1. అంశం :వాల్మీకి నిషాదుని శపించుట.
------------------------
1.
విష్ణు భక్తు డతడు విభుని హృదిని నిల్పి
వివిధ గాన ములతొ విధిగ గొల్చు..
నార దుండ తండు నారాయణుని దల్చు
నీతి జ్ఞాన ధనుడు నిర్మలుండు ॥
2.
ఘనుని గని నంత గణనీయు డెవరంచు
ఎరుగ దెల్పు మనుచు యెంచి యడిగె
మౌన వ్రతము వీడి మౌనివల్మీకడుగ
హర్ష మలర బల్కె నారదుండు ॥
3.
వంద నమ్ము లిడి వాల్మీకి మునికిని
వరుస రామ కధను వర్ణ నలతొ
జెప్పె నతడు మునికి జేలందు పుణ్యకథ
రామ జన్మ ,కథను , రమ్య ముగను ॥
4.
వివర మంత యెరుగ విందాయె వీనులకు
శ్రీకరుని సుచరితె శ్రీయుతమ్ము
మొాదమలర మునికి మ్రొక్కెవల్మికుండు
పుాజ లెన్నొ జేసె పుాజ్యునకును ॥
5.
రామ కధయె దలచి రసభక్తి మది నిండ
వల్మికుండు జేరె వడిగ నదిని
సుకపికమ్ము లేలు సుందర మ్మైనట్టి
మిధున పక్షు లీదు మిత్ర నదిని ॥
6.
ముద్దు తేలు పక్షి మురిపాలు గనిమౌని
మురిసి ముదము దేలె మనము నందు.
యంతజేరి నాడు యతడొక నిషాది
దుష్ట శరము వదలె ధుార్తు డతడు ॥
7.
పురుష క్రౌంచ మొరిగె పుార్తి ప్రాణమొదలె
తరుణి పక్షి గని తల్లడిల్లె
ఎడద లోన బాధ నేల బోయనికి
మౌని శాప మిడెను మౌనముగను ॥
8.
శోక వచనములవె శ్లోకమ్ము లాయెను
ఛంద బద్ధ మౌచు చక్క గాను
వరుస పాద ములుగ వరలెనక్షరములు
పద్య కావ్య మాయె ప్రభుని గాధ ॥
*****************************
2. బ్రహ్మ , వాల్మీకిని, రామాయణ గాధను రాయమనుట.
------------------------------------------
9.
భుామి సంచ రింప భువన కర్తయెదల్చి
వేద నుతుడు బ్రహ్మ యేగె భువికి
మునుల ఆశ్రమముల ముందు దర్శనమిడ
నలువ దలచి పోయె నాశ్ర ములకు ॥
10.
పుట్టమునివరుండు పుడమి బ్రహ్మను జుాచి
పరవశించి పోయె పరుగు తోడ
పాదములకు జేసి పాద పుాజలు భక్తి-
ప్రణతు లిడుచు ప్రభుని పలుక రించె ॥
11.
నలువ సంతసించె నమము ప్రతిగజేసె
కుశల మడిగె మునిని కుార్మి తోడ.
విషయ వివరములను విప్పిజెప్పీదెల్పె
శోక శ్లోక ములవె శోభ లలర ॥
12.
శ్లోకములను విన్న శోభలనదె గన్న
బ్రహ్మ మురిసి బల్కె బ్రాహ్మణునితొ
వాణి జిహ్వ జేరి వాక్కుకు వరమిచ్చె
ధన్య జీవి వీవు ధరణి లోన...
13.
లోకమందు భువిని లోకోత్తరంబైన
రామ చరిత రాయు, రక్తి తోడ
యనుచు దీవెనలిడె యాబ్రహ్మ దేముండు
శ్రీఘ్రమేవ శుభము శుభమటంచు ॥kj
14.
పుణ్య కార్య మిదియె పుార్ణమౌ భక్తితో
మొదలు పెట్టుమయ్య మధుర చరిత
గాని నట్టి వైన, గాన నట్టివిగుాడ
కందువయ్య నీవు కవిగ నిపుడు ॥
15.
నీవు రాసి నట్టి నిర్మలమ్మౌ చరిత
పృథివి యున్న వరకు పుాజ్య మగును.
ఆకసమ్ము భుాము లవియుండు వరకును.
అది కావ్య మౌను అదియె సుమ్మీ ॥
16.
అనుచు బ్రహ్మ పలుక ఆమౌనివర్యుండు
అతిగ సంతసించె ,నాత్ర తొందె .
బ్రహ్మ దీవెనలిడ బ్రహ్మానందముతోడ
సాగనంపె నతని సాద రముగ ॥
**************************
వాల్మీకి అయోధ్యాపురిని గనుట.
----------------------------
17.
నలువ చెప్పినట్లు నగుపించె కనులకు
రామ జన్మ స్థలము రమ్య ముగను
దివ్య యోథ్యపురిని దివ్యచక్షుల తోడ
కనెను వాల్మి కపుడు కడు ముదమున ll
18.
కళలు. నిండినట్టి కడు విశాల పురము
రత్న రాసి నిండు రాచ వీధి
వేద పఠన ములతొ వెల్గుబ్రాహ్మణులుండు
శిల్ప కళలు నిండు సిరుల పురము. !!
19.
లలిత కళలు నిండు లక్షణమైనట్టి
సద్గుణాదులున్న సాధు పురము
సుార వీరు లున్న శుద్ధబలుల పురము
సార విద్య లుండు సారయొాధ్యపురము॥
20.
మణుల మండపములు మంచి ఆసములు
సుక పికము లున్న సుఖ వనములు
పుాల సోరభాల పుప్పొడెగురు వీచి
వేల అందములతొ వెలుగు పురము ॥
ధర్మరాజు అశ్వమేధ యాగము జేయ సంకల్పించుట
-----------------------------------------
21.
దశర ధుండతండు ధర్మ పాలనజేయు
రాజతండు జనుల రక్షకుండు
పుణ్య శీలు డతడు పుాజ్యుడందరికిని,
ప్రీతి పాత్రు డతడు నీతి పరుడు ॥
22.
లోభ రహితు లున్న శోభ,సంపదలేలు
జనులు అచట వేలు, జయము లేలు.
శత్రు వైన నేమి శరణుకోరినవాని-
కభయ మిడెడు ఘను డయొాధ్య రేడు ॥
23.
మువురు భార్యలున్న ముచ్చట్ల ఘనరేడు
భాగ్య, రాసులున్న భవుడతండు
సంతాన మది లేక చింతలేలినవాడు
వంశ వృద్ధి కొరకు వదరు వాడు.॥
(వదరు= పలుకు , ఆవేదించు)
24.
వ్రతము పుాజలెన్నొ వరుస జేసిన వాడు.
పరిత పించె నతడు ఫలము లేక.
సార యజ్ఞ మునకు సంకల్పమును జేయ
గురుల జ్ఞాన ధనుల గుణుల బిలచె ॥
మునులు ఋష్యశృంగుడు యజ్ఞార్హుడని పలుకుట
25.యజ్ఞ యాగ ములకు యతి ఋష్యశృంగుండు
తగిన వాడు యతడు తలువ నెంచు
తోడ్కొ రమ్మ తనిని తోడునాలిని గుాడ
జంట గాను పిలువ జయము నీకు ॥
26.మునులు పలుకు మాట ముచ్చట గొల్పగా
నమము లిడుచు మాట నమ్మి తనుచు
మునుల సత్కరించె ముదము దశరధుండు
బయలు వెడలె పుార్తి బలగ ములతొ ॥
------------------------------------
27.
శస్త్ర బద్ధముగను శాంతిపుాజలుజేసె
క్రతువు నడుప నతడు క్రమము గాను.
మదిని మాట జెప్పె మంత్రి సుమంతుడు
అశ్వ మేధ యాగ మహిమ దెల్ప ॥
28.
బ్రహ్మ చర్య మునను భాసిల్లు విప్రుండు
ఋష్య శృంగు డతడు ఋషి వరుండు.
ఘనవి భాండకుండు గర్వించు పుత్రుండు
విషయ వాంఛ లేని విమల యశుడు ॥
29.
ధర్మ నిరతి లేనధర్మ పాలుడతండు
రోమపాదు డతడు రోష పరుడు
క్షామ కార కుండు క్షమకనర్హుడతడు
ప్రజల గోడు వినని పాలకుండు ॥
30.
ప్రాణ నష్ట మాయె ప్రారబ్ద కర్మలకు
క్షామ మదియె పెరిగె ధామ మందు
దుర్భ రమ్ము గతికి దుఃఖ మొందిన రేడు
దోష ముడుగ జేయు దోవ వెదకె ॥
31..
వేద విదుల మాట వేల యాశలు రేప
మునిని ఋష్య శృంగు ముదము బిలువ-
దలచి మౌని దరికి దండనాధులనంప
వారకాంతల నంప వారు బలికె ॥
32..
ఆడు వారలు వారు యాశ్రమమును జేరి
యాడి పాడి రంత యలుపు మీర
కాంత లందరు జేరి కవ్వింతలనుదేల్చ
తాప మదియె పెరిగె తాపసునకు ॥
33.
వార కాంతల మరచు వల్ల కానిదదాయె
జప తపంబు లందు జాడ్య మాయె
మదన తాప మదియె మదిని పీడనలిడ
కాంత లున్న దరికి కదలె శృంగి ॥
34..
ముని ఋష్య శృంగు ముదమార గనినంత
వార కాంత లెల్ల వచ్చి దరికి
మునిని తోడ్క జనిరి ముందు రాజుకడకు
మురిసె నంగ రాజు మునిని జుాచి ॥
35.
కారు మేఘము లవియె కమ్మె గగనమందు
ఉరుము లురిమె వెలుగు నుారు మెరిసె
కుంభ వృష్టి గాను కురిసేను వానలవె
పారె నీరు నదుల పలు నదముల ॥
36.
అర్ఘ్య పాద్య ములిడి అంగపుాజలుజేసి
ఆదరించె మునిని యంగ రాజు .
పుత్రి కైన "శాంత" పుణ్య శీలవతిని
పరిణయమ్ము నాడ పలికె విభుడు ॥
37.శాంత ఋష్యశృంగుల వివాహము
----------------------------
37..
రోమ పాదు కోర్కె రోమాంచకము కాగ
సమ్మతించె శృంగి సరళ ముగను
మొాద మందె మునులు మొాగెదుందుభులిల
జరిగె కల్యాణమ్ము జయము గాను ॥
38.క్షామ ముడిగె పురిని ధామ మేలె రాజు
పొరలె పాడి, పంట, పురము నిండె
కాలు పెట్ట చాలు కలుగుశు భములెన్నొ
పిలువ వయ్య మునిని పిలువు మనగ ॥
39..సాదుశీలు డైన సనత్కొమరు మాట
దశరధుండు వినెను విశద ముగను
మంత్రి వరుల గుాడి మధుర భావనతోడ
పయన మాయె రోమ పాదు కడకు ॥
40..మువురు సతుల గుాడి ముని వశిష్టుని గుాడి
ధండ నాధు లగొని దశరధుండు.
అంగ దేశ మేగె నలరు యాశలతోడ
ముని ఋష్యశృంగు ముదము గలువ ॥
41.మాట తెలిసి నంత మనెను రోమపాదు
విభుని సత్క రించె వినయ ముగను.
ఋష్యశృంగు కడకు రుషియంత గొని పోవ
సంతసించె రాజు సాధు జుాచి . ॥
42.వంశ ముద్ధరించు వరపుతృబడయంగ
అశ్వ మేధ యాగ మదియె జేయ
పుత్ర ఋష్య శృంగు పుార్ణ యొాగ్యుడనుచు
కోరెనతని నంప కోసలుండు ॥
43..కృతిని జేయు టకును కుమరుని గొనిపోవ
వచ్చు రేని జుాచి వలపు మీర
క్రతువు జేయు తలపు కడు ప్రియముగ దోచె
యనుచు సమ్మ తించి యానతిచ్చె ॥
44.సంతసంబు మదిని సందడించగ రాజు
దశర ధుండు మునికి దండ మిడుచు
ముదము తోడ్క పోయె ముని ఋష్యశృంగునీ
పురిఅ యొాధ్య ధన్య పురియటంచు ॥
45..మంచి ముార్త మదియె మధుమాస మనిబల్క
మాట విన్న రాజు మదిని మురిసె .
గురులు దీవెనలిడ గుణుడుదశరధుండు
యాగ అశ్వమునదె యటకు దెచ్చె ॥
46..దినము పౌర్ణ మిగని దివ్యముార్తము నెంచి
వేద మంత్ర ములతొ వేల్పు గొలచి
భుాసు రోత్తములతొ భుామి పుాజలుజేసె
సంత సించె రాజు సతులు మురిసె!!.*****************************
దశరధుడు యాగారంభమునకు సంసిద్ధుడగుట
------------------------------------
.47.
తలచు కార్య మునకు తరుణమిది యటంచు...
బూనె దీక్ష యపుడు భూసురుండు.
సతులు గూడి యుండ సద్గురులు దీవించ
యాగ అశ్వ మొదలె యజ్ఞ విధిగ ॥
48.వెలసె గృహము లెన్నొ వేల జనుల కొరకు
అతిధి గృహము లవియె నాప్తులకును
కనుల పండుగాయె కళనిండె పురమంత.
ముచ్చటాయె జూడ ముగ్గు లన్ని !!
49.ఉన్నతులకు నంపె నుత్తరమ్ములు యెన్నొ
ఆద రముతో నంపె నాహ్వనములు
మణి -రత్న ములతొ మారాజు నిధి నిండె
వచ్చి కాన్క లిడగ వరుస నృపులు !!
50.భక్ష్య భోక్ష్య ములను బహు ప్రీతీ సేవించి
మంగ ళమ్ము లిడిరి మాన్య వరులు
దశరధేశు వెంట ధర్మ విధులు నడువ
ద్విజులు నడిచి రాది. దీవె నలతొ !!
51.యజ్ఞ వాటి లోన యాగాగ్ని వేసెనదె
రుత్వి కులతో గూడి ఋష్య శృంగి
యాగ మార భమ్ము ఆగ మాదులుజేయ
జరిగె వైభ వములు జయము గాను !!
52..కర్మ దేవతలకు కడు ప్రార్థనలు జేసి
యాగ శాల జేరె యాత్ర ముగను .
సార సరయు తటిని సాగు యశ్వము జూచి
వలయు పూజ లిడెను వాజి కతడు !!
53..వేడి ,యగ్ని కపుడు వేదోక్తపూజలిడి
నిప్పు కుండమునదెచె నిలిపి రచట.
యాగ అశ్వమునదె యాగ శాలకుదెచ్చె
పట్టమహిషి రాణి పసుపు రాసె !!
54.యాగ విధుల జరిగె యశ్వ మేధ క్రతువు
దశమ దానము లిడె దశరధుండు.
భూమి దాన మొసగె భూ సురేంద్రులకును
రూప గోవుల నొసగె ఋత్వి జులకు!!
55..దాన ధర్మ ములకు. ధర వాసులు మురిసె
వేల దీవె నలవె వెల్లు విరిసె
సంత సమున మురిసె సధ్ధర్మరాజదే
పుత్ర కామ క్రతువు పూర్తి జేయ!!
56.మహిని జరిగె మధుర మంత్రోక్త పుాజలు
మంత్రధర్వణోక్త మధుర యజ్ఞ ఫలము
బ్రహ్మ , రుద్రు లాది బ్రహ్మర్షి పుంగవులు
హవిసు లన్ని గొనిరి హర్ష ముగను ॥
57..నలువ గాంచి సురులు కలుగు బాధలు జెప్పె
రావణాసు డతని రచ్చ దెలిపె
తాపసుండతండు తపోబలము మెండు
గర్వ బలము నిండు ఘనుడ తండు ॥
58.పంచ భుాత ములను పట్టియుంచెనువాడు.
పవన , సంద్ర ములకు పనికి వెరపు
అదర గొట్టి పంపె నష్ట దిక్పాలకుల
దాగె దేవ రాజు దారి లేక ॥
59.కామ రుాపు లైన ఖలు రక్కసులరేడు
లంక నాధు డతడు లజ్జ లేదు.
వివిధ బాధ లిడెడు వీర రక్కసు పనికి
ఆగె కార్య ములవె యతని వలన ॥
60..వినెను ధాత యపుడు కనెను దేవతలను
నుడివె బ్రహ్మ రావ ణాసు మాట
వత్సరముల తపము వత్సచేసెను నాదు
మెచ్చి వరము లిచ్చి వచ్చి నాడ ॥
61.సిద్ధసాధ్యు లైన సుద్ధ గంధర్వులు
యక్ష కిన్నె రాది యశుల వలన
చావు లేని వరము తావులేకను యిస్తి
నరులు వాన రుల్లు వారు దక్క!!
62..గర్వ బలము తోడ సర్వ నాశనమును
కోరి తెచ్ఛు కున్న క్రోధి యతడు
నరులు వాన రుల్లు నమ్మ చంపుదురని
తెలియ లేదతండు తెలివి హీను !!
63.సమయ మొచ్చె నిపుడు సంయమమునుజూప
వరదుడదియె వచ్ఛు. వలదు భయము
అభయ మీయ నలువ హర్షమొందె సురుల
అంజలులిడి రంత అమరు లెల్ల !!
64.శార్గ గదా ధరుడు. శంఖచక్రధరుడు
లక్ష్మి వల్లభుండు లక్షణుండు
నలువ చెంత జేర నప్పిన్న ధవుడంత
నలువ సంతసించి నమము లిడెను!!
65.జేసి స్తోత్రములను చేసిరంజలులను
దేవతల్లు సురులు దేవునకును
ఈతి బాధలన్ని ఈశ్వరునికెరుకంచు
జెప్పి రిడుములన్ని జేరి హరికి !!
66..పుత్ర యాగ మదియె పుత్ర సంతతి కోరి
జేసె దశరధుండు జయము గాను
మువురు సతుల గర్భమున జన్మమెత్తి నువు
మహిమ చూపుమయ్య మహిని నీవు !!
67.యనుచు సురులు వేడ అభయమిచ్చెను హరి
నాల్గు రూపములతో నరుని వలెను
మువురు తల్లులకును ముద్దు బిడ్డడిగాను
జన్మ మెత్తి మీకు జయము జేతు !!
68..కోర్కె దీర్చ వచ్ఛి కోరి దశరధింట
అవతరింతు నిలను అసురు జంప
ధర్మ రక్ష జేయ ధర వేల వత్సరము-
లేల రామరాజ్య మిలను జేతు !!
దివ్య పురుషుడు దశరథునకు పాయసపు పాత్ర నిచ్చుట
----------------------------------------------
69.
అని పలికి హరి అంతర్దానముజెంద
దివ్య కాంతి నిండె దిక్కులెల్ల
అగ్ని గుండమునదె నగుపించె దివ్యమౌ
పాయసంపు పాత్ర పట్టి ఘనుడు!!
70.పంపె నన్నిచటకు పనిగ ప్రజాపతీ
పాయసమ్ము పంచ ఫలము కలుగ
సతుల కోర్కె తీర్చి సంతసింపుమదయ్య
వంశవర్ధనమ్ము వరము నీకు!!
71.అనిన దశరథుండు అదే సంతసమునొంది
పాయసాన్న పాత్ర పట్టి మురిసె
యజ్ఞపురుషునకును అంజలి ఘటియించి
ధామమునకు జేరె దశరధుడు !!
72.మువురు సతుల బిలచి ముచ్చటగను పంచె
దివ్య పాయసమ్ము నవ్యముగను.
సగము భాగ మిచ్చె సతి కౌశల్యకును
సగము భాగ మిచ్చె సతి కైక రాణికి !!
73.శేష పాయసమ్ము సతి సుమిత్రకును
పంచ ఇచ్చె నతడు ఫలముగాను
యాగ విధిని జేసి ఆనందముగజూచి
ద్విజుల నెల్ల నంపె సజవు గాను!!
74.రీతి ఘనము చేసి ప్రీతి సత్కారముల
నంపె ఋష్యశృంగు నాలి తోడ .
గరుడ కిన్నెరాది గంధర్వులందరూ
వీడికొల్పు లిడిరి విజయ మనుచు !!
75.దివ్య పాయసమును దినినట్టి రాణులు
నవ్య కాంతి తోడ నడిచి రాగ
గర్భ వతుల జుాచి ఘన యజ్ఞ ఫలముకు
మురిసె దశరధుండు ముదము తోడ ॥
బ్రహ్మ వానరవీరులను సృజింపజేయుట
-----------------------------------
76.
నరుగ నల్గు రైన నారాయణుని దల్చి
నలువ సంత సించె నభము నందు
విభుని కార్య మదియె విశ్వ విజయ మొంద
వరుస సృష్టి జేసె వానరులను ॥
77.బ్రహ్మ సృజన జేసె బలజాంబ వంతుని
సురపతంశ తోడ సుతుడు వాలి
దినకరునకు బుట్టె దివ్యసుగ్రీవుండు
వాయు దేవునకును వరము హనుమ॥
78.నలుడు బుట్టె నుగద నదె విశ్వ కర్మకుా
తడవ దేవ గురుకు తారు డదియె
నీలు డుద్భ వించె నిత్యాగ్నిహోత్రుకుా
ఘన యక్షు నకును గంధమా ధనుడుా ॥
79.బుట్టె వాన రుల్లు భువనాల భవనాల
భుజ బలమ్ము తోడ భువిని జనిరి.
బుట్టె యొాధులెల్ల భువి గహనములందు
ఏలి కాయె ఘనుడు ఇంద్ర సుతుడు ॥
80.దేవ గణము లన్ని దేవదేవుని దల్చి
సృష్టి కార్య మునకు సుాత్రు లైరి
యక్ష కాంత లాది లక్ష యొానులయందు
ప్రాభ వించె వారు ప్రథమ ముగను ॥
------------------------------
.శ్రరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననము..
----------------------------------+
81.మువురు సతుల మనము మురిసె మొాదముతోడ
నెలలు నిండె నవము నేర్పు గాను
కళలు దేలె ముఖము కాంతి నేలెను మేను
లక్షణములు శుభము లాయె ఘనము ॥
82.శుద్ధ చైత్ర నవమి శుభ పునర్వసు నందు
పంచ గ్రహము లుచ్ఛపథము నుండ
కర్క లగ్న మందు ఘనముగా ప్రసవించె
కోస లేంద్రు సతి కొమరు నంత ॥
83.మీన లగ్న మందు మేని నిగ్గులుదేల
భరత కొమరు కనెను భార్య కైక.
కనెను లక్ష్మ ణుడను కలసి శత్రుఘ్నునీ
శుభము ద్వయము గాను శుభసు మిత్ర ॥
84.నరుల జన్మ మెత్తె నారాయణుండిల
నాల్గు రుాప ములతొ నయము గాను
యజ్ఞ ఫలముగాను యాపుతృలన్బడసి
ధన్య తొందె విభుడు ధర్మరాజు ॥*****************************:
నామకరనణ మహోత్సవం .
--------------------------------------
85.
నామకరణ క్రియ నదె వశిష్టుడు జేసె
రామ , భరతు లనిరి అగ్ర జులను.
చతుర నామ మదియె శత్రుఘ్నుడనిబల్కె
లక్ష్మణుండు పేరు లక్షణునకు ॥
86.బాల రామ లక్ష్మ భరతాది శత్రుఘ్ను
పెరిగి రంత ముద్దు పేర్ల తోడ.
ఉపన యనము జేసె నుత్తమ దినమెంచి
సకల వేద శాస్త్ర విద్య నేర్ప ॥
87.విద్య లన్ని నేర్చె విధిగ మొాహనులంత
ధర్మ రాజు సుతులు ధర్మ యుతులు
ఆరి తేర వారు అన్ని విద్యల యందు
మొాద మాయె నృపకు మొాహ మలర ॥
88.యుక్త వయసు దాటె యువపుతృలకటంచు
ముచ్చ టించి పెండ్లి ముుార్త మడుగ
మునివ శిష్టు బిలచె ముందుమాటలనాడ
ధరను కన్యల వెదుక దశరధుండు ॥
89.గాధి తనయు డంత ఘన తేజుడగునట్టి
విశ్వమిత్రు రాక వివర మిచ్చె .
గౌర వంద నముల గాధేయు సేవించి
అర్ఘ్య పాద్య ములిడె నంత నృపుడు ॥
90.కనుగొనగను యెంచి కార్యార్ధియైనట్టి
మునిని జుాచి యడిగె మందు మాట
శంక లేక యడుగ శతవిధముల కోరి
కోర్కె దెల్ప మనెను కోశలుండు.॥-
-----------------------------
యాగ రక్షణకై రాముని పంపమని విశ్వామిత్రుడు కోరుట
--------------------------------------------
91.
యజ్ఞ మొకటి జేయ యాగ దీక్షను బుాని
మొదలు పెట్ట విఘ్న మొనరు చుండె
మాంస భక్ష కులదె మారీచ సుాబాహు
భంగ పరచు చుండె బలిమి తోడ ॥
92.రక్త మాంస ములను రాసిగా పోయుచుా
జిమ్ము చుంటి రచట జిత్ర ములను
యొాగ మునదె నీదు యొాగ్య పుత్రుని కోరి
రాము దోడ్క పోవ రయము వస్తి ॥
93.రావణాసు బంట్లు రక్కసుల్లగువారి
శాపమిడగలేను సాహ సమున
దీక్ష బట్టు నెేను శిక్షవేయగలేను
జంప రాక్ష సులను జడుపు లేదు ॥
94.తపసు మహిమ జేత తలచీ కనుగొంటి
ధరణి నీదు సుతుని ధర్మ గుణుని
అగ్ర గణ్యు డతడు అదె ధనుర్విద్యను
రఘుకులేశు డతడె ,రాము నంపు ॥
95.విశ్వమిత్రు మాట వినినంత నృపునకు
చీక టాయె నంత లోకమంత.
కంటి రెప్పగాను గాచి పెంచిన బాలు
నంపు టెట్లు వనము పంపు టెట్లు ॥
96.దలచి వగచు చున్న దశరధుడను జుాచి
విశ్వ గురుడు జెప్పె వివర ముగను.
తపము జేయు శక్తి తనయుని కేయిత్తు.
యశము కీర్తు లెన్నొ వశము జేతు ॥
97.బాలుడతడు కాడు బలశాలి, ధీరుండు
విష్ణు తేజు డతడు వీరు డతడు
అనుచు బల్కు టవిని యాకోశలేంద్రుండు
శోక సంద్ర మందు సోలి కుాలె ॥
98.కొమరు రాము విడువ కోరి మనజాలను
జంప రక్కసులను పంపలేను
యుద్ధమెరుగ డతడు యుాధమెరుగ బోడు
పసితనమ్ము విడని పాప డతడు ॥
99.మాట యిచ్చితేను మన్నింపగోరెదా
యాగ ఫలము వీరు యలమి గనుమ
రామ చంద్రునంప రణముజే యుటకును
దుష్ట రాక్ష సులను దుార నంప ॥
100.
చక్క నైన సైన్య చతురంగ బలమును
పంపె దనుగ నేను పలుకు దీర.
వారి గుాడి వత్తు వరుస నసురు గుాల్తు
యాగ రక్ష జేతు ఆన నమ్ము ॥ (ఆన )
101.అనుచు పలుక నృపుడు అగ్ని నిండు కనుల
అరచె కోపి తుండు అగు మనుచు
మాట యిచ్చు టేల మరలిపో వుటలేల
మహిని మచ్చ దెచ్చు మాట లేల ॥
102.
శికుడు రామునకు గంగాదేవి చరిత్ర
షణ్ముఖ జననము జెప్పుట.
--------------------------------------
103.
పుాజ్య హిమ వంతు పుత్రిక లిరువురు.
గంగ యమున వారు ఘనులు గుణులు.
దేవ కార్య మునకు దేవ తలదె యడుగ
నొసగె గంగ నతడు ఒనర శుభము॥
104.
ఫాల నేతృ కొరకు పార్వతి తపియించ
పరిణయమ్ము జేసి పంపె హిముడు
కామ కేళి లోన కలిసి మునుగ వారు
శివుని తేజమునకు శిఖర మొణికె ॥
105.
సిద్ధ జనులు వేడ శివుడు తేజము విడచె
వీర్య మదియె నిండె విశ్వ మంత
తేజ మదియె జేరి శ్వేత నగమదాయె
ఎలమి మనము యున్న స్థలము రామ ॥
106.
అంత నుమయె రగిలె నంత సంతతిలేక
శాపమిడెను పుడమి తాప మణగ
బడయ వెపుడు సుతుల బహు రాజుల సతివై
కనరు సురులు సుతుల కలుగ ముదము ॥
107.
యనుచు శాప మిడగ యాపుడమి వణికె
భయము తోడ సురులు పారిపోయె ॥
సంతతది కలుగని సంతాపముతోడ
కుంగి పోయిరి వారు వంగి నేల॥
108.
ఘోర కృత్య ములను కోరి చేయుచునున్న
దనుజ ముాక నణచ దారి లేక
నడచి పోయిరి సురులు నలువయున్నదరికి
కోరె పుత్రుల నదె కోర్కెదీర ॥
109.
శాప గ్రస్తు లైన సాధు సురులు మీరు
పుత్రు లింక మీకు పుట్ట బోరు
అనలు నందు నలరె ఆ శివ తేజమ్ము
గంగ దాల్చ గలదు దాని నిజము ॥
110.
నలువ జెప్పు మాట నమ్మి పరుగులిడిరి
యగ్ని దేవు కడకు యాత్ర ముగను .
దేవ హితము కోరి బయలు వెడలె నగ్ని
గంగ కిడగ తేజ ఘనము నంత ॥
111.
అగ్ని మాట వినిన యంత మారెను గంగ
వనిత గాను తాను వరల శుభము
మొాహ నాంగు డగ్ని ముదమున వీర్యాగ్ని
గర్భ మందు విడచె ఘనము గాను ॥
112.
మంటలుచెల రేగె మాత గర్భమునందు
మనగ లేని దాయె మాత గంగ
మాత తాళ లేక మంచు కొండలు జేర
గర్భ శ్రావ మాయె గంగ కపుడు ॥
113.
గడ్డి మొాపు లందు ఘన పుత్రు డుదయించె
అతని పేరు "స్కందు" డనిరి సురులు.
గర్బ శ్రావ మైన ఘనుడు జీవించెను
పుాజ లందె నతడు పుాజ్యు డగుచు ॥
114.
ఆర్గు రైన వారు ఆ కృత్తికలుపెంచ
"కార్తి కేయ" పేరు కలిగె నంత ॥ .
సేవ లతని కంట, సేనాధిపతి యంట
సురల కతడె ముద్దు కొమరు డంట॥
115.
గంగ జన్మ మిదియె ఘన షణ్ముఖుని జన్మ
పుడమి వినిన చాలు పుార్తి గాను
పుత్ర పౌత్ర వృద్ధి పుార్తి ఫలము, శుద్ధి
కల్గు ననుచు బల్కె కౌశికుండు ॥
---------------------------
సగరుని జన్మము
----------------
116.
సుతుల బడయు కొరకు శత వర్షములుగాను
సతుల గుాడి తపము సగరు జేసె
దర్శనమ్ము నిచ్చె ధర్మ బృగువు తాను
వేడ సుతుల నొసగ వేలుగాను ॥
117.
ఒకరి కిత్తు నేను ఒడినరువదివేలు
వేరొకరికి యిత్తు వెరసి యొకని
యెవరి కేది వలయు యెంచి చెప్పుము మీరు
యనెను బృగువు వారి నేరి కోర ॥
118.
సతులు ఇద్ద రైన సగరు సంతసించె
మాత సుమతి కోరె మదిని వేలు
కొమరు నొకని గుణుని కోరె కౌశికి యంత
దాల్చి గర్భ ములను ధన్యు లైరి ॥
119.
పుతృ డొకడు గాని పుార్తి దుష్ట గుణుడు
విచ్చలవిడి గాను వీధు లేలు
అతడె కౌశి కిసుతు డసమంజసుడతడు
అసహనమున ద్రోలె నతని సగరు ॥
(అతని వెళ్ళ గొట్టె నంత సగరు ॥)
120.
తుంబ మదె బుట్ట తునియలుగ నుజేయ
సుమతి కపుడు బుట్టె సుతులు వేలు.
జనుల రోయు వాడు జడుడసమంజసు-
డతని పారద్రోలె నంత సగరు ॥
121.
అంశుమంతు డతడు అతిబుద్ధిమంతుడు
పలుకు తేనె లొలుకు బాలు డతడు
పుార్ణ తేజ మయుడు బుట్టె నసమంజస-
కదియె విధివిలాస మదియె వింత ॥
122.
అశ్వ మేధ యాగ మదియెజేయగనెంచి
యవ నాశ్వ మువిడె యతడు సగరు
వీడె నశ్వ మతడు విశ్వ రక్షణకొరకు.
వెంట అంశుమంతు వేడ్క నంపె ॥
123.
అపహ రించె నింద్రు డశ్వమ్మునదె తాను
నాగ లోక మొదలి నాక మేగె .
అశ్వ మెదుక సగరు యారువేల సుతుల
నంపె వెదుక వారి నమ్మకమున ॥
124.
పుడమి కాన రాదు పుట్టలందును లేదు
పాతాళముకు వారు పయన మాయె ॥
వెదకి వెదకి వారు వేసారి కడకదే
గనిరి యాశ్ర మమ్ము కపిల మునిది ॥
125.
యందు గనిరి వారు యాగాశ్వమును యంత
అపహరించె నతడు యనుచు దలచె .
దలచి నంత లోనె దాడి జేసిరి వారు.
సంహరించ మునిని సాయు ధముల. ॥
126.
కోరి నింద వేయు కొమరులనదె గాంచి.
కపిలు డుగృ డౌచు కనులు దెరచె.
కనుల కురిసె నిప్పు కడు మంటలవిరేగ
దగ్ధ మాయె సుతులు ధరణి యందు ॥
-------------------------------
127.
అంత సగరు పౌత్రు డంశుమంతునిబిల్చి
యాగ భారము యంత యతని దంచు
అశ్వ జాడను గన యంశు మంతుని కోర
తాత యాజ్ఞ నుగొని తరలె నతడు ॥
128.
మార్గ మధ్య మందు మహాదిగ్గజమున-
కంజలిడెను భక్తి నంశు మతుడు.
తెలిపె కార్య మతడు తేట తెల్లముగాను.
గజము దెల్పె బాట ఘనముగాను ॥
129.
కడకు జేరె నతడు కపిలునాశ్రమముకు
వినయ మునదె యడిగె ,వివర ములను
దెలిసె భస్మ మైన దెటులొ పినదండ్రులు
దుర్గ తికిని యతడు దుఃఖ మొందె ॥
130.
తరుణ మదియె ననుచు తర్పణాల నొదల
వేగ గంగ కొరకు వెదుక సాగె
విధివశమున వచ్చె వినతాసుతుడటకు.
గంగ భువిని దెమ్ము ఘనమ దనియె ॥
131.
సగర భస్మ ములవి సరిగంగ ప్రవహించ
సద్గతులవె గల్గు సగర పౌత్ర
యనుచు బల్కె నంత యాగరుక్మంతుడుా
అంశుమంతుడంత అంజ లిడెను ॥
132.
యాగ అశ్వముగొని యాలోకమును వీడి
చేరి తాత కడకు జెప్పె మాట .
సగరుల గతిని విని సరి దుఃఖితుండాయె.
వగచె సగరు డెంతొ వారి దలచి ॥
133.
వరుస రాజ్య మునదె వత్సరమ్ముల నేలి
దివిజ ధామ మేగె ధీర సగరు .
అతని రాజ్య మేలె నా అంసుమంతుడు
పాతృ డతడు సగర పౌత్రుడతడు ॥
134.
కొంత కాలమునకు కొమరుండు కల్గెను
అంశు మంతు నకదె అతడె " దిలీపు."
ధర్మ బద్ధు డతడు దార్మికుండగుచేత
ఇచ్చెరాజ్య మతని కిచ్ఛ తోడ ॥
135.
అంశు మంతు డపుడు ఆరాజ్యము నొదలి
ఘనము తపము జేసె గంగ కొరకు .
వత్స రములు గడచె వరుస గంగయె రాక
వదలె దేహ మతడు వగచి వగచి ॥
136.
దినము లెన్నొ గడచె , "దిలీపు" నకు బుట్టె
భవ్య గుణుడు సుతుడు భాగి రధుడు
తనయు బిలచి పలికె తండ్రి దిలీపుండు
రాజ్య భారముగొని రాజ్యమేల !!!
137.
తాత లందరి నదె తరియింప చేయంగ
జేయ లేక పోతి జన్మ మేల.
యనుచు కృంగె నతడు యాబాధ తోడనే
దేహ మొదలి పోయె దేవ పురము !!
138.
భారమాయె బ్రతుకు. భగీరథుడలసె
వెలితి సంతతి కడు వేదన నాయె.
రాజ్య భారమునదె రాజమంత్రులకిడె
తపము జేయ వెడలె తపవనమ్ము
139.
సార గంగ బిలువ సంకల్పమది జేసె
పుత్రులనదె కోర పుణ్య మలర
ఘోర తపము నదియె గోకర్ణమున జేసె
ధాత కొరకు నతడు ధరణి నందు !!
140.
ధాత ప్రకట మాయె ధరభగీరధునకు
అభయ మిచ్చె ధాత అడుగ గంగ .
ఉధృతమ్ము గంగ ఉరుకులు తీవ్రమ్ము
శివుని పిలువు మయ్య. శిరము దాల్చ !!
141.
ఇలను వృధ్ధి చెందు నిక్ష్వాకు వంశంబు
వంశ ముద్ధరింప వరలు సుతులు
తల్లి గంగ వచ్ఛు ధరలోన ప్రవహించు
గంగ దాల్చ ఘనుడు శివుడె సుమ్మీ !!
142.
అనుచు పలికి బ్రహ్మ. అంతరార్థమదాయె
అంత భాగి రధుడు హర్షమొందె.
ఒంటి కాలు పైన ఒనరి చేసెను తపము
శివుని కొరకు నతడు చిత్త మలర !!
143.
తపము గాంచి శివుడు నెపములెంచకవచ్చె
దర్శనమ్ము నిడగ ధర్మ ధవుకు ॥ .
కోర్కె దెలుపమంచు కోరె భగీరధుని
గంగ నంప భువికి ఘనుడు కోరె ॥
144.
అభయ మిచ్చె శివుడు యాభగీరధునకు
గంగ భువికి తెచ్చు ఘనుడ వంచు
గంగ బిలచె శివుడు ఘన స్వాగతముతోడ
ఘర్జ నలతొ దుమికె గంగ భువికి ॥
145.
పెను తుఫాను వలెను పెట్రేగి దుముకుచు
జారె భువికి గంగ జలజలంచు .
ఫాల నేత్రు డపుడు పట్టెనాగంగను
జడల జుాట మందు జయము గాను ॥
146.
శివుని జుాట మందు చిక్కు బడెను గంగ
జడల బంధములకు జడిసె గంగ
కదల దారి లేక కనికరించని, వేడ
ఏడ పాయలుగను ఎంచి వదలె ॥
147.
పొంగి పొరలె గంగ పొంగుచు ప్రవహించె
ఏడు పాయ లుగను ఏల గంగ
నల్గు దెసల పారె నదుల రుాపము తోడ
పాపులనదె జేయ పావనమ్ము ॥
--------------------------
--------------------------------
అశ్వ మేధ మదియె ఆ
1. అంశం :వాల్మీకి నిషాదుని శపించుట.
------------------------
1.
విష్ణు భక్తు డతడు విభుని హృదిని నిల్పి
వివిధ గాన ములతొ విధిగ గొల్చు..
నార దుండ తండు నారాయణుని దల్చు
నీతి జ్ఞాన ధనుడు నిర్మలుండు ॥
2.
ఘనుని గని నంత గణనీయు డెవరంచు
ఎరుగ దెల్పు మనుచు యెంచి యడిగె
మౌన వ్రతము వీడి మౌనివల్మీకడుగ
హర్ష మలర బల్కె నారదుండు ॥
3.
వంద నమ్ము లిడి వాల్మీకి మునికిని
వరుస రామ కధను వర్ణ నలతొ
జెప్పె నతడు మునికి జేలందు పుణ్యకథ
రామ జన్మ ,కథను , రమ్య ముగను ॥
4.
వివర మంత యెరుగ విందాయె వీనులకు
శ్రీకరుని సుచరితె శ్రీయుతమ్ము
మొాదమలర మునికి మ్రొక్కెవల్మికుండు
పుాజ లెన్నొ జేసె పుాజ్యునకును ॥
5.
రామ కధయె దలచి రసభక్తి మది నిండ
వల్మికుండు జేరె వడిగ నదిని
సుకపికమ్ము లేలు సుందర మ్మైనట్టి
మిధున పక్షు లీదు మిత్ర నదిని ॥
6.
ముద్దు తేలు పక్షి మురిపాలు గనిమౌని
మురిసి ముదము దేలె మనము నందు.
యంతజేరి నాడు యతడొక నిషాది
దుష్ట శరము వదలె ధుార్తు డతడు ॥
7.
పురుష క్రౌంచ మొరిగె పుార్తి ప్రాణమొదలె
తరుణి పక్షి గని తల్లడిల్లె
ఎడద లోన బాధ నేల బోయనికి
మౌని శాప మిడెను మౌనముగను ॥
8.
శోక వచనములవె శ్లోకమ్ము లాయెను
ఛంద బద్ధ మౌచు చక్క గాను
వరుస పాద ములుగ వరలెనక్షరములు
పద్య కావ్య మాయె ప్రభుని గాధ ॥
*****************************
2. బ్రహ్మ , వాల్మీకిని, రామాయణ గాధను రాయమనుట.
------------------------------------------
9.
భుామి సంచ రింప భువన కర్తయెదల్చి
వేద నుతుడు బ్రహ్మ యేగె భువికి
మునుల ఆశ్రమముల ముందు దర్శనమిడ
నలువ దలచి పోయె నాశ్ర ములకు ॥
10.
పుట్టమునివరుండు పుడమి బ్రహ్మను జుాచి
పరవశించి పోయె పరుగు తోడ
పాదములకు జేసి పాద పుాజలు భక్తి-
ప్రణతు లిడుచు ప్రభుని పలుక రించె ॥
11.
నలువ సంతసించె నమము ప్రతిగజేసె
కుశల మడిగె మునిని కుార్మి తోడ.
విషయ వివరములను విప్పిజెప్పీదెల్పె
శోక శ్లోక ములవె శోభ లలర ॥
12.
శ్లోకములను విన్న శోభలనదె గన్న
బ్రహ్మ మురిసి బల్కె బ్రాహ్మణునితొ
వాణి జిహ్వ జేరి వాక్కుకు వరమిచ్చె
ధన్య జీవి వీవు ధరణి లోన...
13.
లోకమందు భువిని లోకోత్తరంబైన
రామ చరిత రాయు, రక్తి తోడ
యనుచు దీవెనలిడె యాబ్రహ్మ దేముండు
శ్రీఘ్రమేవ శుభము శుభమటంచు ॥
14.
పుణ్య కార్య మిదియె పుార్ణమౌ భక్తితో
మొదలు పెట్టుమయ్య మధుర చరిత
గాని నట్టి వైన, గాన నట్టివిగుాడ
కందువయ్య నీవు కవిగ నిపుడు ॥
15.
నీవు రాసి నట్టి నిర్మలమ్మౌ చరిత
పృథివి యున్న వరకు పుాజ్య మగును.
ఆకసమ్ము భుాము లవియుండు వరకును.
అది కావ్య మౌను అదియె సుమ్మీ ॥
16.
అనుచు బ్రహ్మ పలుక ఆమౌనివర్యుండు
అతిగ సంతసించె ,నాత్ర తొందె .
బ్రహ్మ దీవెనలిడ బ్రహ్మానందముతోడ
సాగనంపె నతని సాద రముగ ॥
**************************
వాల్మీకి అయోధ్యాపురిని గనుట.
----------------------------
17.
నలువ చెప్పినట్లు నగుపించె కనులకు
రామ జన్మ స్థలము రమ్య ముగను
దివ్య యోథ్యపురిని దివ్యచక్షుల తోడ
కనెను వాల్మి కపుడు కడు ముదమున ll
18.
కళలు. నిండినట్టి కడు విశాల పురము
రత్న రాసి నిండు రాచ వీధి
వేద పఠన ములతొ వెల్గుబ్రాహ్మణులుండు
శిల్ప కళలు నిండు సిరుల పురము. !!
19.
లలిత కళలు నిండు లక్షణమైనట్టి
సద్గుణాదులున్న సాధు పురము
సుార వీరు లున్న శుద్ధబలుల పురము
సార విద్య లుండు సారయొాధ్యపురము॥
20.
మణుల మండపములు మంచి ఆసములు
సుక పికము లున్న సుఖ వనములు
పుాల సోరభాల పుప్పొడెగురు వీచి
వేల అందములతొ వెలుగు పురము ॥
ధర్మరాజు అశ్వమేధ యాగము జేయ సంకల్పించుట
-----------------------------------------
21.
దశర ధుండతండు ధర్మ పాలనజేయు
రాజతండు జనుల రక్షకుండు
పుణ్య శీలు డతడు పుాజ్యుడందరికిని,
ప్రీతి పాత్రు డతడు నీతి పరుడు ॥
22.
లోభ రహితు లున్న శోభ,సంపదలేలు
జనులు అచట వేలు, జయము లేలు.
శత్రు వైన నేమి శరణుకోరినవాని-
కభయ మిడెడు ఘను డయొాధ్య రేడు ॥
23.
మువురు భార్యలున్న ముచ్చట్ల ఘనరేడు
భాగ్య, రాసులున్న భవుడతండు
సంతాన మది లేక చింతలేలినవాడు
వంశ వృద్ధి కొరకు వదరు వాడు.॥
(వదరు= పలుకు , ఆవేదించు)
24.
వ్రతము పుాజలెన్నొ వరుస జేసిన వాడు.
పరిత పించె నతడు ఫలము లేక.
సార యజ్ఞ మునకు సంకల్పమును జేయ
గురుల జ్ఞాన ధనుల గుణుల బిలచె ॥
మునులు ఋష్యశృంగుడు యజ్ఞార్హుడని పలుకుట
యజ్ఞ యాగ ములకు యతి ఋష్యశృంగుండు
తగిన వాడు యతడు తలువ నెంచు
తోడ్కొ రమ్మ తనిని తోడునాలిని గుాడ
జంట గాను పిలువ జయము నీకు ॥
మునులు పలుకు మాట ముచ్చట గొల్పగా
నమము లిడుచు మాట నమ్మి తనుచు
మునుల సత్కరించె ముదము దశరధుండు
బయలు వెడలె పుార్తి బలగ ములతొ ॥
దశరధుడు యజ్ఞ మునకు ఋష్యశృంగుని పిలచుట
-------------------------------------
25.
శాస్త్ర బద్ధముగను శాంతిపుాజలుజేసె
క్రతువు నడుప నతడు క్రమము గాను.
మదిని మాట జెప్పె మంత్రి సుమంతుడు
అశ్వ మేధ యాగ మహిమ దెల్ప ॥
26.
బ్రహ్మ చర్య మునను భాసిల్లు విప్రుండు
ఋష్య శృంగు డతడు ఋషి వరుండు.
ఘనవి భాండకుండు గర్వించు పుత్రుండు
విషయ వాంఛ లేని విమల యశుడు ॥
27.
ధర్మ నిరతి లేనధర్మ పాలుడతండు
రోమపాదు డతడు రోష పరుడు
క్షామ కార కుండు క్షమకనర్హుడతడు
ప్రజల గోడు వినని పాలకుండు ॥
28.
ప్రాణ నష్ట మాయె ప్రారబ్ద కర్మలకు
క్షామ మదియె పెరిగె ధామ మందు
దుర్భ రమ్ము గతికి దుఃఖ మొందిన రేడు
దోష ముడుగ జేయు దోవ వెదకె ॥
29.
వేద విదుల మాట వేల యాశలు రేప
మునిని ఋష్య శృంగు ముదము బిలువ-
దలచి మౌని దరికి దండనాధులనంప
వారకాంతల నంప వారు బలికె ॥
30.
ఆడు వారలు వారు యాశ్రమమును జేరి
యాడి పాడి రంత యలుపు మీర
కాంత లందరు జేరి కవ్వింతలనుదేల్చ
తాప మదియె పెరిగె తాపసునకు ॥
31.
వార కాంతల మరచు వల్ల కానిదదాయె
జప తపంబు లందు జాడ్య మాయె
మదన తాప మదియె మదిని పీడనలిడ
కాంత లున్న దరికి కదలె శృంగి ॥
32.
ముని ఋష్య శృంగు ముదమార గనినంత
వార కాంత లెల్ల వచ్చి దరికి
మునిని తోడ్క జనిరి ముందు రాజుకడకు
మురిసె నంగ రాజు మునిని జుాచి ॥
33.
కారు మేఘము లవియె కమ్మె గగనమందు
ఉరుము లురిమె వెలుగు నుారు మెరిసె
కుంభ వృష్టి గాను కురిసేను వానలవె
పారె నీరు నదుల పలు నదముల ॥
34.
అర్ఘ్య పాద్య ములిడి అంగపుాజలుజేసి
ఆదరించె మునిని యంగ రాజు .
పుత్రి కైన "శాంత" పుణ్య శీలవతిని
పరిణయమ్ము నాడ పలికె విభుడు ॥
శాంత ఋష్యశృంగుల వివాహము
----------------------------
35.
రోమ పాదు కోర్కె రోమాంచకము కాగ
సమ్మతించె శృంగి సరళ ముగను
మొాద మందె మునులు మొాగెదుందుభులిల
జరిగె కల్యాణమ్ము జయము గాను ॥
క్షామ ముడిగె పురిని ధామ మేలె రాజు
పొరలె పాడి, పంట, పురము నిండె
కాలు పెట్ట చాలు కలుగుశు భములెన్నొ
పిలువ వయ్య మునిని పిలువు మనగ ॥
సాదుశీలు డైన సనత్కొమరు మాట
దశరధుండు వినెను విశద ముగను
మంత్రి వరుల గుాడి మధుర భావనతోడ
పయన మాయె రోమ పాదు కడకు ॥
మువురు సతుల గుాడి ముని వశిష్టుని గుాడి
ధండ నాధు లగొని దశరధుండు.
అంగ దేశ మేగె నలరు యాశలతోడ
ముని ఋష్యశృంగు ముదము గలువ ॥
మాట తెలిసి నంత మనెను రోమపాదు
విభుని సత్క రించె వినయ ముగను.
ఋష్యశృంగు కడకు రుషియంత గొని పోవ
సంతసించె రాజు సాధు జుాచి . ॥
వంశ ముద్ధరించు వరపుతృబడయంగ
అశ్వ మేధ యాగ మదియె జేయ
పుత్ర ఋష్య శృంగు పుార్ణ యొాగ్యుడనుచు
కోరెనతని నంప కోసలుండు ॥
కృతిని జేయు టకును కుమరుని గొనిపోవ
వచ్చు రేని జుాచి వలపు మీర
క్రతువు జేయు తలపు కడు ప్రియముగ దోచె
యనుచు సమ్మ తించి యానతిచ్చె ॥
సంతసంబు మదిని సందడించగ రాజు
దశర ధుండు మునికి దండ మిడుచు
ముదము తోడ్క పోయె ముని ఋష్యశృంగునీ
పురిఅ యొాధ్య ధన్య పురియటంచు ॥
మంచి ముార్త మదియె మధుమాస మనిబల్క
మాట విన్న రాజు మదిని మురిసె .
గురులు దీవెనలిడ గుణుడుదశరధుండు
యాగ అశ్వమునదె యటకు దెచ్చె ॥
దినము పౌర్ణ మిగని దివ్యముార్తము నెంచి
వేద మంత్ర ములతొ వేల్పు గొలచి
భుాసు రోత్తములతొ భుామి పుాజలుజేసె
సంత సించె రాజు సతులు మురిసె!!
******************************
దశరధుడు యాగారంభమునకు సంసిద్ధుడగుట
------------------------------------
తలచు కార్య మునకు తరుణమిది యటంచు...
బూనె దీక్ష యపుడు భూసురుండు.
సతులు గూడి యుండ సద్గురులు దీవించ
యాగ అశ్వ మొదలె యజ్ఞ విధిగ ॥
వెలసె గృహము లెన్నొ వేల జనుల కొరకు
అతిధి గృహము లవియె నాప్తులకును
కనుల పండుగాయె కళనిండె పురమంత.
ముచ్చటాయె జూడ ముగ్గు లన్ని !!
ఉన్నతులకు నంపె నుత్తరమ్ములు యెన్నొ
ఆద రముతో నంపె నాహ్వనములు
మణి -రత్న ములతొ మారాజు నిధి నిండె
వచ్చి కాన్క లిడగ వరుస నృపులు !!
భక్ష్య భోక్ష్య ములను బహు ప్రీతీ సేవించి
మంగ ళమ్ము లిడిరి మాన్య వరులు
దశరధేశు వెంట ధర్మ విధులు నడువ
ద్విజులు నడిచి రాది. దీవె నలతొ !!
యజ్ఞ వాటి లోన యాగాగ్ని వేసెనదె
రుత్వి కులతో గూడి ఋష్య శృంగి
యాగ మార భమ్ము ఆగ మాదులుజేయ
జరిగె వైభ వములు జయము గాను !!
కర్మ దేవతలకు కడు ప్రార్థనలు జేసి
యాగ శాల జేరె యాత్ర ముగను .
సార సరయు తటిని సాగు యశ్వము జూచి
వలయు పూజ లిడెను వాజి కతడు !!
వేడి ,యగ్ని కపుడు వేదోక్తపూజలిడి
నిప్పు కుండమునదెచె నిలిపి రచట.
యాగ అశ్వమునదె యాగ శాలకుదెచ్చె
పట్టమహిషి రాణి పసుపు రాసె !!
యాగ విధుల జరిగె యశ్వ మేధ క్రతువు
దశమ దానము లిడె దశరధుండు.
భూమి దాన మొసగె భూ సురేంద్రులకును
రూప గోవుల నొసగె ఋత్వి జులకు!!
దాన ధర్మ ములకు. ధర వాసులు మురిసె
వేల దీవె నలవె వెల్లు విరిసె
సంత సమున మురిసె సధ్ధర్మరాజదే
పుత్ర కామ క్రతువు పూర్తి జేయ!!
మహిని జరిగె మధుర మంత్రోక్త పుాజలు
మంత్రధర్వణోక్త మధుర యజ్ఞ ఫలము
బ్రహ్మ , రుద్రు లాది బ్రహ్మర్షి పుంగవులు
హవిసు లన్ని గొనిరి హర్ష ముగను ॥
నలువ గాంచి సురులు కలుగు బాధలు జెప్పె
రావణాసు డతని రచ్చ దెలిపె
తాపసుండతండు తపోబలము మెండు
గర్వ బలము నిండు ఘనుడ తండు ॥
పంచ భుాత ములను పట్టియుంచెనువాడు.
పవన , సంద్ర ములకు పనికి వెరపు
అదర గొట్టి పంపె నష్ట దిక్పాలకుల
దాగె దేవ రాజు దారి లేక ॥
కామ రుాపు లైన ఖలు రక్కసులరేడు
లంక నాధు డతడు లజ్జ లేదు.
వివిధ బాధ లిడెడు వీర రక్కసు పనికి
ఆగె కార్య ములవె యతని వలన ॥
వినెను ధాత యపుడు కనెను దేవతలను
నుడివె బ్రహ్మ రావ ణాసు మాట
వత్సరముల తపము వత్సచేసెను నాదు
మెచ్చి వరము లిచ్చి వచ్చి నాడ ॥
సిద్ధసాధ్యు లైన సుద్ధ గంధర్వులు
యక్ష కిన్నె రాది యశుల వలన
చావు లేని వరము తావులేకను యిస్తి
నరులు వాన రుల్లు వారు దక్క!!
గర్వ బలము తోడ సర్వ నాశనమును
కోరి తెచ్ఛు కున్న క్రోధి యతడు
నరులు వాన రుల్లు నమ్మ చంపుదురని
తెలియ లేదతండు తెలివి హీను !!
సమయ మొచ్చె నిపుడు సంయమమునుజూప
వరదుడదియె వచ్ఛు. వలదు భయము
అభయ మీయ నలువ హర్షమొందె సురుల
అంజలులిడి రంత అమరు లెల్ల !!
శార్గ గదా ధరుడు. శంఖచక్రధరుడు
లక్ష్మి వల్లభుండు లక్షణుండు
నలువ చెంత జేర నప్పిన్న ధవుడంత
నలువ సంతసించి నమము లిడెను!!
జేసి స్తోత్రములను చేసిరంజలులను
దేవతల్లు సురులు దేవునకును
ఈతి బాధలన్ని ఈశ్వరునికెరుకంచు
జెప్పి రిడుములన్ని జేరి హరికి !!
పుత్ర యాగ మదియె పుత్ర సంతతి కోరి
జేసె దశరధుండు జయము గాను
మువురు సతుల గర్భమున జన్మమెత్తి నువు
మహిమ చూపుమయ్య మహిని నీవు !!
యనుచు సురులు వేడ అభయమిచ్చెను హరి
నాల్గు రూపములతో నరుని వలెను
మువురు తల్లులకును ముద్దు బిడ్డడిగాను
జన్మ మెత్తి మీకు జయము జేతు !!
కోర్కె దీర్చ వచ్ఛి కోరి దశరధింట
అవతరింతు నిలను అసురు జంప
ధర్మ రక్ష జేయ ధర వేల వత్సరము-
లేల రామరాజ్య మిలను జేతు !!
దివ్య పురుషుడు దశరథునకు పాయసపు పాత్ర నిచ్చుట
----------------------------------------------
అని పలికి హరి అంతర్దానముజెంద
దివ్య కాంతి నిండె దిక్కులెల్ల
అగ్ని గుండమునదె నగుపించె దివ్యమౌ
పాయసంపు పాత్ర పట్టి ఘనుడు!!
పంపె నన్నిచటకు పనిగ ప్రజాపతీ
పాయసమ్ము పంచ ఫలము కలుగ
సతుల కోర్కె తీర్చి సంతసింపుమదయ్య
వంశవర్ధనమ్ము వరము నీకు!!
అనిన దశరథుండు అదే సంతసమునొంది
పాయసాన్న పాత్ర పట్టి మురిసె
యజ్ఞపురుషునకును అంజలి ఘటియించి
ధామమునకు జేరె దశరధుడు !!
మువురు సతుల బిలచి ముచ్చటగను పంచె
దివ్య పాయసమ్ము నవ్యముగను.
సగము భాగ మిచ్చె సతి కౌశల్యకును
సగము భాగ మిచ్చె సతి కైక రాణికి !!
శేష పాయసమ్ము సతి సుమిత్రకును
పంచ ఇచ్చె నతడు ఫలముగాను
యాగ విధిని జేసి ఆనందముగజూచి
ద్విజుల నెల్ల నంపె సజవు గాను!!
రీతి ఘనము చేసి ప్రీతి సత్కారముల
నంపె ఋష్యశృంగు నాలి తోడ .
గరుడ కిన్నెరాది గంధర్వులందరూ
వీడికొల్పు లిడిరి విజయ మనుచు !!
దివ్య పాయసమును దినినట్టి రాణులు
నవ్య కాంతి తోడ నడిచి రాగ
గర్భ వతుల జుాచి ఘన యజ్ఞ ఫలముకు
మురిసె దశరధుండు ముదము తోడ ॥
బ్రహ్మ వానరవీరులను సృజింపజేయుట
-----------------------------------
నరుగ నల్గు రైన నారాయణుని దల్చి
నలువ సంత సించె నభము నందు
విభుని కార్య మదియె విశ్వ విజయ మొంద
వరుస సృష్టి జేసె వానరులను ॥
బ్రహ్మ సృజన జేసె బలజాంబ వంతుని
సురపతంశ తోడ సుతుడు వాలి
దినకరునకు బుట్టె దివ్యసుగ్రీవుండు
వాయు దేవునకును వరము హనుమ॥
నలుడు బుట్టె నుగద నదె విశ్వ కర్మకుా
తడవ దేవ గురుకు తారు డదియె
నీలు డుద్భ వించె నిత్యాగ్నిహోత్రుకుా
ఘన యక్షు నకును గంధమా ధనుడుా ॥
బుట్టె వాన రుల్లు భువనాల భవనాల
భుజ బలమ్ము తోడ భువిని జనిరి.
బుట్టె యొాధులెల్ల భువి గహనములందు
ఏలి కాయె ఘనుడు ఇంద్ర సుతుడు ॥
దేవ గణము లన్ని దేవదేవుని దల్చి
సృష్టి కార్య మునకు సుాత్రు లైరి
యక్ష కాంత లాది లక్ష యొానులయందు
ప్రాభ వించె వారు ప్రథమ ముగను ॥
------------------------------
శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననము..
----------------------------------+
మువురు సతుల మనము మురిసె మొాదముతోడ
నెలలు నిండె నవము నేర్పు గాను
కళలు దేలె ముఖము కాంతి నేలెను మేను
లక్షణములు శుభము లాయె ఘనము ॥
శుద్ధ చైత్ర నవమి శుభ పునర్వసు నందు
పంచ గ్రహము లుచ్ఛపథము నుండ
కర్క లగ్న మందు ఘనముగా ప్రసవించె
కోస లేంద్రు సతి కొమరు నంత ॥
మీన లగ్న మందు మేని నిగ్గులుదేల
భరత కొమరు కనెను భార్య కైక.
కనెను లక్ష్మ ణుడను కలసి శత్రుఘ్నునీ
శుభము ద్వయము గాను శుభసు మిత్ర ॥
నరుల జన్మ మెత్తె నారాయణుండిల
నాల్గు రుాప ములతొ నయము గాను
యజ్ఞ ఫలముగాను యాపుతృలన్బడసి
ధన్య తొందె విభుడు ధర్మరాజు ॥
*****************************:
అశ్వ మేధ మదియె ఆ
No comments:
Post a Comment