"పూబాల "
---------------
( ఆడపిల్లలకి రక్షణ కల్పించండి )
శీర్షిక
అందాల పుాబాల.
-------------------------
అందాల పూబాల వికసించే పరువాల
కలువకన్నులతోడ చూచె నాడ ఈడ
వింతగా కనురెప్పలు విప్పీ వివరంగ చూచి
ఎంతగానో మురిసే వనమంతా పరికించి ॥
ఆ తోటలో పూలు రంగు వలువల చెలులు
వలపు వింజామరల పంచె సౌరభములు
మొగ్గ తొడిగిన సాటి ముద్దు బాలలతోటి
కవ్వింత,తుళ్ళింతలాడి పాడెను కలసి ॥
అంత నరుదెంచెనా తోట వనమాలి
పూలబాలల తెంపె వాడు దయమాలి
విరిసి విరియని పూల చేర్చె నంగడిలోన
వెలగట్టి తెగనమ్మే కరకు సందడితోన ॥
చిదిమే కొందరు వాని నలిపే భోగులు మేని
కొన్ని చేరెను బలికై ఎన్నో నలిగెను చితికి
కన్నీరై మున్నీరై వాడి నలిగిన బేల
ఏల పూచితి ననుచు వగచె విరిసిన బాల ॥
_______________________________
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదిుశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
----------------------
No comments:
Post a Comment