Wednesday, January 25, 2023

దేశభక్తి

తేది:25-1-2023
అంశం: దేశభక్తి .
శీర్షిక : గట్టి మేల్ తలపెట్టవోయ్.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .

పుట్టి నట్టి ఊరు పుణ్య భుామదె గాద
మట్టి తల్లి మనకు మరపు రాదు.
జుట్టి నెన్ని యుార్లు జుాడ పుట్టిన ఊరు.
మనసు పరవశించు మాయ గాదె॥

భరత దేశ మందు భవితలే  వెలుగొందు
నిరత దేశ భక్తి నిలుపు మదిని
కొరత యుండ దెపుడు కోరుకొన్నను శాంతి
మరపు రాని కీర్తి  మహిని విలువ ॥

దేశ రక్ష కొరకు దేహ త్యాగము జేయు
దేశ భక్తులున్న  దేశ మిదెగ।
వేష భుాష లేలు వేల భాషలు చుాడు
ఆశ పాశ గతుల నలరు జనులు ॥

మట్టి కాదు మంది మనుజులున్నది భుామి
వట్టి మాట లింక వలదు వలదు .
దేశ భక్తి నిలిపి దేశ సేవను జేయ
గట్టి తలపు లేల, ఘనము మనుజ ॥

No comments:

Post a Comment