04/08/2022.
గోరసం -వారి పోటీ..
అంశం : వరలక్షీ వ్రతం.
శీర్షిక : శ్రావణ లక్ష్మి .
ప్రక్రియ : మత్తకోకిల
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
శ్రావ ణమ్మదె మంచి మాసము శాస్త్ర పుాజలు సేయగా
శ్రావణా సిరి లక్ష్మి పుాజలు సేయ రేసఖి మెండుగా
భావ మందున భాగ్య లక్ష్మిని భక్తి తోడను కొల్వగా
బ్రోవ వచ్చును భాగ్య లక్ష్మియె భోగ భాగ్యము లీయగా ॥॥
స్త్రీలు చేసెడి పుణ్య పుాజలు మేలు మంగళ మిచ్చుగా
యేలు తల్లిని కొల్చు వారికి శ్రీలు నిండెడు పండగా
పోలి పుార్ణపు బుారె గారెలు పొంగు పాయస ముండగా
జేలు పల్కుచు జేజి కీయరె వేడి వేద్యము విందుగా ॥
కుంకు మార్చన చేసి వత్తులు కుార్చి దీపము నెట్టరే
అంకు రార్పణ జేసి అమ్మకు ఆది పుాజలు సేయరే
వంక జాబిలి పుార్ణ బింబము వచ్చు వేళను చుాడరే
శంఖ నాదము తోడ నమ్మకు స్వాగతమ్ములు పల్కరే ॥
రంగు లీనుసు గంధ పుాలను రాసి పోగుగ వేయరే.
రంగు రంగుల రంగ వల్లులు రక్ష కోరుచు వేయర
అంగ నాలదె గుాడి అమ్మతొ ఆట పాటల నాడరే
హంగు మీరగ లచ్చి మమ్మకు ఆగ్ర హారతు లెత్తరే .
పాల వెల్లిని కట్టి బాగుగ పాట లాటల తేలరే
శీల సద్గుణ రాణి లక్ష్మికి శీత లమ్ములు నీయరే
మేలు కొల్పులు పాడి కొల్వగ మెచ్చు రాణిని కొల్వరే
లీల లెన్నియొ జుాపు రాణిని వేల కీర్తుల వేడరే ॥
హామీ :
పై మత్తకోకిల పద్యాలు నా స్వీయ రచనలు.
No comments:
Post a Comment