Sunday, April 18, 2021

రామ నామ మహిమ

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాన్. మహారాష్ట్ర 

వైకుంఠ వాసుడైన శ్రీ మహా విష్ణువు.
మానవావతారమెత్తిన శ్రీరాముడు.దుష్ట శిక్షణ  శిష్ట రక్షణ  జేయడానికి అవతరిస్తున్న యుగపురుషుడు.
శ్రీ "మహావిష్ణుని అష్టాక్షరీ" మంత్రంలో ఐదో అక్షరమైన   ‘రా’, "శివ పంచాక్షరీ"  మహామంత్రంలోని రెండో అక్షరం ‘మ’.కలిపితే  రామ శబ్దం నిర్మితమైంది.
మంత్ర  బీజాక్షర శక్తి కలిగిన" రామ "అన్న శబ్దానికి
 "ఓం" కారము కుాడా చేర్చ నవసరం లేదు .
గణేశ, శైవ, శక్తి, సూర్య వైష్ణవ మంత్రము-
లన్నింటికంటెనూ అధిక ఫలము "శ్రీ రామ నామ " 
జపము వలన కలుగు తుంది."ర" శబ్దము, అగ్ని బీజం   " ఆ" శబ్దము,వాయు బీజం "మ" శబ్దము,ఆకాశ బీజం -ఇటువంటి అగ్ని , వాయ,రాకాశ  బీజ సమ్మిళితమైన " శ్రీ రామ"  నామ మహిమ ఇంతా అంతా 
 అని చెప్పనలవి కాదు.ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ భాతృ, సదాచారం, నిగ్రహం, వంటి 
 సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ద హృదయుని ," రామ" అన్ననామాన్ని మన-
 మందరం జపించి కృతార్ధులమౌదాం.

No comments:

Post a Comment