రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ: హయప్రచార రగడ.
శీర్షిక : జాలిలేని కరోనా.
పాప కణము పరిహ సించె
ఆప రోగ మధిగమించె ॥
మహా మారి మనిషి బట్టె
అహర హమును అణచి జుట్టె ॥
దుార ములను తుాచి యుంచె
భార మైన భయము పెంచె ॥
మాట లాడ మాస్క్ లుంచె
బాట బంధు జాడ తుంచె॥
పలక రింప పలుక రారు
వలపు జుాప పరుగిడేరు.
అంటు రోగి వనుచు జుాసె
ఒంట రిగను ఒదలి వేసె
జాలి లేని జనులదెగను
గాలి నమ్మె ఘనము గాను
ఆసు పత్రి ఆశ తోచె
వేసి మందు వేల దోచె॥
కట్టె వదిలి కదలె, మాయె
మట్టి లోకి మరలి పోయె.
ఎవరి కెవరు ఎరుక లాయె
చివరి బ్రతుకు చితికి పోయె ॥
No comments:
Post a Comment