Thursday, September 28, 2023
శ్రావణమేఘపు జావళికథలు * అనే అంశం పై , ఈ పుస్తకం కోసం సెలెక్ట్ చేసుకున్న కథలు.
Wednesday, September 27, 2023
ఓటు విలువ
27/09/2023.
తపస్వీ మనోహరం e book కొరకు
అంశం : ఓటు--విలువ
శీర్షిక : నేటి భారతం .
రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .
నిరుద్యోగ సమస్యలకు నీరైపోతున్న జీవితాలు
తీరని సమస్యలతో అడుగడుగున అగచాట్లు
ముద్దు మచ్చట్లు తీరక యువత పడుతున్న పాట్లు.
నోట్ల కొరతతో నోచుకోని సుఖాలకై ఎదురు దాట్లు॥
ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నిండిన ఓటర్లు.
మనుషుల బలహీనతకు "బ్యాలెట్ బాక్స్"లో
కౌంట్ ఔతున్న ,ఓట్లు.
నోట్లకు అమ్ముడుపోయిన ఓట్లు కొడుతున్న సిక్సర్లు.!!
ఏకాదశ గ్రహ బలంతో గద్దెనాక్రమిస్తున్న
అక్రమ- నాయకత్వాలు ॥
నోట్లు ఓట్ల గారడీలో రన్నౌట్ అవుతున్న ప్రజా వికెట్లు .
బౌన్స్ ఔతున్న ధర్మ వ్యవస్థలు ,న్యాయాధికారాలు.
ఓటింగ్ వ్యవస్థలో అధర్మంతో కుాడిన అస్తవ్యస్థాలు.
గుర్తింపుకు రాని అబద్ధపు ఓట్లతో గెలుపు పతాకాలు॥
కాలే కడుపులకు ఐదు వత్సరాల ఎన్నికల సమయం .
ఓటునమ్మిన నోట్లతో కడుపులు నింపుకునే దైన్యం .
మద్యం వేటగాళ్ళకు మత్తు మందుతో వైద్యం .
నాయకుడెవరైనా మారనిబ్రతుకుల మండే జీవితం॥
ఇదే ఈనాటి అవినీతి నిండిన....ఎన్నికల పర్వం.
చదరంగపు టెత్తులకు దిగజారిపోయిన నేటి భారతం..
కలలు కల్లలై , ఓడిన, నేటి భారతి కన్నీటి కథనం ॥
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన. మత్తుకు చిత్తైపోతున్న జనం ॥
అంశం : మహిళా రిజర్వేషన్ బిల్లు
అంశం : మహిళా రిజర్వేషన్ బిల్లు
శీర్షిక : ఎండమావులు.
(వ్యాసం).
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
-------------------
పార్లమెంటులో అనేక అవరోధాల తర్వాత, భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్లు కల్పిస్తూ, మార్చి 9, 2010న రాజ్యసభలో ఆమోదించబడింది
గత 27 సంవత్సరాలుగా,"మహిళా రిజర్వేషన్ బిల్లు" పెండింగ్‌లో నే ఉండిపోయింది. .
ఎన్నికలు వస్తున్నాయి . నాయకులు మారుతున్నారు. రాజ్యాంగాలు మారాయి. చట్టాలు మారాయి కానీ ," మహిళా రిజర్వేషన్స్ బిల్లులు " మాత్రం ,పాస్ కావడం లేదు.
పంచాయతీ స్థాయిలో 33 శాతం రిజర్వేషన్ల చట్టం ఉంది. అయినా కూడా పార్లమెంటు, శాసనసభల్లో అదే రిజర్వేషన్‌పై ఏకాభిప్రాయం ఏర్పడేందుకు మూడు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది.
మహిళలకు రాజకీయ అవగాహన లేదని, ఇన్నిరోజులు రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చారు.
భారతదేశంలో" మహిళా రిజర్వేషన్ బిల్లు,"
పార్లమెంటులో అనేక అవరోధాల తర్వాత, మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్లు కల్పిస్తూ, మార్చి 9, 2010న రాజ్యసభలో ఆమోదించబడినా,
2014లో లోక్ సభలో ఆమోదించబడలేదు , సరికదా, ,అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ కూడా దీనిని ముందుకు తీసుకెళ్లలేదు.
పురుషాధిక్యత గల రాజకీయాల్లో, రిజర్వేషన్ ద్వారా మహిళలు రాజకీయాల్లోకి రావడాన్ని గట్టిగా సమర్థించలేకపోయారు పురుష నాయకులు.
1992లోనే ,పంచాయతీల్లో ,సర్పంచ్‌లుగా ఎన్నికైన మహిళల పేర్లు, కాగితాలపైనే నిలిచిపోయాయి. ఆ పదవిలో భర్తలు
"సర్పంచ్-భర్త'" అనే ముద్దుపేరు తో ,పెత్తనం చేస్తూ వస్తున్నారు.
----------------
ఎట్టకేలకు. మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలలో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన "మహిళా రిజర్వేషన్ బిల్లును "మోదీ ప్రభుత్వం ,పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
కానీ..రిజర్వేషన్‌లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉప-రిజర్వేషన్లు కల్పించే నిబంధన ఉన్నా ,. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించలేదు సరికదా ,
ప్రతీ లోక్‌సభ ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ స్థానాలను మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు.అంతేకాదు...
రాష్ట్రం ,లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని, వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా, రిజర్వ్‌డ్ సీట్లను కేటాయించవచ్చని సూచించారు. ఈ సవరణ ప్రకారం,
చట్టం అమలులోకి వచ్చిన 15 ఏళ్ల తర్వాత గానీ, మహిళలకు సీట్ల రిజర్వేషన్ అమలు చేయబడదు.బిల్ ",అయితే ఇప్పుడు" పాస్ "అయిపోతుంది.
దాని కానీ దాని "ఎఫెక్ట్ "మాత్రం,
L2027 లో "జనగణన " జరిగిన తర్వాత ,2028 లో జరిగే తెలంగాణ రాష్ట్ర, శశాశనసభా ఎన్నికలతో పాటు, 2029, లో జరిగే లోక్ సభ ఎన్నికల తరువాతే ,మహిళా బిల్లును అమలు చేసే అవకాశం ఉండవచ్చని చెపుతున్నారు గానీ అదీ ఇంకా తేలలేదు.
కారణం...ముందుగా,జనాభా లెక్కల సేకరణ జరగాలి.2026 లో నియోజక వర్గాల పునర్విభజన కూడా జరగాలి
."రీ లిమిటేషన్" జరిగిన తర్వాత కూడా ఎన్నోసార్లు
ఈ" బిల్లును" అమలు చేసే ప్రయత్నంలో,
ఆ పార్లమెంటు కు చెందిన బలహీన వర్గ నాయకులు
దీనిని అడ్డుకున్న కారణంగా, ఆగి పోయేది.
ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టాలని
అనుకున్నపుడు ,ములాయం సింగ్ , లాలూ ప్రసాద్ యాదవ్
వంటి వారు దీనిని అడ్డుకున్నారు.
Bc లకు అస్సలు రిజర్వేషన్లే లేకపోవడం ఒక కారణమైతే...
33% మహిళలకు ఇచ్ఛిన రిజర్వేషన్ల కోటాలో,
"ఒక Oc మహిళతో Bc ,Sc మహిళలు ఆ గెలుపులో పోటీ పడగలరా..? అనే విషయంలో వచ్ఛిన మీమాంశ ఒక కారణం..
అసలు చట్టపరంగా కూడా, Bc లకు రిజర్వేషన్స్ లేని కారణంగా, అన్ని పార్టీలు సమర్థిస్తున్నా కూడా, ,ఈ విషయంలో జరిగే ఉద్వమాల బాట లో , ఈ బిల్లు ,వెనుకబడి పోవడం మరో కారణం .
"మహిళలు" అన్నపుడు , దేశ జనాభాలో ఉన్న ప్రతీ మహిళకు
ఈ రిజర్వేషన్ బిల్లు వర్తించాలి . కానీ ఈ బిల్లులో Bc ల
ప్రసక్తే లేదు.
ప్రస్తుతం రాబోయే ,పదకొండు రాష్ట్రాల ఎన్నికలు ,తరువాత రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ముగిసేవరకూ కూడా ఈ మహిళా బిల్లు అమలులోకి వచ్చే ప్రసక్తే లేదు అన్నది కేంద్ర నిర్ణయం.
అసలు కారణమేమిటో అర్థం కాని పరిస్థితి.
అసలు నాటి నుండి, నేటి వరకు కూడా, మహిళల విషయంలో
ఏ విధమైన మార్పు గాని, మంచి తీర్మానం గాని, జరగలేదు.
ఇకపై ," జరుగుతుంది" అన్న ఆశ కూడా లేదు.
ఈ విషయంలో మహిళలే,
ఒక అడుగు ముందుకేయ్యాలేమో..
-----------------------------------
Monday, September 25, 2023
శీర్షిక : సజీవ సమాధులు.
25/09/2023.
శ్రీ శ్రీ కళావేదిక కవితా పోటీల కొరకు,
అంశం : అమ్మ , నాన్న , ఓ వృద్ధాశ్రమం..
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ మహారాష్ట్ర
నాటి నుండి, నేటి వరకు,
అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలంటుా
మాటల్లో అందలానికెక్కిస్తూ,
చేతలతో చిత్తు చేస్తునే ఉన్నారు .!!
అవనిలో ఆడది, అమ్మగా మరో బ్రహ్మై ,
తొమ్మిది నెలల భారాన్ని మోస్తూ.
సృష్టికి-ప్రతి సృష్టి చేసేందుకు
తన రక్తం మాంసాలను పంచుతూనే ఉంది.!!
ఆ సృష్టికి కారకుడైన తండ్రి,
తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం కోసం ,
బాధ్యతల బరువును మోస్తూ, జీవితాంతం,
తన కుటుంబం కోసం ,తన. జీవితాన్ని
పణంగా పెడుతుానే ఉన్నాడు.!!
పాశ్చాత్య సంస్కృతి మొాజుతో ,
మన సంస్కృతి , సాంప్రదాయాలు
ఏనాడో మట్టి కలిసిపోయాయి.
నేను, నా , అనే స్వార్ధం ,
వావి వరుసలకు "చెక్" పెట్టింది .!!
ఆడ దాని అస్తిత్వం ,
అంగట్లో ఆట బొమ్మై పోయింది.
అలసిపోయిన అమ్మ తనం ,
అడ్డుగోడై నిలిచింది.
జవసత్వాలుడిగిన నాన్న ఉనికి ,
జారిపోతున్న విలువల,
విచ్చలవిడి తనానికి , ప్రతిబంధకమైంది.!!
అంతే మట్టిలో కలసిన మానవత్వం ,
మరోదారిని కనుక్కొంది.
తీరిన అవసరాల చివరి క్షణాలకై ,
జన్మదాతలకు ,ఊరవతల జీవ సమాధులు కట్టి,
ఆధునుకతను తలపించే .అందమైన పేరు పెట్టింది.!!
అవే నేటి బ్రతుకు బడుగు జీవితాలకు ఆశ్రమాలు.
అంతరించిపోతున్న ఆప్యాతలకు నిలువుటద్దాలు.
అడుగు కొకటిగా అలరారుతున్న" వృద్ధాశ్రమాలు ".!!
----------------------------------------