25/09/2023.
శ్రీ శ్రీ కళావేదిక కవితా పోటీల కొరకు,
అంశం : అమ్మ , నాన్న , ఓ వృద్ధాశ్రమం..
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ మహారాష్ట్ర
నాటి నుండి, నేటి వరకు,
అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలంటుా
మాటల్లో అందలానికెక్కిస్తూ,
చేతలతో చిత్తు చేస్తునే ఉన్నారు .!!
అవనిలో ఆడది, అమ్మగా మరో బ్రహ్మై ,
తొమ్మిది నెలల భారాన్ని మోస్తూ.
సృష్టికి-ప్రతి సృష్టి చేసేందుకు
తన రక్తం మాంసాలను పంచుతూనే ఉంది.!!
ఆ సృష్టికి కారకుడైన తండ్రి,
తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం కోసం ,
బాధ్యతల బరువును మోస్తూ, జీవితాంతం,
తన కుటుంబం కోసం ,తన. జీవితాన్ని
పణంగా పెడుతుానే ఉన్నాడు.!!
పాశ్చాత్య సంస్కృతి మొాజుతో ,
మన సంస్కృతి , సాంప్రదాయాలు
ఏనాడో మట్టి కలిసిపోయాయి.
నేను, నా , అనే స్వార్ధం ,
వావి వరుసలకు "చెక్" పెట్టింది .!!
ఆడ దాని అస్తిత్వం ,
అంగట్లో ఆట బొమ్మై పోయింది.
అలసిపోయిన అమ్మ తనం ,
అడ్డుగోడై నిలిచింది.
జవసత్వాలుడిగిన నాన్న ఉనికి ,
జారిపోతున్న విలువల,
విచ్చలవిడి తనానికి , ప్రతిబంధకమైంది.!!
అంతే మట్టిలో కలసిన మానవత్వం ,
మరోదారిని కనుక్కొంది.
తీరిన అవసరాల చివరి క్షణాలకై ,
జన్మదాతలకు ,ఊరవతల జీవ సమాధులు కట్టి,
ఆధునుకతను తలపించే .అందమైన పేరు పెట్టింది.!!
అవే నేటి బ్రతుకు బడుగు జీవితాలకు ఆశ్రమాలు.
అంతరించిపోతున్న ఆప్యాతలకు నిలువుటద్దాలు.
అడుగు కొకటిగా అలరారుతున్న" వృద్ధాశ్రమాలు ".!!
----------------------------------------
No comments:
Post a Comment