Tuesday, June 27, 2023

పద్యాలు. ( మొత్తం).



అంశం : శ్రీ క్రిష్ణుడు.

శీర్షిక : శ్రీ క్రిష్ణ  శరణం మమ ॥

ప్రక్రియ : ఉపేంద్రవజ్ర.


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్  :  మహారాష్ట్ర .

ఉపేంద్రవజ్రకు గణములు-

IUI    U U I    IUI      U U 

జ-      త-      జ-     గ-గ


నమొాస్తు  శ్రీకృష్ణ నరాయ ణాయా.

నమొాస్తు నందాత్మ జబాల కాయా.

నమొాస్తు లీలాది విహార పారా

నమొాస్తు శ్రీశాయ సుబాల కాయా ॥ 


నమొాస్తు  దేవాది భిరర్చి తాంఘ్రీం.

నమొాస్తు శాంఖాయు ధచక్ర పాణీం .

నమొాస్తు శ్రీవత్సస వక్ష సాయాం 

నమొాస్తు గోపీ జనపాల మేయం   ॥


నమొాస్తు క్రిష్ణంవర రుాపనంతం

నమొాస్తు భక్తాశ్రిత పారిజాతం .

నమాస్తు గోపీజనలోల బృంగం.

నమొాస్తు వేణుా స్వర గీతలోలం ॥


వికుంఠ వాసాయ అకుంఠ తీర్థం.

సుపాండ వాపక్ష సుపార్ధ మిత్రం.

సుగీత బోధాత్మక  దివ్య గాత్రం 

నమొా నమః శ్రీ పురవేనమస్తే ॥


సమస్త లోకైక సురక్ష కుక్షీం

సమస్త భక్తాగ్రజ  సేవితాక్షాం

సమస్త  సౌభాగ్య సుమంగ ళాయాం

సమస్త భుామండల నాయకాయాం ॥


అనంత శ్రీశేష శయాంగ నాయాం

అనంత సంకల్ప వికల్పనాయాం

దిగంత వ్యాప్తాయ దివాకరాయాం

దశాది రుాపాయ దయాపరాయాం ॥


సునీల దేహాయ శుభాంగ నాయాం

సువేణు నాదాయ సుగాత్ర మిత్రాం

సుహేమ భుాషాది సుశోభి తాయాం॥

సుభక్త పోషాయ సుదివ్య చిత్తాం॥


చతుర్భు జాయాయ సనాత నాయాం

అనంత నంతాయ అమొాఘకాయాం

మధుర్వనే బృంద వనే విహాయాం

వ్రజ జ్జనానందన నంద బాలాం ॥


తమాల భుాషాతులసీ ప్రియాయాం

సుపీత వస్త్రాది  సుదివ్య నేత్రాం   

చిదంబ రానంద  చరాచరాయాం

శమంత కాదివ్య మణి ప్రకాశాం ॥


కుచేలపాలం బహుబంధు మిత్రం 

సుసచ్చిదానంద  సుదివ్య  క్షేత్రం 

కురుాప కుబ్జాది సురుాప దాతం

నమొాస్తు శ్రీనీల ఘనాయ శ్యామాం  ॥


*****************************



శ్రీరాజ  రాజేశ్వరీ " స్తోత్రం .

ఛందస్సు : ఇంద్రవ్రజ.

గురు శంకరాచార్యుల ఛందస్సు వైభవము

ఇంద్రవజ్రకు గణములు- త-త-జ-గ-గ, 

ప్రక్రియ : శ్లోకం.


రచన : శ్రీమతి : 

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్. : మహారాష్ట్ర .


---------------------

1.

మాతామ హారాజ్ఞి మతంగ కన్యే

శ్రీమన్మ హాదేవ  సుభాంగపర్ణే. 

శ్రీరాజ  రాజేశ్వరి వంద్యమాన్యే

పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥

2.

కస్తూరి  కాశ్యామల కోమలాంగే

శ్రీమన్మనోజ్ఞే  శ్రితపాద యుగ్మే

శ్రీరాజ రాజేశ్వరి రక్షసఘ్నే (చారు హాసే).

పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥

3.

వందే శుభాంబిక శ్రితాశ్రితాయే

చతుర్భుజే శంకరు వల్ల భాయే 

శ్రీరాజ రాజేశ్వరి దివ్య ముార్తే

పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥

4.

కాదంబ వాటీ కమలాలయాయే..

కస్తుారికా దివ్య సుగంధ మాల్యే

శ్రీరాజ  రాజేశ్వరి శ్యామలాంగే

పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥

5.

కామాక్షి  భుామండల నాయికాయై

వామే స్థితేశంక రురాణి మాన్యే

శ్రీరాజ  రాజేశ్వరి చిత్స్వరుాపే

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

6.

వాణీ రమా సేవిత పాద పద్మే

బ్రహ్మేంద్ర దేవాదిభి రర్చితాంఘ్రే

శ్రీరాజ  రాజేశ్వరి సిద్ధి ధాత్రే 

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

7.

అవ్యాజ కారుణ్య రసప్రవాహే..

ఆనంద కైలాశ గిరీసు నందే

శ్రీరాజ  రాజేశ్వరి సుదుర్ల భాయే

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

8.

క్షేత్ర స్వరుాపే ధర దైత్య దుారే

ఉన్మేష ణాక్షీ కృతకర్మ సారే 

శ్రీరాజ  రాజేశ్వరి సుయజ్ఞ రుాపే

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

9.

శ్రీవేద వేద్యే స్థితి కారణేభ్యే

యంత్రస్వ రుాపేసు స్వతంత్ర రుాపే  

మాతేన వావర్ణ సుబిందు పుార్ణే

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

10.

చింతామ ణిద్వీప త్రికోణ మధ్యే

శ్రీచక్ర  మధ్యస్థి తమంత్ర మాన్యే

హేబిందు రుాపే స్థిత సింహ వాహే

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥


అంశం : పద్యాలు (ఐచ్ఛికం ).
ప్రక్రియ : మత్త కోకిల .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .

శ్రీల నిచ్చెడు కల్ప వల్లివి సింహ వాహిని శాంకరీ.
వేల రుాపము లేలు తల్లివి వేల్పు కొలువౌ శ్రీకరీ
ముాల మంత్రిణి,మొాక్ష రుాపిణి,మొాహ మాయ వినాశినీ
బాల , శ్రీ లలితాంబ చిద్ఘని భక్త సంకట మొాచనీ ॥

అమ్మ నీవని నమ్మి యుంటిని ఆది శక్తి పరాత్పరీ.
నిమ్మళమ్మగు భక్తి తోనిను నిష్ట గొల్చెద నీశ్వరీ  ॥
రమ్మ నంటిని జాగు సేయక రావె శ్రీ జగదీశ్వరీ
ఇమ్మ నీవభయమ్ము మాకిల ఈప్సితావర దాయినీ ॥

జోత లెట్టెద చిద్ఘనీ శుభ జ్యోతి చక్రని వాశినీ.
ప్రాతః కాలపు పుాజలందవె పార్వతీ గుణ భాసినీ
యాతనింకను తాళజాలను యామినీ జన మొాదినీ
మాత శ్రీ లలితాంబ బ్రోవవె మాత మంగళ రుాపిణీ ॥

ముండ మాలిని దుర్గ నాశిని ముక్తి మొాక్షస్వ రుాపిణీ
ఛండ ఛండిక రుాపిణీ సుప్రచండ తాండవ మొాదినీ
అండ నీవుగ మమ్ము బ్రోవవె  ఆర్త త్రాణ  పరాయణీ.
భండ దైత్య విదారిణీ భవ బంధ దుఃఖ విమొాచనీ ॥

భక్తి గొల్చెడు వారి బ్రోచిన  భాగ్య మంగళ రుాపిణీ
యుక్తి రుాపము లెన్నొ దాల్చిన శక్తి శంకరు కామినీ ॥
సుాక్తి సుందరి శాంత రుాపిణి సుార్య తేజ ప్రకాశినీ
ముక్తి నిచ్చెడు మార్గ దర్శిని ముాక దైత్య వినాశినీ ॥



Monday, June 26, 2023

చిత్ర కవిత. (చిత్రం: అక్షరాలకు రెక్కలు వచ్చాయి).

[26/06, 8:05 pm] JAGADISWARI SREERAMAMURTH: 26/ 06 /2023.
మహతీ  సాహితీ కవి సంగమం.

చిత్రకవిత -

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


అక్షరాలు నిండిన పుటలలో
అవని నుండి ఆకాశం వరకు నిండి ఉన్న విజ్ఞానం.
దేశ విదేశాల సంస్కృతి సంప్రదాయాల నెరిగించే 
జ్ఞాన పరమైన విషయ సంపదల  సారం !!

మానవ మేధకు పదును  పెడుతున్న విజ్ఞానం
మనసు పుటల్లో మనిషి భావాలకు రెక్కలొచ్చిన వైనం
 అంతరిక్ష ప్రయాణం చేయిస్తున్నా ఆకాశ విహంగం
ఆశల తీరాలకు చేరాలన్న ఆశయాలకు ప్రతిరూపం!!

అక్షరాల బాట లో సాగిన అనంత విశ్వం.
విశ్వం వేటలో దాగిన  చతుర్వేద విజ్ఞానం.
రేయింపవళ్ల  రెక్కల కష్టానికి లెక్కకు రాని
బ్రతుకు పోరాటాలకు బంధీలవుతున్న అక్షర కన్యల ఆక్రోశం !!

ప్రకృతి  నిండిన పచ్చదనంలో జన జీవ చైతన్యం.
జాతి భేదాలు తెలియని మానవ మేధస్సు-
 పెడుతున్న పదునుకు ,మెదడులో ఆత్మవిశ్వాసం.-
 అణగారి పోతున్న అంతర్మధనానికి తార్కాణం!!

 రాజ్యాంగం రణనీతులకు  రగిలిపోతున్న న్యాయం.
విదేశాలకు అమ్ముడుపోతున్న దేశ సంపదల 
దౌర్భాగ్యానికి నలిగిపోతున్న  వ్యవస్థల పరిణామం
బ్రతుకు పోరాటాల బాటలో చితికిపోయిన జనం-!!
ఏబీసీడీల యాసతో నిండిన విదేశాలకు  ప్రయాణం !!

వెన్నుపోటు వెతలతో తల్లి భారతి తడబాటు..
భరత భవిత గ్రహ పాటుకు మాతృభూమి ఎడబాటు!!


*****************************************
[26/06, 8:29 pm] +91 94418 71767: 3️⃣7️⃣
రాజ్యాంగం రణనీతులకు  రగిలిపోతున్న న్యాయం.
విదేశాలకు అమ్ముడుపోతున్న దేశ సంపదల 
దౌర్భాగ్యానికి నలిగిపోతున్న  వ్యవస్థల పరిణామం
బ్రతుకు పోరాటాల బాటలో చితికిపోయిన జనం-!!
ఏబీసీడీల యాసతో నిండిన విదేశాలకు  ప్రయాణం !!

అంటూ తమరు వ్రాసిన కవిత చాలా చాలా బాగుంది మేడం 🙏🙏🙏

Friday, June 23, 2023

కవి కాని కవి వేదన ( కవిత).

05/05/2023.
"కవన కిరణాలు " లో
నాలుగవ సంకలనానికై రాసిన వచన కవిత..
శీర్షిక : కవి కాని , కవి వేదన .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

అంతరంగంలో రేగుతున్న అలజడి
నాలో అంతరాత్మను చిత్రవధ చేస్తున్న సడి.
కవిగా నా మస్తిష్కం లో కదులుతున్న భావాలు-
అణచిపెట్టిన నా పిరికితనానికి ప్రతి రుాపాలు ॥

కాగితంమీద నా కలం కురిపిస్తున్న అబద్ధపు-
 అక్షరాల, ఆక్రోశం నిండిన ఆక్రందనలు .
ఉన్నది ఉన్నట్టు రాయలేని నా పిరికి తనానికి
కవితాత్మకమైన  కన్నీటి సాక్ష్యాలు॥

అడ్డ త్రోవలో అడుగులేస్తుా అక్షర కన్యలను
మానభంగం చేస్తున్న నా దౌర్జన్యానికి  .,
నా ఎదురుగా కుప్పలుగా పడున్న ప్రసంసాపత్రాల-
 వెకిలి వేళాకోళాలు, నన్ను నిలదీస్తుా ప్రశ్నిస్తున్న 
 తిరుగుబాటుకు ప్రత్యక్ష  సాక్ష్యాలు॥

జరుగుతున్న  అక్రమాలను ప్రశ్నించలేని తనం ,
నాలో జారిపోతున్న విలువలకు -
వలువలుాడదీసిన వైనం.-
సమాజ హితాన్ని కాంక్షించే కవిగా ఎదగలేని
నా నిస్సహాయతకు , నాలో జరుగుతున్న అంతర్మధనం ,
నాలో నిజయతీని, నమ్మలేని నిజానికి సాక్ష్యం  ॥

మీకు తెలీని నిజమేంటో తెలుసా....
బాహ్య ప్రపంచంలో గొప్ప" కవిగా " 
గుర్తింపబడుతున్న నన్ను ,నా అంతరంగ 
"న్యాయ పీఠం" అబద్ధాల కవిగా,
 నన్నేనాడో ఉరితీసేసింది .

హామీ :
ఈ కవిత నా స్వీయ రచన .

Wednesday, June 21, 2023

నందమూరి తారక రామారావు ...కవిత

04/06 /2023 .
ఆర్ట్ ఫౌండేషన్  వారు నిర్వహించు
 "నందమూరి తారక రామారావు" గారి 
 శతజయంతి ఉత్సవాలు. 
 "సంకలనం" కొరకు
 ప్రక్రియ  : కవిత
అంశం : నందముారి తారక రామారావు.

శీర్షిక  : తారక రాముడు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


ఒక తార నింగికెగసింది.
ఒక కన్నీటి బొట్టు ఉధృతమై పొంగింది.
 కళాలోకం స్థంభించిపోయింది
మరపు రాని మహా నటుణ్ణి కోల్పోయింది ॥

తారక రామారావు తిరిగి రాడు.
స్మారక చిహ్నాలకు జన్మ లేదు.
మేలైన కాంతి మణులకు "వెల" లేదు.
మణి కాంతులు విరజిమ్మని చోటు లేదు.॥

నవరసాలను పొిషించే నాయకుడు
భావ వ్యక్తీకరణల మేటి పాలకుడు ॥
తారక మంత్రరాజ భుాషణుడు
రామారావను పేర జగత్ప్రసిద్ధుడు ॥

విల్లు పడితే  అందాల రాముడు.
మురళి నుాదితే  అల్లరి  క్రిష్ణుడు.
పది తలల భారం మొాసే రావణాసురుడు.
పలు  రుాపాలకు ప్రాణం పోసే జీవకుడు.॥

నట సార్వ భౌమునిగా మంచి దర్శకుడు.
భాషాభి వృధ్ధికై పాటుపడిన భావుకుడు.
విన్నుాత పథకాల విశ్వ మేధావతడు
తెలుగు బిడ్డలకన్నగా అత్మ బంధువతడు ॥

తెలుగు వారి గుండెలో    
 ముఖ్య మంత్రి పదవితో 
 చిరస్థాయిగా నిలిచిపోయిన  
 జాతి రత్నమతడు..॥
----------------+
హామీ :
"తారక రాముడు" శీర్షిక గల 
ఈ కవిత నా స్వీయ రచన.

Tuesday, June 20, 2023

గుడి లేని దేవుడు. కవిత

17/06/2023.

మనుమసిద్ధి  కవన వేదిక ,
శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా..
వచన కవితల పోటీ కొరకు ,
అంశం :  నాన్న చిటికెన వేలు.
శీర్షిక : గుడి లేని దేవుడు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


అమ్మ మనకు జన్మనిస్తే -
ఆ జన్మకు, జీవితాన్నిచ్ఛేది నాన్న!
అమ్మ ప్రేమ, ఆకాశమైతే -
నాన్న ప్రేమ , అనంతం.!
అమ్మ ఒడి ఒక ప్రపంచం అయితే ,
 ఆ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది నాన్న!
అమ్మ  ఒడి ఒక  బడైతే -
ఆ బడి వైపుకు వేసే -
అడుగుల ఆసరా నాన్న!
అమ్మ అన్న పదం నా తొలి పలుకైతే-
ఆ పదానికి అక్షర శ్రీకారం నాన్న.!
తడబడే అడుగులకు మార్గదర్శకం నాన్న.
కష్టంలో నేనున్నానన్న భరోసా నాన్న .!
జీవిత అవసరాల  అంగడి నాన్న. 
అడుగడుగు విజయాలకు ఆసరా నాన్న !
 నేను గెలిస్తే గర్వపడేది నాన్న .
 ఓడిపోతే  వెన్ను తట్టి ఓదార్చేదీ  నాన్నే !
 అమ్మ మనసు వెన్న అయితే 
ఆ వెన్న కాచితే వచ్చే నేతి సుగంధం నాన్న!
అమ్మ మనకు చందమామను చూపిస్తే
మా చందమామ పంచే వెన్నెల వెలుగు నాన్న !
ఆనందమే జీవితమైతే 
ఆ ఆనందానుభూతిని పంచే నిత్య శ్రామికుడు నాన్న !



ఈ కవిత నా స్వీయ రచన

Monday, June 19, 2023

శీర్షిక : నా ఉనికి చిరునామా


మనోహరి పత్రిక  మరియు తపస్వి మనోహరం వారి" "నాన్నకు ప్రేమతో" కవితల లింక్.

https://thapasvimanoharam.com/nannaku-prematho/

కళింగ రచయితలు వ్రాసిన రచనలు కూడా e-book లో జత పరచాము.  పై లింక్ ఓపెన్ చేసి మీ కవితలు చూడవచ్చు.


68వ పేజీలో నేను రాసిన కవిత .

Saturday, June 17, 2023

రుబాయిలు

13/06/2023.

మహతీ సాహితీ కవి సంహమం .

ప్రక్రియ :  రుబాయిలు.....

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

తొలిసారి నినుజుాడ మది రేగె కలకలం  .
మలిసారి నిను గుాడు కల లేగ ప్రతిక్షణం.
ఈనాటి మనబంధ మేనాటి దోకదా..
నినువీడి మనలేని మదిలోన కలవరం

 నా ప్రేమ జల్లులే మేఘమై  కురియాలి
నీ వలపు, బంధమే  వెన్నెల్లు  పంచాలి
 ఆవేల్పు లండగా  ఆశీస్సు లీయగా 
మనజంట  పంటగా  పుావులై విరియాలి ॥


శీర్షిక : అనుభవాల పాఠశాల. కవిత

14/06/2023.
అంశం: స్నేహం.
శీర్షిక  : అనుభవాల పాఠశాల.


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


ఒక మనిషి తన ఆశయాలను సాధించాలన్నా 
  ఉన్నత స్థితికి ఎదగాలన్నా , నలుగురిలో మన్ననలు పొందాలన్నా , ముఖ్య భుామిక స్నేహితులదే ॥
  
నిజమైన స్నేహం , మన  కష్టాల్లో , ఇష్టాల్లో , కన్నీళ్ళ లో,
కలిగే ఆనందంలో కుాడా, పాలుపంచుకుంటుంది.
గుండె నీదైతే , ఊపిరి తానంటుంది.
  
  మన స్నేహితులు మన గురించి చెప్పిన ప్రతీ మాట కుాడా 
  ఎదుటివారిపై ప్రభావం చుాపించడమే కాక, 
 వాళ్ళు  మన వ్యక్తిత్వాన్ని  అంచనా వేసి ఆదరించడమొా..అవహేళన చేయడమొా 
 నిర్ణయించుకొనే స్థితికి తీసుకు వెళుతుంది.॥
 
 మన మెంత మంచివాళ్ళమైనా , 
 మనతో గడిపే మన స్నేహితుల మాటలనే 
 జనం నమ్ముతారు. ఎందుకంటే  స్నేహం అంటే
 మనలో మరో మనిషిగా  , నమ్ముతారు కాబట్టి.॥
  
నిజమైన స్నేహం ...
.మనలో నిస్పుృహను దుారం చేస్తుంది. మన బాధను
 తన  భాధగా భావించి , మనకు తగిన చేయుాత నిచ్చి 
మన  అస్థిత్వానికి ఆసరా అవుతుంది.

కొంత మంది మన అసహాయతను ఆసరాగా చేసుకొని
అందలాలు చేరుకుంటారు.
మరి కొంతమంది మన అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని అణగదొక్కేస్తారు.
 స్వార్ధం నిండిన  కొందరు  మన అవసరం తీరేకా
 నలుగురిలో అవమానించి అడ్డు తొలగించుకుంటారు.
 అదీ...ఎంతో  చాకచక్యంగా....
 అవన్నీ మనకు జీవిత గుణపాఠాలౌతాయి
 ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు  దోహదమౌతాయి..
 స్నేహం ముసుగులో,  మనసు మలినాల్ని కప్పిపుచ్చుతున్నారు చాలా మంది.
 ఇది కుాడా ఒక రకంగా బ్రతుకు తెరువే ...
 వారి ఉన్నతిలో భాగమైనందుకు  మనం ఆనందపడదాం.
 
 మరి కొంతమంది కొన్ని పరిస్థితులో దుారమైనా 
వారి మనసుల్లో మనం స్థిరమై ఉంటామని 
మనకు తెలుసు. ఎందుకంటే స్నేహం మీద మనకున్న నమ్మకమది.

నాకున్న స్నేహితులలో  కొందరు నన్ను  
కలలో కుాడా ఊహించని రీతిలో ప్రోత్సహించేరు.
 నాలో ఉన్న  , సంగీత - సాహిత్యాలకు ప్రాణం పొిసేరు.
కొందరు నన్ను  కావ్య కవన ప్రపంచానికి 
పరిచయం  చేసి కవిగా ప్రోత్సహించేరు..

వారిచ్చిన స్ఫుార్తే ఈ రోజు నా ఉత్సాహానికి ఊపిరై ,
ఎన్నో పద్య , గద్య , సంగీత , సాహిత్య  విహారాలకు
 యానమై , సాహితీ ప్రపంచంలో విహరింపజేస్తోంది.

వారివల్లే నేను నా వంటింటి గడపదాటి , వరుస
కథా, కవన దారులవెంట , కలం చేయి బట్టి అడుగులేస్తుా
నా భావాల గతుల్ని , కాగిత పుటలపై గుప్పించగలుస్తున్నాను.

ఒడిదొడుకుల జీవిత బాటలో, ముళ్ళ కంపలే కాదు
పరిమళించే పుాల తోటలు కుాడా  ఉంటాయన్న సత్యం ..
ప్రతీ స్నేహానికీ మధ్య తెలుకుంటుానే ఉన్నాను.
స్నేహాన్ని  కించపరచేంత  ఎత్తుకు నేనింకా ఎదగలేదు
జీవిత ప్రయాణంలో ఎన్నో మజిలీలు .
ప్రతీ మజిలీ ,మనకొక పాఠశాల .వంటిదే..
అక్కడ నేర్చుకున్న విద్యతో, ముందడుగు వేయాలే తప్ప, వెనకడుగు వేయకుాడదని తెలుసుకున్నాను.॥

ఎందుకంటే...
ప్రతీ సంఘటన వెనకాతల మనం మన వ్యక్తిత్వం , 
మన అజ్ఞానం , మన అవివేకం , మన మాట తీరు, 
 మన నడత జోరు కుాడా ఉంటాయి .
 అందుకే మన బాధకు గానీ, మన ఆనందానికి గానీ ,
 మనకు మనమే మిత్రులం, లేదా శత్రువులం .॥

జీవితం , సముద్రంలో నావైతే, మన బ్రతుకు, ఆ నావలో 
ఒడుదుడుకుల ప్రయాణం వంటిది.
తీరం చేరుతామొా, లేదో, తెలియని స్థితిలో 
మనతో ఉన్న కొందరు  హితులు ,స్నేహితులు కుాడా,
యుక్తి బలంతో తీరం చేరుకుంటారు. అది వారి ఆత్మరక్షణ పోరాటం.
మరి కొందరు , వారిననుసరించి  అలల పై మునుగుతుా తేలుతుా  ఎటుా  చేరలేని స్థితిలో ఉంటారు.
చాలా తక్కువ మంది మాత్రం, ఆదే నావలో చాలా దుారం ప్రయాణించే సాహసం చేసి, నిశ్ఛలమైన నీటి బాటను చేరి ,
 నిచ్ఛితమైన నిర్భయ పయనం సాగిస్తారు.

అందికే నేనెవ్వరి పేర్లుా చెప్పదలచుకోలేదు.

పుాలలో పరిమళం దాగనట్టే, మంచి చేసినవారి వ్యక్తిత్వం ,
మందికి  తప్పక  తెలుస్తుంది   
అది మనకు మంచి నడవడిక నేర్పుతుంది.
వీరినెప్పటికీ మర్చిపోలేం.

మురికి కంపుకు ముక్కు ముాసుకున్నట్టే ,చెడ్డ వారి ప్రవర్తన
 మనలో  మంచి ఆలోచనలకు పదునుపెట్టి ,మంచికి బాటకు మార్గదర్శక మౌతుంది.
వీరినీ మర్చిపోలేం.॥

 ఒక్కటి మాత్రం చెప్పగలను .
 మనని మనం ముందుగా తెలుసుకున్న తర్వాతే, 
 ఇతరుల గురించి మనం మాట్లాడే అధికారానికి అర్హుల మౌతాం. ఇది మాత్రం  ముమ్మాటికీ నిజం .
 చీకటి వెనుక వెలుగు ఉన్నట్టే...
చెడు వెలకాలే  మంచి కుాడా ఉంటుంది.
మనకు మంచి జరగాలంటే చెడన్నది మనకు తెలియాలి.
అందికే స్నేహితులందరుా మంచివారే ..
వారే  మన నీర్సం , వారే మన బలం.
ఒకొక్క రీతిలో   నేనేంటో నాకు తెలిపిన నాప్రియ స్నేహితులందరికీ మనఃపుార్వక ధన్యవాదాలు ..🙏


ఇది నా చేదు , తీపి అనుభవాల స్వీయ రచన.





Monday, June 12, 2023

అమ్మా...నువ్వెక్కడ...?

మగువ మహారాణిలో
14/05/2023
అంశం : అవనికి అమ్మే ఆధారం* 
శీర్షిక  : అమ్మా ! నువ్వెక్కడ..?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


అవనిలో అలిగా ,అక్కగా, చెల్లిగా ,
చెలిగా..,అల్లుకున్న బంధాలకు 
ఆత్మీయతను,అనురాగాన్ని పంచి,
విలువలు నేర్పిన కొమ్మ అమ్మ॥

మన ఉనికికి ఆధారం అమ్మ .
 మన నోట తొలి పలుకు అమ్మ .
 మన తొలి అడుగుకు ఆసరా అమ్మ.
అక్షరాలకు అర్ధం చెప్పన తొలి గురువమ్మ. -॥

మన బాటకు మార్గదర్శై, 
మన కష్టానికి తోడై, మన-
ఇష్టాలకు వరమై, నీడలా 
మన వెన్నంటి ఉండి మనలను 
గాచే- ఇల వెలసిన దేవత  అమ్మ ॥
 
 అమ్మ గురించిన కవితలు కొల్లలు
 అమ్మ గురించిన భాష్యాలు వేలు
 మన కవితల్లో  జీవం అమ్మ .
నిజానికి మన స్వార్ధానికి-
 బలౌతున్న బ్రతుకు అట బొమ్మ ॥
 
 నేడు అమ్మలు, గుండెలు పగిలి -
చిందర-వందరైన  గాజు దీపాలు.
వృద్ధాశ్రమాల్లో ఉనికి మరచిన 
బ్రతుకు పొిరాటాల తోలు జీవాలు॥


హమిపత్రం : 
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.

రామారావు కవిత.

04/06 /2023 .
ఆర్ట్ ఫౌండేషన్  వారు నిర్వహించు
 "నందమూరి తారక రామారావు" గారి 
 శతజయంతి ఉత్సవాలు. 
 "సంకలనం" కొరకు
 ప్రక్రియ  : కవిత
అంశం : నందముారి తారక రామారావు.

శీర్షిక  : తారక రాముడు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


ఒక తార నింగికెగసింది.
ఒక కన్నీటి బొట్టు ఉధృతమై పొంగింది.
 కళాలోకం స్థంభించిపోయింది
మరపు రాని మహా నటుణ్ణి కోల్పోయింది ॥

తారక రామారావు తిరిగి రాడు.
స్మారక చిహ్నాలకు జన్మ లేదు.
మేలైన కాంతి మణులకు "వెల" లేదు.
మణి కాంతులు విరజిమ్మని చోటు లేదు.॥

నవరసాలను పొిషించే నాయకుడు
భావ వ్యక్తీకరణల మేటి పాలకుడు ॥
తారక మంత్రరాజ భుాషణుడు
రామారావను పేర జగత్ప్రసిద్ధుడు ॥

విల్లు పడితే  అందాల రాముడు.
మురళి నుాదితే  అల్లరి  క్రిష్ణుడు.
పది తలల భారం మొాసే రావణాసురుడు.
పలు  రుాపాలకు ప్రాణం పోసే జీవకుడు.॥

నట సార్వ భౌమునిగా మంచి దర్శకుడు.
భాషాభి వృధ్ధికై పాటుపడిన భావుకుడు.
విన్నుాత పథకాల విశ్వ మేధావతడు
తెలుగు బిడ్డలకన్నగా అత్మ బంధువతడు ॥

తెలుగు వారి గుండెలో    
 ముఖ్య మంత్రి పదవితో 
 చిరస్థాయిగా నిలిచిపోయిన  
 జాతి రత్నమతడు..॥
----------------+
హామీ :
"తారక రాముడు" శీర్షిక గల 
ఈ కవిత నా స్వీయ రచన.

మనోహరి మహిళా పత్రిక లింక్.

https://thapasvimanoharam.com/weekly-11-06-2023/
*11-06-2023 తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు వార పత్రిక వెబ్సైట్ లింక్..✍️*


లో   ఐ లవ్ యుా హబ్బీ....శ్రీవారికి ..లేఖ

Thursday, June 8, 2023

గణములు ఛందస్సు

*గణాలు-రకాలు*  :-  .

అక్షరాల గుంపును గణము అని అంటారు. ఇవి నాలుగు రకాలు

*ఏకాక్షర గణాలు*


ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు కావచ్చు.

U, U, U

ఉదా: శ్రీ, శై, లం

*రెండక్షరాల గణాలు*

రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1.  *లలము*  2. *లగము* ( వ గణం ) ౩. *గలము ( హ గణం )*  4.*గగము.*

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ లేదా వ IU ఉదా: రమా
గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్


*మూడక్షరాల గణాలు*  :- 

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ ౦, ౧, తీసుకున్న ౦౦౦, ౦౦౧, ౦౧౦, ౦౧౧, ౧౦౦, ౧౦౧, ౧౧౦, ౧౧౧) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు

అన్ని గణాలు:

*ఆది గురువు భ గణము UII*
*మధ్య గురువు జ గణము IUI*
*అంత్య గురువు స గణము IIU*
*సర్వ లఘువులు న గణము III*
*ఆది లఘువు య గణము IUU*
*మధ్య లఘువు ర గణము UIU*
*అంత్య లఘువు త గణము UUI*
*సర్వ గురువులు మ గణము UUU* 

ఇవి మూడక్షరముల గణములు

*ఉపగణాలు* :  

ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు

*సూర్య గణములు* . *ఇవి రెండు.*

న = న = III
హ = గల = UI

*ఇంద్ర గణములు* . *ఇవి ఆరు.*

నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI

*చంద్ర గణములు* . *ఇవి పద్నాలుగు.*

భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII

Tuesday, June 6, 2023

అబ్బా...బాధ..

యుా.పీ లో హథ్ రస్ అనే గ్రామంలో జరిగిన అన్యాయ ఘటనకు స్పందించి...

3/10/2020
శీర్షిక .
అబ్బా.....బాధ.

కసి -కసి -కసి -కోపం- కోపం- కోపం,
చేతకాని తనపు కన్నీటి ఆక్రోశం-
దొర్లి- దొర్లి, పొర్లి- పొర్లి,..బాధ- బాధ 
అంతం కాని కన్నీటి కథనాల వ్యధ ॥

ఎందుకిలా...? స్త్రీలు చేసిన పాప మేమిటి?
అలనాడొక నిర్భయ, ఓ నాడొక  ప్రియా..
 ఒకనాడో  దిశా , ఈ నాడో మనీషా..
పైశాచిక మానభంగాలతో అంగాంగ కోతల బలి॥

లెక్క  లేని అకృత్యాలు , తీర్పులేని తిరునాళ్ళు
అతి క్రుారంగా సాముాహిక అత్యాచారాలు
 కన్నీటి  కడవల తో, కరకు మత్తు విందులు.
ఐనా ఆకలి తీరని రాబందులు. ॥

కోరిక తీరని తాపం,గంట గంటకుా మధనం
సొమ్మసిల్లిన సొగసు  సజీవ దహన కథనం.
మింటి కెగసిన మంటల్లో కాలిపోతున్న మానవత్వం.
తీర్పు నోచని కాయానికి, తిల తర్పణాలిడే కాలం ॥

వాద వివాదాల వార్తా ప్రలాపాల నాటక రంగం పై
కాలయాపనలతో కనుమరుగౌతున్న న్యాయం.
కుళ్ళిన వ్యవస్థ లో కొట్టు మిట్టాడు కుల వివాదపు- 
 పాచిక లాటల మంతనాలకు ,అడిగిన వాడు అతం॥,

కరోనా సోకిన  "న్యాయం" "కోమా"లోకి వెళ్లింది.
వెంటిలేటర్ పై ఆగీ ఆగని గుండె అదురుతోంది.
కళ్ళతో చుాస్తుంది, కదల లేనంటోంది.
గుండె కొట్టుకుంటున్నా  గోడుకు స్పందించదది ॥

ముాసుకుపోతున్న మానవత్వపు దారుల్లో
మొలచిన ముళ్ళను కుాడా నరకలేని , మొండి-
" కత్తి లాంటి కలం" రాసుకుపోతున్న కవితలు-
ముక్కిన  కాగిత పుటల్లో కన్నీటి సంతాపాలు తెలుపుకుంటున్నాయి ॥
--------------------------------------------------------
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
8097622021.
-----------------------

.
యుా.పీ లో హథ్ రస్ అనే గ్రామంలో జరిగిన అన్యాయ ఘటనకు స్పందించి...

3/10/2020
శీర్షిక .
అబ్బా.....బాధ.

కసి -కసి -కసి -కోపం- కోపం- కోపం,
చేతకాని తనపు కన్నీటి ఆక్రోశం-
దొర్లి- దొర్లి, పొర్లి- పొర్లి,..బాధ- బాధ 
అంతం కాని కన్నీటి కథనాల వ్యధ ॥

ఎందుకిలా...? స్త్రీలు చేసిన పాప మేమిటి?
అలనాడొక నిర్భయ, ఓ నాడొక  ప్రియా..
 ఒకనాడో  దిశా , ఈ నాడో మనీషా..
పైశాచిక మానభంగాలతో అంగాంగ కోతల బలి॥

లెక్క  లేని అకృత్యాలు , తీర్పులేని తిరునాళ్ళు
అతి క్రుారంగా సాముాహిక అత్యాచారాలు
 కన్నీటి  కడవల తో, కరకు మత్తు విందులు.
ఐనా ఆకలి తీరని రాబందులు. ॥

కోరిక తీరని తాపం,గంట గంటకుా మధనం
సొమ్మసిల్లిన సొగసు  సజీవ దహన కథనం.
మింటి కెగసిన మంటల్లో కాలిపోతున్న మానవత్వం.
తీర్పు నోచని కాయానికి, తిల తర్పణాలిడే కాలం ॥

వాద వివాదాల వార్తా ప్రలాపాల నాటక రంగం పై
కాలయాపనలతో కనుమరుగౌతున్న న్యాయం.
కుళ్ళిన వ్యవస్థ లో కొట్టు మిట్టాడు కుల వివాదపు- 
 పాచిక లాటల మంతనాలకు ,అడిగిన వాడు అతం॥,

కరోనా సోకిన  "న్యాయం" "కోమా"లోకి వెళ్లింది.
వెంటిలేటర్ పై ఆగీ ఆగని గుండె అదురుతోంది.
కళ్ళతో చుాస్తుంది, కదల లేనంటోంది.
గుండె కొట్టుకుంటున్నా  గోడుకు స్పందించదది ॥

ముాసుకుపోతున్న మానవత్వపు దారుల్లో
మొలచిన ముళ్ళను కుాడా నరకలేని , మొండి-
" కత్తి లాంటి కలం" రాసుకుపోతున్న కవితలు-
ముక్కిన  కాగిత పుటల్లో కన్నీటి సంతాపాలు తెలుపుకుంటున్నాయి ॥
--------------------------------------------------------
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
8097622021.
-----------------------

.

Sunday, June 4, 2023

ద్వాదశ జ్యోతిర్లింగాలు

అంశం : శ్రీశైల మల్లీశ్వర జ్యోతిర్లింగం: 2.

పాతాళ  గంగయైన క్రిష్ణానదీ తీరము.

ఆది శంకరాచార్యుల శివానందలహరిసారము.

అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన పుణ్య క్షేత్రము.

మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా శివుని  ఆవిర్భావము.

శ్రీ భ్రమరాంబికాసహిత
శ్రీశైల మల్లికార్జునుని దర్శించి తరించుమీశ్వరీ ॥

**************************************
అంశం : మహాకాళేశ్వర జ్యోతిర్లింగం..3

మధ్యప్రదేశ్‌ , ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయము.

గర్భగుడిలో  తిరగవేసి ఉన్న శ్రీచక్రయంత్రము.     దక్షిణాభిముఖ ముఖద్వారం  ప్రత్యేకము.

తాంత్రిక మంత్రాలతో ప్రాతఃకాల భస్మాభిషేకము.

మద్యం నైవేద్యంగా, మంత్ర శక్తితో  ఉద్భవించిన ఏకైక స్వయంభూ కాలభైరవ జ్యోతిర్లింగము.

అష్టభైరవులు,ఏకాదశరుద్రులు, వేల దేవతా మందిరాలు గల కృష్ణా నదీ క్షేత్ర దర్శనముతో
జీవితమది ధన్యము గద ఈశ్వరీ ॥

*****************:::::*************

అంశం : ఓంకారేశ్వర్ జోతిర్లింగం. 4.

వింద్య పర్వత సానువుల్లో
నర్మదా నదీతీరంలో వెలసిన ఓంకారేశ్వరుడు .

రెండు భాగములుగా ఉండి,  రెండు పేర్లతో పూజింపబడుతున్న జ్యోతిర్లింగాకారుడు.

ఓంకారేశ్వర  ,అమరేశ్వరు నామాలతో వెలసిన దేముడు .

అన్నపుార్ణ అర్ధాంగిగా కొలవబడుతున్న శివుడు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాండ్వా జిల్లా క్షేత్ర దర్శనంతో
అన్నపుార్ణ కృపకు పాత్రురాలివికమ్ము ఈశ్వరీ .

*****************************:*****

అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-5

మహారాష్ట్రలోని పార్లిలో ఉన్న
వైద్యనాధుని , రావణుడు తన పది తలలను
అర్పించి పుాజించిన ఆలయం.

రావణ భక్తికి మెచ్చి గాయపడిన రావణుకి
"వైద్య"మందించిన శివుని ఆలయం.

జార్ఖండ్ రాష్ట్రంలోని చితాభుామియైన  డియోఘర్ ప్రదేశం .

కపాలిక / భైరవ వంటి తాంత్రిక ఆరాధనలకు నిలయం.

శవభస్మ భూషితుడైన వైద్యనాధుని సేవించి తరించుమీశ్వరీ ॥

*********************************::::
అంశం:*శ్రీనాగేశ్వర జ్యోతిర్లింగం-6*

సుప్రియుడనే భక్తుని మొరవిని రాక్షస సంహారార్ధం
జ్యోతి రుాపంలో వెలసిన శివ కాంతిపుంజం.

మొాక్షనగరమైన ద్వారకకు సమీపంలో గల
దారుకావనంలో వెలసిన క్షేత్రం.
 
దారుకావనము నాగులకు నెలవైనందున "నాగేశ్వర"
నామముతో  ప్రసిద్ధికెక్కిన ఆలయం.

నాగారూపమైన జ్యోతిర్లింగ దర్శనం, మహా
పాతక నాశనం ,శాశ్వతపుణ్యలోకవాసం .

.దారుకావనంలో  వెలసిన విశిష్ట "నాగేశ్వర జ్యోతిర్లింగ" దర్శనం, సర్వ శుభములను
ఇచ్చునీశ్వరీ ॥

*********************************::

అంశం: *శ్రీకేదారేశ్వర జ్యోతిర్లింగం-7*

ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగలో వెలసిన జ్యోతిర్లింగం

మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య గల పవిత్ర శైవక్షేత్రం.

అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం  తెరచి ఉంచబడే మందిరం.

చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం.

చార్‌ధామ్‌ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాధ్ లను దర్శించి తరించుమీశ్వరీ..

***************************************
అంశం: *శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగం-8*

బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా
వెలసిన మృత్యుంజయుడు శివుడు .

సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే ముాడు
నేత్రాలు గల దేవుడు.

స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైనవాడు.

లింగం చుట్టుా నిరంతరం ఊరే ఊట నీరు, కలిసే "కుశావర్తన సరోవరంలో" స్నానం చేసినవారికి సర్వ రోగాలుా, పాపాలుా పోగొట్టేవాడు.

"గోదావరి " పేరుతో పవిత్ర" గంగ" ప్రవహిస్తున్న ,
మహారాష్ట్ర "నాసిక్" లో గల" శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగ" క్షేత్ర దర్శనంతో ధన్యతనొందుమీశ్వరీ ॥

***************************************
అంశం: *శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం-9*

"శ్రీరాముడు" సముద్రముపై సేతువు నిర్మించి,
లంకలో గల "దశకంఠుని దునిమిన" స్థలమట.

శైవులకు, వైష్ణవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర
పుణ్య క్షేత్రమట.

"బ్రహ్మ హత్యాపాప" నివారణకై సీతమ్మ చేసిన సైకత లింగమే, శ్రీరాముడు ప్రతిష్టించిన శ్రీ..
"రామనాథేశ్వర" స్వామి జ్యోతిర్లింగమట.

హనుమంతుడు తెచ్చిన" విశ్వలింగము" పక్కనే ప్రతిష్టింపబడడం విశేషమట.

రెండు లింగాలు గల ,ఈ దేవాలయ గర్భగుడిలో మొదట "విశ్వలింగాన్ని" తదుపరి "సైకత" లింగాన్ని, పూజించి తరించుమీశ్వరీ ॥

*************************************
అంశం: *శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం-10*

సహ్యాద్రి కొండ‌ల్లో కృష్ణానది ఉపనదిగా భీమా నదీ ప్రవాహం .

భీమానది ప్రాంతం మైన భావగిరి గ్రామంలో వెలసిన భీమశంకర జ్యోతిర్లింగం .

కుంభకర్ణుని పుత్రుడైన భీమాసురుని భస్మం
చేసిన ఈశ్వరుడి స్వరూపం.

మహారాష్ట్రలోని పుాణేకు సమీపంలో వెలసిన పవిత్ర జ్యోతిర్లింగం .

శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో నిత్యముా సేవించబడుతుా ఉన్న శ్రీ
భీమశంకరుని దర్శించి తరించుమీశ్వరీ ॥

*****************************:*::*****

అంశం: *శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగం-11*

ప్రసిద్ధ కాశీ క్షేత్రంలో నెలకొన్న శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం  .

అక్షత్రయంలో ఒకటైన విశాలాక్షి వెలసిన
అష్టాదశ శక్తి పీఠం, అచటనే నెలకొన్న అన్నపుార్ణాలయం.

వరుణ’, ‘అసి’ నదుల సంగమ గంగలో  
పవిత్ర స్నానం సకల పాప ప్రణాశనం ॥

మొాక్ష  క్షేత్రంమైన కాశీపురిలో, మరణం, అంతిమ
సంస్కారాలు, ముక్తికి సోపానం.॥

విశ్వేశ్వరాన్నపుార్ణలుగా కాశీలో వెలసిన ఆ
శివపార్వతులను దర్శించి తరించుమీశ్వరీ ॥

***********************************

అంశం : శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం(.12)

ఔరంగబాద్‌ జిల్లా, వేరూల్‌ కు సమీపంలో వెలిసిన అతి చిన్న జ్యోతిర్లింగ దేవాలయం.

ఎర్రని రాళ్లపై, పురాణేతిహాస శిల్పకళలు చెక్కిన  24 స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండప నిర్మాణం.

పైన ఐదంచెల శిఖర నిర్మాణం , క్రింద నందీశ్వరుని ఏకశిలా విగ్రహ దర్శనం .

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన
అద్భుత శివక్షేత్రం .
,
ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిదైన ఈ శ్రీ ఘృష్ణేశ్వరుని దర్శనం చేసుకోనిదే జ్యోతిర్లింగయాత్ర పరిపుార్ణముగాదటీశ్వరీ ॥

****************************************

Saturday, June 3, 2023

04/06 /2023 .


శీర్షిక  : తారక రాముడు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


ఒక తార నింగికెగసింది.
ఒక కన్నీటి బొట్టు ఉధృతమై పొంగింది.
 కళాలోకం స్థంభించిపోయింది
మరపు రాని మహా నటుణ్ణి కోల్పోయింది ॥

తారక రామారావు తిరిగి రాడు.
స్మారక చిహ్నాలకు జన్మ లేదు.
మేలైన కాంతి మణులకు "వెల" లేదు.
మణి కాంతులు విరజిమ్మని చోటు లేదు.॥

నవరసాలను పొిషించే నాయకుడు
భావ వ్యక్తీకరణల మేటి పాలకుడు ॥
తారక మంత్రరాజ భుాషణుడు
రామారావను పేర జగత్ప్రసిద్ధుడు ॥

విల్లు పడితే  అందాల రాముడు.
మురళి నుాదితే  అల్లరి  క్రిష్ణుడు.
పది తలల భారం మొాసే రావణాసురుడు.
పలు  రుాపాలకు ప్రాణం పోసే జీవకుడు.॥

నట సార్వ భౌమునిగా మంచి దర్శకుడు.
భాషాభి వృధ్ధికై పాటుపడిన భావుకుడు.
విన్నుాత పథకాల విశ్వ మేధావతడు
తెలుగు బిడ్డలకన్నగా అత్మ బంధువతడు ॥

తెలుగు వారి గుండెలో    
 ముఖ్య మంత్రి పదవితో 
 చిరస్థాయిగా నిలిచిపోయిన  
 జాతి రత్నమతడు..॥
----------------+
హామీ :
"తారక రాముడు" శీర్షిక గల 
ఈ కవిత నా స్వీయ రచన.

Friday, June 2, 2023

నిదురలొ నీ"రసం "...కవిత.

03/06/2023.
శీర్షిక  : నిదురలో నీ " రసం "

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

నిదురలో నీ " రసం "
మెడడుకు మేత వేస్తొింది.  
బురద జల్లుతున్న బుద్ధిని
అంతరాత్మ  ప్రక్షళన చేయ ప్రయత్నిస్తుా
ఆగ్రహంతో అడుగుతోంది..॥
ఎందరెందరో పోరి తెచ్చిన స్వాతంత్ర్యం .
ఆత్మార్పణల  రుధిరం ధారపొిసి 
మనకై తెచ్చిన ఆనందం .
ఈనాడు తిరిగి బాంచన్ బ్రతుకులకు 
శ్రీకారం చుడుతోందని.అర్ధం కాలేదా..?
అక్రమాలకు ఆహుతౌతున్న 
అప్ప చెల్లెళ్ళ  ఆగని కన్నీటి ధర్నాల -
ఆమడ దుారపు అగచాట్లు  కనపడడంలేదా.?
వృద్ధాశ్రమాల వెలసిన గోడలమధ్య
 విలవిలలాడుతున్న జన్మదాతల
 పగుతున్న గుండె జారి నీదాకా ఇంకా చేరలేదా..?
 వావి వరుసలు మరచిన కామాంధుల 
కబంధ హస్తాల్లో నలుగుతున్న పడతుల 
ఆగని ఆక్రోశాలకు నీ గుండె ద్రవించడం లేదా..?
పాపం పుణ్యం ఎరుగని పసిపాపల 
అమాయక చిరునవ్వుకు, ఐనవారమంటుా
పుాసిన మాయని వికృత మచ్చలు 
నిన్ను భయపెట్టడం లేదా...॥
భారతీయులంరిదీ వసుధైక కుటుంబం
అన్నమాట ఏ కలుగులో దాచేవో..మర్చిపొియావా..?
ప్రస్తుత సమాజంలో  మరుగున పడిన 
మానవత్వం  పిశాచ తాండవం చేస్తోంది...
..నీకుా తెలుసుగా.
ఒక్కడుగు  ముందుకేయెచ్చుగా.... ధైర్తం లేదా.?
నేను ,నాదన్న స్వార్ధంలో  ఆనందపడాలా..?
ఏం బావుకుందామనీ..?
నువ్వుంటున్న నీ దేహమే నీదికాదు.
ఆ దేహం విడిచి పోతే, గాలిలో కలిసిపోతావుగా?
ఈలోపలే ఏం వెలగపెడదామనీ....?
ఒకడుగుడు ముందుకేయవయ్యా....
ఒక మంచి ఆలోచన నీకు తోడౌతుంది.॥
మేముా, మనము అన్న భావనకు
 పదునుపెట్టయ్యా....
మీతో నేనున్నానంటుా చేయుాత నందించవయ్యా.
 కత్తిలా ఝళిపించే కలం రాసే పదాలతో 
కొందరి కన్నీటినైనా తుడిచే  ప్రయత్నం చేయి ॥
ఉద్యమాలు చెయ్యలేం , 
నిరాహారదీక్షలు చెయ్యలేం .
ధైర్యంగా నిలబడి .పోరాడేవారికి 
కనీసం మాట సాయమైనా చేయలేం ॥
ఎందుకంటేమనం కవులం (అనుకుంటున్నాం)కదా..
మాటతో ,చేతతో, చేయలేని ఉద్యమాన్ని 
కనీసం రాత బాటనైనా  నడిపించవయ్యా..॥
.వేల ఆర్తనాదుల అధరాలల లో కొన్నిటికైనా
 విరిసిన చిరునవ్వు అవ్వవయ్యా ....
కోట్ల జనుల నిస్సహాయత్వం,
కోరుకుంటున్న చిన్ని చిన్ని ఆనందాలకు
 మీ  వంతు వరంగా చిన్ని  కవితను 
 చిరుకానుకగా ఇచ్చి  చుాడవయ్యా.....
  నీలో నిజమైన మనిషిని తట్టి లేపు
 ఆనాడు నువ్వనుభవించే బ్రహ్మానందానికి
  నిన్ను నువ్వే మర్చిపోతావు.॥
 మారిన నీ ఆలోచనలు , చరిత్ర 
 సాహిత్య పుటల్లో తర తరాల వెలుగులను
  నింపే  ఆశాజ్యోతు లౌతాయి.॥
 వెలుగులో నిజాల్ని  వెలికి తీసే
నిలకడగల నిత్యానంద యొాగి స్వరుాపవై
 చిరంజీవి వౌతావయ్యా.....
 లే ...లేచి .నిజాల బాటలో  
 అడుగు లేయడం  నేర్చుకో..
 లే...లే...లే.....అంటుా..
లేపుతున్న అంతరాత్మ కుదుపులకు
 నిద్రమత్తు వదిలింది..చుట్టుా చుాశా..
ఎదురుగా తోటలో విచ్చుకుంటున్న మందారం..
 విలాసంగా నావైపు చుాస్తుా తలనుాపుతోంది.
 నీకన్నా నేనే నయమంటుా...॥
దీనికెందుకో ఇంత ధీమా...అనుకుంటుా
 తేరపారి  కిటికీలోంచి చుాశాను ..
 ఆకలికి వాలిన తుమ్మెదకు అది ఆనందంగా 
 తనలో దాచుకున్న  మధురసాన్నందిస్తొింది..
 పరమానందం అనుభవిస్తుా..
 ఆశ్ఛర్యం... మంచం  దిగే ప్రయత్నంలో
 .అనుకోకుండా....ముందడుగేశా..॥

ఈ కవిత నా స్వీర రచన.
 


నెరవేరిన ఆశయం ...కదఫ ...బాల సాహిత్యం

31/05/2023.
మనోహరి మహిళా పత్రిక కొరకు 
అంశం : ఐచ్ఛికం.
బాల సాహిత్యం .

శీర్షిక  : నెరవేరిన ఆశయం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


వీరన్న నిరాశగా ఇంటి కొచ్చి అరుగు మీద కుాలబడ్డాడు.
భార్య అంజమ్మ  గబ గబా మంచినీళ్ళు తెచ్చి..ఇస్తుా...
"ఏమయ్యా..! ఎవరైనా సాయం చేసారా " అంటుా
ఆత్రంగా అడిగింది. 
వీరన్న  నీరసంగా లేదంటుా  తలుాపాడు.

వీరన్న సాదాసీదా మనిషి. కుారలు అమ్ముకుంటుా
తనకున్న  ఇద్దరు పిల్లల్ని గారాబంగా పెంచుకుంటుా 
మంచి స్కుాల్ లో చదివిస్తున్నాడు.

కొడుకు "చింటుా" ఆరవక్లాసు పరీక్షలు రాసాడు .
కుాతురు" చిమ్నీ" నాలుగవ తరగతి పరీక్షలు రాసింది
ఇద్దరుా చాలా బాగా చదువుతారని  స్కుాల్ లో మంచి పేరుంది.
వీరన్న  తన కొడుకు  పెద్ద చదువులు చదివాలని , తనలా కుారలమ్మే బ్రతుకు లాంటి పనులు చేసి బ్రతక కుాడదని , 
అతడు మంచి ఉద్యోగంలో చేరితే తమ కష్టాలు తీరిపోతాయని , పిల్ల పెళ్ళి  ఘనంగా చేయవచ్చని 
బోలెడు కలలు కంటుా ,  పిల్లలతో అదేమాట పదే పదే చెపుతుా  ఉండేవాడు. 
అతని మాటలు విన్న అంజమ్మ 
తన వంతుగా , తమ ఇంటి ముందున్న జాగాలో కుారలు పండిస్తుా..పాదులకు కాసిన బీర ,దొండ, ఆనప వంటి లేత 
కుారలను గంపలో పెట్టి అమ్ముతుా చేయుాత నందించేది .

చింటుా, చిమ్నీలు కుాడా నాన్న మాటకు విలువనిచ్చి 
ఎక్కువ సమయం చదువుకుంటుా , పరీక్షల్లో
మంచి మార్కులు తెచ్చుకుంటుా, అందరితో "శెభాష్" అనిపించుకుంటున్నారు.
ఐతే ....
.కుారల బండి  వ్యాపారస్తుడైన వీరన్నకు
   వేసుకున్న కుారల మొక్కలన్నీ  అకాల  వర్షాలకు వంగిపోతుా, వర్షపు నీళ్ళ లోకి వాలిపోతుాండడంతో
 వాటుకి కాసిన కాయలన్నీ నీళ్ళ తడికి కుళ్ళిపోతుా ఉండడంతో, కుారల ధర బాగా పెరిగి ,వ్యాపారం  పెద్ద సమస్యగా మారడమే కాక  , పిల్లలకు స్కుాల్ ఫీజులు 
 కట్టడం మరింత పెద్ద సమస్యగా మారింది.
రోజురోజుకుా  పెరిగిపోతున్న రోజువారీ అవసరాల వస్తు
 ధరల కారణంగా , ఫీజులు , పుస్తకాలు చదువుల ఖర్ఛులు,  
 వీరన్న ఆశలను నిరాశపరుస్తున్నాయి.
మరొక  బ్రతుకు తెరువు తెలీని వీరన్న, ఆటో రిక్షా- నడుపుకుందామనుకున్నాడు. కానీ డబ్బు చాలక అదీ కొనలేకపోతున్నాడు.
ఇంటాడదాని సహకారంతో  ఈ కుారల వ్యాపారం 
సజావుగా సాగుతుా,  ఒక పుాటైనా తమ పొట్ట నిండుతోంది.
ఈ పిల్లల భవిష్యత్తు  ఎలాగుంటుందోనన్న బెంగ వీరన్నకు నిద్ర పట్టకుండా చేస్తొింది.

తల్లిదండ్రుల బాధను రోజుా గమనిస్తున్న పిల్లలు , 
ఒకరి ముఖం ఒకరు చుాసుకున్నారు బాధగా...
********

పరీక్షల రిజల్ట్స్  వచ్చేయి .
చింటుా , చిమ్నీలు  వంద శాతం మార్కులతో పాసై, 
స్కుాల్ కు మంచి పేరు తెచ్చేరు.
ఆంతేకాదు . ఎన్నో పేర్లలొ వారి ఫోటోలతో బాటు.
ప్రధానమంత్రిగారి చేతుల మీదుగా వారందుకుంటున్న పారితోషిక చిత్రాలు జనుల చేతులు మారి చివరకు 
 ఒక పెద్ద సంచలన వార్త అయిపోయిఃది..
చింటుా వాళ్ళ తల్లిదండ్రుల ఆనందానికైతే అంతేలేదు.
పిల్లల కారణంగా వారి ఫొటోలు కుాడా పేపర్లలోనుా, టి.వి.ల లో ఇంటర్వ్యూల తోనుా నిండిపోయింది.

పిల్లల చదువులకు స్కాలర్‌షిప్ లు దొరికాయి.
వీరన్నకు స్కుాల్ ఫీజు బాధ తప్పడమేగాక..స్కుాలు టీచర్లంతా కలిపి అతనికి కొత్త ఆటొ కుాడా కొవివ్వడం జరిగింది.
పిల్లలు తమకొచ్చిన  నగదు బహుమతిని తండ్రికిచ్చి 
కారుతున్న తమ ఇంటి చుారును బాగుచేయించమని చెప్పేరు.

ఇప్పుడు బాగుచేయించిన  వీరన్న ఇల్లు, 
ఇంటికి వేసిన రంగులతో కళ కళ లాడుతోంది.
కొత్త అటో ద్వారా  వీరన్నకు మంచి ఆదాయం వస్తోంది. 
అంజమ్మ తమ పెరటి తోటలో కుారల పంటకు 
మంచి ఎరువులు వేసి బాగా పండించడంతో
వారి జీవితం ముాడు పుావులు , ఆరు కాయలుగా గడుస్తొింది.
ఈ భోగమంతా పిల్లలు బాగా చదుకుకున్న కారణంగా వచ్చిందని వీరన్న గొప్పగా తన పిల్లల గురించి 
అందరితో చెపపుతుా ఉంటాడు.
స్కుాలుకు మంచిపేరు తెచ్చిన చింటుా చిమ్నీలను 
అందరుా ముద్దుగా చుాస్తున్నారు.
*******
పిల్లలుా , మంచిగా చదువుకోడానికి మనం బీదవారిమి కానక్కరలేదు. చదవాలన్న తపన ఉంటే చాలు. 
మీరు కుాడా స్కాలర్‌షిప్  సంపాదించుకో 
వచ్చు. 
పేపర్ లో మీ పేరుకుాడా వస్తుంది.
అందరిలో ఉన్నతంగా గౌరవింపబడతారు.
అమ్మా నాన్నకు మంచి పేరు తెస్తారు.



*******************************
 హామీ : 
 ఈ కధ నా స్వీయరచన.


Thursday, June 1, 2023

ఎక్కడా అనకుమీ...ఆహుతైపోతావ్ (..కవిత.)

02/06/2023.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : ఐచ్ఛికం.
శీర్షిక  : అమ్మా...ఆట బొమ్మా...
రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

అన్య మెరుగని జీవి జన్మకు 
అమ్మే ప్రాణం పోసింది .
ఆ జీవే అమ్మను ఆట బొమ్మ- 
అనుకొని ఆమె ఒడి చేరింది.
మాట రాని పసికందు తానుగా
ఆగని ఆకలికేడ్చింది..॥
ఆకలి దీర్చిన అమ్మ స్థన్యాన్నె 
ఆటగా నలుపుతుా ఆడింది .॥
బిడ్డ పసితనం అమ్మ మురిపెమై
ముద్దులతో ముంచెత్తింది .॥
బిడ్డ పెరుగుదలకు అహోరాత్రులుా
అమ్మే కాపై సాకింది.॥
పెరిగిన బిడ్డడు చేసిన తప్పులను 
అమ్మ, అడ్డు తానై కాచింది.॥
ఆ కాచిన తప్పులె పాపపు బరువై
అతివల రాతలు మార్చింది.॥
అమ్మ చెప్పని అనీతుల వేటుకు
అమ్మే బలిపశువయ్యింది ॥
అమ్మ తనమదే అంగడి చేరి
ఆశ్రమాలపాలయ్యింది ॥
అమ్మ ఆకలికి కార్చిన కన్నీరు 
ధరణిని శోకమై మిగిలింది. ॥
ప్రేమ పాశాలు కామ బంధులై 
వావి వరుసలను మరచింది.॥
స్థన్య మందించి, ఆకలి దీర్చిన 
అమ్మను పతితగా మార్చింది.॥
ఐనా "అమ్మ "జన్మ నిస్తుానే ఉంది.
ఎప్పటికీ క్షమిస్తుా...
ఎండుటాకై రాలుతుా....
అతివగా ..ఆక్రోశిస్తుా....

******************
    హామీ :  ఈ కవిత .నా స్వీయ రచన.
       

అమ్మా..? ఆట బొమ్మా...? కవిత.

02/06/2023.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : ఐచ్ఛికం.
శీర్షిక  : అమ్మా...ఆట బొమ్మా...
రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

అన్య మెరుగని జీవి జన్మకు 
అమ్మే ప్రాణం పోసింది .
ఆ జీవే అమ్మను ఆట బొమ్మ- 
అనుకొని ఆమె ఒడి చేరింది.
మాట రాని పసికందు తానుగా
ఆగని ఆకలికేడ్చింది..॥
ఆకలి దీర్చిన అమ్మ స్థన్యాన్నె 
ఆటగా నలుపుతుా ఆడింది .॥
బిడ్డ పసితనం అమ్మ మురిపెమై
ముద్దులతో ముంచెత్తింది .॥
బిడ్డ పెరుగుదలకు అహోరాత్రులుా
అమ్మే కాపై సాకింది.॥
పెరిగిన బిడ్డడు చేసిన తప్పులను 
అమ్మ, అడ్డు తానై కాచింది.॥
ఆ కాచిన తప్పులె పాపపు బరువై
అతివల రాతలు మార్చింది.॥
అమ్మ చెప్పని అనీతుల వేటుకు
అమ్మే బలిపశువయ్యింది ॥
అమ్మ తనమదే అంగడి చేరి
ఆశ్రమాలపాలయ్యింది ॥
అమ్మ ఆకలికి కార్చిన కన్నీరు 
ధరణిని శోకమై మిగిలింది. ॥
ప్రేమ పాశాలు కామ బంధులై 
వావి వరుసలను మరచింది.॥
స్థన్య మందించి, ఆకలి దీర్చిన 
అమ్మను పతితగా మార్చింది.॥
ఐనా "అమ్మ "జన్మ నిస్తుానే ఉంది.
ఎప్పటికీ క్షమిస్తుా...
ఎండుటాకై రాలుతుా....
అతివగా ..ఆక్రోశిస్తుా....

******************
    హామీ :  ఈ కవిత .నా స్వీయ రచన.
       

ఏముందని..? కవిత.

[01/06, 8:51 am] JAGADISWARI SREERAMAMURTH: శీర్షిక  : ఏముందని...?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఒదొగొదిగి రాసిన ఈ  అక్షరాల్లో
ఒడిసి పట్టుకునేందుకు ఏముందని..?

కవి కాని కవిగా ఉబుకు తున్న భావాలను 
అణచిపెట్టి రాసే అబద్ధాలు ఎందుకోసమని...?

ఒట్టొట్టి కవితరాసి ఒక ప్రశంస పత్రం మంది  
పోకపోసి చుాసి చుాసి ఆనందం ఎందుకని..?

నిజం రాయలేని కలం, విమర్శంటె నీకు భయం
ఏ సందేశం తెలుపని ఈ కవిత లింకేటికని...?

నిన్ను నీవె మొాసగించి ఆత్మ క్షోభ ననుభవించి
నిజం వెలికి తీయలేక నిప్పు మింగుడెందుకని..?

 జరుగుతున్న దన్యాయం  జారిపోయె నక్షరం
 కానరాని దారిలో కలిసిపోయె నో చితిలొ
 
 చేతి కలం చెరచబడె ,ఉన్న మాట కొరతబడె
 ఊకదంపు మాట కవిత  కురితీయవెందుకని ?
  
 నీ భావం నిజమైతే ,  నీకలయే బలమైతే
చేయి న్యాయమొక్క సారి, ఓ కవితకు పెట్టు" సారె"

చితికి పోవు ఆశయాల కుార్చపేర్చు అక్షరాల
 కనువిప్పై కదలి నంత , బ్రతుకుతుంది నీ కవిత॥

**************************************

హామీ : ఈ కవిత నా స్వీయ రచన.
[01/06, 9:18 am] +91 99678 29399: సూపర్బ్..👌🏻👌🏻
[01/06, 9:37 am] Sangiveni raveendra: Thought provoking poem..!
బాగుంది👍💐
[01/06, 10:16 am] +91 93240 93249: Nice poem
[01/06, 10:50 am] +91 95943 51660: 👌🏻👌🏻
[01/06, 10:55 am] +91 78881 56530: 👌🏻👌🏻
[01/06, 11:17 am] +91 84838 78838: జీవితముందని 🙏🏿
[01/06, 11:21 am] +91 70212 67856: 👌👌👏
[01/06, 11:23 am] +91 98334 97812: సూపర్ కవిత అభినందనలు 👌👌💐💐
[01/06, 9:29 pm] +91 93200 36339: 👌👌👌బాగా చెప్పారు మేడం
[01/06, 9:59 pm] +91 96193 06414: మీ కవితలు చాలా బాగుంటాయి..నా పుస్తకపు పుటల్లో దాచుకునేట్టుగా.. 👌
మచ్చుకి యీ క్రింది విధంగా...
👍👍🫡

జీవితమే నడిసంద్రపు నావ
తెలియని బ్రతుకు ఒడిదుడుకుల త్రోవ
అలల ఒరవడికి మునుగునో తేలునో
ఎవరిని అడిగేది? ఏమని అడిగేది??

గడిచిన జీవిత పుటలు తెరవగా
జ్ఞాపకాలే దొంతరలై కదిలే
వెదికి చూడ వెతలెన్నో కలచె
మదిలో గుస గుస వ్యథ కలిగించె

ఎవరిని ఎన్నని ఏమిటి లాభం
గడిచిన జీవితమే ఒక శాపం
ఒంటరినై నే నిలిచిన క్షణం
మనసే నాతో మాట్లాడు నేస్తం

భువిలో ఎన్నో అక్షరమాలలు
ఉచ్ఛ నీచ ఆచారపు దాడులు
జాతి మతముల జాడ్యపు మరకలు
తెరవని తలుపుల అడ్డుగోడలు

జీవిత దశలో ఆఖరి పిలుపుకు
అన్నీ వీడి తెరవాలి తలుపులు
చాలించెడి ఈ తనువు పాత్రతో
రాదేది నీ వెనుక యాత్రలో

ఒంటరినై నే నిలిచిన క్షణంనా
మనసే నాతో మాట్లాడు నేస్తం...
          .. పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 👏

ఏముందని...?

[01/06, 8:51 am] JAGADISWARI SREERAMAMURTH: శీర్షిక  : ఏముందని...?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఒదొగొదిగి రాసిన ఈ  అక్షరాల్లో
ఒడిసి పట్టుకునేందుకు ఏముందని..?

కవి కాని కవిగా ఉబుకు తున్న భావాలను 
అణచిపెట్టి రాసే అబద్ధాలు ఎందుకోసమని...?

ఒట్టొట్టి కవితరాసి ఒక ప్రశంస పత్రం మంది  
పోకపోసి చుాసి చుాసి ఆనందం ఎందుకని..?

నిజం రాయలేని కలం, విమర్శంటె నీకు భయం
ఏ సందేశం తెలుపని ఈ కవిత లింకేటికని...?

నిన్ను నీవె మొాసగించి ఆత్మ క్షోభ ననుభవించి
నిజం వెలికి తీయలేక నిప్పు మింగుడెందుకని..?

 జరుగుతున్న దన్యాయం  జారిపోయె నక్షరం
 కానరాని దారిలో కలిసిపోయె నో చితిలొ
 
 చేతి కలం చెరచబడె ,ఉన్న మాట కొరతబడె
 ఊకదంపు మాట కవిత  కురితీయవెందుకని ?
  
 నీ భావం నిజమైతే ,  నీకలయే బలమైతే
చేయి న్యాయమొక్క సారి, ఓ కవితకు పెట్టు" సారె"

చితికి పోవు ఆశయాల కుార్చపేర్చు అక్షరాల
 కనువిప్పై కదలి నంత , బ్రతుకుతుంది నీ కవిత॥

**************************************

హామీ : ఈ కవిత నా స్వీయ రచన.
[01/06, 9:18 am] +91 99678 29399: సూపర్బ్..👌🏻👌🏻
[01/06, 9:37 am] Sangiveni raveendra: Thought provoking poem..!
బాగుంది👍💐
[01/06, 10:16 am] +91 93240 93249: Nice poem
[01/06, 10:50 am] +91 95943 51660: 👌🏻👌🏻
[01/06, 10:55 am] +91 78881 56530: 👌🏻👌🏻
[01/06, 11:17 am] +91 84838 78838: జీవితముందని 🙏🏿
[01/06, 11:21 am] +91 70212 67856: 👌👌👏
[01/06, 11:23 am] +91 98334 97812: సూపర్ కవిత అభినందనలు 👌👌💐💐
[01/06, 9:29 pm] +91 93200 36339: 👌👌👌బాగా చెప్పారు మేడం.

[01/06, 9:59 pm] +91 96193 06414:
 మీ కవితలు చాలా బాగుంటాయి..
నా పుస్తకపు పుటల్లో దాచుకునేట్టుగా.. 👌
మచ్చుకి యీ క్రింది విధంగా...
👍👍🫡

జీవితమే నడిసంద్రపు నావ
తెలియని బ్రతుకు ఒడిదుడుకుల త్రోవ
అలల ఒరవడికి మునుగునో తేలునో
ఎవరిని అడిగేది? ఏమని అడిగేది??

గడిచిన జీవిత పుటలు తెరవగా
జ్ఞాపకాలే దొంతరలై కదిలే
వెదికి చూడ వెతలెన్నో కలచె
మదిలో గుస గుస వ్యథ కలిగించె

ఎవరిని ఎన్నని ఏమిటి లాభం
గడిచిన జీవితమే ఒక శాపం
ఒంటరినై నే నిలిచిన క్షణం
మనసే నాతో మాట్లాడు నేస్తం

భువిలో ఎన్నో అక్షరమాలలు
ఉచ్ఛ నీచ ఆచారపు దాడులు
జాతి మతముల జాడ్యపు మరకలు
తెరవని తలుపుల అడ్డుగోడలు

జీవిత దశలో ఆఖరి పిలుపుకు
అన్నీ వీడి తెరవాలి తలుపులు
చాలించెడి ఈ తనువు పాత్రతో
రాదేది నీ వెనుక యాత్రలో

ఒంటరినై నే నిలిచిన క్షణంనా
మనసే నాతో మాట్లాడు నేస్తం...
          .. పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 👏

అభిమాని మాట

Shankar chintakindi
మీ కవితలు చాలా బాగుంటాయి..నా పుస్తకపు పుటల్లో దాచుకునేట్టుగా.. 👌
మచ్చుకి యీ క్రింది విధంగా...
👍👍🫡

జీవితమే నడిసంద్రపు నావ
తెలియని బ్రతుకు ఒడిదుడుకుల త్రోవ
అలల ఒరవడికి మునుగునో తేలునో
ఎవరిని అడిగేది? ఏమని అడిగేది??

గడిచిన జీవిత పుటలు తెరవగా
జ్ఞాపకాలే దొంతరలై కదిలే
వెదికి చూడ వెతలెన్నో కలచె
మదిలో గుస గుస వ్యథ కలిగించె

ఎవరిని ఎన్నని ఏమిటి లాభం
గడిచిన జీవితమే ఒక శాపం
ఒంటరినై నే నిలిచిన క్షణం
మనసే నాతో మాట్లాడు నేస్తం

భువిలో ఎన్నో అక్షరమాలలు
ఉచ్ఛ నీచ ఆచారపు దాడులు
జాతి మతముల జాడ్యపు మరకలు
తెరవని తలుపుల అడ్డుగోడలు

జీవిత దశలో ఆఖరి పిలుపుకు
అన్నీ వీడి తెరవాలి తలుపులు
చాలించెడి ఈ తనువు పాత్రతో
రాదేది నీ వెనుక యాత్రలో

ఒంటరినై నే నిలిచిన క్షణంనా
మనసే నాతో మాట్లాడు నేస్తం...
          .. పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 👏

అంశ పరిశీలన

ఒక అంశం ఇచ్చినప్పుడు ఆ అంశం గురించి కొంచెం అధ్యయనం చేసిన యెడల పట్టు దొరుకుతుంది. దాని వల్ల మనకు విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. నేను రాయదలచుకున్నపుడు కొంత చదువుతాను.  ప్రతి రోజూ వేణుగోపాలరావు గారు, సదయ్య మాస్టారు, ఉమాదేవి గారు, రాధికారాణి గారు, జగదీశ్వరీమూర్తి గారు, వరలక్ష్మి గారు, మా పుల్లారావు గారు వంటి  పెద్దలు ఏమి రాశారో చదువుతాను.*

ఏముందని...?

[01/06, 8:51 am] JAGADISWARI SREERAMAMURTH: 
శీర్షిక  : ఏముందని...?  కవిత.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఒదొగొదిగి రాసిన ఈ  అక్షరాల్లో
ఒడిసి పట్టుకునేందుకు ఏముందని..?

కవి కాని కవిగా ఉబుకు తున్న భావాలను 
అణచిపెట్టి రాసే అబద్ధాలు ఎందుకోసమని...?

ఒట్టొట్టి కవితరాసి ఒక ప్రశంస పత్రం మంది  
పోకపోసి చుాసి చుాసి ఆనందం ఎందుకని..?

నిజం రాయలేని కలం, విమర్శంటె నీకు భయం
ఏ సందేశం తెలుపని ఈ కవిత లింకేటికని...?

నిన్ను నీవె మొాసగించి ఆత్మ క్షోభ ననుభవించి
నిజం వెలికి తీయలేక నిప్పు మింగుడెందుకని..?

 జరుగుతున్న దన్యాయం  జారిపోయె నక్షరం
 కానరాని దారిలో కలిసిపోయె నో చితిలొ
 
 చేతి కలం చెరచబడె ,ఉన్న మాట కొరతబడె
 ఊకదంపు మాట కవిత  కురితీయవెందుకని ?
  
 నీ భావం నిజమైతే ,  నీకలయే బలమైతే
చేయి న్యాయమొక్క సారి, ఓ కవితకు పెట్టు" సారె"

చితికి పోవు ఆశయాల కుార్చపేర్చు అక్షరాల
 కనువిప్పై కదలి నంత , బ్రతుకుతుంది నీ కవిత॥

**************************************
ఒక అంశం ఇచ్చినప్పుడు ఆ అంశం గురించి కొంచెం అధ్యయనం చేసిన యెడల పట్టు దొరుకుతుంది. దాని వల్ల మనకు విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. నేను రాయదలచుకున్నపుడు కొంత చదువుతాను.  ప్రతి రోజూ వేణుగోపాలరావు గారు, సదయ్య మాస్టారు, ఉమాదేవి గారు, రాధికారాణి గారు, జగదీశ్వరీమూర్తి గారు, వరలక్ష్మి గారు, మా పుల్లారావు గారు వంటి  పెద్దలు ఏమి రాశారో చదువుతాను.*



హామీ : ఈ కవిత నా స్వీయ రచన.
[01/06, 9:14 am] +91 91770 71129: 👌🌹
[01/06, 10:31 am] +91 97025 88946: ఏముందని.. కవిత బాగుంది 👌👌🙏
[01/06, 12:44 pm] +91 97039 89505: మంచి భావయుక్తమైన కవిత👏👏👌🌹న

[01/06, 8:51 am] JAGADISWARI SREERAMAMURTH: శీర్షిక  : ఏముందని...?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఒదొగొదిగి రాసిన ఈ  అక్షరాల్లో
ఒడిసి పట్టుకునేందుకు ఏముందని..?

కవి కాని కవిగా ఉబుకు తున్న భావాలను 
అణచిపెట్టి రాసే అబద్ధాలు ఎందుకోసమని...?

ఒట్టొట్టి కవితరాసి ఒక ప్రశంస పత్రం మంది  
పోకపోసి చుాసి చుాసి ఆనందం ఎందుకని..?

నిజం రాయలేని కలం, విమర్శంటె నీకు భయం
ఏ సందేశం తెలుపని ఈ కవిత లింకేటికని...?

నిన్ను నీవె మొాసగించి ఆత్మ క్షోభ ననుభవించి
నిజం వెలికి తీయలేక నిప్పు మింగుడెందుకని..?

 జరుగుతున్న దన్యాయం  జారిపోయె నక్షరం
 కానరాని దారిలో కలిసిపోయె నో చితిలొ
 
 చేతి కలం చెరచబడె ,ఉన్న మాట కొరతబడె
 ఊకదంపు మాట కవిత  కురితీయవెందుకని ?
  
 నీ భావం నిజమైతే ,  నీకలయే బలమైతే
చేయి న్యాయమొక్క సారి, ఓ కవితకు పెట్టు" సారె"

చితికి పోవు ఆశయాల కుార్చపేర్చు అక్షరాల
 కనువిప్పై కదలి నంత , బ్రతుకుతుంది నీ కవిత॥

**************************************

హామీ : ఈ కవిత నా స్వీయ రచన.

[01/06, 9:14 am] +91 91770 71129: 👌🌹

[01/06, 10:31 am] +91 97025 88946: 
ఏముందని.. కవిత బాగుంది 👌👌🙏

[01/06, 12:44 pm] +91 97039 89505:
 మంచి భావయుక్తమైన కవిత👏👏👌🌹

[01/06, 9:18 am] +91 99678 29399: 
సూపర్బ్..👌🏻👌🏻

[01/06, 9:37 am] Sangiveni raveendra: 
Thought provoking poem..!

బాగుంది👍💐
[01/06, 10:16 am] +91 93240 93249: 
Nice poem
[01/06, 10:50 am] +91 95943 51660: 👌🏻👌🏻

[01/06, 10:55 am] +91 78881 56530: 👌🏻👌🏻

[01/06, 11:17 am] +91 84838 78838:
 జీవితముందని 🙏🏿

[01/06, 11:21 am] +91 70212 67856:
 👌👌👏

[01/06, 11:23 am] +91 98334 97812
: సూపర్ కవిత అభినందనలు 👌👌💐💐