శ్రీ సుందరాకాండ.(పాటవెలదులు).
పాటవెలదులు సృష్టి కర్త ...
శ్రీ వడ్డేపల్లి క్రిష్ణ గారు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ఓం : శ్రీ : గణేశాయనమః.
సుందరాకాండ ప్రారంభము.
ప్రక్రియ : పాటవెలది.
సృష్టి కర్త : శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
1:
అపహరించె సీత నసురు డొకడు
రావణుండు వాడు రక్కసుండు
రమణి సీత బాసి రాము వగచి
చిక్కి శల్య మాయె చింత తోడ ॥
2.
ధీరు డతడు హనుమ వీరు డతడు.
రామ భక్తి నిండు నామ జపుడు
జానకమ్మ వెదకి జాడ నెరుగ
బయలు వెడల లంక బంటు రీతి ॥
3.
వరుస గురుల కిడెను వంద నములు
ఆనతీయ మనుచు ఆదరమున
ఉధది దాట హనుమ ఉరికి ఎగసి
దక్షిణంబు దిశగ తరలి పోయె ॥
4.
పర్వతుండు వణికె పగలె శిలలు
భుామి గుహల నదిరె భుాత గణము
తరులు రాల్చె పుాలు తడవ తడవ
కుప్పియించి నెగర కుల ఘనుండు ॥
5.
ధీర గతిని ఎగురు వీర కపికి
ఆశ్రయమ్ము నొసగి అలుపు దీర్చ
తలచి మైన కుండు తరచి పిలచె
అలుపు దీర నిలుమ హనుమ యనుచు॥
6.
విఘ్నమదని తలచి వీర హనుమ
ఆగ్ర హమున తోసె అతడు గిరిని
కృంగి శ్రేష్ట గిరుడు వంగి నిలచి
నరుని రుాపు తోడ నగము పలికె ॥
7.
యొాజనములు శతము యొాగి వంద్య
ఆగి నిలచి పొమ్ము అలుపు దీర
జలధి దాటగలవు జయము నీకు
అనుచు స్వాగతించె అనిల సుతుని ॥
8.
ప్రేరణిచ్చు పిలుపు ప్రేమ పలుకు
వినియు క్షణము ఆగి వినయ ముగను
పవన తనయు డెగసె పరమ గతిని
జలధి దాట జరుప జాప్యమనుచు ॥
9.
పర్వతోత్తముడదె పరవశమున
గాంచె ప్రేమ తోడ ఘనుని కపిని
రామ కార్య దీక్ష రగులు వాని
దివ్య జయము లేల దీవెనలిడె ॥
10.
సురులు అంబరమున సుస్వరముల
మేలు గీతములతొ జేలు పలికె
కార్య దీక్ష తోడ కదలె హనుమ
దాట యొాజనముల బాట సాగె ॥
11.
రాత్రి లంక నేలు రక్కసులను
జుాచి నంత హనుమ జంకు నేమొా
బలులసురుల జుాచి భయము తోడ
వీడు నేమొ లంక వివశు డౌచు ॥
12.
అసుర భయము తోడ హనుమ యిపుడు
సీత జాడ నెరుగ సిద్ధ మౌన
అనెడు శంక తోడ అదిరి సురులు
సురస నంపె భువికి శుభము దలచి ॥
13
రక్కసదని తెలిసి రయము తోడ
లంక వీడు నేమొ లక్ష్య మొదలి
సులభ మౌన కపికి సురస గుాల్చ
అనుచు దలచి సురులు అశ వీడె ॥
14.
బ్రహ్మ వరము దలచి భయము వీడి
తెరచె నోరు సురస తెగువ తోడ
రక్కసదని తెలిసి రగుల మనము
మేను పెంచె హనుమ మేరు రీతి ॥
15.
ఒడిసి పట్టి కపిని నోట మ్రింగ
నోరు తెరుచు సురస జోరు నెరిగి
అంగు ళీక మంత ఆయె హనుమ
నోట జొచ్చి వచ్చె నొనర జయము ॥
16.
పవన సుతుని ప్రజ్ఞ పాటవముకు
ముదము దీవెనలిడె మురిసి సురస
అంజలిడుచు హనుమ ఆదరమున
ఆకశమ్ము నెగిరె అనిల సుతుడు.. ॥
17.
దీక్ష నుధధి దాటు ధీరుని గని
సింహికడ్డగించె సింహ బలుని
నాల్క జాపె వానినారగింప
ఛాయ రుాపి , దాని చంపె హనుమ ॥
18.
సాహసమున దాటె సంద్రమతడు
కనుల ముందు గాంచె కాంచనపురి.
నిపుణు విశ్వకర్మ నిర్మితంబౌ
లంక గాంచె నతడు లక్షణంబౌ ॥
19.
త్రికుటచలము నిదియె త్రిభువనమున
నాకమునదె మించె నగర శోభ
ఫలము ,పుాల నిండు పచ్చదనము
సుందరమ్ము మిగుల సుందరమ్ము ॥
20.
అద్భు తమ్ము లంక అనుచు హనుమ
అదెగ తిరిగె వనము అచ్చెరువున
నిలచి నిలచి జుాచె నిండు వనము
గడచె దినము యంత పొడచె రాత్రి ॥
21.
తరుణ మిదియె గాదు తరుణి వెదుక
అనుచు తలచి హనుమ అచటె నిలిచి
వేచి యుండె నచటె వేకు వగన
నిశిని గడపె హనుమ నిదుర లేమి ॥
---------------------------------------------
22.
వేకు వాయె నంత వెలుగు వచ్చె
వేచి యున్న హనుమ వేగ సాగె
కరకు రజనిచరుల కంట బడక
ఎక్కి గోడ నతడు ఎగిరి దుమికె ॥
23.
నక్కి పోవు కపిని నిక్కి జుాచి
జడల మారి చరిచె జఘన ములను
కరకు రక్కసామె కరుణ లేని
లంక గాచు నసురి లంఖిణామె ॥
24.
అడ్డగించె నసురి హనుమ బాట
గర్జనలను జేసి గట్తి గాను
కొండ కోన తిరుగు కోతి వనుచు
తరలి పొమ్మటంచు తరిమె నతని ॥
25.
రగిలె హనుమ వింత రక్కసి గని
నన్ను వెడలు మనుచు నడ్డు నీవు
పేర్మి దెల్పు మమ్మ పేరు నీవు
అనుచు నోర్మి పలికె హనుమ యపుడు.॥
26.
కావలుందు నిచట గావ పురము
లంఖిణందు రన్ను లంకసురిని
ఆన తిడను పురము నడుగు నిడగ
ప్రాణ ములను దీతు పారి పొమ్ము ॥
27.
అనిన లంఖిణి గని హనుమ బల్కె
జుాడ వస్థి పురము జుాచి పోదు
వేడు చుంటి నమ్మి వెడలనిమ్ము
అనుచు వినుతి జేసె ఆదరమున ॥
28..
మంకు పట్టు విడని మారుతి గని
గర్జనలను జేసి గదిమి తరుమ
కుమతి విసిగి మీద కురిమి చరచె
హనుమ ఉగృడాయె హఠము పెరిగె ॥
29.
సింహ నాద మిడెను సింగ మల్లె
మారు మ్రొాగి రవము మారు బల్కె
కొండ వలెను పెరిగె కోరి హనుమ
ముష్టి ఘాతములతొ ముదిమి గుాల్చె ॥॥
30.
కొండ వంటి అసురి బండ వలెను
దొర్లి దొర్లి కుాలి , పొర్లి పొరలె
అబల తానటంచు అరచి వేడె
దయను చుాపటంచు ధరణి వ్రాలె ॥
31.
అబల జంప నేను అల్పు గాను
అనుచు బల్కె హనుమ ఆదరమున
ధర్మ బుద్ధి మెలగు ధన్యు జుాచి
నమము జేసె నసురి నమ్ర భావై ।
-------------------------------------------
32.
ఓట మిదియె తనకు ఒనరు కీడు'
లంక కగును చేటు శంక లేదు
సీత ముాల మౌను సీమ రగులు
అనుచు వణికె నసురి అదెగ దలచి ॥
33.
లంఖిణనెడు మాటలదెగ వినిన
హనుమ సంతసించె హర్షమొలుక
కలుగ భయము నసురి కదలి పోయె
జయము హనుమ నీకు జయ మటంచు॥
34.
ప్రతిగ లంఖిణీకి ప్రణతు లిడుచు
కంట తడిని బెట్టె కాంత దలచి
రావణాసు దలువ రగుల మనము
వామ పాద మిడెను వరల కీడు॥
35.
కొండ దాటి పోయె కోట దరికి
లంఘనముల వెదుక లంక దిరుగ
సుమ సుగంధ వీచి సుఖము లొలుక
శోభ లలరు వనము సొగసు గాంచె ॥
36.
రమ్య వనము సాగె రాజ వీధి
స్వర్ణ సౌధ ములవె స్వచ్ఛ బాట
దివ్య మణుల ద్యుతులు దిక్కు లీన
ఉత్తమంబు గృహము లున్నతములు ॥
37..
అప్సరసల మించు అంద ములతొ
మేటి నృత్యములవె మేలు గతుల
అతివ లచట నాట్య మాడె జతుల
రమ్యమైన రేయి రసము లొలుక ॥
38.
శోభ లీనె లంక శోధ నేల...
అనుచు మదిని దలచె అనిల సుతుడు
వెన్నెలంత హాయి వెలిగె లంక
కదల లేక వదలె కపి వరుండు ॥
39.
రత్న ఖచిత మయము రమణియమ్ము
కళలు నిండు పురము కాంతి మయము
వీణ నాద మలరె విందు లీను
మధుర కళల నిండె మందిరములు॥
40.
ధ్వజ పతాక మెగిరె ద్వార ముపరి
సింహ ద్వార మదియె సిరుల నెలవు
నృపుని గృహము నేలె నృత్య గీతి
రాగ రంజి తముగ రమణు లాడ ॥
----------------------------------------
శ్రీ సుందరాకాండ.(పాటవెలదులు).
పాటవెలదులు సృష్టి కర్త ...
శ్రీ వడ్డేపల్లి క్రిష్ణ గారు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
41.
ఫలము లెల్ల నిండె వనము పండె
పరిమళించె పుాలు పలు రకములు.
సకల రాజ భోగ సంపదలరె
రావణాసు లంక రస భరితము.॥
42.
యమ కుబేర వరుణు లాది ఘనుల
మించి నట్టి ఘనత మీరె లంక
శివుని అర్చ నలవె సిరులు పంచ
జపము తపము లచట జరుగుచుండె ॥
43.
విశ్వ కర్మ తొలుత విధికి నీయ-
ధనపతి కది యిచ్చె దాని బ్రహ్మ.
రావణుండు గెలువ రణము నందు
పుష్పకమ్ము పెంచె పురము శోభ ॥
44.
వలయు నపుడు తలువ బయలు వెడలు
వాయు వందు దేలు వాహనమ్ము
అట్టి పుష్ప కమ్ము నవని గనని
చక్క దనము గనుచు చకితు డాయె ॥
45.
రణము నందు నోడు రాజ సతుల
మెచ్చి రావణుండు దెచ్చి యుంచె
రమణి సీత దక్క రమణు లగని
వగచె నెంతొ హనుమ వారి గతికి ॥
46.
వీర మందిరమున విశ్రమించు
రక్కసుండు అతడె రావణుండు
కత్తి పోట్లు నిండు ఘాత ములతొ
సేద దీరె నచట సేవ లలర ॥
47.
లోహితాక్షుడతివ లోలు డతడు.
కల్లు తాగు వాడు నల్ల వాడు.
మహిని మగువ లేలు మద పురుషుడు
రాస లీల నెరపు రసికు డతడు ॥
48.
వంచి తలను హనుమ పొంచి చుాడ
దివ్య భుాషణముల దీర్చి దాల్చి
శయన మందిరమున శయ్య నలరు
రమణి గాంచె నతడు రమ్య గతిని ॥
49.
భామ సీత యనుచు భ్రమను పొందె
కంటి సీత ననుచు కపి వరుండు
బట్టి వాల మతడు బెట్టి ముద్దు
చెంగు చెంగు యనుచు చెలగె హనుమ ॥
50.
పల్లి టీలు గొట్టె పవన సుతుడు
కోతి గుణములకును కొదువ గలదె .
తంబములను బట్టి తడవు నెక్కి
దుమికె నేల నతడు దుడుకు మీర ॥
---------------------------------------------
51.
ఎట్లు తలచితేను ఎరిగి నిజము
జానకుండ గలద జగము లోన
రాము బాసి నట్టి రమణి బేల
పరమ సాధ్వి యామె , పలుక, తప్పు ॥
52.
రమణి సీత బోలు రమణి జుాచి
తప్పు దలచి తేను తగదు తప్పు
అనుచు బాధ చెందె హనుమ మదిని
వగచె తలచి తలచి వాయు సుతుడు.॥
53.
స్వావలంబమునను స్వామి సేవ
జేయ వచ్చి నాను చెడుపు నెరుగ
పాపి గాను నేను పలుక, దప్పు
సీత వెదుకు వస్తి సీమ లంక ॥
54.
దవుల దవుల వెదకె ధరణిజగన
మేలు వసతు లెల్ల మేడ లెల్ల
భుాగృహముల వెదకె భుామి సుతను
కాన రాని దాయె కాంత యెచట..॥
55.
రామ నామ జపము రమణి జేయ
రాక్ష సతులు రమణి రక్కె నేమొ
రామ జపము వినిన రావణుండు
సీత జంపె నేమొ శీఘ్ర గతిని ॥
56.
అనుచు దలచి హనుమ ఆగ్రహించె
కంట నీరు కారె కపి కులజుకు
వెదకె అడుగు అడుగు వెతల కోర్చి
కాన రాని దాయె కాంత యెచట..॥
57.
ఆపతమ్ము సోక అలసె హనుమ
కాననముల వెదకె కాచి గాచి
జాడ కాన రాదు జరిగె దినము
తరిగె దుడుకు తనము తగ్గె నతడు ॥
58.
రామ చంద్రుడడుగ రమణి మాట,
ఏమి సేతు నేను ఏమి చెబుదు..?
తరుణి కాన నైతి తరలి పొివ..
అనుచు సిగ్గు పడెను అనిల సుతుడు॥
59.
అవనిజ ఇక లేదు అనిన వార్త
విన్న రాముడచటె విడును శ్వాస
రాము నంటి పోవు రవి కులమ్ము
నాశ మౌను గాదె నాదు వలన ॥
60.
వగచి మాన్యు లెల్ల వరుస పోవు ,
అటుల జరుగ రాదు అవని లోన
మాత వెదకి గాని మరలి పోను
అనుచు ప్రతిన బుానె అనిల సుతుడు ॥
-------------------------------------------------
61.
వానప్రస్థ మేల వాయు సుతుడు
నిత్య నియమ మేలె నిష్ట తోడ
చంద్ర, సుార్యు లాది జయ గ్రహములు
ప్రబలు గౌరవముల పణతు లిడెను ॥
62.
వనము లెన్నొ తిరిగి వడలి -జేరె
శోభ లలరు వని కశోక వనికి
విరిగ కురియు తేనె విందు జేయ
గ్రోలు భృంగము లవె గోల గాను ॥
63.
పక్షి గుంపు లెల్ల పరవశమున
కిచల రవము జేసె కీచు గాను
నెమలు లాడె నచట నేర్పు కళల
గంధ వీచి సోకె గాడముగను ॥
64.
రాలు పుాల పండ్ల రసము గ్రోలి
కపి వరుండు ఆడె కడు విధముల
ఆట పాట తోడ అరచి విరచె
మంచి మేలు తరుల మర్కటుండు.॥
65.
పుావులనిన పుాల తావులనిన
పరవసించు నెంతొ పసిడి కాంత
తేనెలుారు వనము తేట వీచి
తధ్య మిచటె నుండు తరుణి సీత ॥
66.
అనుచశోక వనము నదెగ జుాచి
చెట్టు నెక్కె హనుమ గుట్టు గాను
నేల వాలి కుంగి ఏడ్చు చున్న
యువతి గాంచె నతడు ఉత్సు కతను ॥
67.
చిక్కి శల్య మైన చిన్న దాని
గనెను హనుమ నామె కరుణ తోడ
జుట్టు ముట్టి రామె జట్టు గాను
లంక సురుని చరులు లంఖిణీలు ॥
68.
వృక్ష శాఖ లందు వరుస సరులు
మణులు మరకతముల మాల లెన్నొ
కర్ణ వేష్ట హస్త కంకణములు
హనుమ జుాచె వాటి నచ్చెరువున ॥
69.
రమణి వీడి నట్టి రతన ధనము
గురుతు పట్టి హనుమ మురిసె మదిని
సర్వ లక్షణముల సార సుగుణి
సీత దక్క ఎవరు సిరుల నెలవు ॥
70.
జానకమ్మ ఒకతె జగతి లోన
రామ మదిని దోచు రమణి సాధ్వి
పదియు నాలు గేండ్లు పావనిచట
దుర్దయెంత గనెనొ దుఃఖ పడెనొ ॥
71.
అనుచు దలచి మదిని హనుమ వగచె
తల్లడిల్లె హనుమ తరుణి జుాచి
జయము కలుగు నీకు జగతి ననుచు
శుభము పలికె హనుమ సుఖము లేలు ॥
72.
కఠిన కాల మిదియె కష్ట ములకు
తొలగి పోవు నమ్మ త్వరిత గతిని
నీదు జాడ తెలియ నిక్క ముగను
రావణునదె చంపు రామ శరము ॥
73.
అనుచు హనుమ సోలె నచటె నిలచి
ఝాము లాయె ముాడు జాగ రణతొ
మధుర వాద్య ఘోష మంగళములు
ఆలకించె హనుమ హాయి మీర ॥
74.
మరపు రాని సీత, మదిని కలచ
మేని తాప మలర మేలు కొనిన
రావణుండు నెరపె రాజ సమున
శాస్త్ర యుక్త ముగను సర్వ విధుల ॥
75.
అప్సరసల బోలు అతివలతని
సేవ జేయ వచ్చి చెంత నిలచె
సార భుాషణముల సరిగ దాల్చి
వెడలశోక వనము వేగ తెమిలె ॥
76.
సతులు నుార్గు రతని సరస జేిరి
మెరయు సరుల జుాచి మెచ్చి రతని
రమణి దలచి మదిని రక్కసుండు
నవ్వి రావణుండు నడచె వనికి ॥
77.
రామ గుణ గణముల రాత్రి పవలు
జపము జేయు పుణ్య చరిత జుాడ
రావణుండు కదలె రాజసమున
మేని సరుల జాపి మెప్పు పొంద ॥
78.
మసక రుాపు తోడ మసలె హనుమ
రావణాసు గాంచి రగిలె మనము
శింశుపావనమున సీత సాధ్వి
ఏక వస్త్ర అమె ఎరుగ దేమి ॥
79.
అనుచు తలచి హనుమ అదె పరుగున
వనము జేరె నంత పలుక హితము
విషయ మెల్ల జెప్ప వివర ముగను
లంక సురుకు బోధ లదెగ జేయ. ॥
80.
దాన సామ భేద దండములతొ
సానుకుాల పరచ సాధ్వి దరికి
జనెను రావణుండు జతన ములతొ
జేరి సీతను గని జెప్పె మనసు ॥
81.
ఏలుకొందు నిన్ను ఏల చింత
రాణి వాస మేలు రమణి నీవు
లోక సుందరీవు లోల నేత్రి
వన నివాస మొదులు వనజ నేత్రి ॥
82.
వనము లేలు వాని వశము గాదు
వలయు సుఖము లిడగ , వట్టి మాట
నన్ను జేర రమ్ము నమ్మ కమున
సుఖము లేల గలవు సుందరాంగీ ॥
83.
అడవి దిరుగు రాము డల్పు డతడు
నన్ను గెలవ తరమ నరుడతండు
ఇంద్ర దేవతలను ఇట్తె గెలిచి
ధామ సర్గ మేలు ధవుడ నేను ॥
84.
మరచి పొమ్ము వాని మరచి రమ్ము
సర్గ సుఖము లిత్తు సరసి జాక్షి
అనుచు వాతలాప మధిగ జేసె
చెడుపు మాట లనుచు జేర వచ్చె ॥
85.
సీత ధవుని దలచి శిరసు వంచి
నమము జేసె మదిని నాధు దలచి
గరిక మించు హీన గుణుడ వనుచు
పెరికి గడ్డి పరక పెట్టె నడ్డు.॥
86.
పిరికి పంద వలెను ప్రియుని చాటు
అపరించి తీవు యడవి జొచ్చి
కపట వేస మునను కరుణ లేక
పట్టి తెచ్చి తీవు పలికి కల్ల ॥
87.
వదరు బోతు వీవు వంచకుడవు
పనికి రాని వట్టి పలుకు లాపు
శరణు వేడు మతని శరణటంచు
రాము డతడు ఘనుడు రక్ష కుండు ॥
88.
భీతి నొందు వట్టి భీరు డీవు
నీతి లేని గుణము నీచ బుద్ధి
గుణుడు రాము డొచ్చి గుాల్చు నిన్ను
లంక దగ్ధ మొౌను శంక లేదు ॥
89.
అనుచు సీత బల్క నదిరె నతడు
కోప మాప లేని క్రోధి యగుచు
ఎంత జాణ వీవు యెంచ తరమా !
కరకు మాట నీదు కనివినెరుగ ॥
90.
నీదు మాటలు విని నిలువ జాల
గడువు రెండు నెలలు గడచి నంత
కనికరించ నేను కాంత వనుచు
చంపి వేతు నిన్ను చపల నేత్రి॥
91.
రాను ఇచటి కింక రానటంచు
అరచె రగుల నతడు అదరె లంక
క్రొవ్వు దేరు మేను క్రోధ మునకు
కరిగి కారె చమట కరకు మేని ॥
92.
రాము నాజ్ఞ లేక రక్ష లేక
పలుకు లేక యుంటి పరుష మొప్ప
పరమ సాధ్వి నేను పతివ్ర తేను
తృణము బోలు నిన్ను తృటిని గుాల్తు ॥
93.
కలికి పలుకు లోన కఠిన ముగని
రగిలె రావణుండు రమణి జుాచి
నివురు గప్పు నట్టి నిప్పు యట్లు
మాట లాడె సీత మాయ గాదె ॥
94.
అనుచు పలికి నతడు అవని గాచు
అక్కసు నదె పిలచె రక్కసులను
రాయి వంటి దైన రమణి మనసు
మార్చు మనుచు జెప్పి మరలె నతడు ॥
95.
గడువు రెండు నెలలు గడచి నంత
వినదు అన్న మాట విననటంచు
మాట వినగ జేయ మసలు మనుచు
కరుగ జేయ మనెను కాంత మనసు ॥
96.
అటుల జేయకున్న ఆగ్రహింతు
అబల లనియు జుాడ నాగ్ర హింతు
శిక్ష వేదు జంపి శిలువ వేతు
అనుకు క్రోధి వెడలె అవనిజదరె ॥
97.
మరలె రావణుండు మదిని కృంగి
కొరకొరనుచు జుాచి కోమలి దెస
ఎర్రనైన కనుల నెగుర వేసె
ఆగి తొడను చరచె నహము తోడ ॥
98.
కనికరమ్ము వీడి కరుణ లేని
రక్కసుల్లు జేరి రమణి రోసె
కంట ధార లాయె కనుల నీరు
బేల యౌచు వాలె బెదరి సీత ॥
99.
ముదుసలైన త్రిజట ముప్పు నెరిగి
మాతకడ్డు నిలచె మండి పడుచు
సీత జేరి నంత సీమ లంక
దగ్ధమౌనటంచు దరిమి గొట్తె ॥
100.
ప్రళయ కాల మిదియె ప్రాణ ములకు
దానవులకు కీడు దాపు రించె
అనుచు త్రిజట పలుక అదరసురిలు
బెరకు తనము తోడ బెదరి చెదరె ॥
------------------------------------------------
101.
తప్పదికని తెలిసి తరుణ మిదని
పలుక నెంచి త్రిజట పలికె నపుడు
స్వప్న గాధ జెప్పె స్వయము త్రిజట.
విని నసురిలు భీతి విహ్వ లైరి ॥
102.
రాజ వేష ధారి రాము డతడు
సీత అబల కాదు సిరుల నెలవు ॥
దేవ లోక చరులు దేవ గణులు
పరమపదము లిడెడు పరమ శుభులు
103.
కోరి మునులు గణులు కొలచు వారు
సన్నుతొందు వారు సర్గ చరులు
మానవులుగ వచ్చి మహిని ఏలు
దేవ తల్లు వారు దేవ గుణులు ॥
104.
సుార్య కోటి తేజ సుందరుల్లు
విష్ణు డతడు సీత విజయ లక్ష్మి
విధిగ లంక గుాల్చు విశ్వ ఘనుడు
నాశ మౌను లంక నరుని వలను ॥
105.
శ్వేత కరిని ఎక్కి వేల ద్యుతుల
దివ్య తేజ మలర దిగిరి వారు.
రామ లక్ష్మణులదె రాజ సమున
జేరి నారు లంక ,చేటు జేయ ॥
106.
అనుచు పలికె త్రిజట అతు రముగ
స్వప్న విషయ మెల్ల స్వయము జెప్పి
వినిరి త్రిజట మాట విస్మయముగ
బెదరె రక్క సుల్లు పెరిగె భయము ॥
107.
తనదు స్వప్న మదియె తధ్యముగను
జరుగ గలదటంచు జడిసె త్రిజట
బ్రహ్మ ముార్త మదియె భ్రాంతి కాదు
నిజము కాగలదది నిశ్ఛయముగ ॥
108.
భయము గొల్పు మాట భారముగను
వివర ముగను జెప్పె విషయ మెల్ల
స్వరము తగ్గ జేసి స్వప్న గాధ
వినుడు యనుచు జెప్పె వింత మాట ॥
109.
మెతక తైల మలదె మేని రేడు
తాగు చుండె నుానె తరచి యతడు
నలుపు బట్ట జుట్టె నల్ల మేని
కాల యముని బోలె, కఠిను డపుడు॥
110.
మెరయు నల్ల మాల మెడను దాల్చి
పొర్లె పుష్ప కమున దర్లి పడెను
ఈడ్చు చుండ్రి స్త్రీలు ఇతని బట్టి
జెప్ప జాల నింక చెడుపు మాట ॥
111.
సుారు డతడు యెక్కె సుాకరమును
ఒరిగె కుంభకర్ణు డొంటె పైన
మదము నింద్రజిత్తు మకరమెక్క
దక్షిణంబు దెసగ తరలి , పడిరి ॥
112.
అసురు లదెగ జచ్చె అవని నిండె
మట్టి గలిసి రంత మహిమ గాదె
భయము భీకరమ్ము , బడక బాధ
కదలి పారి పొండు వదలి లంక ॥
113.
అనిన త్రిజట తోడ అసురు నాజ్ఞ
చెప్పి రపుడు వారు చేయు పనిని
సీత మనక యున్న శీఘ్ర గతిని
చంపు రావణుండు చరచి మమ్ము ॥
114.
నీదు మాట వినిన నీల ఘనుడు
రాము డొచ్చి చంపు రమణి రోయ
ఏమి సేయ వలయు ఏది సబబు
తెలియ జెప్పు మాకు తెలివి తోడ ॥
115.
అనిన త్రిజట జెప్పె అసలు మాట
రాము డొచ్చు మాట రక్క సులకు
తెల్ల గంధము నదె దేహ మలది
వచ్చె వేల్పు లిటకు వనిత వెదుక ॥
116.
తెలుపు వలువ లిడిరి తెలుపు సరులు
ధారణమ్ము జేసి , ధామ మొదలె
చంద్ర కాంతి జిమ్ము ఛత్రము గల
తెల్ల కరిని ఎక్కి తేలి ఎగిరె ॥
117.
మంగళములు మ్రొాగె మధుర గతిని
దండ మిడుచు వచ్చె దనుజు డొకడు
వీరు డతడు గన విభీషణుండు.॥
వినయ ముగను రామ విభుని కడకు
118.
విశ్వ కర్మ జేయు విజయ లంక
అమరె నందముగను అదియె నిజము
రావణుండు రసిక రాజ విభుడు
ఏక ఛత్ర ముగను ఏల లంక ॥
119..
రామ దుాత యొకడు రాత్రి జేరె
తిక్క వానరుండు తిరుగు బోతు
వాల మంటె నిప్పు వాడె గాల్చె
మంట లెగసె మారె మసిగ లంక ॥
120.
స్వర్గ మంటి లంక స్వర్ణ లంక
మసిగ మారి కలసె మట్టి లోన
ముద్దు లొలుకు లంక మునిగి పోయె
కలసె సాగరమున కల్ల గాదు ॥
------------------------------------------
121.
అనుచు జెప్పె త్రిజట అసురి నులతొ
నమ్మె త్రిజట మాట కమ్మ భయము
భయము చెంది వారభయము కోరె
రమణి విడిచె వారు, రాత్రి గడచె ॥
122.
ప్రాణ త్యాగ మిడగ ప్రాంజలిడుచు
వాలు జడను మెడకు బాగ జుట్టి
కొమ్మ కేసె కట్టె కోమలాంగి
బిగియు నటుల ఉరిని బిగితు గాను ॥
123.
కనుల నీరు నిండె కఠిన గతికి
దుఃఖ మినుమడించ తుాలె సీత
అంత లోనె వింత వనిని జరిగె
శుభ శకునములను సుదతి గాంచె ॥
124.
సీత జేయు పనిని చిత్రముగను
గనిన హనుమ మదిని కలవరపడె
ఆలసింప అగును అశుభ మనుచు
తరుణి సీత గావ తలపు నెంచె॥
125.
రామ బంటు ననిన రమణి మనదు
రక్కసుండ వనుచు రగులు సీత
వేష ధారి వనుచు వేయు నింద
ఏమి చేదు నింక ఎరుక జేయ ॥
126.
యొాచ నెంచి అతడు యొాగ్యమైన
రామ కధను పాడె రమణి వినగ
పావనమ్ము గాధ పరమ శుభము
పలుక తేనె లొలుకు భవుని చరిత ॥
127.
వినియు రామ చరిత వివశయౌచు
సీత అగి చుాచె చిత్ర ముగను
ఉరిని వేయుటాపి ఉరికె సీత
పాట వినిన దెసకు పరుగు లిడగ ॥
128.
సీత వినుట గనుచు శీఘ్ర గతిని
రామ గుణము లెల్ల రసము లొలుక
పలికె హనుమ శ్రావ్య పాట రీతి.
సంత సించ సీత సరసి జాక్షి ॥
129.
సత్య వంతుడతడు సర్వ శుభుడు
యశము లేలువాడు యజ్ఞ ఫలుడు
ధశరధాత్మజుండు ధరణి నేలు
రామచంద్రుడతడు రఘుకులజుడు ॥
130.
తండ్రి మాట వినెడు తనయు డతడు
ధర్మ మార్గ మెంచు ధర్మ ధవుకు
జ్ఞాన ధనుడతండు దాన గుణుడు
దశరధాత్మజుండు ధర్మ ప్రభువు ॥
131.
సభను సభికులంత సమ్మ తిడగ
రాజ పట్టమిడగ రాము నకును
జేయ నిర్ణ యించె జయము గాను
దశరధుందు ధర్మ దాశరధికి ॥
132.
సంతసమ్ము తోడ సతుల జేర
చిన్న భార్య కైక చిందె విషము
మున్ను బాస లిడిన ముాడ్వరముల
ముందు ఇమ్మ నడిగె ముార్ఖముగను ॥
133.
మాట తప్పనన్న మగని జుాచి
కరకు కైక కోరె కటు వరములు
వనము కంప మనెను వర సుతుడను
కట్ట వలె భరతుకు పట్ట మనెను ॥
134.
రాము వీడ మనెను రాజ్య సుఖము
కడకు పంప మనెను కాన నముకు
పదియు నాలుగేండ్లు పరిమి తిడెను
కఠిన మనము నిండు కపటి కైక ॥
135.
దద్దరిల్లె నభము ధరణి పగిలె
మాట విన్న రాజు మదిని రగిలె
ఏమి కోర్కె ఇదని ఏడ్చుచడిగి
దశరధుండు కుాలె ధరణి పైన ॥
136.
ముక్కుపచ్చలారు ముద్దు సుతుని
అడవికంప లేను అడుగ నీవు
కనికరమ్ము తోడ కరుణ గొనుమ
అనుచు ధశరధుండు అడిగి సోలె ॥
137.
కరగ లేదు మనసు కఠిన గుణికి
దీను డతడు వేడ ధక్కరించె
మాట ఇచ్చితీవు మరల కనుచు
పట్టు బట్టి కైక పతిని రోసె ॥
138.
తండ్రి మాట వినెడు తనయు డతడు
తల్లి కోర్కె దీర్చ తరల వనికి
వల్క ధారి యుౌచు వదలె పురము
చెదర నీక నగవు చేసి నమము ॥
139.
రాము విడవ లేని రమణి సీత
వెంట నడచె నతని వెలుగు వలెను
రాము గుాడి నడచె లక్ష్మణుండు
రాము డున్న చోటె రక్ష యనుచు ॥
140.
కామ రుాపులైన కర్కసులను
హతమొనర్చె రాముడడవి లోన
దండకా అరణ్య దాపు నతడు
దానవులను దృంచె, దరిమి తరిమి ॥
141.
సుారు డతని గనెన సుార్ఫణఖయె
పెండ్లి యాడ గోరి ప్రేమ దెలిపె
కోసె ముక్కు చెవులు కోపి అతడు
రామ అనుజు డతడు రక్షకుండు
142.
లక్ష్మణుండు అతడు లక్ష ణుండు.
సీత గాచు నతడు చిన్న వాడు .
రావణాసు చెల్లి రక్కసామె
రగిలె బాధ తోడ రక్కసామె ॥
143.
అన్న రావణునకు అంత జెప్పె
చెల్లి మాట వినుచు చెలగె నతడు
అనుజు మారి చునకు ఆజ్ఞ జేసె
మాయ లేడి గాను మార నతడు ॥
144.
అన్న రావణు మాట నమలు జేసి
మారిచుండు వెడలె మాయ తోడ
మృగము జుాచి మురిసె ముదిత సీత
స్వర్ణ మృగము కోరె స్వయము సీత ॥
145.
సీర కోర్కె దీర్చ సిద్ధ మౌచు
రాము మృగము తరిమె రమణి కొరకు
మాయ తెలియు రేడు మాటు వేసి
మారిచునను జంపె మహిమ తోడ ॥
146.
జాప్య మగుట గాంచి జడిసె సీత
పంపె లక్ష్మణునదె పడతి వనికి.
దానవులది మాయ దడవ కనుచు
గీరి దాట కనుచు గీత గీసె ॥
147.
కృుద్ధ రావ ణుండు కృుారు డతడు
మానినపహరింప మాయ పన్నె
సాధు రుాప మెత్తి సమయ మిదని
రమణి దరికి పోయె రావణుండు.॥
148.
వేయు బిక్ష నాకు వేగర మన
సీత మాట మరచె, గీత దాటె.
కపట రుాప ధారి కరుణ వీడి
మాతనపహరించె మాయ తోడ ॥
149.
ఇంతి బాసి వగచె ఇనకులజుడు
అడవి దారి బట్టె అవనిజ గన.
వృద్ద గ్రద్ద జెప్పి వ్రాలె నంత
ప్రాణ ములను బాసె ప్రభువు చెంత ॥
150.
లంక పురము వెదుక లక్ష్యమునిడి
రేయి పవలు దిరిగె రేడు విసిగె .
నగవు లేలి నట్టి నాధు డలసె
చిక్కి శల్య మాయె చింత తోడ ॥
151.
వాలి గుాల్చె నతడు వనమునందు
వాని తమ్ము జేసె వనికి రాజు
రామ సుగ్రివులదె రాగ మలర
మిగుల ప్రీతి మెలగు మితృలైరి.॥
152.
సంత సమున విభుని సత్కరించె
వానరులకు రేడు వరలు భక్తి .
సిరుల నేలు ముఖము చిన్న బోవ
విషయ మేమ నడిగె విభుని రేడు ॥
153.
రాముడంత దలచి రమణి మాట
విషయ మంత జెప్పె వివర ముగను .
బాస లిడెను భక్తి భావ మలర
తరుణి వెదికు దేను ,తప్పకనుచు॥
154.
వరుస ప్రతిన బుానె వాన రుండు
కపుల పిలచి జెప్పె కబురు నతడు
రమణి వెదుక మనెను రాజ్య మంతా
రామ కార్య మిదనె , రాజసమున ॥
155.
కామ రుాపు లైన ఘనులు కపులు
వెదుక నాల్గు దెసలు వెడలి రంత.
పక్షి రాజు మున్ను పలుకు బాట.
కడకు సాగ రమును గనిరి కపులు॥
156..
సాగరమును దాట సాధ్య మౌన
నట్ట నడుమ గలదు నగర లంక
ఎగుర గలమ మనము, ఏమి దారి..?
చేత నౌన మనకు జేర లంక. ॥
157.
వగచు కపుల జుాచె వాయు సుతుడు
తనదు మాట జెప్పె తరుణ మిదని
పేరు హనుమ నాది పేర్మి వినుమ
కడలి దాటుదేను గన కమలిని ॥
158.
అనుచు పలుకు నాకు అనుమ తొసగె..
విభుడు రక్ష నాకు విడ పదములు .
రామ దాసు డేను రమణి నమ్ము
అనుచు పలికె హనుమ ఆదరమున ॥
159.
ప్రభువు నాజ్ఞతోఫ ప్రతిన బుాని
జేర వస్థి లంక జయము తోడ
మాట నిన్ను వెదుక మదిని దలచి
ఓర్మి శాఖ లందు ఒదిగి యుంటి.॥
160.
అనుచు పలుకు లాప, హనుమ జుాచి
విస్మయమ్ము తోడ వీరు జుాచె.
బాల భాస్కరునిగ భాసిలున్న
కపిని జుాచె సీత కడు ముదమున ॥
-------------------------------------------------
No comments:
Post a Comment