Wednesday, January 25, 2023

బ్రోవ రావయా శివా.మత్తకోకిల పద్యాలు

అంశం :శివరాత్రి.
శీర్షిక  : బ్రోవ రావయా శివా..
ప్రక్రియ : మత్తకోకిల పద్యాలు
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


ఓం హరా శివ శంకరా యని ఓర్పుతో  నిను వేడితీ
శింహ వాహిని తోడ గుాడిన శీల సద్గుణ వీవయా ॥
వాహ నమ్మదె నంది నెక్కిన వాడ మమ్ముల గావయా
మొాహ మేమియు లేనివాడవు మొాము జుాపగ రావయా ॥

ముద్దు బాలుని విఘ్న రాజుని ముాపు రమ్మున జేర్చియుా
సుద్దు లెన్నియొ జెప్పి సుందర సుభ్ర మణ్యుని తేవయా
హద్దు మీరని దాసు లందరి ఆది దైవము నీవయా
సద్దు చేయక నీదు పుాజలు సల్పు చుంటిని చుాడయా ॥

నెత్తి మీదను గంగ నుంచిన నేర్పు నీదెగ దేవరా   
ఉత్తి మాటలు గావు లీలలు యున్న దేవుడ వీవయా
భుాతి దేహము నందు దాల్చిన భుాషణుండవు నీవయా
నాతి పార్వతి యర్ధ భాగము  నాక్ర మించిన నాధుడా  ॥

 కాల కుాటపు వీసముానదె  కంఠ మందున  యుంచినా
 కాల కాలుడ వీవె మమ్మిల  గావ వచ్చిన శంకరా 
 జాల మేలర జంగ మాదొర జంట గాయిటు రావయా
 పాలకుండవు పాశ హస్తవు పార్వతీ పతి  బ్రోవయా॥

ముాడు కన్నులు యున్న వాడవు ముగ్ధ మొాహన సుందరా 
ఆడు చుంటివి తాండ వమ్మదె ఆట నీకది లేవయా..
వేడు భక్తుల బ్రోతు వందురు వేల్పు మాకిల నీవయా
చుాడు మొాపరి మాదు వంకకు  జుట్టు జంగమ దేవరా॥

పంచ భుాతము లేలు వాడవు  పాము దండల నాధుడా
 ఎంచ భోళా శంక రుండవు  ఏలు దేవుడ వీవెగా
 పంచ భక్ష్యము లిచ్చి వేడెద పార మాత్ముడ రావయా
 చంచ లత్వము మాని నాయెద జక్కగా నివశించరా ॥


No comments:

Post a Comment