Tuesday, November 14, 2023

శీర్షిక : కుదిరితే చిన్న చిరునవ్వు.....

[03/11, 11:09 pm] JAGADISWARI SREERAMAMURTH
: శీర్షిక : కుదిరితే చిన్న చిరునవ్వు.....

తెల్లవారి లేవగానే...
నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్న చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చుట్టుా,  ఉన్న నీ వారి ఆనందం ,
నీ వెప్పటికీ మరువలేని అనురాగ బంధమౌతుంది.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
బయటి ప్రపంచంలో నువ్వడుగిడే ప్రతీచోటా,
నీ చెలిమికై చేయిజాచే వారు, నీ బాటలో ఎదురౌతారు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ కష్టాలను , తన ఇష్టాలుగా . భరించే సహచరి , 
నీ భారాన్ని ,బాధల్ని ,పంచుకునేందుకు నీ వెన్నంటే ఉంటుంది..

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
వ్రుద్ధాప్యంలో, నీ ప్రేమను పొందిన వారు , నీకు తిరిగి పంచి ఇచ్చేందుకు, నీ పిల్లలు, నీకు తోడై నిలుస్తారు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
జీవితంలో అన్నీ సాధించగలిగే అత్మ శక్తి 
నీలో నిరంతర సంజీవినై ,నిన్ను ముందుకు నడిపిస్తుంది.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
లోకంలో డబ్బుతో కొనలేని ఆత్మ సంత్రుప్తి..
నీకు ఆలంబనై , ఆనందలోకాల్లో విహరింపజేస్తుంది

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
అందం, ఆస్థి , అంతస్థులనే  డాంబికాలనొడ్డే
సత్సంబంధాల సౌరభం ,నీ చుట్టుా పరిమళిస్తుా ఉంటుంది.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
ఎన్నో బంధాలు, అనుబంధాలు , ఆప్యాయత-
అనురాగాల ఆస్థికి వారసుడవౌతావు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చివరి క్షణాల్లో నీకై కన్నీరు కార్చే ఎంతోమంది
నీ స్నేహపుారితమైన చిరునవ్వు, ఎప్పటికీ తమతో
ఉండాలనే కోరికతో నీకై తపిస్తారు.

నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై, చిన్ని చిరునవ్వు చిందించు
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
నీ చివరి స్వాశలో , మమకారంతో నీకై తపించేవారి కన్నీటి అలలు,  వైతణీని దాటించే  వారధిగా మారి
నీ ఆత్మను , శాంతి లోకాలకు సాగనంపుతాయి.

తెల్లవారి లేవగానే...
నీకు ఇష్టం   ఉన్నా లేకపోయినా, నీ-
పెదవులపై , చిన్ని చిరునవ్వు చిందించు.
తేనె వంటి తీయని పలకరింపు వినిపించు.
జీవితాన్ని జయించే రీతిలో ,నీ
పయనాన్ని కొనసాగించి , మనిషిగా పుట్టినా
మనీషిగా ఎదిగి, అందరిమదిలో స్థిరంగా నిలిచిపో....॥
-----------------------------

రచన శ్రీమతి ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
-----------------------------
[03/11, 11:20 pm] +91 93235 64359: 👏👏👏👏
శభాష్!  జీవిత సత్యాలని చాలా అందమైన విధంగా, అందమైన పదాలలో చెప్పారు. మీనుంచి ఇటువంటి కవిత్వాన్నే అభిలషిస్తూ ఉండేవాణ్ణి. 👍
[03/11, 11:24 pm] +91 84838 78838:
 నిజమే వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ 🙏🏿🙏🏿🙏🏿

[04/11, 8:32 am] +91 96193 06414: చిర్నవ్వు విలువను కవితా రూపం లో చాలా బాగా చెప్పారు...👌
ఆదర్శప్రాయమైన కవిత.. 👌👍🫡🙏🙏
[04/11, 9:00 am] +91 93224 00551: 
చాలా బాగుంది మేడం
👌👌👌💐💐💐
[04/11, 9:04 am] Sangiveni raveendra:
 మంచి సబ్జెక్ట్.  మీ కవిత్వంలో మంచి flow ఉంటుంది..
కాస్త ఎడిట్ చేసుకుంటే కత్తి మొనలా ఉండేది.. 
Congrats💐💐


No comments:

Post a Comment