శీర్షిక : కృషీవలుడు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
కోడి కుాయక ముందే లేస్తాడు
పలుగు పారతో పయనమౌతాడు.
చద్దిముాటతో పుాట గడుపుతాడు
మట్టి మడులతో మాటలాడుతాడు ॥
ఎడ్ల బండే వాడి ఎత్తైన వాహనం
దుక్కి దున్నడం వాడి బ్రతుకు కష్టం
నారు తడపడానికై పడతాడు ఆరాటం
నీటి కొరతతో ఆవిరౌతుంది వాడి ఆనందం ॥
గొప్పులెన్నో తవ్వుతాడు కొండంత ఆశతో
కాల్వలన్నీ నింపుతాడు చిందు ఒంటి చమటతో
ఎండు తున్న బావిలో నీటి చుక్క తోడుతుా
పొలమంతా తడుపుతాడు పొద్దంతా అలుపుతో ॥
పంట ప్రాణమంటాడు, గుంతలెన్నొ తీస్తాడు
లద్దెపురుగు,పంటమేస్తె లబోదిబోమంటాడు
పురుగుమందులేస్తాడు, పిచికారీ కొడతాడు
పంట తెగులు రాకుండా పడిగాపులు పడతాడు॥
కుాడుండదు, గుాడుండదు, కంటిమీద కునుకుండదు.
కష్టానికి ఫలముండదు, కన్నీరు లేని ఇల్లుండదు.
నీటి బొట్టు కురిపించని నల్ల కారు మేఘాలు
రైతన్నలకమలుకావు సంక్షేమపు పథకాలు.॥
అష్ట కష్టాలె సుమ్మ ,పంటనమ్మ ఫలముసున్న
దేశానికి వెన్నన్న రైతప్పుల పాలు సుమ్మ
అందరికీ అన్నమెట్టు అన్నదాత అతడన్న
ఆత్మహత్యల వేటే అతని బ్రతుకు బాటన్న ॥
రెక్కల కష్టము నిండెడు కృషీవలుడు అతడమ్మ
మట్టి తల్లినే నమ్మిన మట్టి మనిషి రైతమ్మ
అందరి ఆకలి తీర్చెడు అలుపెరుగని దైవమమ్మ
తీర్చుకొనగ ఋణమతనిది తీరుగ చేయుాతనిమ్మ ॥
No comments:
Post a Comment