11/08/2023.
*తపస్వి మనోహరం E-book కొరకు కవిత*
అంశం : శ్రీ వరలక్ష్మీ, వ్రతం పాట.
అంశం ఇచ్చిన వారు : శంకరప్రియ గారు.
రాగం : ఆనందభైరవి
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ మహారాష్ట్ర అనుపల్లవి
పల్లవి:
-------
నోము ఫలము వినరారే, ప్రియమారా సఖులాలా
కామ దహను సతి మంగళ గౌరీ లీలా..
అనుపల్లవి.
---------
శ్రావణ మాసాన వెలుగు చారుశీల
వాడ వాడలా వెలిగే వరలక్ష్మీ హేల!!
1. చరణం
-------
పదునారు కళల నోము పడతులు చేయంగా
అదె ,చారు మతి కలయై ఇల నిండెనుగా
వ్రత దీక్షలు నిండిన ఫలితమ్మె మెండుగా
కలిమి నిండు కళకళలతొ ,కలలె పండుగా!!
2.చరణం
---------
చిరు మువ్వల పద రవళుల ,మోమున నగవేలగా
సిరి- సంపద లొసగు శోభ విందు చేయుగా
విచ్ఛేయును వైభవముల నిచ్చు లక్ష్మి గా
అచ్ఛపుటానంద సిరుల- నవని నేలగా !!
3.చరణం.
--------
కోటి వెలుగు సిరులై కురిసెసేటి తల్లి వేల్పుగా
శ్రావణ మంగళ వారము మహి మంగళ గౌరిగా
శుక్రవార పూజలంద, శుభ కల్పవల్లిగా
శుభములొసగు వరలక్ష్మియె, మముగన్న తల్లి గా !!
---------------------------------
హామీ :
పై కీర్తన నా స్వీయ రచన.
No comments:
Post a Comment