శీర్షిక : అమ్మ మనసు.
(వచన కవిత).
.రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
అకాశంలో వెలిగే తారల మిణుకులు
అమ్మ, నాపై పెంచుకున్న ఆశల శకలాల్లా.
వెన్నెల కురిపిస్తున్న పుార్ణ చంద్రుడు .
అమ్మ చల్లటి చిరునవ్వులా ...॥
బావిలో చంద్రుని ప్రతిరుాపం ,
నా వెన్నంటి ఉండే- అమ్మ భావనలా...
మా తోటలో పుాచే గులాబీలు,
అమ్మ ఒడి నిండిన మమతలా....
గాలిలో పరుచుకున్న మత్తైన పరిమళం,
అమ్మ ,నిస్వార్ధంగా పంచే ప్రేమలా..॥
నాలో జరిగే అంతర్యుద్ధంలో
నాకు నేనుగా ఓడిపోతుాన్న ,భావన..
అమ్మనయ్యాకా గానీ తెలుసుకోలేని
"అమ్మ" మనసులా...॥
ధారగా కారుతున్న నా కన్నీళ్ళు
అమ్మని బాధపెట్టిన నా పాపానికి
ప్రాయశ్ఛిత్తంలా.....॥
నా ఒళ్ళో కేర్..కేర్..మంటుా ఏం కావాలో
చెప్పలేకా ,ఏడుస్తున్న నా బాబు రోదన..
అనాధాశ్రమంలో ఆకలైనా చెప్పలేని
అమ్మ నిస్సహాయతకు నిదర్శనంలా....॥
No comments:
Post a Comment