అంశం: ఐచ్ఛికం
కవితాసంఖ్య: 03
తేది: 30-10-2024, బుధవారం.
శీర్షిక: బాల లీలలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .(43)
ప్రక్రియ: వృషభగతి రగడ.
బాల కృష్ణుని /వలచి భావపు/ భక్తి తోడను /గొల్చి చూడుము
వేల నాముని/ మదిని దలచుచు/ వేడ్క వానిని / నమ్మి వేడుము !!
పాల వెన్నను / పంచ గ్వాలల/ పరుగు పరుగున/వచ్చు వేగము
బాల కృష్ణుడ /తండె శ్రీహరి /భాగ్య మిదిమన /జన్మ ధన్యము!!
------------------------------
అంశం: ఐచ్ఛికం
కవితాసంఖ్య: 03
తేది: 30-10-2024, బుధవారం.
శీర్షిక: బాల లీలలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .(43)
ప్రక్రియ: వృషభగతి రగడ.
---------------------
నంద-యశోద / లకిదె పరమా/ నంద మయమై /నట్టి వరముగ
బంధ మదియే/ మధుర తరమౌ/ భావ నలనిడె/ బాలు గనగా!!
చంద మామను/ బోలు కోమల/ చారు శీలుని / కొంటె చేతలు!!
విందు లాయెను/ఆట పాటలు/వినగ విందులు /మురళి పాటలు.!!
చిన్ని కృష్ణుని/ బాల లీలలు/చిలిపి చేతల/చిందు నవ్వులు
ఎన్ని జూచిన/ ఎంత వినినా/ఎరుగలేముగ / కృష్ణ లీలలు !!
అన్ని మానుల /చాటు దాగుచు/ అల్లరెంతో /చేయు వేళలు
కొన్ని కావుగ / వెన్న దొంగడు/కోరి చేసెడు/ చిలిపి చేష్టలు !!
పాల వెన్నలు /దొంగలాడెడు /బాలకృష్ణుడు/ బంధు డాయెను!!
ఏల పుడమిని/రామవిభుడై/ఎంచి దశరథ/పుత్రుడాయెను!!
వేల జనులకు/అభయ మొసగుచు/వేంకటేశుగ/వెరపు దీర్చెను!
వేలనామము /లున్న వానిని/వెన్ను డాతని /చేరి కొలువుము!!
-----------------------------------------------
పాల వెన్నలు /దొంగలాడెడు /బాలకృష్ణుడు/ బంధు డాయెను!!
ఏల పుడమిని/రామవిభుడై/ఎంచి దశరథ/పుత్రుడాయెను!!
వేల జనులకు/అభయ మొసగుచు/వేంకటేశుగ/వెరపు దీర్చెను!
వేలనామము /లున్న వానిని/వెన్ను డాతని /చేరి కొలువుము!!
1️⃣5️⃣✅ శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు బహుకాల దర్శనం దసరా నవరాత్రులలో మీ అద్భుతమైన గానామృతాన్ని రుచి చూపించారు నేటి అంశానికి జన్మ ధన్యము శీర్షికతో మీరు రాసిన వృషభరతి రగడ చాలా బాగుంది సహజంగా గాయని అయిన మీరు మాత్రలను నడకను ఇట్టే పట్టుకున్నారు. రాబోయే బుధవారాలు కూడా తప్పక రాయండి ధన్యవాదములు మరియు అభినందనలు👏👏👏💐💐💐🙏🙏🙏
ఇష్టపది
మహతీ సాహితీ కవిసంగమం
అంశం: నీతి.
ప్రక్రియ : ఇష్టపది
కవితాసంఖ్య: 04
తేది: 17-10-2024, బుధవారం.
శీర్షిక: నీతి నియమాలు ఎక్కడ?
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .(43)
నేటి న్యాయ వ్యవస్థ నెంచ కుటిల మాయెను
మేటి ఘోర ఖలుల నేడు చేయి కలిపెను !!
తోటి మనిషి బాధను తోసి తీర్పు నిచ్చెను
కాటి, జైలు వాసము కలుగజేసి చంపెను !!
ధర్మ న్యాయ నిరతిని దాటి ధైత్యు డాయెను
కర్మ భోగ మనుచును కరకు గాను మారెను.
నిర్మల మౌ బతుకుల నిలువు కోత కోసెను .
మర్మ మెరుగని వారి , మట్టి లోన కలిపెను !!
నేటి దేశ పాలన కోటి జనుల రోదన.
తోటి వారి హింసకు తోవ గనుటే యోచన
పాలకుల కుశాసన పలుక చిత్ర వేదన.
వేల యువత బాధలు వెరపు నిండు శోషణ.!!
తీర్చువాడే లేడు తిరుగుబాటుల గోడు.
కూర్చు శిక్షలు వేలు , కుటిల బుద్ధులు చూడు.
నేర్పు చూపిన వాడు నేల బతుకడు వాడు
మార్చు ఓట్లను వారు మనిషికి రూక తోడు.
లేపి దొమ్ములు నడుమ ,దొంగ ఓటుల గెలుపు
దోపిడీలే బ్రతుకు, దోచుకొనుటే బలుపు
పాపి యగుచూ కులుకు పాలకులదే గెలుపు.
జూపి మత్తుల సరుకు జూద మాడిన పిలుపు !!
రూకలాడిన యాట రూపు మారిన మాట
శోకమొందిన చోట , రూక నిండిన వేట
చౌకబారుల తీరు చావు బతుకుల పోరు
చాకలాడే మిన్న చదువులోడిన జోరు.
---------------------------------
నేడు ఎన్నికలన్న . నేరాలకు నిలయము
లేడు అడుగు ధీరుడు లెక్క జెప్పు వీరుడు
గోడు,గొడవల తీరు గోస జనులదాయెను
జోడు దుష్ట గణముల జోరు గెలుపులాయెను !!
లేదు న్యాయ మదేల లేపు చావుల గోల
కూల్చివేతల లీల కుల,మతాలదె హేల
మనిషి బ్రతుకుట కన్న మత్తు దారది మిన్న
యువత బ్రతుకే సున్న యూధముల బతుకన్న
No comments:
Post a Comment