[24/07, 6:16 pm]
JAGADISWARI SREERAMAMURTH: 24/07/2023.
మహతీ -సాహితీ కవి సంగమం.
అంశం : చిత్రకవిత -50 ,అధికారం.
శీర్షిక : ఏకమైన స్త్రీ శక్తి .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.
నశించిన మానవత్వంతో అవినీతి, అక్రమం ,
అన్యాయం , నిండిన స్వార్థ రాజకీయాలతో
కళ్ళు మూసుకుపోతున్న అధికార బలాలను
అదుపులోకి తీసుకుంటూ, పశుత్వం నిండిన
అహంకారానికి కళ్లాలు వేస్తూ, ఆవేశంతో గర్జిస్తూ
అడుగు ముందుకు వేసిందో స్త్రీ ...
తాను అబలను కాదు సబలనంటూ....!!
వావి వరుసలెంచక, కళ్ళు మూసుకున్న
కామంతో, జన్మస్థానాన్ని జలగల్లా పీకుతూ.
తామేమిటో తెలియని స్థితిలో, కడుపు నింపి,
ఆకలికి తీర్చిన స్థన్యాన్ని ,అవహేళన చేస్తూ,
అంగాగ శోషణ తో. చిత్రహింసలు పెడుస్తూ ,
అతివలను, అంగట్లో నగ్నంగా తిప్పుతూ,
అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్న
నికృష్ట నీచ మృగాలకు, తన శక్తేంటో తెలియజేస్తూ
ధర్మ రథంపై , ధైర్యంగా నిలబడి,
క్రౌర్యానికి, కళ్ళేలు వేస్తున్న ...స్త్రీ శక్తి,
తాను ,అబల కాదు, సబలనంటూ
అడుగు ముందుకేసింది.!!
ఎప్పటికీ ఒరగని ,మువ్వన్నెల జెండా,
తల్లి భారతికి , తలమానికమై,
సత్య, శాంతి,ధర్మ మార్గాలను సూచిస్తోంది..
తల్లి భారతి తరగని వేదనతో,
పాపులైన బిడ్డలను పరిమార్చేందుకు,
కరవాలం చేతపట్టి , ఖలుల అంతానికై
కదను తొక్కింది.
తల్లి భారతి అండతో, స్త్రీ శక్తి విజృంభించింది.
ఒంటరి పోరాటానికి, ఓట్లు, కోట్లయయ్యాయి.
వేల అడుగులు ఒక టై, చేయి చేయి కలిపాయి
అబలల. ఆవేశాలు అగ్నిశిఖలై రాజుకున్నాయి.
స్త్రీ శక్తి. ఒకటై ,పురుషాహంకారానికి ,
సవాలుగా నిలిచింది..
తాము, ,అబలలము కాదు,, సభలల మంటూ ,
స్త్రీ శక్తి. అడుగు ముందుకేసింది.!!
[24/07, 7:07 pm]
+91 96406 22018: *26*
*శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి* గారూ
*ఏకమైన స్త్రీ శక్తి* శీర్షికతో మీరు వ్రాసిన కవిత బాగుంది. మానవత్వం నశించిపోయి, వావి, వరుసలెంచక మహిళలను వేధించే మగాళ్ళను ఎదుర్కొని,
సబలలుగా నిలవమని, స్త్రీ శక్తి పెంచడానికి
" భరత మాత ముందడుగేసింది " అన్న భావం బాగుందండీ.
ధన్యవాదములు, అభినందనలు.🙏🙏🙏🌸🌸🌸👏🏻👏🏻👏🏻
No comments:
Post a Comment