Friday, August 6, 2021

పరమపద సోపానపథము( వైకుంఠపాళీ).

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .

శీర్షిక : జీవిత వలయం.

రాతియుగంలో  సశ్య
శ్యామల మైన  సుందర దేశ ప్రకృతి
ఆదిమ వాసుల అరమరికలు లేని జీవితం
స్వశ్ఛ మైన ప్రకృతి వనరుల పచ్చ ధనం
తేట నీరు, వీచు గాలుల శుద్ధమైన
ఆరోగ్య సంపదకు నిలయం
మారుతున్న కాలంలో 
మనిషి వేసిన ముందడుగు
జాతి ,మత విభజనలు , 
విద్యా విధానాలో వర్ణ విభజనార్హతలు.
బడుగు బతుకుల  బానిసత్వపు ఆటుపోట్లు.
 మరో అడుగు ముందుకి  
 వేసిన విద్యా విధానాలు
 తిరుగుబాట్ల ఉద్యమాలు,  
 స్వాతంత్ర్య జీవన పోరాటాలు ,  
 సాధికార సాఫల్యతానందాలతో.
 మరో అడుగు ముందుకి.
 మనిషి వికసించిన మేధస్సుతో...
 ఆకాశ హార్మ్యాలు , అంతరిక్ష  యానాలు..
 సుఖ- సౌఖ్య,  జీవనగతి తో 
 మారిన మనస్తత్వాలు
 సమయ సందర్భాలు 
 లేని సారహీనపు అలవాట్లు.
రాత్రి క్లబ్బు పబ్బులు , పగటినిద్ర రోగాలు.
 బీడు పడ్డ భుాలులు జీవితపు భాగాలు.
 చెట్ల కొరత, చెత్త నిలవ, జీవ హింస , స్వార్ధ
 చింతనలు నిండిన బుద్ధిహీన ప్రజావేశాలు.
  దిగజారుతున్న వలువలు ,
  బజారున పడ్డ స్త్రీ విలివలు.
  కాలుష్య కణ ప్రభావాలు
  ముక్కు ముాతులకు మాస్కులు 
  మందులేని మానవ కళేబరాలు.
  గుట్టలు తేలిన దహనం కాని కళేబరాలు.
  అణగారిన బ్రతుకుల దిక్కుతోచని జీవితాలు.
  ఆకాసానికి నిచ్చెనలు  .ఆగని తాపాలు
  అతఃపాతాళాల అణపులు.
  అంతా నాదే , నీదీ నాదే ,అన్న భావంతో 
  బరువుగా ఉండే  చేతలు. 
  రచ్చకెక్కిన రాజ్యాంగాలు. ఇచ్ఛా శక్తుల
  రౌడీ రాజ్యాంగాలు. ఒకొక్క గద్దెపై ఒకొక్క
  విష సర్పం..కాటేసిన ఫలితం మానవ ఖననం.
  ఈలోకంలో మనిషి ఒడిదుడుకుల సవారీకి 
 దారి , విష సర్పాల జీవిత  వైఖుంఠ పాళీ..