24/01/2023.
శ్రీశ్రీశ్రీ సుందర మారుతి
శీర్షిక : రామ భక్త పరాయణుడు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
అంజనీ పుత్రుడవు ఆంజనేయ నీవు
అందమైన "సుందరుడను " నామధేయుండవు.
వందనమ్ము నీకయా వానర యువరాజా
బంధుడవిల మాకు నీవె బాలా! హనుామంతా ॥
ఎర్రనైన భానుని గని ఫలమని భ్రమియించేవట
అద్భుతమౌ లీల జుాపి మింటి కెగసిపోయేవట
సుార్య తేజమునకు ముఖము పొంగి కమిలిపోయేనట
వఝ్రాయుధ ఘాతముచే భువిని కుాలినావంట ॥
వాయు పుత్రుడైన నీవు వరములెన్నొ పొందేవట.
వలసినంత బలము నీకు వరముగనందేనట.
బుద్ధి బలము, భుజబలముల బలశాలిగ మారేవట.
వలసినపుడు బలము మరచి వ్యాకులపడు శాపమంట ॥
కిష్కింధలొ సుగ్రీవుని మిత్రుడవైనావంట.
వానర ముాకల గుాడి వనములెన్నొ తిరిగేవట.
రామ నామ మంత్రమునే మరువక జపియించేవట
రామ భక్త హనుమ పేర స్థిరుడవు యైనావట ॥
రావణుడను రక్కసుడే రమణి సీత గొనిపోగా
రామ కార్యమును జేయ రయమున వెడలేవంటా
రామచంద్రు బాధనుగని కన్నీరిడినావంటా
మాత సీత జాడ వెదుక రాము నాజ్ఞ గొనినావట ॥
యొాజనాల సంద్రమునే దాట ఎగిరినావంటా
అసురి సురస నోట జిక్కి బ్రతికి బయలు పడ్దావట
లంకాపురి జేరి అసురి లంఖిణినే జంపేవట
లంకలోకి చొరబడీ వనమంతా చెరిచేవట ॥
అశోకవనము జేరి సీత జాడను కనుగొన్నావట
రామ ముద్రికొసగి రమణి నార్తి దీర్చి నావంట.
బంధించిన రావణుని లంక గాల్చి వచ్చేవట
సీత సేమమను వార్తను రామ చెవిని వేసేవట ॥
సేతుబంధనము జేసి జేరిరి వానరులదె లంకకు
రామ రావణుల పోరదె సాగెనంట దినమంతా
రామ బాణమదె రావణు గుాల్చె తలలు పదియంటా
సీత గుాడి సంతసమున రాముడేగె పురముకంట ॥
రాముడెంతొ సంతసించి నిన్ను హత్తు కొనినంతనె
పొంగి పొరలి కన్నిుటిని రామ పదము కడిగితివట
భక్తి గనిన రాముడు నీ హృదయసీమ నేలెనంట
రామ భక్త హనుమ భువిని నీదు కీర్తి వెలిగేనట
రామ భక్త హనుమ నిన్ను జపియించిన కలుగు శుభము.
నిను కొలిచిన వారి కిలను కలుగునంట జయము జయము ॥
**************************************
No comments:
Post a Comment