06/12/2022..
అంశం - రుబాయీలు .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
ఎవరికైనా అవకాశమది ఒక్కసారే వస్తుందిగా.
అదృష్టమది ఉన్నదంటే నిన్నుకోరే వస్తుందిగా
మంచినడతది భావితరాల జీవితాలకు మార్గదర్శది
వ్యక్తిత్వాన్ని చంపుకుంటే కంటనీరే వస్తుందిగా ॥
ఎన్నికలలో గెలవడానికి ప్రమాణాలిడి మరపిస్తారు
గెలిచివచ్చీ దేశసంపద విదేశాలకు తరలిస్తారు
నాటి నుండీ నేటివరకు బానిసలుగా మనబతుకులు
రాజకీయపు రణనీతితో తమ మాటలను మరలిస్తారు
నేటి చదువులు ప్రజలమదిలో అజ్ఞానాన్ని పెంచుచున్నవి
అలోచనలు పెడత్రోవలో సుజ్ఞానాన్ని వంచుచున్నవి.
స్వార్ధం పెరిగి బంధాలనే మరచిపోయే ముార్ఖుడుమనిషి.
కలికాలమిది బుద్ధిహీనత విజ్ఞానాన్ని తుంచుచున్నవి॥
వెన్నెముక రైతన్న మనసదే బాధగా
బీడైన మట్టిలో తడన్నదె లేదుగా
వానకై నిరీక్షణ , నిరాశదె జీవితం
మట్టిమనిషి మనసులో ఆశన్నది పోదుగా
No comments:
Post a Comment