మహతీ సాహితీ కవి సంగమం.
ధనుర్మాస కవితోత్సవములు.
అంశం : రామాయణ మహా మాల.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
మకుటం : జగదభి రాముడు శ్రీరాముడు.
1.
వాల్మీకి రాసిన రామాయణమ్మిది
జపియించరే జనులు జన్మ తరియింప
కల్మషమ్ముల వీడి కనరె కైవల్యము
రామ చంద్రుని గాధ రసపు గుళికిలను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
2.
రామ కథామృత పానము సేయరె
దారుణ భవ సాగరమును దాటరె
ఆనందామృత మయ రస భరిత
ధర్మ కర్మల అద్భుత చరిత ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
3.
పావన సీతా-రామ కధ
పురుషార్ధములిడు పుణ్యఫల చరిత ॥
తల్లిదండ్రులను గారవించెడి గాధ
అనుజుల ప్రేమ ననుభవించెడు బోధ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
4.
అయొాధ్య పురమేలు ఆదర్శ పురుషుడు
ధశరధ నాముడు ధర్మ పాలకుడు
రాణులు మువ్వురౌ రాజశేఖరుడు
సంతాన హీనుడు సత్యవ్రతుండు ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
5.
యజ్ఞ ఫలమునను యశశ్వులైనట్టి
నలుగురు పుత్రుల నమ్మిక గనెను
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులనువారు
వేద విద్యలు నేర్చి వెలిగిరా బాలురు ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
6.
దశరధ కౌశల్య ప్రియ నందనుడు
భరత లక్ష్మణ , శత్రుఘ్నాగ్రజుడు
అదర్శ పురుషుడు శ్రీ రఘు రాముడు
వైకుంఠ ధాముడు హరి నారాయణుడు॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
7.
పరశురాముని గర్వమణచి బ్రోచినవాడు
వర శివ ధనుసును ద్రుంచినట్టీ ఘనుడు.
జనకజ సీతను పరిణయమాడిన
జగదాభి రాముడు వర శుభ కాముడు ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....
8.
తక్లి కోరిక దీర్చ తల్లడిల్లినవాడు
తండ్రి మాటను నిలుప శిరసు వంచిన ఘనుడు
పదునాలు గేండ్లు విధి వనవాసము జేయ
వల్కధారియై వనము కేగిన వాడు ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....
9.
జగముల రక్షంప జనని కోరిక దీర్ప
జనకు నాజ్ఞ గొని జగదభి రాముడు..
అవనిజ సీతతో అనుజు లక్ష్మణు గుాడి
యడవులకేగేను యతి రామచంద్రుడు॥
(యతి అర్ధం : స్వసంగ పరిత్యాగి )
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....
10.
చిరుత ప్రాయము నాడె
వన రక్కసుల దునుమి
కౌశికు మఖ సంరక్షణ జేసి
తాటకాసురి జంపి ,ఋషి మునుల గాచేటి ,
శ్రీరామచంద్రుడు శ్రిత జన పాలకుడు ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....
11.
ధర శిల రుాపాన యున్న అహల్యకు
శాప మొచన జేసి సౌఖ్యమును నొసగేను ॥
కరశరము ధారియై ఖలు సంహరము జేసి
ముని జనుల గాచేటి సద్ధర్మ నిరతుడు ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
12.
గుహుని సాయంబున గంగను దాటి
చిత్రకుాటమును చేరగ నెంచి
భరతుని శోకము దీర్చి దీవించి
పాదుకలొసగిన పరంధాముడు ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
13.
చిత్రకుాటమును చేరిన రాముడు
మాత్ర శరములాసురులను గుాల్చెను .
మునులకు మిత్రుడై అభయము నొసగెను
ఆపద్బాంధవు డాపదలు బాపెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
14.
లంకాసురుడగు రావణు సోదరి
సుార్ఫణకాసురి రామచంద్రుని కోర
నాసిక కోసిన సౌమిత్రిపై రగిలి
మాత చేబట్టమని మారీచునంపెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
15.
మారీచుడది విని మాయలేడిగ మారి
సీతమ్మ ముంగిట చిందులు వేసెను.
మాయలేడిని గాంచి సీతమ్మ మురిసేను.
బంగారు లేడికై రామని పంపెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
16.
సీతమ్మ కోరిన కోర్కె దీర్చగ దలచి
రాముండు హరిణమును వెంబడించగ వెడలె
మాయావి రక్కసుడు మాటు వేసీ పొంచి
రామునితొ తలపడె రక్కసుడు మితి మించి ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
17.
సమయము మించెను జానకి వగచెను
రామచంద్రుని వెదుక లక్ష్మణు కోరెను.
లక్ష్మణుడా మాట మన్నించి వెడలుచు
గీత దాటుట వలదని మాట మంచిగ జెప్పె ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
18.
మాయ భిక్షువు వేష ధారియై
రావణు డేతెంచి రమణి చేబట్టె..
గీత దాటిన సీత మదినెంతొ వగచెను
రామచంద్రుని దలచి సీత శోకించెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
19.
రమణిని గానక రాముడు యవనంత
అటు నిటు వెదకుచు ఆతురత పడెను
పక్షి జటాయువు జెప్పిన మాటల..
విషయమ్ము నెరిగెను విచలితుడాయెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
20.
లంకనదె చేర రాముడు దలచెను
రమణిని దలచి దుఃఖితుడాయెను.
రావణుని జంప రాముడు బుానెను
సాగరమ్మును దాట యొాచన జేసెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
21.
ఒరిగిన జటాయు నొడిజేర్చుకొని
విలపించి మనమున విధి క్రియలు జేసెను
పరమపదమును పక్షి జటాయు కొసగెను
జానకీ జాడను వెదకుచు పోయెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
22.
వానర రాజగు వాలిని గుాల్చెను
పట్టాభషిక్తుగ సుగ్రీవు జేసెను
వానర వీరుల సాయము జేకొని
సాగరమ్మును దాట వారధిని గట్టెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
23.
యొాజనములు గల సాగరమును దాట
వానరులెల్లరు వివశులాయెను గాద .
సాగరమును దాటి లంకను జేరెడు
వీరుడెవ్వడని, రాముడు దలచెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
24.
హనుమంతుడను వాడు శ్రీ రామ భక్తుండు
సుగ్రీవ మిత్రుండు ఘన కార్య సుారౕుండు
సీతాన్వేషణ జేయ నెంచెను కపుడు
సంద్రమ్ము దాటంగ సందడించెను గురుడు॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
25.
వీరాధి వీరుడు శ్రీ ఆంజనేయుడు
పవమాన సుతుడు అంజనీ పుత్రుడు
శ్రీరామ కార్యమ్ము జేయ నుత్సాహితుడు
రామ పదములనంటి ఆజ్ఞ కోరెను ఘనుడు ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
26.
జలధిని లంఘించీ జయముల నేలగ
లంకను జేరప నుధధి లంఘించె కపిరాజు
రక్కసి సురసను చతురతతో మెప్పించి
లంక సమీపించె గుణలక్షణుడుా ...॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
27.
లంకను జుాచి లంఖిణి పరిమార్చి
సుందరమౌ లంకాపురిని గాంచీ
సీతాన్వేషణ చేయగ నెంచి
లంకాపురిని యడుగిడె నా కపి ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
28.
అశోక వాటిని అవనిజ గనె కపి
కన్నులు నిండెను కన్నీరు గార్చెను.
రామాంగుళీకము యావాలుగ నిడి
అమ్మ సీతమ్మకు అభయమొసంగెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
29.
రాముని బంటని తెలిసిన జానకి
హనుమంతుని గని యానందపడెను.
రాముని క్షేమము నడిగెను సీత
రయమున రాముని రమ్మనె మాత ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
30.
మాత ఆజ్ఞ గొని మరలెను హనుమ.
మదిని క్రోధమున రగిలెను హనుమ .
తరులను విరిచెను పుాలను నలిపెను.
లంకా శోభను నలిపి చిదిమెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
31.
హనుమను పట్టిన రక్కసు లలసిరి.
కట్టి బంధముల కడకు బంధించిరి.
రావణు దరికి రయమున జేర్చిరి.
హనుమను శిక్షింప ఆగ్రహమిడిరి ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
32.
ధర్మ వచనములు పలుకు మారుతిని
అహమున రావణు డవమానించెను.
వానరయొాధుని వాలము గాల్చెను.
వరుస దుాషణల హనుమను రోసెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
33.
దయమాలిన రావణుని వర్తనకు
హనుమ క్రోధమున రగిలెనుగ్రుడై
వాలము నెగసిన మంటల తోడనె
దనుజపురమును దగ్ధము జేసెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
34.
అసురుల గుాల్చి లంకను గాల్చి
ధరణిజ సీతకు ధైర్యము జెప్పి
రయమున ఎగిరి రాముని చేరెను
కుశలము సీతని శుభములు బల్కెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
35.
ఆనందములో రాముడు తేలెను
హనుమంతుని శక్తిని కొనియాడెను
సీత క్షేమమును తెలిపిన హనుమను
అక్కున చేర్చుకు నానందపడెను.॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
36.
వారధి గట్టిన వానర ముాకతొ
చేరెను లంకకు రాముడు హరితో
రామ- రావణ యుద్ధము జరిగెను
లంకాసురులను గుాల్చిరి సైన్యము ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
37.
ధనువుతొ శరముల వదలెను రాముడు
నేల గుాలె పది తలల రావణుడు
వెలగె విభీషణుడు.లంకా పతిగా
.ఆప్త జనులు జేజేలు పలుకగా ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
38.
జానకి కన్నుల కాంతులు కురిసెను
రాముని మొామున చిరునగవొలికెను
సీతా రాముల జంటను జుాచిన
కపివరులందరు గెంతులు వేసెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
39.
ఆప్త జనులతో అవనిజ చేకొని
జగదభి రాముడు నిజపురి కేగెను.
భరతుని ప్రేమతొ ఆలింగన గొని
పురజనులందరి సేమము నడిగెను॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
40.
తల్లులు మువ్వురి పదముల నంటెను.
గురులకు మునులకు వందన మిడెను .
మధుర వాక్కులిడి మన్నన నొందెను
స్థిరమౌ కీర్తిని భవిపై పొందెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
41.
రామాంకమ్మున రమణి కుార్చుండగ
పార్శ్వములందున అనుజులు చేరగ
రాముని సన్నిధి ఋషులు నిలువగ
మారుతి రాముని పదముల నంటెగ ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
42.
ఋషులుా మునులుా వరుస దీవింప
పుర జన గణములు శ్రియములు కీర్తింప
వేద మంత్రముల నయొాధ్య రాముడు
పట్టాభిషిక్తుడై పురముల నేలెను ॥
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
------------------------
ఓం తత్ సత్ ....
శాంతిః శాంతిః శాంతిః ॥