[5/22, 18:20] +91 95530 92592: *యుగంధరాచార్య గురువుగారికి ప్రణామాలు 🙏*
వ్యస్తాక్షరి అంటే ఏమిటి ?
న్యస్తాక్షరి అంటే ఏమిటి ?
తెలియజేయగలరు...
[5/22, 18:42] వాగ్దేవీకళాపీఠ అడ్మిన్: *వ్యస్తాక్షరి*
ఇది ధారణకు సంబంధించిన అంశము.
ఈ అంశంలో ఒక వాక్యం లేదా పద్యంలోని అక్షరాలు లేదా పదాలకు అంకెలు వేసి వాటిని వేరువేరుగా కత్తిరించి వాటికి క్రమము తప్పించి అవధానము జరుగుతున్నప్పుడు మధ్యమధ్యలో అవధానికి అందిస్తారు.
అవధాని ఆ కాగితపు ముక్కలో ఉన్న అక్షరాన్ని లేదా పదాన్ని చదివి గుర్తు పెట్టుకుని ఆ కాగితపు ముక్కలను పక్కకు పడవేస్తాడు.
అవధానం చివరలో ఆ అక్షరాలను/పదాలను క్రమంలో పేర్చి వాక్యాన్ని/పద్యాన్ని అప్పజెప్పుతాడు.
[5/22, 18:42] వాగ్దేవీకళాపీఠ అడ్మిన్: *నిర్దిష్టాక్షరి (న్యస్తాక్షరి) :*
నిర్దిష్టాక్షరి అనగా నిర్దేశించబడిన అక్షరాలు గలదని అర్థం. దీనినే న్యస్తాక్షరి అని కూడా పిలుస్తారు.
వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలానా చందస్సులో ఒక పద్యం చెప్పమని అవధానిని అడుగుతూ, పద్యంలోని నాలుగు పాదాలలో ఫలానా స్థానంలో ఫలానా అక్షరం మాత్రమే వుండాలి అని నాలుగు అక్షరాలను నిర్దేశిస్తాడు.
అవధాని పృచ్ఛకుడు చెప్పిన అక్షరాలను ఉపయోగించి పద్యాన్ని పూరిస్తారు.
No comments:
Post a Comment