Monday, November 4, 2024

శీర్షిక: బాల లీలలు.

అంశం: ఐచ్ఛికం 

కవితాసంఖ్య: 03

తేది: 30-10-2024, బుధవారం.

శీర్షిక: బాల లీలలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)

ప్రక్రియ: వృషభగతి రగడ.




బాల కృష్ణుని /వలచి  భావపు/  భక్తి తోడను  /గొల్చి చూడుము

వేల నాముని/  మదిని దలచుచు/ వేడ్క వానిని / నమ్మి వేడుము !!

పాల వెన్నను / పంచ గ్వాలల/  పరుగు పరుగున/వచ్చు వేగము

బాల కృష్ణుడ /తండె  శ్రీహరి /భాగ్య మిదిమన  /జన్మ ధన్యము!!

------------------------------

అంశం: ఐచ్ఛికం 

కవితాసంఖ్య: 03

తేది: 30-10-2024, బుధవారం.

శీర్షిక: బాల లీలలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)

ప్రక్రియ: వృషభగతి రగడ.

---------------------



నంద-యశోద / లకిదె  పరమా/ నంద మయమై /నట్టి వరముగ

బంధ మదియే/ మధుర తరమౌ/ భావ నలనిడె/ బాలు గనగా!!


చంద మామను/ బోలు కోమల/ చారు శీలుని / కొంటె చేతలు!!

విందు లాయెను/ఆట పాటలు/వినగ విందులు /మురళి పాటలు.!!


చిన్ని కృష్ణుని/ బాల లీలలు/చిలిపి చేతల/చిందు నవ్వులు 

ఎన్ని జూచిన/ ఎంత వినినా/ఎరుగలేముగ / కృష్ణ లీలలు !!


అన్ని మానుల /చాటు దాగుచు/ అల్లరెంతో  /చేయు వేళలు

కొన్ని కావుగ / వెన్న దొంగడు/కోరి చేసెడు/ చిలిపి చేష్టలు !!


పాల వెన్నలు /దొంగలాడెడు /బాలకృష్ణుడు/ బంధు డాయెను!!

ఏల పుడమిని/రామవిభుడై/ఎంచి దశరథ/పుత్రుడాయెను!! 


వేల జనులకు/అభయ మొసగుచు/వేంకటేశుగ/వెరపు దీర్చెను!

వేలనామము /లున్న వానిని/వెన్ను డాతని /చేరి కొలువుము!!





-----------------------------------------------

పాల వెన్నలు /దొంగలాడెడు /బాలకృష్ణుడు/ బంధు డాయెను!!

ఏల పుడమిని/రామవిభుడై/ఎంచి దశరథ/పుత్రుడాయెను!! 

వేల జనులకు/అభయ మొసగుచు/వేంకటేశుగ/వెరపు దీర్చెను!

వేలనామము /లున్న వానిని/వెన్ను డాతని /చేరి కొలువుము!!







1️⃣5️⃣✅ శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు బహుకాల దర్శనం దసరా నవరాత్రులలో మీ అద్భుతమైన గానామృతాన్ని రుచి చూపించారు నేటి అంశానికి జన్మ ధన్యము శీర్షికతో మీరు రాసిన వృషభరతి రగడ చాలా బాగుంది సహజంగా గాయని అయిన మీరు మాత్రలను నడకను ఇట్టే పట్టుకున్నారు. రాబోయే బుధవారాలు కూడా తప్పక రాయండి ధన్యవాదములు మరియు అభినందనలు👏👏👏💐💐💐🙏🙏🙏





ఇష్టపది



మహతీ సాహితీ కవిసంగమం 

అంశం: నీతి.

ప్రక్రియ :  ఇష్టపది

కవితాసంఖ్య: 04

తేది: 17-10-2024, బుధవారం.

శీర్షిక: నీతి నియమాలు ఎక్కడ?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)



నేటి న్యాయ వ్యవస్థ నెంచ కుటిల మాయెను

మేటి ఘోర ఖలుల నేడు చేయి కలిపెను !!

తోటి మనిషి బాధను తోసి తీర్పు నిచ్చెను

కాటి, జైలు వాసము కలుగజేసి చంపెను !!


ధర్మ న్యాయ నిరతిని దాటి ధైత్యు డాయెను

కర్మ భోగ మనుచును  కరకు గాను మారెను. 

నిర్మల మౌ బతుకుల నిలువు కోత  కోసెను  .

మర్మ మెరుగని వారి , మట్టి లోన కలిపెను !!


నేటి దేశ పాలన కోటి జనుల రోదన.

తోటి వారి హింసకు తోవ గనుటే యోచన

పాలకుల కుశాసన పలుక చిత్ర వేదన.

వేల యువత బాధలు వెరపు నిండు శోషణ.!!


తీర్చువాడే లేడు   తిరుగుబాటుల గోడు.

కూర్చు శిక్షలు వేలు , కుటిల బుద్ధులు చూడు.

నేర్పు చూపిన వాడు నేల బతుకడు వాడు

మార్చు ఓట్లను వారు మనిషికి రూక తోడు. 


లేపి దొమ్ములు నడుమ ,దొంగ ఓటుల గెలుపు

దోపిడీలే బ్రతుకు, దోచుకొనుటే బలుపు

 పాపి యగుచూ కులుకు  పాలకులదే గెలుపు.

 జూపి మత్తుల సరుకు జూద మాడిన పిలుపు  !! 


రూకలాడిన యాట రూపు మారిన మాట

శోకమొందిన చోట , రూక నిండిన వేట

చౌకబారుల తీరు చావు బతుకుల పోరు

చాకలాడే మిన్న చదువులోడిన జోరు.


---------------------------------

నేడు ఎన్నికలన్న  .  నేరాలకు నిలయము

లేడు అడుగు ధీరుడు లెక్క జెప్పు వీరుడు

గోడు,గొడవల తీరు గోస జనులదాయెను

జోడు దుష్ట గణముల జోరు గెలుపులాయెను !!


లేదు న్యాయ మదేల  లేపు చావుల గోల

కూల్చివేతల లీల  కుల,మతాలదె హేల

మనిషి బ్రతుకుట కన్న మత్తు దారది మిన్న 

యువత బ్రతుకే సున్న యూధముల బతుకన్న

వృషభగతి రగడలు మరియు ఇష్టపది

అంశం: ఐచ్ఛికం 

కవితాసంఖ్య: 03

తేది: 30-10-2024, బుధవారం.

శీర్షిక: బాల లీలలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)

ప్రక్రియ: వృషభగతి రగడ.




బాల కృష్ణుని /వలచి  భావపు/  భక్తి తోడను  /గొల్చి చూడుము

వేల నాముని/  మదిని దలచుచు/ వేడ్క వానిని / నమ్మి వేడుము !!

పాల వెన్నను / పంచ గ్వాలల/  పరుగు పరుగున/వచ్చు వేగము

బాల కృష్ణుడ /తండె  శ్రీహరి /భాగ్య మిదిమన  /జన్మ ధన్యము!!

------------------------------

అంశం: ఐచ్ఛికం 

కవితాసంఖ్య: 03

తేది: 30-10-2024, బుధవారం.

శీర్షిక: బాల లీలలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)

ప్రక్రియ: వృషభగతి రగడ.

---------------------



నంద-యశోద / లకిదె  పరమా/ నంద మయమై /నట్టి వరముగ

బంధ మదియే/ మధుర తరమౌ/ భావ నలనిడె/ బాలు గనగా!!


చంద మామను/ బోలు కోమల/ చారు శీలుని / కొంటె చేతలు!!

విందు లాయెను/ఆట పాటలు/వినగ విందులు /మురళి పాటలు.!!


చిన్ని కృష్ణుని/ బాల లీలలు/చిలిపి చేతల/చిందు నవ్వులు 

ఎన్ని జూచిన/ ఎంత వినినా/ఎరుగలేముగ / కృష్ణ లీలలు !!


అన్ని మానుల /చాటు దాగుచు/ అల్లరెంతో  /చేయు వేళలు

కొన్ని కావుగ / వెన్న దొంగడు/కోరి చేసెడు/ చిలిపి చేష్టలు !!


పాల వెన్నలు /దొంగలాడెడు /బాలకృష్ణుడు/ బంధు డాయెను!!

ఏల పుడమిని/రామవిభుడై/ఎంచి దశరథ/పుత్రుడాయెను!! 


వేల జనులకు/అభయ మొసగుచు/వేంకటేశుగ/వెరపు దీర్చెను!

వేలనామము /లున్న వానిని/వెన్ను డాతని /చేరి కొలువుము!!





-----------------------------------------------

పాల వెన్నలు /దొంగలాడెడు /బాలకృష్ణుడు/ బంధు డాయెను!!

ఏల పుడమిని/రామవిభుడై/ఎంచి దశరథ/పుత్రుడాయెను!! 

వేల జనులకు/అభయ మొసగుచు/వేంకటేశుగ/వెరపు దీర్చెను!

వేలనామము /లున్న వానిని/వెన్ను డాతని /చేరి కొలువుము!!







1️⃣5️⃣✅ శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు బహుకాల దర్శనం దసరా నవరాత్రులలో మీ అద్భుతమైన గానామృతాన్ని రుచి చూపించారు నేటి అంశానికి జన్మ ధన్యము శీర్షికతో మీరు రాసిన వృషభరతి రగడ చాలా బాగుంది సహజంగా గాయని అయిన మీరు మాత్రలను నడకను ఇట్టే పట్టుకున్నారు. రాబోయే బుధవారాలు కూడా తప్పక రాయండి ధన్యవాదములు మరియు అభినందనలు👏👏👏💐💐💐🙏🙏🙏





ఇష్టపది



మహతీ సాహితీ కవిసంగమం 

అంశం: నీతి.

ప్రక్రియ :  ఇష్టపది

కవితాసంఖ్య: 04

తేది: 17-10-2024, బుధవారం.

శీర్షిక: నీతి నియమాలు ఎక్కడ?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)



నేటి న్యాయ వ్యవస్థ నెంచ కుటిల మాయెను

మేటి ఘోర ఖలుల నేడు చేయి కలిపెను !!

తోటి మనిషి బాధను తోసి తీర్పు నిచ్చెను

కాటి, జైలు వాసము కలుగజేసి చంపెను !!


ధర్మ న్యాయ నిరతిని దాటి ధైత్యు డాయెను

కర్మ భోగ మనుచును  కరకు గాను మారెను. 

నిర్మల మౌ బతుకుల నిలువు కోత  కోసెను  .

మర్మ మెరుగని వారి , మట్టి లోన కలిపెను !!


నేటి దేశ పాలన కోటి జనుల రోదన.

తోటి వారి హింసకు తోవ గనుటే యోచన

పాలకుల కుశాసన పలుక చిత్ర వేదన.

వేల యువత బాధలు వెరపు నిండు శోషణ.!!


తీర్చువాడే లేడు   తిరుగుబాటుల గోడు.

కూర్చు శిక్షలు వేలు , కుటిల బుద్ధులు చూడు.

నేర్పు చూపిన వాడు నేల బతుకడు వాడు

మార్చు ఓట్లను వారు మనిషికి రూక తోడు. 


లేపి దొమ్ములు నడుమ ,దొంగ ఓటుల గెలుపు

దోపిడీలే బ్రతుకు, దోచుకొనుటే బలుపు

 పాపి యగుచూ కులుకు  పాలకులదే గెలుపు.

 జూపి మత్తుల సరుకు జూద మాడిన పిలుపు  !! 


రూకలాడిన యాట రూపు మారిన మాట

శోకమొందిన చోట , రూక నిండిన వేట

చౌకబారుల తీరు చావు బతుకుల పోరు

చాకలాడే మిన్న చదువులోడిన జోరు.


---------------------------------

నేడు ఎన్నికలన్న  .  నేరాలకు నిలయము

లేడు అడుగు ధీరుడు లెక్క జెప్పు వీరుడు

గోడు,గొడవల తీరు గోస జనులదాయెను

జోడు దుష్ట గణముల జోరు గెలుపులాయెను !!


లేదు న్యాయ మదేల  లేపు చావుల గోల

కూల్చివేతల లీల  కుల,మతాలదె హేల

మనిషి బ్రతుకుట కన్న మత్తు దారది మిన్న 

యువత బ్రతుకే సున్న యూధముల బతుకన్న

శీర్షిక : నేటి భారతం .

మహతీ సాహితీ కవిసంగమం.

18/10/2024.శుక్రవారం.

కవిత సంఖ్య : 5.

అంశం : ఐచ్ఛికం

శీర్షిక : నేటి భారతం .

రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కల్యాణ్ .మహారాష్ట్ర  

మ సా క .సం 43).




నిరుద్యోగ సమస్యలకు నీరైపోతున్న జీవితాలు

తీరని సమస్యలతో  అడుగడుగున అగచాట్లు 

 ముద్దు మచ్చట్లు తీరక యువత పడుతున్న పాట్లు.

 నోట్ల కొరతతో నోచుకోని సుఖాలకై ఎదురు దాట్లు॥

ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నిండిన ఓటర్లు.

మనుషుల బలహీనతకు "బ్యాలెట్ బాక్స్"లో

 కౌంట్  ఔతున్న ,ఓట్లు.

నోట్లకు అమ్ముడుపోయిన  ఓట్లు కొడుతున్న సిక్సర్లు.!!

ఏకాదశ గ్రహ బలంతో గద్దెనాక్రమిస్తున్న

 అక్రమ- నాయకత్వాలు ॥

 

నోట్లు ఓట్ల గారడీలో రన్నౌట్ అవుతున్న ప్రజా వికెట్లు .

బౌన్స్ ఔతున్న ధర్మ వ్యవస్థలు ,న్యాయాధికారాలు.

 ఓటింగ్ వ్యవస్థలో అధర్మంతో కుాడిన అస్తవ్యస్థాలు.

 గుర్తింపుకు రాని అబద్ధపు ఓట్లతో గెలుపు పతాకాలు॥

కాలే కడుపులకు ఐదు వత్సరాల ఎన్నికల సమయం .

ఓటునమ్మిన నోట్లతో కడుపులు నింపుకునే దైన్యం .

మద్యం వేటగాళ్ళకు  మత్తు మందుతో వైద్యం . 

నాయకుడెవరైనా మారనిబ్రతుకుల మండే జీవితం॥

ఇదే ఈనాటి  అవినీతి నిండిన....ఎన్నికల పర్వం.

చదరంగపు టెత్తులకు  దిగజారిపోయిన నేటి భారతం..

కలలు కల్లలై , ఓడిన, నేటి భారతి  కన్నీటి కథనం ॥



హామీ :

నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన. మత్తుకు 

నేను సమయాన్ని. ముందడుగే నా లక్ష్యం" శీర్షిక"

మహతీ సాహితీ కవి సంగమం.

04//11/2024.

అంశం : చిత్ర కవిత. 

ప్రక్రియ : వచన కవిత.

కవిత సంఖ్య  :  1.

శీర్షిక: "నేను సమయాన్ని .ముందడుగే నా లక్ష్యం."

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర 


________________________________



నేను కాలాన్ని ---

ముందడుగే తప్ప వెనకడుగు వేయలేని వివశను.

గత కాలంలో ఒకప్పటి సంస్కారాలను మరిచిపోయిన మానవుల మితిమీరిన మనస్తత్వాలను 

అంచనా వేయలేక వారితో పాటే ముందుకు పోతున్నా!!

రాజకీయ నిర్ణయాల బలవంతపు ఒత్తిడులు

తట్టుకోలేక ,పొగమత్తుకు ,మగువకు ,మదిరకు

బానిసై ,  మనిషి చేస్తున్న అరాచకాలకు 

నా గుండె దడ దడ లాడుతోంది.!!

స్వార్థం నిండిన మానవుడు తన అవసరాలకు 

తమ తోటి వారిని తొక్కి వేస్తున్న వైనం 

 నాలో ఆవేశాన్ని నింపుతోంది.!!

మేధావి యైన మానవుడు , తాను సాధించిన 

చరవాణి , ముఖచిత్రం,దూరదర్శన్ వంటి  

టెలికమ్యూనికేషన్  మాధ్యమాలకు 

తానే బానిసౌతూ, రేపుతున్న -కలకలాలు

ఎన్నోఅరాచకాలను సృష్టిస్తున్నాయి.

ఏమీచేయలేని వివసత్వంతో ,నా కళ్ళు వర్షిస్తున్నాయి !!

జాతి -మతాల, మారణహోమాల  జోరుకు -

 పెరుగుతున్న స్వార్థం , మనిషిలో

 వివేకాన్ని నశింప చేస్తోంది !! 

చేటు చేసే చెడు చెడుదారులకు 

అలవాటు పడిన యువత , విజ్ఞాన పునాదులను 

 పెకిలివేస్తూ , వింత వివాదాలకు, విద్రోహాలకు 

 ఆరతి పడుతోంది. !!

ఈ ప్రపంచ సృష్టిలో,  అన్నీ అలాగే ఉన్నాయి.కానీ- 

ప్రకృతిలో వచ్చే అన్ని వైపరీత్యాలకు ,అకృత్యాలకు -

కారణంగా మారిన మనిషి మాత్రం , అమాయకంగా

" కాలం మారింది, మనం కాలంతో పాటు ముందుకు పోతున్నాం", అన్న భ్రమలో పడి ,  బ్రష్టుడౌతున్నాడు.!!

"తమ అధోగతికి తామే కారణం" అన్న ,

మాట మరచిన మానవుడు, తమకు తామే 

 వేసుకున్న "మత్తు" సంకెళ్లను విడదీసుకోలేక. 

బయట పడలేక ,వెర్రి చూపులు చూస్తున్నాడు.!!

అన్నీ చూస్తూ కూడా ఏమీ చేయలేని నేను,

వెనుకకు తిరిగి చూడకుండా ,

ముందుకు సాగుతూనే ఉన్నాను. !!

"ఎందుకంటే నేను సమయాన్ని . 

"వెనుకకు తిరిగి చూడను.ముందడిగే నా లక్ష్యం."!!


హామీ:

ఈ కవిత నా స్వీయ రచన.

--------------------------



2️⃣6️⃣✅ శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారూ ,

"నేను సమయాన్ని. ముందడుగే నా లక్ష్యం" శీర్షికతో,

 నేటి చిత్రానికి మీరు వ్రాసిన కవిత చాలా బాగుంది.  

మానవుల మితిమీరిన వింత చేష్టలకు నిర్ఘాంతపోతూ అంచనావేయలేక వారితోపాటే చరిస్తున్నాను మౌనంగా. 

నాకు వెనుక చూపులేదు. "రాను. మీరేమైపోయినా నాకు సంబంధంలేదు "అంటూ కాలంతో ఖచ్చితంగా 

నిష్కర్షగా చెప్పించిన తీరు హర్షణీయము..

 చాలా బాగుంది. 👌🏻 ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏💐💐💐🙏🙏🙏





Sunday, September 8, 2024

కవిత

[31/08, 9:51 pm] JAGADISWARI SREERAMAMURTH: తపస్వి మనోహరం పత్రిక కొరకు,
31/08/2024.

అంశం ..ఐఛ్ఛికం.

శీర్షిక  ..సజీవ సమాధులు.

రచన:  శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
 కళ్యాణ్ మహారాష్ట్ర

నాటి నుండి, నేటి వరకు, 
 అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలంటుా 
మాటల్లో అందలానికెక్కిస్తూ, 
చేతలతో చిత్తు చేస్తునే ఉన్నారు .!!

అవనిలో ఆడది, అమ్మగా మరో బ్రహ్మై ,
 తొమ్మిది నెలల భారాన్ని మోస్తూ. 
 సృష్టికి-ప్రతి సృష్టి  చేసేందుకు
 తన రక్తం మాంసాలను పంచుతూనే ఉంది.!!

ఆ సృష్టికి కారకుడైన తండ్రి, 
తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం కోసం , 
బాధ్యతల బరువును మోస్తూ, జీవితాంతం, 
తన కుటుంబం కోసం ,తన. జీవితాన్ని
పణంగా పెడుతుానే ఉన్నాడు.!!

పాశ్చాత్య  సంస్కృతి  మొాజుతో ,
 మన సంస్కృతి , సాంప్రదాయాలు 
 ఏనాడో మట్టి కలిసిపోయాయి.
నేను, నా , అనే స్వార్ధం , 
వావి వరుసలకు "చెక్" పెట్టింది .!!

ఆడ దాని అస్తిత్వం , 
అంగట్లో ఆట బొమ్మై పోయింది.
అలసిపోయిన అమ్మ తనం , 
అడ్డుగోడై నిలిచింది.
జవసత్వాలుడిగిన నాన్న ఉనికి ,
 జారిపోతున్న  విలువల, 
విచ్చలవిడి తనానికి , ప్రతిబంధకమైంది.!!

అంతే మట్టిలో కలసిన మానవత్వం , 
మరోదారిని కనుక్కొంది.
తీరిన అవసరాల చివరి  క్షణాలకై , 
జన్మదాతలకు ,ఊరవతల జీవ సమాధులు కట్టి, 
ఆధునుకతను తలపించే .అందమైన పేరు పెట్టింది.!!

అవే నేటి బ్రతుకు బడుగు జీవితాలకు ఆశ్రమాలు.
అంతరించిపోతున్న ఆప్యాతలకు నిలువుటద్దాలు. 
అడుగు కొకటిగా అలరారుతున్న" వృద్ధాశ్రమాలు ".!!
----------------------------------------
హామీ ..
ఈ కవిత నా స్వీయ రచన.
[07/09, 10:46 pm] బుజ్జి...✍️ స్వప్న: *27-08-2024 నుండి 31-08-2024 వరకు గ్రూప్ సభ్యులు రాసిన ఐచ్ఛిక కవితలలో పత్రిక/e-book కు సెలక్ట్ చేసినవి..*


1.గమ్యం - పప్పు సుజాతారావు 
2.దేశ సైనికుల జీవన పరిక్రయం -ప్రసన్న కుమ్మరగుంట్ల 
3.పండువెన్నెల-కళావతి కందగట్ల 
4.మధుర జ్ఞాపికలు-చట్టి లక్ష్మి 
5.నీలిమేఘమా-కె.రాధిక నరేన్ 
6.ఒకటి కావాలి-టి.నాగేశ్వరి 
7.చిరునవ్వులను చెదరనీయద్దు-రామకూరు లక్ష్మీమణి 
8.చిరుజల్లు-ఎస్.గిరిజశివకుమారి
9.సజీవ సమాధులు పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
10.సరిచేయు చువ్వలను- జగదీశ్వరి కందికుప్ప 
11.గురుదేవోభవః-వై.కె.సంధ్య శర్మ (టీచర్స్ డే ఈ-బుక్)
12.జ్వాలాదీపిక-బత్తిన గీతాకుమారి (టీచర్స్ డే ఈ-బుక్)

Tuesday, April 9, 2024

ఆమెని కాంతులు ( క్రోధి సంవత్సర ఉగాది గేయం).

శీర్షిక :  ఆమని కాంతులు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .
---------------------
గేయం.
------
యుగయుగాలుగా జగాన ఆమని 
 వెన్నెల కాంతులు తెచ్చెనులే
ఉగాది పర్వము ఆంధృల మదిలో
పునాది వేసిన పండగలే...!!2!!
ఆ.....ఆ....ఆ.......ఆ.....

చరణం: 
------
అందముగా ఆనందముగా చిరు 
చిగురుల కొమ్మల ఊయలలూ
బంధములే అనుబంధములౌ, అర
విరిసిన మల్లె సుగంధములు.,
చిగురులు తొడిగిన కొమ్మల నడుమ 
 కోయిల పాడే గీతికలు
సమతా మమతల శాంతి సౌఖ్యముల
సాగే జీవన రాగములూ...అవి
నాల్గు వేదముల సారములు !!
ఆ.....ఆ....ఆ.......ఆ.....
చరణం: 
------
ఆరు రుచులతో నిండిన సాదము
ఆరోగ్యమునకు సూత్రముగా...
ఆరు ఋతువులా ఆగమనమదే..
ప్రకృతి పడతికి  చెలియలుగా..
సస్యశ్యామల ప్రగతి పథమదే
దేశ సంపదకు మూలముగా 
అందము నిండిన అనందములే
దివిలో వెలిగిన దివ్వెలుగా..శుభ-
శాంతి సౌఖ్యముల దూతలుగా...
ఆ.....ఆ....ఆ.......ఆ.....!!
----------------------

Tuesday, March 12, 2024

అంశం: అడవి జంతువులు (

అంశం: అడవి జంతువులు (గేయం).
శీర్షిక :  మా బాధలు  కనరండి.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 
కళ్యాణ్ :  మహారాష్ట్ర.

పల్లవి:
-----
అడవిలో పుట్టాము అడవిలో పెరిగాము 
ఆనంద తీరాల ఆడాము పాడాము ॥
అనుపల్లవి :
--------
చీకుా చింతా లేని జీవితాలు మావీ
మాజంతు జీవాలకు సాటిరావు ఏవీ ॥అడవి ॥

చరణం :
------
సాధు  జంతు జీవాలము,  కలసి మెలసి ఉంటాము .
జాతి మతముల జోలికి పోమే పోముా 
కలసి నీరు తాగుతాం ,కలివిడిగా మసలుతాం.
అడవి యంతా తిరిగి అలసి సొలసి వాలుతాం ॥

చరణం :
------
క్రుార జంతు బంధులున్న , కుటిల బుద్ధి లేదుా
ఆకలైతేగానీ, దరికి చంపగ రావుా
స్వార్ధమన్నది లేదు  పాచి కుాడు నవి తినవుా
వలసినంత  మాత్రమె తిని, మిగులును వదలేసి పోవు ॥

చరణం :
------
ఆశ నిండు విసపు మనిషి  ఎదుటివాణ్ణి దోచే,
స్వార్ధ చింతనలు జేసి , నమ్మువారి  రోసే
 మానవత్వమే మరచే మనిషి మనిషినే కోసే,
జాతి భేదముల పేరున రాజకీయములు జేసే ॥

చరణం :
------
మేడ, మిద్దెలు కట్టగ మనిషి యడవి  కోసే
జంతువులను చంపి అమ్మి , సొమ్ములెన్నొ దాచే
 బ్రతుకు తెరువు పేరుతో బంధనాలు వేసే
గారడీలు చేయించి, మా  కడుపులు మాడ్చే॥ 

చరణం :
------
చిలకల మేల్కొలుపు లేదు, కోయిలమ్మ పాటలేదు
నెమలి కన్నెలాట లేదు , పుా బాలల శోభ లేదు
పచ్చదనపు వాడ లేదు, కొండ చాటు నీడ లేదు
ప్రకృతి పడతి ఎండి పోయె, భరత మాత క్రుంగిపోయె॥

చరణం :
------
బ్రతుకు తీరు బరువై , వాసములే  కరువై
 రోడ్లు జేరు మమ్ము  జంపె, మనిషి క్రుార మృగమై
మాస్థానము దోచీ , సంకెళ్ళను వేసీ
తోలు తీసి అమ్మకున్న మనిషి బ్రతుకు ఛీ ఛీ ॥

------------------------------------

Wednesday, March 6, 2024

చిగురించిన కొత్త ఆశలు.

06/03/2024.

"ఉగాది పండుగ " సందర్బంగా...

కవిత.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్  : మహారాష్ట్ర.

-----------------------

జీవిత పయనంలో ఎన్నో చిక్కులు

కష్ట సుఖాల మేళ వింపుల ఒడిదుడుకులు.

బ్రతుకు బాటలో సుఖ-దుఃఖాల 

పూల బాటలు. , ముళ్ళ తోటలు !!

రాజకీయ రొచ్ఛులు , అసమంజస ఉచ్చులు.

న్యాయానికి పడ్డ సంకెళ్ళతో....

అన్యాయానికి ఆహుతౌతున్న 

అమాయకుల వెక్కిళ్లు !!

గడచిపోతున్న కాలంలో 

వత్సర కాలం మరుగుపడిపోబోతోంది.

బ్రతుకు ఆశ ,కొత్త సంవత్సరం కోసం ఎదురుచూస్తోంది.!!

మారుతున్న కాలంలో ,మళ్లీ వసంతం చిగురిస్తుందని.

కొత్త రాగాలతో కోయిల పాట వినిపిస్తుందని

ఆశల పల్లకిలో "ఆహ్వానాలు" పంపుతున్న

 జనం  నమ్మకానికి భరోసా నిస్తూ...

"క్రోధి"నామ వత్సరం కోటి వెలుగులై  వచ్చి ,

కమ్ముకున్న చీకట్లను పారద్రోలుతుంది.

జనంలో,  నవ చైతన్యానికి నాంది పలుకుతుంది.

క్రోధ ,భేదాలను మరచిన ఉత్సాహంతో

 కొత్త వత్సరం కళకళలాడుతుంది !!


---------------------------

06/03/2024.

"ఉగాది పండుగ " సందర్బంగా...

కవిత.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్  : మహారాష్ట్ర.

-----------------------

జీవిత పయనంలో ఎన్నో చిక్కులు

కష్ట సుఖాల మేళ వింపుల ఒడిదుడుకులు.

బ్రతుకు బాటలో సుఖ-దుఃఖాల 

పూల బాటలు. , ముళ్ళ తోటలు !!

రాజకీయ రొచ్ఛులు , అసమంజస ఉచ్చులు.

న్యాయానికి పడ్డ సంకెళ్ళతో....

అన్యాయానికి ఆహుతౌతున్న 

అమాయకుల వెక్కిళ్లు !!

గడచిపోతున్న కాలంలో 

వత్సర కాలం మరుగుపడిపోబోతోంది.

బ్రతుకు ఆశ ,కొత్త సంవత్సరం కోసం ఎదురుచూస్తోంది.!!

మారుతున్న కాలంలో ,మళ్లీ వసంతం చిగురిస్తుందని.

కొత్త రాగాలతో కోయిల పాట వినిపిస్తుందని

ఆశల పల్లకిలో "ఆహ్వానాలు" పంపుతున్న

 జనం  నమ్మకానికి భరోసా నిస్తూ...

"క్రోధి"నామ వత్సరం కోటి వెలుగులై  వచ్చి ,

కమ్ముకున్న చీకట్లను పారద్రోలుతుంది.

జనంలో,  నవ చైతన్యానికి నాంది పలుకుతుంది.

క్రోధ ,భేదాలను మరచిన ఉత్సాహంతో

 కొత్త వత్సరం కళకళలాడుతుంది !!


---------------------------






Thursday, January 11, 2024

అమ్మ పై కవితలు

శీర్షిక : అమ్మ మనసు.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్ : మహారాష్ట్ర .



నన్ను  మొాసిన నవమాసాల బరువు  

ఆమెకు అపురుాపమైన ఆనందాల కొలువు.॥


నా ఆట పాటల అల్లరి పనులు

ఆమెకు విసుగు లేని ఆనందపు ఖనులు॥


నా ఉన్నతికై ఆమె పడే నిరంతర శ్రమ 

నా ప్రశంశాపుార్వక  విజయాలకిడే దీవెన .॥


వృద్ధాశ్రమంలో విడచిన అమ్మ పడే ఆరాటం 

నేను బాగుండాలన్న తపనతో చేసే పొరాటం .॥


అమ్మ త్యాగాన్ని మరచిన నా స్వార్ధానికి ఫలితం.

అమ్మ లేని రోజు అమ్మ విలువ తెలిసొచ్చిన శాపం॥

 .

*********************************


రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్ : మహారాష్ట్ర .


శీర్షిక : తోలు బొమ్మ అమ్మ 


అమ్మ అనే మాటలో కమ్మని బంధం 

ఎన్ని జన్మలెత్తినా తీర్చ లేని ఋణాను బంధం.॥


రోజంతా అలసినా వాడని చిరునవ్వుతో అమ్మ  

అమ్మా అన్న పిలుపుకే  పొంగిపోయి తన 

జీవితాన్నంతా మనకై  ధారపోసిన వెర్రిది సుమ్మ ॥


మనకై పడే  కష్టాన్ని తన ఇష్టంగా మార్చుకొని

నిరంతరం  శ్రమించే అమ్మ  , మన ఎదిగిన

 జీవితపు ఆనందాలకు ఆలంబనైన  కొమ్మ॥


తన కండలు కరగి కృుశించిపోయినా  జీవితానందామృతాన్ని మన కుటుంబ

సౌఖ్యానికై ధారపొయాలన్న తపనతో,  అమ్మ ॥


అమ్మంటే ప్రేమ ,అమ్మంటే త్యాగం ,

అమ్మంటే మన ఆనందాలకు  ప్రతిరుాపం .

అమ్మ లేని జీవితం , ఎందరు ఉన్నా

ఎవరుా లేని అనాధగా మది నిండిన భావం ॥


మమత పంచి ప్రేమతో పెంచి  

కొవ్వొత్తిలా కరిగిపోతుా కాపాడే ఆమ్మకు 

ప్రతిఫలం గా ఆమె బ్రతికుండగా ఏమీ

 చేయలేని వ్యర్ధ జీవితం మనది కదమ్మ ॥


వృద్ధాశ్రమాల వెలసిన చుారుల్లో

కన్నీటి కథనాలు దాచిన తోలు బొమ్మ 

ఈ భువిలో వెలసిన దేవతగా 

కవితల్లో వర్ణించే కావ్యాక్షరం అమ్మ ॥


********:::*********************


శీర్షిక : అమృతానందమయి.


రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్ : మహారాష్ట్ర .


జన్న జన్నల పుట్టుకకు 

రక్షణ కవచం అమ్మ గర్భం .

తొమ్మిది నెలల  దశలకు 

జీవామృతం అమ్మ  రక్తం .॥


పెరిగే శరీరానికి ఆకార వికాశం

అమ్మ దేహంలోని మాసం 

భువిపై పడిన క్షణం

కాపాడే ధైర్యం అమ్మ ఒడి.॥


తన రక్తాన్ని క్షీరామృతంగా మార్చి

మనను పెంచి పోషించిన అమ్మ .

ప్రతి అడుగుా నేర్చిన ఆలంబన

అమ్మ అందించిన చేయుాత ॥


అమ్మా అన్న పిలుపుకు, పలకరింత 

అమ్మ నిండు ప్రేమలో పులకరింత.

కష్టాలు కన్నీళ్ళను తాను భరిస్తుా

సుఖాల వనంలో మనలను పెంచే

పరిమళ సుమ గంధం  అమ్మ ॥


అరచి విసిగించినా, అవమానించినా 

ఉన్నతి కోెరే మహోన్నత చరిత అమ్మ.

మన ఊపిరే తన ఊపిరిగా బ్రతికే

వెట్టి చాకిరీల వెర్రి అనందం అమ్మ .॥


ఊపిరి పోయే సమయంలో కుాడా

తన మమతానురాగాలను ముాట కట్టి

మనకందించి అశీర్వదించే 

అమృతానందమయ రుాపిణి అమ్మ ॥



**************:*:**********



శీర్షిక :   ప్రేమకు ప్రతిరుాపం .


రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్ : మహారాష్ట్ర .



నిండు ప్రకృతికి నిర్వచనం అమ్మ.

ప్రకృతి కరుణించకపోతే బ్రతకలేము.

అమ్మ ఆదరించకపోతే ఊపిరిపోసుకోలేము .

చుాడ చక్కనితెలుగు సున్నితంబు॥


మనను పుట్టించే మరో బ్రహ్మ అమ్మ .

అమ్మ గర్భంలో నవమాసాల  కర్మ.

అమ్మ రక్తమాంసాలు నింపుకున్న జన్మ .

చుాడ చక్కనితెలుగు సున్నితంబు॥


అమ్మ ఒడిలో అలుపెరగని వెచ్చదనం.

కల్తీ లేని అమ్మ పాలు ఆకలి తీర్చే అమృతం.

అమ్మ లాలనలో బెదురులేని  బాల్య జీవితం 

చుాడ చక్కనితెలుగు సున్నితంబు ॥


ఇల్లే బడిగా తల్లే గురువై నేర్పే జీవిత పాఠాలు.

పెరిగే వయసుతో పెరిగే స్వార్ధం తెచ్చిన లోపాలు.

అవసరం తీరేకా అమ్మ చేదైన కోప తాపాలు .

 చుాడ చక్కనితెలుగు సున్నితంబు ॥


ఆలి రాకతో అసహాయత చేతల నిండు పాపాలు

వృద్ధాశ్రమాలలో తల్లుల కన్నీటి జీవిత శాపాలు

అన్నీ కోల్పోయేకా తెలిసిన అమ్మ ప్రేమ సందేశాలు ॥

చుాడ చక్కనితెలుగు సున్నితంబు ॥



*********************::::*********


శీర్షిక :   తెలుసుకున్న నిజం.


రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్ : మహారాష్ట్ర



కదులుతున్న కలం ఆగకుండా

అక్షరాలను కాగితంపై నింపుతోంది.

అమ్మ కొసం కవిత రాస్తుా 

కన్నీరు  మున్నీరై  కదలిపోతోంది ॥


అమ్మనైన తర్వాత తెలిసిన అమ్మ తనం.

అమ్మగా నా పాత్రకు జీవం పోసిన దినం.

పిల్లల పెంపకంలో నిదుర లేని రాత్రులనేకం 

శరీరం  అలసినా పిల్లలపై వీడని మమకారం ॥


సంఘంలో  ఉన్నతంగా నన్ను  

 పెంచాలనుకున్నపుడు

ఎదిరింపు బెదిరింపులతో 

నేను అమ్మకు చేసిన అవమానం

అమ్మగా ఈ నాడు నేను 

ఎదుర్కుంటున్న బాధకు నిదర్శనం ॥


అమ్మ చెప్పిన జీవితానుభవాలు 

అపహాస్యంపు  ధోరణిలో నేను

వదిలిపెట్టిన చేదు నిజాలు.

ఈ నాటి నా జీవిత సత్యాలు..॥


పిల్లలను  సరైన దారిలో పెంచలేక

 వారి వినాశనాన్ని చుాస్తుా భరించ లేక

ఒంటరినైన వేళ అమ్మ జ్ఞాపకాలు 

ఆవేశంగా నన్ను చుట్టుముడతాయి ॥


అక్షరాల అల్లికలో ప్రతీ పేజీలో

అమ్మ  కవతలే రాస్తాను

అమ్మ ఇలలో వెలసిన దేవతని.

అమ్మ కంట కన్నీరు రానీయకండని ॥


చేతితో చేయలేని పనిని 

మనసులో దాగిన మౌన వేదనని.

అక్షర రుాపంలో ఆవిష్కరణ చేసి

నా మనసులో మలినాన్ని అమ్మ

 కవన ,కావ్యాలతోనే కడుక్కుంటున్నాను ॥


**********************:::::

Wednesday, January 10, 2024

కుందారపు గురుమూర్తిభాషారత్న, పద్యకవి.

'పాట పాటలో పరమాత్మ పరవశించె'

సీ: మధురానగరితో సుమధురముగ మొదలై
           మురళి గానముతోడ ముగిసి  మురిసె
     మధురాధి పతియైన మంగళకరుడైన
           మాధవు రూపంబు మదిని వెలిగె
     గోపాల బాలుడా! గోవిందుడా!యని
          పాడుగ మెనెల్ల  భక్తి నిండె
    శ్రీకృష్ణ లీలలు చిత్తమున నిలచె
            గాత్రంబునన్ సరిగమలు వలికె
తే: పాట పాటలో పరమాత్మ పరవశించె
     పదము పదములో సాహిత్య పటిమ తెలిసె
      పదును గలిగిన పాటలు పాడుచుండ
      నాదు మానసంబు మిగుల హ్లాదమొందె

కం వియ్యాల వారి పాటలు
     కయ్యాలననేల? వినగ  కమ్మని విందుల్
     సయ్యాటలేగద జనుల
     నెయ్యములనుబెంచుచుండు నేర్పున భువిలో
కం: శ్రీ పుల్లాభట్ల కలము
      ప్రాపకమయి నిల్చె భక్తి పాటలకెల్లన్
      రూపము భగవద్భక్తికి
      నీ పొత్తము. గణుతి కెక్కు నిదియునొకటిగాన్

కుందారపు గురుమూర్తి
భాషారత్న, పద్యకవి.
పాఠశాల సహాయకులు తెలుగు,
బలిజపల్లి,
కలసపాడు మండలం
వై.యస్.ఆర్ కడపజిల్లా.
ఆంధ్రప్రదేశ్.
7780656292

Friday, January 5, 2024

శీర్షిక : అమ్మ మనసు.

శీర్షిక : అమ్మ మనసు.

(వచన కవిత).

.రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

 కల్యాణ్. మహారాష్ట్ర .



అకాశంలో వెలిగే తారల మిణుకులు

అమ్మ, నాపై పెంచుకున్న ఆశల శకలాల్లా.

 వెన్నెల కురిపిస్తున్న పుార్ణ చంద్రుడు .

అమ్మ  చల్లటి  చిరునవ్వులా ...॥


 బావిలో చంద్రుని ప్రతిరుాపం ,

 నా వెన్నంటి ఉండే- అమ్మ భావనలా...

మా తోటలో పుాచే గులాబీలు, 

అమ్మ  ఒడి నిండిన మమతలా....

 గాలిలో పరుచుకున్న  మత్తైన పరిమళం,

 అమ్మ ,నిస్వార్ధంగా పంచే ప్రేమలా..॥


 నాలో జరిగే అంతర్యుద్ధంలో

 నాకు నేనుగా ఓడిపోతుాన్న ,భావన..

 అమ్మనయ్యాకా గానీ తెలుసుకోలేని

 "అమ్మ"  మనసులా...॥

 

 ధారగా కారుతున్న నా కన్నీళ్ళు

 అమ్మని బాధపెట్టిన నా పాపానికి

 ప్రాయశ్ఛిత్తంలా.....॥

 

నా ఒళ్ళో కేర్..కేర్..మంటుా ఏం కావాలో

చెప్పలేకా ,ఏడుస్తున్న నా బాబు రోదన..

అనాధాశ్రమంలో ఆకలైనా చెప్పలేని

అమ్మ నిస్సహాయతకు నిదర్శనంలా....॥