Saturday, July 30, 2022

రుబాయిలు.

26/07/2022.౯
మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక :  నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు పెంచుకొని కలుపుకో  ॥

కుార్చొని తింటే కొండలు కరుగుతాయి
అతిగా తింటే కండలు పెరుగుతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యమనంటారు.
పద్ధతి పాటించు చింతలు తొలగుతాయి.॥

మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

ఎవరినీ ఎప్పుడుా తక్కువ చేసి చుాడకు 
పిల్లలను  గారాబమెక్కువ చేసి పాడుచేయకు
మన నడతే  పిల్లల రేపటి భవిత భాట 
ఇల్లే పాఠశాల అనేటి వాసి , మరువకు ॥
 
రాజకీయంలో  స్వార్ధాన్ని  విడవవోయి
ప్రజలలో ఉన్న భయాన్ని పారద్రోలవోయి.
 ఓటుకు నోటన్నది నేటి నిజమొాయి
నోరున్న వాడిదే రాజ్యమన్న నిజాన్ని తెలుసుకోవోయి .॥

మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక :  నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు  కలుపుకొని పెంచుకో ॥

కలలో నిన్నే తలచితిని కృష్ణా 
ఇలలో నిన్నే కొలచితిని కృష్ణా 
యశోదా నంద  గోపాల బాలా
నను బ్రోవగ నిను పిలచితి కృష్ణా  ॥

**************************


29/07/2022.
మహతీ సాహితీ కవి సంగమం.
ప్రక్రియ : రుబాయిలు
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

అక్షరమంటే   దేశ  భవితల సోపానం
అక్షరమంటే  దేశ  చరితల  విజ్ఞానం
అక్షరమంటే అచ్చులు హల్లుల సమాహారం
అక్షరమంటే కథా కవితల భావ సంగమం ॥

కవితంటే మనోభావాల మన్ననకు ఆకారం
కవితంటే కళల కల్పనకు సాకారం
కవితంటే సుఖ దుఃఖాల భావ గమనం 
కవితంటేభావ వ్యక్తీకరణకు సుాక్షరుాపం

జీవితం, అనుభవాలు నిండే పాఠశాల
వయసు అనుభవాలతో పండే యొాగశాల
బాల కౌమార యవ్వన వృద్ధాప్య  దశలకు
శరీరం పోషణనిచ్చే రస పానాలుండే పాకశాల ॥

ఇంద్రియాలు ఆలోచనావగాహనల సహకారాలు
అవయవాలు శరీరానికి సహకరించే సాధనాలు
శరీరాలు రక్త మాంస పురీష ముాత్ర నిలయాలు .
ఆత్మలు సత్ చిత్ ఆనంద భావాలకు ఆలయాలు ॥


మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు  కలుపుకొని పెంచుకో ॥

కలలో నిన్నే తలచితిని కృష్ణా 
ఇలలో నిన్నే కొలచితిని కృష్ణా 
యశోదా నంద  గోపాల బాలా
నను బ్రోవగ నిను పిలచితి కృష్ణా  ॥

********************************





No comments:

Post a Comment