1.అర్జున విషాద యొాగము.
--------*-------:-----------------------
1.
ధర్మ క్షేత్రమునందు ధర్మ రక్షణ జేయ ,
పార్ధ సారధి వైన పరమేశుడవునీవు.
2.
స్వఫలా పేక్ష కై స్వజన సంహారమ్ము
జేయనని పార్ధుడదె ధ్యేయమును విడనాడె ॥
3.
వేద సారము మెండు వేల సుాక్తుల నిండు
శ్రావ్య భగవద్గీత కావ్య ఘనుడవునీవు
4.
శ్రీ కృష్ణ రుాపాన శ్రితునర్జునకు నీవు
ఘనయొాగ ములనెంచి గీత బోధించేవు. ॥
5.
నిఖిల లోకోధ్భవుడ నిత్య పరమానంద
నిల కర్మ ఫలములకు నీదె బాధ్యతటంచు
6.
నిస్సహాయత తోడ నిలిచి శస్త్రము విడిన
పార్ధునకు పర తత్వ ఫలము నెరిగించేవు.॥
7.
కులధర్మ ములు వీడు కుటిల మాయలనేలు
కులహీనులౌ, ఖలుల కుాల్చ తప్పదు పార్ధ .
8.
యనుచు పలికెను విభుడు-యదునందనందనుడు.
యుద్ధముకు లెమ్మనెను యుాధమునుఛేధింప॥
2. సాంఖ్య యొాగము.
--------------------------------
9..
పోరి గురులను జంపి - పోరు ననుజుల గుాల్చి
పొందురాజ్యములేల ? పొలయు సుఖ మేలా..?
10.
రక్త సిక్తము లైన రాజ్య సంపద లేల..?
రధము తిప్పుము కృష్ణ రణము వీడెదనయ్య ॥
11.
అని పల్కునర్జనుని అజ్ఞానమును బాప
ఆది దేవుడు పల్కె అనునయము తోడ ॥
12..
పుట్టి -గిట్టుటె రీతి పుడమి యందనుచునుా
శాశ్వతము ఆత్మనుచు శంకలనుబాపేను.॥
13.
శోత్రుడవు నీవనుచు శోకింప తగదనుచు
సాంఖ్య యొాగపు నామ శాస్త్ర మును తెలిపేను ॥
14.
సరి దుఃఖ -సుఖములను సమముగా చుాచేటి
స్థిర తత్త్వజ్ఞానియె స్థితప్రజ్ఞుడగుననియె॥
15
కర్తవ్య కర్మలను కడ దాక పాటించి
సమబుద్ధియుక్తుడవై సమరమును సలుపమనె॥
16.
ఇంద్రియమ్ముల బట్టి ఇహమునను నీవెపుడు
నిగ్రహము లేలనుచు బోధించె కృష్ణయ్య.॥
--------------------------------------------------------------
3. కర్మ యొాగము.
-------------------------
17.
యొాగముల పాటించి యొాగ కర్మల నేలు
యొాగ నిష్టాపరులు యొాగులిల పార్ధా॥
18.
ఇంద్రియపు లోలుడై ఇలను చింతల పొందు
మానసిక ముాఢుడే మాన మిధ్యాచరుడు ॥
19.
పరమాత్మ ప్రాప్తి నదె ఫలముగా నొందేటి
నిష్ట పుార్ణుడె యొాగి నిత్య సంతుష్టుడు. ॥
20.
ఆశక్తిరహితుడవై ఆచరింపగ కర్మ-
పరమ శ్రేష్టుడ వగుచు పరము నొందెదవు.॥
21.
పరధర్మ గుణములను పాటించుటలు కన్న
స్వీయ ధర్మము లిలను స్వీకరించుటె మిన్న.॥
22.
కామ క్రోధము లిలను కడు పాప ప్రేరణలు
బుద్ధి తోడ విడుమా బద్ధుడవై మెలగుమా॥
23.
జ్ఞానమ్మె శాస్త్రమని జ్ఞానివై మెలగుమని
కర్మ ఆచరణ లిల ఘన లోక హితములని
24.
కర్మలకు బాధ్యుడవు- కర్త నీవని తెలిపి
జగతి కర్మల సలిపి జయమొంద మంటివి ॥
----------------------------------------------------------------
.5..జ్ఞాన , కర్మ సన్యాస యొాగము.
---------------------------------------------
ఏ కాంక్షయుా లేని ఏ ద్వేషములు లేని
కర్మ సన్యాసమ్మె కాంచ ఫల రుాపమ్ము.
జ్ఞాన యొాగపు ఫలము కర్మ యొాగపు ఫలము
ఒక్కటిగ చుాడుమా ఒనరు భావముతోడ.॥
నిష్కామ కర్మములు నిర్భావ చిత్తులై-
సల్పు సజ్జను లిలను శాంతి పొందెదరు.
సర్వత్ర సమభావ సత్య సాధకు లిలను
బ్రహ్మ వేత్తలు బ్రహ్మ నిర్వాణ పాత్రులు॥
పెక్కు జన్మలు నీవి పెక్కు అవతారములు-.
పేర్మి నెత్తితి నేను పెకిలింప పాపములు.
నాల్గు వేదములైన నాల్గు వర్ణములైన
నడిపించు వాడనుా నట సుాత్రధారుడను ॥
అజ్ఞాన మును వీడి అలరు జ్ఞానము తోడ
కర్తవ్య నిష్టలే కడు శ్రేష్టమని యెంచు.
కర్మ తత్వమునెరిగి కర్మ యొాగము తోడ
యుద్ధ సంశిద్దవౌ -- ఉత్తమంబెరిగి ॥
--------------------------------------------------------------
.కర్మ సన్యాస యొాగం.
----------------------------------
కర్మ , సన్యా సములు కనిన రెండును వేరు
కాని రెండిటి ఫలము కల్యాణ దాయకమె॥
అవని రాగ-ద్వేష మధిగమించిన వాని
సాధనల సమకుారు సార బ్రహ్మపు పథము॥
అతఃకరణ సుద్ధి ఆనందయొాగమై
పరమాత్మ తత్త్వ మును పరగు జ్ఞానులగుదురు.॥
బాహ్య విషయములనుచు భోగ విషయములనుచు
చింతన ను చేయకయె చింతా ముక్తుడగును.॥
ఆత్మ స్థిత ధ్యానులు, అ- నాశక్త విషయులై
అక్షయానందమును అనుభవించెదరు.॥
ఏక భావ స్థితులు ఏ మొాహములకును
వివశులేటికి కాక విజయ సాధకులౌదు ॥
చిత్త వృత్తుల జయము స్థిరముగా సాధించి
పరమ శాంతి నొంది పరము నొందెదరు ॥
తామరాకు పై జారు తళుకు బిందువు వోలె
స్వజన చింతన వీడు సఖ సవ్యసాచివై ॥
-----------------------------------------------------------------
6.ఆత్మ సంయమ యొాగము.
-----------------------------------------
సంకల్ప త్యాగముల సహనశీలత నొదులు
సాధు చిత్తుడె యగును సన్యాస యొాగిగను॥
సంసార సంద్రాన సాధు చింతన లేని
మనిషి తనకే తాను మిత్రుడును శతృడును.॥
శీతోష్ణ, సుఖ -దుఃఖ శీల,మానావముల
నిశ్ఛలపు స్థితి నేలు నిత్య లగ్నుడె యొాగి॥
చిత్తేంద్రియమ్ములను చిద్బ్రహ్మ ధ్యానమున
లగ్నమై యుంచవలె లక్ష్యసాధకుడిలను ॥
అనంత చైతన్య స్థితు ---- డాత్మ రుాపమును
సకల ప్రాణులయందు సమానమని యెంచును॥
సర్వ భుాతములందు సమ దృష్టి కల్గుటను
పరమ శ్రేష్ఠులు వారు పరమాత్మ రుాపములు॥
పుణ్య పురుషులుపొంది పర స్వర్గ సుఖములను
మరల జన్మింతురుా మహి పవితృలుగాను॥
విరాగులకు జన్మ విధిగ ప్రాప్తంబౌను
దుర్లభమ్మైనట్టి ధన్య యొాగిగ జనును॥
--------------------------------------------------------------
6.ఆత్మ సంయమ యొాగము.
-----------------------------------------
సంకల్ప త్యాగముల సహనశీలత నొదులు
సాధు చిత్తుడె యగును సన్యాస యొాగిగను॥
సంసార సంద్రాన సాధు చింతన లేని
మనిషి తనకే తాను మిత్రుడును శతృడును.॥
శీతోష్ణ, సుఖ -దుఃఖ శీల,మానావముల
నిశ్ఛలపు స్థితి నేలు నిత్య లగ్నుడె యొాగి॥
చిత్తేంద్రియమ్ములను చిద్బ్రహ్మ ధ్యానమున
లగ్నమై యుంచవలె లక్ష్యసాధకుడిలను ॥
అనంత చైతన్య స్థితు ---- డాత్మ రుాపమును
సకల ప్రాణులయందు సమానమని యెంచును॥
సర్వ భుాతములందు సమ దృష్టి కల్గుటను
పరమ శ్రేష్ఠులు వారు పరమాత్మ రుాపములు॥
పుణ్య పురుషులుపొంది పర స్వర్గ సుఖములను
మరల జన్మింతురుా మహి పవితృలుగాను॥
విరాగులకు జన్మ విధిగ ప్రాప్తంబౌను
దుర్లభమ్మైనట్టి ధన్య యొాగిగ జనును॥
అట్టి యొాగము తోడ ఆత్మ యొాగిగ మనుచు
శ్రధ్ధాళుడవు కమ్ము శ్రేష్ట కార్యము జేయ
అని పలికె శ్రీకృష్ణు డవని అంతర్యామి
జగదీశ్వరిని బ్రోవ జగదీశ రావయ్య..॥
--------------------------------------------------------------
No comments:
Post a Comment