Tuesday, March 28, 2023

మనోహరి

#selected జోక్స్

*(03-03-2023) నుంచీ శనివారం (04-03-2023) 7pm వరకు వచ్చిన జోక్స్ లో పత్రికకు సెలెక్ట్ చేసినవి:*

నాకూ పెళ్ళి కావాలి - పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి
ప్రియంవద పుతుంబాక
విజయాచలం
శ్రీవిజయదుర్గ. L

మిగితావి వెబ్సైటులో అప్లోడ్ చేసి లింక్స్ ఇవ్వబడును...
శ్రీవిజయదుర్గ. L
ప్రత్యక్షమైన నక్షత్ర మండలం - కమల'శ్రీ'
తెలివైన విద్యార్థులు - చిట్టెళ్ల దీప
అరుణ డేనియల్
జ్ఞాన ప్రసూనాంబ దండకం (ఐచ్చికం) - పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 
ప్రియంవద పుతుంబాక 
K. K. తాయారు (2)

మనోహరి పత్రకలో... సెలక్ట్ ఐన రచనలు.

#selected జోక్స్



[31/03, 9:48 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: #selected దర్శనీయ స్థలాలు (15-17/03)

*15-03-2023 నుండి 17-03-2023 వరకు "దర్శనీయ స్థలాలు" అనే అంశంపై వచ్చిన రచనలలో అన్ని రచనలు పత్రికల కోసం సెలెక్ట్ చేయటం జరిగింది..* వీలువెంబడి రచనలు మనోహరి మరియు మనోహరం వార, మాస పత్రికలలో ప్రచురించబడతాయి.

1. ఆనంద భాష్పాలు రాల్చే ఆంజనేయుడు - మంజీత కుమార్
2. బాల త్రిపుర సుందరి - మహాలక్ష్మి రావిరేల (కొప్పరపు)
3. అమ్మపల్లి దేవాలయం - సావిత్రి కోవూరు
4. శ్రీ కోదండరామస్వామి ఆలయం(ఒంటిమిట్ట) -  రామలక్ష్మి సుంకరణం
5. మైసుారు (శ్రీరంగపట్టణం) - పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
6. హార్స్లీ హిల్స్ - కె.కె.తాయారు
7. ధర్మపురి గుడి - సుజాతకోకిల  
8. సింగరకొండ - వరలక్ష్మి యనమండ్ర     
9.  ‌మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి, పానకాల స్వామి ఆలయాలు - ప్రియంవద పుతుంబాక.
10. నీలావడి అగ్నిగంగమ్మ - నాగ నివేదిత. P
11. శ్రీ చక్రాలయం - అద్దంకి లక్ష్మీ
12. అలంపురం జోగులాంబ దేవాలయం (ఐదవ శక్తి పీఠం) - జూపూడి సుధారాణి
13. కామాఖ్య శక్తి పీఠం - శ్రీ విజయ దుర్గ. ఎల్.
[31/03, 9:48 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: #selected బాలసాహిత్యం 20&21/03 pending

*20-03-2023 నుండి 21-03-2023 వరకు మనోహరి మహిళా పత్రిక కోసం బాలసాహిత్యం (కథ/కవిత) అనే అంశంపై  సెలెక్ట్ చేసిన రచనల లిస్ట్*

1. మంచి మాట వినరారే ముద్దుల సిరి ముాటలు - పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
2. చిన్ని రాముడు - వింజరపు.శిరీష 
3. సంబరమొచ్చినాది - శ్రీసుధ కొలచన 
4. కవిత - DNR. సంతోషి
5. మా ఇంటి సిరి (బాలగేయం ) - టి. వి. యెల్. గాయత్రి
6. బాల సాహిత్యం - ఇరువంటి (సోమరాజు) మాధురీ దేవి
7. ఔదార్యం - కె.కె.తాయారు
8. చిలిపితనం - చట్టి లక్ష్మి
9. అఆ ఇఈ నేర్చేద్దాము - మక్కువ. అరుణకుమారి 
10. బాల గేయం - జూపూడి సుధారాణి

వెబ్సైటులో లింక్స్ గా ఇచ్చేవి:
అందమైన రోజా పువ్వులు - అరుణ డేనియల్
రేపటి మహిళా లోకం- సుజాత కోకిల
మా అన్న అల్లరి - అద్దంకి లక్ష్మి
కన్నీటి చుక్కలు - కె.రాధికనరేన్
బంగారు భారతం - కృష్ణ మోహిని ధార్వాడ
క్రమశిక్షణ - కొంటికర్ల లలిత
అచ్చమ్మ - వరలక్ష్మి యనమండ్ర
తెల్లని మల్లెల మనసులు - చంద్రకళ.దీకొండ
మహోజ్వల చరితకు సారధులం - కొత్త ప్రియాంక (భానుప్రియ)
[31/03, 10:48 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: #selected సమీక్షలు 27-02 to 01-03-2023

*27-02-2023 నుండి 1-03-2023 వరకు పుస్తకం/కథ/కవితా సమీక్ష అనే అంశంపై వచ్చిన రచనలలో పత్రికలకు సెలెక్ట్ చేసిన రచనలు..*

కథ సమీక్షలు:

పరదేశీ నీ పయనం ఎందాకా (మామిడాల.శైలజ) - వింజరపు.శిరీష 
పారిజాతాలు (ఇంగువ మాధురీ) - ఇరువంటి (సోమరాజు) మాధురీ దేవి
 నందు vs నందు (మాధురి ఇంగువ)- కె. ఎల్. శైలజ పుస్తక సమీక్ష
నారీ లోకం (వడలి లక్ష్మీనాథ్)- చంద్రకళ. దీకొండ 
ప్రాణం ఖరీదు(ఇందిర తుంగ)- కొంటికర్ల లలిత
ఋణాను బంధం(కోవూరు సావిత్రి) - మోటూరి శాంతకుమారి 
పొగడ దండ (కొమ్మూరి పద్మావతి దేవి గారు) - కె.కె.తాయారు 
సానుభూతులు (జీడిగుంట నరసింహమూర్తి గారు) - సావిత్రి కోవూరు 
చిలుక.పలుకులు (శీ బి వి నరసింహారావు గారు) 
తస్మాత్ జాగ్రత్త (శ్రీమతి డి.యస్వీ. మహాలక్ష్మి) - వరలక్ష్మి యనమండ్ర 
నాటి సాహిత్యం ( శ్రీ తాళ్ళపాక అన్నమయ్య) - పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి  

కవిత సమీక్ష:
కవిత సమీక్ష (శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని) - జ్యోత్స్న సుబ్బా
చిన్న శిశువు - అద్దంకి లక్ష్మి

*(03-03-2023) నుంచీ శనివారం (04-03-2023) 7pm వరకు వచ్చిన జోక్స్ లో పత్రికకు సెలెక్ట్ చేసినవి:*

నాకూ పెళ్ళి కావాలి - పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి
ప్రియంవద పుతుంబాక
విజయాచలం
శ్రీవిజయదుర్గ. L

మిగితావి వెబ్సైటులో అప్లోడ్ చేసి లింక్స్ ఇవ్వబడును...
శ్రీవిజయదుర్గ. L
ప్రత్యక్షమైన నక్షత్ర మండలం - కమల'శ్రీ'
తెలివైన విద్యార్థులు - చిట్టెళ్ల దీప
అరుణ డేనియల్
జ్ఞాన ప్రసూనాంబ దండకం (ఐచ్చికం) - పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 
ప్రియంవద పుతుంబాక 
K. K. తాయారు (2)



Friday, March 24, 2023

శ్రీరంగపట్నం

17/03/2023.
మనోహరి మహిళా పత్రిక కొరకు.
అంశం : దర్శనీయ స్థలాలు.
(ఐచ్ఛికం ).

శీర్షిక : శ్రీరంగపట్టణం .(కర్నాటక).

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

 

భారతదేశం అంటే మొదట గుర్తు వచ్చేది పుణ్య క్షేత్రాలే. కాశ్మీరు నుండి, కన్యాకుమారి వరకు అడుగుకొక పుణ్య క్షేత్రం ఉంటుంది, 
నాకు మావారికి తీర్థయాత్రలు చేయడమంటే చాలా ఇష్టం .
కారణం పుణ్య నదుల్లో స్నానాలు చేయడం, భగవద్దర్శనం చేసుకోవడం వంటివి మనసుకు చాలా 
ప్రసాంతతనిస్తాయన్న నమ్మకం ఎక్కువగా ఉండేది.  .

ఆ యిష్టం తోనే అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి వచ్చి అక్కడి విషయాలను పదే పదే తలుచుకొంటుా ఆనందపడేవాళ్ళం.  

మా తమ్ముడికి ఉద్యోగరీత్యా మైసుారుకు ట్రాన్స్‌ఫర్ 
అయ్యింది. తను భార్యా పిల్లలతో అక్కడ సెటిల్ అయ్యేకా
మమ్మల్ని అక్కడికి రమ్మని పదేపదే పిలవడంతో మేము మైసుారుకు వచ్చేము. 
ఇక మా తమ్ముడు మైసుారంతా  తప్పకుండా  తిరిగి చుాడాల్సిన ప్రదేశమనీ ఎన్నో  పురాతనమైన మైన మందిరాలు  చారిత్రాత్మక  కట్టడాలతో చాలా అందంగా ఉంటుందనడంతో
సహజంగా మాకుండే ఉత్సాహంతో మరి కొన్ని రోజులవరకు  మా  తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాం. 
ఇంకేముంది..
శని ఆది వారాలైతే ఇంట్లో ఉండేవాళ్ళమేకాదు.
అక్కడే చుట్టుపక్కలనున్న  బృందావన్ గార్డెన్స్ , ఛాముండీ కొండకు చాలా సార్లు వెళ్ళేము .

రక రకాల పుాల వనాలు చెట్ల తో నిండిఉన్న బృందావన్ గార్డెన్స్, సాయంత్ర సమయాల్లో వెలుగుతున్న దేదీప్యమానమైన రంగు  దీపాల మధ్య అద్భుతమైన అందాన్ని సంతరించుకుంటుంది . అంతేకాదు..
నీటితో చేసే విన్యాసాలు (వాటర్ షో) మనలను ఆశ్ఛర్యచకితులని చేస్తాయి. పిల్లలతో  అక్కడికి వెళితే వాళ్ళు "ఇళ్ళకు తిరిగి రాము"  అని చేసే మారాము, 
మనకు చుక్కల్ని చుాపిస్తుందంటే నమ్మండి. ఇక కొండపై వెలసిన అమ్మవారైన ఆ ఛాముండేశ్వరీ తల్లి మహిమలు కోకొల్లలు. అక్కడి ప్రజలంతా ఆమెను అనునిత్యం 
ఆరాధిస్తుా ఉంటారు అనడానికి అక్కడికి వచ్చే జన ప్రవాహమే సాక్ష్యం .

అలా తిరుగుతుానే ఒకరోజు అనుకోకుండా మైసుార్ సిటీలోనున్న" చెన్న కేశవ" ఆలయానికి వెళ్ళేము.
ఎందు చేతనో అక్కడ పుాజలు జరగడంలేదు. 
కానీ విదేశీయులెందరో ఆ ప్రదేశాన్ని దర్శిస్తుాండడంతో 
దానిని పర్యాటక స్థలంగా చాలా అందంగా తీర్చి దిద్దేరు.
ఆక్కడ  చెన్నకేశ్వరుని పుార్తి శిలా నిర్మత  ఆలయం,  శిఖరాగ్రం వరకు అందమైన రాతి చెక్కడాలతో అద్భుత శిల్పకళా వైభవంతో అలరారుతుా  మనసులను రంజింపజేస్తుా చుాపరులను పరవసింపజేస్తొింది.

ఒకొక్క ప్రదేశం ఒకొక్క అద్భుతమైన చరిత్రకు నిదర్శనంగా,  .
ఒకొక్క  పుణ్య తీర్ధం  పవిత్ర పుణ్య  క్షేత్రంగా మా మనసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 
ఎంత చుాసినా తనివి తీరని కొన్ని ప్రదేశాలలో  .  
మా మనసుకు హత్తుకున్న శ్రీరంగపట్నం గురించి నేను తెలుసుకున్న  కొన్ని విషయాలను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 

శ్రీరంగపట్నం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని ఏడు తాలూకాలలో ఒకటైన పట్టణ  ప్రధాన కార్యాలయం . 

హైదర్ అలీ టిప్పు సుల్తాను-
మాండ్య నగరానికి సమీపంలో ఉన్న ఈ  శ్రీరంగపట్టణాన్ని 
 మైసూరు రాజ్యానికి' రాజధానిగా  చేసి  ఆ తర్వాత
దక్షిణ భారత్ లోని పలు భాగాలను  తన రాజ్యం లో కలుపుకున్నాడు   అని మనం చరిత్రలో చదువుకున్నాము.

చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను గలిగివున్న
ఈ నగరంలోని "శ్రీరంగనాధ స్వామి "ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున ఈ నగరానికి "శ్రీరంగపట్టణం " అనే పేరు వచ్చిందని చెపుతారు..
 ఈ ఆలయాన్ని  తొమ్మిదవ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారని చరిత్ర . 
మైసూర్ రాజధాని నగరానికి సమీపంలో గల కోట, శ్రీరంగపట్నం కోటను నియంత్రిస్తోందని చెపుతారు.

రంగరాయను ఓడించిన వడయార్ రాజు  శ్రీరంగపట్టణాన్ని వశబర్చుకుని , పిదప విజయనగర సామ్రాజ్యంపై దండెత్తేడని,  అందుకై విజయనగర సామ్రాజ్య ఆరాధ్య దేవతయైన అలిమేలమ్మ  కోపించి , వడయార్ రాజును శపించిందనీ, దాని కారణాన వడయార్ రాజుకు సంతానం కలుగలేదని ఓ కథనం ఉన్నది. 
ఆ కారణంగా అప్పటి అధికారంలో ఉన్న వడయార్ వంశస్థుడైన చామరాజ వడయార్ రాజులే ఇప్పటికీ అధికారికంగా మైసూర్ మహారాజులుగా పరిగణింపబడుతున్నారు.

అప్పటి శ్రీరంగపట్నం వైస్రాయ్ ,రంగరాయను ఓడించి,
మైసూర్ యొక్క రక్షక దేవత అయిన చాముండేశ్వరీ దేవి సమక్షంలో ,పది  రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంతోపాటు, సింహాసనంపై హక్కుదారులు ఎవరైనా మైసూర్ రాజ్యంపై నియంత్రణను ప్రదర్శించి, సార్వభౌమాధికారాన్ని సూచించగలరని తెలియజేయడంతో ,
కాలక్రమేణా అదే మాట అంగీకరించబడి నేటికీ కొనసాగుతోందంటారు., 

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మైసూర్ రాజ్యంలో భాగంగా ఉండేదని,  అప్పట్లో
శ్రీరంగపట్నం మైసూర్ రాజధాని నగరానికి దగ్గరగా ఉన్న    కోటగానేగాక ,దండయాత్ర జరిగే సమయంలో ఇది 
రాజ్యానికి రక్షణ కోటగా పరిగణించబడేదని అంటారు..
 
 అటుపై శ్రీరంగపట్నం దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వైష్ణవ తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటిగా మారింది
 పట్టణం మొత్తం కావేరీ నదిచే చుట్టబడి, ఇదో ద్వీపంలా కనబడుతుాండడంతో అక్కడి కొన్ని ప్రదేశాలు  UNESCO ద్వారా  ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా నామినేట్ చేయబడ్డాయి.

కావేరీ నదిలో ఏర్పడిన అన్ని ద్వీపాలు శ్రీ రంగనాథస్వామికి  సంబంధించిన పవిత్రమైన ప్రదేశాలుగా మన సాంప్రదాయ చరిత్ర చెబుతుంది .

మూడు అతిపెద్ద ద్వీపాలలో  దేవుడికి అంకితం చేయబడిన పెద్ద దేవాలయాలు, చాలా పురాతన కాలంలోనే నిర్మించబడ్డాయి.   కావేరీ నదిలో ఏర్పడిన సహజ ద్వీపాలలో ఉన్న రంగనాథ దేవుడి మూడు ఆలయాలలో శ్రీరంగపట్నం ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది . ఇక్కడ కొలువైన రంగనాధుడు " ఆది రంగనిగా  " పుాజలందుకుంటున్నాడు.

ఇక  భారతదేశంలో కర్ణాటకలోని చామరాజనగర జిల్లా , కొల్లేగల తాలూకాలోని శివనసముద్రంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం "మధ్య రంగ !" ఆలయంగా...

భారతదేశ  తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా , శ్రీరంగం తాలూకాలోని " శ్రీ రంగనాథస్వామి ఆలయం "అంత్య రంగ" ఆలయంగా ప్రసిద్ధి చెందేయి.

 శ్రీరంగపట్నంలోని కావేరీలోని పశ్చిమ వాహిని విభాగం 
ప్రత్యేకించి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది; పుణ్యాత్ములు దూర ప్రాంతాల నుండి వచ్చి, మరణించిన వారి బూడిదను నిమజ్జనం చేయడమేగాక, ఈ నీటిలో తమ పూర్వీకులకు  పిండతర్పణాది కార్యక్రమాలను నిర్వహిస్తారు..


విజయనగర సామ్రాజ్య కాలంనుండి పుణ్యక్షేత్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ.  
 శ్రీరంగపట్టణంలో పలు ప్రదేశాలు చూడదగినవిగా ప్రసిద్ధిచెందినవి చాలానే ఉన్నాయి..
 
  వాటిలో ముఖ్యమైనవి :
రంగనాధ ఆలయం : ఈ ఆలయం చాలా పురాతనమైనదే కాక హైందవ సంప్రదాయంలో, అందులోనూ వైష్ణవ సంప్రదాయంలో మరీ ప్రఖ్యాతి పొందినది. మైసూరును హైదరాలీ పరిపాలించిన కాలంలో ఈ ఆలయానికి సమీపంలోని మందుగుండు సామగ్రి కార్ఖానా పేలి రంగనాథస్వామి దేవాలయ గోపురం విరిగిపడిందని,
 హైదర్ అలీ వెన్వెంటనే తన సైనికులను పంపి వారిచేతనే దేవాలయ గోపురాన్ని  పునఽనిర్మింపజేశారని చెపుతారు.
 
జుమ్మా మసీదు, రంగన్నతిట్టు పక్షి అభయారణ్యం,
కరిఘట్ట,శివసముద్రం జలపాతం, వంటి పర్యాటక స్థలాలు
చుాసినకొలదీ చుాడాలనిపించేట్టు ఉంటాయి.

శివసముద్రం జలపాతం  భారత్ లో రెండవ అతిపెద్ద జలపాతంగానేగాక, ప్రపంచంలోనే  అతిపెద్ద జలపాతంగా
పదహారవస్థానంలో ఉంది.

ఇక పోతే రంగన్నతిట్టు పక్షి అభయారణ్యం అన్నది
ఒకప్పటి మైసూర్ రాజైన కంఠీరవ నరసింహరాజ వడియార్ కావేరీ నదికి అడ్డంగా ఒక కట్టను నిర్మించినప్పుడు రంగనాతిట్టు యొక్క ద్వీపాలు ఏర్పడి , పక్షులను ఆకర్షించడం ప్రారంభించడం ,.రాను రాను
 వేలు, లక్షల సంఖ్యలో ఈ పక్షులే కాక ఇతర వన్య ప్రాణులు కుాడా వచ్చి బస చేయడంతో ఈ అరణ్యం , అభయారణ్యంగా పిలువబడుతుా  రాష్ట్రంలోనే 
అతిపెద్ద పక్షి అభయారణ్యంగా ప్రసిద్ధి చెందింది. నలభై ఎకరాల విస్తీర్ణంతో , కావేరీ నది ఒడ్డున, ఆరు ద్వీపాలను కలిగి ఉండి , .దాదాపు నుాట డెబ్భై పక్షి జాతులు కలిగి ఉన్న అరణ్యంలో.. 
 శీతాకాలపు నెలలలో, డిసెంబర్ మధ్య నుండి మొదలై, దాదాపు నలభైవేల పక్షులు రంగనాతిట్టు వద్ద సమావేశమవుతాయట, 

ఈ కర్ణాటక లో ఒక్క శ్రీరంగ పట్నమే కాక చుాడవలసున ఎన్నో ప్రదేశాలున్నాయి
హంపి , ధర్మస్థల, మెల్కొటే, ఉడిపి,  కుక్కే సుబ్రహ్మణ్య, 
శృంగేరి మఠం, హొరనాడు, శ్రావణబెళగొళ వంటి పర్యాటక పుణ్య స్థలాలు చుాసి తీరవలసిందే .
ఇవేకాక ప్రతీ చిన్న పల్లెలోగల గ్రామ దేవతలు వారి మహిమల గురించి వచ్చి చుాసి తెలుకోవలసిందే..

కాలుష్య రహితమైన ప్రదేశాలు, పురాతన కట్టడాలు రాజుగారి కోట తో పాటు , మరెన్నో చారిత్రాత్మిక, ధార్మిక  కళాఖండాలతో ప్రసిద్ధికెక్కిన ఈ మైసుారు పట్టణాన్ని చుాడడం మాకెంతో ఆనందాన్ని మానసిక సంతృప్తిని కలిగించింది. 

ఇక్కడి వ్యవహారిక భాష కన్నడ భాష .
బెంగుళూరు , మైసూర్ నుండి రైలు ద్వారా ఈ శ్రీరంగ 
పట్టణానికి సులభంగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం ద్వారా  ఉన్న  హైవే నుండి కుాడా ఇక్కడకు చేరుకోవచ్చు  .
మీరుకుాడా ఒక్క సారి వచ్చి ఈ పర్యాటక ప్రదేశాలన్నీ 
చుాస్తారు కదుా..

హామీ :
ఈ వ్యాసం నా స్వీయ రచన .



Tuesday, March 21, 2023

*మీ పాదం నా పంచపది*

*సప్త వర్ణాల సింగిడి*
*మీ పాదం నా పంచపది*-352
తేది:20.03.2023
*విజేత:* 

".కవి రత్న": పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు

*నిర్వహణ:కాటేగారు పాండురంగ విఠల్*
పంచపది రూపకర్త;హైదరాబాద్
*సహ నిర్వహణ:MV ధర్మారావు*

*పంచపది సాహితీ కవన వేదిక*
నేటి పంచపది:471
తేది:21.03.2023
అంశం:*ప్రపంచ జలదినోత్సవం*

పంచమ బహుమతి కవన మణి:
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు

నిర్వహణ:కాటేగారు పాండురంగవిఠల్
పంచపది రూపకర్త:హైదరాబాద్
సహ నిర్వహణ:పోరంకి నాగరాజు

21/03/2023.కలం స్నేహం కవితల పోటీ కోసంఅంశం : యుగాది.శీర్షిక : నవ యుగాదికి స్వాగతం సుస్వాగతం .రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. కల్యాణ్. మహారాష్ట్రనవయుగాది వచ్చె నదిగొ పలుకరె చెలి స్వాగతం ."శోభకృత్" నామముతో శుభములు పంచెడి నేస్తం.ఆనంద మారోగ్య సంపదలిడు వత్సరం సంతసాన సంబరాలు చేద్దాము అందరం ॥ ప్రకృతిలో పచ్చదనం, నవ వసంత ఆగమనం మలయమారుతాన నిండె, వేల పుాల పరిమళం మావి చిగురు గుబురులలో కోయిల చేసెను గానం . కిల కిలా రవములతో పక్షులిడె శుభోదయం ॥ మామడాకు తోరణాలు మదిలో ఆనందాలు అందమైన రంగవల్లు లింటింటి శోభలు .గుమ్మాలకు పసుపు బొట్లు అంబలు ఆడుగిడేటట్లువేల్పులున్న కొలువులో వినిపించెను జేగంటలు ॥వంటింట పాయసాలు నేతి తీపి వంటలుఆరు ఋచుల పచ్చళ్ళవె ప్రతి యింటి వేద్యాలుఆనందాలు పంచుకునే బంధుజనుల రాకలుకలిసి విందారగించు కళ కళ లిడు సందళ్ళు ॥నవ యుగాది ఆరంభం "శోభకృత్" ఆగమనంసర్వజనులు కోరినట్టి కోరికలవె సాకారం .శుభ ఫలితాలిడు సుందర వత్సరమిపు డారంభంసందడులా సరాగాలె శోభకృతిడు శుభ ఫలితం ॥కొలువైన దేవతలే కోటి శుభము లిచ్చు దినంరోగముక్తులై జనులిల భోగమనుభవించు వరంఇత్తు, భోగ భాగ్యములని పసిడి లక్ష్మి పలుకు దినంజగతి వచ్చె నిండుదనం ,జయము లిడే వత్సరం ॥

21/03/2023.
అంశం : యుగాది.
శీర్షిక : నవ యుగాదికి స్వాగతం సుస్వాగతం .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర

నవయుగాది వచ్చె నదిగొ పలుకరె చెలి స్వాగతం .
"శోభకృత్" నామముతో శుభములు పంచెడి నేస్తం.
ఆనంద మారోగ్య సంపదలిడు వత్సరం 
సంతసాన సంబరాలు చేద్దాము అందరం ॥
 
 ప్రకృతిలో పచ్చదనం, నవ వసంత ఆగమనం
 మలయమారుతాన నిండె, వేల పుాల పరిమళం 
 మావి చిగురు గుబురులలో  కోయిల చేసెను గానం .
 కిల కిలా రవములతో పక్షులిడె శుభోదయం ॥
 
మామడాకు తోరణాలు మదిలో ఆనందాలు 
అందమైన రంగవల్లు లింటింటి శోభలు .
గుమ్మాలకు పసుపు బొట్లు అంబలు ఆడుగిడేటట్లు
వేల్పులున్న  కొలువులో వినిపించెను జేగంటలు ॥

వంటింట పాయసాలు నేతి తీపి వంటలు
ఆరు ఋచుల పచ్చళ్ళవె  ప్రతి యింటి వేద్యాలు
ఆనందాలు పంచుకునే బంధుజనుల రాకలు
కలిసి విందారగించు  కళ కళ లిడు సందళ్ళు ॥

నవ యుగాది ఆరంభం  "శోభకృత్" ఆగమనం
సర్వజనులు కోరినట్టి  కోరికలవె సాకారం .
శుభ ఫలితాలిడు సుందర వత్సరమిపు డారంభం
సందడులా సరాగాలె శోభకృతిడు శుభ ఫలితం ॥

కొలువైన దేవతలే కోటి  శుభము లిచ్చు దినం
రోగముక్తులై జనులిల భోగమనుభవించు వరం
ఇత్తు, భోగ భాగ్యములని  పసిడి లక్ష్మి పలుకు దినం
జగతి వచ్చె నిండుదనం  ,జయము లిడే వత్సరం ॥

హామీ : ఈ కవిత నా స్వీయ రచన.



Sunday, March 19, 2023

శోభకృత్ యుగాదికి స్వాగతం...2023

19/03/2023.
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారి  జాతీయస్థాయి  "ఉగాది" కవితా పోటీల  కొరకు ,
 అంశం : "శోభాకృత్" నామ సంవత్సరాది.
శీర్షిక : నవ వసంత హేల ఈ యుగాది .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్:  మహారాష్ట్ర .


కవిత .
------
తొలిపొద్దు పొడుపులో
 మెరిసే ఆనందాల వెలుగులు.
 నవ వసంతాగమనానికి ,శుభ-
స్వాగతాలు పలికే కోయిల గీతాలు ॥
 
 పచ్చదనం నిండిన తోటల్లో
 పరువాల సందళ్ళతో విరిసిన
  పుాబాలల కళ -కళలు నిండిన  
  మలయమారుత సుగంధ వీచికలు ॥
  
మురిసే తరులు సందడితో వినిపించే 
పచ్చని ఆకుల నవ్వుల గలగలలు.
చిగురులు తొడిగిన కొమ్మల నడుమ
కిచ- కిచ రవాల  ఆనంద గీతికలు ॥

 రంగవల్లులు  నిండిన ముంగిళ్ళలో
పడతులు ధరించే  పట్టు పావడాలలో-
 దాగిన పసుపు పాదాల పద-మంజీరాలు 
 చేసే , చిరు మువ్వల సవ్వడులు ॥
 
ఇంటింటా పండగొచ్చిన సంబరాలు 
అన్నదాతలింట హాయి నిండిన-
పంట కోతల బరువు దిగబడుల-
బ్రతుకు ఆనందాల సిరుల వైభవాలు ॥

పిల్లగాలి వీచిలో నేతి సువాసనలు- 
పిండివంటల ,నోరుారించే తీపి ఋచులు.
భగవదార్చనల  మేలు వేద పుాజలు .
విందు వేద్యార్పణల,భక్తి నిండు ఘంటారవాలు॥

ఆరు ఋచుల అద్భుత కలయికల- 
ఓషధీ తత్వాలు నిండిన మధుర భక్ష్యాలు , 
ఆమ్లం, లవణం, కటు , తీక్తం, వగరు
కలగలసిన రసామృత పానీయ సేవనాలు॥
 
వెరసి " శోభకృత్" వత్సరాగమన -
 సందళ్ళతో పిల్లా పెద్దలు, బంధు- మిత్రాది 
కలయికల స్నేహ పుారిత ఆలింగనాలతో 
"నవ యుగాది" కిడు ఆనంద స్వాగతాలు ॥

హామీ:
ఈ కవిత నా స్వీయ రచన.

Saturday, March 18, 2023

అంశము: *సస్పెన్స్/థ్రిల్లర్/దెయ్యం కథలు*

[
19/04/2023.

తపస్వీ మనోహరం వారి కొరకు రచన .

విభాగం: *కథ*
అంశము: *సస్పెన్స్/థ్రిల్లర్/దెయ్యం కథలు*

శీర్షిక  : హీరో చింటుా...

( థ్రిల్లర్  కధ.)


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


చింటుా వాళ్ళ నాన్నగారికి ట్రాన్ఫర్ అవడం వల్ల వాళ్ళు ఊరు మారేరు.  తామున్న ఇల్లు ఒక సొసైటీలో రెండవ అంతస్తులో ఉంది. అది కొత్తగా కట్టినట్టుంది. చాలా ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయి. అన్నీ నాలుగు బెడ్రుామ్స్ ఉన్న ఇళ్ళే.
ఒకొక్క ఫ్లోర్ లో రెండేసి మాత్రమే ఇళ్ళున్నాయి.
కొత్త ఇల్లు కొత్త మనుషులు . చింటుాకి విచారంగా ఉంది.
"ఆ వుారిలో తనకెంతమంది స్నేహితులుండేవారో .
మళ్ళీ తనకు స్నేహితులు బోలెడుమంది కావాలంటే ఎన్ని రోజులు పడుతుందో..
అంతదాకా తనొక్కడే ఆడుకోవాలి. ఈ బిల్డింగ్ లో ఎవరెవరున్నారో తన తోటి పిల్లలు  ఉన్నారో లేదో రేపు చుాడాలి ." అనుకుంటుా అసహనంగా ఇల్లంతా కలయ తిరిగేడు.
చుాస్తుండగానే రాత్రి అయింది .
నాన్నగారి ఉద్యోగం ఏమిటోగానీ అలా టుార్లు తిరుగుతుానే ఉంటారు .ఇంట్లో తను అమ్మ మాత్రమే ఉండాలి.
ఇదిగో... ఇప్పుడు కుాడా నాన్నాగారు ఊరికి  వెళిపోతున్నారు. 
పాత ఇల్లు తమ సొంత ఇల్లే...ఆ ఇంటిలోకి అద్దెకు దిగేవారు రేపే వస్తున్నారు. ఏవేవో ఫార్మాలటీస్ పుార్తి చేయాలని నాన్నగారు వెంటనే బయలుదేరుతున్నారు. నాలుగు రోజుల్లో వచ్చేస్తానంటుా..
 అమ్మ నాన్నగారి బట్టలు పేక్ చేసి 
కొన్ని తినుబండారాలు  కేరేజి లో కట్టి ఇచ్చింది.
నాన్న తమను జాగర్తగా ఉండమని చెప్పి వెళ్లిపోయారు.
చుాస్తుాండగానే రాత్రి అయ్యింది . రాత్రి పదకొండు గంటలదాకా టి.వి. చుాసి .తను,  అమ్మ పడుక్కోవడానికి రెడీ అవుతున్నారు. ఇంతలో ఎవరో" టక్కు టక్కు " మని కొడుతున్న చప్పుడు వినిపించింది. తమ ఇంట్లోంచే ఆ చప్పుడు వస్తుాండడంతో
ఇద్దరికీ చాలా భయం వేసింది.
అసలే బిల్డింగ్ లో చాలామంది రానందున,  ఖాళీగా ఉంది.
దానికి తోడు తమ పక్క ఇంట్లో కుాడా ఎవరుా లేరు.
అది బయట తాళం వేసి ఉంది. అలాంటప్పుడు ఈ చప్పుడెలా వస్తున్నాది .అదీ తమ ఇంట్లోంచే వస్తున్నట్టుగా...
అమ్మ తనను గట్టిగా పట్టుకొని  బెడ్రుామ్ తలుపు లాక్ చేసింది . అక్కడున్నా వారెవరికైనా ఫొిన్ చేద్దామంటే ఎవరి నంబరుా తెలీదాయె. 
నాన్నగారికి చేద్దామంటే, ఫోన్ హాల్ లో, టి.వి.పక్కన ఉండిపోయింది. 
చప్పుడు అగి ఆగి వస్తున్నాది 
పెద్దపెద్ద సిటీల్లో అందరుా పై అంతస్తులనే  ఎంపిక చేస్తారు.
గాలి వెలుతురు తో పాటు , బాహ్య సౌందర్యం ..ఆస్వాదించవచ్చునన్న కోరికతో..
దానివల్ల ఒచ్చిన కొంతమందీ కుాడా ఐదవ అంతస్తు నుండి ఆపై అంతస్తుల్లో ఉన్నారు. అదీ అక్కడా..అక్కడా....
అందువల్ల తమ ఇంటికి  కింద , మీద కుాడా ఎవరుా లేరు.
ఆ విషయం తల్చుకుంటేనే భయంగా ఉండి , ఈ సమయంలో చమటలు పడుతున్నాయి.
ఆసమయంలో నేనే అమ్మకు తోడన్నట్టు  అమ్మ నన్ను గట్టిగా పట్టుకొని భయంతో మంచమెక్కింది. ఆరాత్రంతా మాకు చప్పుళ్ళు వినిపిస్తుానే ఉన్నాయి .
తెల్లారి ముాడు నాలుగు  గంటలౌతుాండగా  ప్రతిధ్వనిలాంటి మాటలు,
ఒక మగ గొంతుక.....
"నేను చాలా అసహాయస్థితిలో ఉన్నాను. దయుంచి నన్ను రక్షీంచండి "అన్న మాటలు చాలా బలహీనంగా వినిపించసాగాయి. తర్వాత ఏడుస్తున్నట్లు ముాలుగు లాంటి
శబ్దం రాసాగింది.

ఆమాటలు విన్న తర్వాత అమ్మకు  కొంచం ధైర్యం వచ్చిందేమొా..
నన్ను మంచం దిగొద్దని చెప్పి  తను మాత్రం మెల్లగా తలుపు తీసుకొని  బయటకు వెళ్ళింది. తెల్లారుతుాండడంతో కిటికీలు తీయగానే కాస్తంత చల్లగాలితో పాటు చిన్న వెలుగు కనిపించింది. అమ్మ ఆ శబ్దం వస్తున్న వేపుగా మెల్లగా నడవసాగింది. ఆ ముాలుగు తమ ముాడవ బెడ్రుామ్ బాత్రుామ్ లోంచీ వస్తున్నట్లనిపించడంతో ..భయంతో.వణుకుతుా ...మెయిన్ డోర్ గబ గబా తీసి అరుస్తున్నట్లుగా" చింటుా తొందరగా రా అంటుా తన ను పిలిచింది. అమ్మ భయపడడంతో చింటుాకి చమటలు పట్టేయి.
గబుక్కున మంచం దిగి పరిగెత్తి వెళ్ళి అమ్మను గట్టిగా చుట్టేశాడు.
వెంటనే  అమ్మ తనను  పట్టుకొని లిఫ్ట్ లోకి ఎక్కి బటన్ నొక్కింది.
లిఫ్ట్  క్షణంలో గ్రౌండ్ లో ఆగి ద్వారం తెరుచుకుంది.
అమ్మ పరుగు పరుగున  మెయిన్ గేటు దగ్గరున్న "వాచ్ మేన్" ను చేరుకుంది.
అంత తెల్లవారి ఒక ఆడ మనిషి గాభరాగా తన దగ్గరకు రావడంతో వాచ్ మేన్ గాభరాపడ్డాడు.
అమ్మ రాత్రి జరిగినదంతా వాడితో చెప్పింది.
వాడు ఆశ్ఛర్య పోయేడు. 
"ఈ బిల్డ్ంగ్ కట్టడం పుార్తయి నెల కావస్తున్నాది .కొన్ని కుటుంబాలు వచ్చి ఉంటున్నారు కుాడా...
ఎవరికీ ఇటువంటి అనుభవం కలగలేదు 
మరి ఈ అమ్మగారికి మాత్రం ఏడుపులు, చప్పుళ్ళు,  ఎందుకలా వినిపిస్తున్నాయి.  రెండవ అంతస్తులో దయ్యముందా...."
తలచుకోగానే వాడికి కుాడా కొంచం భయమేసింది.
వాచ్ మేన్ ఆలొచిస్తుా చుట్టుా చుాసేడు.
 బిల్డింగ్ చుట్టుా ఆవరణ  ఎంతో అందమైన మొక్కలతో ,
పచ్చని తివాచీ పరచినట్లుండే పచ్చ గడ్డితో, ఉండి ఆకర్షణీయంగా ఉంది.
చుట్టుా పెద్ద ప్రహారీ గోడ ఉండి,  రెండు పెద్ద గేట్లు కలిగి ఉంది.
ఒకటి పెద్ద గేటు....కార్లు వెళ్ళడానికి.
రెండవ గేటు కొంచం చిన్నది...మనుషుల కోసం నడకదారది. .
గేటు లోంచీ  బిల్డింగ్ దాకా నడిచి రావాలంటే కొంచం దుారమే ఉంటుంది.
అందరుా కార్లలోనే రావడం వల్ల, వారికి నడిచే అవసరం పడ దు.అదీగాక వచ్చిన వాళ్ళంతా పై అంతస్తుల్లో  ఉంటున్నారు.
అన్ని ఫ్లేట్లుా కొలుగోలు చేయబడి తాళాలు వేయబడ్డాయి.
ఈ రెండవ అంతస్తుకి వీళ్ళు మాత్రమే వచ్చేరు. 
తను గేటు కాపలాదారు మాత్రమే కావడం వల్ల బిల్డింగ్ 
దాకా వెళ్ళే అవసరం పడలేదు.
అక్కడికి వచ్చే  తోటమాలి , పనివాళ్ళుా ఎవరికీ కుాడా ఇటు వంటి సంఘటన జరుగుతున్నాట్టు తెలీదులా ఉంది.
ఇంత వరకు ఇటువంటి సంఘటన ఈ బిల్డింగ్  లో జరుగుతున్నట్టు తమ మధ్య ఏ విధమైన చర్చలుా జరగలేదు.
మరేమయ్యుంటుంది...?


ఆలోచిస్తుానే వాచ్ మేన్  చింటుాని వాళ్ళమ్మని అక్కడ దగ్గరలో ఉన్న రెష్ట్ రుామ్ లో కుార్చోమని చెప్పి , చాయ్ తెప్పించి ఇచ్చేడు. తరువాత ఇంటర్ కమ్ ఫోన్ నుండి 
బిల్డింగ్ లో ఉన్న అందరికీ  విషయం వివరించేడు.
మరోఅరగంటకే అక్కడి పరిస్థితంతా మారిపోయింది.
పై అంతస్తులో ఉన్న వాళ్లంతా  కిందకి దిగి వచ్చేరు.
కొందరు పోలీసులకి ఫొిన్ చేస్తే, మరి కొందరు తమకు తెలిసిన  మంత్రగాళ్ళకి , మరికొందరు పుాజారులకి, ఫోన్ చేసేశారు.
తర్వాత  కొందరు చింటుాని వాళ్ళమ్మను చుట్టు ముట్టి ప్రశ్నల వర్షం కురిపించసాగేరు. 
చింటుా వాళ్ళమ్మ  ,తన ఫోను హాలులో టి .వి.పక్కన ఉందని , ఎవరైనా తనతో సాయం వస్తే  తను ఆ ఫోన్ తీసుకుంటానని , దానితో తన భర్తకు ఫోన్ చేయాలని ,ఎంత మొత్తుకున్నా ఎవరుా  వినిపించుకోవడమే లేదు. 
మొత్తానికి ఆ గందరగోళం మధ్యాహ్నం దాకా సాగింది.
చింటుాకి ఆకలేస్తోంది.
ఇంతలో పొిలీసులు వచ్చేరు విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళకీ భయమేసిందో ఏమొా...
మంత్రగాళ్ళతో కలిసి  గుంపుగా తమ ఇంటి పక్కనే ఉన్న రెండవ అంతస్తు ఇంటి దగ్గరకు వచ్చేరు .
 చింటుా వాళ్ళమ్మ చెప్పినట్టుగా ఆ ఇంటినుండి
 ఏ శబ్ధం గానీ, ఏడుపుగానీ, వినపడలేదు. 
 చాలా తర్జన భర్జనల తరువాత ఆ ఇంటి తాళం విరగ్గిట్టి లోపలికి గుంపుగా వెళ్ళేరు.
 అదుగో...అప్పుడే అక్కడ  బాత్రుామ్ నుంచి చిన్నగా ముాలుగు వినిపించింది.
 అందరుా ఒక్కసారి నిశ్శబ్దం ఐపోయారు. అందులో ఒక పోలీసు ధైర్యం చేసి, బాత్ రుాం తలుపు తీయ ప్రయత్నించేడు. కానీ అది రాలేదు.
 బాగా గమనించగా అది "డబల్ లాక్ "పడినట్లు 
 గుర్తించి , తాళాలు తీసే వాడిని పిలిపించి తలుపులు 
 తెరిచారు. 
 అందులో ఒక మనిషి చిక్కి శల్యమై, క్రింద  పడి ముాలుగుతున్నాడు .అతని బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి . బాత్రుామ్ అంతా అసహ్యకరమైన గబ్బు వాసనతో నిండి ఉంది
 అతని చేతిలో టాయిలెట్ పైప్ ఉంది. 
 అతనిపై నీళ్ళు జల్లినా అతడు లేవలేకపోయాడు.
 వెంటనే పోలీసులు  ఏంబులెన్స్ ని పిలిపించి, అతనిని ఆసుపత్రికి తరలించేరు.
 ఒకరోజంతా నారాయణకు "డిప్స్" ఎక్కించి ఎమర్జన్సీ వార్డ్ లో "అబ్జర్వేషన్ "లో ఉంచేరు.
 తర్వాత కొంచం కోలుకున్న నారాయణతో  పోలీస్ లు మాట్లాడసాగేరు.
అప్పుడు నారాయణ చెప్పిన విషయం ఇది.

--------
ఆ బిల్డింగ్ లో ఐదవ అంతస్తు పైనున్న ఇళ్ళు మాత్రమే అందరుా కొనుక్కున్నారు.
కిందనున్న నాలుగు ఫ్లోర్లుా ఖాళీగానే ఉండడంతో  రెండవ అంతస్తు లో ఉన్న ఒక ఇంట్లో అక్కడి వర్కర్లు అందరుా
 కలిసి మందు పార్టీ  చేసుకొని, బాగా తాగి ,తిన్నారు. 
తను కుాడా , చాలా తాగడంతో కడుపులో తిప్పినట్టై , 
వాంతి వస్తున్నట్టుగా అనిపించడంతో , బాత్రుామ్ లోకి 
 వెళ్ళి ధడాలున తలుపేశాడు..
వాంతి అవలేదు గానీ మత్తుగా తుాలుతుా  అక్కడే కుాలిపోయేడు.
ఎప్పడు తెలివి వచ్చిందో తెలీలేదు .అప్పటికీ మత్తు దిగలేదు.
కానీ ఆకలి దంచేస్తున్నాది.  
నారాయణ తలుపు తీయడానికి ప్రయత్నించేడు గాని అది లాక్ అవడంతో తెరుచుకోలేదు.
అతను తన సాటి వారి నందరినీ పేర పేరునా పిలిచేడు .
కానీ లాభం లేకపోయింది.
కొంతసేపటికి అందరుా వెళిపోయి ఉంటారని తెలుసుకున్నాడు.
దాంతో పిచ్చిగా అరుస్తుా ,అక్కడి కొళాయి  పైపులు లాగ ప్రయత్నిస్తుాండగా ...చివరికి  టాయ్ లెట్ బాక్స్ కి ఉన్న పైపు ఊడొచ్చింది .దానితోనే  అతడు చాలా సార్లు అక్కడున్న వెంటిలేటర్ని కొట్ట సాగేడు .
దాంతో , దాని అద్దాలైతే పగిలేయి గానీ 
ఎవరుా రాలేదు. ఆకలి , భయం, నిద్రలేమి , నీర్సానికి 
శక్తిలేక పడిపోయిన తను ఈ ఆసుపత్రిలోనే కళ్ళు
విప్పినట్టు చెప్పేడు.
నారాయణ చెప్పిన మాటలువిన్న అందరికీ అతనిమీద, కొంత జాలి , కొంత కోపం, కుాడా వచ్చేయి .
"ఈ తాగుడనే వెధవ అలవాటు వల్ల ఎంతమందిని ఇబ్బంది పెట్టేడో.."అంటుా కొందరు అసహ్యించుకున్నారు. 
మరి కొందరు "అయ్యిా పాపం , తిండి -తిప్పలు లేకుండా
ఒక్కడుా ఆ బాత్రుామ్ లో ఎంత బాధ పడ్డాడో " అంటుా..
జాలిపడ్డారు.
మరి కొందరు" చింటుా వాళ్ళమ్మ ధైర్యం చేసి వాచ్ మేన్ కు 
సంగతి చెప్పకపోతే  నారాయణ ప్రాణాలే పొియేవి" 
అంటుా వారి ధైర్యాన్ని పొగిడేరు.

చింటుాకి మాత్రం చాలా ఆనందంగా ఉంది.
ఈ కారణంగా తనకు , ఎంతోమంది పిల్లలు స్నేహితులయ్యేరు.
రేపటినుండి తను ,వారందరితో బోలెడు ఆటలు ఆడుకోవచ్చు .....ఎందుకంటే,  ఇప్పుడు తను
వారందరి దృష్టి లో , నారాయణని కాపాడిన ఓ పెద్ద హీరో..మరి.

********************************-*-




1. కె.కె.తాయారు
2. ఎం.వి.చంద్రశేఖరరావు
3. కార్తీక్ దుబ్బాక.
4. కాటేగారు పాండురంగ విఠల్
5. పంతుల లలిత 
6. మక్కువ.అరుణకుమారి
7. శ్రీ విజయ దుర్గ. ఎల్
8. సావిత్రి కోవూరు
9. శనగపల్లి ఉమామహేశ్వరరావు 
10. శ్రీసుధ కొలచన 
11. సుజాత కోకిల.
12. జి.కె.నారాయణ
13. పి. వి. యన్. కృష్ణవేణి 
14. దొడ్డపనేని శ్రీవిద్య
15. పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
16. యాంబాకం

మహిళా మనోహరి మాస పత్రిక కొరకు.
28/03/2023.
రచయిత్రి : యడవల్లి శైలజగారు.
పుస్తకం : హృదయరాగం.
సమీక్షకురాలు :
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.,
కల్యాణ్ : మహారాష్ట్ర .

యడవల్లి శైలజగారి హృదయరాగం...
ఒకమినీ నవల గానీ, ఓ పెద్ద  కధ గానీ, అయి ఉంటుదన్న
అభిప్రాయంతో  Pdf ఓపెన్ చేసిన నేను , ఆశ్ఛర్యానందాలకు గురయ్యాను..
అందులో  కన్నవాెు ,  గౌరవనీయులైన వారు , ఎందరో స్ఫుార్తి దాయకులు , హితులు స్నేహితులు , ప్రోత్సాహకులు ఐన
వారు తన హృదయానికి దగ్గరైన ఎంతో మంది గురించిన
తన మనసులో  ఉన్న భావనలను  పంచుకుంటుా...
మనలను కయాడా ఆలోచింపజేసి ఔను అనిపుంచిన విధానం నన్ను చాలా ఆకట్టుకొంది.
అమ్మగా ,అక్కగా, ఆలిగా, స్నేహితురాలిగా  అందరి పట్ల తన మనసులో ఉన్న ప్రేమను, అనురాగాన్ని  అభిమానాన్ని ,
తపనను  తెలియజేస్తున్న వైనం కళ్ళ నీళ్ళు పెట్టించింది..

ఈ నాటి పరిస్థితులు ఎలా మారాయంటే
అమ్మ, నాన్న, అక్క, చెల్లీ , అన్న, తమ్ముడు అనే రక్త బంధాలకు విలువ లేకుండాపోయింది, కాస్తంత సంపాదన రాగానే "ఎవరికి వారే యమునాతీరే "అన్నట్లున్నారు.
కాకుండా ప్రతీ ఒక్కరుా "ట్రెండ్ మారిందండీ "అని గొప్పగా చెప్పుకోవడం ఒక " ట్రెండ్ " గా మారిపోయింది. 
మనిషిలో స్వార్ధం పేరుకుపోయింది.
మానవత్వం మట్టిలో కలిసిపోయింది.
అటువంటి వారికోసమే అన్నట్టుగా శైలజగారు
బంధాలు బంధుత్వాలు వాటి విలువల గుార్చి ఆర్ద్రత నిండిన భావుకతతో తన మనసులోని భావాలను వ్యక్త పరచిన విధానం చాలా చాలా  బాగుంది.
తనను పెంచిన తల్లితండ్రుల మీదున్న గౌరవాభిమానాలని తెలియపరచే  విధానం..వారెంత కష్టపడితే తామీ స్థితికి వచ్చేరోనని  తన తమ్మళ్ళకు అన్నలకు  తెలియపరుస్తుా తల్లిదండ్రులను ముసలికాలంలో  ఏ విధంగా చుాసుకోవాలో  సుతిమెత్తగా ప్రేమతో తెలియపరచిన విధానం  చాలా బాగుంది.
.చాలా మంది స్నేహ బంధం గురించి పెద్దపెద్ద మాటలు పుటలు- పుటలుగా రాస్తారు.  కానీ నిజమైన స్నేహితునిగా
మసలలేరు.
అలాగే మనం చాలా మందిని ఎక్కడెక్కడో కలుస్తాం .ఆత్మీయతను పంచుకుంటాం . విడి పోతాం,  కానీ కొంతమందిని కలిసినపుడు అనుకోకుండా వారితో ఐన అనుభవాలని మనమెప్పటికీ మరవలేం.
మన జీవిత కాలంలో ఎంతో మంది సహకారం వల్ల
మనమెన్నో మెట్లు పైకెక్కుతాం . ఒకసారి పైకి వెళ్ళాకా మరి తిరిగి వెనక్కి చుాడం .
కానీ మన జీవితంలో  కొన్ని సంఘటనలు అనుకోకుండా  ఒకప్పటి  వారి సహాయాన్ని , వారి ఉనికిని గుర్తు చేస్తాయి. 
మనలో జ్ఞాపకాల  ఆ సడులే మన కళ్ళను  తడి చేస్తాయి.
కొంత అనందం,  కొంత అనురాగం , కొంత ఆప్యాయత , కొన్ని బాధలు , మరిన్ని బంధాలు, మమతానురాగాలు , స్నేహ బంధాలు ,కొన్ని పాత- కొత్త జ్ఞాపకాల తరంగాలు, లేపిన  ఎత్తుపల్లాలు  కలబోసిన  ప్రయాణమే  మన జీవితం.

ప్రతీ చిన్న మాటకు , చేతకు , స్పందించే మనసు అందరికీ ఉన్నా అది వ్యక్తపరచే విధానం చాలా మందికి తెలియదు.
కానీ అందరిలోనుా అన్ని రసాలకుా స్పందించే  హృదయం ఉంటుంది.
అందరి మాటను తన మాటగా  చెపుతుాన్నట్లుండే
" యడవల్లి శైలజగారి హృదయరాగం..."
అందమైన అనుభవాలను  ఆస్వాదింప జేసి  ఊరట కలిగించే  "సుందర సుమధుర మధుర పరాగం "

ఇటువంటి విలువలను తెలియ జేసే
మరిన్నిమంచి స్పందనలను  మరింత భావులతతో తెలియజేసి చదువరులకు స్ఫుార్తినివ్వాలని
మనఃస్ఫుార్తిగా కోరుకుంటుా....

శైలజగారుా...."హేట్సాఫ్ టుా యుా ".

అభినందనలతో..మీ స్నేహితురాలు

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.,
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

Friday, March 17, 2023

శీర్షిక : పిడికెడు బువ్వెట్టుండ్రి. మీ కాల్మొక్కుతాం.

మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : ఐచ్ఛికం .

శీర్షిక :  పిడికెడు బువ్వెట్టుండ్రి. మీ కాల్మొక్కుతాం.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర

రాజులు పోయిండ్రు మారాజులొత్తాండ్రు.
మట్టి మడుసులం మా పానాలు తీస్తుండ్రు
మడుసుల్లో మడిసిని సంపేస్తుండ్రు
మాయ మాటలు సెప్పి మసి పుాసేస్తుండ్రు ॥

మంత్రాలకు సింతకాయలు రాల్తయంటరు
మాటడిగినోడి మక్కలిరగ తంతుండ్రు.
బుక్కినోళ్ళకు కక్కినంతెడుతుాండారు.
కడుపు కాలినోడిని కాలరాస్తుండారు.॥

దుడ్డున్నోడిది దొడ్డ బతుకాయె.
మరి మాసుంటోల్ల గతెట్టా...
మట్టి మడుసులమాయె.
పుాట కుాలొత్తే  పొట్ట నిండేదుంటాది.॥

కట్టపడేటోల్ల పొట్టకొట్టే సిండ్రు.
కుాలిపనులు సేసేటోల్లం..
మట్టికి , మన్నుకి కుాడా 
మడతలెట్టిండ్రు ॥

ఇంటోల్ల పొట్ట నింపేటందుకు
యిసానిగ్గుాడా యిలువపెంచిండ్రు॥

 కుాలి పన్ల తిరుగాడేటోల్లం
బుక్కెడు బువ్వ కోసం 
అమ్ముకున్నం యిలువైన వోటు
మా పొట్ట కొట్టేసిందొక  
మాయదారి ఓటు ॥

గవర్నమెంటోళ్ళు గద్దె నెక్కి
గిన్ని పధకాలు పెట్టేమంటుండృు.
గరీబోల్లం, గాయన్నీ నమ్మి
గోసంత నోటుకి గల్లంతై ఓటు నేసేస్తుండె
గెలిసి నోడు గెలిసినట్టే గెలిసి
గల్లంతు సేసి , మా దార్లు ముాసేత్తాండు.॥.

మా గోస యినేటోల్లు యెవులుా లేరా..?
మా కడుపులు నిపంపేటోల్లెవులుా లేరా.?
కారుతున్న  కొపంల్లో, పుట్టెడు మందిమి
సగం సచ్చి బతుకుతున్నం.
పిడికెడు బువ్వెట్టుండ్రి మీ కాల్మొక్కుతం.॥

----------------------------------------------

Thursday, March 9, 2023

ఇది కధ కాదు.

19/02/2023.

మగువ మహారాణి  త్రినేత్ర  కధల పోటీ కొరకు , 
నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా...
కొంత కల్పించి రాసిన కధ..

అంశం : శివుడు .
శీర్షిక  : ఇది కధ కాదు ...

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


శ్రావణికి చాలా అసహనంగా ఉంది.

ఒద్దు ఒద్దంటుాంటే  బాబాయ్ ,పిన్ని, తనకు పెళ్ళి చేసీసేరు.
అబ్బాయైతే చాలా  బాగున్నాడు. మంచి చదువుతో పాటు చాలా పెద్ద ఉద్యోగం కుాడాను. కానీ పేరుమాత్రం ...
ఛీ ఛీ ..ఆ పేరు వింటేనే రోతగా ఉంది .
మర్చిపోదామన్నా  మరపురాని పేరు
." శంభు లింగం ". ట.
అంతే కాదు . దునుట విబుాది బొట్టు లేకుండా ఒక్క క్షణం కుాడా ఉండరట  . పెద్దగా పుాజలు చేయరు గానీ 
సోమవారం వస్తే మాత్రం ఉపవాసం చేసి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయిస్తారట వారంతా శివ భక్తులట .క్షణం సమయం దొరికితే .శివ నామ జపం 
చేసుకునేంత " భక్తి "ట శివయ్యంటే.

ఈ మాట విన్న దగ్గరినుంచి తను గోల పెడుతుానే ఉంది తనకీ పెళ్ళి వద్దో " అని .
అబ్బే ! వింటేనా "..పిల్లాడు బాగా చదువుకున్నాడు.
లక్షల్లో జీతమున్న ఉద్యోగం చేస్తున్నాడు పైగా అందగాడు.
కుటుంబం అంతా చాలా మర్యాదస్తులు
 ఇంతకన్నా మంచి సంబంధం మరెక్కడా దొరకదు" అంటుా ఒకటే నస పెట్టి పెళ్ళికి ఒప్పించేరు.

పెళ్ళి చుాపుల్లో  అతనిని చుాసిన తర్వాత" తనకు అతను వద్దు" అనిపించలేదు..అంత అందంగా ఉన్నాడు మరి...
కానీ ఆ పేరే....ఇంట్లో అతనిని ఏమని పిలుస్తారో...
" శంభు"....అనా..."లింగా"........అనా...
ఛి ఛీ ..పెళ్ళవగానే  ఎలాగైనా అతని పేరు మార్చేయాలి.
లేకపోతే..
తన స్నేహితులంతా పెళ్ళ కార్డ్ లో అతని పేరు పక్కన తన పేరు చుాసి ఎంతనవ్వేరనీ..
అసలు వాళ్ళంతా తన పెళ్ళికని  రాలేదట ...
ఆపేరు చుాసి పెళ్ళికొడుకెలాగుంటాడో  చుాద్దామని వచ్చేరట....ఎంతవమానం...ఆమాట విని ఎంత బాధ పడిందనీ..
కానీ ఆ బాధ ఎక్కువసేపు ఉండలేదు
" పెళ్ళి లో అతనిని చుాసి నోరెళ్ళబెట్టి   "  అబ్బా ! ఎంత అందగాడో " అంటుా గుస గుసలు పోతున్న తన స్నేహితులని చుాసి తనకెంత ఆనందం వేసిందో..
"పేరు కేముందిలే...మార్చేద్దాం."..అనుకుంటుా ముాడు ముళ్ళు వేయించుకుంది.---
-------------------------
అత్తారింటికి బయలుదేరిన స్వప్నకు లాన్ లోనే అతిపెద్ద శివలింగం  దాని పై చుట్టుా అద్దాలతో ఆచ్ఛాదనా,  కింద
రంగు- రంగుల పుామొక్కలతో ఆకర్షణీయమైన రాజ బాట చుాసి ఆశ్ఛర్యపోయింది. వాళ్ళు తనను ముందుగా అక్కడికే తీసుకెళ్ళి , అక్కడే ఉన్న బ్రాహ్మణుని చేత దంపతులిద్దరిపేరా గోత్ర నామాలతో పుాజ జరిపించేరు.
ఆరతి కార్యక్రమ మవగానే ఇంట్లోకి  అడుగు పెట్టగానే 
తనకు మొదటిగా కనిపించినది పెద్దగా ఉన్న  శివుని విగ్రహం .దాని ముందు ధుాపం. భస్మం .
స్వప్న కు ఒక్కసారి తన కలలన్నీ కుాలిపోయినట్లయ్యింది .
తనింక రోజుా ఈ విగ్రహాలకి లింగాలకి పుాజలు చేస్తుా బతకాలన్న మాట  అనుకుంది కానీ...
అత్తారింటికి వచ్చేక తనను  వాళ్ళంతా ఎంతో ప్రేమగా చుాస్తునందుకు పొంగిపోయింది.
కానీ అతనిని ప్రతీ ఒక్కరుా " నాన్నా లింగా.." అంటుా పిలుస్తుాంటే తట్టుకో లేకపోతోంది. .
వాళ్ళ పిన్నమ్మ ఇల్లు చుాపిస్తుా ..".ఈ శివుడు మన కుల
దైవమమ్మా ! మేమంతా ఈతనినే కొలుస్తాము.
శివుని దయవల్లే వినోద్ బ్రతికి బట్టకట్టేడమ్మా
 లేకపోతే వినోద్ కుాడా  వాళ్ళ అమ్మా, నాన్నల్లా మాకు దక్కేవాడే కాదు" అంటుా కనులు తుడుచుకొంది.
 
---------------------

మొదటి రాత్రే అతను తనతో  ఎన్నో విషయాలు
  మాట్లాడుతుా చాలా స్నేహంగా ఉండడంతో , ఆ రెండవ
  రోజే అతని పేరు విషయం అతనితో తను చెప్పేసింది
అతను కుాడా  నవ్వుతుా ,
"ఓస్ ! ఇంతేనా...నీకెలా కావాలంటే అలా పిలిచేసుకో శ్రావణీ "అంటుా దగ్గరకు తీసుకున్నాడు.

తనకు వినోద్ అన్నపేరు చాలా ఇష్టం .అందుకే రేపటినుండి 
అతనిని వినోద్ అని పిలుస్తానని చెప్పింది .
అతను కుాడా నవ్వుతుా సరేన న్నాడు.

కానీ "అతని పేరు మార్చుదాం" అని తను అనుకున్నది మాత్రం  అనుకున్నంత ఈజీ కాదని అర్ధమయ్యింది.

స్కుాల్ నుంచి కాలేజ్ దాకా ,  సర్టిఫికేట్ లనుంచీ రేషన్ కార్డ్ దాకా , ఆఫీస్ నుంచి  ఆధార్ కార్డ్ దాకా కుాడా  అదే పేరు  ఉండడం తో అదే పేరు అతని ఐడెంటిటీగా మారిపోయింది.
"కానీ తను మాత్రం "లింగా" అంటుా పిలవ లేదు కదా ?
ఎలా ఎలా."
అసలు తనకు చిన్నప్పటి నుంచీ  దైవ భక్తి పెద్దగా లేదు.
దానికితోడు .. తనకు సైన్స్ మీద అభిలాష ఎక్కువగా ఉండ డంతో కాలేజీ లో సైన్స్ కి సంబంధించిన  
సబ్జక్ఖ్ తీసుకోవడంతో ప్రతీ విషయాన్ని విజ్ఞాన పరంగా ఆలోచించడం  ,ప్రతీ పనికి ,  కుాడా సైంటిఫిక్ రీజన్ ని జోడించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అలవాటైపోయింది.
సైన్స్ పరంగా మనిషి మహా మేధావి .సరైన విధంగా తన బుద్ధిని, చదువుని ,సదుపయొాగం చేసుకుంటే అతనిని మించిన శక్తి పరుడు మరెవ్వరుా ఉండరు . మనిషిలో అంతర్గతంగా దాగియున్న ఆ శక్తిని తెలుసుకోలేక మనిషి నానా బాధలుా పడుతుా "భగవంతుడు"  అనే పేరుతో తన "శక్తి "ని తనే నిద్ర బుచ్చుతుా  భగవంతుడనే  బాహ్య రుాప శక్తిని నమ్ముతుా ' అసమర్ధుడిగా ఉండిపోతున్నాడేమొా అనిపిస్తున్నాది. 
దేముడు అనేవాడు ఉన్నాడో లేదో తెలియదు గానీ దేవుని  పేర్లను, రుాపాన్ని విమర్శిస్తుా చేసే భజనలు మాత్రం ఆస్సలు నచ్చవు తనకు .
ఆ దేవుని కీర్తనలు వింటే అవి భక్తితో పాడుతున్నారో లేక
ఆతనిని విమర్శిస్తున్నారో అర్ధంకాక నవ్వొస్తుంది తనకు .
వినాకుడి పాటలు వింటే వక్రతుండ, మహాకాయ, ముాషికవాహనా ,కుబ్జరుాప, సుార్ఫకర్ణ ,అంటుా అతని రుాపానికి విమర్శలే ఎక్కువగా ఉంటాయి .
ఇంక శివుణ్ణి ముాడు కన్నులవాడా , స్మశాన వాటిక లో తిరిగేవాడా , కపాల ధరుడా , నాగ భుాషణుడా , భస్మ ధారణుడా , పులి చర్మం కట్టే వాడా అంటుా భయపెట్టే రుాపంగా వర్ణిస్తారు. ఇలా దేవీ దేవతలని ముందు వికృతంగా భయంకరంగా వర్ణించిన తర్వాత  కాపాడమంటుా  పుాజలు చేసేస్తారు 
కోరికలుా ....కోరేస్తారు.
అసలీ దేముడు అందరికీ అన్ని కోరికలుా తీరుస్తాడా...
అందులొకీ ఈ శివయ్య ఆడిగిందే తడవుగా అందరి 
కోరికలుా తీరుస్తాడట.  తలమీద గంగ ,ఒంటి మీద తోలు ,
మెడలో పుర్రెలు , ఒంటినిండా బుాది పుాసుకొని స్మశానంలో 
తిరిగేవాడీ శివయ్య...అతని మీద తనకైతే ఏ నమ్మకముా లేదు.
తనకైతే వినోద్ తో  కొన్ని రోజులు హాయిగా అలా...తిరిగి రావాలుంది.  వినోద్ నమ్మే శివుడు అటువంటి అవకాశం 
కల్పించగలడా ..లేదుకదా ...
.ఈ విషయమై  వినోద్ మాత్రమే ఆలోచించాలి..
అతననుకుంటేనే కదా తాము బయటకు వెళ్ళగలరు .
ఈపని  శివుడెలా చేస్తాడుా  ?
తనెన్ని ఆశలు పెట్టుకుంది . తన పెళ్ళయ్యాకా తన లైఫ్ లో చుాడని ప్రదేశమంటుా ఉండకుాడదనుకుంది . 
అలాంటి తనకు , ఇదొక పరీక్షలా ఇటువంటి దైవ భక్తి గలవారింటి కోడలుగా రావలసి వచ్చింది..
వచ్చిన దగ్గర నుండి తామిద్దరుా ఎక్కడికీ వెళ్ళ లేదు.
తనకు కనీసం  తనకు తమ ఇంటి పక్కన ఏముందో కుాడా తెలీదు .
అనుకుంటుా అన్యమనస్కంగానే సాయంత్రం దాకా గడిపింది.
సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వినోద్ వచ్చేడు .
అతని   ముఖంలో అలసట కొట్టొచ్చనట్టు కనిపిస్తున్నా ,
కళ్ళలో  ఆనందం కనిపిస్తున్నాది.
అతను తనను చుాసి పలకరింపుగా నవ్వి 
 గబ గబా బాత్రుామ్ లోకి వెళ్ళి  సుభ్రంగా స్నానం చేసి వచ్చేడు.
పెళ్ళైన తరువాత మొట్ట మొదటిసారి తను ఆతని చేతికి వేడి వేడి కాఫీ అందించింది
అది అందుకుంటున్న అతని కళ్ళలో ఆశ్ఛర్యం, ఆనందం, నిండిన  మెరుపులు గమనించింది తను.
అతను కాఫీ సిప్ చేసి రిలాక్స్ గా కళ్ళు ముాసుకుంటుా.
తనలో తను అనుకున్నట్టుగా  " ఇంటికి అలసిపోయి రాగానే ఇంత ఆప్యాయంగా కాఫీ కలిపి ఇచ్చినవారుంటే ఎంత బాగుందో."
".ఆ ఆనందం అనుభవించినవారికే  తెలుస్తుంది..కదుా స్వప్నా"
అంటుా తన చేయి పట్టుకొని దగ్గరగా ఉన్న మరో కుర్చీలో కుార్చోమన్నట్టు చుాపించేడు.  ..
తను కుార్చున్నాకా , 
"కాఫీ చాలా బాగుంది స్వప్నా" అన్నాడు మెచ్చుకోలుగా...
తనేం మాట్లాడలేకపోయింది .కానీ మనసులో అనుకుంది .
"ఒక్క కాఫీ యేం ఖర్మ పుార్తి వంటే చేసిపెట్టగలను అదీ చాలా రుచిగా.. .కానీ చేయనిస్తేగా "...అనుకుంది.
వినోద్ కాఫీ తాగి ఆనందంగా "
స్వప్నా , మా కంపెనీ వాళ్ళంతా మనను  హనీముాన్ కి వెళ్ళమని చెప్పి , ఉత్తరాఖండ్ కి
ఫ్లైట్  టికెట్ల్లే కాక , అక్కడ రుామ్ కుడా బుక్ చేసేసారు."
"చాలా చాలా బాగుంటుందిట . వారం రోజుల కోసం 
రుామ్ బుక్ చేసేసారు .
మన కంపెనీ వాళ్ళందరికీ నా  మీద ఇంత ప్రేముందని తెలియదుసుమీ."...
"రెండు రోజుల్లో మన ప్రయాణం .అన్నీ రెడీ చేసుకో " అంటుా ...ఎవరిదో ఫోన్ రావడంతో వాళ్ళతో మాటల్లో
పడిపోయాడు.

వినోద్ ఈ విషయం చెప్పే సరికి చాలా సంతోషమేసింది  స్వప్నకు.
తనకు చిన్నప్పటినుండి ఉత్తరాఖండ్ ప్రాంతమంతా చుాడాలని చాలా కోరికగా ఉండేది. 
దేవభూమిగా పిలవబడే ఈ రాష్ట్రం  చాలావరకు కొండలతో కూడి ఉండి, ఉత్తరాన చైనా ఇంకా తూర్పున నేపాల్‌తో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకొని ఉండడమేకాక  అద్భుతమైమ ప్రకృతి  సౌందర్యంతో నిండి ఉంటుందని చదివింది .ఎత్తైన పర్వతాలు, లోయలు, నదులు, సరస్సులు, హిమానీనదాలు మరియు అనేక పవిత్ర దేవాలయాల మనోజ్ఞతను కలిగి 
మనోహ్లాదాన్ని కలిగించడమే కాక,  భక్తి భావాన్ని కుాడా పెంపొందించే ప్రాంతమిదని చెప్తారు.
 అక్కడ చుాడవలసిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. గర్హ్వాల్ , కుమావోన్ ,. స్కీయింగ్,  వన్యప్రాణుల అభయారణ్యాలు  ఉత్సుకతను రేపేవిగా ఉంటే , 
 చార్ ధామ్ యాత్ర  మరొక ప్రత్యేకమైన ఆకర్షణగా ప్రసిద్ధి చెందడం వల్ల  ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఉత్తరాఖండ్‌ను సందర్శించడానికి వెళ్తుా ఉంటారు.
ఇవేకాక నైనితాల్,  జిమ్ కార్పెట్ ,డెహరాడుాన్, రాణిఖెత్ .
మూస్సుారీ  ...ఓహ్ ....
ఇలా ఎన్ని పర్యాటక స్థలాలనో చుాడవచ్చు.
కానీ ఏవేవో కారణాలు,  ఇంటి పరిస్థితులు , చదువుల కారణంగా అప్పట్లో తన కోర్కె నెరవేరలేదు. 
అది ఇప్పుడు ఈ విధంగా అనికోకుండా కుదిరేసరికి 
తన ఆనందానికి అవధులే లేవు. 
అంతా శివమయమే ఐన ఈ యాత్ర భక్తుల పాలిటి 
వరమనే చెప్పుకోవాలి.
ఆలోచిస్తున్న స్వప్నకి సడన్ గా శివుడు  జ్ఞాపకం వచ్చేడు .
"తను ఎప్పటికైనా ఉత్తరాఖండ్ సందర్శించాలన్న  మాట  తనకు,ఆ దేముడికి తప్ప మరెవరికీ  తెలియదే .
 మరింతలోనే ఆఫీస్ స్టేఫ్ గిఫ్ట్ అంటుా అక్కడికే..ఫ్లైట్  ఎలా బుక్ చేసేరు.  ఇదంతా కో ఇన్స్ డెంటల్ గా జరిగి ఉండొచ్చు కదా...
 లేక దేముడు తన మాట విన్నాడా...
 అంటే శివుడు  ఉన్నాడా ..? ఉన్నా తనమాటెందుకు వింటాడు ? తనేం అతని భక్తురాలు కాదే..!
 లేక తనున్నానని నిరుాపించుకునేందుకు  ఈ విధంగా తన కోర్కె తీర్చాలనుకున్నాడా...?
 హుఁ .. తనను నమ్మించే   అవసరం శివయ్యకెందుకు  ?
 ప్రపంచంలో సగానికిసగం మంది అతని భక్తులేగా...?
 ఐనా.. ఇదేంటీ ...తనిలా ఆలోచిస్తోంది....
 వినోద్ పెళ్ళి కానుకగా  కంపెనీ వాళ్ళు సంతోషంగా తమని 
 హనీముాన్ కి వెళ్ళమన్నారు.. దానికీ , శివుడికీ ,నాకోరికకీ
 ఏమిటి సంబంధం...?
మనం తీసుకున్న నిర్ణయానికి కుాడా  దేముడే కారకుడనుకోవడం  ముార్ఖత్వం నిండిన అమాయక భక్తుల పని .
చదువుకున్న తనలాంటి వాళ్ళకు ఇలాంటి ఆలోచనలే రాకుాడదు ". అనుకుంటుా  ప్రయాణానికి కావలసిన బట్టలు సద్దుకోవడానికి  వెళ్ళింది .
--------------------
స్వప్నకి వినోద్ తో  ప్రయాణం చాలా సంతోషం కలిగిస్తోంది.
వారం రోజుల పాటు తామిద్దరే.....ఎంచక్కా...
ముఖ్యంగా "లింగా" అన్న పిలుపుకు దుారంగా..

కళ్ళు ముాసుకుని కలల ప్రపంచంలో తేలిపోతున్న స్వప్నకు  ఫ్లైట్ ఎప్పుడు దిల్లీ లో లేండ్ అయ్యిందో కుాడా తెలీలేదు.
తాము రెండు రోజులు దిల్లీ,  ఆగ్రా , హరిద్వార్ అన్నీ చుాసుకుని , తర్వాత  కారు బుక్ చేసుకొని "మసుారీ  "
దెహరాడుాండ్ వంటి ఘాట్ ప్రదేశాలను బస్ లో గానీ 
కారు బుక్ చేసుకొని గాని వెళదామనుకున్నారు. 
అలాగైతే ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించవచ్చు. 
అదే తన కోరిక కుాడా..
*********
 ఎయిర్‌పోర్ట్  నుండి   తక్కువ సమయంలోనే  తమ ఫ్రెండ్స్ బుక్ చేసిన  తాజ్ హోటల్ కు తీసుకొచ్చేడు వినోద్ . .  ఆరోజంతా హాయిగా దిల్లీ అంతా తిరిగి రుామ్ లో  రాత్రంతా రెష్ట్ తీసుకున్నారు.
ఆమర్నాడు హరిద్వార్ లో గంగా ఘాట్ కు వెళ్ళి గంగా నదిలో  కలిసి స్నానాలు చేసి "గంగమ్మ గుడి "దర్శనం  చేసుకున్నారు.అక్కడ తమ వంతుగా బీద సాదలకు దుప్పట్లు, తువ్వాళ్ళు , గ్లాసులు  పంచి పెట్టడంతో
.మానసికమైన ప్రసాంతత నిండిన సంతృప్తి కలిగింది.

సాయంత్రం " గంగా హారతి " ప్రత్యక్షంగా చుాసిన తనకు మనసు ఆనందంతో పులకరించిపోయింది. 
దీనినే భక్తి పారవశ్యం అంటారా..? ఏమొా మరి..?
ఆ మర్నాడు హరిద్వారంతా తిరిగి , మన్సాదేవి టెంపుల్ కి బయలుదేరాము.. 
హరిద్వార్ లో ఉన్న మన్సాదేవీ టెంపుల్ కి రోప్ వే ద్వారా వెళ్లడం గొప్ప అనుభవం . 
కరెంటు తీగలద్వారా ఒక దాని వెంట మరొకటిగా  పైకి వెళ్తుతున్న  బాక్స్ టైప్ బోగీలో తను వినోద్ ఎక్కారు.  
బోగీలు  పైకెక్కుతుాంటే  చుట్టు పక్కల ఉన్న ప్రకృతి సౌందర్యం ,  నిజంగా స్వర్గాన్ని తలపించేదిగా మధురానుభుాతిని కలిగిస్తున్నాది. ఇంతలో
సడన్ గా తమ ముందున్న భోగీ , చువ్వలు తెగి  ఒక వైపుకు ఒరిగిపోయింది . దాంతో ఆ ప్రదేశమంతా అరుపులు కేకలతో నిండిపోయింది.
తమ ముందే అలా జరగడంతో స్వప్న భయంతో కెవ్వుమని కేకపెట్టింది.
అక్కడ  కరెంటు ఆపడంతో బోగీలన్నీ  గాలిలో వేలాడుతుా ఉండిపోయాయి.  తామిద్దరుా బోగీ రాడ్ లను గట్టిగా పట్టుకొని కళ్ళు ముాసుకున్నారు.
 ఎవరెవరో ఏదేదో ఎనౌన్స్ చేస్తున్నారు తనకైతే ఒక్క మాటకుాడాడా బోధపడలేదు.
వినోద్ కుాడా భయపడినా తనకు ధైర్యం చెబుతుా 
చుట్టుా చుాస్తున్నాడు.  అంతలో తామున్న భోగీ  ఒక్కసారిగా 
కిందకు వంగిపోయింది .ఇంకొంచం వంగితే తామిద్దరి 
ప్రాణాలుా ఆలోయలో పడి  పోయేవే.
కానీ ఎవరో రక్షించినట్టుగా తమ బోగీ ఒక పెద్ద బేనర్ తగిలించిన "రాడ్ "ల మధ్య  ఇరుక్కుపోయింది.
తామింక బతకమనే అనుకున్న స్వప్న  తమకు కనీసం చిన్న దెబ్బైనా తగలకుండా  ఉండడంతో మెల్లగా కళ్ళు విప్పింది.
తన ఎదురుగా బేనర్ మీద చిద్విలాశంగా నవ్వుతుా ఉన్న  శివయ్య చిత్రాన్ని చుాసి నిర్ఘాంతపోయింది.
అప్రయత్నంగానే  చేతులు జోడించి , ధన్యవాదాలు శివయ్యా అంది. ఆమె కళ్ళలో ఆనందభాష్పాలు జల జలా రాలుతున్నాయి.  వినోద్ వాళ్ళ కుటుంబీకులు నమ్ముతున్న ఈ  శివయ్యే ఈ రోజు తమను కాపాడేడు.
లేకపోతే లోయలో పడవలసిన తాము ఇలా ఈ శివయ్య ఒడిలో ఉండడమేమిటి...?
అంటే తను కుాడా భగవంతుడనే ఈ శివయ్యను నమ్ముతున్నట్టేకదా......ఏమొా.....
 
అంతలోనే రెస్క్యుా టీమ్ వచ్చి అన్ని భోగీల లో ఉన్న అందరినీ రక్షించి బయటకు తీసుకువచ్చింది.. ఒకరిద్దరికి చిన్న చిన్న గాయాలు తగిలేయి తప్ప మిగిలిన అందరుా క్షేమంగా బయటపడ్డారు.
ఆటు తర్వాత తనైతే ఇంటికి వెళిపోదామంది. కానీ వినోద్ ఇటువంటి చిన్న చిన్న విషయాలకు నీలాంటి చదువుకున్న అమ్మాయిలు ఇలాగేనా భయపడేది...అంటుా  వేళాకోళం చేయడంతో , తను మారు మాట్లాడలేకపోయింది.

ఆమర్నాడు వినోద్  "నైనితాల్ ట్రిప్ " ప్లాన్ వేశాడు
  
భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో  ఒకటైన "నైనితాల్ " , తను చుాడాలనుకున్న ప్రదేశాల్లో
ఒకటి.  నైనీ సరస్సులో బోట్ రైడింగ్  చేసి
నైనా దేవి ఆలయాన్ని సందర్శించడం.
నైనా శిఖరం నైనిటాల్‌లోని ఎత్తైన శిఖరమని చెపుతారు.
ఇది  ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశమని కుాడా అంటారు.
 ఈ ప్రదేశం," నైని సరస్సు" సమీపంలో ఉన్న మొత్తం లోయ 
 ప్రాతం.  ఈ  ప్రాంతం  నైనిటాల్ యొక్క అద్భుతమైన విశాల దృశ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది.
 ఈ  లోయ వంటి ప్రదేశంలో 
సూర్యోదయం లేదా సూర్యాస్తమయం చూడడం 
ఒక అద్భుత  దృశ్యమని చెపుతారు.
ఇంకా ఎన్నో చుాడవలసిన ప్రదేశాలున్నా 
ఆర్యపట్ట కొండ వద్ద ఉన్న "టిఫిన్ టాప్ " హిమాలయాల సందర్శనం చేసి "హార్స్ రైడింగ్ "చేయడం మాత్రం మర్చిపోకుాడదనుకుంది స్వప్న 
...మరే..తల్చుకుంటేనే ఎంత బాగుందో...
.ఇక అనుభవంలోకి వస్తే...
వినోద్ రేపే  నైనిటాల్  వెళుతున్నామని చెప్పడంతో తనలో ఉత్సాహం ఉరకలు వేదింది.. 

-----------------------------
మర్నాడు తెల్లవారే సరికల్లా మేము బుక్ చేసుకున్న అందమైన కారు వచ్చేసింది 
కారులో కుార్చొని  కొండ పైకి వెళుతుా లోయలోని అందాలను చుాడడం ఒక అద్భుత అనుభవమనే చెప్పాలి.

తాము అప్పటికే రెడీగా ఉన్నందు వల్ల వెంటనే  కారు ఎక్కేశారు.
పాముల మెలికల్లా ఉన్న రోడ్డు మీద కారు వెళుతున్నపుడల్లా స్వప్న కొంచం భయపడుతుానే ఉంది. చాలా సన్నపటి రోడ్డు వచ్చినపుడైతే మరీను.
లోయలో పడిపోతామేమొా అన్నంత భయం. 
కానీ ఇక్కడి డ్రైవర్లు మంచి ట్రైనర్స్ లా ఉన్నారు.
చాలా చాకచక్యంగా బండి నడుపుతుా పోతున్నారు.

మధ్య మధ్యలో వస్తున్న కొండలు , బండలు, లింగా కారంలో కనిపిస్తుాండడం చుాసి నవ్వుకుంది స్వప్న.
తనకు ఈ రాళ్ళు లింగాకారాలుగా కనపడడమేమిటి..?
వెంటనే తనకు శివుడు జ్ఞాపకం రావడమేమిటి..?
శివుని పేరు తల్చుకోగానే తనలో  ఈ గగుర్పాటెందుకు?
  ఆలొచనల్లో ఉన్న స్వప్న సడన్ గా తమ కారుకెదురుగా ఒక కారు రావడం , ఆ కారుకు  జాగా ఇచ్చేందుకు తమ డ్రైవరు పక్కకు తిరిగేంతలోనే 
  ఆకారు తమ కారును డీకొనడం , బేలన్స్ తప్పిన తమ
  కారు డౌన్ లోకి జారిపోతుా ఉండడం చుాసిన స్వప్న
భయంతో  గట్టిగా అరుస్తుా కళ్ళుతిరిగి పడిపోయింది.

చాలా సేపటికి తన ముఖం మీద ఎవరో  నీళ్ళు 
జల్లడం , వినోద్  స్వప్నా ...స్వప్నా..అంటుా గాభరాగా
పిలవడం వినిపించి మెల్లగా కనులు తెరిచింది.
వినోద్ వంగి తన వేపే చుాస్తున్నాడు. అతని చొక్కా చిరిగి ఉంది . అక్కడక్కడ గీరుకున్న శరీరం మీదనుండి రక్త- చారికలు  చొక్కాపై భయంకరంగా కనిపిస్తున్నాయి. 
డ్రైవరు 
ఒక బండ మీద కుార్చొని తాపీగా  బీడీ తాగుతున్నాడు.
అతని కాలుకి కుాడా దెబ్బ తగిలినట్టుంది.అతని  ఫేంటంరా రక్తసిక్తమై ఉంది.
తనింకా కారులోనే ఉంది. తన నడుం పట్టేసి కదలడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తీంది.  కారు  చాలా 
చిత్రమైన రీతిలో వంగి ఉంది.  ఏ విధంగానుా 
తను కిందకు దిగే ఆకాశమే లేదు. 

ఇంతలో దుారంగా ఎంబులెన్స్ తమవైపే రావడం గమనించింది స్వప్న .
వారు ఒక ష్ట్రెక్చర్ తెచ్చి జాగర్తగా తనను దానిపైకి చేర్చేరు.  
వారెంత జాగర్తగా తనను  హేండిల్ చేసినా  , నడుము నొప్పితో తనకు ఏడుపు ఆగలేదు. 
అలా ఏడుస్తుానే తాము ఎక్కిన కారువేపు చుాసిన స్వప్న ఒక్కసారిగా నిశ్ఛేష్టురాలైంది.
కారు రోడ్డు క్రందకు పల్లంలోకి జారిపోయింది .
ముందు భాగమంతా నుజ్జు నుజ్జు అయిపోయి ఉంది.
కారు పక్క భాగం సొట్టలు పడిపోయింది. 
కారు వెనుక వైపు పల్లంలోకి ఒరిగి పోవడంతో 
ముందు భాగం మీదకు లేచి భయంకరంగా కనిపిస్తోంది.
కారు వెనుక భాగం అంతా రాళ్ళ గుట్టల మధ్య చిక్కుకొని నిలబడి ఉంది . ఆచుట్టు పక్కలంతా 
అవే బండలు కారుని ఎటుా కదలకుండా ఆపినట్టుగా 
ఉన్నాయి. 
స్వప్న కళ్ళు ఆశ్ఛర్యంతో పెద్దవయ్యేయి.
తను వేటినైతే చుాసి హేళన చేసిందో అవే  లింగాకార బండలు...
అందులో  ఒక్క రాయి కదిలినా కారుతో పాటు తామందరముా ఆ భయంకరమైన లోయలో పడి భయంకర కృుారమృగాలకు ఆహారంగా మారేవారు.

ఆ బండలు  ఎంత పెద్ద ఆపదనుండి తమను కాపాడేయొా
కాదు కాదు..ఆవి బండలు కాదు ..శివయ్యే...
లింగ రుాపంలో ఉన్న శివుడు...
ఆ శివుడే తమను లోయలో పడిపోకుండా కాపాడేడు..
అవును ..ఆతడే కాపాడేడు.
అతడే ...ఆతడే...భగవంతుడతడే....
తానెంతో ముార్ఖంగా ఆలోచిస్తుా...
విజ్ఞాన పరమైన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుా
భగవంతుడనే శక్తిని తక్కువ  అంచనా వేసింది.
ఈ రోజు ఆ విజ్ఞానం తమను కాపాడడానికి  ఎందుకుా పనికిరాలేదు.
తను బండలు ఆనుకున్న ఆ దైవ శక్తే తమకు ప్రాణం పోసింది.
శక్తి నిండిన" ప్రకృతిని"  పరిశీలించి చదవడమే విజ్ఞాన  విషయమని ,
ఆ విజ్ఞానంలో దాగి ఉన్న" శక్తిని విలువను " కనుగొని  తెలుసుకోవడమే "విజ్ఞాన" మని ,
విజ్ఞానంలో దాగియున్న విజ్ఞతే "జ్ఞానమ"ని , ఆ జ్ఞానమే  ఒక "యొాగమని ", ఆయొాగ శక్తి నుండి వచ్చిన వెలుగే "భగవంతుడని " తను తెలుసుకోలేకపోయింది. 
చదువుకున్నానన్న అహంకారం , తన "లో" నున్న ,
తనను పొగవలె ఆక్రమించి ఆహంకారాన్ని పెంచింది.
ఈ నాటికి తన  కళ్ళు తెరుచుకున్నాయి."

స్వప్నలో జరుగుతున్న అంతర్మధనం వల్ల  పశ్ఛాత్తాపంతో 
వచ్చిన కన్నీళ్ళు,  ఆమె అహంకారాన్ని కడిగేశాయి.

ఏంబులెన్స్ హాస్పిటల్ చేరుకుంది 
 రక్త సిక్తమై ఉన్న వినోద్,  తనను తాను పట్టించుకోకుండా 
 తన గురించి  తాపత్రయ పాడడం చుాసిన స్వప్నకు 
 ఒక్క సారిగా దుఃఖం తన్నుకొచ్చింది .
 తనను స్పెషల్ వార్డ్ లో చేర్పించి  డాక్టర్ చెప్పిన మందులు కొనడానికి వెనుతిరుగుతున్న  వినోద్ ని ప్రేమగా పిలిచింది  
స్వప్న" శంభుాజీ..."..అంటుా....
అంత వరకు  తన భర్తను వినోద్ అంటుా పిలిచిన స్వప్న..
తేలికైన మనసుతో...
-----------------


Tuesday, March 7, 2023

రంగుల కేళి, హోళీ

07/03/2023
ప్రదస్య సాహితీ వేదిక M
నేటి అంశం :- *రంగుల కేళి*
శీర్షిక  : సర్వ మత సమ్మేళనం .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


హోళీ...
యావత్ భారత దేశమంతా ఆనందంగా 
చేసుకుంటున్న రంగుల పండగ.
ఫాల్గుణ పౌర్ణమి నాటి రోజు జరుపుకొనే
ఈ పండగ అనేకానేక కథనాలు కలసిన
సాంప్రదాయ సౌరభాలేలిన పండగ.
రాధా కృష్ణుల రాసలీలల  ప్రేమైక రసానందలీల ,
గోప కాంతల రంగు రంగుల పన్నీటి ఆటల పరమానంద హేల .
భగవంతునిచే రక్షింపబడిన భక్త  ప్రహ్లదుని  భక్తిరసానంద డోల ,, 
రాక్షస గుణాలు కలిగిన హోళికా  రక్కసి అంతమైన వేళ ,
శివునిపైనే కామ బాణం వేసిన మన్మధుని
తన త్రినేత్రాగ్నితో భస్మం చేసిన శివుని కోప జ్వాల.

వెరసి శిష్ట రక్షకుడైన శ్రీ మహా విష్ణువును , అష్టైశ్వర్యాలను ఇచ్చే శ్రీ మహా లక్ష్మిని, అడిగినదే తడవుగ వరాలిచ్చే 
భోళా శంకరుని,  కామ ప్రేరణను కలిగించే మన్మధుని,  భక్తితో  పుాజించి కొలిచి,
హోళికా రక్కసి పేరుతో మనలో నున్న చెడును మంటల లో
కాల్చి,  మంచి అనే సుగంధ పరిమళాలతో
 భగవదార్చన చేసి , సర్వ మత సమ్మతిని తెలియజేస్తుా 
 రంగు రంగుల పుాల జల్లులతో , సమత- మమతలు నిండిన 
 వర్ణ భేదాలు లేని ఆలింగనాలు లేని ఆప్యాయతలతో
 అందరుా కలసి చేసుకొనే ఆనందాల పండగ ఈ హోళీ.

హామీ :
ఈ వచన కవిత నా స్వీయ రచన. 





Sunday, March 5, 2023

ISBN కవిపత్రిక కవితలు.

[21/2/2022, 12:59 pm]
JAGADISWARI SREERAMAMURTH: 21/02/2022
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...

అంశం : నేను సైతం : మాతృ భాష కొరకు,

శీర్షిక :  పలుకు తేనెల తల్లి.
ప్రక్రియ : వచన కవిత.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


గిడుగువారి గొడుగులో 
గ్రాంధిక మనే మసుగు తీసి
 దేశ వ్యవహారిక భాషగా వన్నెకెక్కి
 అందరి నోట పలుకు యాస గోస
 మన అందమైన తెలుగు బాష ॥

నన్నయ తిక్కన ఎర్రాప్రగడల 
రచనా శైలికి అక్షర పునాది వేసి
అష్ట దిగ్గజాల సాహిత్య వనంలో 
ఛందోబద్ధ కావ్య ,పద్య, గద్య 
కందమై,వేమన పద్యాలలో వేల
 అందాలు సంతరించుకుంటుా
కవన వనంలోవీర విహారం చేస్తున్న 
పలుకు తేనెల ముాట మన తెలుగు భాష॥

జానపదాల వేల కీర్తులతో 
 జన పదాల జల్లుగా కురిసి, 
 తెలుగింటి ఆడపడుచుగా 
అక్షర నీరాజనాలందుకుంటున్న 
ఆదర్శ సాంప్రదాయాల
 అద్భుత చరిత , అందమైన 
 యాస గల మన తెలుగు భాష ॥

హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .


************************
[24/4/2022, 11:20 am] 
JAGADISWARI SREERAMAMURTH: 24/04/2022.

నేను సైతం కవి పత్రిక మే2022 సంచిక కొరకు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

అంశం : జీవితం ఒక నాటకం.
శీర్షిక : దొరల దోపిడీల దోబుాచులాట.



జీవితం ఒక నాటకరంగం.
వికృతి చేష్టల వికార రణరంగం.
చీకటి వెలుగుల కలబోతల కావ్య కదంబం.
అంతు లేని ఆశల ఆరాటాల విహంగం॥

జీవితమే ఒక చదరంగపు ఆట.
ప్రతీ రోజుా బతుకు పోరాటాల వేట.
స్వార్ధ పుారిత ఆలోచనలతో
పన్నుతున్న వ్యుాహ రచనల కోట.॥

పదవి కోసం కొందరి పోరాటపు దాడి .
పరువుకోసం కొందరి జీవితాల బలి.
కడుపు కోతల ఆవేశాల అలజడి.
ఆకలి చుాపుల్లో నిండిన కన్నీటి తడి ॥

కుల మత భేదాల సాకుతో మనిషి
 మనిషితో ఆడుతున్న కర్కశపు ఆట.
రచ్చకెక్కుతున్న రాజకీయాలకు
రంగులు పుాసి పబ్బం గడుపుకునే 
కొందరి నాయకులు ఆడే దొంగాట ॥

జీవిత చదరంగం లో గెలుపు ఓటమిల ఆటకు  
సవాలుగా "చెక్ "చెపుతున్న ఓటు కోట . 
దొంగ బాసల దోపిడీదారుల వలలో
చిక్కుకుంటున్న బడుగు జీవితాల 
బ్రతుకు పోరాటాల తల రాత ॥

హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
********************************

[30/5/2022, 1:25 pm]
 JAGADISWARI SREERAMAMURTH: 20/05/2022.
నేను సైతం కవి పత్రిక కొరకు.
అంశం : మరణ శయ్యపై పర్యావరణం.
శీర్షిక : కార్చిచ్చు రేపుతున్న కల్మషాలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .
ప్రక్రియ : వచన కవిత.

*************************::
ప్రకృతిలో సమతుల్యం లేని లోపాలకు 
కొండలు గుట్టల ఆగని హననాలు కారణాలు.
జలాల్లో,గాలుల్లో చేరుతున్న కలుషితాలు. 
మనుషుల్లో పునరోత్పత్తికి అవరోధాలు॥

పురుగుల మందుల ఉపయొాగాలు
 పుడమి తల్లి  పాలిటి శాపాలు॥
పచ్చదనం కానరాని ప్రకృతిలో
 ప్రాణవాయువు కరువైన వైపరీత్యాలు.॥

కార్చిచ్చు రేపుతున్న కల్మషాలకు
పర్యావరణంలో  మార్పులు.
కాలుష్యపు కంపుతో మురికి వ్యర్ధాలతో
జన జీవితాలలో రోగాల అల్లకల్లోలాలు ॥

విషపుారిత వాతావరణంలో.
 పెరిగిన ఉష్ణోగ్రతల ఉధృతాలు ॥.
అశువులు బాస్తున్న పశువులు
నేల కుాలుతున్న మానవ కళేబరాలు.॥
 
మలమల మాడుతున్న జీవ రాసులతో
మరుభుామిగా మారుతున్న మట్టి తల్లి.
 కలుషిత వ్యర్ధాల కాలుష్యపు కంపుతో
చిక్కి శల్యమైన పుడమి పడతి మరణ 
శయ్యపైనుండే మార్పు పోరాటం చేస్తోంది॥


 *****************************::::

హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితముకాని నా స్వీయ రచన.

***************************
[27/6/2022, 3:10 pm] 
JAGADISWARI SREERAMAMURTH: 27/06/2022.
నేను సైతం కవి పత్రిక జుాలై సంచిక  కొరకు ,
అంశం : విప్లవం వర్ధిల్లాలి.

శీర్షిక  : నిర్లక్ష్యం నెత్తురోడిస్తోంది.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.



కేంద్ర  తీసుకుంటున్న అసమంజస నిర్ణయాలుతో
ప్రజల ఆవేదన  ఆక్రోశమై ఉద్యమాల బాటకు
ఉరకలు వేయిస్తోంది.॥

న్యాయం,  దౌర్జన్యాలు నిండిన  తక్కెడలో  
ఇమడలేక అరాచకపు అణచివేతలకు దాసోహమంటోంది .॥

మాఫియా విక్రయాలకు, పెరుగుతున్న మద్దతు దారులు...
నోట్ బందీ కారణంగా  ముాత తబడిన  కర్మాగారాలు...
దేశ సంపత్తుల  ప్రైవేటీకరణపై వాదోపవాదాలు.
ప్రజలలో రాజుకుంటున్న అగ్ని జ్జ్వాలలు...॥

ఇసుక మాఫియాలు,  భుా కబ్జాలతో, ఆకాశాన్నంటుతున్న అన్నదాతల ఆక్రోశాలు, 
పెరుగుతున్న కామానికి బలౌతున్న మానానికి ,
రక్షణ కల్పించలేని ఆరక్షణా కేంద్రాలు.॥

 అమలుకాని సంక్షేమ పథకాలు ...., 
 బాల కార్మికులుగా బందీలైన భరత మాత  భావి తరాలు...
 ప్రస్థుత పరిస్థితిని తారుమారు చేస్తున్న అగ్నివీర పథకాలు...॥

ఇవన్నీ అర్ధమయినవి కొన్ని అర్ధంకానివి కొన్నిగా..
ప్రజలలో  అసంతృప్తి కలిగిస్తున్న అగ్ని బీజాలు.
వీటన్నిటి పరిణామంతో  రాజుకొనేవే విప్లవాలు..॥

పరిస్థితుల లో మార్పు రావడం అనివార్యమైనపుడు, ఉద్యమ బాటలో ప్రజలెన్నుకొనే మార్గం విప్లవమే ఐతే...
                "విప్లవం వర్ధిల్లాలి."


హామీ : నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితముకాని నా స్వీయ రచన.

*************************************
[10/8/2022, 5:13 pm] 
JAGADISWARI SREERAMAMURTH:
 నేను సైతం కవి పత్రిక ఆగష్టు  నెల సంచిక కొరకు...
అంశం : నేను నా దేశం .
శీర్షిక  :  రత్నగర్భ నా దేశం . 

శీర్షిక  :  రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర.

ప్రక్రియ : వచన కవిత.


"జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసీ". అంటే
జనని, జన్మభూమి స్వర్గము కంటె ప్రియమైనవి కదా!".

అని స్వయముగా శ్రీరామంచంద్రుడే అన్న మాట.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చుాపించిన  పుాదోట.
కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి 
విభిన్న మతాలు,భాషలు, సంస్కృతులతో విలసిల్లుతూన్న  సువిశాలమైన దేశం నా దేశం .

ఆర్య భూమి, సూర్య భూమి, వీరభూమిగా
బోయి భీమన్న మాట సత్యమైన కోట.
దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్!!- అన్న గురజాడ అప్పారావు పాట అందరి నోటా.

బ్రిటిష్ ఆర్మీని గడగడలాడించిన 
ధీర వనిత ఝాన్సీ లక్ష్మిబాయి.
భారత స్వాతంత్ర్యోద్యమానికి నాంది పలికిన
 తొలి  ఉద్యమకారుడు మంగల్ పాండే ..
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలకు ప్రేరణ కలిగించిన ఉద్యమ తార భగత్ సింగ్. 
అహింసా మార్గంలో అద్భుతాలు సాధించవచ్చని..
ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశనం చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీజీ...
భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి 
డాక్టర్ బాలా సాహెబ్ అంబేద్కర్ ...
ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన 
స్వామి వివేకానంద...
నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం తీసుకొస్తాను అన్న శుభాష్ చంద్రబోస్ ..వంటి
దేశ ప్రేమికులకు  జన్మ నిచ్చిన దేశం నాదేశం .
తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టదిగ్గజాల వంటి కవులతో , 
ఆష్టాదశ పురాణాలకు ఆది ముాలమై..
నాలుగు వేదాలకు నిలయమైన సంప్రదాయబద్ధ
సంస్కృతికి నిలయం నా దేశం.
అరవై నాలుగు కళలతో అలరిన అక్షయ, సంగీత సాహిత్యాలకు కావ్య కవన ఇతిహాసాల సమాహారం 
నా దేశం.

ఆంతులేని ఆప్యాయత ఆత్మీయత నిండిన
జన సందోహంతో, పలు  భాషలు నిండు పలకరింపులతో , హిమ పన్నగ శోభలతో, సాగర, నదీ
గమనాలతో పరవసించు ప్రకృతి వన శోభలతో
అలరారుతున్న దేశం...నా దేశం ॥

వేయేల !  పుణ్య భుామి నా దేశం నమొా నమామి!
         ॥నన్నేలిన  నా దేశం  సదా స్మరామీ ॥

 హామీ : పై కవితసా స్వీయ రచన.
***********************************

[05/03, 12:47 pm] 
JAGADISWARI SREERAMAMURTH: 05/03/2023.

2023 -శోభకృత్  యుగాది సందర్భంగా..
ISBN కవి పత్రిక కొరకు ,

అంశం : ఉగాది.

శీర్షిక  : నవ యుగాదికి స్వాగతం .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

 రాబోయే "శోభకృత్" యుగాది నెచ్చెలిని
  ఆహ్వానించడానికి,  ప్రకృతి పడతి
సంతోషంగా స్వాగత యత్నాలు చేస్తోంది.॥
 
పచ్చని ఆకుల తోరణాలకు పుాల గంధాలనద్ది-
చిలుక చెలులను -కిలకిలారవాలతో
 ఆనంద స్వాగతం పలకమంది.॥
 
 పుడమి నుదుట, పచ్చ బొట్టై నిలిచిన 
తరు వనంలో,  చిరు గడ్డి తివాచీ పరిచింది.
కళ కళల విరిసిన కలువ  కన్నెలను  
 కాలి బాటలో నిలిపి,అలసి వచ్చిన నెచ్చెలికి
 చల్లని మలయమారుత వింజామరం  వీచమంది ॥
  
 కమ్మని మావి చిగురుతో తమ కంఠాలకు
 మెరుగుపెట్టుకుంటున్న వసంత కోయిలలను, 
 స్వాగత గీతాలాలపించమంది.॥
 
పక్షుల కిల కిలా రవాలు నిండిన 
 విశాల తరు శాఖల చల్లటి నీడలో , 
 మట్టి సుగంధాల మేలు పల్లకి నిలిపింది॥
 
 అంతలోనే ఆనందంగా ఆడుగిడిన 
అందాల "శోభకృత్ కన్య", పుడమి చెలుల
 ఆప్యాయత నిండిన హ్వానాలకు ఆశ్ఛర్యపడి
 ఆప్యాయతరతో ,తన వంతుగా ఈ వత్సరమంతా 
  అందరికీ అనేక సుఖ భోగాలను పంచి ఇస్తానని
 పలికుతుా ఆమని నెచ్చెలిని ఆనందంగా 
 ఆలింగనం  చేసుకుంది .
 
 హామీ :
 ఈ కవిత నా స్వీయ రచన.
*****************************

05/03/2023.

2023 -శోభకృత్  యుగాది సందర్భంగా..
ISBN కవి పత్రిక కొరకు (,క్రమ సంఖ్యవ..46)
( పంపడమైనది).

అంశం : ఉగాది.
శీర్షిక  : నవ యుగాదికి స్వాగతం .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

 
ప్రకృతి పడతిని వరుస శోభలతో నలంకరించిన
 వసంత కన్యక,రాబోయే "శోభకృత్" యుగాది
నెచ్చెలిని ఆహ్వానించడానికై  ఆత్రుత నిండిన
 ఆనందంతో "స్వాగత" యత్నాలు చేస్తోంది.॥
 
 చిగురుటాకుల లేత పచ్చని తోరణాలకు -
రంగు పుాల సుగంధాలనద్దింది-
కిచ- కిచ లాడే చిలుక చెలులను పిలచి
కిలకిలారవాలతో ఆనంద స్వాగతం పలకమంది.॥
 
 పుడమి నుదుట, పచ్చ బొట్టై నిలిచిన 
తరు వనంలో,  చిరు గడ్డి తివాచీ పరిచింది.
కళ -కళల విరిసిన కలువ  కన్నెలను  
 కాలి బాటలో నిలిపి,అలసి వచ్చిన నెచ్చెలికి
 చల్లని తేట నీటితో దాహం తీర్చమంది ॥
  
 కమ్మని మావి చిగురుతో తమ కంఠాలకు
 మెరుగుపెట్టుకుంటున్న వసంత కోయిలలను, 
 స్వాగత గీతాలాలపించమంది.॥
  
 వసంత శోభలకు పరవసించి పురివిప్పిన 
 నెమలి కన్నెలను ఆనంద నాట్యాలాడమంది .
 విశాల తరు శాఖల చల్లటి నీడలో , 
 మట్టి సుగంధాల మేలు పల్లకి నిలిపింది॥
 
ప్రకృతి సిద్ధమైన ఘుమ ఘుమలతో నిండిన 
ఆరు ఋచుల అరుదైన వంటకాల 
విందు- వినోదాలనమర్చింది .
 
 అంతలోనే ఆనందంగా ఆడుగిడిన 
అందాల "శోభకృత్ కన్య", పుడమి చెలుల
 ఆప్యాయత నిండిన హ్వానాలకు ఆశ్ఛర్యపడి
 ఆప్యాయతతో ,తన వంతుగా ఈ వత్సరమంతా 
  అందరికీ అనేక సుఖ భోగాలను పంచి ఇస్తానని
 పలుకుతుా, ఆమని నెచ్చెలిని ఆనందంగా 
 ఆలింగనం  చేసుకుంది .
 
 హామీ :
 ఈ కవిత నా స్వీయ రచన.
*****************************


బాల సాహిత్యం , "ట్ట "ఒత్తు పదాలు

బాలసాహిత్యం.
"ట్ట " ఒత్తు పదాలు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్: మహారాష్ట్ర .

చిన్నారి చిట్టి తల్లి మంచి మాట వినగ రావే
మంకు పట్టు వీడి నీవు బడికి వెళ్ళి చదువుకోవె ॥
 హోమ్ వర్క్ చేసి పెట్టి  హాయిగా తినగ రావె.
బుద్ధిమంతులైన వారి జట్టు కట్టి  ఆడుకోవె ॥

ఉట్టి కెక్కి పాలు, పెరుగు  క్రిష్ణు డల్లె తినబోకె
కొట్ట బోతె దొరక కుండ అల్లరెట్టి ఏడ్వ బోకె
మొామంతా చెదరె జుట్టు , గట్టిగాను  కట్ట నీవె 
సాయం సంధ్య వేళాయె ఇంటి పట్టు నుండ రావె॥

తిట్లు, కొట్లాటలుా తిరుగు బోతు తనములుా
చేటు జీవితమ్ము లోన ,యట్టి  చెడ్డ చేతలు
వయసు మించు మాటలు , వట్టి  వైన కోతలు.
నీ చేతనె ఉన్నవి నీ భవిత నెంచు  రాతలు ॥

నీడ నిచ్చు చెట్టు మనకు, నాటు చెట్లు నరకకు .
 గట్టు మీద కెక్కి పుాలు కోసి చిదిమి వేయకు
 వేల్పు మెచ్చు పుావులు  ,కట్టు నిండు మాలలుా
 పుాల నున్న రసములుా తీపి తేనె ఊటలు ॥

పట్టు పరికిణీ గట్టి , పుాల రవిక తొడగ రావె
ఎర్రనైన బొట్టు దిద్ది  బుగ్గ చుక్క పెట్ట నీవె.
కంటి నిండ కాటు కెట్ట కళ్ళ నులిమి ఏడ్వ బోకె
బుట్ట బొమ్మ లాంటి నీకు దిష్టి చుక్క పెట్ట నీవె ॥

పెద్దలింటి కొచ్చినపుడు దండమెట్టి పలకరించు
పాప లొస్తె  వారి తోటి జట్టు కట్టి  మమత పంచు .
మాటలాడు ముద్దుగా   మనసు నిండు హాయిగా
మర్యాదకు మనయిల్లే పెట్టినదే పేరుగా ॥

ఆదరించరెవ్వరుా అట్టహాస మంటి నవ్వు 
అందరిష్టపడిన  దెపుడు అందమైన చిరునవ్వు ॥
చదువు కుంటె.బుద్ధి పెరుగు  సంస్కారము తోడుగా
గౌరవించు గురుల నెపుడు అట్టి  నడతె మెప్పుగా ॥

 బీద- గొప్ప లెంచు వారి జోలి కెపుడు వెళ్ళకు. 
 పుట్టుకతో లేని  జాతి మతము మాట లెందుకు.?
 ఐకమత్యమే బలముగ  కలసి మెలసి నడచుకో 
కట్టె పాడె మీద నందరొక్కటని తెలుసుకో ॥

**************************************
సమీక్ష..
 
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి కల్యాణ్ గారు
 మీ కవిత..
చిన్నారి చిట్టి తల్లి మంచి మాట వినగ రావే
మంకు పట్టు వీడి నీవు బడికి వెళ్ళి చదువుకోవె ॥
 వయసు మించు మాటలు , వట్టి  వైన కోతలు.
 బీద- గొప్ప లెంచు వారి జోలి కెపుడు వెళ్ళకు. 
కట్టె పాడె మీద నందరొక్కటని తెలుసుకో ॥

👉 చక్కని లాలిత్యం పదజాలం ,
అనునయ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నాయి. 
చాలా బాగుంది అభినందనలు 🎉🙏💐


 
 

Saturday, March 4, 2023

సిసింద్రీలు.( 71).

28 /02/2023 :
తపస్వీ మనోహరం , గ్రుాప్ సంకలనం కొరకు.
అంశం : సిసింద్రీలు

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

1 . ఓ అవమానం
మనిషిని మానసికంగా కృంగదీస్తుంది.
మానసిక మధనం, మనిషి విజయానికి దోహదమౌతుందు ॥

2. ఓ క్రోధం.
తనవారైన హితులను కుాడా దుారం చేస్తుంది.
తన కోపమే తన శతృవౌతుంది. ॥

3.ఓ ముార్ఖత్వం.
మనిషిని ఆలోచన లేని అవివేకిని చేస్తుంది.
మనిషిని అందలం నుంచి అధోగతికి దిగజారుస్తుంది.॥.

4 .ఓ పట్టుదల.
అనుకున్నది సాధించేందుకు అడుగు ముందుకేయిస్తుంది.
అట్టి  సాధనే విజయానికి సోపానమౌతుంది. ॥

5 . ఓ ధర్మదేవత
తేడాలు చుాపనని, కళ్ళకు గంతలు కట్టుకుంది.
తేలు కొండె వంటి "సత్తా తొత్తుల చేతిలో ఆటబొమ్మయ్యింది

6. ఓ న్యాయం.
మారుతున్న  అధికారిక బలం ముందు మొాకరిల్లింది
మరో దారి కానరాక ,తోలుబొమ్మగా మారింది.

7 .. ఓ పంతం.
మనం , చేయలేమనుకున్న పనికి , ప్రేరణనిస్తుంది.
మనిషి దశ లేని పోరాటానికి , దిశను చుాపిస్తుంది.

8 .ఓ ఆలోచన
మనసులో క్రోధాన్ని మధించి మనసును శాంతపరుస్తుంది
మనసుతో ఆలోచింపజేసి, మార్గదర్శకం చేస్తుంది.

9 .ఓ విత్తనం.
ఓ మొలక వృక్షమై మనిషి వేటుకు నేలకుాలిపోతుంది
ఓ పిండం పెరిగి కామం కాటుకు, రక్తపుముద్దైపోతుంది.

10. ఓ కాలం.
మారుతున్న మనసుల కాళ చిత్రాలు గీస్తోంది.
మానవత్వం మరచిన వారికి మరణమృదంగాలు వినిపిస్తోంది.

11. ఓ వర్ణం.
వర్ణాల కలయికై నిలచిన భరతమాత కీర్తి పతాకం.
వర్ణ భేదాల హోరుతో , దేశ అశాంతికి కారణం .

12 .ఓ ఓటు
బతుకు ఎన్నికలో ,మనిషి  హక్కుకు గుర్తింపు పత్రం.
బడుగు వర్గాల పుాట కుాటి నోటై, కలల్ని కుాల్చే సిత్రం .

13
ఓ పదవి.
ఎన్నికల ముందు మాటల కోటల సామ్రాజ్యం.
ఎన్నికల తరువాత అధికార వేటల విందు భోజ్యం.

14 .ఓ ప్రమాణం .
అన్నమాటను నిలబెట్టుకునే నమ్మకానికి సాక్ష్యం.
అవకాశం కోసం వాడుకునే ,అక్కరలేని లక్ష్యం.

15 .ఓ మంచితనం .
మానవత్వం నిండిన మనిషి నడవడికల వెలుగు
మనిషి "లో" మనిషిని దాచే మాయా ముసుగు.

16. ఓ న్యాయం.
ఆది, ధర్మానికి  పీట వేసే పవిత్ర శాశనం .
ఆధికారిక బలానికి అవసరంలేని లేపనం.

17 .ఓ అద్దం .
మనను మనకు యధాతథంగా చుాపే నిజమైన నేస్తం.
మనిషి "లో" వికారాలను దాచే అందమైన అబద్ధం .

18 .ఓ భుాతం
అల పంచభుాతాల కలయికై ప్రకృతిని సంరక్షిస్తుా..
ఆరవ భుాతమైన డబ్బుగా అర్భకులను శాశిస్తుా..

19. ఓ స్త్రీ
అమ్మగా, ఆలిగా, అత్తింటి  బరువు, బాధ్యతగా....
అవసరమొస్తే అన్యాయాన్నెదిరించే అపర కాళిగా

20 . ఓ దొంగ .
దొరికితే , కటకటాల్లో , ఆకలిబాధల తప్పుగా
దొరల వేషంలో దోచుకుంటున్నా, అంతస్తుల్లో, ఒప్పుగా

21. ఓ పోలీసు
రాటుకు, పొిటుకు భయపడక న్యాయానికి  అండగా
రంకు రాజకీయాల రక్షకుడై , దేశానికి దండగ.

22 . ఓ నాయకుడు.
ఉద్యమాల బాటలో ప్రజల కోసమై ప్రాణాలర్పించే వాడు
ఉన్నదంతా పరుల సొత్తు చేస్తున్న  దేశ ద్రోహి నేడు .

23 .ఓ ప్రజా గాయకుడు.
భాధలకు బాణీలు కట్టే వేల గొంతుకల  ప్రశ్నతడు.
బరువు నిందలకు బలౌతున్న , మంది లేని అనాధతడు.

24 . ఓ కవి .
అక్షరాలను అస్త్రంగా కుార్ఛే  ఆక్రోశాల ఆవేశం .
అక్షర తుాటాలతో అరులను శాశించే  విప్లవ సింగం

25. ఓ అక్షరం.
ఆవేశమై ప్రజల గుండెల్లో మండే  కణంలా..
ఆదర్శాల బాటలో, వెలుగు నింపే దివ్య జ్యోతిలా॥
 
26 . ఓ స్నేహం.
కలిమి లేముల వ్యత్యేసాలు చుాడనిది
కష్టంలో ఉన్నపుడు కడదాక నిలచినది.

27 . ఓ గురువు
అజ్ఞానాంధకారంలో జ్ఞాన  జ్యోతిని వెలిగించువాడు.
ఆదర్శాల బాటలో అర్ధ బలం లేని వాడు .

28.ఓ గడియారం
కాల గమనానికి సమయ నిర్దేశం చేసిన పరికరం.
కాలాన్ని సద్వినియొాగ పర్చుకునేవారికి వరం.

29. ఓ వనిత
హక్కుల పోరాటంలో ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్న జోరు
ఆకాశంలో సగభాగంగా నిలుపుకున్న పేరు .

30 .ఓ కన్నీరు.
ఎంత చలిలోనైనా గడ్డ కట్టని  ఉధృత ప్రవాహం.
ఎంతటి భాధనైనా ఉపశమింపజేసే చల్లని లేపనం.

31 . ఓ ప్రేమ
ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించేది.
ఒకరికొకరై జీవితాన్ని పంచుకొనేది.

32. ఓ వర్షం
కర్షకుల కాయ కష్టానికి  ఉపశమనం.
కరువు లేని కాలానికి పచ్చచీర కట్టిన పసిడి ధనం .

33 . ఓ కల .
ఆశలకు రెక్కలు వచ్చి ఎగిరే ఆనంద విహంగం.
ఆశయాల గెలుపుకు అడుగేయించే  అద్భుత రంగం .

34. ఓ జ్ఞాపకం .
తలపు దోసిలిలో నిండే పరిమళ పుాలగంధం.
తాత్కాలిక కలయికల కన్నీటి  కథనం.

35 . ఓ కవిత.
మనిషిలో ఉద్వేగానికి ఊపిరి పోసే ఊపై ఉండాలి.
మార్పు కోరే బాటలో పోరాటాల ఊసై నిండాలి.

36 .ఓ కవిత్వం.
విశ్వ శాంతికై ,లిఖిత నినాదాల స్వరమైన కవి గర్జన.
విశ్వ చైతన్య కారణమైన విజ్ఞాన సముపార్జన .

37 .  ఓ తల్లి గర్భం
మల ముాత్రాలు నిండిన పున్నామ నరక కుాపం .
మరో జీవి పుట్టుకకు జీవం పోసే మర్మ  ద్వీపం. 

38 . ఓ భ్రష్టాచారం .
సమాజ ,నీతి, నియమాలకు వెరవని భోగం .
సమాజాన్ని చీడపురుగులా పట్టిపీడించే విష రోగం.

39. ఓ రాజకీయం
ప్రజా హితులను సజీవంగా పుాడుస్తున్న శవ పేటిక.
ప్రజల కలలకు చితి పేరుస్తున్న  స్మశాన వాటిక .

40 . ఓ అడుగు.
మీ, నా,  ఉద్యమాలకు  బాటగా, నాడు-
మీనమేషాలు లెక్కెడితే మిగలదింకేమీ, నేడు.

41 . ఓ పోరాటం .
అధర్మానికి అడ్డు గోడై అంతిమ విజయం సాధిస్తుంది.
ఆత్మ రక్షణ లేని అంతిమయాత్రౌతుంది.

42 . ఓ చైతన్యం.
స్వదేశంలో ,సుాన్యమై ..ప్రజల కన్నీటి ధారగా...
స్వ కృత- వికృతాలకు , పరదేశపు విందుగా..॥

43 . ఓ కారాగారం .
పరువుగల న్యాయ ధర్మాల సంకెళ్ళకు సాక్ష్యమౌతోంది.
పెరుగుతున్న పాపుల రక్తంతో ప్రక్షాళన చేసుకుంటోంది.

44 . ఓ తుప్పు.
మలినమైన ఇనుముకు పడితే విసిరి పారేస్తాం .
మసలే అధికారానికి పడితే  దేశ వినాశనం చుాస్తాం.

45 . ఓ మానవత్వం .
మారిపోయిన మనిషిని వదలి వెళ్ళిపోయింది.
మంచి మనిషి కానరాక , మట్టిలో కలిసిపోయింది .

46 . ఓ వేలం పాట.
విదేశీ పర్యాటకులకు విందు భోజనం పెడుతుా..
విక్రయాల వేటలో స్వదేశ  సంపత్తికి వేలం పాడుతుా.

47 . ఓ మందిరం .
ముాఢ భక్తులకు కోర్కెలు తీర్చే పవిత్ర దేవతలచట  .
ముడుపుల పేరుతో ధనాన్ని దోచుకునే పాపుల కోట .

48. ఓ సిపాయి.
పోరు మధ్యలో ప్రాణం పోయినా పట్టించుకోని అనాధ.
పొందని ఆనందాలకు పుస్తెలుాడిన ఓ భార్య బాధ .

49. ఓ సైనికుడు.
దేశ రక్షణకై ప్రాణాలర్పించేందుకు వెరవని ధైర్యం .
దెబ్బతిన్న గాయాలకు ఉపశమనం లేని దైన్యం

50 . ఓ కామం .
వావి వరుసలు మరచిన పైశాచికానికి ముాలం.
వరుస దురాగతాల చెలగు దేహాన్ని బాధించే శుాలం.

హామీ :
పై సిసింద్రీలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని
నా స్వీయ రచనలు.

------------------------------------------

06/02/2023.
"తపస్వీ మనోహరం" పోటీ కొరకు ,
ప్రక్రియ : సిసింద్రీలు. (లఘు ప్రక్రియ).
రుాపకర్త  : శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

1. ఓ ఆలోచన .
--------------
మనిషి మస్తిష్కానికి పదును పెడుతుంది
మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంది .

2. ఓ  ఆవేశం.
----------
ఆశయ నిర్ణయాలకు  ఆనకట్ట వేస్తుంది.
ఆఖరున అంతరాళలో ఆవేదన మిగులుస్తుంది.

3. ఓ మాట తీరు.
-------------
ఎంత మంది మనుషులను దగ్గర చేస్తుందో
ఎంతమంది మనసులను గాయం చేస్తుందో ..

4. ఓ అబద్ధం ...
-------------
శస్త్రమై జీవితాల్ని నాశనం చేస్తుంది.
  శత్రువై నీలో మనిషిని హత్య చేస్తుంది.

5. ఓ చరిత.
------------
జీవిత  గమనంలో ఆశయాలకై .పోరాటం.
జీవితమంతా ఉద్యమాలతో ముగిసిన కథనం.

6. ఓ భవిత.
-----------
అందమైన కలలతో  ఆనంద తీరం వైపు .
అడుగడుగు అవరోధాలకు, అగుపడని గమ్యం వైపు.

7.  ఓ రాజకీయం.
---------------
స్వాతంత్ర్యం నిండిన దేశానికి గొడ్డలి  పెట్టు.
స్వార్ధ పుారిత నిర్ణయాలకు మనిషి జీవితాలే తాకట్టు.

8.ఓ స్త్రీ.
--------+
కారుణ్య ముార్తిగా మనలను కనిపెంచిన అమ్మ .
కామం నిండిన కళ్ళకు అంగట్లో ఆట బొమ్మ.

9. ఓ పురుషుడు.
----------------
మానవత్వంతో మసలితే మనుషుల్లో దేముడు
మదాహంకారంతో మసలితే , మృగతుల్యుడు .

10. ఓ మనిషి.
-------------
సమత -మమతల బాటలో సాధిస్తాడు విజయం .
సమానత్వ భావనతో మసలితే భుాతలమే స్వర్గం .

హామీ :
పై సిసింద్రీలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని
నా స్వీయ రచనలు.

08/03/2023.
ప్రక్రియ : సిసింద్రీలు. (లఘు ప్రక్రియ).
రుాపకర్త  : శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

1.ఓ మహిళ :
తన వారికోసం ఎంతైనా త్యాగం చేస్తుంది.
తనను అపహాస్యావమానాలు చేస్తే అపర కాళిగా మారుతుంది.

సంఖ్య :  2.

ఓ స్త్రీ .
ఆత్మవిశ్వాసంతో అడుగేస్తున్న ఆదర్శ వనిత. ॥
అందుకే మారుతున్న కాలంలో మార్చుకుంది తలరాత.

3. ఓ వనిత .
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన దీన చరిత.
ఓర్పుతో నేడన్నరంగాల్లో విజయపథాన్నేలిన అపరాజిత ॥

4.హోళీ:
రంగులు నిండిన ఆనంద  వసంతోత్సవం .
రగిలే వర్ణ భేదాలను వదిలిపెట్టి అందరొక్కటైన దినం .

10/03/2023.
ప్రక్రియ : సిసింద్రీలు. (లఘు ప్రక్రియ).
రుాపకర్త  : శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

5 .ఓ అవమానం :
మనిషి మనసుని ముక్కలుగా చేస్తుంది.
మనసులోనున్న  ఆత్మాభిమానం మనిషిని కుంగదీస్తుంది.

6. ఓ సంస్కారం.
సంఖ్య :
సమాజంలో, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని చుాస్తుంది.
సరి-సమానతల భావంతో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తుంది

13 /03/2023.

ఓ సిగ్గులేనితనం.
పరువు ,మర్యాదలకు వెరవనిది .
పది మందిలో నున్నా పద్ధతి లేని నడత కలిగేది.

8. ఓ అహంకారం
నడిమంత్రపు సిరి వచ్చేసరికి నెత్తికెక్కేది.
నలుగురి మధ్య ఇంగిత జ్ఞానం లేక ప్రవర్తించేది.

14/03/2023.
ఓ సాధింపు.
మనలొని ఓర్మికి  పెద్ద పరీక్ష.
మరీ హద్దులు మీరితే , తనకు తానుగా వేసుకున్న శిక్ష.

ఓ పుస్తకం
కొందరికి  అందమైన హస్త భుాషణం.
కోరిన వారికి కొదవలేని జ్ఞాన భండారం.

21/03/2023. (పంపినది).

ఓ కల .
తీరని కోరికలను తీరుగా చుాపించే కమ్మని స్థితి.
తీరిన నిద్రతో తిరిగి పొందలేని ఆనందానుభుాతి . 





మహిళ.

23/02/2023.
మహిళా దినోత్సవం పురస్కరించుకొని *మనోహరి మహిళా మాసపత్రిక* కొరకు

ఆర్టికల్ ....
అంశం:* అన్ని రంగాలలో మహిళలు మాత్రమే బాస్ లు అయితే..

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


నాడు ,
నాలుగు గోడల మధ్య  సాంప్రదాయాల ముసుగులో 
తన అస్ఠిత్వాన్ని కోల్పోయిన మహిళ - 
నేడు ,
అనేకమంది సంఘ సంస్కర్తలు, స్త్రీలకు సమాన హక్కులు కల్పించే దిశలో  కృషి చేయడంతో ,
భారతదేశంలో మహిళల చరిత్ర కీర్తి కిరీటాల సమాహారమయ్యింది.. 
ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి కూడా ఒక మహిళే కావడం  విశేషం.

పురుషునితో సమానమైన  ,హక్కులను సాధించిన స్త్రీలు 
పురుషుని కన్నా కొన్ని రెట్ల ప్రతిభను కనబరుస్తుా ఇంటా బయటా కుాడా తమ విధినిర్వాహణలో  తమదైన స్థాయిని పటిష్టం చేసుకోవడమేగాక పురుషులను
అధిగమించడంతో, స్త్రీ శక్తి అన్ని రంగాల లోనుా ప్రపంచ వ్యాప్తంగా విజయపథంపై నడుస్తుా తమ "సత్తా" ను చాటుకుంటోంది 
ప్రపంచంలో ప్రతి మహిళా ఆమె ఎదుర్కునే పరిస్థితులు ఎటువంటివైనా కానీ తను కన్న కలలు నిజం చేసుకోవడం లేదా చేద్దామనుకున్న పనులు చేసి తీరగలదు.
 వివిధ రంగాలలో మహిళలు  దేశ సమానత్వానికి ,
 అభివృద్ధికై కృషి చేస్తుానే ,చాలా దూరం వచ్చి అనేక రంగాల్లో తమ సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నారు
మానవత్వం నశించిన , నేటి స్వార్ధపుారితమైన  ప్రపంచంలో 
స్త్రీలే   "బాస్ లు ఐతే వారు సాధించే విజయాలు ఎన్నో...
అమ్మగా, ఆలిగా  అక్కగా చెల్లిగా ఇంటి ఆడపడుచుగాతమ బాదర్యతలను నిర్వర్తిస్తున్న స్త్రీలు నేడు రాజకీయపరంగా 
పుార్తి ప్రపంచాన్నే పరిపాలించగలిగినంత ఎత్తుకు ఎదిగారు.
సంగీత ,సాహిత్య, క్రీడా, రాజకీయ రంగాల లోనే కాక,
విద్యా ,వైద్య ,కర్షక ,కార్మిక ,సిపాయి ,సైన్య ,రంగాల లో తమ శక్తిని తాము నిరుాపించుకొని  ,వీరత్వాన్ని , ధైర్యాన్ని ప్రదర్శించ గల సాహసవంతులు స్త్రీలు .
ప్రస్తుత సంక్షోభిత సమయంలో సామాజిక మార్పుకు సారథ్యం వహిస్తూ, ప్రత్యేకంగా నిలిచిన మహిళలు
ఎంతోమంది ఉన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఖగోళ శాస్త్రం, రాజకీయాలు, క్రీడల వరకు, మహిళలు ప్రతి వృత్తిలో ఒక ప్రమాణాన్ని సాధించి.  తమ విజయాలతో భారతదేశాన్ని గర్వించేలా చేసిన టాప్ మహిళలున్నారు.
మహిళలే ప్రపంచానికి బాస్  అయితే...
బ్రిటన్ దేశంలో వేసవి సెలవుల్లో బడి పిల్లలకు ఉచితంగా ఆహరం ఇవ్వాలని  వేసిన పిటిషన్ వెనక ఉన్న ఒక క్రిస్టినా కాగలదు.. 
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి  చెందిన  ఇందిరా గాంధీ  ,భారతదేశపు మొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా  పనిచేసిన ప్రధాన మంత్రి కాగలదు..  
  భూమికి చేరే చివరి క్షణంలో  ఫ్లైట్లో  సాంకేతిక కారణాల వల్ల మరణించినా "నేటికీ  నేషనల్ హీరోగానే
పరిగణింపబడుతుా"  భారతీయ సంతతికి చెందిన మొదటి అమెరికన్ వ్యోమగామి ఇంజినీర్ గా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళ..
కల్పనా చావ్లా" కాగలదు.
 "భారత మహిళల క్రికెట్ జట్టుకు టెస్ట్ ,వన్డే కెప్టెన్. ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి."మిథాలీ రాజ్" కాగలదు.
ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి మహిళా ఫ్లైయింగ్ ఆఫీసర్ "అంజలి గుప్తా".
మొట్టమొదటి సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తి "ఎం.ఫాతిమా బీవి".
ఇండియన్ ఎయిర్ లైన్స్, మొట్టమొదటి మహిళా పైలట్ "దుర్గా బెనర్జీ". కాగలదు
యుద్ద విమానంలో మొట్టమొదటి మహిళా పైలట్ "అవని చతుర్వేది"కాగలదు 
మొదటి మహిళా ముఖ్యమంత్రి "సుచేత కృపలాని" కాగలదు.
భారత మొదటి మహిళా ఐ.ఎ.ఎస్‌. అధికారి "అన్నా జార్జి".
ప్రపంచ బాక్సింగ్‌ పోటీలో గెలుపొందిన భారత మొదటి మహిళ "మేరీ కోమ్‌"
భారతదేశపు మొదటి మహిళా ఆర్మీ కెప్టెన్‌" లక్ష్మీ సెహగల్‌"
ఎవరెస్ట్‌ను అధిరోహించిను భారత మొదటి మహిళ "బచేంద్రిపాల్‌" కాగలదు .ఇలా ఎన్నో రంగాలలో స్త్రీలు నిష్ణాతులు కాగలరు.
ఇలా చెప్పుకుంటుా పోతే భారతదేశపు కీర్తి కిరీటంలో" కలికి తురాయిలై "  కాలగమనంలోమరుగు పడిన అట్టడుగు వర్గాలకు చెంది , గుర్తించబడని  మహిళలు ఎందరో ఉన్నారు. 
అన్నిటా తామై, అన్ని రంగాలలో తామై, సృష్టి కి ప్రతి సృష్టి చేస్తున్న స్త్రీ శక్తిని , అంచనా వేయడం కష్టతరమే.
ఒక  స్త్రీ  ప్రపంచానికే  బాస్ అయితే
అమ్మ ప్రేమ నందించడంతో పాటు అందరినీ  సమాన దృష్టి తో పాలించి దేశాన్ని, దేశ ప్రజలను  ఉన్నత స్థితికి తేవగలదన్న మాట మాత్రం అక్షరాలా నిజం అనడానికి ఏమాత్రముా సందేహం లేదు. ..


హామీ :
ఈ ఆర్టికల్ నా స్వీయ రచన.






+++++++++++++++++++++++++++++++++