Tuesday, July 19, 2022

అంశం : వర్షం. ప్రక్రియ : మత్త కోకిల.

20/07/2022
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : వర్షం.
ప్రక్రియ : మత్తకోకిల .పద్యం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
మ.సా.క.సం. : 19.
కవిత సంఖ్య : 1.


ఆక సమ్మున మేఘు డొచ్చిన ఆశ పొందెడు వానిగా
సేక రించును విత్త నమ్ముల సేద్య మాతడు సేయగా 
ఆక లైనను దాహ మైనను ఆగ డాతడె రైతుగా..
రుాక లప్పులు జేసి పంటకు  రుాప మిచ్చును వాడెగా॥

అన్న దాతకు ఆర్తి దీర్చెడు దాకసమ్మున మేఘమే
చిన్ని వర్షపు జల్లు చుాడగ చిందు లేసెడు అందమే
అన్న దేశపు వెన్ను అంటిమి ఆతడే మన దైవమే
మన్ను లోపలి పంట బంగరు మాన్య మాతడి కష్టమే॥

మట్టి తల్లిని నమ్ము నాతడు మంచి పంటల నేలగా
గట్టి యత్నము జేసి పంటను గాచు కష్టము తోడుగా
పెట్టు దుడ్డుకు రాదు లాభము  వెట్టి చాకిరి దండగా
వట్టి చుక్కల వర్ష మేలగ వచ్చు దుఃఖము మెండుగా ॥

వాగు నిండెడు నీటి కోసము  వర్షమాతనె కోరుగా
బాగు కోరును అంద రీసుఖ  భాగ్య దాతయె రైతుగా
పోగు ధాన్యపు రాసి పొందగ పోరు సల్పెడు వాడుగా
సాగు దుక్కికి సార మీయగ సాయ మెవ్వరు లేరుగా ॥





No comments:

Post a Comment