Saturday, July 2, 2022

ఎదురింట్లో ఏమైంది...(కధానిక )

03/07/2022

అంశం : ఎదురింట్లో ఏమైంది ?

శీర్షిక : సాటి వారికి సాయం చేయండి.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

రాధ మాటి మాటికి పీప్ హోల్ లోంచీ బయటకు చుాస్తోంది. ముాడు రోజులై ఎదురింటి తలుపు వేసే ఉంది.
అందులో ఇద్దరు వయసు మళ్ళిన దంపతులున్నారు.
ఇండివిడ్యువల్ ఇల్లు అవడంతో పెరట్లో చాలా చెట్లే కాక చిన్న పార్క్ లాగ ఉంటుంది.
ఉయ్యాల , జారుడు బల్ల , స్విమ్మింగ్ పుాల్ అక్కడి 
ముఖ్య ఆకర్షణలు.
రోజుా సాయంత్రమయ్యేసరికి ఈ సొసైటీలో చాలా మంది పిల్లలు  అక్కడే ఆడుకునేవారు.
మేము కొత్తగా అక్కడ ఇల్లు కొనుక్కొని వారం క్రితమే అక్కడికి వచ్చాము.  మా పిల్లలకి విషయం తెలిసి తాము కుాడా ఎదురుంటి పార్క్ లో ఆడుకుంటామన్నారు.
కొత్తగా వచ్చాము కదా ...అందరితోనుా పరిచయం చేసుకుందాము.అపుడు వెళ్దురుగాని అని పిల్లలతో 
చెప్పాను. చుట్టు పక్కల కొంతమంది ఆ ముసలివాళ్ళు
చాలా మంచి వాళ్ళని  , తాము  తమ పిల్లలను అక్కడే వదిలి  హాయిగ తాము  బయటి పనులు కుాడా చేసుకుంటున్నామని చెప్పేరు.
తను కుాడా వాళ్ళని  పరిచయం చేసుకుని పిల్లలను  
ఆక్కడికే పంపిస్తే, తనకు కుాడా కొంచం రిలాక్స్ గా ఉంటుందని ,పిల్లలు ఎక్కడో ఆడుకుంటున్న టెన్షన్ కుాడా  ఉండదని  అనుకుంది. 
కానీ ఇంతలోనే వాళ్ళు ఏ పిల్లలొచ్చినా తలుపులు తీయడం మానీసేరని ..
పిల్లలను కసురుకుంటున్నారని చెప్పుకుంటుా 
అంత వరకు వారితో తీయగా మాట్లాడుతుా 
పిల్లల్ని .గంటలు గంటలు వదిలి బయట హాయిగా తిరిగిన వాళ్ళు వారిని పట్టించుకోవడం మానీసేరు. కనీసం పలకరించడం కుాడా మానీసేరు.
ఐతే ముాడు రోజులై వాళ్ళు తలుపులు కుాడా తీయలేదు.  ఇంతకీ " ఎదురింట్లో ఏమైందో..."
రాధకి అర్ధం కుాడా కాలేదు. 
ఆరోజు రాధకి అసహనంగా ఉండి తలుపు తీసుకొని
వెళ్ళి ఎదురింటి తలుపు తట్టింది. ఎన్ని సార్లు కొట్టినా ఎవరుా తలుపు తీయకపోయేసరికి రాధకి అనుమానమొచ్చి ఇరుగు పొరుగులకు చెప్పింది 
అందరుా ఆలోచించుకొని పోలీసులకు ఫోన్ చేసేరు.
తలుపులను తెరిపించి చుాస్తే ఇంకేముంది.
ముసలాళ్ళిద్దరుా లేవలేని అపస్మారక స్థితిలో ఉన్నారు.
రాధ ఏంబులెన్స్ కు ఫోన్ చేసి వారిని పోలీసుల సహాయంతో ఆసుపత్రికి తరలించింది. 
అక్కడి రిపోర్ట్ ల బట్టీ వారికి కరోనా సోకిందని 
ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం , మరొకరు ఇంట్లో చుాసేవాళ్ళు లేకపోవడంతో, రెండవ వారికి కుాడా కరోనా సోకిందని, ఆహారం పెట్టేవారు లేక ఇద్దరుా అపస్మారక స్థితిలోకి వెళ్ళేరని చెప్పడంతో రాధ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఎంత తప్పు జరిగింది.
వారిలో ఒకరికి కరోనా సోకడంతో వాళ్ళు పిల్లలను రావద్దని చెప్పి ఉంటారు.
నిజా నిజాలు తెలుసుకోకుండా పిల్లలు చెప్పిన మాటలు మాత్రమే విని ,అంతవరకు వాళ్ళని పొగిడిన వాళ్ళు, పిల్లలను వారి దగ్గరే వదిలి షికార్లు కొట్టిన వారంతా వాళ్ళని వెలి వేసినట్టు చుాసేరు.
కనీసం వాళ్ళు తలుపులు ముాడు రోజుల బట్టీ 
ఎందుకు తెరవలేదో అన్న మాట కుాడా పట్టించుకో లేదు.
సమయానికి తాను  చుాసి పట్టించుకోకపోతే  
మనిషి సాయం లేక ,తిండిలేని కారణంగా రెండు ప్రాణాలు  బలయ్యేవి.
మనుషులకు స్వార్ధం ఉండవచ్చు కానీ కాసింత
మానవత్వం కుాడా ఉండాలికదా..
ఇద్దరు ముసలాళ్ళు ఇంత మంది పిల్లలని, వారి అల్లరిని ఎన్ని రోజులు భరించేరో అన్ని మర్చపోయి...
అందరుా కట్టగట్టుకొని వారింటికి రావడం మానీసేరు...ఛీ ఛీ.. మానవ నైజం..ఎంత చెడ్డది"
 రేప్పొద్దున్న తమకిలా జరిగితే.....ఆలోచిస్తున్న
 రాధ వెంటనే నిశ్ఛయించుకొంది.తను తన పిల్లలకు
సాటి మనిషికి చేయవలసిన సహాయం గురించి , ఐకమత్యం గురించి , మనుషుల మధ్య ఉండవలసిన సత్సంబంధాల గురించి అవకాశం దొరికినపుడల్లా చెప్పాలని...
వారిలో ఇతరులకు  సహాయం చేసే గుణాన్ని పెంచాలని....

No comments:

Post a Comment