Tuesday, May 31, 2022

వృద్ధాశ్రమాలు

31/05/2022
శ్రీశ్రీ కళా వేదికలో
అంశం : వృద్ధాశ్రమాలు
శీర్షిక : కన్నీటి కథలకు సాక్ష్యాలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

ఎక్కడ నుండో వస్తున్న కన్నీటి వెక్కిళ్ళు
ఏ తల్లో కోల్పోయిన జ్ఞాపకాల  సుళ్ళు
బిడ్డ పుట్టిన సంబరాన విరిన నవ్వుల పుాలు
నేడు వాడి నలిగిన రాతకు రగిలిన సెగలు ॥

నడక నేర్చిన బిడ్డ అడిగి కోరిన ఆట బండి
అప్పు చేసి కొన్న పాపానికి లేని తిండి
తాము తిన్నా తినకున్నా తెలియనీయని
అమ్మ తనం , ఆకలి కష్టానికి ఆదుకోని శరీరం ॥

కాయ కష్టానికి దొరకని దుడ్డు లేపిన దుమారం  .
మగని పిరికి తనానికి నిండు బావి నీరే సాక్ష్యం .
కొరతబడిన ప్రాణానికి ప్రాణమైన పసి ప్రాణం.
సాకిన ప్రేమకు బిడ్డను చదివించడమే లక్ష్యం ॥

తొమ్మది మాసాలు బరువును మొాసిన శాపం
ఎదిగిన రక్తబంధంలో ఏపుగా పెరిగిన స్వార్ధం .
 మదిర- మగువల చాటున మరచిన మానవత్వం .
 పెంచిన మమతపై చుాపిన  కృుార ప్రతాపం ॥
 
నేడు వృద్ధాశ్రమాల వెలిసిన గోడల బీటల్లో
దాగిన ఎన్నో అపశృతుల గతిలేని గీతాలు
ఎండిన శరీరాలకు నీడనిచ్చే ఓదార్పు గళ్ళు.
పెంచిన మమకారాలకు పేగు బంధాలు వేసిన సంకెళ్ళు॥

నేడు వృద్ధాశ్రమాలు
 "నా" అన్నవారు రాని భాధితుల బందీలు.
నిరీక్షణ నిండిన కళ్ళకు నిదుర రాని శోకాలు .
గది గదిలో నిండిన కధలకు ,కన్నీటి కాల్వల ఊటలు .
చితుకు బ్రతుకు పొిరాటాలకు ఆలంబనైన
కొడిగట్టిన దీపాలు ॥

వృద్ధాశ్రమాలు .....
 కన్నీటి కష్టాలకు స్పందించలేని  నీరుారని
  కన్నీటి  వెక్కళ్ళకు  మారు పేర్లు ॥
 

హామీ : 
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితము కాని నా స్వీయ రచన .

Thursday, May 26, 2022

నిజం నిష్టుారం.

అశం : నిజం నిష్టుారమే...

శీర్షిక  :  శ్రీశ్రీ  బాట నామాట.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .

మరో ప్రపంచం మరో ప్రపంచం 
మరో ప్రపంచం మనదేనోయ్
కలాలు పట్టుకు నిజాలు చెప్పుచు
కదను తొక్కుదాం మనమేనోయ్ ॥

అన్యాయాన్నెదిరించే మాటను
నిప్పు నిజాలను రాసే బాటను
నిర్భయ రీతిని సాగండోయ్
కలం కత్తిగా మార్చండోయ్ ॥

భగ భగలాడిన హ్మ్రదయాక్రోశం
భుగ భుగ ఎగసిన ఎర్రని కోపం
పిట పిటలాడే పుస్తక పుటలో
పట పటలాడుచు రాయండోయ్ ॥

అన్యాయాలకు బలియౌ బడగుల
అసభ్య చేతల అవమానితులా
స్త్రీల మాన హింసాత్మక చర్యల
చలించు చరితలె రాయండోయ్ ॥

కష్టాల్ నష్టాల్ కావిడి మొాతల 
రాజకీయ అధికార రాపిడుల
చట్టపు తీర్పులె  మార్చండోయ్
కవన భేరి మ్రొాగించండోయ్ ॥

మార్పు  కుార్పుకై మరో ఉద్యమం  
మనిషిని మనిషిగా మార్చు సాధనం
కలం హలంలో ఉదండోయ్.
కవిగా కదనం త్రొక్కండోయ్ ॥ 

మంచి మార్పుకై మంచి తీర్పుకై
నిజాల నిప్పును కురిపించోయ్
భరత భవతకై తపించవోయ్
భాగ్య విధాతవు నీవేనోయ్ ॥

శ్రీ శ్రీ  బాటను శ్రీ శ్రీ మాటను
తర తరాల కందించండోయ్
కదిలీ ముందుకు, తోసుకు తోసుకు
అక్షర సేద్యం చేయండోయ్ ॥..॥

*************************

పంచపది..


విఠల్ కాటేగర్..మాట
*******************
అద్భుతమైన ప్రతిభ!
ఇలా చెప్పగానే అలా లయబద్ధంగా రాశారు మేడం.
5 రోజుల నుండి నేను ఒక్కణ్ణే రాస్తున్నాను.
అందరికి స్ఫూర్తిదాయకంగా వుంటుంది, రోజూ వ్రాయండి మేడం!🙏👏🙏

అమోఘం,అద్వితీయం, ఆదర్శనీయం మీ కలం, గళం,గీతం,సంగీతం.
పంచపది సమూహంలో ఉండడం అందరికి ఆనందదాయకం.
మీ కలంతో పంచపది సమూహాన్ని రోజూ అలరించాలని కోరుతున్నాను.
*******************::::::******

Tuesday, May 24, 2022

సురవరం మన వరం

24/05/2022.

గోరసం మరియూ అక్షరకౌముది వారు నిర్వహిస్తున్న సురవరం కవితా పండుగ కొరకు 

అంశం: సురవరం - తెలుగుజాతి వరం.
శీర్షిక  : బహుముఖ ప్రజ్ఞాశాలి .

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .


నిజాం నిరంకుశ పాలనలో
మతం మాధ్యమంగా చేసుకొని
తెలుగు భాషా సంస్కృతులకు
 జరిగిన అవమానం .॥
 
వ్యవహారిక భాషగా ఉర్దూ భాషకు పట్టం.
తెలుగు జాతి సంస్కృతిని సాంతం, 
 కాలరాయడానికి చేసిన ప్రయత్నం.॥

తెలుగు గ్రంథాలయాల ఏర్పాటును 
నిషేధించిన నైజాం తెలుగు సభలు, 
సమావేశాలకు  తమ అనుమతి 
కోరలన్న అహంకారపుారిత శాశనాలు॥

తెలుగువారి అణచివేతల కారణంగా
కలం ఎక్కుపెట్టిన సురవరం, నిజాం
 నిరంకుశ పాలనను విమర్శిస్తూ 
నిర్భయంగా రాసిన ఎన్నో వ్యాసాలు
 ప్రజలలో  తెచ్చిన చైతన్యం ॥

ప్రజా శ్రేయస్సే జీవిత పరమార్ధగా  
ప్రతిష్టాత్మక సంస్థల ఉన్నతి, సురవరం-
 ప్రతాపరెడ్డి  సాధించిన ఘన విజయం.॥

గోల్కొండ కవుల ప్రత్యేక సంచికలో
354 మంది తెలంగాణ కవుల కవితలను
 చేర్చి తెలుగువారి ఘనతను చాటిచెప్పిన
ధీశాలి సురవరం ప్రతాపరెడ్డి గారు.॥

త్యాగం, దేశభక్తి, భాషాభిమానాలతో
ఆయన రచించిన ‘ఆంధ్రులు సాంఘిక చరిత్ర’కు
తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 
లభించడం తెలంగాణ గడ్డ చేసుకున్న అదృష్టం”   

సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా
తెలంగాణ యాసలోని మాధుర్యాన్ని
తెలుగు భాష ప్రత్యేకతను కాపాడడమే
ఆయనకు మనమందించే ఘనమైన నివాళి.॥

హామీపత్రం: 
ఈ సురవరం కవిత కేవలం ఈ సమూహము కొరకు మాత్రమే వ్రాసినది అని, ఎక్కడ పోస్ట్ చేయలేదని హామీ ఇస్తున్నాను.



Sunday, May 22, 2022

నా పరిచయం

యుాట్యుాబ్ ఛానల్ లో నా పరిచయం
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
పరిచయం యుాట్యుాబ్ ఛానల్ లోకల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.  ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను   .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.
తమ్మడు పంతుల వేంకటరమణ ముార్తి.
తమ్మడు కుాడా మంచి  రచయిత ,గాయకుడు ,
మంచి కంపోజర్.కావడం  విశేషం.
సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత  గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు  చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణ ను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా  నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా  గాత్రానికి సంగీత  శ్రీకారం చుట్టేను .

వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
రైల్వేలో మొాటర్ మేన్ గా రిటైర్ అయి ప్రస్తుతం
హైకోర్ట్  వకీలుగా కొనసాగుతన్నారు.
మాకు  ఇద్దరు పిల్లలకీ వివాహాలయ్యేయి.
అబ్బాయి పి. రాజశైఖర్ ముార్తి  సైబర్ సెక్యుారిటీ
ఫౌండర్ గా  కొన్ని కంపెనీలకు  డైరెక్టర్ గా
కొనసాగుతున్నాడు. వికీపీడియాలో రాజశేఖర్ ముార్తి పి. పేరుతో ఉన్న బయొాడేటా చదివి కోర్స్లు పుార్తి చేయడం వల్ల వల్ల చాలా మంది
నేటి కంప్యుాయుాటర్  విభాగంలో నిష్టాతులై
ఉద్యోగ ప్రాప్తులయ్యేరు.
అమ్మాయి వివాహానంతరం లండన్లో స్థిరపడింది.
అన్యోన్య దాంపత్యం .వారిద్దరికీ పిల్లలున్నారు.

ముంబే కల్యాణ్ వాసినైన నేను
అక్కడి పొరుగుారైన  డోంబివిల్లి వాస్థవ్యులు
"శ్రీమతి తారా రమేష్ " గారి వద్ద సంగీత ప్రస్థానాన్ని కొనసాగించేను . హరికథా శిరోమణి యైన మా
అత్తయ్యగారు సాహిత్యాభిలాషి .అమె దగ్గరున్న పుస్తకాల గది ఒక పెద్ద గ్రంధాలయమని చెప్పవచ్చు
వారికి గల  తొమ్మిది మంది సంతానంలో పెద్ద కోడలిగా
ఆరుగురు ఆడపడుచులు , మరుదుల అభిమానానికి
పాత్రురాలినయ్యేను.
వారందరుాకుాడా  భక్తి భజన,  గాన, వాద్య కళాకారులే
అమె సంగీత సాహిత్యాల నేర్పు కుార్పులతో రాసిన కీర్తనలు పద్యాలు స్తోత్రాలు అనేకం .
నిత్య పురాణ ఫఠనాలతో భజన సప్తాహాల విందుభోజనాదులతో  మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చతోరణమే.
అవిధంగా నేర్చుకున్న సంగీతానికి , నేర్చుకున్న సాహిత్యానికి నాలో
సహజంగా ఉండే ఆశక్తి తోడై  కవితలు రాయడం పాటలు రాయడం రాగాల లో స్వరకల్పన చేయడం చేస్తుా.  రాను రాను .ఎన్నో పాటలను , కధలను కవితలనుా రాస్తుా..
అందరిచే ప్రశంశలు పొందేను.
నా స్వర రచనలను విని  ఆస్వాదించి ఆనందించిన
గురువుగారు "శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారు  తాను రచించిన శివపదం పాటలను స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో  రెండు CD లుగా  ఆవిష్కరించేరు.  నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం , స్వయంగా వారి చేతులమీదుగా  సన్మానితురాలిని కావడం
నాకు గర్వకారణం.

అవికాక 8 CD లు వివిధ గాయనీ గాయకు లు పాడినవి , పుార్వ గవర్నరు గారైన "విద్యాసాగర్ గారి చే కొన్ని , కుర్తాళం స్వామివారిచే "కొన్ని,  శారదా సుబ్రహ్మణ్యం గారి చే కొన్ని ఆవిష్కరింపబడ్డాయి. అవేకాక కవితలు,కధలు కుాడా రాస్తాను. ముంబాయి ఆంధ్రమహా సభ , వాషి తెలుగు కళా సమితిలలో పలు కార్య క్రమాలలో  పాల్గొని సన్మాన పాత్రురాలినయ్యేను.

పలు సంఘాల లో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాల లో చోటు చేసుకున్నాయి.
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో ఎన్నో  లలిత సంగీతాలు   పాడేను.
బోంబే షణ్ముఖానందలో,  అన్నమాచార్య కీర్తనలు,
పలు అర్కెష్ట్రాలలో  ఎన్నో సినీ గీతాలు  లలిత సంగీతం ,స్వీయ రచనలు కుాడా పాడేను.
హైదరాబాదులో జరిగిన శివపద సప్తాహంలో నాచే స్వరపరచబడిన కీర్తనలను, నాతో కలిపి , బోంబే సంగీత కళాకారిణులందరికీ పాడే అదృష్టం గురువుగారు శ్రీ షణ్ముఖశర్మగారు కల్పించేరు.

కరోనా కారణంగా ఆన్ లైన్ లో నిర్వహింపబడుతున్న
పలు ప్రక్రియల లో  "సున్నితం" ప్రక్రియ రుాపకర్త యైన
గౌరవనీయులు "శ్రీ నెల్లుట్ల సునీతగారు" మహిళా కవయిత్రులకొరకు పడిన కష్ట ఫలితంగా 
ఈ నాడు "తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ " లో నా పేరు నమొాదు కావడం,  సర్టిఫికెట్ పొందడం
నా జీవితంలో మరువలేని  అనందకరమైన విషయం.
ఈ నాటి స్వీయ చరిత్ర మాధ్యమంగా
శ్రీ నెల్లుట్ల సునీతగారికి మనఃపుార్వక ధన్యవాదాలు .
తెలియజేస్తున్నాను.

అలాగే మహతీ సాహితీ కవి సంగమం లో  "ఇష్టపది" ప్రక్రియ రుాపకర్త గారైన గౌరవనీయులు శ్రీ అడిగప్పుల సదయ్యగారు. వారు చేస్తున్న సాహిత్య కృషిలో
ఎన్నో ఛందోబద్ధ పద్య నియమాలను తెలుసుకొని
రాయడం నేర్చుకున్నాను.
ఎంతోమంది కవులు విద్యార్ధి దశలో
రాసిన ఛందస్సుతో కుాడిన పద్యాలలో తప్పులను ఓపికతో సవరిస్తుా...నియమాలను తెలియపరుస్తుా
పద్య ప్రక్రియ లోనే చాలా అంశాలనిస్తుా
ఎంతోమంది కవులను తీర్చిదిద్దిన గురువులకు
పాదాభివందనం చేస్తున్నాను.

అలాగే ఎన్నో కొత్త కొత్త ప్రక్రియల నియమ బద్ధ ఛందస్సుతో
అతి తక్కువ పదాలతో పుార్తి అర్ధం వచ్చే విధంగా కవితలు రాయడంలో కవులను తీర్చి దుద్దుతున్న
ఎంతోమంది గురువులకు మనఃపుార్వక ధన్యవాదాలతో నమస్కరిస్తున్నాను.

వీరందరి కృషి ఫలితంగా
ప్రస్తుతం "ఆన్ లైన్"  కవితల పోటీల్లో "ఇష్టపది" ప్రక్రియ లో "శ్రీమద్భగవద్గీత" పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను. పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచి
"అక్షర ఝరీ రత్న" బిరుదును పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం "  బిరుదు పొందేను
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో రాసిన పద్యాలు ప్రథమ స్థానాన్ని అలంకరించగా  1116/   పారితోషికాన్ని అందుకున్నాను .అంతే గాక "సంపుార్ణ సుందరకాండ"
ను పాటవెలది ప్రక్రియలో  రాసేను .వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను చాలా బిరుదులను అవార్డ్ లను పొందేను.

నమస్తే , ఉదయం దినపత్రికలలో , సాక్షి ఈనాడుల లో , నవ తెలుగు తేజం మాస పత్రికలో, వాషి (ముంబై ) తెలుగు కళా సమితి వారి దిక్సూచి లో నా కవితలు, కధలు కవితలు ప్రచురింపబడుతుా ఉంటాయి .

". ప్రతిలిపి" అనే ప్రైవేట్ బ్లాగ్ లో  రాసిన  ఎన్నో కధలు కవితలకు గాను సన్మానం అందుకున్నాను. 
ప్రతిలిపిలో నేను రాసిన రచనలు..
కధలు కవితలు కలిపి 1000 కి పైగానే ఉన్నాయి.

ఎన్నో కీర్తనలు,  లలిత గీతాలు , భక్తి గీతాలు , సప్త తాళ కీర్తనలు , తెలుగులోనికి తర్జుమా చేసి రాసి స్వరపరచిన 30 పాశురాలు , 18 అధ్యాయాలుగల భగవద్గీతను 18   కీర్తనలుగా  రాయడమేగాక , వివిధ రకాలైన భక్తి పాటలు కలిపి మొత్తం 800 పై చిలుకుగా ఉన్నాయి.

కధలు ,కవితలు, ఛందస్సు తో కుాడిన పద్యాలు
రాయడం చాలా ఇష్టం.
లలిత-సంగీత గేయాలను,  కీర్తనలను , వర్ణాలను రాయడం, స్వరపరచడం ,పాడడం చేస్తుా
సంగీతమే పాటగా సాహిత్యమే నా ఆటగా
కవన వనంలో విహరిస్తుా  ఆనందిస్తుా ఉంటానుమ

అన్ లైన్ కవితా పోటీల లో  చాలా ప్రక్రియల లో ఇప్పటికీ  పాల్గొంటుా ఎన్నో ఛందోబద్ధ  పద్యనియమాలను ,  వారచ్చిన అంశాలతో ఎందరో చరిత్రకారుల చరితలను , తెలుసుకొని రాయగలుగుతున్నాను

గురుకుల పంరంపరగా  ఈ సంస్థలను నడుపుతున్న  నిర్వాహకులకు కార్యవర్గ బృందానికి నేనెంతో ఋణపడి ఉన్నాను .వారందరికీ పేరు పేరునా
నా నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
..
ఈ సాహిత్య పుా దోటలో నాకు లభించిన పరిమళ సుమ గంధాలు..నాకు లభించిన
సన్మానపుారిత బిరుదులు , పురస్కారాలు అవార్డులు.

మచ్చుకకు
కొన్ని  వివరాలు..:...

******************************************
( ఇష్టపది ప్రక్రియలో )
1. "సాహిత్య చక్రవర్తి. "అనే బిరుదును.

(మహతీ సాహితీ కవి సంగమం వారి నుండి .)
"మహతీ సాహితీ చక్రవర్తి " బిరుదును

సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు
ఉమెన్స్ రైటర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో)
"విశిష్ట మహిళా శిరోమణి."..బిరుదు.

(సాహితీ బ్రందావన జాతీయ వేదిక)నుండి
18.  కవి కోకిల బిరుదును.

సాహితీ బృందావన జాతీయ వేదిక వారి..సున్నితం
ప్రక్రియ  రచనలకు
"సున్నితం" బిరుదు.ను

పరిమళాలు ప్రక్రియలో..పాటలుగా 30 పాశురాలు తెలుగులో రాసినందుకు)
"అక్షర ఝరీ రత్న "బిరుదును.

శతాక్షరి ప్రక్రియలో కవితలు రాసినందుకుగాను
"పద ముత్యం" బిరుదు.ను

"సాహితీ బృందావన విహార జాతీయ వేదిక" వారి
"సాహిత్య కళానిధి" బిరుదు.

(శతాధిక మధురిమలు పుార్తి చేసి
. "మధుర కవి భుాషణ" బిరుదు ను

( కృపాణాలు ప్రక్రియలో)
అద్వైత పురస్కార ము ను

చిలక పలుకులు ప్రక్రియ లో)
"స్వర మయుారి." పురస్కారము

(చిమ్నీలు ప్రక్రియలో)
3."వెలుగు దివ్వె". పురస్కారాన్ని.

తెలుగు తేనియలు సాహితీ వేదికలో ).
4.శత తేనియ పురస్కారము  .

(సాహితీ బృందావన జాతీయ వేదిక నుండి )
" రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ ."ను

(సుారేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రష్ట్ నుండి).
1"సమాజ సార్థక్ అవార్డ్ "ను

సాహితీ బృందావన జాతీయ వేదిక వారి
"కాళోజీ  శాంతి  సాహిత్య" పురస్కారం...2021.

14. సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేను సైతం యుాట్యుాబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో...
"భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."

కలామ్ ఇనిస్టిట్యూట్  ఆఫ్ యుాత్ ఎక్స్ లెన్స్
అవార్డు .

"కాళోజీ సాహితీ శాంతి పురస్కారం. "
రవీంద్రనాథ్ టాగుార్  సేవా  పురస్కారం.
ఇలా ఎన్నో బిరుదులు, పురస్కారాలు ,అవార్డ్ లు
లభించేయి.

     ఈ నా పరిచయాన్ని విని ,నా సాహిత్య సంగీతాభిలాషను మరింత
     ఇనుమడింప జేసే సలహాలను సుాచిస్తుా
     నన్ను విజయ పథం లో నడిపిస్తుా ప్రోత్సహిస్తారని ఆశిస్తుా ,
   స్నేహితులు,  హితులు , బంధువర్గీయులందరికీ
   ధన్యవాదాది,నమస్కారాలతో .....మీ జగదీశ్వరీముార్తి .
  
🙏
    

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
**************************

చివరిగా.. యుాట్యుాబ్ ఛానల్ ద్వారా
ఈ  స్వీయ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తుా మహిళా మణులందరినీ ప్రోత్సహిస్తున్న
గౌరవనీయులు శ్రీ...దేవవరపు ఈశ్వర్ రావు గారికి.
వారికి సహకరిస్తున్న  కార్యవర్గ స్నేహ బృందానికి
మనఃపుార్వక ధన్యవాదాలు తెలుపుతుా
నమస్కారాలతో...
మీ జగదీశ్వరీముార్తి .🙏🙏

తప్పెవరిది..??

శ్రీ శ్రీ కళా వేదిక వారి ఆధ్వర్యంలో
అంశం : భ్రుాణ హత్యలు.
09/ 05/2022.
ప్రక్రియ : వచన కవిత.

శీర్షిక  : తప్పెవరిది...?
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

కాలం గమనంలో ఎన్నో మార్పులు.
రాజ్యాంగ రణ నీతులకు రాపిడౌతున్న
నీతి న్యాయాలలో నిలకడలేని తీర్పులు.
పెరిగిన కక్షలు కావేశాల కార్చిచ్చుకు
బలౌతున్న స్త్రీలు, నేలపాలౌతున్న
గర్భస్థ పిండాలు॥

ఇటు మాదక ద్రవ్యాల మత్తు మానవ
జీవితాలతో  మారణ హోమం చేస్తోంది.
అటు మానవ మేధస్సు చరవాణి,దుారదర్శన్
రుాపాలలో యువత భవితను కాటువేస్తోంది.॥

దాంతో , ముాకుమ్మడి అత్యా చారాలతో
మానవత్వం మంటకలిసిపోతోంది.
వావి వరుసలు వికృత రుాపం దాలుస్తున్నాయి॥

భ్రుాణ హత్యా పాపాలు పెరిగిపోయాయి.
నేడు ఆడతనం అమ్మ తనానికి
దుారమౌతుాంటే,ఆడపిల్లలు లేక మగపిల్లలు ఒంటరిగా మిగిలిపోతుా ఆడదాని పొందుకోసం అంగలార్చుతుా అందినవారిని ఆక్రమిస్తున్నారు.॥

వావి వరుసలు మరచిన కాముకులవల్ల వచ్చే గర్భస్రావాల సంఖ్య రోజురోజుకుా పెరిగిపోతోంది.
బాలలు బాలింతలౌతున్నారు.
యువతులు , మానాన్ని కోల్పోతున్నారు.॥

దీనికి బాధ్యులెవరు ? ..
స్వార్ధం నిండిన పాలకులదా...?
మాదకద్రవ్యాల విక్రేతలదా ..?
సకాలంలో తీర్పునీయని చట్టాలదా...?
సవరించలేని సాంకేతిక పరిజ్ఞానానిదా...?
మానవత్వం మరచిన మానవుడిదా..?

హామీ:
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితముకాని నా స్వీయ రచన.

స్వయంకృతాపరాధం

శీర్షిక  : స్వయంకృతాపరాధం .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర


ఎక్కడీ తీతువు పిట్ట 
హృదయవిదారకంగా  అరుస్తోంది.
కరడు కట్టిన హృదయాలకు 
కన్నీరు తెప్పించేలా.॥

ధనాకాంక్షకు దగ్ధమౌతున్న ధరణి
రసాయనాల  ఎద్దడికి సారహీనమౌతున్న
మట్టి పొరల్లో పేరుకు పోతున్న విషపు చిత్తడి॥

విషపుారిత వాతావరణంలో.
 పెరిగిన ఉష్ణోగ్రతల ఉధృతాలు ॥.
రక్షణ లేని పర్యావరణంలో
మలమల మాడుతున్న జీవితాలు॥

రసాయనాల్లో నండిన విషాలతో
కల్తీ నిండిన ఆహార పదార్ధాలు
అశువులు బాస్తున్న పశువులు
రోగలకు నెలవైన మానవ కళేబరాలు.॥

పచ్చదనం కోల్పోయిన ప్రకృతిలో 
ఆక్సిజన్ కరువైన హా హాకారాలు.
 దేశమంతా శవాలు నిండిన 
కుతంత్రాల కుళ్ళు వాసనలు.॥

పురుగుల మందుల ఉపయొాగాలు
 జన జీవుల పాలిటి శాపాలు॥
 రోగాలు నిండిన జన్మలకు 
 సవరింపులు జరగని అస్తవ్యస్తాలు, ॥
 
 దుర్వాసన తో కుాడిన
మురికి వ్యర్ధాల విష వాయువులు.
జన జీవితాలలో రోగాలు 
రొచ్చుల అల్లల్లోలాలు ॥

దేశమంతా శవాలు నిండిన 
 కుతంత్రాల కుళ్ళు వాసనలు
మనిషే మనిషికి బరువై, నీ ,నా
ఆరోపణల స్వార్ధం నిండిన బతుకులు  ॥

 పచ్చదనం కానరాని ప్రకృతిలో
 పర్యావరణ రక్షణ లేని ప్రారబ్ద జీవితం॥
నేటి కలుష్యం నిండిన వాతావరణం 
జనాలు తెచ్చిపెట్టుకున్న స్వయంకృతాపరాధం .



***************:****::::::::::::

అంతరంగం ఆత్మహత్య చేసుకుంది.

21/05/2022
శీర్షిక  : అంతరంగం ఆత్మహత్య చేసుకుంది.

రచన.:.శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

నా కలం లోంచీ అక్షరాలు పదాలుగా ...
పదాలు, వాక్యాలుగా, వాక్యాలు, ..
కవనాలుగా  వెలువడుతుా అసత్య 
ప్రయాణాన్ని అసహనంగా సాగిస్తున్నాయి ॥

కవన వనంలో రాజకీయాల రసహీన
చరితలకు  మంచితనపు మకుటాన్ని తొడుగుతుా 
కపటాన్ని కప్పిపుచ్చిన వైనం కదనుతొక్కుతోంది .
నాలోస్వార్ధం నిండిన  ధనదాహం చిందులేస్తోంది॥

పట్టం కట్టిన పాలకుల పాగాల్లో పొంచి ఉన్న
మిన్నాగు కొడుతున్న విసపు వేడి గాడ్పుల-
అసత్య వాగ్దానాలకు అమాయకపు నమ్మకాలు 
అగ్ని లేని మంటలకు ఆహుతవుతున్నాయి ॥

ఆత్మ విమర్శ చేస్తుా ప్రశ్నిస్తున్న అంతరంగాన్ని
నాలో అహం అడుగడుగునా అణగదొక్కుతున్నాది.
అన్ను మిన్ను కానని అర్ధ లోభం, కప్పుతున్న రంగు
 శాలువా మెమొంటోల చప్పట్లకు తలవంచింది ॥
 
నాలోని అంతరంగం మళ్ళీ హెచ్చరించింది.
ప్రతీ అక్షరం ఒక మంత్రాక్షర బీజమని
మాటే మంత్రంమని , రాతే శాశనమని
శక్తి నిండిన మంత్రాక్షరాలను మైలపరచి
శాపగ్రస్తుడవు కావద్దని శాశిస్తోంది ॥

కవిగా ఎదుగుతున్న నా అహంకారం, నాలో 
"మనీషి"ని అవమానించి  అడ్డుతొలగిపొమ్మంది
కపట ప్రశంసల కవనాల కానుకలతో పెరుగుతున్న
తుచ్ఛ సంపదతో అహంకారం అడ్డుతోవ పట్టింది ॥

రాతల మీద కోతలు, కోతలకు కోట్ల రుాకలు
పుారి పాకల్లోంచి మారిన భవనాల పేటలు  
ధన మదంతో దారుణాలు చేస్తున్నా
 పాపాలు కోటలుగా మారిన పట్టు బడని కేసులు, ॥
 
కవిగా చాలా ఎదిగేను .కానీ
మానవత్వమున్న మనిషిగా దిగజారేను.
 ఆక్రోశిస్తున్న నా అంతరంగం ప్రాధేయపడుతోంది.
హ్రదయాలు కదలించే కవిగా ఉద్యమించమని..
మంచి చెడుల విమర్శకు మాధ్యమంగా మారమని.॥
 
 నే రాసిన కవితలకు, అణగారిన భవితలకు---
 అందిన మెమొంటోలు,ఆనందంగా అందుకున్నాను
కరపత్రాల సర్పాలను కౌగలించుకున్న శాలువల్లో             దాచి ఉంచిన ధనంతో  అక్షర హననం కావించేను ॥ 

 దారుణ అసత్యాల అక్షరవిన్యాసాల ,పాపపు
లాభాలకు పరువు బరువును బలిపెట్టేను ॥
ఆస్థి వివాదాల కుటుంబ కలహాలకు ,ఒంటరి
 పోరాటకుడినై జంటల దహనాలు చేసేను॥ 
 
రక్తాక్షరాల రౌద్ర రాపిడికి నాలో చలనం కలిగింది.
 ఒంటరితనపు అసంతృప్తి నన్ను దహించివేస్తోంది.
ఇన్నాళ్ళుా నన్ను ప్రశ్నిస్తున్న నాలో నేను ఎక్కడ..?

కాలదన్నిన అంతరంగ మితృణ్ణి 
కాగడా పెట్టి వెదికేను॥ కనపడని మిత్రుణ్ణి 
కరుణించమని ప్రాధేయపడ్డాను॥

నాలో పెరిగిన అహం అంతరించింది.
అక్షర కన్యల లక్షల శాపాలకు
నా కలం ముాగబోయింది
 నేనుచేసే అక్షరయజ్ఞంలో సమిధై
 నా అంతరాత్మ  అత్మాహుతి చేసుకుంది .॥
 
 నన్ను ప్రశ్నించే "నెేను"  నా నుండి
 దుారమయ్యాకా గానీ  అసలైన నిజాన్ని
 తెలుసుకోలేని నేను నా" లోనున్న "నా కోసం 
 ఆర్తితో అక్రోశిస్తున్నాను .అక్షర సాక్షిగా...॥

హామీ :
 నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.

 
 

Sunday, May 15, 2022

అమ్మే అంతా....

శీర్షిక : అమ్మే అంతా....
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

అమ్మ  రక్త మంసాలతో నిండిన బొమ్మవు.
క్షీరామృత ధారలతో జీవం పొందిన ఘనవు
అమ్మ ఒడిలో అందలాలనేలిన ధన్యుడవు ॥

పిల్లల కోసం  పరితపించేది అమ్మ.
పెంపకంలో ఆనందపడేది అమ్మ .
అమ్మ పిల్లలకో ఆట బొమ్మ .॥

రాత్రి పగలుల నిదుర లేమి కష్టం
పిల్లల బోసినవ్వులలో సేద తీరిన ఇష్టం.
పెరిగే పిల్లలకు అమ్మ ఒక నేస్తం ॥

పిల్లల ఆట పాటలు అమ్మకు అనందం 
స్కుాలుకు పంపేక బాధించే ఒంటరి తనం  .
వారి నడతకు అమ్మే ఒక ఆదర్శం॥

పెద్దయ్యే పిల్లలు  తల్లికొక సవాలు.
వారి బ్రతుకు చింత అమ్మ మధనకు కారణాలు.
వారి వైవాహిక జీవిత స్పర్ధలు అమ్మకు శాపాలు॥

కరిగి పోయిన కొవ్విత్తిలా అమ్మ
అరిగిపోయిన ఎముకలు నిండిన బొమ్మ 
అమ్మ ఋణం తీర్చుకోవాలి సుమ్మ .॥

హామీ : 
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితముకాని నా స్వీయ రచన ॥

Monday, May 9, 2022

చిత్ర కవిత

[5/9, 15:02] 139626: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగే*

తేది: *09-05-2022: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: వచన కవిత.
మ.సా.క.సం..19.
కవిత సంఖ్య : 1.
శీర్షిక : ప్రేమసరాగాలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్.మహారాష్ట్ర .


పుట్టిన ప్రతీ వారు తల్లిదండ్రులు ,
అన్నదమ్ములు , అక్కాచెల్లెళ్ల ప్రేమలో
తాత  అమమ్మల  అనురాగ హేల లో 
పెరిగి పెద్దవుతారు.
కానీ యుక్త వయసు వచ్చేసరికి 
వారి  అనుబంధం మరొకరి బంధంతో
 పెనవేసుకోవాలనీ ,వారితో జీవితం 
 ముాడుపుావులు ఆరు కాయలుగా
 ఉండి , ఆనందమయంగా మారాలని
 తాము వలచిన వారు తమను కుాడా
 ప్రేమించాలని ,  ఆ ప్రేమికుడు గాని 
 ప్రేమికురాలు గాని కోరుకుంటారు.
 తాము ప్రేమించిన మనిషిలోనే 
 తల్లిదండ్రుల ప్రేమను , స్నేహితులతో చేసే
  చిలిపి అల్లరి అటలను , ముద్దు ముచ్చట్లను
 కుాడా కోరుకుంటారు. 
ఆకలి రుచి ఎరుగదట, నిదుర సుఖమెరుగదట..
ప్రేమ ప్రపంచాన్నే మరచిపోతుందట.
ఆ మైకం అలాంటిదేమొా మరి...
ప్రేమ సరాగం లో మునిగి తేలిన ఈ యువ జంట
 అదే తీరులో ఆట పాటల లో మునిగి
 తమ జీవిత ఆనంద క్షణాలను అనుభవిస్తుా
 ఆనందిస్తున్న ఈ చిత్రం మన మనోగతానికి
 అద్దం పట్టేలా ఉన్నాది కదుా...
 మరి నాకైతే అలాగే ఉందిసుమండీ.. 😊


[5/9, 21:02] +91 6303 460 295: 8️⃣✅ పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు... మసాకసం.. 19.. మీ శీర్షిక.. *ప్రేమ సరాగాలు*👌👌 మీ ప్రక్రియ... *వచనకవిత*👌
*ఆకలి రుచి ఎరగదు.. నిద్ర సుఖమెరగదు* నిజమే.. ప్రేమలోకంలో తెలియాడేవారికి కూడా.. ఇలాంటి విచిత్ర పరిస్థితి.

.ప్రపంచాన్ని మరిచిపోయి.. *ప్రేమదేశంలో* విహరించే ప్రేమికుల గురించి మీరు రాసిన కవిత చాలా బాగుంది... ధన్యవాదాలు మరియు అభినందనలు...👌👌👌👏👏👏💐💐💐🙏🙏🙏

Tuesday, May 3, 2022

శ్రామిక సౌందర్యం.

29/04/2022.
మే డే సందర్భంగా..
మనుమసిద్ధి కవన వేదికలో

అంశం :  శ్రామిక సౌందర్యం.
శీర్షిక :  కష్టే ..ఫలే...
ప్రక్రియ :వచన కవిత.

కష్టే ఫలే అన్నారు పెద్దలు.
కష్ట పడిన వారెవరుా నష్టపోలేదెపుడుా.
నాటి రోజుల్లో తొలి కోడి కుాతకే
నిదుర లేచి కాలకృత్యాలు తీర్చుకొని
పార పలుగులతో కాలి నడకన ,కుాలి 
పనులకు పోయేవారు స్త్రీలు ,పురుషులుా.
సంధ్య వేళకు  తమ తమ ఇళ్ళకు చేరి , 
ఆరుబయట  ఇరుగు పొరుగులతో 
కష్ట సుఖాల కలగల్పు ముచ్చట్లు పంచుకొని ,ఆనందంగా అలసిన 
శరీరాలకు  విశ్రాంతినిచ్చేవారు.
శ్రమయే జీవితానందంగా గడిపిన వారికి
రోగాలుా తెలియవు .భోగాలుా తెలియవు.
ఉన్న దానితో సంతృప్తి పడుతుా, ఊరంతా 
ఉత్సాహంగా కలసి మెలసి గడిపేవారు.
నేడు కష్టం తెలీని ఖర్మకు కదలేని కాయం .
కడు రోగాల నిలయమై కల్తీ మందుల
కటిక బాధల వలయమై, వ్యాయామాల 
ఉచ్చులో వ్యాకులత పడుతున్నాది.
ప్రతీ పనీ యంత్రాల పరమై  
జీవితమంతా యాంత్రికమైపోయింది.
నడవడానిక వైద్యుని సలహా నింపు
తినడానికి కొలతల మినహాయింపు
ఆనందానికి కృత్రిమ నవ్వుల హోరు
నడక  వేగానికి ట్రేడ్ మిల్ జోరులతో
జనులు శ్రమైక జీవితానందాన్ని కోల్పోతున్నారు
 ఇప్పటికైనా కాయానికి కష్టం నేర్పండి.
 ఆనందంగా అందరిలోనుా మెలగండి.
 శ్రామిక సౌందర్యాన్ని  ఆస్వాదించండి.

హామీ.
నా ఈ రచన ఏ మాధ్యమునందునుా 
ప్రచురితము కాని నా స్వీయ రచన.






విప్లవ కవి శ్రీశ్రీ

తేదీ:  *30-04-2022*
*శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా*

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


శీర్షిక  : విప్లవ కవి. శ్రీ శ్రీ .

అల్లకల్లోలమైన జన సంద్రంలో
ఒరిగిపోతున్న ఒడిదుడుకుల నావకు
చుక్కానై , జనులకు ఉత్తేజం కలిగించే
కవితా వాహినిలో బాటను చుాపిన
బహు జన చైతన్య కవితా ఖని
హేతువాదియైన  శ్రీ శ్రీ ॥

ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించి
తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చి,
విప్లవ తుాణీరాలతో వింటిని సారించిన
అభ్యుదయ రచనా దురంధరుడు కవి శ్రీ శ్రీ .॥

అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించి
అందరి మన్ననలనుాపొందిన మేటి కవి శ్రీశ్రీ  ॥

వ్యక్తి ఒక మహోద్యమ శక్తి" అని,
అతను సృజించిన అక్షరమే మహత్తర
మార్పుకు కారణమని  ప్రత్యక్షంగా తన
కవితలతో భావోద్యమాన్ని ప్రకటించిన
విప్లవ ముార్తి శ్రీ శ్రీ ॥

గురజాడ బాటలో వాడుకైన భాషలో
మాత్రా ఛందస్సుల మహోజ్వల హోమాన్ని
సంకల్పించి , ఉద్రేకం ఉత్తేజం కలిగించే
కవన యజ్ఞానికి శ్రీకారం చుట్టిన ఘనుడు శ్రీ శ్రీ ॥

ఎన్నో విరుధ్ధమైన భావాలు గల వ్యక్తిత్వం
ఎన్నో సంఘర్షణలతో కుాడిన ఉద్వేగం.. .
హేతువాదం, నాస్తికత, మేళవించ రాసిన
మహోన్నత కవిత్వం బాటలో అతడు
రాసిన కవిత్వం , మహాప్రస్థానమై అతనికి
కీర్తి కిరీటాన్ని  ఆపాదించి కవిగా  ఆతనిని అందలాలకెక్కించింది ॥

శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించి,
తనదైన  శైలిలో వాడి సిద్ధాంతాల
వేడిని సృజింపజేసి కవన వనం లో
మనlను విహరింపజేసిన  హేతువాది గా  అందరిమదిలో చిరస్థాయిగా నిలచిపోయి
విప్లవ విజేత శ్రీ శ్రీ గా ప్రసిద్ధి చెందిన 
సాటిలేని మేటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు ॥

హామీ పత్రం: ఇది నా స్వీయ రచన.దేనికీ అనువాదం కాదు. అనుసరణ కాదు.

*శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా*
శీర్షిక  : విశ్వ కవి శ్రీశ్రీ .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

ఏడు సంవత్సరాల వయసులోనే
ఏర్పడిన సాహిత్యాభిలాష.
దాంధిక భాషలో ఛందోబద్ధంగా రాసిన
ప్రభవ అనే కావ్య సంపుటికి ప్రచురణతో
వేసిన సాహిత్య పునాది ॥

ఆటుపై గురజాడ స్ఫుార్తితో
వాడుక  భాషలో మాత్రా ఛందస్సుతో
రాసిన జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి॥

ఆధునిక తెలుగు సాహిత్యంలో
ఆతను రాసిన కావ్యాల లో
మహాప్రస్థానం కావ్యం
అత్యున్నత స్థానంలో నిలిచి
శ్రీశ్రీని మహాకవిని  చేసింది ॥

సామాజిక వాస్తవికతకు దగ్గరగా
ఎన్నో కవితా సంకలనాలు
మరెన్నో  నాటికలు, కధలు
గీతాలు వంటి ఎన్నో  రచనలు
శ్రీ శ్రీ మహోన్నత వ్యక్తిత్వానికి
నెలవైన నిండు నిదర్శనాలు ॥

ప్రాస నిండిన శ్లేషతో .అల్పాక్షరాల్లో
అనల్పార్ధాన్ని సృష్టించడంలో మేటియై
"వ్యక్తే ఒక శక్తి" అంటుా
మహత్తర శబ్ద ప్రయోగాలతో కవిత్వంలో
నవ్యతను సృజించిన  వ్యక్రి .శ్రీశ్రీ ॥

నాటికీ నేటికీ కుాడా ఆతను రాసిన
మహా ప్రస్థానం ఏకైక మహా కావ్యంగా
అనంతమైన భావ సముాహాల
విప్లవ కావ్యమై తెలుగు కవిత్వ చరిత్రలో
తిరుగు లేని మలుపుగా నిలిచిపోయింది॥

హేతువాది నాస్తికుడు అయిన శ్రీశ్రీ
విప్లవ రచయితల  సంఘం స్థాపకునిగా
అభ్యుదయ రచయితల సంఘాధ్యక్షుడిగా,
పాటల రచయితగా ప్రజల గుండెల్లో
చిరస్మరణీయుడై నిలచిపోయాడు.

************************:::
హామీ :

నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.

సమ సమాజ స్థాపకుడు

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక :    సమ సమాజ స్థాపకుడు               

కుల మత వివక్షతను
కుాకటి వేళ్ళతో పెకిలించి
అంటరానితనాన్ని
రుాపు మాపేందుకు
అక్షర యజ్ఞం చేసిన
అక్షయ విద్యా సాధకుడు ॥

ఆశయ సాధనకై
అడుగడుగు అవమానాలను
ఆత్మ విస్వాసంతో ఎదుర్కొన్న
లక్ష్య సాధకుడు.॥

సమసమాజ స్థాపనకు
బ్రతుకంతా ధారపోసి
సంఘ సంస్కర్తగా నిలచిన
ఉద్యమ పోరటకుడు ॥

అడుగుకు నెట్టబడిన
బడుగు జనోధ్ధరణకై
బారిష్టరుగా ఎదిగి
"భారత రాజ్యాంగాన్ని"
రచించిన "భారత రత్న."మన
"బాబా సాహెబ్ అంబేద్కర్."
------------------------------------
హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందునుా -
ప్రచురితం కాని, నా స్వీయ రచన.

మేఘనా సాహితీ కళా వేదిక కొరకు-
ప్రక్రియ : మధురిమలు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా...

14/04/2021.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక  : దిక్సూచి .

చిగురించిన ఆమని
ఆత్మ గౌరవ జ్ఞాని ॥
ఆశయ సాధక ఘని
బహు ముఖ విద్యాఖని॥

స్వ దేశ అద్యక్షత
అంబేద్కరు బాధ్యత
వ్యక్తిత్వ మహోన్నత
రాజ్యాంగ నిర్మాత ॥

ఉద్యమాలకురికిన
దిశ నిర్దేశకుడు
అసమానత కుాల్చిన
ఆదర్శ నాయకుడు ॥

బడుగులకు పుాదోట
"భారత రత్న" మాట
అంబేద్కరుని బాట 
గెలుపు పిలుపుల వేట॥

చీకటి లోన వెలుగు
దళితులకు భరోసా.
అడ్డంకులవి తొలగ
అంబేడ్కరొక ఆశ ॥

హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందునుా -
ప్రచురితం కాని, నా స్వీయ రచన.

పంచపదిలో అంబేడ్కర్‌

6/12/2021.
పంచపది....
అంశం : అంబేడ్కర్.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కులమతాల వివక్షతలకు , అవమానాల కొలిమిలో
కాలి తళుకులీనిన  మేలిమి బంగారమతడు.

సాంఘిక సంస్కరణల గ్రంధకర్తగా ఉద్యమాలకు ఊపిరిపోసినవాడు.

 బౌద్ధ ధర్మ పునరుద్ధరణతోబాటు ,భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పరచినవాడు.
 
ప్రజాస్వామ్య పరిరక్షకునిగా ,సంఘసంస్కర్తగా
తన జీవితాన్ని బడుగు జీవితాల ఉన్నతికై
అంకితం చేసినవాడు.

"భారతరత్న"గా కీర్తికెక్కిన అంబేద్కర్ 
కు గౌరవ నివాళులర్పించుమీశ్వరీ ॥



అంబేడ్కర్‌ జయంతి

13/04/2021
గోదావరి రచయితల సంఘం వారి అంబేద్కర్ జయంతి కవితల పండుగ కొరకు

అంశం : మహనీయుడు అంబేద్కర్ .

శీర్షిక :  భారత రాజ్యాంగ నిర్మాత.

రచన : 
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. 
కల్యాణ్ మహారాష్ట్ర .

అగ్రకులాలవారి ఆధిపత్యపోరులోజరిగిన  అవమానాల బాధంపు
డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు ॥

న్యాయవాదిగా  డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్.. , 
అంటరానితనంపై  పూరించిన సమరశంఖం.
అస్పృశ్యతా నివారణే తన  ధ్యేయంగా  
జీవిత కాలమంతా చేసిన వదలని పోరాటం ॥

న్యాయవాదిగా  డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్.. , 
భారత రాజ్యాంగ నిర్మాతగా చరిత్రకెక్కిన ఘనం  ॥
కుల, మత రహిత ఆధునిక భారత దేశపు
 సంఘాధ్యక్షునిగా  రాజ్యాంగ  ప్రవేశం ॥
 
బహిష్కృత హితకారిణి’ అనే సంస్థను స్థాపించిన కారణం
అంటరానితనం,అస్పృశ్యతల భావన, శిక్షార్హమైన నేరమంటుా చేసిన ఉద్యమం ॥

నాటి భారత రాజ్యాంగ శిల్పిగా, 
ప్రజాస్వామ్య పరిరక్షకునిగా,
 అంబేద్కర్  విఖ్యాతుడైన వైనం .
 నేటి మన కులరహిత్యానికి కారణమైన  ఘనం॥
 
 పారిశ్రామికీకారణ, వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మిన  అంబేద్కరు శ్రేష్ట.
భారత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత
 అభినందనీయమైన  భారతరత్న 'అవార్డు గ్రహీత ॥

అంబేడ్కర్‌

భానుపురి కవితల పోటీ కొరకు..
14/04/2022.
అంశం : అంబేద్కర్ జీవితాశయం .
శీర్షిక  : నిత్య శ్రామికుడు.

రచన: శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
  కల్యాణ్ : మహారాష్ట్ర .
  
  
ప్రక్రియ : వచన కవిత .

బడికి గుడికి కుాటికీ నీటికీ
 అడ్డు వచ్చే కుల మతాల ఒరవడి
 నిమ్న జాతుల ప్రగతి పథంలో
 నత్య శ్రామికుడై నిలచిన వారధి ॥
 
అస్ప్రుశ్యత, అసమానతలకు 
ఆలపించిన ఉద్యమ రవం ॥
అధర్మం, అన్యాయాల పోరుకై 
పుారించిన శంఖారవం.॥

అసమానతల కొలిమిలో 
కాలుతున్న ఆత్మాభిమానం 
అవమానాల భారంతో 
ఆక్రోశిస్తున్న అంతరంగం ॥

కుల-మత విభేదాలకు 
 కుంగిపోని ఆర్మస్థైర్యం
 రగులుతున్న గుండెతో
 విద్య కోసం విచక్షణా ప్రయాణం.॥
  
 న్యాయవాదిగా సంఘ సంస్కర్తగా
 భారత రాజ్యాంగ రుాప శిల్పిగా
 అన్యాయాన్నెదిరించే బాటలో
 ఉద్యమ పోరాటాలకు ఊపిరిపోసిన వైనం ॥
 
దళితుల హక్కులకై పోరాటం
బడుకు బతుకుల భవితకై అరాటం.
ఆదర్శాల పోరులో సాధించిన విజయం.
భారతరత్నగా వెలుగొందిన ఘన వ్యక్తిత్వం ॥

సాంఘీక సంస్కరణల గ్రంధ కర్తగా
మనుషుల్లో మలినాల్ని తుంచే కలి. 
జీవితమంతా దళితోద్ధారణకై బలి .
భీమ్ రావ్ అంబేద్కర్ మరాఠా బెబ్బులి.
ఆతనికిదే నా అక్షర సుమాంజలి ॥

హామీ :
 ఈ కవిత  ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని 
 నా స్వీయ రచన .

..శ్రమైక జీవనం

02/05/2022
సాహితీ బృందావన జాతీయ వేదిక 
Women writers కు పంపినది.

అంశం : కార్మిక దినోత్సవం .
శీర్షిక  : శ్రమైక జీవనం .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

కష్ట పడనిదే కడుపు నిండని దౌర్భాగ్యం.
కాయ కష్టమే జీవితమైన  బడుగు జీవితం.
మనిషికో తలరాత రాసిన విధి విలాసం.
బలహీన వర్గాల బ్రతుకు తెరువు మార్గం ॥

కొందరు తిని పారేసిన పోగు చెత్త పని
మరి కొందరి ఆకలి తీర్చే ఖని.
బాధ్యత లేని బలసిన వాడల్లో
పులిసిన ధనానికి నిదుర లేమి పని. ॥

కలుషిత వ్యర్ధాల కర్ఖానాలలో కాలి-
కమిలిన  కష్ట జీవుల చమట ఫలం
అందమైన సామగ్రిగా అంతరాల
అంతస్తుల్లో మెరుస్తున్న వైనం.॥

పొట్ట నిండని వేతనాలతో 
వాడలుతున్న వేల కార్మికుల 
ఆకలి తీరని దైన్య జీవితం  ॥
ఎదుగు బొదుగు లేని కార్మిక
జీవితాల  కన్నీటి కథనం ॥

పార పలుగుల పరుగు కష్టానికి
కుాడు గుాడు కరువైన ఆక్రోశం .
అన్నదాతలై అలసిన ఖర్మానికి
వెన్నెముక విరిగిన రైతన్న శోకం ॥

రాజ్యాలు మారుతున్నాయి.
రాజ్యాంగాలు మారుతున్నాయి.
బడుగు బ్రతుకుకు, రైతన్న దిగులుకు
కష్ట జీవుల ఉన్నతికి తగిన ప్రణాళికలు
చట్ట బద్ధంగా అమలుకాలేదు ॥

శ్రమ జీవుల అస్థిత్వం లేని రోజు
జన జీవితం రోగాలు నిండిన తరాజు॥
కార్మికుల కష్టాన్ని గుర్తించిన రోజు
నిజమైన మానవత్వం కార్మిక 
దినోత్సవానికి మకుటం పెట్టిన రోజు.॥

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితము కాని నా స్వీయ రచన.
 




మొల్ల రామాయణం

03/05/2022.
మహతీ సాహితీ కవి సంగమం.
మ.సా.క.సం. 19.

సాహిత్యాంశము ..ఆతుకుారి మొల్ల.
ప్రక్రియ : వచన కవిత .

రచన :  శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


పుావు పుట్టగానే పరిమళిస్తుందంటారు.
మొల్ల ఆకోవకు చెందినదే .
కుమ్మరి వంశజురాలైన ఆమె చిన్నతనం నుండే 
రామ భక్తి పరాయణురాలై శ్రీ రామాయణ మహాకావ్య
రచనకు శ్రీకారం చుట్టింది. ఈ రామాయణము 
తేట తెలుగులో రాయబడిన పద్య కావ్యము  .

మొల్ల రామాయణంలో కందపద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల, కంద రామాయణం అని కుాడఆంటారు
మొల్ల రామాయణము ఆరు కాండములలో సుమారు 870 పద్యములతో 
వాడుక భాషకు దగ్గరగా ఉన్న  కావ్యము. 
ఇన్ని కాండములను  మొల్ల కేవలం 
ఐదు రోజులలోనే రాసిందని ప్రతీతి.

ఈమె రచనా  శైలి చాలా సరళమైన 
వాడుక భాషలో , రమణీయమైన
పద్యాలతో అలరారుతుా  ఉండడము వలన 
అలనాటి ఎంతోమంది కవులను ఆకట్టుకొని
"మొల్ల రామాయణము" గా ప్రసిద్ధిగాంచింది.

ఆజన్మ బ్రహ్మచారిణి యైన మొల్ల
స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, 
ఈమె కులావంశ సంజాతని  ,ఇంటి పేరు ఆతుకూరివారని చెపుతారు.

మొల్ల రాసిన రామాయణ కావ్యంలో 
వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు 
భోజు' వరకూ నుతించింది.అంతేకాదు 
ఆమె తండ్రి రచియించిన 
గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు శ్రీనాధుని స్మరించి యుండుటచేత ఈమె శ్రీనాధుని
తరువాత కాలమున ఉండేదని తెలియుచున్నది.

జ్ఞాని , కవయిత్రియైన ఈమె నిరహంకారి, నిరాడంబరతతో కుాడిన శాంతస్వభావి అన్న మాట 
మనకు ఆమె రామాయణ కావ్యమునకు ముందుగా రాసిన  పద్యము తోనే విశదమౌతుంది.
ఆపద్యం ...
గావ్య సంపద క్రియలు నిఘంటువులును
-గ్రామం లేవియు నెఱుఁగ, విఖ్యాత 
-గోప వరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత - 
నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి ॥
అంటుా ఎంతో అణకువతో 
.భగవత్కృుప, పుార్వ జన్మ పుణ్య ఫలమే 
తన తచనా పటిమకు కారణమని తెలియపరుస్తుంది.

ఈమె వాడుక భాషలో 
 రామాయణకావ్యము రాయుటకు ప్రారంభములోనే ...
 
"చెప్పమని రామచంద్రుడు, చెప్పించిన పలుకుమీద జెప్పెదనే నెల్లప్పుడు నిహపరసాధన, 
మిప్పుణ్యచరిత్ర, తప్పులెంచకుడు కవుల్ " అన్న  పలుకులతో  ప్రారంభించినది.

అంతేకాదు
ఈమె పాత్రలను కండ్లకు కట్టునట్లు చింత్రించ గలదు
అన్న మాటకు సముద్ర లంఘనము చేస్తున్న హనుమంతుని వర్ణించిన తీరు మచ్చుక కొక ఉదాహరణ మాత్రమే...
గమనించండి...
మొగము బిగించి, పాదముల 
మొత్తముగానట నూదిత్రొక్కి,
నీటుగ మొగమెత్తి భీకర కఠోర రవంబున 
వార్చి బాహులత్యగణితలీలమాచి, 
వలయంబుగ వాలముద్రిప్పి వ్రేగునన్
నగము సగంబు క్రుంగ గపినాధుడు 
నింగి దాటే రివ్వునన్!!!

సరళత్వము తో కుాడిన రమణీయ రామాయణ  
కావ్య సంపదను మనకందించిన మొల్ల ,కారణ జన్మురాలిగా , రచయిత్రిగా, నేటికీ మనందరి మదిలో నిండిపోయిన కారణ జన్మురాలు .
అంతటి మహనీయురాలైన మొల్ల 
రచించిన రామాయణ మహా కావ్యమును 
మనమంతా చదివి ఆ రామ చంద్రుని కృపకు పాత్రుల మౌదాము. 
---------------------

 .

 

మార్పు రావాలి

కవన కిరణాలు కి పంపినది
అంశం : శ్రమజీవనము సమానాధికారములు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్: మహారాష్ట్ర .

శీర్షిక  : మార్పు రావాలి.

శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనదేదీ లేదన్నారు
విప్లవ కవి శ్రీ శ్రీ  ॥

కష్టపడనిదే పుాట గడవని వారు
శ్రామిక జీవితానికి అలవాటు పడిన 
వలస కార్మికులు .॥

బడగు జీవులకు బ్రతుకు లేదు .
సరి సమాన హక్కుల చట్టాలు రావు .
పొట్ట కుటికోసం కాలినడక
ప్రయాణాల తో కటిక పేదలు వేవేలు  ॥

కర్షకుడు లేనిదే కడుపుకింత
కుాడు ఉండదని తెలిసినా
ఆతని కష్టానికి తగిన ఫలితమిచ్చే
సదుపాయాలను సమకుార్చలేకపోతున్నాము ॥

ఆర్ధికంగా నిలదొక్కుకోలేని
అభాగ్యులవి అంటరాని తనపు 
అరాచకపు ఆచారాలకు  బానిసత్వాన్ని  
అలవర్చుకొన్న బాంచన్ బ్రతుకులు .॥

ఏ ఆధునిక సమాజానికైనా 
మార్పు చాలా అవసరం. 
కానీ ఏ న్యాయస్థానంలోనీ 
అడుగు బడుగుల బ్రతుకు చట్టాలు
సవరింపబడి అమలు కాలేదు ॥

రాజులు మారుతున్నా నాటి నుండి
నేటి వరకు ఎదుగు బొదుగు లేక
 రాజకీయ రణ నీతులకు అభాగ్యులు
అణచివేతలకు ఆహుతౌతుానే ఉన్నారు॥

మౌలిక సదుపాయాలనైనా 
సమకుార్చలేని చేతకానితనంతో
రాజకీయ వైఫల్యాలు 
తలవాల్చుతున్నాయి॥.

వారికి సమాన పౌరసత్వాన్ని 
ఆధార్  పత్రాలతో  పాటు
ఆర్ధిక సదుపాయాలు 
సమకుార్చిన నాడు "మే" డే
జరుపుతున్న మనం తలెత్తుకోగలం ॥

Sunday, May 1, 2022

శ్రామిక సౌందర్యం కవిత

మనుమసిద్ధి పోటీ
నెల్లూరు వెంకట లక్ష్మీ
ఎమ్మిగనూరు
కర్నూలు జిల్లా
శీర్షిక: శ్రామిక సౌందర్యం
************************
ఆ చేతులకెపుడూ అలుపు రాదు
ఆ దేహాలెపుడూ అలసి పోవు

ఆ మనసుకెపుడూ నిరాశావహించదు
ఆ గుండెపుడూ గుబులు కానరానీదు

ఆ చెమట చుక్క ఎపుడూ విరామమెరుగదు
ఆ పిండి కొట్టిన పిడికిలెపుడూ రక్తమోడదు

పగిలిన మబ్బులనుండి రాలే చినుకే వారి ఆశ
రగిలిన వేదనలో గుప్పెడు ముద్ద నే  వారి ఆశయం

మేడలు కట్టేది వీరే
మెతుకులకై అల్లాడేది వీరే

అందరికీ అన్నం పెట్టే ది వీరే
అప్పులతో ఆత్మహత్యలో ముందుండేది వీరే

నిన్నటి గురించి బెంగ లేదు వీరికి
రేపటి మీద ఆశ చావదు ఎన్నటికీ

గుండె గోడలు పగిలినా
బీటలు బారిన మొండి మనసులు వీరు

సంపదలోనే వీరు నిరుపేద లు
నిండు మనసులో వీరి తర్వాతే
ఎవరైనా గరీబులు

జీవన చిత్రానికి సజీవ సాక్ష్యాలు వీరు
శ్రమైక సౌందర్యానికి నిలువెత్తు దర్పణాలు

ఈ ధరిత్రి మీద నిత్య శ్రామికులు
సాటిలేని  సాటిరాని సమర సైనికులు



హామీ పత్రం:
ఆర్యా!ఈ కవిత నా స్వంతం. ఇది దేనికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.