Monday, April 19, 2021

గిడుగు రామ్ముార్తి పంతులు



శీర్షిక :
శ్రీ  గిడుగు రామ ముార్తి పంతులు 

పాఠ్యాంశ' , గ్రంధ,కావ్యాల భాష.
అక్షరాశ్యులకు కుాడా అర్ధమవని గ్రాంధిక  ప్రాస
నిరక్షరాశ్యులకు  కుాడా అర్ధమవ్వాలన్న ధ్యాస 
నిత్య వాడుక భాషగా మార్చాలన్న ఆత్మ ఘోష॥

పర్యవసానం పుస్తక వనంలో వీర విహారం
తుమ్మెద గ్రోలిన మధువు రీతి ,
నిత్య సాహిత్య రస పానం ,.
సాధించిన "వ్యవహారిక భాషా సుగంధ" ఫల సారం॥
 
తోటి సహాధ్యాయుల  సమిష్టి సహకారంతో ..
భాషోద్యమాకారుని క్రుషి , వేసిన సోపానం.
నేడు యావత్ భారత దేశం చేస్తున్న--
తెలుగు వెలుగుల" సరళభాషా"  వీర విహారం.॥
 
 అందరికీ అందుబాటులోకి వచ్చిన ఆనంద సౌరభం
 " తెలుగుభాషాదినోత్సవ" మనే సాహిత్య సంబరం.
 అతని జన్మదినదినాన -
 అద్భుతంగా జరిగే  ఆనందోత్సవం. ॥
 (29 ఆగష్ట్ నాడు." తెలుగు భాషా దినోత్సవం ).
 
 కైజర్ - ఇ- హింద్ అనే  గౌరవ స్వర్ణ సుాత్రం తో
 నిండిన  పురస్కార  సుమ-సౌరభాల తోరణం.
 డాక్టరేట్, కళాప్రపుార్ణ వంటి ఎన్నో బిరుదు-
 సుమాల  సమాహార  సమ్మేళనం.॥
 
 పట్టు వదలని విక్రమార్కుని  రీతి
పట్టుదల తో సాధించిన ఘన కీర్తి.
తెలుగుభాషా ఉద్యమొాద్యుతి స్ఫుార్తి
అతడే శ్రీ  గిడుగు  రామ్ముార్తి.॥
----------------------------------------

రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్
8097622021.


💐మీ కవితను గిడుగు వారి సంకలనం కోసం ఎంపిక చేశాం.  మీకు హైదరాబాద్ లో ఈనెల 22న ఆత్మీయ సత్కారం ఉంటుంది. మీరు తప్పక ఆవిష్కరణ సభకు హాజరు కావాలని విజ్ఞప్తి. మీకు గిడుగు ఫౌండేషన్, వెన్నెల అకాడమీ తరఫున హార్దిక అభినందనలు.💐💐అభినందనలతో..💐💐 గిడుగు లక్ష్మీకాంతి, వ్యవస్థాపక అధ్యక్షురాలు,  గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్, డాక్టర్ ఉద్దండం చంద్ర శేఖర్, చైర్మన్, వెన్నెల పబ్లికేషన్స్. 9441433833.

No comments:

Post a Comment