Monday, January 23, 2023

నేతాజీ శుభాష్ చంద్ర బోస్

నవభారత నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి కవితల పోటీ కోసం....

23/01/2023.

అంశం: దేశభక్తి-జాగృతి
శీర్షిక: భరతీయుల స్ఫుార్తి దాత.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర.


నేతాజీ సుభాష్ చంద్రబోస్ ...
భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 

సాయుధ పోరాటం తో  
ఆంగ్లేయులను తరిమి కొట్టవచ్చునన్న ఆరాటం
 నమ్మి, ఆచరణలో పెట్టి సాగించిన పోరాటం.

"సంఘర్షణ లేకపోతే, చరిత్రలో 
నిజమైన మార్పు జరగదన్నది " అతని  ఆలోచన.
 
"ఓ వ్యక్తి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు, 
కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత 
వెయ్యి జన్మలలో అవతరిస్తుం" దన్నది  సుభాష్ చంద్రబోస్ .ఆవేశం.

"అన్యాయాన్ని సహించడం, 
తప్పుతో రాజీపడడం అతిపెద్ద నేరం..".అందుకే
" మీ రక్తాన్ని ధారపోయండి..
మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను " అంటుా..
"జై హింద్ " నినాదంతో
తన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన 
సాయుధ పొిరాట యొాధుడు సుభాష్ చంద్రబోస్

"ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్" అనే 
రాజకీయ పార్టీని కూడా స్థాపించి,  దాదాపు  
పదకొండుసార్లు ఆంగ్లేయులచే కారాగారంలో 
నిర్బంధించ బడిన వ్యక్తి  సుభాష్ చంద్రబోస్.

"ఆజాద్ హింద్  ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచి
తన గమ్యానికి చేరువౌతున్న  సమయంలో 
ఆతని మరణం ......
నేటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

ఆతని నినాదాలు కోట్లాది మంది భారతీయులను ప్రేరేపించాయి

తనలో 'విపరీతత్వం' లేని వ్యక్తి 
ఎప్పటికీ గొప్పవాడు కాలేడంటుా ప్రతీ ఒక
భారతీయుడికీ స్ఫుార్తిగా నిలచిన గొప్పవ్యక్తి..
"నేతాజీ సుభాష్ చంద్రబోస్."

హామీ : ఈ రచన నా స్వీయ రచన.

No comments:

Post a Comment