీతాలు  రచించి స్వరపరచి పాడేను.
బోంబే షణ్ముఖానందలో,  అన్నమాచార్య కీర్తనలు,
పలు అర్కెష్ట్రాలలో  ఎన్నో సినీ గీతాలు , లలిత సంగీతం ,స్వీయ రచనలు కుాడా పాడేను.

కరోనా కారణంగా ప్రస్తుతం "ఆన్ లైన్"  కవితల పోటీల్లో "ఇష్టపది" ప్రక్రియ లో "శ్రీమద్భగవద్గీత" పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను. పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచి 
"అక్షర ఝరీ రత్న" బిరుదును పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం "  బిరుదు పొందేను 
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో  "సంపుార్ణ సుందరకాండ"ను  రచించేను

సంక్షిప్త రామాయణ గాధను , భగవద్గీత పదునెమిది అధ్యాయాలను ,ముప్పది పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచేను..
నేను రాసిన కధలు, కవితలు కలిపి 1000 కి పైగానే ఉన్నాయి.
పెళ్ళిపాటలు  సంక్రాంతి పాటలు , విరహ గీతాలు, లలిత గీతాలు , భక్తి గీతాలు , ఇలా వివిధ రకాలైన అనేక పాటలు కలిపి మొత్తం 800 పై చిలుకుగా ఉన్నాయి.
వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను చాలా బిరుదులను అవార్డ్ లను పొందిన నేను , 
సంగీతమే పాటగా సాహిత్యమే నా ఆటగా
కవన వనంలో విహరిస్తుా  ఆనందిస్తుా ఉంటాను.

సాహిత్య పుా దోటలో నాకు లభించిన పరిమళ సుమ గంధాలు..నాకు లభించిన
సన్మానపుారిత బిరుదులు , పురస్కారాలు అవార్డులు.
 చాలానే ఉన్నాయి .

అన్ లైన్ కవితా పోటీల లో  చాలా ప్రక్రియల లో ఇప్పటికీ  పాల్గొంటుా ఉంటాను.
 ఇది నా సంక్షిప్త పరిచయం.

Saturday, July 15, 2023

శీర్షిక.మారుతున్న విద్యా విధానం.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
--------------------
శీర్షిక.
మారుతున్న విద్యా విధానం.

----------------------------------------

తలిదండృల బాధ్యత        తనిగ పెంచుట వరకె.
మహిని మను బాటలో       మార్గదర్శి  గురువే  ॥
తరమంతరించినా             తరం కదలినా,అది---
గురువుల కే సాధ్యం           గురువే ఇల దైవం...॥

అంతర్జాతీయపు                అనేక పరిణామపు--
ప్రభావాల ఫలితం              ఫల మెరుగని లోపం.
విద్యారంగాల్లో                   వివిధ ఒత్తిడులు-
నాణ్యత గల విద్యలు        నలిగేటి శాపాలు॥

విద్యావ్యవస్థలవి               వీధి బడిన వేళలు
గురు శిష్య బంధాలు          గుడ్డి దారి బాటలు॥
గుణు లైన గురువులకు      గౌర-విలువల లోపం.
గురు బాధ్యత క్షీణం            గుణ శిష్యుల లోపం ॥

భవిష్యత్ ప్రణాళికల            బాధ్యతల బరువుకును -
మొాయలేని  గురువులు      మొాడువారు బతుకులు.
కార్పరేట్ విద్యల                  కాలుష్య  విధానం.
ధర ,  విజ్ఞానం విలువ -         ధనానికి అమ్మకం   ॥

కొనుగోలు పత్రాల              కొందారులనేకం .
విద్యార్ధుల ప్రగతి               వీధిపాలైన వైనం॥
నేడు విద్యల విలువ         నిలువు దోపిడీ వల            సమ సమాజ స్థాపన        సద్గురుల బాధ్యత ఇల॥
--------------------------------------------------------------------

హామీ.....

ఇష్టపది ప్రక్రియ లో రాసిన --
" మారుతున్న విద్యా విధానం " అనే నా ఈ  కవిత,
ఏ మాధ్యమునందునుా  ప్రచురితం కాని, నా
స్వయ రచన.

నాణానికి రెండవ వైపు. కధ



నాణానికి రెండవ వైపు.    కధ



అఖిలకు చాలా సహనంగా ఉంది ఏంటి జీవితం ఎన్నాళ్ళు ఇలా ! పొద్దున్నే లేవడం, గబగబా ఇంటి పని, వంట పని- చేసుకొని ,ఆఫీస్ కి వెళ్లడం అక్కడ సాయంత్రం దాకా ఊపిరి తిరగని పనితో సాయంత్రం 5:30 దాకా కష్టపడడం , తిరిగి ఇంటికి రావడం, మళ్ళీ రాత్రి వంట ,
పొద్దున లేచి ఆఫీస్కి వేసుకునే బట్టలు ఇస్త్రీ చేసుకోవడం, ఆఫీస్  డబ్బా కోసం   కూరలు తరుక్కోవడం ,ఇలా...
 రాత్రి పడుకునే సరికి 11 దాటిపోతుంది .
పని, పని ,పని , ఎంత  చిరాకుగా ఉందో...
అమ్మా,నాన్నలకు ఆరోగ్యం అంతంత మాత్రం గానే ఉంది.
తన మీద అన్నొకడున్నాడు . వాడు ప్రేమ పెళ్ళంటూ 
ఒక తమిళ అమ్మాయిని చేసుకొని, చక్కగా ఆమెతో పాటు
 అమెరికా  వెళ్ళి పోయాడు. వెళ్లిన వాడు వెళ్ళినట్టే  వెళ్లి మరి తిరిగి రాలేదు, .  కన్నెత్తి చూడలేదు , పన్నెత్తి పలకరించలేదు
 దాంతో తల్లిదండ్రుల   బాధ్యత తన మీద పడింది.
 ఉద్యోగం వచ్చిన తర్వాత తన పెళ్లి విషయం తాత్కాలికంగా మూల పడింది.
 రెండేళ్లు  ఇట్టే గడిచిపోయాయి.
 తనకు 30 ఏళ్ళు పైపడ్డాయి.

అమ్మ నాన్న తనకు పెళ్లి చేస్తామని అప్పటినుంచీ.. ప్రయత్నాలు చేస్తూనేన్నారు . కానీ  "ఉద్యోగం చేసే పిల్లవద్దని" కొంతమంది , "అమె పెళ్లయిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారు" అని కొంతమంది , "ఉద్యోగం చేసే పిల్ల అయితే మాకు కావాలి కానీ, తర్వాత  మీ ఇరువురి బాధ్యత తను తీసుకోవాల్సి  వస్తుందేమో కదా, "అని మరి కొంత మంది,
ఇలా ఏదోరకంగా వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతున్నాయి.
 దాంతో అమ్మ నాన్నలకు ,తనకసలు పెళ్లి అవుతుందా అన్న బెంగ మొదలైంది.
 వాళ్ల బెంగ చూసి తనకు నిరుత్సాహం మొదలైంది.
 చూడడానికి అయితే తను బాగానే ఉంటుంది .అందంకేం కొరత లేదు. ఛాయ కూడా కాస్త తెలుపనే చెప్పొచ్చు .కన్ను ముక్కు తీరుగానే ఉంటాయి. 
పోస్ట్ గ్రాడ్యుకేషన్ చేసింది . మంచి ఉద్యోగం చేస్తోంది .
మంచి జీతం వస్తుంది . కానీ తల్లిదండ్రుల బాధ్యత తన మీద ఉందన్న ఒక్క నెపంతో తనకి ఈనాటి దాకా సంబంధాలు కుదరలేదు.
ఇప్పటికే తన వయసు 32 దాటింది .రొటీన్ గా చేస్తున్న పనితో జీవితం చాలా విరక్తిగా ఉంటోంది. 
ఆలోచిస్తూ  అరగంట నుండి పక్క మీద దొర్లుతున్న , అఖిలకు నిద్ర అన్నది మాత్రం రావడం లేదు .

ఈరోజు తను డ్యూటీ నుంచి రాగానే అమ్మ చెప్పిన మాట
రేపు తనకు పెళ్లి చూపులట.అమ్మ చాలా సంబరంగా చెప్పింది
  "అబ్బాయి చాలా సింపుల్ గా ఉంటాడట .కొంచెం పొట్టిగానీ మిగిలిన విషయాలకు ఏమి లోటు లేదట .
  ఛాయ కొంచెం తక్కువైనా ,మంచితనానికి మారు పేరట.
  ఎవరి మనసు కష్టపెట్టడట."
  ఇవన్నీ చెప్పుకోవడానికే , గాని నిజంగా మగవాళ్లంతా అలా ఉంటారా ? చాలా అరుదు కదూ.
  అబ్బాయికి తను నచ్చినా, తనకు మాత్రం అబ్బాయి నచ్చొద్దూ ? తనకన్నా పొట్టిగా ఉంటే ఎలా ఒప్పుకోవడం.
  తనకన్నా కొంచెం  ఛాయ కూడా తక్కువేనట . 
  ఏమో చూద్దాం, పొద్దున్నే చూస్తాను కదా !అప్పుడే నిర్ణయించుకోవచ్చు." అనుకుంటూ అఖిల  నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ కళ్ళు  మూసుకుంది.
  
*******************************

ఆరోజు ఆదివారం .
ఆఫీసుకి సెలవు రోజు. అయినా సరే పెళ్లిచూపులు కారణంగా తను తొందరగానే లేచింది..
  పెళ్ళివారు రాగానే ఇవ్వడానికి ఒక స్వీటు, హాటు,తయారు చేసి ,కాఫీ గుండ ఫిల్టర్ లో వేసి, డికాషన్  తీసి ఉంచి,
  పక్కనే గిన్నెలో పాలు వేడి చేసి ఉంచింది .
  వీలైనంతవరకు అమ్మని శ్రమ పెట్టకుండా ఉండాలన్నదే అఖిల తాపత్రయం .
  ఇల్లంతా నీట్ గా సర్ది ఉంచి, స్నానం చేసి , దేవుని ముందు దీపం పెట్టి ,తర్వాత తనకు  తోచిన విధంగా తయారై హాల్లోకి వచ్చి కూర్చుంది.
  అప్పటికే సమయం తొమ్మిదిన్నర అయింది.
  పది, పదిన్నర ప్రాంతంల్లో  పెళ్లి వారు వస్తున్నారు అన్న వార్త వచ్చింది.
ఆ  వెంటనే అమ్మా ,నాన్న చేసిన  హడావిడి ఇంతా-అంతా కాదు.
తుడిచిందే తుడిచేరు, సద్దిందే సర్దేరు.
తనకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఈ సంబంధం అన్నా కుదురుతుందా..? తనకు పెళ్లి కొడుకు నచ్చుతాడా? ఏమో?
ఆలోచిస్తుండగానే పెళ్లి వారు వచ్చేసారు .
అమ్మ, నాన్నగారు ,వాళ్ళందరికీ సకల మర్యాదలు చేసి- కుర్చీల్లో కూర్చోబెట్టారు.

అంతా కూర్చున్నారు. తనను వాళ్ళ ఎదురుగుండా కూర్చోబెట్టారు. వాళ్లు అమ్మ నాన్నలను ఏవేవో అడుగుతున్నారు.
 తన దృష్టి మాత్రం ఎదురుగుండా కూర్చున్న పెళ్ళికొడుకు మీదే ఉంది.
అతడు చాలా సింపుల్ గా ఉన్నాడు.
చాయ్ తక్కువని చెప్పారు కానీ నల్లగానే ఉన్నాడు. దానికి తోడు పొట్టి. వెనకాతల బట్టతల కూడా ఉన్నట్టుంది.
జుట్టు చాలా పల్చగా ఉంది.
అతని పెదాలు  లావుగా,  చూడడానికి అసహ్యంగా ఉన్నాయి. చూడగానే అతనిని పెళ్లి చేసుకోవాలనిపించలేదు అఖిలకు.
కూర్చున్నంతసేపు అతనేమీ మాట్లాడలేదు 
.అన్ని వాళ్ళ అమ్మ నాన్న గారే మాట్లాడారు.
అతనిని గమనించడంలో వాళ్లు ఏం మాట్లాడుకున్నారో
 తనేం వినేలేదు.
కొంతసేపు తర్వాత అమ్మ వచ్చి "అబ్బాయి తో ఏమైనా మాట్లాడతావా" అంటూ చెవిలో చెప్పింది.  
ఇదేంటి పెళ్లి చూపుల్లో అబ్బాయి కదా  తనతో మాట్లాడ వలసింది... అదే మాట అమ్మతో అంది.
" అలా కాదమ్మా. అతడు కాస్త మొహమాటస్తుడట .
అందుకే నువ్వే ఏదైనా అడగాలంటే అడిగేయ్" అంటూ చిన్నగా నవ్వింది.
 నిరుత్సాహంగా ఉన్న తను
" మాట్లాడను" అన్నట్టుగా తల ఊపింది.
ఇంతలో అతన్ని తల్లి "మాకు అమ్మాయి నచ్చిందంటూ" చెప్పారు.
అంతేకాదు తమకు కట్న కానుక లేవీ అవసరం లేదని, పెళ్లయిన తర్వాత ఆమె బాధ్యతగా తల్లిదండ్రులను చూసుకోవచ్చని , అందుకు తమకేమీ అభ్యంతరం లేదని కూడా చెప్పారు.

ఆ చివరి మాట తనకు చాలా నచ్చింది." తనకు పెళ్లయితే అమ్మానాన్న సంగతి ఎలాగ. ? " అని ఆలోచిస్తున్న తనకు ఒక ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అనిపించింది.
అమ్మ నాన్నల ముఖాల్లో సంతోషం వెల్లి విరుస్తున్నది.
అమ్మ, వారి ముందే తనను అడుగుతోంది "ఆనంద్ నచ్చాడా" అంటూ..
అప్పుడు తెలిసింది అతని పేరు ఆనంద్ అని. పేరైతే చాలా బాగుంది.
కానీ అతను తనకన్నా చాలా పొట్టి గా ఉండటమే గాక
చూడటానికి కూడా బాగులేడు అందుకనే తనేం చెప్పలేకపోయింది.
నిజంగానే తనకు అబ్బాయి నచ్చలేదు కానీ, ఈ సంబంధం వద్దంటే మరొకళ్ళు వస్తారు ,కట్నం అడుగుతారు, లేదా తల్లిదండ్రులని చూడొద్దు అంటారు.
తను ఈ వయసులో వాళ్ళని వదిలి వెళ్ళలేదు.
ఎటునుండి ఎటు ఆలోచించినా ,తను ,ఈ సంబంధానికి ఒప్పుకుంటేనే మంచిది అనిపించింది.
అందుకే మరోసారి ఆలోచించకుండా "ఊ... "అన్నట్టుగా తల ఊపింది,.
*****************
పెళ్లి నిశ్చయమైపోయింది. వెనువెంటనే ముహూర్తం కూడా .…
జేష్ట మాసంలో చాలా సింపుల్ గా,  తామిద్దరికీ
పెళ్లైపోయింది.

వ్రతం అంటూ అత్తవారింటికి తీసుకెళ్లారు. ఇల్లు బాగానే ఉంది. అత్తగారు, మావగారు చాలా మంచి వాళ్ళలాగే ఉన్నారు.
తనను అమ్మ ,అమ్మ ,అంటూ ,ఒక క్షణం వదలకుండా తన మంచి చెడులన్నీ చూసుకుంటున్నారు.
వచ్చిన వాళ్ళందరికీ చాలా సంతోషంగా తనను పరిచయం చేస్తున్నారు 
ఇంట్లో ఇంత హడావిడి జరుగుతున్నా....
ఆనంద్ మాత్రం దూరంగా కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు..
కనీసం ఇలాంటి సమయంలో అయినా తన పక్కన కూర్చోవచ్చు కదా! మరీ ఇంత మొహమాటమా! 
కనీసం వచ్చినవాళ్ళలో ఒక్కరినైనా పలకరిస్తాడా అని చూస్తే అదీ లేదే  ! అసలు అతను సమంగా మాటలైనా మాట్లాడుతాడా ,లేక మరేదైనా ప్రాబ్లమా ! అఖిల ఆలోచిస్తూనే అతని వైపు చూస్తోంది .
అతను తలెత్తి చిన్నగా తన వైపు చూసి నవ్వాడు అఖిల గాభరాగా చూపులు మరోవైపుకు తిప్పుకుంది
వ్రతంలో తన పక్కనే కూర్చున్న ఆనంద్ ,చాలా శ్రద్ధగా పూజ అంతా చేసాడు.
 వ్రతం బాగానే జరిగింది.  తర్వాత భోజన కార్యక్రమం.. అందరికీ తాంబూలాలు ఇచ్చుకోవడం వంటి పద్ధతులన్నీ 
 అయ్యేసరికి సాయంకాలం అయిపోయింది.
వచ్చిన వారందరూ సంతోషంగా వెళ్లిపోయారు 
ఆ తర్వాత అత్తగారు, మామగారు ,నాన్నగారు, అమ్మ- కూర్చుని చాలా సేపు పిచ్చా- పాటీమాట్లాడుకున్నారు.
తర్వాత సడన్గా టాపిక్ మారిపోయింది.
వాళ్ళు తమ శోభనం కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ ఉంటే తన గుండె గుభిల్లుమంది.
అమ్మో !ఇతగాడి తోటా !శోభనమా!
తను చచ్చినా ఈ కార్యక్రమానికి ఒప్పుకోదు .
కానీ ఎలా ఎలా తప్పించుకోవడం..? కానీ ఎప్పుడో అప్పుడు ఇదంతా జరగవలసినదే కదా..?
ఇప్పుడు తప్పించుకున్నా మరొకప్పుడు వీళ్ళు ఇదంతా చేయడం మానరు .దాని బదులు ఇప్పుడే కాముగా ఊరుకుంటే సరి.
అసలు తనకు పెళ్లి కొడుకు నచ్చనప్పుడు తనీ పెళ్లెందుకు చేసుకుంది.
 చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తోంది..
 అంటే తనకు పెళ్లి కాదని భయమా...
  "లేదు, లేదు, తను అమ్మానాన్నల కోసమే ఈ పెళ్లి చేసుకుంది. వీళ్లు మాత్రమే తల్లిదండ్రులను తన దగ్గర  ఉంచుకునేందుకు  ఒప్పుకున్న వాళ్ళు..
  అందుకే తనకు ఆనంద నచ్చకపోయినా ఈ పెళ్లి చేసుకుంది.  అంతే....

అఖిల మనసులో ఉన్న ఏహ్య భావాన్ని, బయటకు కనబడనీయకుండా నానా అవస్థలు పడుతోంది.
దూరంగా కూర్చున్న ఆనంద్ , తనను చాలాసేపటినుండి గమనిస్తున్నాడని తెలుసుకున్న  అఖిల మొదటిసారిగా సిగ్గుపడుతూ తల మరో వైపుకు తప్పుకుంది .

*****************************
రూమ్ లో పెద్ద మంచంపై తెల్లటి దుప్పటి .దానిపై మల్లెపూలు, జాజిపూలు, గులాబీ రేకులు, పరిచి ఉన్నాయి.
పక్కన టేబుల్ మీద పెట్టిన అగరబత్తుల వాసన , మంచి గుభాళింపుతో హాయిగ మత్తెక్కిస్తోంది.
ఆ పక్కనే కొన్ని రకాల సీట్స్, హాట్స్ , పాలు వంటివి పెట్టి ఉన్నాయి.
ఆ పక్కన కుర్చీలో ఆనంద్ పంచకట్టు, లాల్చీ వేసుకుని   ఠీవిగా కూర్చుని ఉన్నాడు.
అతని బుగ్గ మీద నల్లగా పెద్ద పుట్టుమచ్చ లాంటిది పెట్టారు.
మెడలో కర్పూరపు దండ వేలాడుతోంది.
పొట్టిగా ఉన్న అతన్ని ఆ విధంగా చూసేసరికి అఖిలకు నవ్వు ఆగలేదు .
అది కష్టం మీద నవ్వు ఆపుకుంటూ చిన్నగా నవ్వింది.
అఖిల లోపలికి రాగానే ఆనంద్ మెల్లగా లేచి అఖిల దగ్గరికి వచ్చి , "రా అఖిలా " అంటూ నెమ్మదిగా ఆమె చేయి పట్టుకున్నాడు.
అఖిలకు ఏదోలా ఉంది .తనకు అతనే ఇష్టం లేనప్పుడు.. అతనితో ఈ రాత్రి ఎలా గడపడం ?
అనుకుంటూ ,ఎటూ  తేల్చుకోలేక మెల్లిగా అతని వెనకాలే నడిచింది.
ఆనంద్ ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు . మెల్లిగా తను కూడా అమె పక్కన కూర్చుంటూ , "అలిసిపోయావా" అంటూ అడిగాడు.
అఖిలకు చిర్రెత్తుకొచ్చింది .
ఇదీ అడగవలసిన మాటేనా? నాలుగు రోజులు బట్టి నిద్ర లేకుండా ,రెస్ట్ లేకుండా ,తమ పెళ్ళి హడావిడి అంతలా జరుగుతూ ఉంటే.... అలసటగా ఉండదా..
అనుకుంటూ చిరాకుగా అతని వైపు చూసింది.
ఆనంద్ మెల్లగా నవ్వుతూ "పడుకో అఖిలా ! 
ఈ రాత్రంతా నువ్వు రెస్ట్ తీసుకో . నేను ఆ బయట వరండాలో పడుకుంటాను అని ,తన మాటకోసం  ఎదురు చూడకుండా  తలగడ పట్టుకుని చక్కా  
 బాల్కనీలోకి వెళ్ళిపోయాడు.
 ఒక్క క్షణం అఖిల  అవాక్కైపోయింది.
 కానీ మరుక్షణం తనకి ఈరోజు గండం తప్పినందుకు సంతోష పడింది.
 రోజులు గడుస్తున్నాయి. అతను రాత్రి రూమ్ లోకి రాగానే రోజు అడుగుతున్నాడు ".వరండాలో పడుకోనా" అని,
  తను సరే అని తల ఊపుతుంది .అతను వరండాలోనే పడుకుంటున్నాడు అతనిలో కనీసం కోపం కూడా కనపడడం లేదు ,చిరాకు  అంతకన్నా లేదు.  పైగా తన ఆఫీసుకు వెళ్తున్నప్పుడు ప్రతి పనిలోనీ సాయం చేస్తున్నాడు. 
  ఇదంతా చూస్తున్నా అఖిలకు ఏం చేయాలో అర్థం కావడం
  లేదు. అటు అత్తగారు మామగారు కూడా తనను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు.
  ఇదంతా చూస్తున్న అఖిలకు, అసలు అతడు మగాడా , కాదా ,అన్నా అనుమానం రోజురోజుకు పెరిగిపోతోంది.
 ఇక ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో, అఖిల  తనంతట తానే ఒక రాత్రి అతన్ని వరండాలోకి వెళ్ళనివ్వలేదు.
 అతను చిన్నగా నవ్వుతూ తన వైపు చూశాడు .
 తను మళ్ళీ సిగ్గుతో తలొంచుకుంది.
 
 కానీ ఆ రాత్రి అతని ప్రవర్తన తనకి చాలా విచిత్రంగా అనిపించింది.
 తనతో ముద్దుగా, ముచ్చటగా ,ఏ మాటలు మాట్లాడలేదు.
 తనను దగ్గరికి తీసుకుంటూ పరవాలేదా ,నీకు ఇష్టమే కదా అని మాత్రం అడిగాడు.
ఆ తర్వాత ఆయన మరింకేమీ మాట్లాడలేదు. తన మనసులో ఏముందో కూడా తెలుసుకోకుండానే
తన కోరికను తీర్చుకోవడంల్లో నిమగ్నమైపోయాడు.
అరగంట దాటగానే అతడు గుర్రు పెట్టి నిద్రపోయాడు.
  అఖిలకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .ఇదే నా జీవితం అంటే.. ఇకముందు కూడా, ఇతను ఇలాగే ప్రవర్తిస్తాడా...?
 తన శరీరంతో తప్ప తన మనసుతో అతనికి పని లేదా...
 అతను తనతో కొంచెం సేపైనా ప్రేమగా మాట్లాడితే కనీసం మనసైనా తెలుసుకోగలిగి జీవితంలో కాస్త రాజీ పడేది.
 కానీ ఆనంద్ ప్రతిరోజు ఒకేలా ప్రవర్తిస్తున్నాడు తనతో ఎక్కువగా మాట్లాడడు. తన దగ్గర ఉంటే మాత్రం ఒంట్లో బాగుందా అని అడుగుతాడు. కానీ నిజంగా  ఒంట్లో బాగు
 లేకపోయినా ,చెప్తే గాని అర్థం చేసుకోలేడు .
  తను చేయాలనుకుంటే ఇంటి పని ,వంట పని, ఆడ పని అంతా కూడా చేసేస్తాడు.
  అతనికి మూడ్ లేకపోతే  తను చచ్చిపోతున్నా లేవడు.
  అసలు అతడేంటో అతని మనస్తత్వం ఏంటో పెళ్లై ఇన్ని నెలలైనా  తనకి ఇంకా బోధపడలేదు.
 ముందు ముందు తను ఇంకా ఎన్ని విషయాలలో ఎంత అడ్జస్ట్ అవ్వాలో.....
 ఆలోచిస్తున్న అఖిలకు తెల్లారితూ ఉండగా కాస్త కునుకు
 పట్టింది.
 లేచేసరికి తెల్లారి 7: గంటలు దాటింది.
 అత్తగారికి మామగారికి కావలసిన వంట చేయనేలేదు ఎలా? తను డబ్బా కట్టుకోకపోయినా పర్వాలేదు.
 ఈ పూటకి అతను ఏదో బయట తినేస్తారు. 
 
 కానీ తను ఆఫీసుకి వెళ్ళిపోయాక అత్తయ్య గారు తామిద్దరికి వండుకోగలరా? లేదు లేదు.
 ఆవిడ చేసుకోలేరు .తనే ఏదో కొంచెం చేసి పెట్టి వెళ్ళాలి. 
 ఆలోచిస్తునే గబగబా కిచెన్లోకి వెళ్ళింది.
అక్కడ  వంటిల్లు అంతా నీట్ గా సర్ది ఉంది. 
కిచెన్లో వంట వండిన సూచనలు కనిపిస్తున్నాయి.
ఒక మూల గిన్నెల్లో, వండిన వంటంతా శుభ్రంగా నీట్ గా సర్ది ఉంది.
తన కేరేజి  కూడా సర్దేసి ఒక మూల పెట్టి ఉంది.
సింకు దగ్గర ఆనంద్ చిన్న  బర్ముడా వేసుకొని,
చెమటలు కారుతూ, అంట్ల గిన్నెలు బర బరా తోముతూ కనిపించాడు.
అదేంటి ?  ఇతనెప్పుడు లేచాడు ..? అతను కూడా ఆఫీస్ కి వెళ్ళాలి కదా! ఈ పనంతా ఎప్పుడు లేచి చేసాడు...?
ఐనా ఇతనేంటి ,ఎప్పుడూ అంటిడీ గానే ఉంటాడు .
గట్టిగా మొహం కడుక్కొని, శుభ్రంగా మంచి సూట్ వేసుకొని, టక్ చేసుకుని, నీటుగా తలదువ్వు కొని  ,కాస్త సెంటు స్ప్రే చేసుకుని కనిపిస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు పేడ తట్టలా మొహం వేసుకుని తనెదురుగా తిరుగుతూ ఉంటాడు. అతను ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తాడో గాని ,తను వెళ్ళిపోయే వరకు కూడా ఇలాగే ఉంటాడు. శుభ్రంగా తయారై ఉండగా అతనిని తనెప్పుడూ చూడలేదు..
  ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో తన ముఖానికి ఇలాంటి భర్తను రాసి పెట్టాడు దేవుడు. అనుకుంటూ ఆఫీస్కి తయా రవ్వ సాగింది. అద్దం ముందు నిలబడీ ఉన్న అఖిలకు, సడన్గా తన  ఆఫీసులో బాస్ గుర్తుకొచ్చాడు.
  అతడు ఎంత బాగుంటాడని ఎప్పుడూ నీటుగా సూటు వేసుకుని ఉంటాడు కాళ్ళకు పోలీష్. చేసిన బూట్లు  నిగనిగలాడుతూ ఉంటాయి .
  మంచి ఒడ్డు పొడుగుతో అందంగా ఉంటాడు.
  అతనిని చూస్తున్న కొద్ది చూడాలనే అనిపిస్తుంది.
  అందరితోనూ చాలా రిజర్వుడ్ గా ఉంటాడు
   చాలా తక్కువ మాట్లాడుతాడు. సాయంత్రం వరకు చొక్కా నలగకుండా, రూపు చెదరకుండా అలాగే ఉంటాడు.
   అతని ఆఫీసులో లేడీస్ ష్టాఫ్ కొంచెం ఎక్కువ మందే ఉన్నారు.  అందరూ అతనితో ఏదో పని కల్పించుకుని మాట్లాడుతూ ఉంటారు .
   తనకి కూడా అనిపిస్తుంది తను కూడా మాట్లాడదామని కానీ ఒక రకమైన భయంతో అలాగే ఉండిపోయేది.
రోజులు గడుస్తున్నాయి   
 అతనికి కూడా తను నచ్చిందేమో చాలాసార్లు తన వైపు చూస్తూ ఉండడం తను గమనించింది .
  అతని భార్య ఎంత అదృష్టవంతురాలో...
  నిన్న మాత్రం అతను ఒక అడుగు ముందుకేసాడనే చెప్పాలి ఫైల్స్ చూపించమన్న మిషతో తనను లోపలికి పిలిచాడు. ఎంత మర్యాదగా మాట్లాడాడని.
  తనకోసం కాఫీ కూడా తెప్పించాడు. 
   కావాలనే తనతో ఎక్కువగా మాట్లాడుతూ
  తన కుటుంబ విషయాలు  అడిగి మరీ తెలుసుకున్నాడు.
  అతను తన భర్త గురించి  తరచి తరచి అడిగేవాడు.
  తను ఏమని చెప్తుంది అతనితో ...
  తన భర్త విషయంలో ,తను ఎంత అసంతృప్తిగా ఉందో అతనితో ఎలా చెప్పగలదు..? 
కానీ ఒకరోజు  తను కావాలనే తన భర్త ఫోటో ఒకటి తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకు వెళ్ళింది.
అది ఏదో ఒక విధంగా అతని కంట పడినట్టు చేసింది.
ఆ ఫోటో తన భర్తదని  తెలిసి అతనెంత బాధ పడిపోయాడనీ...
అతను చాలా బాధపడుతూ" అందమైన వాళ్ళకి దేవుడు ఇలాంటి పరీక్షలు ఎందుకు పెడతారో" ..అంటూ వాపోయాడు.
తనతో  చాలా ప్రేమగా మాట్లాడుతూ, తనపై జాలి చూపించడం వలనో ఏమో ,తను అసంకల్పితంగా అతనికి దగ్గరవుతూ వచ్చింది . 
అతని గురించిన ఆలోచనలు ఎక్కువ అవ్వడంతో, 
ఆనంద్ అంటే మరి కొంచెం రోత పుడుతోంది అఖిలకు.
ఆనందం మాత్రం అఖిల విషయంలో చాలా ప్రేమగా ఉంటున్నాడు ఆఫీసుకు వెళ్తున్న పిల్లలకు చాలా సాయం చేస్తున్నాడు ఏ విధంగానూ కష్టపెట్టకుండా చూసుకుంటున్నాడు.

*****************************
ఈనెల శనాదివారాలతో కలిపి ఆఫీసుకు మరో రెండు రోజులు అదనంగా సెలవులు.  కలిసి వస్తున్నాయి. దాంతో ఆఫీసులో అందరూ ఎక్కడికైనా చిన్న టూర్ వేసుకుని, ఎంజాయ్ చేద్దాం అని ప్లాన్ వేస్తున్నారు.
ఎవరెవరు జాయిన్ అవుతారో వాళ్ళ అందరి పేర్లు రాసుకుంటున్నారు.
తను ఈ ఊరు తప్ప, మరెప్పుడూ, ఏ ఊరికీ వెళ్లలేదు పెళ్లైన తర్వాత కూడా హనీమూన్ కని  ,ఆనంద్ తనని ఎక్కడికీ తీసుకెళ్లలేదు.
అత్త మామల్ని వదిలి, నాలుగు రోజులు పాటు బయటకు వెళ్లడమా, మానడమా, అని ఆలోచిస్తున్న తనకు
 తన ఆఫీసు కోలీగ్స్,తమ  బాస్ కూడా తమతో వస్తున్నట్లు తెలిపారు.
 దాంతో  అఖిలకు ఎక్కడలేని హుషారు పుట్టుకొచ్చింది.
 వెంటనే తను కూడా తన పేరు ఇచ్చి వచ్చింది.
 
 *****************
ఇంటికి వెళ్లిన తర్వాత ఆనంద్ తో ఈ విషయం చెప్పింది.
ఎవరెవరు వెళ్తున్నారు అని అడిగాడు.
తను కొందరి పేర్లు చెప్పి ,బాస్ కూడా వస్తున్నట్లు తెలిపింది.
అకామిడేషన్ ఎక్కడ అని అడిగాడు .
అఖిలకు చిరాకు వేసినా, భర్తగా ఆ మాత్రం అధికారం అతని కుందిలే ....అనుకుంటూ  వివరాలు చెప్పింది.
ఆనంద్ నవ్వుతూ సరే అన్నాడు.

అఖిల ప్రయాణానికి అన్నీ సర్దుకుంటున్న సమయంలో ఆనంద్ కూడా హెల్ప్ చేశాడు.
చివరిలో దగ్గు జలుబు లాంటివి వచ్చినా ,ఒంటి నొప్పులు కలిగినా, నడిచి నడిచి  అలసిపోయి, జ్వరం వచ్చినట్లు అనిపించినా ఈ మందులు వేసుకో అంటూ కొన్ని టాబ్లెట్స్  నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాడు.
అఖిల కు అతన్ని చూస్తే చాలా జాలి అనిపించింది.
 ఎప్పుడు తను,   అతనిపై విసుక్కుంటూనే ఉంటుంది .
 కానీ అతను మాత్రం తన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు.
 అనుకుంది .
 మరుక్షణమే ఎందుకొచ్చిన ప్రేమ, తన మనసు గురించి గానీ తన ఇష్టాయిష్టాల  గురించి గానీ పట్టించుకోనప్పుడు,.
  అనుకుంటూ మూతి ముడిచింది.
  
  ************************
అఖిల ఆనందంగా ఆఫీస్ స్టాఫ్ తో కలిసి ప్రయాణం అయింది.
అందరూ తమ తమ కార్లను తీసుకొచ్చి కొంతమందిని ఎక్కించుకుంటున్నారు.
 తమ బాస్ తనను, తనతో పాటుగా  మరొకరిని తన కార్లో ఎక్కించుకున్నాడు. అతనితో వచ్చిన ఆమె తమ ఆఫీసులో పనిచేయడం లేదు .ఆమె ఎవరో తనకు తెలియదు.
 ఏమైతానేం అందరూ కార్లో కూర్చున్నారు అఖిలకు చాలా హ్యాపీగా  గాల్లో తేలిపోతున్నట్టు ఉంది.
 తను, బాస్ తో కలిసి ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. బాస్ తనను ఫ్రెంట్ సీట్లో, తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు.  బాస్ తో వచ్చిన అమ్మాయి పేరు శ్రావణి అని చెప్పింది. ఆమె కూడా చాలా కలగోలుపుగా, చాలా చక్కగా తనతో మాట్లాడుతూ ఉంటే, ప్రయాణం చాలా హాయిగా సాగింది.
 జోకులు వేసుకుంటూ ,పాటలు పాడుకుంటూ, చాలా సరదాగా ప్రయాణం అయ్యారు .మధ్య మధ్యలో ఆగుతూ విశాలంగా ఉన్న చెట్ల కింద ఫలహారాలు తింటూ, ప్రకృతిని ఎంజాయ్ చేశారు.
 ప్రతి చోట బాస్ తనతో ఉన్న  తమ ఇద్దరి మీద ,చాలా శ్రద్ధ చూపించాడు.
 మొత్తానికి సాయంత్రానికల్లా రిసార్ట్ చేరుకున్నారు .బాగా ప్రయాణం చేసి ఉన్నారేమో ,అలసిపోయి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
 
తనది, శ్రావణీది,  బాస్ వి , రూములు వేరే హోటల్ రూమ్ లో బుక్ చేసానంటూ బాస్  తమని మళ్ళీ కారు ఎక్కమన్నారు .
ఒక్క క్షణం తనకేమీ అర్థం కాలేదు చుట్టూ ఉన్నవారి వైపు చూసింది .వారు తన వేపు ,తన పక్కన ఉన్న మరొక ఆమె వైపు అదోలా చూసి, ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఆ క్షణం తనకెందుకో కొంచెం భయం వేసింది .
బాస్ తమకు వేరే హోటల్లో, రూమ్స్ ఎందుకు బుక్ చేసినట్టు.
ఈ విషయం తనకు చెప్పలేదే . ఇక్కడికి వచ్చాక తెలిసింది.
అందరూ కలిసి ఒక దగ్గరే ఉండి ఎంజాయ్ చేస్తాము కదాకదా.. ఎక్కడ కూర్చుంటే ఏంటి ..? అనుకున్నది తను . బాస్ ,తమ కోసం వేరే రూమ్స్ ఎందుకు బుక్ చేసినట్టు ఇంత పెద్ద రిసార్ట్లో మరో రెండు రూమ్స్ దొరకలేదా?.
అనుకుంటూనే  కారెక్కింది అఖిల .
ఆమెతో పాటుగా శ్రావణి కూడా .
తాము ఉండబోయే హోటల్ ,రిసార్ట్ కి చాలా దూరంలోనే ఉన్నట్టుంది .  అందరితో కలిసి ప్రయాణించడం చాలా బాగుంది అనుకున్న అఖిల కి , ఎందుకో , ఈ విషయం నచ్చలేదు. అందరికీ అంత దూరంగా ఉంటే ఇంకా సరదాగా ఉంటుంది . అదే విషయం బాస్ ని అడిగింది .
బాస్ నవ్వుతూ, నా స్టేటస్ కి ,స్టాఫ్ అందరితో కలిసి ఉంటే బాగుండదు కదా!  అందుకే నేను వేరే స్పెషల్ గా ఈ హోటల్ లో రూమ్ తీసుకున్నాను. అక్కడ చాలా బాగుంటుంది. ఏముంది , తెల్లారి లేచి, ఫ్రెష్ అయ్యి ,మళ్ళీ మనం అక్కడికి వెళ్లిపోవడమే .అందరూ  కలిసి చుట్టుపక్కలంతా తిరిగి ,ఎంజాయ్ చేశాక ,రాత్రి పడుకోవడానికి మట్టుకే మనం ఈ హోటల్ కి వస్తాం . అని చెప్పాక కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయింది అఖిల.

**************************"""""

 రూమ్ లోకి వెళ్ళగానే , అఖిల ఫ్రెష్ గా స్నానం చేసి ,మంచి చీర కట్టుకుంది .చాలాసేపు వెయిట్ చేసింది .ఎవరైనా వచ్చి పిలుస్తారేమో ..బయటకు వెళ్దామని ..
 కానీ ఎవరూ రాలేదు. 
 రాత్రి  డైనింగ్ హాల్లో భోజనాల దగ్గర అంతా  మళ్ళీ రిసార్ట్ లో కలిశారు.
 అక్కడ  మరుసటి , అందరూ వెళ్లవలసిన ప్రదేశాల గురించి, సమయం గురించి మాట్లాడుకున్నారు.
 తర్వాత ఎవరు రూముల్లోకి వెళ్లిపోయారు .  అఖిల, శ్రావణి
  బాస్ తో కలిసి హోటల్ కి వచ్చేసారు.  అఖిలకు ఎంతసేపటికి నిద్ర రాలేదు.
   తను సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చింది అందరితో పాటు కలిసి ఉండొచ్చు అనుకుంది. కానీ అందరూ దూరంగా రిసార్ట్లో ఎవరి రూముల్లో వాళ్ళు పడుకుంటున్నారు.
 పోనీ కాసేపు శ్రావణి తో కబుర్లు చెబితేనో., అనుకుంటూ
  బయటి వారండాలోకి వచ్చింది. 
  శ్రావణి రూము లాక్ చేసీ ఉంది .  "ఇంత రాత్రిపూట, శ్రావణి  ఎక్కడికి వెళ్ళిందబ్బా" అనుకుంటూ, ఏమి తోచక ,మెల్లగా- బాస్ రూమ్ దగ్గరికి వచ్చి ఆగింది . పోనీ కాసేపు ఇతనితో మాట్లాడితేనో... చర్చ నిన్న రాత్రిపూట బాగుంటుందా అయినా తను ఏంటి , బాస్ రూం దగ్గరికి వచ్చి నిలబడింది.
   తనకి బాస్ అంటే మనసులో ఇష్టమే. అతనితో మాట్లాడాలని కాసేపొద్దునతో గడపాలని చాలాసార్లు అనుకుంది తను. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశం తన కోసమే అన్నట్టుగా వచ్చింది .కానీ మరీ ఇంత బరితెగించినట్టు   ఇలా రావడం బాగోలేదు కదా...
   తనిలా తర్జనభర్జనలు పడుతూ ఉండగానే, బాస్ రూమ్ తలుపు తెరుచుకుంది . లోపల బాస్ చిన్న లాగుతో  ఉన్నాడు. మరో ఆఛ్చాదన లేని శరీరం నిండా  నల్లటి బొచ్చు అసహ్యంగా కనిపిస్తోంది . నోట్లో సిగార్ లోంచి గుప్ గుప్  మని పొగ వస్తోంది.
 రూమ్ లోంచి విస్కీ వాసన గుప్పు మంటూ వస్తోంది.
 ఇంత దరిద్రంగా బాస్ ని తనెప్పుడూ చూడలేదు.
 వస్తున్న వాసనలకి కడుపు తిప్పినట్టు అయింది .
 సగం రేగిన జుట్టు, సగం నలిగిన బట్టలతో శ్రావణి గాబరాగా తన రూమ్ కి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది .
 తను ఏంటి చూస్తున్నది.  ? తన బాస్ నేనా..?
 అతనికి వివాహం అయినట్టుగా విన్నాది .మరి ఇదేంటి..? ఇతను ఇలా....
 శ్రావణి అతని భార్యలా తనకు పరిచయం చేయలేదే ..
 మరి శ్రావణి ఎవరు ...?
 ఆయనకు ,శ్రావణి కు, మధ్య ఏమైనా ఉండవచ్చు.
  కానీ.  అతను ఆమెతో  పాటు ఈ హోటల్ కి, తనను కూడా ఎందుకు తీసుకొచ్చినట్టు..?...
  అఖిలకు చమటలు పడుతున్నాయి.
  తలుపు తీయగానే ఎదురుగుండా  నిలబడ్డ అఖిలను చూసిన బాస్ కూడా కాస్త తడబడ్డాడు.
  కానీ కొద్దిసేపట్లోనే  తేరుకొని "  రా  అఖిలా " అంటూ లోపలికి పిలుస్తూ, వెకిలిగా నవ్వాడు.
అఖిలకు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది.
వెంటనే వెను తిరిగి పరుగెడుతున్నట్లు  తన రూమ్ కి వెళ్లి ధడాలున తలుపేసుకుంది.

అఖిల గుండెలు, ఆగిపోతాయేమో... అన్నంత స్పీడుగా కొట్టుకుంటున్నాయి. 
ఏంటి తను చూస్తున్నది.? ఎవరి శ్రావణి.? ఆమెకి బాస్ కి ఉన్న సంబంధం ఏమిటి..?
ఎంతో హుందాగా , డిగ్నిటీగా  ఉంటూ ,అతి తక్కువగా మాట్లాడుతూ, అందర్నీ ఎంతో గౌరవిస్తూన్న బాస్, ఇలాంటి వాడా..
 ఛీఛీ.. ఇందాకల  అతను  ఒంటి నిండా రోమాలతో, ఎంత అసహ్యంగా కనిపించాడు. 
 సిగరెట్టు ,తాగుడూ కూడా, అలవాటు ఉందా..?
 పైగా రాత్రి  కోసం , వేరే అమ్మాయిని కూడా తెచ్చుకున్నాడు .
 అంతేకాదు...
 ఆమెతో పాటు, తనని కూడా తీసుకురావడంలో, అతని ఉద్దేశ్యం ఏమిటి..?
 తను కూడా ఆమెలాగే ,అతని కోసం ,అతని రూముకి వెళుతుందనా.,?
  నా గురించి అతను ఇంత చీప్ గా ఆలోచిస్తున్నాడా.?
అక్కకు తల పగిలిపోతున్నట్టుగా ఉంది.
అసలు ,అతను తన గురించి ఇలా ఆలోచించడానికి కారణం కూడా ,తనే కాదు కదా..?
ప్రతీ ఆడపిల్లా కోరుకున్నట్టే , తను కూడా, తనకి అందమైన భర్త రావాలని కలలు కన్నాది.
కానీ తనకు ఆనంద్ లాంటి అందవిహీనమైన భర్త దొరకాడు.
రంగూ లేదు .పొడగరీ కాదు. కనీసం సరదాగా మాటైనా మాట్లాడడు . ఇంతవరకు ఎక్కడకూ తీసుకెళ్లలేదు కూడా.
ఆడారిలా ఇంటి పని అంతా చేస్తాడు .
*****************

  
 

  
 
 
      
    
 






నాణానికి మరోవైపు.. కథ. 2
తపస్వీ, మనోహరం ," e" బుక్  కొరకు రచన.
అంశం : నాణానికి మరోవైపు. (కథ).
రెండవ భాగం.
శీర్షిక : మౌనరాగాలు 
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
 కళ్యాణ్ :మహారాష్ట్ర.



దాంతో తనకు చాలా చిరాకు వేసి ,జీవితం మీద విరక్తి పుట్టినట్టయింది. 
దాంతో ఎప్పుడూ లేనిది    అందంగా ఉన్న, తన బాస్ ని గమనించడం మొదలెట్టింది. 
ఎందుకంటే అతను ఆఫీసులో అందరితో చాలా క్లోజ్ గా అభిమానంగా ఉంటాడు .అందుకే ,అతని స్వభావం చాలా మంచిది అనుకుంది.
తనకు ఎలాంటి భర్త రావాలనుకుందో, అటువంటి లక్షణాలున్న బాస్ అంటే, కాస్త వ్యామోహం పెరిగిన మాట వాస్తవమే.
అతనితో కాస్త టైం స్పెండ్ చేసి, మనసు విప్పి మాట్లాడాలనుకుంది.
అంతకుమించి తన మనసులో మరి ఏ ఉద్దేశమూ,
కోరికకా లేదు.
కానీ తను తీసుకున్న చోరవను, అతను అపార్థం చేసుకున్నట్టుగా ఉంది..... తను సులభంగా అతనికి లొంగిపోతుంది అనుకున్నాడేమో ! అందుకే తన కారులో స్పెషల్ గా రూమ్ తీసుకున్నానని చెప్పి, ఇక్కడకు తెచ్చి పెట్టినట్టున్నాడు.
ఇందులో తప్పంతా తనదే కనిపిస్తున్నది. ఎందుకంటే ఇంతకుముందు కూడా తను ఆఫీసులో పనిచేసినప్పుడు బాస్ గురించి పట్టించుకునేది కాదు. తనేదో తన పనేంటో, అంతే .ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేది కూడా కాదు.
పెళ్లయిన తర్వాతే ఆనంద్ విషయంలోనున్న అసంతృప్తి తనను ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయట పడడం ఎలా? తను ఒక్కతే ఇంటికి వెళ్లిపోగలదా ? చూస్తే అర్ధరాత్రి దాటిపోయినట్టుంది.
ఆలోచనలతో మహతికి  పది లంఖణాలు చేసినంత నీరసం వచ్చేసింధి.
ఏమీ చేయలేక మంచం మీద కూర్చునీ , ఏడవడం మొదలెట్టింది.
ఇంతలో హోటల్ బయట అలారమ్స్ మోగుతున్న చప్పుడు వినిపించింది.
అంతలోనే అఖిల రూమ్ ఎవరో దబదబా , బాదుతున్న చప్పుడు వినిపించింది.
అఖిల అదిరిపడింది .తలుపు తీయడమా .? మానడమా..?
అసలు బయట ఏం జరుగుతోంది...?.
ఆలోచనలో ఉన్న అఖిలకు  , "అఖిలా! తలుపు తియ్యి" అన్నా ఆడ గొంతుక వినిపించింది.
అఖిల గబగబా వెళ్లి  తలుపుతీసింది.
అక్కడ, తమ ఇంటి పక్కన ఉన్న రాధ నిల్చునుంది. ఆమె వెనక ,ఆమె అన్నయ్య పోలీస్ డ్రెస్లో నిల్చుని ఉన్నాడు.
ఇదేంటి రాధ ఇక్కడ ఉంది. అని ఏదో అడిగేంత లోపలే రాధ , అఖిల చేయి పట్టుకొని ,అఖిలా పద,  ముందు బయటికి రా, తర్వాత నీకు జరిగిందంతా చెబుతాను
 అంటూ కబ-గబా చేయ పట్టుకుని త్వరగా రా అంటూ, 
 లిఫ్ట్ దగ్గరికి లాక్కు వెళ్ళింది.
 అసలే గాభరాగా ఉన్న అఖిలకి, కళ్ళు తిరిగినట్టు అయింది. ఏం జరిగిందో,   ఏం చేస్తున్నాదో, ఏమీ తెలియని పరిస్థితిలోనే , రాధ తనను కారులో ఎక్కించడం, ఆ కారు డ్రైవర్ సీట్ లో ,ఆమె అన్న కూర్చుని డ్రైవ్ చేస్తూ నడపడం గమనించింది.
 భయం భయంగా చూస్తూ ,మాటరాని స్థితిలో ఉన్న అఖిలను చూసి ,రాధకు చాలా జాలి వేసింది.
 వెంటనే తన బ్యాగులో ఉన్న మంచినీళ్ల సీసా తీసి, మంచి నీళ్లు తాగమని అఖిలకు ఇచ్చింది.
 గటగటా మంచినీళ్లు తాగిన తర్వాత, అఖిలకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది.
 అటుపై రాధ చెప్పిన మాటలు విన్న అఖిల నిశ్చేష్టురాలయింది.
 
  తను ఆఫీసు వాళ్లతో రిసార్ట్ కి వెళ్తాను , అనగానే ఆనంద్ కి అనుమానం వచ్చిందట .ఎందుకంటే అతను అంతకముందే బాస్ మంచివాడు కాదని విన్నాడట .
  కానీ  అఖిల మీద నమ్మకం ఉన్నందువల్ల అతను ఏనాడూ ఆమెను  అనుమానించడం గాని, ప్రశ్నించడం గాని చెయ్యలేదట.
  
కానీ రిసార్ట్ కి వెళతానన్న దగ్గర నుండీ , ఆనందు  ఆరాలు తీస్తూనే ఉన్నాడట ,.ఎక్కడికి వెళుతున్నారు ?, ఎక్కడ ఉంటున్నారు,? ఏమిటి ?,అన్న సంగతులు  తెలుసుకున్నాడట .బాస్ కూడా బయలుదేరుతున్నాడని ,తనతో అఖిలను, ఇంకో అమ్మాయినీ కూడా తన కారులో కూర్చోబెట్టుకున్నాడనీ ,  వేరే చోటికి తీసుకెళ్తున్నాడని కూడా విన్నాడట.

అందుకే పక్కనున్న  రాధ తో మాట్లాడి ,వాళ్ళ అన్నయ్య పోలీసైనందున అతని సహాయం కోరాడట.
ఆ హోటల్ కి అంత మంచి పేరు లేనందున, ఆనంద్ వేసిన ప్లాన్ ఫలించిందట.

పోలీసులు హోటల్ మీద రైడ్ చేస్తున్నారని అనిపించేంతగా, "ప్లాన్" రక్తి కట్టించారు.
అఖిల అతడి "కామానికి" బలికాకుండానే రాధ, వాళ్ళ అన్నయ్య ఆమెను రక్షించి , సేఫ్ గా ఇంటికి తీసుకు వెళుతునన్నారట....
.
 నిజానికి బాస్, ఆ రాత్రి మరో నలుగురిని పిలిచి , 
 వారితో పాటుగా, తనను మానభంగం చేయాలని ప్లాన్ చేశాడట.
 తను , పరువుకు భయపడతానని ,అందుకే అరవడం గానీ ,  పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం గానీ , చేయలేనని , అందువల్ల  తమ పని  అయిన తర్వాత , తనంతట తానే  ఏ నుయ్యో - గొయ్యో చూసుకుంటుందని , దాంతో తమ కోరిక తీరడమేకాక ,ఇకముందు ఆమె వల్ల ప్రమాదముమూ ఉండదన తలచి, ఎప్పటినుంచో ప్లాన్ వేస్తున్నాడట.
అతనికి ఈరోజు అవకాశం దొరకడంతో చాకచక్యంగా తన ప్లాన్ ని, అమలుపరిచేడట.
ఈ సంగతులన్నీ తెలుసుకున్న ఆనంద్, ముందుగానే నీకు చెప్పి, వెళ్ళొద్దంటే , నువ్వు వాళ్ళ అందరితో వెళ్లడం ఇష్టం లేక అలా చెప్తున్నాడని   అనుకుంటావేమోనని,
నువ్వు వెళ్ళిన రోజు నుంచే అన్నీ కనిపెడుతూ ,
ఈరోజు ఏ ప్రమాదం జరగకుండా నిన్ను ఇంటికి చేర్చే విధంగా ప్లాన్ చేశాడని చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయింది.

ప్లాన్ విజయవంతంగా పూర్తయినందుకు ,తనకు ఎంతో ఆనందంగా ఉందని, రాధ చెప్తుతూ ఉంటే ,వింటున్న అఖిల నిర్గాంత పోయింది.

"నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఆనంద్  నాకు తెలుసు అఖిలా. ఇరుగు-పొరుగునే ఉంటున్నాము కదా!
ఒకరి కష్టం తెలుసుకునే మనసుంది .అందర్నీ గౌరవించే సంస్కారం ఉంది.
ఒక చెడు ఆలోచన గాని, చెడ్డ గుణాలు కానీ , చెడు అలవాట్లు కూడా లేని, ఆనంద్ లాంటి భర్త ,అందరికీ దొరకడఖిలా.నువ్వు చాలా అదృష్టవంతురాలివి ".. 
అని రాధ.
అంటూ ఉంటే , అఖిల కళ్ళలో నీళ్లు తిరిగాయి.
తన సంకుచిత మనస్తత్వానికి ,తనకే సిగ్గు వేస్తోంది ఇప్పుడు.
నిజమే !ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తూ ఉంటే, ఆనంద్ లాంటి మంచి వ్యక్తి తనకు భర్తగా దొరకడం, తన అదృష్టమనే అనిపిస్తున్నాది.

లేకపోతే.. ఏంటి ? ఈ విషయాలన్నీ ఆనంద్ కు ముందే తెలుసా?
 తెలిసి కూడా ,తన మీద నమ్మకం ఉండడం వల్ల ,  తనని అనుమానించకుండా ఊరుకున్నాడా..?
ఎప్పుడూ మౌనంగా ఉండే ఆనంద్ , తన మంచి చెడులు కూడా ఎప్పుడూ  పట్టించుకోడే అనుకున్న ఆనంద్ ,
ఈరోజు ఒక రాక్షసుడి చేతిలో నుంచి, తనను రక్షించడానికి, ఇంత కష్టపడ్డాడా...?

అఖిల కంటి నుంచి కన్నీరు ధారగా కారుతోంది.
రాధ, అఖిలా!  కారు దిగు. ఇల్లు వచ్చేసింది .
అనడంతో ఇంట్లోకి ఎలా వెళ్లాలా అనుకుంటూ,  సిగ్గుతో తల దించు కుంది  అఖిల.
రాధ, తన చేయి పట్టుకుని గుమ్మం దాకా తీసుకెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది.
ఎప్పటిలాగే ఆనంద్ తలుపు తీసి, అదే చిరునవ్వుతో ఎదురుగా నిలబడి ఉన్నాడు.
అఖిల ,ఆనంద్ ని చూడలేక ,పరుగు -పరుగున , తన రూమ్ లోకి వెళ్ళిపోయింది.
ఆ తరువాత ఏమైందో ,ఆ రాత్రి ఎలా గడిచిందో,  తను ఎంత ఏడ్చిందో..,తనకు ఎప్పుడు నిద్ర పట్టిందో ,అఖిలకు ఏమీ తెలియలేదు.
అఖిలా ,అఖిలా, అంటూ, పిలుస్తున్న ఆనంద్ పిలుపుకు, కళ్ళు తెరిచింది అఖిల.
గోడ గడియారం పగలు 10 గంటల సమయం చూపిస్తున్నాది.
ఆనంద్ చేతిలో ఉన్న కాఫీ అఖిల చేతికి అందిస్తూ ముందు కాఫీ తాగు అఖిలా! తర్వాత లేచి ఫ్రెష్ అవుదు గాని అంటున్నాడు.
అఖిల మెల్లగా కాఫీ అందుకుంది.
చిన్నగా తలెత్తి చూసింది. మేరు పర్వతంలా ఎత్తుగా కనిపించాడు ఆనంద్.
ఎంత మామూలుగా మాట్లాడుతున్నాడు. నిన్న రాత్రి అంత జరిగినా ,ఒక ప్రశ్న కూడా తనను వెయ్యలేదు.
ఏమీ జరగనట్టు తనతో మామూలుగా ఉంటున్నాడు.
అదే ఇంకొక మగాడైతే , తన గతేంకాను ..? నిజంగానే హోటల్లో రైడ్ జరిగి ఉంటే ,తను ఈసరికి జైల్లో కదా ఉండేది. ఎంత అప్రతిష్ట. అప్పుడు ఎవరికీ మొహం చూపించలేక నిజంగానే తను, ఏ నుయ్యో- గొయ్యో చూసుకో వలసి వచ్చేది కదా.....

కానీ...ఆనంద్ ... తన మనసు కష్టపడకుండా ఉండేందుకు ,తనకు తెలియకుండా ఎంత ఉన్నతంగా ప్రవర్తించాడు.
పైగా కాఫీ కూడా చేసి పట్టుకొచ్చాడు . ఆనందు ఎంత మంచివాడు.
అఖిలకు మొదటిసారిగా ,ఆనంద్ చేసిన కాఫీ, చాలా రుచిగా అనిపించింది.
ఆనంద్, అక్కడే నిల్చుని, అఖిల పెట్టి లోంచి బట్టలన్నీ తీసి, ఆమె వాడ్రోబులో సద్ధుతున్నాడు.
అఖిలకు ఈరోజు ఆనంద్ చేస్తున్న ఆ పని ,ఆడారి పనిలా అనిపించలేదు. 
మొట్టమొదటిసారిగా అఖిల ఆనంద్ వ్యక్తిత్వానికి తలవంచింది.
అందంగా లేకపోతేనేం... ఆనంద్ లో ఉన్నతమైన భావాలు న్నాయి.
పొట్టిగా ఉంటేనే ఆనందులో , సభ్యత ,సంస్కారాలున్నాయి.
ఎక్కువగా మాట్లాడకపోతేనేం... ఆనందులో తనను ప్రేమించే గుణం ఉంది.
పెదాలు మోటుగా ఉంటేనేం.. ఆ నవ్వులో, నిర్మలత్వం ఉంది.
పెళ్లయిన తర్వాత ,కొన్ని రోజుల వరకు ,తను ఆనంద్ ని దగ్గరికి రానివ్వకపోయినా, ఆనంద్ ఏ ఆడదానిని కించపరిచే విధంగా, వెకిలితనంగా, ప్రవర్తించలేదు.
ఎప్పుడూ తన మంచి చెడులు చూసుకుంటూ, తను పడబోయే కష్టాన్ని,  ఇష్టంగా పాలు పంచుకుంటూనే ఉన్నాడు, 

"పాపిష్టిది .తనే అతన్ని ఎప్పుడూ సహృదయంతో చూడలేదు. నాణేనికి ఒకవైపే చూసింది, కానీ రెండవ వైపు కూడా ఓసారి చూద్దామని అనుకోలేకపోయింది .
అతని రూపాన్నే చూసింది గాని ,అతని గుణాన్ని  గమనించలేకపోయింది.

తన అదృష్టం బాగుండి ఆనంద్ లాంటి భర్త లభించాడు .
తను అతని బాహ్య సౌందర్యానికే విలువచ్చింది, గాని అంతః సౌందర్యాన్ని  గమనించలేకపోయింది.
తనే పాపిష్టిది .తన ఆలోచనలే బాగోలేవు. అనుకుంటూ, నెమ్మదిగా తలెత్తి  ,కన్నీళ్ళతో ఆనంద్ వైపు చూసింది.

చిన్న బర్ముడాలో, చేతులు లేని బనీన్ లో ,ఆనంద్ ఆరోజు ఎంత అందంగా కనిపిస్తున్నాడో.... అఖిల మెల్లగా లేచి, ఆనంద్ కు దగ్గరగా వెళ్లి నిలబడింది.
"ఏం కావాలి అఖిలా "అన్న ఆనంద్ మాటలకు జవాబుగా,
అఖిల ఒక్కసారిగా ఆనంద్ పాదాలపై వాలిపోయింది.

ఆనంద్ అఖిలను మెల్లగా లేపి హృదయానికి హత్తుకున్నాడు. మొదటిసారిగా, రెండు హృదయాలు ఒకటై  మాట్లాడుకుంటున్నాయి. మౌనరాగాలతో మధుర గీతాలు పాడుకుంటున్నాయి.


                                   సుఖాంతం.
********************""********""""""""""
 ఈ కథ ఏ మాధ్యమునందును  ప్రచురితము కాని,
 నా స్వీయ రచన.



 
 

 
 
 



Wednesday, July 12, 2023

శీర్షిక : అందమైన అనుభవం.

13/07/2023.
తపస్వి మనోహరం E-book  కొరకు కథ.
అంశం:* రైలు " కథలు...

శీర్షిక : అందమైన అనుభవం.
    రచన :     శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.
    కళ్యాణ్ : మహారాష్ట్ర.

కధా ప్రారంభం.
-------------
బట్టలు సర్దుతూనే  మా వారి మీద నేను విసుక్కుంటున్నాను
"ఆయనేప్పుడూ ఇంతే .ఏ రోజు ఏ పని వద్దంటామో, ఆ రోజే ఆ పని చేస్తారు.  తిథి ,వార, నక్షత్రాల మీద నమ్మకమే లేదు. జాతకాల మీద నమ్మకం లేదు, శకునాల మీద నమ్మకం లేదు, వాస్తు మీద నమ్మకం లేదు.
పూర్తిగా నమ్మక్కర్లేదు గాని, కనీసం కొంతవరకైనా నమ్మాలి కదా,. పూర్వం పెద్దలు ఎందుకు చెప్పారో..?.. ఏమో.?
 నాకైతే అన్నిటి మీద నమ్మకమే...
 కానీ , ఆడదాని మాట ఎప్పుడు నెగ్గిందని ,ఎప్పుడూ మగాడిదే కదా పై చేయి." అంటూ....
 
  ఇంతకీ జరిగిందేంటంటే..,
 
బొంబాయి లో మా అత్తగారు, ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళని చూడడానికి వెళ్దాం అంటూ , ఆయన "ట్రైన్ కి టికెట్ బుక్ చేస్తాను" అన్నారు . 
చాలా రోజులలై హైదరాబాదులోనే ఉన్నాం కదా. ఇలా .నలుగురినీ కలిసి వస్తే మనసుకు కాస్తా ఆనందంగా ఉంటుంది కదా, అని నేను కూడా" సరే " అన్నాను .
 దాంతో మా వారు సంబరపడిపోయారు 
 
" సరే మంచి రోజు చూడు, టికెట్లు బుక్ చేస్తాను" అని నాతో చెప్పనే చెప్పారు. 
అయితే మంచి రోజు చూసి నేను చెప్పాను కూడా .కానీ ఈయనేమో "అసలు ఎక్కడా రిజర్వేషన్ లేవు" అంటూ కరెక్ట్ గా   "పౌర్ణమి" రోజున టికెట్లు బుక్ చేసేసారు .
దాంతో, నాకేం చేయాలో తోచలేదు లేదు. ఎందుకంటే , పున్నమి రోజు పులి కూడా బయలుదేరదంటారు కదా, మన పెద్దలు.
ఆరోజు బయలుదేరితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో ? అన్న భయంతో, మరో రోజు టికెట్లు దొరుకుతాయేమో చూడండి." అన్నాను .
దాంతో మావారికి చిర్రెత్తుకొచ్చింది.
" నీకు కావలసినప్పుడల్లా రిజర్వేషన్లుదొరుకుతాయా? ఎప్పుడు రిజర్వేషన్లు  దొరికితే అప్పుడు బయలుదేరాలి గానీ" ,అంటూ రుస రుసలాడారు  మావారు .
నేనైతే ప్రతి పౌర్ణమికి ఉపవాసం ఉండి, "సత్యనారాయణ స్వామి వ్రతకల్ప" పుస్తకం ,  చదువుకుని,  స్వామివారికి ప్రసాదం నివేదన చేసి, ఒక ముత్తైదువకి  భోజనం పెట్టి , పసుపు, కుంకం, పండు-తాంబూలాలతో పాటు, చీర పెట్టడం నాకు అలవాటు. అది గాక ,
ఆరోజు ప్రయాణం పడితే,  నేను ఉపవాసంతో ప్రయాణం చేయాలి .  నాకు పూజ కూడా చేయడం అవదు .పౌర్ణమి నాటి పూజ, రాత్రి పూటే , చంద్రోదయం తర్వాత చేస్తారు. ప్రయాణం రోజు పూజ చేయడం కుదరదు .దాంతో వ్రత భంగం అవుతుందనే బాధ మరొకవైపు,  కలుగుతున్నాది.
దాంతో ప్రయాణం రోజు వరకు, ఇద్దరి మధ్యన వాదనలే..," "ఏం పర్వాలేదు వెళదాం " అంటూ అతను,
 "వద్దంటూ" నేను వాదించుకున్నా , మొత్తానికి అతనే నెగ్గారు.
దాంతో " ఏమవుతుందో, ఏమో " అని ఒక ఒక పక్కన భయం వేస్తున్నా , ప్రయాణానికి కావాల్సిన సామాన్లు, బట్టలు, సర్దడం మొదలెట్టేను.
"ఇంకా వంటవండాలి.. భోజనాలు చేయాలి. రాత్రికి ఏదో చేసి పట్టుకోవాలి . అంట్లగిన్నెలు తోముకొని ఇల్లంతా సర్దుకోవాలి."
"ఈ పనులన్నీ ఒక్కత్తినే ఎలా చేస్తానో ఏమో.."
"ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా సరదాగా ఉంటుంది. కానీ ఇంట్లో , టైము లోపల అన్ని పనులు చేసుకుని తెమిలే సరికి తల ప్రాణం తోకకి వస్తుంది.
"ఈయనకి ఒక్క పని కూడా చేతకాదాయే.
ఏ పని చెప్పినా, తిరిగి ఆ పని, నేను చేసుకోవలసి వస్తుంది".
అనుకుంటూ,  విసుక్కుంటూ, ఎలాగో ఒకలాగా , సామానంత సర్ది , ప్రయాణానికి రెడీ అయ్యాను. . 
కరెక్ట్ సమయానికి , ఈయన  బుక్  చేసిన "క్యాబ్ " కుాడా వచ్చేసింది.
దాంతో ఈయన"  తొందరగా,  పద " అంటూ హడావుడి చేసేరు.
" హైదరాబాద్ టు ముంబై  వెళ్ళే హుస్సేన్ సాగర్  ఎక్స్‌ప్రెస్‌ " మధ్యాహ్నం 2:30 కి  హైదరాబాదు  లో బయలుదేరుతుంది.
మేము  "బొల్లారం" ష్టేషన్  వైపు ఉన్నాము
" బేగం పేట్"  కు వెళ్తే గాని,  మాకు బండి ఎక్కడానికి అవ్వదు.
 అందుకనే ,ఎప్పుడు ప్రయాణం చేసినా ఒక గంటన్నర ముందు గానే బయలుదేరవలసి వస్తుంది.
 మొత్తానికి ఇల్లు తాళం పెట్టి, బేగంపేట్ చేరేసరికి రైలు వచ్చి రెడీగా ఉంది.
 ఇద్దరం ఆడుతూ, పడుతూ, కోచ్ వెతుక్కోనేసరికి మరో 10 నిమిషాలు పట్టింది.
 గబగబా సామాన్లన్నీ మోసుకుంటూ, ఈడ్చుకుంటూ, ఎలాగో పెట్టలో పడ్డాం.
 టికెట్లో సీటు నెంబర్లు చూసుకుని వెళ్లేసరికి ,అవన్నీ నిండుగా ఉన్నాయి .మా సీట్లో ఎవరో  దంపతులు కూర్చుని ఉన్నారు.
 మా వారు మర్యాదగా" ఏమండీ ,ఈ సీట్లు మావి. కాస్త లేస్తారా.? సీటు కింద సామాన్లు సర్దుకోవాలి" అని చెప్పారు.
 ఆయన ఒకసారి మా వారి వైపు చూసి ,"ఇవి మీ సీట్లు కావండి . ఇవి. మాసిట్లే. మేము 15 రోజులు ముందు నుండే బుక్ చేసుకున్నాం. " అని అన్నారు.
 దాంతో మా వారు జేబులో ఉన్న టికెట్లు తీసి ,ఆయనకి చూపిస్తూ , "కాదండి ఇవి మా సిట్లే . కావాలంటే చూడండి " అంటూ టిక్కెట్లు  చూపించారు .
 కానీ ఆయన "ససేమిరా" అంటూ అక్కడే కూర్చున్నాడు ఎంతకీ లేవరు." టికెట్లు చూపించాం కదా"
  అని మా ఆయన
  " మా దగ్గర కూడా టికెట్లు ఉన్నాయి కదా  "అంటూ అతను వాదించుకున్నా రు..
  ఈ గొడవ మధ్య నిలబడి, నిలబడి , నా కాళ్లు పీకుతున్నాయి.
  "అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. .టి.సి .రానివ్వండి  అతను ఈ టికెట్ల గొడవ చూసుకుంటాడు " అంటూ కొందరు సలహా ఇచ్చారు.
  దాంతో అతను కాస్త జరిగి మా ఇద్దరం కూర్చునేందుకునందుకు కాసింత చోటు ఇచ్చాడు.
"  బతికేం రా భగవంతుడా " అనుకుంటూ అక్కడ కూర్చున్నాం. 
మా వారు అతనితో "ఏవీ, మీ టికెట్లు చూపించండి" అని అడిగారు . అతను ససేమిరా అన్నాడు.
దాంతో వాళ్లు ,మేము, ఎడముఖం, పెడముఖంగా కూర్చున్నాము.

 టి సి రావడానికి చాలా సమయం పట్టింది.
అతను రాగానే మా వారు ముందు అతనిని పట్టుకుని మా దగ్గరికి తీసుకువచ్చారు .
మా ప్రాబ్లం విన్న టి .సి. చాట్ ని చూశారు .అందులో మా  ఇద్దరి పేర్లు నమోదై ఉన్నాయి.
మా సీట్లలో కూర్చున్న వారి టికెట్లను అడిగారతను.
అతను సణుకుతూ  విసురుగా టిక్కెట్లు చూపించాడు.
టి.సి ,  "ఇవి మీ సీట్లు కావండి . రెండు డబ్బాల అవతల మీ కోచ్  ఉంది చూడండి. అక్కడ ఉన్నాయి మీ సీట్లు అంటూ కోచ్  నంబరు చూపించాడు.
దాంతో అతని మొహం ముడుచుకుని, కోపంగా లేచి, కనీసం "సారీ " అయినా చెప్పకుండా, సామాన్లు,  బరబర మని లాక్కుంటూ వెళ్ళిపోయాడు.
దాంతో" హమ్మయ్య "అనుకుంటూ ,మేము మా సీట్లలో రిలాక్స్ గా కూర్చున్నాం. 
అప్పటిదాకా  ముందున్నతనికి  వంతపాడినందరుా , 
ఒక్కసారిగా మా పక్షాన మాట్లాడడం మొదలెట్టేరు.
"అబ్బో ..అతను టిక్కెట్టు చుాసుకోకుండా , దాబాయింపుతో, ఎంత చక్కగా వీళ్ల సీట్లను ఆక్రమించాడో..." అని ఒకరంటే..
"ఈ కాలంలో అన్యాయం ఎక్కువైపోయిందండీ...
మాట్లాడే వాడు లేకపోతే పుార్తిగా దోచేస్తారు మనల్ని"
అని మరొకరుా... అంటూ ఒకరొకరిగా మాపై ,సానుభుాతి కురిపించేసారు.
మేము మా సామాన్లను సమంగా సీట్లకింద సర్దుబాటు 
చేసుకుని నిశ్ఛింతగా కుార్చున్నాము.
ట్రైన్ లో అందరుా ఆసరికే ఆప్తులైపోయినట్లు  .
ఒకరితోనొకరు  మాట్లాడీసుకుంటున్నారు.
ఇద్దరిద్దరుగా మాట్లాడుకుంటున్న వాళ్ళు , 
ఒకొక్కరుా  వేరు వేరు విషయాలను చర్చిఁచుకుంటుా 
ఉండడం వల్ల , ట్రైన్ అంతా గొడవ గొడవగా ఉండీ..
ఎవరేం మాట్లాడుతున్నారో మరొకరికి అర్ధం కాని రీతిలో , మాకు సమయం బాగానే గడిచుపోతోంది

అందులో కొందరు మాతో కుాడా మాటలు కలుపుతుా
రాజకీయాల దగ్గరినుండి , రైతుల ఇక్కట్ల దాకా , పెరిగిపోతున్న ధరలదగ్గరినుండీ నలిగిపోతున్న మధ్యవర్తుల దాకా, గల అన్ని రకాల బాధలనుా చర్చించుకుంటుా, టైం పాస్  చేస్తున్నారు.

ఈ మధ్యలో అలసట  తెలీకుండానే  రాత్రి ఏడు గంటలు దాటిపోయింది.
చాలా మంది ఇంటినుండి తెచ్చుకున్న ఆహార పదార్ధాలను విప్పి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటుా 
రుచులు ఆస్వాదిస్తున్నారు.
వారితో పాటు మేము కుాడా  తెచ్చుకున్న 
దిబ్బరొట్టెను కొబ్బరి చట్నీతో లాగించేసాము.
రాత్రి ఎనిమిదిన్నర గంటలయ్యేసరికి , చాలామంది తమతమ సీట్ల లో నిద్రకుపక్రమించేదుకు సిద్ధమవుతుా 
తమ తమ సీట్ల లో దుప్పట్లు పరుస్తున్నారు.
కొందరు పై బర్త్ లకు ఎక్కి అసక్కడినుంచీ , కింది బర్త్ వాళ్లతో బాతాకానీలు కొడుతున్నారు.

ఇంతలో ట్రైన్   షోలాపూర్  ష్టేషన్ లో ఆగింది.
కొందరు ఏదో పేద్ద పనిన్నట్లు , ట్రైన్ దిగి 
ఆచివరి నుండి , ఈ చివరి వరకు గల అన్ని ష్టాల్స్ నుా
చుట్టబెడుతుా అక్కరలేకపోయినా ఏవేవో కొనేస్తున్నారు.
షోలాపూర్  లో  ట్రైన్  ఎక్కిన వాళ్ళు, ,
 , గాభరాగా , తమ తమ సీట్లను   వెతుక్కుంటూ , 
అందరినీ తోసుకుంటుా, గుద్దుకుంటుా  వెళిపోతున్నారు.
ట్రైన్ అంతా గొడవ గొడవగా తయారయింది.

ఈ గొడవలో , ఒక  పాతికేళ్ల  అబ్బాయి ,అటూ ఇటూ ఈ కోచ్ నుండి ఆ కోచ్ కి, ఆ కోచ్ నుండి ఈ కోచ్ కి,  తన సీట్ కోసం వెతుక్కుంటూ తిరగడం నేను గమనించాను.
అతని చేతిలో బరువైన పెట్టె ఉంది .
దానిని ఈ చేతి నుండి ఆ చేతికి , ఆ చేతి నుండి ఈ చేతికి, మార్చుకుంటూ , పాపం  ఆకొస నుండి ఈ కొసకి.. ఈ కొసనుండి ఆ కొసకి , తిరుగుతూన్నాడు.

అక్కడ ఎక్కిన వారంతా సద్దుకుని , నిద్రకుపక్రమించేరు. కానీ  ఈ అబ్బాయికి మాత్రం
తన సీటు ఎక్కడో  తెలియనట్టుంది .చేతిలో బరువుతో  ఎప్పటినుంచో అలా తిరుగుతుానే ఉన్నాడు.
నాకు అతని మీద చాలా జాలేసింది.
నేను మా వారితో
" ఏవండీ  , ఆ అబ్బాయి చాలాసేపటినుండి అలా తిరుగుతూనే ఉన్నాడు . పాపం .అతనిది ఈ కోచ్ కాదేమొా ।  అతను  ఎక్కడికెళ్తున్నాడో కనుక్కొని 
ఆతని సీట్ నంబరేదొ మీరే చుాసి చెప్పండి. అతను కుాడా ముందు ,  మనసీట్లో కుార్చున్నవారిలా, కన్ఫ్యుాజ్  అవుతున్నట్టున్నాడులా ఉంది. మన  అబ్బాయి వయసే ఉంటుంది .
ముందు కాస్తా , ఆ అబ్బాయిని  కాసేపు ఇక్కడ కూర్చోనిచ్ఛి, "ఆ తర్వాత వివరాలు అడుగుదాం * అన్నాను.

మా వారు ఏదో అనే లోపునే , ఆ పక్కన కూర్చున్న వాళ్ళు , *అతి కష్టం మీద మీ సీట్లు మీకు దొరికాయి. 
" మళ్లీ ఇంకొకరితో. ఎందుకు చెప్పండి , ఇతనెలాంటివాడో..
ఏంటో...
ఈ కాలంలో ఎవరినీ నమ్మకుాడదండీ...జాలి అస్సలు పనికి రాదు.  టి సి రానివ్వండి అప్పుడు ఇతని సంగతి, అతనే చూసుకుంటాడు." అన్నాడు .
 ఇంతలో మరొకతను. 
 "వద్దండీ .ఇలాంటి వాళ్ళలో, దొంగలు కూడా ఉంటారు. ఇలా తిరుగుతూనే , మనల్ని ఏమార్చి , మన సామాన్లు పట్టుకెళ్ళిపోతారు . ముందుగా అతనిది, ఏ కోచో ,ఏ సీట్ నెంబరో, అడిగి తెలుసుకోండి . అంతేగాని కొత్త వారెవరికి చోటు ఇవ్వకండి." అంటూ ఒక ఉచిత సలహా పారేశాడు.
అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్లు అతనికి వంతు పాడారు.
ఈలోగా ఆ అబ్బాయి కరెక్ట్ గా, మా సీట్ల దగ్గరికే వచ్చి
ఆ పెట్టెను చేతితో పట్టుకొనే ,ఒక పక్కకు ఒదిగి  అలసటగా నిలుచున్నాడు.
అంతలో మరొక అతను" చూశారా ! అతను, ఆ పెట్టెను ఎంత జాగ్రత్తగా పట్టుకున్నాడో ! అందులో ఏముందో ఏమో ? ఆ పెట్టను కనీసం,  కిందకు కూడా దించడం లేదు '" అన్నాడు గుసగుసగా.
వెంటనే ఆ పక్కనున్నతను, " అవునవును. ఇలాంటి వాళ్లే రైళ్లలో అందరూ పడుకునేటప్పుడు , మత్తుమందు జల్లి, సామాన్లన్నీ పట్టుకొని పోతారు. ఇలాగే నటించి ముందు కొంచెం జాగా అడుగుతారు. ఆ తర్వాత మనకు నమ్మకం కలిగించేట్టు మాట్లాడతారు . మనం వాళ్ళని,  నమ్మేమని తెలిసిన తర్వాత ,మనల్ని  పూర్తిగా  దోచేస్తారు. ఈ మధ్య ఇది ఒక బిజినెస్ అయిపోయింది. 
వీళ్ళ గ్యాంగ్ అంతా చుట్టుపక్కల ఎక్కడో , ఉండే ఉంటుంది. 
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.".   అంటూ చెప్పుకుపోతున్నాడు  
అయితే, మాకు మాత్రం అతను చాలా మంచివాడు లాగా కనిపిస్తున్నాడు అతని ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాది.
నేను మా వారు వైపు చూశాను . ఆయన వెంటనే ఆ అబ్బాయిని పిలిచి , "ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆ పెట్టె పట్టుకుని అలా తిరుగుతుతూనే ఉన్నావు .మీకు టిక్కెట్ లేదా.బాబుా.? "అని అడిగారు.
అతను మరాఠీలో "లేదండి! నా టిక్కెట్టు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు . ఏ కోచో తెలియదు .ఏ సీటో తెలీదు.
 మా గురువుగారు నన్ను పూనా వెళ్ళమని ,అక్జడ గురువులకు ఈ పెట్టెను అందించమవి , అన్నారు. ఈ కోచ్ లో ఎక్కి , టికెట్ కలక్టరు వచ్చనపుడు ,నన్ను అతనికి ఫోన్ చేయమన్నారు.   నేను  టికెట్ కలక్టరుగారి కొిసం వెతుక్కుంటుా ఆటెళ్ళగానే , ఒకతను అతను ఇటువైపు ఉన్నట్లు చెప్పారు. దాంతో నేను మళ్ళీ ఇటు వచ్చాను . అలా తిరుగుతుానే ఉన్నాను గానీ టికెట్ కలక్టరు గారిని కలవలేకపోయాను . అతను ఎక్కడున్నారో   ?..ఏమొా...?
 చేతిలో పెట్టె , చాలా బరువుగా ఉండడం వల్ల 
 నాకు,  చాలా అలసట ఆనిపించి ఇక్కడ ఆగాను .
 అంటుా చెప్పుకొచ్చాడు.
మావారు కుాడా ఆతని వాళకం చుాసి ,
  "సరే బాబు. ఇలా రా , టి సి వచ్చేదాకా ఇక్కడ కూర్చో "అని అన్నారు. 
  అతను వెంటనే మరాఠీలో
  " ధన్యవాదాలు దాదా" అంటూ, సీట్లో ఒక పక్కన ఒదిగి కూర్చున్నాడు . 
  కానీ అతను, ఆ పెట్టెను మాత్రం, కింద పెట్టలేదు. 
  అది చిన్న బ్రీఫ్ కేస్ సైజ్ లో ఉంది. అతను ఆ పెట్టెను తన ఒడిలో పెట్టుకునే కూర్చున్నాడు.
 అక్కడ ఉన్న అందరూ మా వారి వైపు కోపంగానే గాక ,  , అనుమానం గా కూడా     చూశారు. 
 "ఆపెట్టెలో ఏముందో..?.అది మొాయలేనంత బరువు ఎందుకుందో...? అన్న అనుమానం మాకుా వచ్చింది.
 
కానీ  మా వారు అందరితో  టి.సి వచ్చాక ఇతని సంగతి చూద్దాం. అంతదాకా ఓపిక పడదాం " అని నచ్చచెప్పారు.
 కొంతసేపట్లో అంతా సర్దుకుని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు ఈ లోపల మావారు, ఆ  మారాఠీ అబ్బాయితో "ఎక్కడికి వెళ్తున్నావు బాబూ, టికెట్ లేకుండా ఎందుకు ట్రైన్ ఎక్కావు ' అని అడిగారు.
 వెంటనే ఆ అబ్బాయి "పూనాలో నేను, ఈ దత్త గురు పాదుకలని అందించాలండీ .అక్కడ  గురు పౌర్ణమి
 సందర్భంగా ,తెల్లారి నాలుగు గంటల సమయంలో నగర సంకీర్తనోత్సవం జరుగుతుంది . ఆ సమయానికి నేను ఈ  దత్తగురు పాదుకలని ,అక్కడి గురువు గారికి అందించాలి . . ప్రతీ ఏడాదీ, మా గురువుగారు , 
 ఈ శ్రీపాదవల్లభుని  పాద పద్మాలను , ఈ ఉత్సవాలకు 
 పంపిస్తుా ఉంటారు. ఈ వత్సరమే నాకు ఈ సదవకాసం వచ్చింది . నేను వారివద్ద వేదం నేర్చుకుంటున్నాను. వారి ఆజ్ఞ  తోనే  నేను షోలాపూర్ 
 లో ఈ ట్రైన్  ఎక్కేను. సడన్గా , ప్రోగ్రాం ఫిక్స్ అవడంతో నాకు టికెట్ సమస్య వచ్చింది .
 మా గురువుగారు చాలా మంచివారు.  టీ.సీ రాగానే, తప్పకుండా నాకు టికెట్ అరేంజ్ చేస్తారు.," 
 అని, అతడు చెబుతుండగానే , టి.సి., కొత్తగా సోలాపూర్ లో ఎక్కిన వాళ్ళ టికెట్లు, చెక్ చేసుకుంటూ ,  అటువైపుగా వచ్చారు.
మరాఠీ అబ్బాయి ఆనందంగా లేచి నిలబడ్డాడు.
 
 
********

అతను లేచి టికెట్ కలెక్టర్‌ తో తన గోడు వెళ్ళబోసుకొని , 
తనకు" పుానా " దాకా సీటు కావాలని  అడిగాడు.
టి సి..ఈ ట్రైన్ లో, మరెక్కడా వెయిటింగ్ లిష్ట్ లో
ఖాళీలు లేవనీ , కావాలంటే టిక్కెట్టు తీసుకోమని 
చెప్పాడు.

ఆ అబ్బాయి వాళ్ళ గురువుగారికి పదే పదే ఫోన్ చేస్తున్నాడు. కానీ ఫోన్ కనెక్ట్  అవడం లేదు.
డబ్బిస్తే గానీ టికెట్టు  ఇవ్వనని టి.సి.అరుస్తున్నాడు .
ఆ అబ్బాయి తన దగ్గర  అసలు డబ్బులు లేవని , 
తనకు రాత్రి భోజనానికి కుాడా డబ్బు లేదని ,
ఒక్కసారి గురువుగారికి ఫోన్ కనెక్ట్ అవుతే , ఆయన తప్పకుండా తనకోసం టిక్కెట్ తీసుకుంటారని," పదేపదే  టి.సి.ని బతిమాలుతున్నాడు.
అతని పరిస్థితి చూస్తూ ఉంటే  మాకు చాలా బాధ వేసింది.
వెంటనే నేను మా వారితో, ఈరోజు గురుపౌర్ణమి కదండీ. ఆ అబ్బాయి నిజమే చెప్తున్నాడేమొ . నిజంగానే  ఆ పెట్టిలో " దత్త గురు పాదుకలు " ఉన్నాయేమో....
మీరు అప్పుడప్పుడు చాలా మందికి ధన దానం చేసిన రోజులున్నాయి కదా...
అలాగే అనుకుని మీరు ఈ అబ్బాయికి టికెట్ తీసి ఇవ్వండి, పాపం , ఇప్పటికే చాలాసేపటి నుంచి అవస్థలు పడుతున్నాడు" అన్నాను.
ఆయన కాసేపు ఆలోచించి ,  టి.సిని పిలిచి ఆ అబ్బాయి కోసం 2000. పే చేసి ,టికెట్ తీసుకున్నారు.
ఆ అబ్బాయి కృతజ్ఞతతో మా వైపు చూస్తూ . మా గురువుగారికి ఫోన్ కనెక్ట్ అవ్వగానే ,నేను తప్పకుండా మీరు చేసిన సహాయం గురించి చెబుతాను . ఆయన వెంటనే మీకు టికెట్ డబ్బులు తిరిగి  ఇచ్చేస్తారు " అంటూ ఆనందంగా టికెట్ తీసుకున్నాడు. 
నేను అతను "భోజనం చేయలేదు " అన్నమాట  జ్ఞప్తికి వచ్చి, మాతో తెచ్చుకున్న  ఫ్రూట్స్ కొన్ని తీసి ఆయన చేతిలో పెట్టాను. ఆయన నా వైపు కృతజ్ఞతగా చూసాడు .
అక్కడున్నవారంతా  మమ్మల్ని  వెర్రి వాళ్ళమన్నట్టు
చుాస్తుా..మేం చేసిన పనిని విమర్శిస్తుా..
ముసి ముసిగా నవ్వుకుంటున్నారు.  కొందరు , ఈ అబ్బాయి వల్ల తమకు  ఏమైనా నష్టం జరిగితే , 
దానికి మేమే బాధ్యులమని, తెగేసి చెపుతున్నారు.
మావారు మాత్రం ఎవరికీ సమాధానమీయకుండా , 
సైలెంట్ గా కుార్చున్నారు.

ఇంతలో ఆ అబ్బాయి మాతో , " ఏమండీ . నేను కాసేపు
ఈ పెట్టెను మీ సీటుమీద పెట్టవచ్చా"... అని అడిగాడు.
మేము" సరే"  అన్నాము. 
 ఆ అబ్బాయి ముందుగా ఆ సీటును , ఒకచేత్తోనే నీళ్ళతో  శుభ్రంగా తుడిచి ,
జాగర్తగా ఆ పెట్టెను సీటు మీద పెట్టేడు

తర్వాత అందరివైపుా చుాస్తుా...
" ఈ రోజు అతి పవిత్రమైన రోజైన గురు పౌర్ణమి .
నేను , శ్రీపాదవల్లభుని పాద ప్రతిమలను,  మాగురువుగారి ఆజ్ఞ  మేరకు, పుానాలో గల గురువులకు,  అందించబోతున్నాను .
సమయానికి టికెట్  దొరకని కారణంగా , నాకు సహాయం చేసిన అన్నగారితో పాటు , మీ అందరికీ  కుాడా ధన్యవాదాలు  తెలుపుకుంటున్నాను. 
మీరంతా నాకు చేసిన ఈ సహాయానికి నేను సదా కృతజ్ఞుణ్ణి. మీరు చేసిన సహాయానికి ప్రతి ఫలంగా ,
  మీరంతా "శ్రీపాద వల్లభుని" కృపకు పాత్రులు కావాలని మనసారా కోరుకుంటుా ,  నేను మీకు "గురుపాదుకా దర్శనం" ఈయబోతున్నాను. 
  అని అందరికీ నమస్కరించి , ఆ పెట్టె ముాతను 
  తీయడానికి సిద్ధమయ్యాడు.
అక్కడున్నవారిలో కొంతమంది భక్తిగా చుాస్తుా ఉంటే , మరి కొంత మంది , భయంగా చుాస్తున్నారు. మరి కొంతమంది తాము ఆ అబ్బాయిని అవమానించి ,  అవహేళన చేసామని తెలిసికూడా, అతను, తమకు ఇంత గౌరవం ఇస్తున్నందుకు సిగ్గుతో తలవంచుకున్నారు.
  మేము  కుాడా,  అతను ఆ పెట్టి తెరుస్తున్నందుకు ఆత్రంగా చుాస్తున్నాము .
  అతను ఆ పెట్టెకు వేసి ఉన్న చిన్న తాళం కప్పను  తొలగించి   , ఆ పెట్టె ముాతను తెరచాడు.
  అంతే ! అందరి కళ్ళుా ఒక్కసారిగా జిగేల్ మన్నాయి. అందరి నోర్లుా , ఆసాంతంగా తెరచుకున్నాయి. 
  మా కుాపే అంతా మంచి గంధపు సువాసనతో నిండిపోయింది. 
ఆ పెట్టెలోపల వెలుగుతున్న  చిన్న చిన్న లైట్ల వెలుగులో, చిరునవ్వులు చిందిస్తున్న  
 శ్రీపాద వల్లభుని చిత్రపటం , పెట్టె  మూతగా గల పైభాగంలో  ప్రసన్నంగా కనిపిస్తోంది .
  పెట్టె క్రింది భాగంలో , బంగారం తొడుగుతో  మహిమాన్వితమైన " గురు పాదుకలు "  వింత వెలుగులతో ప్రకాశిస్తుా  కనిపించాయి. 
 ఒక్కసారిగా మా ఒళ్ళు ఒక్కసారిగా జలదరించి , భక్తితో .
 పులకరించింది.
 కళ్ళ నుండీ , ఆనందభాష్పాలు కురియసాగాయి. 
 ఆవల కిటికీ లోంచీ పుార్ణ చంద్రుని దర్శనం , లోపల గరు పాదుకా దర్శనం తో, మా జన్మ ధన్యమైపోయింది. 
అంతదాకా,  ఆ అబ్బాయిమీద అనుమానపడిన వారంతా ఒక్క సారిగా లేచి , పాదుకలకు భక్తితో నమస్కరించి , ఆ అబ్బాయిని ఆప్యాయంగా 
దగ్గరకు తీసుకుంటున్నారు. 
అంతేకాదు , మా వల్లే తమకీ భాగ్యం కలిగిందని 
మమ్మల్ని వేనోళ్ళ కొనియాడడం మొదలెట్టేరు. 
ఈ అనందకర సమయంలో మేమంతా మునిగి ఉండగానే , ఆ అబ్బాయి ఫోను మొాగింది.
ఆ అబ్బాయి ఫోను చుాసుకొని , "మా గురువుగారు" చేసారంటుా.. ఆనందంగా చెప్తూ,.మాట్లాడడం మొదలెట్టాడు.
తను ట్రైన్ ఎక్కిన దగ్గర్నుంచి పడిన కష్టం అంతా చెప్పాడు  టికెట్ కలెక్టర్ వచ్చిన సమయంలో తను గురువుగారికి 
ఎన్నిసార్లు ఫోన్ చేసినా,  ఫోను తగలక తను ఎంత ఇబ్బంది పడ్డాడో చెప్పాడు.
చివరకు తన మీద నమ్మకంతో ,తనకు టిక్జెట్టు తీసి,. సీటు ఇప్పించినన  మా గురించి గొప్పగా చెప్పేడు.
కొంత సేపు మాట్లాడాకా అతను ఫోను మా వారి చేతికిచ్చాడు 
"గురువుగారు మీతో మాట్లాడతారట " అంటుా.. 

మా వారు మొగమాటపడుతుా , ఫోన్ తీసుకున్నారు.
మా వారు ,అవతలి వైపు గురువు గారికి నమస్కారం చెప్పారు.  అటు నుండి గురువుగారు కూడా, మా వారికి ప్రతి నమస్కారం చేసి,
అత్యవసర సమయంలో తమ శిష్యునికి  సహాయం చేసి నందుకు ధన్యవాదాలు తెలుపుతూ,  మేము టిక్కెట్ కొరకు పే చేసిన సొమ్మును , గూగుల్ పే చేస్తానని  చెప్పి. ,మా వారి ఫోన్ నెంబరు అడిగి తీసుకుని , మాకు  మరొకసారి ధన్యవాదాలు చెప్పి, ఫోన్ కట్ చేశారు
మరుక్షణమే మా రెండు వేల రూపాయలు, ఫోన్ ద్వారా  అకౌంట్ లోకి చేరిపోయాయి.
 గురు శిష్యుల నిబద్ధత, చిత్తశుద్ధి,  చూసిన మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో కూడా ఇటువంటి మనుషులు ఉన్నందుకు ఆనందం కలిగింది..
 ఆ తర్వాత ఆఅబ్బాయి ,తాను ఉంటున్న ప్రదేశం గురించి చెప్పి ,శ్రీపాద వల్లభుల నిజపాదుకలు గల ,ఆ మందిరానికి తమను తప్పకుండా రమ్మని  ఆహ్వానించి, తాము వచ్చినప్పుడు  అతనికి తెలియజేస్తే  , తమకు రూమ్ సదుపాయం, భోజన సదుపాయం ,తప్పకుండా చేస్తానని చెప్పి ,  తన ఫోన్ నెంబర్ ఇచ్చి, అందరికీ నమస్కరించీ , "గురుపాదుక" లను తీసుకొని , అందరికీ శుభ రాత్రి చెప్పి, ఆ అబ్బాయి ,తనకు నియమించిన సీట్ లోకి వెళ్ళిపోయాడు.
 ఆ రాత్రి అందరూ అదే విషయం గురించి  ఆనందంగా చర్చించుకుంటూ, మాకు ధన్యవాదాలు తెలుపుతూ , మాట్లాడుకోవడం లో సమయం, అర్థ రాత్రి దాటింది.
ఆ  రాత్రి అందరూ,  అలా మాట్లాడుకుంటూనే ,  హాయిగా నిద్రలోకి జారుకున్నారు.
 మాకు కూడా, పడుకున్న కాసేపటికి  , బాగా నిద్ర పట్టేసింది.
 తర్వాత,  ,పూనా ఎప్పుడు వచ్చిందో ,  ఆ అబ్బాయి ఎప్పుడు దిగిపోయాడో కూడా,  మాకు తెలియలేదు.
 కానీ ఆనాటి అనుభవం , మేము ఎప్పటికీ మర్చిపోలేము.
 ఆనాడే కాదు , ఎప్పటికీ కూడా, పౌర్ణమి వచ్చిందంటే ఈ సంఘటన , మాకు బాగా జ్ఞాపకం వస్తుంది.
 ఆ అబ్బాయి జ్ఞాపకం వస్తాడు. అతని గురువుగారు జ్ఞాపకం వస్తారు.  జరిగిన ఆ సంఘటన తర్వాత మేము శ్రీపాద వల్లభునకు నిజ భక్తులమయ్యాము. అంతే కాదు .మా పూజ మందిరంలో , సద్గురు ,శ్రీపాద వల్లభుల , దివ్య పాదుకులను మేము కూడా ప్రతిష్ట చేసుకున్నాము. 
 మీరంతా ఎప్పుడైనా మా ఇంటికి తప్పకుండా రండి.
 మా ఇంటి పూజా మందిరంలో గల , "శ్రీ పాద వల్లభుల పాదుకా దర్శనము" చేసుకొని , మా ఆతిథ్యం స్వీకరించి, 
మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లండి .
 
               "   ఓం శ్రీ గురు దత్తాయ నమః "
 













  
 
 


 

Sunday, July 9, 2023

మను ధర్మ శాస్త్రములు.

మనోహరీ మహిళా పత్రిక కొరకు,
మను ధర్మ శాస్త్రములు.
రచన : శ్రీ మతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


యుగాల క్రితం ,చిహ్నం లేని, ప్రమాణముకన్నా హీనమై, నిద్రావస్థలోనున్న జగత్తును పునరుద్ధరించడానికై, స్వయంభువుడు, అవ్యక్ర గోచరుడు అయినవాడు, సమస్త ప్రాణి కోటికీ ఆత్మయైన పరమాత్ముడు- స్వయముగానుద్భవించి, మొదట జలమును సృజించి, అందులో ,శక్తి బీజమును వదిలిపెట్టెను. సహస్ర సూర్య తేజోరాజమైన ఆ బీజము ,అండమువలె, సువర్ణ ఆకారోత్పన్నమై, అందునుండి సమస్త లోకములను సృష్టించు బ్రహ్మనుత్పన్నము చేసెను.

ఈ బ్రహ్మోత్పన్నమైన జలము,  "నారా" అని పిలువబడుతూ, ఆత్మకు పథమస్థానమై "నారాయణునకు" నివాసయోగ్యమైనది. తదుపరి అందుండి ,సకల చరాచర జగత్తునూ సృష్టించే బ్రహ్మ , తపఃశక్తిచే రెండు ఖండాలుగా విభజింపబడిన భూమ్యాకాశాలను ,సముద్రాలను, సృష్టించెను.
లోక వృద్ధికై, ధర్మా- ధర్మ,  సుఖ-దుఃఖ  ,ఇంద్రియ-
కర్మలకు నిలయమైన దేహమును సృష్టించి , వివిధ
కర్మలకు ,వివిధ ఇంద్రియములను ,బ్రాహ్మణ  -క్షత్రియ -
వైశ్య  ,శుాద్రులను , సృష్టించెను.

పిదప ,తన దేహమును సగము పురుషునిగా  ,సగము స్త్రీ గా ,విభజింపజేసి  ,ఆ స్త్రీలో , "విరాట్సజ్ఞక పురుషుని" సృష్టించాడు .

ఆ విరాట్పురుషుని తపఃశక్తిచే ఉత్పన్నమైనవాడు , 
సకల సంసారములను,  పది మంది ప్రజాపతులను,
సప్త ఋషులను,  సకలచరాచర జగత్తును, సృష్టించిన 
శ్రేష్ఠుడే మనువు.

ఈ సృష్టికి ,మనువు నియమించిన కర్మలు ,ఆచారములు, క్రమముగా ఆచరింపబడుతుా వచ్చినవి . జీవులకు, గతులు నేర్పిన వారు మనువు.
ఈ మను వంశ మందు ఉత్పన్నమైన " స్వారోచిష్"
ఉత్తమ్, తామస్ , రైవత్ ,చాక్షుస్  వంటి మన్వంతరములే గాక , మహా తేజశ్వులైన వైవస్వతులను బట్టి , ప్రస్తుతకాలము "వైవస్వత మన్వంతరముగా" పిలువబడుచున్నది.

స్వయంభుాయైన బ్రహ్మ , హోమము, శ్రాద్ధ కర్మలను జేయుట , సంపుార్ణ సృష్టి రక్షణ , చేయుటకై -
సర్వ ప్రథముడైన బ్రాహ్మణుని సృష్టించెను.
ఆపై క్షత్రియ,  వైశ్య , శుాద్రులను, వారి వారి 
గుణానుసారము కర్మలను, సృష్టించెను.

ఈ బ్రాహ్మణుడు, శ్రేష్ఠుడేగాక , ధర్మ రక్షణకు సమర్ధుడును , వేద శాస్త్రపరాయణుడునుాయై ,గృహస్థ- ధర్మాది నియమములను పాటించుచుా,
శాస్త్రములు బోధించువాడై యుండవలయును.
యజ్ఞోపవీత సంస్కారమువలన ద్విజుడు ,
గర్భోత్పన్నమైన దోషములనుండి విముక్తుడగును.

బ్రాహ్మణులకు, మంగళసుాచక శబ్దములతోనుా ,
క్షత్రియులకు బలసుాచక శబ్దములతోనుా  ,
వైశ్యులకు ధనవాచక శబ్దములతోనుా ,
శుాదృలకు నిందిత శబ్దములతోనుా ,నామకరణములు
చేయవలయునని మనువు జెప్పెను. 

మనువు జెప్పిన బ్రాహ్మణ నియమములు విధులు.
----------------------------------------

  బ్రాహ్మణ బాలునకు ,యజ్ఞోపవీతసంస్కారమును 
ఐదు సంవత్సరములలోనుా, క్షత్రియులకు ఆరవ సంత్సరములోను , వైశ్యులకు, ఎనిమిదవ సంవత్సరములోనుా చేయవలయునని
నియమింపబడినది.

భోజనము చేయునపుడు ఆయుర్వృుద్ధికై ,తుార్పు ముఖము  ,యశస్సునకు దక్షిణముఖము  ,
ధన ప్రాప్తికి పడమర ముఖము,  సత్య పాలనకు 
ఉత్తర దిశలు, శ్రేష్టమైనవి.

బ్రాహ్మణులు, భోజనారంభ,  అంత్య సమయములందు,
ముాడు సార్లు ఆచమానమును చేసి ఛిద్రమును స్ప్రుశించవలెను .

బ్రాహ్మణునకు బొటనవేలి దగ్గర "బ్రహ్మతీర్థము  "
చిటికిన వేలి దగ్గర" ప్రజాపతీ తీర్థము  "
ఉంగరపు వేలి దగ్గర "దేవ తీర్థము "
బొటకన వేలు చుాపుడు వేలులకు మధ్య "పితృతీర్థము"లుండును.

ఈ ఆచమానము వలన బ్రాహ్మణుడు, హృదయం వరకును , క్షత్రియుడు కంఠం వరకు, వైశ్యుడు ముఖము వరకును ,శుద్ధి యగును.

బ్రాహ్మణుడు బ్రహ్మ ప్రాప్తికై , ఋగ్యజుర్, సామవేదోత్పన్నమైన ఓంకారమునుండి , ఉత్పన్నమైన
భూః  -భువః - స్వః , అను మంత్రమును ,
ప్రాతః -సాయంకాలములందు జపించవలెను.

ఈ జపము వలన, బ్రాహ్మణుడు సిద్ధి పొందును.
బ్రాహ్మణునకు తల్లి వలన ,ప్రథమ జన్మము  ,
యజ్ఞోపవీత ధారణ వలన, రెండవ జన్మము ,
యజ్ఞ దీక్ష వలన ,ముాడవ జన్మమును పొందుచున్నాడు.

యజ్ఞోపవీతము లేని బ్రాహ్మణులు ,వేద మంత్రములను పఠింపరాదు.
తామస భక్తి వలన, మృత్యులోకమును  ,
పితృ భక్తి వలన, అంతరిక్ష లోకములను  ,
ఆచార్య భక్తి వలన ,బ్రహ్మలోక ప్రాప్తి కలుగును.

మనువు చెప్పిన ప్రకారము చేయకుాడని పనులు :
-------------------------------------

మనువు చెప్పిన ప్రకారము ,
నక్షత్ర నామములు గల కన్యలను ,వృక్ష నామ ములుగల కన్యలను  ,సర్ప నామములు గల కన్యలను,  వివాహము చేసుకొనరాదు.

ఏ కుటుంబములో స్త్రీ లు గౌరవింపబడుదురో..,
ఆ కుటుంబము దేవతలకు ప్రసన్నమగును.
గృహస్తుడు, దేవ కార్యములకు ఇద్దరు బ్రాహ్మణులను  ,
శ్రాద్ధ కార్యములకు ,ముగ్గురు బ్రాహ్మణులను 
పిలువవలెను.

మనిషి శాస్త్రములను ఎంత మేరకు అభ్యసించునో,
అంతవరకే విశేషములను తెలుసుకొనును .
ఇందువలన జ్ఞానము ప్రాప్తించును.

శాస్త్రానుసారము ఉదయాస్తమయములందు , గ్రహణములందు ,నీటి యందు, సుార్యుని ప్రతి బింబమును చుాడరాదు. అటులనే నీటి యందు, తన బింబమును చుాచుకొనరాదు.

వేద స్వరములను , అక్షరములను ,అస్పష్టముగానుచ్ఛారణ చేయరాదు.
ఋగ్వేదము దేవతలకును  ,
యజుర్వేదము మనుష్యులకును ,
సామ వేదము పితృదేవతలకును , చెందినవి.
కనుక సామ వేద ధ్వని అపవిత్రము.

మధ్యాహ్నము,  అర్ధరాత్రి  ,సంధ్యాసమయములందు,
నాలుగు మార్గముల కుాడలికి పోరాదు.

ఈ విధమైన ఎన్నో శాస్త్రములు,  ధర్మములు,
మానవ నడవడికావిధానములెన్నియొా, మను శాస్త్రము నందు చెప్పబడినవి.