Monday, November 29, 2021

చిత్రకవిత..

తేది: *29-11-2021: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: *ఐచ్ఛికం".వచనం .
శీర్షిక : తాను తీసుకున్న గోతిలో తానే..సమాధి.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .

మ.సా.క.స..19.
కవిత సంఖ్య : 1.

స్వాతంత్ర్యానికి ముందు బానిసగా బ్రతికిన మనిషి
స్వాతంత్ర్యానంతరం తన మేధకు పదును పెట్టేడు.
చదువు సంస్కారాలతో పాటు సుఖజీవితానికి
కావలసిన సదుపాయాలు , ఇళ్ళు , యంత్రాంగాలు
భుా వాహనాలు, ఆకాశ యానాలు , క్షిపణులు
ఇలా ఎన్నో, తన మేధస్సుకు పదును పెట్టి, భరతావని
చరిత్రకు కీర్తి కిరీటం తొడిగేడు.

కాలం గడుస్తున్న కొద్దీ రాజులు మారారు.
రాజ్యాంగాలు మారేయి. నీతి- నియమాలు
దారి తప్పేయి. మనిషిలో స్వార్ధం పెరిగింది.
మమతలు, మానవత్వం , నశించేయి .

వావి వరుసలు, రక్త సంబంధాలుా కుాడా మరచి
కాముకులై మృగాల్లా వ్యవహరిస్తుా
ముందుకు దుాసుకు పోయిన మనిషి--కేంద్ర-
రాజకీయ స్వార్ధపు దురాగతాలకు,నలిగిపోయేడు.

తమ ఓటు హక్కును "నోట్ల"కట్టగా మార్చుకొని.
మనీకి, మందుకి లోబడి అదే జీవితానందమని
తలచి తిరిగి బానిసగా మారేడు. మనిషి జ్ఞానాన్ని మందుతో దోచుకున్న రాజకీయ దుండగులు మనిషి మెదడును దొలిచి మేధో రసాన్ని  పీల్చి , పిడిచి
పిప్పి చేస్తుా, మనిషి కనుగొన్న ప్రగతి పథాల సిరి-సంపదల ఖనులను, ప్రైవేటీకరణ పేరుతో  విదేశాలకమ్మి సొమ్ము చేసుకోవడం మొదలెట్టేరు.

మనీషి గా ఎదగవలసిన మనిషి, "మనీ" షి"లకు
లోబడి , రాజకీయ వైఫల్యాల విష పరిమాణానికి
లోనౌతున్న తమ జీవితాలను తిరిగి చక్కదిద్దుకుందామనుకొనే లోపే, రాజకీయ మాంత్రికులు తమ లోగల తెలివి , బుద్ధి, ఆలోచనలు గల మెదడు సారాన్ని తమకి తెలీకుండానే, రోజు రోజుకుా పీల్చి, పిప్పి చేస్తున్న సంగతి తెలుసుకొని,
తాము పుార్తిగా దోచుకోబడ్డాడని, రాజకీయ రణ నీతులకు తిరిగి తాము పుార్తి  బానిసలుగా మారేమని తెలుసుకొని ఏమీ చేయలేని  నిస్సహాయ పరిస్థితిలో, నిలువుగుడ్లేసు కొని, దిగ్భ్రాంతికి లోనవుతున్నాడు .
హతవిధీ...మనిషి మనిషితో ఆడుకొనే ఈ
ఆటలకు అంతమెప్పుడో...
హామీ:
ఈ రచన నా స్వీయ కవిత.

Sunday, November 28, 2021

దశావతారాలు.

తపస్వీ మనోహరం పత్రిక వారి ఈ పుస్తకం కొరకు ,

అంశం : దశావతారాలు.
ప్రక్రియ : పంచపది.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

మానవ సమాజంలో మనుషుల నడవడిక పై  ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి.
ధర్మార్ధ ,,మొాక్షముల నిరంతర సాధనకు 
ఈ అవతారాల విశిష్ట  వ్యక్తిత్వ విలువలు మనకు మార్గదర్శకమౌతాయి.
సామాజిక ధర్మాన్ని , నీతి, నియమాలను తప్పిన వారందరుా ఏదో ఒకనాడు పతన మవక తప్పదన్న మాటకు ఈ అవతారాలు మాధ్యమమై నిలచి
మనిషి స్వార్ధపుారిత దురాలోచనా విధానానికి ,
తగిన జ్ఞాన సముపార్జనకు దోహదమౌతాయన్న
నమ్మకంతో రాస్తున్న దశావతార మహిమలు.

1 . మత్స్యావతారము .
-------------------
చాక్షుష మన్వంతర అంత్యకాలములో
సోమకుణ్ణి వధించి ,వేదాలను రక్షించిన అవతారము.

సత్యవ్రతుణ్ణి రక్షించిన సారసాక్షుని అవతారము.

మహీరూపమైన నావలో సకల బీజాలనుా, ఓషధుల్నీ ,
సప్తర్షులనీ ఎక్కించి ,మూపు పై ధరించి రక్షించిన
అవతారము.

మహా మత్స్యావతారుడై అవనికి వేద నిధి-
నందించిన శ్రీమహావిష్ణువు ప్రథమావతారము.

మానవసమాజంలో మంచిని రక్షీంచేందుకు ఉద్భవించిన ఆ పరమేశ్వరుని అవతారమహిమను తెలియుమీశ్వరీ ॥

2.కుార్మావతారము.
-----------------
దేవ ,దానవుల "సముద్రమంథన" సమయము.

వాసుకిని తాడుగా మందరగిరిని కవ్వముగా
వాడిన సమయము.

ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపిన అవతారము.

"కుార్మావరారుడై "అమృతమధనానికి సహాయం 
చేసిన శ్రీమహావిష్ణువు  ద్వితీయావతారము.

చిలికిన అమృతమును దేవతలకు అందించేందుకు
మొాహినీ అవతారమెత్తి, అసురుల బారినుండి
అవనిని గాచిన అవతారపురుషుని
లీలలను గనుమీశ్వరీ.॥

3.వరాహావతారము:
-----------------
సత్య యుగంలో ముల్లోకాలను అల్ల- కల్లోలం 
చేసిన "హిరణ్యాక్షు"డొక  అసుసుడు .

వర గర్వ బలంతో,భుాదేవిని పాతాళంలోకి తొక్కినవాడు.

బ్రహ్మ నిద్రిస్తుా ఉండగా, వేదాలను తస్కరించినవాడు.

"వరహావతార"మెత్తిన విష్ణుముార్తిచే సంహరింపబడిన
ఘొార అసురుడు.

భుాదేవినీ, వేదాలను రక్షించిన అవతారపురుషుడు
తప్పులు,పాపాలు చేసినవారిని, ఎప్పటికైనా
శిక్షిస్తాడని  తెలియజెప్పిన అవతారమిది ఈశ్వరీ ॥

*****************************************
4.నరసింహావతారము:
-------------------
హిరణ్య కశ్యపుని పుత్రుడు,విష్ణుభక్తుడైన బాల ప్రహ్లాదుడు .

దేముడు ప్రతీ చోటా ఉన్నాడన్నందుకు తండ్రిచే
శిక్షింపబడుతుా ఉండేవాడు.

భక్తికి లొంగిపోయే కరుణామయుడు భగవంతుడు.

 ప్రహ్లాదుని రక్షణకై  స్తంభం నుండి వెలువడి
" హిరణ్యకశిపుని" దునిమిన "ఉగ్ర నారసింహుడు."
 
 దుష్టులను దునిమేందుకు  ఏ రుాపమవసరమొా ఆరుాపమునెత్తి అవనిని కాచే ఆదినారాయణుని 
 శరణనుమీశ్వరీ॥
 
 *************************************
5. వామనావతారము : 

దానధర్మాలకు మారుపేరైన "బలి", అసురవంశజుడు.

అట్టి "బలి చక్రవర్తిని" బలిమినణచ వచ్చిన "వామనరుాపుడు" శ్రీమన్నారాయణుడు .

ముాడడుగుల భుామినడిగి ముల్లోకాలను 
ఆక్రమించిన ముాలపురుషుడు.

అసుర బారినుండి అవనిని కాపాడడానికి వచ్చిన 
మరుగుజ్జు రుాపుడు శ్రీమన్నారాయణుడు.

ధర్మాన్ని కాపాడడానికి వామన  వటువుగా ధరనవతరించినది శ్రీ మహావిష్ణువే ఈశ్వరీ .॥

************************************::::
6. పరశురామావతారము :

జమదగ్ని, రేణుకల పుత్రునిగా, కోపిష్టి తండ్రి
ఆజ్ఞ మేరకు తల్లిని , సోదరులను వధించిన
 పితృ వాక్యపరిపాలకుడు, పరశురాముడు. 

కామధేనువునివ్వని కారణంగా కార్తవీర్యార్జునుని కుమారులు  తండ్రి జమదగ్ని తల నరికినందుకు
కోపోద్రిక్తుడైన పరశురాముడు.

తల్లి రేణుక  రోదన చుాడలేక కార్తవీర్యార్జునుని కుమారులనందరినీ చంపి తండ్రిని బతికించిన వాడు.

కుపితభావుకులు, బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవయ్యొక్కసార్లు వధించి భూమిని క్షత్రియశూన్యం గావించినవాడు.

ఆవేశము అనర్ధాలకు కారణమని తెలిపేందుకు 
అవతరించిన ఆపద్బాంధవుడని తెలియుమీశ్వరీ ॥

**************************************
7.  రామావతారము:
 ---------------+
పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలచిన "శ్రీరాముని" అవతారం.

దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది సత్య, ధర్మ,
నిగ్రహాలకు ప్రతిరుాపమై నిలచిన వైనం.

సామాజిక  కట్టుబాట్లకు, ధర్మానికి, మానవుడు ఇవ్వవలసిన ప్రాధాన్యతకు నిదర్శనం .

కుటుంబ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యతాయుత
కార్య సమర్పణకు నిజమైన తార్కాణం శ్రీరామ చరితం.

సామాజిక కట్టుబాట్లను గౌరవించే జీవన విధానాన్ని 
ఆచరించుమీశ్వరీ ॥

***************************************
8.. బుద్దావతారము:

త్రిపురసంహారానికై బుద్ధావతార రుాపుడైన విష్ణువు.

త్రిపురాసురుల వధకై వారి పత్నుల పాతివ్రత్యాన్ని  భంగపరచుటకై  అశ్వత్థవృక్షంగా మారిన విష్ణువు .

త్రిపురాంగనల పాతివ్రత్యబలాన్ని నశింపచేసి , 
శంకరుని చేతి అస్త్రంగా మారి , త్రిపురాసురులను 
వధించిన విష్ణువు .

సిద్ధార్ధ నామ ముతో జని, సన్యాసియై సత్య, ధర్మ ,అహింసల బాటను ప్రజలకు బోధించిన ఆది బిక్షువు విష్ణువు .

బౌద్ధ ధర్మానికి మూల కారకులు. నాటి ఆధ్యాత్మిక గురువులలో మేటియైన గౌతమ బుద్ధుని బోధనలను 
గౌరవించుమీశ్వరీ . ॥

************************************:

9.కృష్ణావతారము:
***************
కర్మ , ధర్మ , జ్ఞానాదులనే పదునెనిమిది యొాగ తత్త్వ సారములను అవనిని తెలిపేందుకు అవతరించినవాడు.

ఆతడే లీలా మ‍నుష వేషధారి శ్రీకృష్ణుడు.

పసి బిడ్డడై యశోదానందులను, రేపల్లె బాలికలను
తన లీలలతో ఆనందపరచి ,అసురసంహారము గావించినాడు.

కురుక్షేత్ర సమర సమయంలో మనుజులు చేసిన
కర్త, కర్మ, క్రియలకు తానే కారణభుాతుడనని--
భుా భారమును తగ్గించిన బలరామానుజుడు.

కృష్ణావతాడుడై యుద్ధమందు అర్జునునికి 
సారధిగా నిలచి, గీతా వేద సారములను , తత్త్వజ్ఞానమునుా బోధించిన శ్రీ  విష్ణుదేవునకు అంజలినిడుమీశ్వరీ.॥

**********************************::
10. కల్కీ అవతారము :
-------------------
దర్శ సంస్థాపనకు, సజ్జన సంరక్షణ, దుర్జన సంహారమునకు, ప్రతీ యుగంలోనుా మానవరుాపంలో అవతరిస్తున్న  భగవంతుడు .

కలియుగ, కృతయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయశుడనే విప్రునికి పుత్రునిగా
ఉద్భవించిన  సర్వమ్లేచ్ఛ సంహారుడు, కల్కి భగవానుడు.

ప్రస్తుత సామాజిక ,రాజకీయ పరిస్థితుల దుర్గతికి 
సకల జన ,క్షామ, కామ ,లలామ శోక సంక్షోభణల విజృంభణకు కారణం కలి ప్రవేశమన్న తీర్మానం.

మనిషి స్వార్ధం తో తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లు చేసి , జన పతనమొందించే కలి కరవాలం ॥

కలి నివారణకై  మనుజులు ధర్మ పథంలో నడచి ,సమ సమాజ స్థాపనకై శాంతి బాటలో నడిచే సద్బుద్ధినీయమని ఆ భగవంతుని ప్రార్ధించు జగదీశ్వరీ.॥


హామీ:
పై దశావతారాలు  నా స్వీయ రచనలు.





భారత రాజ్యాంగం

అంశం : భారత రాజ్యాంగం.
శీర్షిక : రాజ్యాంగ రక్షణ మనందరి కర్తవ్యం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.


స్వాతంత్రోద్యమం,  ప్రాణాలు కోల్పోయిన
ఎందరో అమర వీరుల త్యాగ ఫలం.
సత్య, శాంతి , ధర్మాలకు ప్రతీకగా
ఎగురవేయబడిన ముాడు రంగుల ఝండా .
ప్రజా ప్రభుత్వం కోసం పోరాడిన భారత రాజ్యాంగ చట్టం         జనవరి,  26th 1950. నాటికి  అమలులోకి వచ్చిన ఆనందం .
 రాజ్యాంగ పరిషత్తు కు అధ్యక్షుడిగా డాక్టర్ 
 "బాబూ రాజేంద్ర ప్రసాద్",
భారతీయ రాజ్యాంగ ప్రధాననిర్మాతగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్  లు పొందిన  గౌరవం.
మౌలిక రాజకీయ సుాత్రాలతో , ప్రజల ఆశలు, ఆకాంక్షలతో మన దేశ ఆదర్శాలను రాజ్యాంగ పీఠికలో
అభివ్యక్తం చేయబడిన చట్టం.

పౌరులకు తమవ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకోవడానికి,  బాధ్యత కలిగిన పౌరులుగా జీవించేందుకు  ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్య్రముల హక్కు ఈ భారత సర్వోన్నత శాసనమైన రాజ్యాంగ చట్టం.

దేశ ప్రగతికి ,ఉన్నతికి , దేశ ప్రజల 
సర్వ మత సమానత్వానికి,  వెనుకబడిన బలహీన వర్గాలకు ప్రాథమిక హక్కుగా నెలకొని దేశానికి దిశా నిర్దేశం చేసిన చట్టం. 
ప్రతి ఏటా 26 నవంబర్ ను రాజ్యాంగ దినంగా పాటిస్తూ, సమ సమాజ స్థాపనే లక్ష్యంగా ,ప్రజల ఉన్నతే ధ్యేయంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రాథమిక హక్కులను ఎటువంటి సవరణలకు లోబడనివిగా చేసిన   మహోన్నత  శుభదినం
నేటి  భారత  రాజ్యాంగ  ఆవిర్భావ దినోత్సవం॥

దత్తపది.

తేది: 27-11-2021: శనివారము.
దత్తపది:  ధర్మము- అర్ధము-  కామము- మోక్షము ( పురుషార్థాల విశిష్టత ).
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ: పద్యము.

పద్య ప్రక్రియ : ఆటవెలది.

(ధర్మ )పథము విడకు , ధనలోభ  మదివీడు
(అర్థ) మవసరమ్ము నవని బ్రతుక
(కామ) మదియె నిన్ను కడనాశ నముజేయు
(మొాక్ష ) జీవి గమను మొాద ముగను॥

ప్రక్రియ : కంద పద్యము.

(ధర్మము) తోడను మెలుగుచు
కర్మములను జేయు నీవు (కామము) తొలగన్
ధర్మపు పర(మార్ధము) లివె
నిర్మల మది(మొాక్ష)మొందు నిత్యాచరణన్॥

ధన్యవాదాలతో...🙏🙏

శుభమౌ  ఆశీ ర్వచనము-
లభయ మ్ములునా కుగాద అవనిని ఆర్యా
నభమున గురులకు సమమౌ
సభమహ తీగురు లకిడెద సన్మాంజలులన్ ॥





(ధర్మ )పథము విడకు , ధనలోభ  మదివీడు
(అర్థం) మదియె మనిషి కవని బ్రతుక
(కామ) మదియె నిన్ను కడునాశ నముజేయు
(మొాక్ష ) జీవి గమను మొాద మదియె ॥

ప్రక్రియ : కంద పద్యము.

(ధర్మము) తోడను మెలుగుచు
కర్మములను జేయు నీవు (కామము) విడచిన్
మర్మము పర(మార్ధము) లివె
నిర్మల మది(మొా క్ష)మొంద నిత్యాచరణన్॥

ఇప్పటివరకు సున్నితం సమూహంలో ఇచ్చిన అంశాలు..

ఇప్పటివరకు సున్నితం సమూహంలో ఇచ్చిన అంశాలు🙏💐💐💐🎊🎊🎊
26_11_2021

1. తేనె వూటల తెలుగు
2. మగువే మానవలోకానికి దేవత
3. వ్యవసాయం రైతులకు ఇష్టానిలయం
4. తరువు మానవ ఆదెరువు
5. జలం మానవ బలం
6. బాల్యం
7. కార్తీకమాసంబు కడు మహత్యంబు
8. సాహిత్యం కొత్త పుంతలు
9. తుంగభద్ర పుష్కరాలు
10. నేటి యువత పై మీడియా ప్రభావం
11. మనోవేదన
12. రోడ్డు ప్రమాదాలు
13. ఇంధనం పొదుపు
14. నైతిక విలువలు
15. నూతనోత్సాహం
16. శ్రమశక్తి
17. జీవ వైవిధ్యము
18. విశ్వశాంతి
19. మహిళ మహోన్నత శిఖరం
20. యువత పై మాదక ద్రవ్యాల దుష్ప్రభావం
21. సంఘ సంస్కరణలు
22. ప్లవ నామ ఉగాది
23. స్వాతంత్ర స్ఫూర్తి
24. రంగుల హోలీ ఆనందాల కేలి
25. బుజ్జి పిచ్చుక నీ జాడ ఎక్కడ
26. శ్రీ శ్రీ సాహిత్యం
27. నిరుద్యోగం
28. మాతృభాషను కాపాడుకుందాం
29 మన సంస్కృతులు సంప్రదాయాలు
30. పలకరింపు
31 విద్యతోనే  విషయం వినతి కెక్కు
32 స్వశక్తి
33గీతాంజలి కావ్యం
34. కరోనా కష్టాల్లో మనోధైర్యం
35 చిరునవ్వు
36 మొక్కలు నాటు సంరక్షించు
37. హెల్మెట్ రక్ష
38.. తొలకరి చినుకు
39.నిత్య జీవితంలో యోగా
40. పీవీ ఆర్థిక సంస్కరణలు
41.  వరకట్నం 
42. సైనికులకు వందనం
43. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సేవానిరతి
44. లాల్ దర్వాజా బోనాలు
45. రామప్ప వైభవం
46. మూఢనమ్మకాలు
47. తెలుగు భాషా దినోత్సవం.
48. గురువు
49. పౌష్టికాహారం
50. శాంతి మంత్రమే గొప్ప తంత్రము
51. రాకాసి రాజ్యంలో రాలిపోతున్న అబలలు
52.  గాంధీ తత్వం
53.రక్తదానం
54. బతుకమ్మ
55. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం
56.  సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు
57. దీపావళి
58. దాశరధి కృష్ణమాచార్యులు సాహిత్యం
59. నేటి బాలలే రేపటి పౌరులు
60.  ఝాన్సీలక్ష్మీ బాయి వీర పరాక్రమం
61. భారత రాజ్యాంగం

Saturday, November 27, 2021

భారత రాజ్యాంగ చట్టం.

[11/6, 18:21] p3: 6/11/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
అంశం : దాశరథీ కృష్ణమాచార్యులు 
శీర్షిక : ప్రజాకోటి.

166.
నిజాం పాలకుల నిరసనతో
కలాయుధంతో కఠినమైన ఉద్యమం 
పద్య విన్యాసాలతో  పదపోరాటం .
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
167.
తెలంగాణ విముక్తికై  ఆరాటం.
తెలంగాణ రతనాల వీణంటుా.
ప్రేరణిచ్చిన స్ఫుార్తికి  నిదర్శనం . 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
168.
సముద్ర  గర్భంలో  బడబానలం  
సాయుధ రైతాంగ పోరాటానికి
ఎలుగెత్తిన దాసరధీ కలం 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
169.
నీలాకాశంలో కానరాని భాస్కరులు
గాయపడిన కవి గుండెలలో 
రాయబడని కావ్యాలన్న క్రిష్ణమాచార్యులు
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
170.
నా పేరు ప్రజాకోటి -
నా ఊరు ప్రజావాటన్న
తెలంగాణ తెలుగుబిడ్డ దాశరధి 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

హామీ: పై సున్నితాలు నా స్వీయ రచనలు.
[11/21, 22:20] p3: 21/11/2021.
ప్రక్రియ సున్నితం 
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : ఝాన్సీ లక్ష్మీ బాయి వీర పరాక్రమం.
శీర్షిక : వీర వనిత.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర ..

176
రాజా గంగాధరరావుతో వివాహం 
వివాహానంతరం లక్ష్మీబాయిగా మణికర్ణిక -
భారతీయ తిరుగుబాటుకు చిహ్నం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
177
బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకి
మరాఠా రాచరికపు దేవేరి .
ఝాన్సీ మహారాణి మణికర్ణిక .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
178
గుర్రపుస్వారీ, విలువిద్యలలో ప్రావీణ్యం.
ఝాన్సీ స్వాతంత్ర్యానికై  ఆరాటం 
సమర్థవంతమైన  సేనల తయారీ .. 
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
179
అత్యంత ధైర్య-సాహసాలతో పోరు
మహిళా సాధికారతకు ఆదర్శం.
స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థానం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
180
నాయకులందరిలో అత్యంత ప్రమాదకరమైనది.
దొంగచాటు దెబ్బతో మృత్యువు .
గ్వాలియర్‌లోని ఫూల్ బాగ్ లో సమాధి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥


హామీ: పై సున్నితములు నా స్వీయ రచనలు.
[11/28, 12:51] p3: 28/11/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.

అంశం : భారత రాజ్యాంగం.
శీర్షిక : రాజ్యాంగ రక్షణ మనందరి బాధ్యత.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


 స్వాతంత్ర్యం  వీరుల త్యాగఫలం.
 మువ్వన్నెఝండాలో సమానత్వ సందేశం.
 ప్రజా ప్రభుత్వాకాంక్షల పోరాటం.
 చుాడచక్కని  తెలుగు సున్నితంబు.॥
 
భారత రాజ్యాంగ చట్టం
అమలులోకి  వచ్చిన ఆనందం.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బి.ఆర్. అంబేడ్కర్ ల కృషిఫలం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు.॥

 మౌలిక   రాజకీయ సుాత్రాలతో  .
అమలైన ప్రజాతంత్ర  చట్టం.
పౌరుల వ్యక్తిత్వాభివృద్ధికి తార్కాణం
చుాడచక్కని  తెలుగు సున్నితంబు.॥

సర్వోన్నత శాసనమైన రాజ్యాంగచట్టం.
వెనుకబడిన బలహీన వర్గాలకు 
 దిశానిర్దేశం చేసిన చట్టం. 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు.॥

సమసమాజ స్థాపనే లక్ష్యంగా 
ప్రజల ఉన్నతే ధ్యేయంగా 
భారతరాజ్యాంగ  ఆవిర్భావ దినోత్సవం॥
చుాడచక్కని  తెలుగు సున్నితంబు.॥

హామీ :
పై సున్నితములు నా స్వీయ రచనలు.


.

కాళిదాసు

అంశము: సాహిత్యాంశము.
మహాకవి కాళిదాసు.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

శీర్షిక : కవి కుల శ్రేష్ఠి .
(వచన కవిత).

సంస్కృత కవియైన కాళిదాసు
గొప్ప శువ భక్తుడు.నాటక కర్త.
కవికుల గురువుగా పేరున్న
ఇతడు  హిందుా పురాణ , 
తత్త్వాలకు సంబంధించిన 
ఎన్నో కావ్య-నాటకాలను
రచించిన ప్రతిభావంతుడు.
కాళికాదేవి అనుగ్రహము
పొందిన వర ప్రసాదుడు.
నవ రత్నములుగా పేరుగాంచిన
విక్రమార్కుని ఆస్థాన కవులలో
 ఒకఁడైన కాళిదాసు 
ఉపమానోపమేయములను 
అతిచక్కగా పోల్ఛు సమర్ధుడు.
అంతేగాక శాకుంతలము, 
మాళవికాగ్నిమిత్రము, 
విక్రమోర్వశీయము అను 
నాటకములును, రఘువంశము, 
మేఘసందేశము, కుమారసంభవము 
అను కావ్యములు రచించి
ఉత్తమ కవిగా పేరొందన ఘనుడు.

ఈయన  ఇంకా, నళోదయము,
శృంగార తిలకము, ప్రశ్నోత్తరమాల, 
కవికంఠ పాశము, కర్పూరమంజరి,
భోజచంపువుఅనే గ్రంథములను,
మేఘసందేశమనే కావ్యమును,
శ్యామలా దండకమును రచించి 
కవికుల గురువుగా కీర్తించబడినాడు.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే l
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ll  
వంటి అత్యద్భుతమైన ఉపమాలంకార 
సౌందర్యం గల శ్లోక రాజములను 
రచించి ఉత్తమ కవిగా అద్భుత 
ఉపమానాలతో కవితాలోకాన్ని 
అలరించిన  కాళిదాసు కవితా 
సౌందర్యం ఏనాటికీ రతగని పెన్నిధి.
అనడంలో అతిశయొాక్తి లేదు.






మత్తకోకిల

మత్తకోకిల పద్యాలు
రచన: : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర

రామ రామని వేడు చుంటిని
కోమ లాంగవు రాఘవా॥
సీతతోడను గుాడి రావయ 
మాత మమ్ముల బ్రోవగా॥
దీన పోషక  రాక్ష సాంతక 
ధ్యాన యొాగి సుపుాజితా॥
కోటి సుార్యప్ర కాశ సుందర
వాటి కామఖ  రక్షకా ॥
ధ్యాయ సజ్జన సార సుందర 
మేయ కార్యసు కారకా ॥
రాజ శేఖర  యజ్ఞ రక్షక
ఓజ తేజ ప్రకాశకా ॥
మేటి కోసల రాజ్య పాలక
కోటి సుార్య  ప్రకాశకా ॥
దాస పోషణ దీన బాంధవ
వాస యొాధ్యపు రాధిపా॥
జానకీదుఃఖ భంజనాజయ
దాన వాంతక పావకా॥
ఆంజ నేయసు పుాజి తామన
రంజ నార్తప రాయణా ॥
వందనీయసు పాద పంకజ
బంధ మొాచజ నావనా ॥










చిత్ర కవిత కు రాసిన పద్యాలు

25/10/2021. సొిమవారము
చిత్ర కవిత.
రచన: : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర
ప్రక్రియ : ఆటవెలది
మా.సా.క.సం. : 19.
కవిత సంఖ్య  1.

అంబ రమ్ము జుట్టె  అదె మానవుని విద్య 
కోతి కక్కరొచ్చె  కోరు ప్రగతి
జక్క గాను బట్టె   చరవాణి చేతితో
పనికి రాని విద్య  పరువు దీసె ॥

మేధ నిండు మనిషి  మేల్గాంచి మసలయ్య
భరత భవిత కిడుము  ఫలము  బలము
చక్క నైన విద్య చరవాణి  పరమైన 
చెడును చుాడ రెవరు చెడదు జగము ॥ 

 కోట్ల జన్మ తపము కోరి పొందిన వరము
 విద్య లెల్ల ఇలను వికట మందె
చెప్ప నలవి కాదు చరవాణి మహినేలె
అసహ నమ్ము లాయె అవని బ్రతుకు ॥ 

కోతి వంటి మనిషి కోరి మనిషిగ మారి
విద్య లెన్నొ నేర్చి విశ్వ మెరిగె
జ్ఞాన మన్న జ్యోతి  జ్ఞానివై వెలిగించి
దారి జుాప వయ్య  ధరణి లోన ॥

చెత్త బుట్ట నిండ చెడు వాసనలు వచ్చు
సుద్ధి జేయ వచ్చు సుఖము ప్రీతి
మేధ మధన మదియె మేలు జేసెడు విద్య
పక్క దార్ల పరుగు పతన మేల॥

హామీ : ఈ పద్యములు నా స్వీయ రచనలు.


తెలుగు జిలుగు

✍🏻మూడింటినీ నిలువుగానూ, అడ్డంగానూ చదివి చూడండి. ఎట్లా చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి!✍🏻

స మ త
మ జ్జి గ
త గ ము

కం చ ము
చ క్కె ర
ము ర ళి

క్షీ ర ము
ర వ్వ లు
ము లు కు

కా ను పు
ను వ్వు లు
పు లు లు

కా ర ము
ర గ డ
ము డ త

స మ త
మ ర ల
త ల పు

త మ కం
మ ర్యా ద
కం ద కం

పొ ల ము
ల లి త
ము త క

ధ న ము
న వ్య త
ము త క

వ ర స
ర వి క
స క లం

హి మ జ
మ న ము
జ ము న

క వి త
వి న ల
త ల క

కో వె ల
వె న్నె ల
ల ల న

మ న సు
న య నం
సు నం ద

ది న ము
న గ రి
ము రి కి

టో క రా
క వ్వ ము
రా ము డు

చ దు వు
దు ర ద
వు ద కం

ప్ర వే శం
వే ది క
శం క రం 
[11/25, 16:50] +91 96520 21126: ✍🏻మూడింటినీ నిలువుగానూ, అడ్డంగానూ చదివి చూడండి. ఎట్లా చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి!✍🏻

Wednesday, November 24, 2021

దత్తపది

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగే*

పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు*
సమీక్షణ: *శ్రీ కొనింటి రమేష్ గారు*
తేది: *09-10-2021: శనివారము*
దత్తపది:  *గిరిజ- శైలజ-  హేమజ- అగజ*

దత్తపది:  *గిరిజ- శైలజ-  హేమజ- అగజ*
పద్య ప్రక్రియ :  మత్త కోకిల.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
జిల్లా  : కల్యాణ్ : మహారాష్ట్ర

అంబ ఈశ్వరి ఆది శక్తివి అందు కోనుతి  శాంకరీ
శుంభ దైత్యుని భంజనీ ప్రియ శంభు మొాదిని పార్వతీ
శంభు రాణివి ,సార పుాజలు సాధ్వి జేతు సుమంగళీ
గుంభ నమ్ములు నీదు మాయలు గుమ్మ  శ్రీ"గిరిజా"త్మనే॥ ॥

బిందు రుాపిణి "శైలజా"ఘని బంధ మొాచని పావనీ
ఇందు లోచని ఇందిరా సఖి  ఈశ్వరాఖిల మొాహినీ
గంధ లేపని  పాపనాశి సుగంధ హార సుభుాషణీ ॥
మంద గామిని దుర్గ హారిణి మంత్రమాతృకె మానినీ॥

భామ సుందర భుాషితాంగిని  "హేమజా"మర నాయికా॥
కామరుాపిణి కాంత కౌళిని కాల రుాపిణి  కాళికా
శ్యామ సుందరి సార సుస్వర స్వాదు మంజుల గాయికా
కోమ "లాగజ" గామి నీసతి పార్వతీ పర దేవతా ॥

కోమలాంగి దశావతారిణి  కోటి సుార్య ప్రకాశినీ
భామ దుర్గతి నాశినీ నమొ పార్వతీ పరమేశ్వరీ ॥
కామకార్య విలోలినీ శివ కామినీ వర దాయినీ
ధామ శ్రీపుర వాశినీ భవతారిణీ సింహ వాహినీ॥

ఈ పద్యములు న స్వీయ రచనలు.

Tuesday, November 23, 2021

సున్నితం ప్రక్రియ.కవితలు

[10/16, 18:17] p3: సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ: సున్నితం
రూపకర్త:: నెల్లుట్ల సునీత గారు
తేదీ:: 16-10-2021
వారం: శనివారం

అంశం  ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం.

శీర్షిక : ప్రపంచ శాంతికై  శ్రీకారం.

రచన, శ్రీమతి, పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి.కల్యాణ్ : మహారాష్ట్ర .


151.
అంతర్జాతీయ చట్టభద్రత,  ఆర్థిక-
సామాజికాది  మానవహక్కుల సమష్టి-
కృషికై  ఐక్యరాజ్యసమితి  ఆవిర్భావం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥ 
152.
ప్రపంచశాంతి పరిరక్షణకై తీర్మానం.
శాస్త్ర సాంకేతికరంగాలకు సహకారం. 
వైజ్ఞానిక - సాంస్కృతిక విద్యాస్థాపనలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
153.
ప్రపంచ సమస్యలను పరిష్కరించడం
బాలల సమగ్రాభివృద్ధికై కృషిచేయడం
ప్రపంచ ఆరోగ్యసంస్థగా గుర్తింపు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
154.
ప్రపంచ పర్యావరణ  పరిరక్షణ,
అణ్వస్త్రవ్యాప్తి నిరోధనకై  కృషి
ప్రపంచ పార్లమెంట్ గా వ్యవహరించడం.॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
155.
ఆలివ్  కొమ్మల మధ్య ,
 తెలుపురంగు గ్లోబుల్ చిత్రం.
 నీలిజండాపై నిలిచిన శాంతిచిహ్నం .
 చుాడచక్కని తెలుగు సున్నితంబు.
 
హామీ:
ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
[10/22, 20:48] p3: సాహితీ బృందావన జాతీయ వేదికలో
22/10/2021 . 
అంశం : సర్దార్ వల్లభ భాయ్ పటేల్ సేవలు.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
ఊరు:  కల్యాణ్. మహారాష్ట్ర .

శీర్షిక :  ఉక్కు మనిషి.

156
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 
స్వదేశీ జాతీయొాద్యమాల ఆకర్షణతో
మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉద్యమం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
   157
బార్దోలిలో సత్యాగ్రహానికి విజయం
ప్రజల సంక్షేమానికై పోరాటం
అల్లర్లను అణచివేయగల చాకచక్యం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
   158   
హైదరాబాదు, జునాగఢ్   సంస్థానాలను                    భారతదేశములో విలీనం చేయుటలో
సఫలుడైన   వల్లభ్ భాయ్ ఘనత 
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
159
 నెహ్రూ నేతృత్వంలో కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ,ఉపప్రధానమంత్రిగా బాధ్యత
భారతరత్నగా   బిరుదందిన ఉక్కుమనిషి 
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
160.
కిసాన్ ఉద్యమ విజేత
ది గ్రేటెస్ట్ఇండియన్పోల్ లో మూడవ స్థానం
 అత్యుత్తమ వ్యక్తిగా సర్దార్ -వల్లభ భాయ్-పటేల్  
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥



ఈ సున్నితాలు నా స్వీయ రచనలు.
[10/30, 20:51] p3: 30/10/2021.
ప్రక్రియ : సున్నితం.
అంశం : దీపావళి
శీర్షిక  : నరకాసుర వధ.

రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

161
వరహావతారునకుా భుామాతకును  శిశువు
ముద్దుదీర్చు  పుత్రుడు నరకాసురుడు.
అసుర  లక్షణములున్న  ముార్ఖుడాతడు.
చుాడ చక్కనీతెలుగు సున్నితంబు ॥
162
కామాఖ్యాదేవికి కడు  భక్తుడీతడు
బాణాసురు చెలిమితో  కడుధుార్తుడు-
అమ్మచేత మరణమని తెలియనివాడితడు
చుాడ చక్కనీతెలుగు సున్నితంబు ॥
163
దేవ్వోపాసనల దేహ బలుండాయెను
దేవతలనుల హింసించి బాధించుచుండెను
ఇంద్రపదవి నాక్రమించి  స్వర్గమేలెను
చుాడ చక్కనీతెలుగు సున్నితంబు ॥
164
దేవతల మొరవినెను జగన్నాధుడు .
సత్యభామ సహితుడైన శ్రీకృష్ణుడుా 
పోరుసల్ప కుాలినాడు నరకాసురుడుా
చుాడ చక్కనీతెలుగు సున్నితంబు ॥
165
భుాదేవీ వరమదే  శాపమాయెను
అమావాస్యరోజున నరకుడు కనుముాసెను.
జనులు దీపవళులుపేర్చి సంతసించెను॥
చుాడ చక్కనీతెలుగు సున్నితంబు ॥ 

హామీ :
పై సున్నితములు నా స్వీయ రచనలు.
[11/6, 18:21] p3: 6/11/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
అంశం : దాశరథీ కృష్ణమాచార్యులు 
శీర్షిక : ప్రజాకోటి.

166.
నిజాం పాలకుల నిరసనతో
కలాయుధంతో కఠినమైన ఉద్యమం 
పద్య విన్యాసాలతో  పదపోరాటం .
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
167.
తెలంగాణ విముక్తికై  ఆరాటం.
తెలంగాణ రతనాల వీణంటుా.
ప్రేరణిచ్చిన స్ఫుార్తికి  నిదర్శనం . 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
168.
సముద్ర  గర్భంలో  బడబానలం  
సాయుధ రైతాంగ పోరాటానికి
ఎలుగెత్తిన దాసరధీ కలం 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
169.
నీలాకాశంలో కానరాని భాస్కరులు
గాయపడిన కవి గుండెలలో 
రాయబడని కావ్యాలన్న క్రిష్ణమాచార్యులు
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
170.
నా పేరు ప్రజాకోటి -
నా ఊరు ప్రజావాటన్న
తెలంగాణ తెలుగుబిడ్డ దాశరధి 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

హామీ: పై సున్నితాలు నా స్వీయ రచనలు.
[11/13, 17:28] p3: 13/11/2021.
సాహితీ బృందావన జాతీయ వేదిక
అంశం : నేటి బాలలే రేపటి పౌరులు .
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
శీర్షిక  : భవిత చరితకు పునాదులేద్దాం.

171.
బాల్యం భగవంతుడిచ్చిన వరం.
పసితనపు అమాయకత్వమే ఆభరణం.
అందరిలో  సమానత్వ భావం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
172.
విద్యావిధానాలలో ప్రధాన లోపం
సామాజికాంశాలు తెలీని అవివేకం.
విద్యార్ధి జీవితాలకొక శాపం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
173.
విద్యార్థుల వినాశనానికి మాధ్యమం 
ప్రధాన భుామిక మీడియారంగం .
కరన్సీ యంత్రాలుగా యువతరం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
174.
నాయకుల త్యాగాలను వివరించు
యువతలో దేశభక్తి కలిగించు.
చైతన్యపు  దీపాలను వెలిగించు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
175.
అపుడౌతారు సంస్కారాలకు ప్రతిరుాపాలు
సభ్యత సంప్రదాయాలకు ఆలంబనలు.
సమసమాజ  స్థాపనకు పునాదులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

హామీ : ఈ సున్నితాలు నా స్వీయ రచనలు.

దుార్వాసుడు

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
తేది:23.11.2021
అంశం:సాహిత్యాంశము(దుర్వాస మహర్షి)
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ: వచనం 
శీర్షిక:  గర్వ భంగం 
ఈవారంకవితాసంఖ్య:2 
మ.సా.క.సం: 19


అత్రి అనసుాయల పుతృడు  అతి కోపిష్టి అతడు.
కోపముతో శాపములిచ్చే ముక్కోపి యైనా
ఆదరించినవారిని ఆనుగ్రహించే వర ప్రసాదుడు.
అతనికి సేవ చేసిన కుంతి కి అతను ప్రసాదించిన
ఉపాసనా మంత్రాల ప్రభావంతోనే ముగ్గురు
పుతృలను కలిగిన విషయం విదితమే.
దుార్వాసుని కోపానికి అంబరీషుని కధ తార్కాణం.
ఏకాదశి ఉపవాస దీక్షావిరమణకై , ఆతిధ్యానికి 
రావలసిన దుార్వాసుని రాక ఆలశ్యమైనందున 
ద్వాదశి ఘడియలు దాటక మునుపే తులసి తీర్ధం
సేవించినందున, అదిగ్రహించిన ముక్కోపియైన 
దుార్వాసుడు అంబరీషుని పైకి మహాకృత్యను
సృష్టించి విడిచిపెట్టిన కారణంతో విష్ణువునాశ్రయించిన
అంబరీషుని రక్షణకై విడచిన సుదర్శన చక్రం 
ఆ రాక్షసిని హతమార్చి , దుార్వాసుని వెంటబడుతుంది.
బ్రహ్మ  రుద్రాదులు సైతం చక్రాన్ని ఆపలేని కారణంగా దుార్వాసుడు విష్ణు ముార్తి శరణు కోరుతాడు.
విష్ణువు , ఆతనిని అంబరీశునే శరణుకోరమని
చెప్పగా..దుార్వాసుడు అంబరీశుని ప్రార్ధించినందున
చక్రం శాంతిస్తుంది. 
ఈ విధంగా ముక్కోపియైన దుార్వాసునికి
 గర్వ భంగమవుతుంది. 
 
హామీ:
పై వచనం నా స్వీయ రచన.


 

ప్రక్రియ పంచపదిలో : ద్వాదశ జ్యోతిర్లింగాలు.

21/11/2021.
పంచపది.
అంశం : ద్వాదశ జ్యోతిర్లింగాలు .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

శివభక్తులైన శైవులు పుాజించే  మహాదేవుడు శివుడు -
లింగాకారంలో ఉద్భవించిన జ్యోతిస్వరుాపుడు.
దేవ, ఋషి, గ్రహ, గణాలు కొలిచే బోళా శంకరుడు.
ప్రసిద్ధమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో జ్యోతిగా నిలిచేడు.
పన్నెండు పవిత్ర పుణ్య క్షేత్రాలలో నెలకొన్న ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించి ధన్యతనొందుమీశ్వరీ ॥
**********::::**:*:::*******************
22/11/2021.
పంచపది : 19.
అంశం : శ్రీ సోమనాధుని జ్యోతిర్లింగం.  1
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

ప్రభాస క్షేత్రాన వెలసిన శివుని  ప్రథమ జ్యోతిర్లింగ స్వరుాపము.
సౌరాష్ట్ర సోమనాధుని పేరుతో ప్రాచుర్యము.
మృత్యుంజయ మంత్ర జపముతో సర్వరోగ నివారణము.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిచే (1951)
లింగప్రతిష్ఠ , పునర్నిర్మాణ కార్యక్రమము.
1970 సంవత్సరంలో శ్రీ సత్యసాయిబాబా గారిచే ప్రారంభోత్సవమైన సోమనాధుని చుాచి తరించుమీశ్వరీ ॥
******************************************
23/11/2021.
పంచపది.20.
అంశం : శ్రీశైల మల్లీశ్వర జ్యోతిర్లింగం: 2.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

పాతాళ  గంగయైన క్రిష్ణానదీ తీరము.
ఆది శంకరాచార్యుల శివానందలహరిసారము.
అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన పుణ్య క్షేత్రము.
మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా శివుని  ఆవిర్భావము.
శ్రీ భ్రమరాంబికాసహిత
శ్రీశైల మల్లికార్జునుని దర్శించి తరించుమీశ్వరీ ॥
**************************************
24/11/2021.
పంచపదిలో
అంశం : మహాకాళేశ్వర జ్యోతిర్లింగం..3
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

మధ్యప్రదేశ్‌ , ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయము.

 గర్భగుడిలో  తిరగవేసి ఉన్న శ్రీచక్రయంత్రము.     దక్షిణాభిముఖ ముఖద్వారం  ప్రత్యేకము.

తాంత్రిక మంత్రాలతో ప్రాతఃకాల భస్మాభిషేకము.

మద్యం నైవేద్యంగా, మంత్ర శక్తితో  ఉద్భవించిన ఏకైక స్వయంభూ కాలభైరవ జ్యోతిర్లింగము.

అష్టభైరవులు,ఏకాదశరుద్రులు, వేల దేవతా మందిరాలు గల కృష్ణా నదీ క్షేత్ర దర్శనముతో 
జీవితమది ధన్యము గద ఈశ్వరీ ॥
***************************************
*పంచపది* విజేతలు.
తేదీ:24.11.21
అంశం *మహాకాళేశ్వర జ్యోతిర్లింగము-3*

ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
యం వి ధర్మారావు గారు

ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
మేకల అనురాధ ప్రసాద్ గారు

తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
**********:****:*:*:::****************
 25/11/2021.
పంచపదిలో
అంశం : ఓంకారేశ్వర్ జోతిర్లింగం. 4.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

వింద్య పర్వత సానువుల్లో 
నర్మదా నదీతీరంలో వెలసిన ఓంకారేశ్వరుడు .

రెండు భాగములుగా ఉండి,  రెండు పేర్లతో పూజింపబడుతున్న లింగాకారుడు.

ఓంకారేశ్వర  ,అమరేశ్వరు నామాలతో వెలసిన దేముడు .

అన్నపుార్ణ అర్ధాంగిగా కొలవబడుతున్న శివుడు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాండ్వా జిల్లా క్షేత్ర దర్శనంతో 
అన్నపుార్ణమ్మ కృపకు పాత్రురాలివికమ్ము ఈశ్వరీ . :
***************:*::*:**********************

పంచపది.
తేదీ:26.11.21
అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-5
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం.

రావణుడు తన పది తలలను అర్పించి 
పుాజించిన ఆలయం.

రావణ భక్తికి మెచ్చి గాయపడిన రావణుకి
"వైద్య"మందించిన శివుని ఆలయం.

జార్ఖండ్ రాష్ట్రంలోని చితాభుామియైన  డియోఘర్ ప్రదేశం .
కపాలిక / భైరవ వంటి తాంత్రిక ఆరాధనలకు నిలయం.
శవభస్మ భూషితుడైన వైద్యనాధుని సేవించి తరించుమీశ్వరీ ॥
**************************************
ముాడు చోట్ల గల వైద్యనాధ జ్యోతిర్లింగాల గురించి...

పంచపది.
తేదీ:26.11.21
అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-5
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం. 1.


సుదర్శన చక్రం ద్వారా విచ్ఛిన్నమైన సతీ- "దాక్షాయని"గుండె భాగం పడిన స్థానమిది.

51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడినది.

సతిని విడువలేని శివుడు నెలకొన్న స్థానమిది

"హర్ధపీత" గా పిలువబడుతున్న ఈ ప్రదేశంలో
సతి "జయదుర్గ" గా శివుడు "వైద్యనాథ్" గా
పుాజింపబడుచున్నది.

శివుడు పాక్షికంగా మండుతుా జ్యోతిర్లింగేశ్వరునిగా
నెలకొన్న పవిత్ర ప్రదేశాలను దర్శించుమీశ్వరీ.॥

**************************************

పంచపది.
తేదీ:26.11.21
అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-2.
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం.

మహారాష్ట్రలోని పార్లిలో ఉన్న
వైద్యనాధుని , రావణుడు తన పది తలలను
అర్పించి పుాజించిన ఆలయం.

రావణ భక్తికి మెచ్చి గాయపడిన రావణుకి
"వైద్య"మందించిన శివుని ఆలయం.

జార్ఖండ్ రాష్ట్రంలోని చితాభుామియైన  డియోఘర్ ప్రదేశం .

కపాలిక / భైరవ వంటి తాంత్రిక ఆరాధనలకు నిలయం.

శవభస్మ భూషితుడైన వైద్యనాధుని సేవించి తరించుమీశ్వరీ ॥

******************************:*::******

పంచపది.
తేదీ:26.11.21
అంశం: శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం-3
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం. 3.

"ఎవరు గొప్ప" అన్న వాదనతో బ్రహ్మ విష్ణువులు.

వారిని పరీక్షించడానికి,  మూడు ప్రపంచాలను లింగాకార కాంతి స్తంభంగా మార్చి  అద్యంతాలను
దర్శించి రమ్మన్న శివుడు.

గెలుపుకోసం అబద్ధమాడిన బ్రహ్మను పుాజానర్హునిగా శపించిన శివుడు.

సత్యము పలికిన విష్ణువుకు శాశ్వత పుాజార్హతలు
కలిగించిన దేముడు.

శివుడు పాక్షికంగా మండుతుా కనిపించే 12 జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలను దర్శించీ తరించుమీశ్వరీ
********************************************