Friday, September 30, 2022

అంశం : గాంధీ తాత

01/ 10 /2022.
మహతీ సాహితీ కవి సంగమం.
బాల సాహిత్యంలో  ..
అంశం : గాంధీ తాత .

శీర్షిక : గాంధీ తాతాకు వందనము.
ప్రక్రియ : గేయ కవిత.

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

చిట్టి పొట్టి చిన్నారి పిల్లలము
గాంధీ తాతాకు వందనము.॥
స్వ భారత మాతకు బిడ్డలము.
భవిత చరిత నిలబెట్టెదము ॥చిట్టి ॥

అక్టోబరు నెల రెండవ తేదీన..
పోరుబందరులొ పుట్టెేడు .
సీమ చదువుకై వెళ్ళేడు..
బారిష్టరుయై వచ్చేడు॥ చిట్టి ॥

కరంచందు మరి పుత్లీబాయిల
పుణ్య ఫలము మన గాంధిజీ ॥
కస్తుారీబా  సహచరిణినిగ...
నలుగురు పిల్లల తండ్రోయి ॥చిట్టి॥

ఆంగ్లేయుల పరిపాలనలో
అవమానితుడై నిలిచేడు
జాతి బేధములు వలదు వలదని
నాయకుడై పోరాడేడు ॥ చిట్టి ॥

అస్పృశ్యత, కులవివక్షతలు మరి
మతవిద్వేషాల మార్పులకుా
సత్య- అహింసా-శాంతి బాటలో-
సత్యాగ్రహములు సలిపాడు ॥చిట్టి ॥

హిందుా , ముస్లిమ్, సిక్కు, ఇసాయిలు
భాయుా భాయని  అన్నాడు .
జాతి భేదములు చుాపించొద్దని
సమైక్యతకు విలువిచ్చాడు ॥  చిట్టి ॥

దేశ విభజనను వ్యతిరేకించీ
తీవ్రగతిని పోరాడేడు.
ఆమరణపు దిశ నిరాహారుడై
దీక్షను ప్రారంభించేడు ॥ చిట్టి ॥

కొల్లాయి కట్టుకట్టి
వెదురు కర్ర చేత బట్టి
నుాలు వడకు నట్టి మేటి
"జాతిపిత"యె గాంధీజీ ॥

మొాహన్ దాస్ కరంచంద్ ఘన
స్వాతంత్ర్యముకై పోరిడి
శాంతి బాటలో ఉద్యమించతడు
కీర్తిని ,చరితలో నిలచాడు॥ చిట్టి ॥

స్వాతంత్ర్యము మన కిచ్చాడు
తుాటాలకు బలియయ్యాడు.
"సత్యమేవ జయ జయతే" యనుచుా
తన ప్రాణాలను వదిలాడు.॥ చిట్టి ॥

సత్యశోధనకు అంకితమౌ మన
బాపుాజీకీ జై కొడదాం .
మువ్వన్నెల ఘన పతాక కీర్తిని
ఐక్యమత్యముతొ నిలబెడదాం ॥ చిట్టి ॥


Thursday, September 29, 2022

ఆమె.

29/09/2022.
శ్రీ శ్రీ కళావేదిక  కవితల పోటీ కొరకు...
.అంశం : ఆమె.
 శీర్షిక :  ఆమె అలుపెరుగని ఆమని.
  
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

అమ్మ కడుపులో నవమాసాల అనురాగపు పంట.
అమ్మా నాన్నల  ఆనందం ఆ చిన్ని పలుకుల వెంట.
పెరుగుతున్న ఆ వయసుకు సింగారాలెే సిరులంట.
కలల రేడు కవ్వించగ పుార్తి చంద్ర కళలవంట.॥

పుట్టినింటి కీర్తి పెంచు పుత్తడియిా..బొమ్మంట 
మెట్టినింటి సాంప్రదాయ మేలు సుగుణములంట
భర్త లోన సగము భార్య అను మాట నిదర్శనమై.
కష్ట-సుఖముల కావిడి తా మొాసే తరాజంట ॥

ఇంటి బాధ్యతలకిరుసై తిరిగే పని రాట్నమంట.
 తనయింటి వారసులను దీర్చి దిద్దు గురువంట ॥
పరువు బరువు బాధ్యతలను మొాసే గతి చక్రమంట
సుఖ సంతోషపు పంటలకిడు సారము తానేనంట ॥

చదువు లెన్నొ చదివి తెలివి రాజ్యాలేలిన కలిమి
వత్సరముల భరతమాత కీర్తి  నిలుప నామె బలిమి
అబలకాదు సబలామె అనుభవ పాఠాల కొలిమి
చిరునవ్వుల పుాలజల్లు కురిపించే ఆమని ॥

నిండు చీరకట్టు బొట్టు నిత్య పుాజ లింట వెలుగు
సిరి సంపద లింట కలుగుటకామే సరి నిల తుాగు
జీవిత భాగస్వామిగ  జీవితాంత సహచరిణిగ
పురుషుల భాగ్య రాశిగ పుట్టెను పడతే కొలువుగ॥

సంద్రపు లోతులేలు మనసు లోన కల్లోలము
కనిపరచని శాంత ముార్తి  సాహితి సంగీత వాణి
ఆమె విలువ గట్టలేము ఆమె సాటి మెలగలేము
ఆమెలేని ప్రకృతిలను సంతోషమె  సుాన్యము ॥


Tuesday, September 27, 2022

మొలక న్యుాస్లో సున్నితం ద్వితీయ వార్షికోత్సవం

https://www.molakanews.page/2022/09/8097622021_27.html?m=1

రుబాయిలు


అంశం : రుబాయిలు.
శీర్షిక : మా మొరలు వినుమమ్మ.
రచన :   
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.


న్యాయస్థానాల్లో వాదోపవాదాలు
 స్త్రీల ఆరక్షణకు సంక్షేమపథకాలు
 కల్లబొల్లి బాసల  కపట రాజకీయం
శీల రక్షణలకై  స్త్రీలిడె నినాదాలు ॥

గుడిలోన స్త్రీ ముార్తి విగ్రహారాధనలు
అవనిలో స్త్రీ ముార్తికంగాంగ శోషణలు
 చుాసేందుకై కనులు న్యాయానికి లేవుగ
మార్పురాని తీర్పుకు స్త్రీల ఆక్రోశాలు ॥

భువిలోన మాబ్రతుకు గనుమమ్మ  బతుకమ్మ ॥
 మనసార మామొరలు వినుమమ్మ బతుకమ్మ॥
నీవుగాకించెవరు  దిక్కు మాకీ  భువిని
మముగాచు దేవివై మనుమమ్మ బతుకమ్మ॥


పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు -1

న్యాయస్థానం లో వాదోప వాదాలు స్త్రీ ల రక్షణ వట్టి మాటలు అంటూ.. బ్రతుకమ్మ కు మొరలు..మీ రుబాయీలకు అభినందనలు 🙏💐👌

Monday, September 26, 2022

శీర్షిక : ఎత్తిపట్టిన ఎర్ర జండా .(చాకలి ఐలమ్మ.).

శీర్షిక  :   ఎత్తిపట్టిన ఎర్ర జండా .

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.


పుట్టు కెందుకో మరి గిట్టు టెప్పుడో  
తెలియని మానవ జన్మిది పుడమిని.॥

హెచ్చు తగ్గు వ్యత్యాసాల బాడుగు
బ్రతుకుల జనమిది ॥

మంచి మాట, మనసు కోరి బ్రతికెదరు  కొందరు.
మంది కొరకు ప్రాణాలనె పణ మిత్తురు కొందరు ॥

అన్యాయమరాచకమ్ము సహియించరు కొందరు.
న్యాయమైన మాట,బాట ఉద్యమించెదరింకొందరు ? 

జాతి మతము యేదైనా కుల వృత్తులు యేవైనా..
అన్యాయము నెదిరించి పోరు వీరులు మరి కొందరు..॥

రాచరికం, భూస్వామ్యం కలగలసిన నీచత్వము
కర్కశ పొరుకు నలిగిన దాసులుగా మారిన జనము॥

కాలం తీర్పుకు పుట్టిన పోరు బిడ్డ ఈయమ్మ
తెలంగాణ ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ ॥

చిట్యాల నరసయ్యకు ఈడు, జోడు, తోడు గా 
ఏడ్గురు బిడ్డల తల్లిగ చాకలి ఐలమ్మగా॥

బ్రతుకు పోరాటాల బాట దుక్కి దున్ని జంటగా
కౌలు భుామి సాగుజేసె కడు కష్టపు జీవిగా॥
 
వెట్టి చాకిరీల తీరు బాంచనన్న జనుల గోడు
పరాధీనమౌ బ్రతుకుల వెలుగు నింప గోరె జుాడు ॥

పాలకుర్తి పట్వారీ పప్పులుడకనీయక 
సివంగిలా గర్జించిన ఐలమ్మే నాయిక. ॥

కొంగు చుట్టి కొడవలెత్తె చాకలి ఐకమ్మ  దురుసు
అలుసు జేయు నిజాం దొరలకైలమ్మే కంటి నలుసు ॥

ఆత్మవిశ్వాసము నిండుగ ఐలమ్మే అడుగిడగా
నిజాం దొరల పింఛ మణచ కుాడిరి జనులండగా...॥

ఆంధ్రమహా సభల జోరు కమ్యూనిస్టుల హోరు
రజాకార్ల తీరు నణచ -నైలమ్మే  సలిపె పోరు..॥

భుామి కొరకు భుక్తి కొరకు పుార్తి దాస్య ముక్తి కొరకు
ఆశయమే స్వాశగ నైలమ్మ బ్రతికె  జనుల కొరకు ॥ 

ఆడ పులిగ ఐలమ్మే ఎత్తిపట్టె నెర్రజెండా ॥ 
తెగువ బిగువ పోరు సలిపె వెట్టిచాకిరీలు ముగియ ॥

పదునెక్కిన పోరాటం
కొమరం భీం, బందగుల రక్తతర్పణం 
బీజం పడిన తెలంగాణలో సాయుధ  పోరాటం ॥

ఎగసి పడిన ఉద్యమాలు వెల్లువైన పొిరాటాలు
ఎరుపెక్కెను ఆఝండా ఎగిరి పోరె నాతండా ॥

అమరత్వం పొందినది ఐలమ్మ పోరాటం  
పుస్తకాలకే పరిమితమై నిలచె నామె ఆరాటం ॥

పింఛనుకైనా నోచుకోని జీవితమామె చరితం
చాకలి ఐలమ్మ స్ఫుార్తి.. మనకు ఘనం నిరంతరం ॥

************************************.....


శీర్షిక : నిను మరువలేను బాలుా అన్నయ్యా.

శీర్షిక  : నిను మరువలేను బాలుా అన్నయ్యా.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .

ప్రపంచంలో ఎంతోమంది పుడతారు
కానీ పుట్టిన జన్మను సార్ధకం
 కొంతమందే చేసుకుంటారు.
 తమ గమ్యానికి చేరడానికై
 తమ జీవితాన్నే ధారపోస్తారు.॥
 
 అటువంటి  కోవకు చెందినవారే మన 
 పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం గారు .
 కోనేటమ్మ పేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో
 జన్మించిన ఈయన మన తెలుగువాడు
 కావడం మన భాగ్యమనే చెప్పుకోవాలి. ॥

పుాచిన కొన్ని పుాలే పరమళిస్తాయి
 అన్నట్టుగా బాలుా చిన్నతనం నుండే 
 తనలోనున్న ప్రతిభకు  శ్రీకారం చుట్టేడు.॥
 
అతని తండ్రి  సాంబముార్తి 
పేరొందిన హరికథా కళాకారుడు.
సహజసిద్ధమైన కలకాకారుల వంశజుడైన 
ఇతడు ఐదేండ్ల వయసులోనే భక్త
రామదాసు అనే నాటకంలో నటించేడు॥

అటుపై విద్యా రంగలో ఉంటుానే 
అనేక నాటకాల్లో నటించడం 
పాటలు పాడడం వంటివి చేస్తుా
అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ॥

ఇంతై అంతై వటుడింతై అన్నట్టు మన
బాలుా నాటకాలు వేస్తుా , పాటలు పాడుతుా
ఒకానొక సందర్భంలో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో
  ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు॥
  
ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల 
దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు,
 ఘంటసాల వెంకటేశ్వరరావుగార్లు 
న్యాయనిర్ణేతలు కావడం .అదే పోటీలో 
ఎస్. పి. కోదండపాణి బాలు ప్రతిభను గుర్తించి
 చలన చిత్ర రంగంలో అవకాశాలనీయడంతో
 బాలుా మరి వెనుకకు తిరిగి చుాడ
 నవసరం  ఎప్పటికీ రాలేదు.॥
 సంగీతాభిలాషుడైన బాలుా 
 సినీ చిత్ర రంగంలో ప్రవేశించి  తనదైన
 శైలితో అందరి మనసులనుా చుారగొన్నాడు.

 గాయకునిగా ఉన్నతమైన సినీ జీవితాన్ని 
 ప్రసాదించిన శ్రీ కోదండపాణిపై భక్తితో, 
 అభిమానంతో తాను నిర్మించిన ఆడియో 
 ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" 
 అని అతని పేరే పెట్టుకున్నారు బాలు.॥


నాటి నుండి నేటి వరకు ఎందరికో
తన గళాన్నందించిన బాలుా చాలామంది 
నటుల  హావభావలకు, నటనా శైలికి
అనుగుణంగా  పాటలు పాడి ప్రాణం పోశాడు॥

అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా బాలసుబ్రహ్మణ్యం  ఒక్కడే నిలిచాడు. ॥

పదాల మాధుర్యాన్ని గమనించి 
అతను చేసే ఉచ్చారణ అతని 
పాటను పండిత పామరులకి చేరువ చేసింది.॥

 వృత్తిపట్ల బాలుా ఎంతో అంకితభావంతో
 వ్యవహరించి గాయకునుగా, నాయకునుగా,
 డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొన్ని వేల పాటలకు
 పురస్కారాలను, అవార్డులను అందుకొని
 గాన గంధర్వునిగా అందరి మదిలో 
 చిరస్థానాన్ని సంపాదించుకున్నారు.॥
 
 బరువెక్కిన గుండెకు 
 స్వాంతన బాలుగారి పాట.
 ప్రేమించిన మనసుకు
 చల్లని వెన్నెల బాలుగారి పాట.
 చిరు కోపాల అలకలకు 
ఊరటల ఉపశమనం బాలుగారి పాట॥

హావ భావాల కదలికలకు
అమరే కళల అందం బాలుగారి పాట ॥
కన్నీటి గాయాలకు పుాసే
 ఔషధం  బాలుగారి పాట॥
 అల్లరి చేసే  యువతకు 
 ఆనందాల ప్రేయసి బాలుగారి పాట..॥
వేయేల...
  మరువలేని మరపు రాని 
 మహా  గాంధర్వ గాయకునికి 
 శతకోటి జ్ఞాపకాలతో చేస్తున్న
  అక్షరాంజలినై నిలిచితి  నీపుాట..🙏
 
 


 
 
 

అత్తయ్యగారు : మరువలేని జ్ఞాపకం

26/09/2022.

నవరాత్రుల ఆరంభం. .
ఆశ్వయుజ పాడ్యమి తిథి ...
మా అత్తయ్యగారైన  "ఈశ్వరమ్మ" గారి జన్మదినం .
అత్తయ్యగారి "జయంతి" జ్ఞాపకాలతో...
వారి కోడలు....
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
రచించిన వచన కవిత ...
శీర్షిక  : మరపురాని జ్ఞాపకాలు .

పుాచిన ప్రతీ పుావు పరిమళించదు.
పరిమళించిన పుాలన్నీ పుాజకు నోచుకోవు.
అలాగే పుట్టిన ప్రతీ  జన్మ సార్ధకమవదు.
మరణించిన ప్రతీ జీవికి అమరత్వం లభించదు ॥

బ్రతుకంతా ఆనందం. ఆనంద చింతనలో, ఆధ్యాత్మికం.
ఆధ్యాత్మికతతో నిండిన  రాగాలాపనం.
అదే స్వర, రాగ, లయలకు నిలయమైన సంగీతం .. ఆమె నిత్య దినచర్యకు ప్రారంభోత్సవం , 
సంగీత, సాహిత్యాల సమ్మేళనల చర్చాంశం.॥

హరికథా శిరోమణిగా అందెవేసిన ఘనం ॥
సంగీతంతో పాటు భక్తి నిండిన సాహిత్యం .
అవే అమె రచనలకు ముాలం .
అదే ఆమె జీవిత పరమార్ధం .॥

నిత్య పుాజగా పద్య, గద్య , రచనల సమాహారం .
భజన-కీర్తనలతో భగవంతునికారాధనల వేద్యం.
గురుమాతగా కీర్తికెక్కిన గుణ వైభవం.
పాదపుాజలు ,పురస్కారాలతో బిరుదు సన్మానం ॥

పెద్దకోడలిగా నాకు దొరికిన గౌరవ‌ ఫలం .
మరుదులు, ఆడబిడ్డల ప్రేమానురాగం.
అమ్మ తరువాత అమ్మగా నా కందిన వరం .
నా తల్లిదండ్రుల అనందానికైన కారణం ॥

వేల పుస్తకాల గ్రంధాలయం మా గృహం.
అత్తయ్యగారు ఆలపించిన గీతాలతో పావనం.
108 సార్లు గావించిన రామాయణ గ్రంధ పఠనం.
అన్నదానాది  శాంతి హోమాలతో  దారపోసిన 
పుాజా ఫలం, మా దంపతులు చేసుకున్న
జన్మ జన్మల పుణ్య ఫలం ॥॥

దశరా పండగ మొదటి రోజు ప్రాశస్త్యం  "
 అత్తయ్యగారి జన్మదినానికి" నిదర్శనం .॥
 అత్తయ్యగారి జయంతోత్సవం ..
మము వీడని  మధురమైన జ్ఞాపకం.॥

తొమ్మండుగురు పిల్లలకు తల్లిగా 
పంచిన ప్రేమకు " 95" వత్సరాల వసంతం.
"శ్రీ రామనవమి" రోజు మా అందరినీ వదలిన బంధం  
"శివైక్యం" చెందిన అత్తయ్యగారికి  పాదాభివందనం ॥

ఆమె పాటలకు, రచనలకు ఊపిరిపోసిన సంతానం.
ప్రతీ రోజుా సంగీత -సాహిత్య చర్చలతో మా కుటుంబం .
ఎప్పటికీ  తరగని ప్రేమామృతాల ఉమ్మడి కుటుంబం.
అత్తయ్యగారి ఆశీర్వాదమే నేడు మా అందరి బలం .॥

**************************************




Sunday, September 25, 2022

బాల సాహిత్యం..లో ద గుణింత పదాలతో

బాల సాహిత్యం.....
అంశం : " ద" గుణింత పదాలతో...
.
శీర్షిక : దాయ్ దాయ్ చందమామ.
( బాలల గేయం..)

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

దాయ్ దాయ్ చందమామ జాబిల్లి దావే
"దా" అంటుా మా పాప పిలచె  పలుక రావే
దినమంత నీ కొరకు మారాము  జేసి
దిక్కులన్ని చుాచి చుాచి అలసి నిద్దరోయె.॥

దాటి ఝాము రాతిరొస్తే నిద్దరొస్త దంటా
దినమంతా నువ్వొస్తే ఆటలాడు నంటా
దీనముగ వేడుకున్న  దిగి రాకుంటే
దుమికి పై కెగిరి  నిన్ను బంధిస్తా దంట ॥

 దోబుాచు లాడబోతె దాగి  దొరకవంట
దొంగాట లాడబోతె   పరుగు పెడతవంట.
దారి మబ్బు బుాచి తాత నిన్నెత్తుకెళ్ళ.
దినమంత మాపాప  వెక్కి వెక్కి యేడ్చె ॥

దుష్ట  రాహు కేతు లంట నిన్ను బట్టి మింగ
ధైర్యముగా పోరాడి వారి జంపెనంట .
దట్టమైన మేఘాలు కమ్మి నిన్ను జుట్ట  
దండముతో మా పాప దండించె నంట.॥

దేవతలకు వెలుగు పంచు  దొడ్డ దివ్వె వంట
దేశ దేశాలు తిరిగి కథలు చెపుత వంట
దెయ్యాలే రాకుండా కాపు కాస్తావంట. 
దట్టమైన చీకటున్న భయముండదంట ॥

మెరుపు తాత ఉరుముతుా  భయపెడతాడంటా
ధైర్యముగా నువ్వు బాణ మేసి కొడత వంట
దెబ్బలకు మెరుపు తాత యేడుస్తాడంట
దుబుకు దుబుకు కన్నీరే కురియు వర్షమంట ॥

దాపు చెరువు నీటిలో నీ నీడను జుాచి
దుాకి, నీట పాప నిన్ను కాపాడునంట
దోస్తు వంట మా పాపకు దొరకి నావంట. 
దరికు వచ్చి జోల పాడ నిద్దరోతదంట ॥

దండిస్తే మా పాపను, దరువులు మాకంట
"దా" రమ్మని పిలువ గానె పలుకుతావంట
దుప్పటిలో దుారగానె కళ్ళు ముాస్తా వంట.
దివ్వె లార్ప లాలి పాడి జో కొడతావంట ॥

దుారాన ఉన్న మంచి మామయ్యవంట
దుారి మబ్బు నీడల్లో దాగున్నావంటా ॥
దాయ్ దాయ్ చందమామ జాబిల్లి రావే
దగ్గరగా వచ్చి నీవు  జోల పాడి పోవే ॥
దగ్గరగా వచ్చి నీవు..జోలపాడి పోవే....

***********************************

మహతీ సాహితీ కవి సంగమం 
( బాల సాహిత్యం.).
అంశం : " ద" గుణింత పదాలతో...కవిత.

శీర్షిక  :  నేర్చుకోండి బాలలుా.

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

ధనం మీద వ్యామొాహం ఉండకుాడదు .
ధార్మికమైన పనులను ఇష్టంగా చేయాలి.
దినమంతా కష్టించి పని చేయాలి.
దీనులను దయాగుణముతో చుాడాలి .॥

దుష్టులకు దుారంగా ఉండాలి .
ధుామపానము  ఆరోగ్యానికి హానికరము.
దెబ్బలాటలు ఆడకుాడదు.
దేశభక్తి  కలిగి యుండాలి ॥

దేముని  నమ్మినవారికి దుఃఖము దుారమౌను.
దొర లెవరో దొంగలెవరో తెలుసుకొని మసలాలి.
దోపిడీ చేసినవారు శిక్షార్హులు.
దౌర్జన్యం చేసి ఎవరినీ బాధించకుాడదు .॥

దండుతనముతో దేనినీ పొందకుాడదు.
దయాగుణము కలిగియుండాలి .
ధారుణిలో  కాలుష్యమును రుాపుమాపాలి.
దానగుణము సర్వోత్తమమైనది.॥

దుర్మార్గులుంటారు జాగర్త .
దుారం పాటించి మెలగడం మర్చిపోకు.
దుష్ట కణాలను పరిశుభ్రతతో పారద్రోలు.
దిక్సూచి వై ధరణిని సిరులు తరులు పెంచు॥

***********************************












 
 







Wednesday, September 21, 2022

విశ్వ శాంతి.కవిత

ప్రపంచ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21 సందర్భంగా

కవిత శీర్షిక  : శాంతిమంత్రం , సర్వులకుా సమ్మతం.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .

మారుతున్న మనస్తత్వాల మారణహోమాలు
స్వాతంత్ర్యానంతరం కుాడా సమసిపోని సమస్యలు
కాల్పులు, కొట్లాటల , హింస నిండిన బాటలు
అశాంతి నిండిన భరతావనిలో కన్నీటి గాధలు ॥

రాజకీయ వైఫల్యాల దుష్పరిమాణాలు
హింసాపుారిత సంఘటనలకు ఆనవాళ్ళు
స్వార్ధపుారిత పాలనలో నలిగిపోతున్న జనాలు
ఫలితంగా కోరుకుంటున్న శాంతి సమావేశాలు॥

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంతో
2008 సెప్టెంబర్ 21,  చరిత్రలో 
నమోదైన.  ప్రపంచశాంతి దినోత్సవం .
సర్వత్రా శాంతివ్యాప్తికై ఈదినం అంకితం ॥

మహాత్మాగాంధీ అహింసా, శాంతిపురస్కారం
సమస్యల శాంతియుత పరిష్కారకులకు ప్రదానం
ఉగ్రవాదాన్ని రుాపుమాపేందుకు ప్రయత్నం 
శాంతిమంత్రం అన్ని సమస్యలనుా రుాపు మాపేతంత్రం॥

ఆవేశంతో  అడుగు, అనర్ధ దాయకం 
ఆలోచన లేనిమాట,  అపార్ధాలకు కారణం
శాంతినిండిన మనస్తత్వం , సర్వులకు సమ్మతం.
సఖ్యతతో మెలుగుతుా ఎగరేద్ధాం శాంతికపోత కేతనం ॥॥

శాంతి మంత్రం .

ప్రపంచ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21 సందర్భంగా

కవిత శీర్షిక  : శాంతిమంత్రం , సర్వులకుా సమ్మతం.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .

మారుతున్న మనస్తత్వాల మారణహోమాలు
స్వాతంత్ర్యానంతరం కుాడా సమసిపోని సమస్యలు
కాల్పులు, కొట్లాటల , హింస నిండిన బాటలు
అశాంతి నిండిన భరతావనిలో కన్నీటి గాధలు ॥

రాజకీయ వైఫల్యాల దుష్పరిమాణాలు
హింసాపుారిత సంఘటనలకు ఆనవాళ్ళు
స్వార్ధపుారిత పాలనలో నలిగిపోతున్న జనాలు
ఫలితంగా కోరుకుంటున్న శాంతి సమావేశాలు॥

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంతో
2008 సెప్టెంబర్ 21,  చరిత్రలో 
నమోదైన.  ప్రపంచశాంతి దినోత్సవం .
సర్వత్రా శాంతివ్యాప్తికై ఈదినం అంకితం ॥

మహాత్మాగాంధీ అహింసా, శాంతిపురస్కారం
సమస్యల శాంతియుత పరిష్కారకులకు ప్రదానం
ఉగ్రవాదాన్ని రుాపుమాపేందుకు ప్రయత్నం 
శాంతిమంత్రం అన్ని సమస్యలనుా రుాపు మాపేతంత్రం॥

ఆవేశంతో  అడుగు, అనర్ధ దాయకం 
ఆలోచన లేనిమాట,  అపార్ధాలకు కారణం
శాంతినిండిన మనస్తత్వం , సర్వులకు సమ్మతం.
సఖ్యతతో మెలుగుతుా ఎగరేద్ధాం శాంతికపోత కేతనం ॥॥

దృష్టి

అంశం : దృష్టి .
శీర్షిక :  సమాన దృష్టి .

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

ప్రక్రియ  : ఆటవెలది.

జాతి మతము లనెడు  జాడ్యమ్ములనెంచు
లోక మందు దృష్టి లోప మదియె 
తారతమ్యములవి  తగినంతె జుాపుమా
ధర్మ బద్దులముగ  ధరణి మనగ ॥

దృష్టి లోపమున్న ధృక్పథమ్మదె మారు-.
వావి వరుస మరచు వక్ర బుద్ధి.
ధర్మ కర్మ విడచి దారుణమ్ములజేయు---
మనిషి విలువ తరుగు మహిని మనుజ ॥

కంటి చుాపు లేని  కబోదు లనుగాంచి
అయ్యొ పాప మందు రవని జనులు
కన్ను లున్న వారు  కపటనీ తులతోడ 
మసలెదరుగ మహిని మాయ గాదె ॥

దుార దృష్టి తోడ దుర్ధశధిగమించ
బ్రతుకు భార మవదు భవిత లోన
జాగురుాకతెరిగి జగమందు మసలుటే
జ్ఞాన దృష్టి యంచు జ్ఞాతు లనియె ॥ 

తగిన దృష్టి  నీదు తలరాత నేమార్చు
కీర్తి బాట నేలు కిటుకు దెల్పు
సాధు సజ్జనునిగ సామ్యవాదముతోడ
మనుజు డేలు జగతి మాన్యు డగుచు ॥








అంశం : దృష్టి . ..(ఆటవెలది పద్యాలు)

అంశం : దృష్టి .
శీర్షిక :  సమాన దృష్టి .

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

ప్రక్రియ  : ఆటవెలది.

జాతి మతము లనెడు  జాడ్యమ్ములనెంచు
లోక మందు దృష్టి లోప మదియె 
తారతమ్యములవి  తగినంతె జుాపుమా
ధర్మ బద్దులముగ  ధరణి మనగ ॥

దృష్టి లోపమున్న ధృక్పథమ్మదె మారు-.
వావి వరుస మరచు వక్ర బుద్ధి.
ధర్మ కర్మ విడచి దారుణమ్ములజేయు---
మనిషి విలువ తరుగు మహిని మనుజ ॥

కంటి చుాపు లేని  కబోదు లనుగాంచి
అయ్యొ పాప మందు రవని జనులు
కన్ను లున్న వారు  కపటనీ తులతోడ 
మసలెదరుగ మహిని మాయ గాదె ॥

దుార దృష్టి తోడ దుర్ధశధిగమించ
బ్రతుకు భార మవదు భవిత లోన
జాగురుాకతెరిగి జగమందు మసలుటే
జ్ఞాన దృష్టి యంచు జ్ఞాతు లనియె ॥ 

తగిన దృష్టి  నీదు తలరాత నేమార్చు
కీర్తి బాట నేలు కిటుకు దెల్పు
సాధు సజ్జనునిగ సామ్యవాదముతోడ
మనుజు డేలు జగతి మాన్యు డగుచు ॥









Tuesday, September 20, 2022

మంచి పుస్తకాలు , రచయితల పేర్లు

💐 *తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు* 💐

●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు
●మహాప్రస్థానం - శ్రీశ్రీ
●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం
●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ
●చివరకు మిగిలేది - బుచ్చిబాబు
●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్
●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్
●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి
●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ
●కళాపూర్ణోదయం - పింగళి సూరన
●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ
●గబ్బిలం - గుఱ్ఱం జాషువా
●వసు చరిత్ర - భట్టుమూర్తి
●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు
●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు
●చదువు - కొడవగంటి కుటుంబరావు
●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు
●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి
●వేమన పద్యాలు – వేమన
●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి
●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి
●అల్పజీవి – రావిశాస్త్రి
●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి
●ఆంధ్ర మహాభాగవతం – పోతన
●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి
●మొల్ల రామాయణం – మొల్ల
●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య
●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య
●మైదానం – చలం
●వైతాళికులు – ముద్దుకృష్ణ
●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి
●సౌందర నందము - పింగళి, కాటూరి
●విజయవిలాసం - చేమకూర వేంకటకవి
●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు
●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు
●మ్యూజింగ్స్ – చలం
●మనుచరిత్ర- అల్లసాని పెద్దన
●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ
●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి
●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు
●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర
●దిగంబర కవిత - దిగంబర కవులు
●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ
●పానశాల - దువ్వూరి రామిరెడ్డి
●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు
●అంపశయ్య – నవీన్
●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య
●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
●జానకి విముక్తి – రంగనాయకమ్మ
●స్వీయ చరిత్ర – కందుకూరి
● మహోదయం - కెవి రమణారెడ్డి
●నారాయణరావు - అడవి బాపిరాజు
●విశ్వంభర – సినారె
●దాశరథి కవిత – దాశరథి
●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య
●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య
●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం
●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి
●పారిజాతాపహరణం - నంది తిమ్మన
●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు
●రాజశేఖర చరిత్ర – కందుకూరి
●రాధికా సాంత్వనము - ముద్దు పళని
● స్వప్న లిపి – అజంతా
●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి
●శృంగార నైషధం – శ్రీనాథుడు
●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు
●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు
●అను క్షణికం - వడ్డెర చండీదాస్
●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ
●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి
●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి
●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్
●గద్దర్ పాటలు – గద్దర్
●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి
●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్
●కుమార సంభవం - నన్నే చోడుడు
●మైనా - శీలా వీర్రాజు
●మాభూమి - సుంకర, వాసిరెడ్డి
●మోహన వంశీ – లత
●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి
●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి
●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు
●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి
●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం
●స్వేచ్ఛ – ఓల్గా
●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి
●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
●తృణకంకణం – రాయప్రోలు
●హృదయనేత్రి - మాలతీ చందూర్
●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్
●నీతి చంద్రిక - చిన్నయ సూరి
●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు

●నీలిమేఘాలు – ఓల్గా
●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల
●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్
●కొయ్య గుర్రం – నగ్నముని
●నగరంలో వాన – కుందుర్తి
●శివారెడ్డి కవిత – శివారెడ్డి🙏 Kvss

Monday, September 19, 2022

మహతీ లో చిత్ర కవిత.

19/09/2022
మహతీ సాహితీ కవి సంగమం .
అంశ : చిత్ర కవిత .

శీర్షిక  : పచ్చదనపు శొిభ

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

ప్రక్రియ : ఆటవెలది.


ముాడు వంతు జలము ముాలమై జీవికి
ప్రకృతి తరుల నింపె ప్రజల కొరకు
జగతి నిండె జనము జలజంతు జాలము.
అందమైన సృష్టి  అద్భు తమ్ము ॥

మనిషి బుద్ధి తరుగ మహిని కలుషితమ్ము
మంది పెరిగి పోయె మైల పెరిగె
కలిగె రోగ బాధ కాలుష్య కణబాధ
పెరిగ జనులు ఇలను తరిగె జలము ॥

పచ్చ దనము తరిగె పాడిపంటలు లేక
ఫలము కరువు బాధ ప్రజల బట్టె
పరము లాయె సొమ్ము ఫలములేని నిజము
బీడు భుామి మిగిలె బిక్కు మనుచు ॥

నిజము తెలియు మన్న, నిర్లక్ష్య వైఖరిని
నీల్గు చున్న జనము నిజము మనరు.
ప్రేమ నిండు ప్రకృతి  పంచు నీడ నీయ
పసరు చున్న దదిగొ పట్టి చుాడు ॥ 

సగము కలుషి తముతొ  సరిభుామి సగమాయె
మనగ నీడ లేక మనిషి  మిగిలె
పరిసరమ్ములెల్ల పరిశుభ్ర ముగజేయ
ఫలము పసిడి బ్రతుకు బలము నీదె॥



Saturday, September 17, 2022

మహతీ సాహితీ లో ఉత్తమ సాహిత్యం ..కవులు.

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

*బాల సాహిత్య ఉత్తమ రచనలు:(17-09-2022)*

శ్రీ/శ్రీమతి 
1)ఈతకోట ఏడుకొండలు గారు
2) గడ్డంకృష్ణారెడ్డి గారు
3) డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు
4) మల్లారెడ్డి రామకృష్ణ గారు
5) శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
6)డాక్టర్.బల్లూరి ఉమాదేవి గారు
7) వి.టి.ఆర్.మోహన రావు గారు
8) పొర్ల వేణుగోపాల్ గారు

*నిర్వాహక & సమీక్షక బృందము*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
*నేటి బాల సాహిత్య ఉత్తమ రచనలు:(17-09-2022)*
శ్రీ/శ్రీమతి 
1)ఈతకోట ఏడుకొండలు గారు
2) గడ్డంకృష్ణారెడ్డి గారు
3) డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు
4) మల్లారెడ్డి రామకృష్ణ గారు
5) శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
6)డాక్టర్.బల్లూరి ఉమాదేవి గారు
7) వి.టి.ఆర్.మోహన రావు గారు
8) పొర్ల వేణుగోపాల్ గారు

*నిర్వాహక & సమీక్షక బృందము*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

*ఉత్తమ చిత్రకవితలు: 12-09-2022*

శ్రీ/శ్రీమతి
1.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
2.పొర్ల వేణుగోపాలరావు
3.మేడిశెట్టి యోగేశ్వరరావు
4.పోగుల భాగ్యలక్ష్మి
5.పసుమర్తి నాగేశ్వరరావు
6.డా.బల్లూరి ఉమాదేవి
7.డియస్వీ మహాలక్ష్మి
8.విటిఆర్ మోహన్ రావు
9.త్రిలోచన్ బిసాయ్
10.దొడ్డపనేని శ్రీవిద్య

*నిర్వాహక/సమీక్షక బృందము*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
[30/8 14:10] +91 78423 68534: 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మహతీ సాహితీ కవి సంగమము రుబాయీల ప్రత్యేక దినం 
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
ఈ రోజు రుబాయీలు వ్రాసిన కవి శ్రేష్ఠులు 
1.డా. సూర్య దేవర రాధారాణి గారు 
2.డా. కడలి ప్రకాశరావు గారు 
3.కుడికాల సమ్మన్న గారు 
4.జక్కల శివ గారు 
5.పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు.
[30/8 18:15] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: చిత్రకవిత: 29-08-2022
*ఉత్తమ రచనలు*

సర్వశ్రీ 
1.గాజుల నరసింహ
2.పొన్నూరి భారతలక్ష్మి
3.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
4.పసుమర్తి నాగేశ్వరరావు
5.డా.వేదాల గాయత్రీదేవి
6.జె వి కుమార్ చేపూరి
7.మేడిశెట్టి యోగేశ్వరరావు
8.పొర్ల వేణుగోపాలరావు
9.డియస్వీ మహాలక్ష్మి
10.రేజేటి వెంకట రమణమూర్తి
11.మద్ది పుల్లారావు

నిర్వాహక/సమీక్షక బృందం
[6/9 21:39] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: 🌸🌸🌸🌸🌸🌸
*ఉత్తమ రుబాయీలు:*

 (06-09-2022)

//సర్వశ్రీ//
1.కుడికాల సమ్మన్న గారు 
2.జూపూడి సుధారాణి గారు
3.పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు 
4.గుడిపూడి రాధికారాణి గారు 
5.సింహాద్రి వాణి గారు 
6.బత్తిన గీతాకుమారి గారు 

నిర్వాహక/ సమీక్షక బృందము
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
[7/9 21:40] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

*నేటి ఉత్తమ పద్య కవులు:(07-09-2022)*

శ్రీ/శ్రీమతి 

1.డా.వేదాల గాయత్రీదేవి
2.గుడిపూడి రాధికారాణి
3.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
4.డా.బల్లూరి ఉమాదేవి
5.పోగుల భాగ్యలక్ష్మి
6.ఎలగందుల లింబాద్రి
7.ఎం వి ఉమాదేవి

*నిర్వాహక/సమీక్షక బృందము*
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
[11/9 11:54] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
*బాలసాహిత్యం: ఉత్తమ కవితలు (10-09-2022)*

శ్రీ/శ్రీమతి:
1.జూపూడి సుధారాణి
2.ఈతకోట ఏడుకొండలు
3.త్రిలోచన్ బిసాయ్
4.విటిఆర్ మోహన్ రావు
5.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
6.పొర్ల వేణుగోపాలరావు
7.కుడికాల సమ్మన్న
8.పోగుల భాగ్యలక్ష్మి
9.దేవనపల్లి ఓగన్న
10.డా.పి యస్ యస్ లక్ష్మి

నిర్వాహక/సమీక్షక బృందము
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
[12/9 22:52] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

*ఉత్తమ చిత్రకవితలు: 12-09-2022*

శ్రీ/శ్రీమతి
1.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
2.పొర్ల వేణుగోపాలరావు
3.మేడిశెట్టి యోగేశ్వరరావు
4.పోగుల భాగ్యలక్ష్మి
5.పసుమర్తి నాగేశ్వరరావు
6.డా.బల్లూరి ఉమాదేవి
7.డియస్వీ మహాలక్ష్మి
8.విటిఆర్ మోహన్ రావు
9.త్రిలోచన్ బిసాయ్
10.దొడ్డపనేని శ్రీవిద్య

*నిర్వాహక/సమీక్షక బృందము*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
[13/9 23:03] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

*ఉత్తమ చిత్రకవితలు: 12-09-2022*

శ్రీ/శ్రీమతి
1.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
2.పొర్ల వేణుగోపాలరావు
3.మేడిశెట్టి యోగేశ్వరరావు
4.పోగుల భాగ్యలక్ష్మి
5.పసుమర్తి నాగేశ్వరరావు
6.డా.బల్లూరి ఉమాదేవి
7.డియస్వీ మహాలక్ష్మి
8.విటిఆర్ మోహన్ రావు
9.త్రిలోచన్ బిసాయ్
10.దొడ్డపనేని శ్రీవిద్య

*నిర్వాహక/సమీక్షక బృందము*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
[14/9 21:58] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

*ఉత్తమ పద్యాలు (14-09-2022)*
శ్రీ/ శ్రీమతి

1.సింహాద్రి వాణి

2.డా.వేదాల గాయత్రీదేవి

3.ఎం వి ఉమాదేవి

4.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి

5.డా.బల్లూరి ఉమాదేవి

*నిర్వాహక/సమీక్షక బృందము*

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

*నేటి బాల సాహిత్య ఉత్తమ రచనలు:(17-09-2022)*

శ్రీ/శ్రీమతి 
1)ఈతకోట ఏడుకొండలు గారు
2) గడ్డంకృష్ణారెడ్డి గారు
3) డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు
4) మల్లారెడ్డి రామకృష్ణ గారు
5) శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
6)డాక్టర్.బల్లూరి ఉమాదేవి గారు
7) వి.టి.ఆర్.మోహన రావు గారు
8) పొర్ల వేణుగోపాల్ గారు

*నిర్వాహక & సమీక్షక బృందము*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐




Wednesday, September 14, 2022

జీడి వంటి జిలుగె జీవితమ్ము కవిత..

సమదర్శిని పత్రిక వారి ఆధ్వర్యంలో
మడిపల్లి స్మారక ఈ సంకలనం కొరకు..

అంశం:  మడిపల్లి భద్రయ్య సాహిత్యం - జీవితం
శీర్షిక : ఇరుసు వంటిది జీవితం .
ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
1.
జీవితమ్ము నీది జీడిమా మిడిపండు
జీడి వలెను నంటు జిక్కులన్నీ
పట్టు జీడి పిక్కె  పండు తీపిని పెంచు
జీడి వంటి జిలుగె జీవితమ్ము ॥
2.
నాల్గు దశల లోన నలిగిపోవును జీవి
కష్ట- నష్టములవి కావిడంచు 
దుఃఖ బాట వెంట సుఖముండు గనవేమి ?
మనసు బెట్టి పోరు మరలి వచ్చు ॥
3.
బాల్య  తనము నందు బడికిపో వువరకు
తెలియ దేమి నీకు తెగులు దిగులు.
యవ్వనమ్ము లోన యవ్వారముల జేసి
ఎగిరిపడుదు వీవు నెవరి వినక.॥
4.
మధ్య వయసు లోన మమతాను బంధాల
మరచి పోదు వన్ని మహిని మనగ ॥
సమ్మ తమ్ము నీకు సంసార బంధాలు
సద్దు బాట్ల బ్రతుకు సహన మిడుచు ॥
5.
వృద్దుడైన పిదప వృక్షరాజము వోలె
అనుభవాలె దలతు వణగి యుండి.
ఇదెగ బ్రతుకు రీతి ఈతి బాధల తోటి
ఇలను జీవితమ్మె  ఇరుసు సుమ్మి ॥

హామీ : ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితము కాని నా స్వీయ రచన.

Tuesday, September 13, 2022

జీవితం

సమదర్శిని పత్రిక వారి ఆధ్వర్యంలో
మడిపల్లి స్మారక ఈ సంకలనం కొరకు..

అంశం:  మడిపల్లి భద్రయ్య సాహిత్యం - జీవితం
శీర్షిక : ఇరుసు వంటిది జీవితం .
ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
1.
జీవితమ్ము నీది జీడిమా మిడిపండు
జీడి వలెను నంటు జిక్కులన్నీ
పట్టు జీడి పిక్కె  పండు తీపిని పెంచు
జీడి వంటి జిలుగె జీవితమ్ము ॥
2.
నాల్గు దశల లోన నలిగిపోవును జీవి
కష్ట- నష్టములవి కావిడంచు 
దుఃఖ బాట వెంట సుఖముండు గనవేమి ?
మనసు బెట్టి పోరు మరలి వచ్చు ॥
3.
బాల్య  తనము నందు బడికిపో వువరకు
తెలియ దేమి నీకు తెగులు దిగులు.
యవ్వనమ్ము లోన యవ్వారముల జేసి
ఎగిరిపడుదు వీవు నెవరి వినక.॥
4.
మధ్య వయసు లోన మమతాను బంధాల
మరచి పోదు వన్ని మహిని మనగ ॥
సమ్మ తమ్ము నీకు సంసార బంధాలు
సద్దు బాట్ల బ్రతుకు సహన మిడుచు ॥
5.
వృద్దుడైన పిదప వృక్షరాజము వోలె
అనుభవాలె దలతు వణగి యుండి.
ఇదెగ బ్రతుకు రీతి ఈతి బాధల తోటి
ఇలను జీవితమ్మె  ఇరుసు సుమ్మి ॥

బతుకు జట్కా బండి

09/09/2022.
శ్రీ శ్రీ కళావేదికలో
అంశం : బ్రతుకు జట్కా బండి.
శీర్షిక  : మారుతున్న కాలంలో మనిషి బ్రతుకు.

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.


జీవిత చక్రం  ఒడిదుడుకుల పట్టాలపై 
గమ్య మెరుగని బాటలో చేసే ప్రయాణం.
సుఖ సంతోషాల వెతుకులాటలో 
అలసిన జీవితాల ఆక్రోశం ॥

అధికార దాహపు అహంకారం
ప్రజల బలహీనతలకు వెలకట్టి
నోట్లు కురిపించి  ఓట్లను  కొని
అక్రమాల బాటలో అల్లర్లు సృష్టి స్తున్నాది ॥

గద్దెకెక్కిన  ఘనులందరుా దేశ సంపత్తిని 
వేలం వేస్తుా  భరత భవితల జీవితాన్ని 
బ్రతుకు వేదనలకు గురిచేస్తున్నారు॥

 స్వార్ధం   నిండిన మనిషి జీవితం
 ధన దాహానికి బానిసై తన - పర అనే
బంధాలకు  ఉద్వాసనలిడింది .
ఆటవిడుపులేని అహం హద్దులు దాటింది ॥

మారుతున్న కాలం తో పాటు 
మారే మనుషుల మనస్తత్వం 
మగువ  మదిరలకు దాసొిహమై
బంధానుబంధాలను మట్టి కరిపిస్తోంది ॥
 
అడిగినవాడు అసలు పత్తా ఉండడు.
అడగనివాడికి అసలు బ్రతుకే ఉండదు.
భయం నిండిన బడుగు జీవితాలు
బ్రతుకు తెరువు లేక బానిసలౌతున్నారు॥

 బానిసత్వపు సంకెళ్ళు విడిన ఆనందం 
 అనుభవంలోకి  వచ్చిందన్న భావం
 తలపులో మలుపు తిరగకు ముందే
 మాట, స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది ॥

బ్రతుకు జట్కా బండిలో  నలిగిపోతున్న 
జనుల చితుకు జీవితాలకు  ముక్తి లేదు.
మననుద్ధరించేందుకు మరో  ఉద్యమ వీరుడు
మళ్ళీ ఈ భువిలో పుట్ట బోడు ॥

*************::*********************

చెట్టు తల్లి.

12/09/2022.
మహతీ సాహితీ కవి సంగమం.
చిత్రకవిత-
శీర్షిక : చెట్టు తల్లి .

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.


యుగ యుగాల కవిత చెట్టు చేమల చరిత
చేయు నుపకారమ్ము  చెట్టు వనిత.
పచ్చ తోరణాల పత్రి నిండిన పడతి
సుకపికమ్ముల కొలువు దీర మెచ్చిన యువతి ॥

ప్రాణ వాయువు పంచి బ్రతుకు పెంచెడి మల్లి.
పాడి పంటల నిచ్చు, భువి కల్పవల్లి.
రాజులైనను గాని పేదలైనను యేమి 
బేధ భావములేక పంచు ప్రేమను తల్లి ॥

పశువులకు గ్రాసమై పలువురకు జీవమై
బ్రతుకు తీరు ఘనము తెలియ జేయు 
విత్తు నాటిన నేల వృక్షమై నిలచేది 
పలుక లేకున్నను,నీడ నిచ్చెడు తల్లి ॥

నానాటికిని మారు కాలాన  కల్మషము 
పెరిగె మనిషిలోన  స్వార్ధమేలిన గుణము 
మంచి చెడులను విడచి మహినందు కడు చెలగి
మానవత్వము విడచి మనిషి మారెను భువిని॥

భువిని పాపము పెరిగె తాపమ్ము లవి మరిగె 
నానాటికిని మనిషి మానవత్వము మరచె
తెగనరికె చెట్లను  విడనాడి బంధముల-
కాముకుండై చెలగి వావి వరుసలు మరచె  ॥

పకృతి వనరులు పోయె వికృతి చేష్టలు పెరిగె
భుామి తల్లడిల్లె భువిని ప్రళయము ముంచె
పంట నాశనమాయె చెట్లు కొట్టుకు పోయె
వివశుడైన మనిషి  వీధి దారిని బట్టె ॥

నీట మునిగిన భువిని  నీడ కానగ రాక 
మనిషి కొండలు దాటి , నిలువ, మట్టిని వెదకె
మనిషి మేధలన్ని మట్టిలో కలయంగ
మరుభుాములను జుాచి మనిషి వగచె ॥

మేలు చేయుటె తప్ప కీడు నెరుగని తల్లి
వేటు వేసిన నరుని  కాపాడ వచ్చె
రెండు కొండల మధ్య  నిండు కొమ్మలు జాచి
బాట జుాపె చెట్టు  బ్రతుక మనిషి ॥

చెట్టు తల్లి చేయు  మేలు మరచిన మనిషి
వేసి యడుగుల త్రొక్కి వెడల సాగె
నోరు లేని జంతు జీవరాసుల నీతి
మనిషి కెపుడు తెలియొ వాటి విలువ   ॥

***************************:****







Sunday, September 11, 2022

ఇరుసు వంటిది జీవితం .

సమదర్శిని పత్రిక వారి ఆధ్వర్యంలో
మడిపల్లి స్మారక ఈ సంకలనం కొరకు..

అంశం:  మడిపల్లి భద్రయ్య సాహిత్యం - జీవితం
శీర్షిక : ఇరుసు వంటిది జీవితం .
ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
1.
జీవితమ్ము నీది జీడిమా మిడిపండు
జీడి వలెను దాగు జిక్కులన్నీ
పారవేయ టెంక పండు తీపిగ నుండు
అదియె సుాత్ర మిచట నాచ రించు ॥
2.
నాల్గు దశల లోన నలిగిపోవును జీవి
కష్ట నష్టములవి కావిడంచు 
దుఃఖ బాట వెంట సుఖముండు గనవేమి ?
మనసు బెట్టి పోర మరలి పోవు ॥
3.
బాల్య తనము నందు బడికిపో వువరకు
తెలియ దేమి నీకు తెగులు దిగులు.
యవ్వ నమ్ము లోన యవ్వారముల జేసి
ఎగిరి పడుదు వీవు నెవరి వినక.॥
4.
మధ్య వయసు లోన మమతాను బంధాల
మరచి పోదు వన్ని మహిని మనగ ॥
సమ్మ తమ్ము నీకు సంసార బంధాలు
సద్దు బాట్లు మనుచు సహన మిడుచు ॥
5.
వృద్దు డైన పిదప వృక్షరాజమువోలె
అనుభ వాలె దలతు వణగి యుండి.
ఇదెగ బ్రతుకు రీతి ఈతి బాధల తోటి
ఇలను జీవితమ్మె  ఇరుసు సుమ్మి ॥

హామీ : ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితము కాని నా స్వీయ రచన.




బాల సాహిత్యం లో " జ"పదాలతో కవిత .

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



10/09/2022.
నేటి బాలభారతంలో
అంశం : "జ" గుణింతంతో కవిత..

శీర్షిక :  జగతి నెరిగి మసలుకో తమ్ముడా...
(గేయ రచన )

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

జనని  జన్మ భుామియే మనదిరా 
జయ జెండా కీర్తి నీవు నిలుపరా
జనని ఋణము దీర్చు కొనర బాలకా
జగతి నీదు జన్మ సార్ధకమ్మురా   ॥ జ

జనకు నాజ్ఞ పాటించీ ఎదగరా
జయము లేలగా చదువులు చదవరా  
జగమున కీర్తుల బడసిన వాడవై
జన్మ సార్ధకమ్ము జేసుకొమ్మురా  ॥

జుట్టు ముట్టు వెతలకు భయపడకురా
జాగురుాకతను తెలిసి మెలగరా 
జీవితమే వికసించిన సుమమురా 
జాతి ముత్యమై  నిలువర తమ్ముడా .॥

జాతీయ గీతి మనకు ముద్దురా
జాతి భేదముల జుాపకు తమ్ముడా 
జుాడ పెరుగు కాలుష్యము నాపగా
జగతి చెట్లు నాటి బాట చుాపరా ॥

జలము కలుషితమ్ము నీవు జేయకురా    
జల జీవుల వేధించీ చంపకురా... .
జంతువులను ప్రేమిచర తమ్ముడా...
జేయు  నీకు మేలు నిజము సుమ్మిరా...

జానపదపు గీతులే నీవు పాడరా 
జ్ఞాన వేద సంస్కృతియే మనదిరా
జగతి సంస్కారములను  నేర్వరా
జయము లెన్నో  భువిని నీకు కలుగురా ॥

జేగంటల గుడిగంటలు వినుమురా 
జోతలిడుచు భగవంతుని వేడరా .
జనగణమణ దేశ భక్తి గీతిరా
జనని పుణ్య భుామి మనదె తమ్ముడా.॥


ఈ కవిత నా స్వీయ రచన .
*******************

*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
*బాలసాహిత్యం: ఉత్తమ కవితలు (10-09-2022)*

శ్రీ/శ్రీమతి:
1.జూపూడి సుధారాణి
2.ఈతకోట ఏడుకొండలు
3.త్రిలోచన్ బిసాయ్
4.విటిఆర్ మోహన్ రావు
5.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
6.పొర్ల వేణుగోపాలరావు
7.కుడికాల సమ్మన్న
8.పోగుల భాగ్యలక్ష్మి
9.దేవనపల్లి ఓగన్న
10.డా.పి యస్ యస్ లక్ష్మి

నిర్వాహక/సమీక్షక బృందము
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️