Wednesday, September 27, 2023

అంశం : మహిళా రిజర్వేషన్ బిల్లు

అంశం : మహిళా రిజర్వేషన్ బిల్లు

శీర్షిక :  ఎండమావులు.  

(వ్యాసం).

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

-------------------



పార్లమెంటులో అనేక అవరోధాల తర్వాత, భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్లు కల్పిస్తూ, మార్చి 9, 2010న రాజ్యసభలో ఆమోదించబడింది

గత 27 సంవత్సరాలుగా,"మహిళా రిజర్వేషన్ బిల్లు" పెండింగ్‌లో నే ఉండిపోయింది. .

ఎన్నికలు వస్తున్నాయి . నాయకులు  మారుతున్నారు. రాజ్యాంగాలు మారాయి. చట్టాలు మారాయి కానీ ," మహిళా రిజర్వేషన్స్ బిల్లులు " మాత్రం ,పాస్ కావడం లేదు.

పంచాయతీ స్థాయిలో 33 శాతం రిజర్వేషన్ల చట్టం ఉంది. అయినా కూడా పార్లమెంటు, శాసనసభల్లో అదే రిజర్వేషన్‌పై ఏకాభిప్రాయం ఏర్పడేందుకు మూడు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది.

మహిళలకు రాజకీయ అవగాహన లేదని, ఇన్నిరోజులు రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చారు.

భారతదేశంలో" మహిళా రిజర్వేషన్ బిల్లు,"

పార్లమెంటులో అనేక అవరోధాల తర్వాత, మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్లు కల్పిస్తూ, మార్చి 9, 2010న రాజ్యసభలో ఆమోదించబడినా,

 2014లో లోక్‌ సభలో ఆమోదించబడలేదు , సరికదా, ,అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ కూడా దీనిని ముందుకు తీసుకెళ్లలేదు. 

 పురుషాధిక్యత  గల రాజకీయాల్లో, రిజర్వేషన్ ద్వారా మహిళలు రాజకీయాల్లోకి రావడాన్ని గట్టిగా సమర్థించలేకపోయారు పురుష నాయకులు.

1992లోనే ,పంచాయతీల్లో ,సర్పంచ్‌లుగా ఎన్నికైన మహిళల పేర్లు, కాగితాలపైనే నిలిచిపోయాయి. ఆ పదవిలో భర్తలు 

"సర్పంచ్-భర్త'" అనే ముద్దుపేరు తో ,పెత్తనం చేస్తూ వస్తున్నారు. 

----------------

ఎట్టకేలకు. మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలలో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన "మహిళా రిజర్వేషన్ బిల్లును "మోదీ ప్రభుత్వం ,పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

కానీ..రిజర్వేషన్‌లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉప-రిజర్వేషన్లు కల్పించే నిబంధన ఉన్నా ,.  వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించలేదు సరికదా , 

ప్రతీ లోక్‌సభ ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ స్థానాలను మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు.అంతేకాదు...

రాష్ట్రం ,లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని, వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా, రిజర్వ్‌డ్ సీట్లను కేటాయించవచ్చని సూచించారు. ఈ సవరణ  ప్రకారం,

చట్టం అమలులోకి వచ్చిన 15 ఏళ్ల తర్వాత గానీ, మహిళలకు సీట్ల రిజర్వేషన్ అమలు చేయబడదు.బిల్ ",అయితే ఇప్పుడు" పాస్ "అయిపోతుంది.

దాని కానీ దాని "ఎఫెక్ట్ "మాత్రం,

L2027 లో "జనగణన " జరిగిన తర్వాత ,2028  లో జరిగే  తెలంగాణ రాష్ట్ర,  శశాశనసభా ఎన్నికలతో పాటు, 2029,  లో జరిగే లోక్ సభ ఎన్నికల తరువాతే ,మహిళా బిల్లును అమలు చేసే అవకాశం ఉండవచ్చని చెపుతున్నారు గానీ అదీ ఇంకా తేలలేదు.

కారణం...ముందుగా,జనాభా లెక్కల సేకరణ జరగాలి.2026 లో నియోజక వర్గాల పునర్విభజన కూడా జరగాలి

."రీ లిమిటేషన్" జరిగిన తర్వాత కూడా ఎన్నోసార్లు

 ఈ" బిల్లును" అమలు చేసే ప్రయత్నంలో,

ఆ పార్లమెంటు కు చెందిన బలహీన వర్గ నాయకులు 

దీనిని అడ్డుకున్న కారణంగా, ఆగి పోయేది.

ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టాలని

అనుకున్నపుడు ,ములాయం సింగ్ , లాలూ ప్రసాద్ యాదవ్ 

వంటి వారు  దీనిని అడ్డుకున్నారు.

Bc లకు అస్సలు రిజర్వేషన్లే లేకపోవడం  ఒక కారణమైతే...

33%  మహిళలకు ఇచ్ఛిన రిజర్వేషన్ల కోటాలో,

"ఒక Oc  మహిళతో Bc ,Sc మహిళలు ఆ గెలుపులో  పోటీ పడగలరా..? అనే విషయంలో వచ్ఛిన మీమాంశ ఒక కారణం..

అసలు చట్టపరంగా కూడా, Bc లకు రిజర్వేషన్స్ లేని కారణంగా,  అన్ని పార్టీలు సమర్థిస్తున్నా కూడా, ,ఈ విషయంలో జరిగే ఉద్వమాల బాట లో , ఈ బిల్లు ,వెనుకబడి పోవడం మరో కారణం .

"మహిళలు" అన్నపుడు , దేశ జనాభాలో ఉన్న ప్రతీ మహిళకు

ఈ రిజర్వేషన్ బిల్లు వర్తించాలి . కానీ ఈ బిల్లులో Bc ల

ప్రసక్తే లేదు.

ప్రస్తుతం రాబోయే ,పదకొండు రాష్ట్రాల ఎన్నికలు ,తరువాత రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ముగిసేవరకూ కూడా ఈ మహిళా బిల్లు అమలులోకి వచ్చే ప్రసక్తే లేదు అన్నది కేంద్ర నిర్ణయం.

అసలు కారణమేమిటో అర్థం కాని పరిస్థితి.

అసలు నాటి నుండి, నేటి వరకు కూడా, మహిళల విషయంలో

ఏ విధమైన మార్పు గాని, మంచి తీర్మానం గాని, జరగలేదు.

ఇకపై ," జరుగుతుంది" అన్న ఆశ కూడా లేదు.

 ఈ విషయంలో మహిళలే,

 ఒక అడుగు ముందుకేయ్యాలేమో..


-----------------------------------


No comments:

Post a Comment